Varahamahapuranam-1    Chapters   

ఏకాదశోధ్యాయః - పదునొకండవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు చెప్పెను.

తత స్త మీదృశం దృష్ట్వా తదా గౌరముఖాశ్రమమ్‌,

దుర్జయ శ్చిన్తయామాస రమ్య మాశ్రమమణ్డలమ్‌. 1

ఇట్టి సుందరమగు గౌరముఖుని యాశ్రమమును గాంచి దుర్జయు డిట్లు తలపోసెను.

ప్రవిశామ్యత్ర పశ్యామి ఋషీన్‌ పరమధార్మికాన్‌,

చిన్తయిత్వా తదా రాజా ప్రవివేశ తమాశ్రమమ్‌. 2

ఇందు ప్రవేశించెదను. పరమధార్మికులగు ఋషులను సందర్శించుకొందును-అని తలపోసి రాజు ఆశ్రమమున ప్రవేశించెను.

తస్య ప్రవిష్టస్య తతో రాజ్ఞః పరమహర్షితః,

చకార పూజాం ధర్మాత్మా తదా గౌరముఖో మునిః. 3

అట్లు ప్రవేశించిన రాజునకు ధర్మాత్ముడగు గౌరముఖ ముని ఉప్పొంగిన ఆనందముతో మర్యాదలు కావించెను.

స్వాగతాది క్రియాః కృత్వా కథాన్తే తం మహామునిః,

స్వశక్త్యాహం నృపశ్రేష్ఠ సానుగస్య చ భోజనమ్‌. 4

కరిష్యామి ప్రముచ్యన్తాం సాధు వాహా ఇతి ద్విజః,

ఏవ ముక్త్వా స్థిత స్తూష్ణీం సమునిః సంశిత వ్రతః. 5

స్వాగతము మొదలగు మర్యాదలు కావించి ప్రసంగము ముగిసిన పిమ్మట ఆ మహాముని రాజుతో 'రాజవరేణ్యా! నా శక్తి కొలది నీకును, నీ వారికిని భోజనము పెట్టెదను. గుఱ్ఱములకు విశ్రాంతినొసగుము' అని పలికి మిన్నకుండెను.

రాజాపి తస్థౌ తద్భక్త్యా స్వసహాయైః సమన్వితః,

అక్షౌహిణ్యో బలస్యాస్య పఞ్చ మాత్రా స్తదా స్థితాః,

అయం చ తాపసః కిం మే దాస్యతే భోజనం త్విహ. 6

రాజు కూడ అతనిపై నున్న భక్తితో తనతోడి వారితో కూడి అందు నిలిచెను. అతని సేన అయిద క్షౌహిణుల లెక్కలో నున్నది. ఈతడేమో తాపసుడు. ఇచట భోజన మేమి పెట్టునో! అని తల పోసెను.

నిమన్త్ర్య దుర్జయం విప్ర స్తదా గౌరముఖో నృపమ్‌,

చిన్తయామాసం కిం చాస్య మయా దేయంతు భోజనమ్‌. 7

విప్రుడగు ఆ గౌరముఖుడును దుర్జయుని భోజనమునకు నిలువరించి 'యీతనికి భోజనమేమి పెట్టుదును?' అని చింతించెను.

ఏవం చిన్తయత స్తస్య మహర్షే ర్భావితాత్మనః,

స్థితో మనసి దేవేశో హరి ర్నారాయణః ప్రభుః. 8

అట్లు తలపోయుచున్న గొప్పభావన గల ఆ మహర్షిమదిలో దేవదేవుడు ప్రభువు అగు నారాయణుడు మెదలెను.

తతః సంస్మృత్య మనసా దేవం నారాయనం తదా,

తోషయామాస గఙ్గాయాం ప్రవిశ్య మునిసత్తమః. 9

అంతనాముని నారాయణుని స్మరించి గంగలో ప్రవేశించి దేవదేవుని సంతోషపెట్టెను.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

కథం గౌరముఖో విష్ణుం తోషయామాస భూధర,

ఏతన్మే కౌతుకం శ్రోతుం సమ్యగిచ్ఛా ప్రవర్తతే. 10

స్వామీ! గౌరముఖు డెట్లు విష్ణువును సంతోషపరచెనో వినవేడుక యగుచున్నది. కోరిక ప్రబలుచున్నది.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

నమోస్తు విష్ణవే నిత్యం నమస్తే పీతవాససే,

నమస్తే చాద్యరూపాయ నమస్తే జలరూపిణ. 11

బంగరు వలువలు గట్టిన విష్ణువునకు ఎల్లవేళల నమస్కారము, తొలి రూపముగల వానికి, జలమే తన రూపమైన వానికి మ్రొక్కులు.

నమస్తే సర్వ సంస్థాయ నమస్తే జలశాయినే,

నమస్తే క్షితిరూపాయ నమస్తే తేజసాత్మనే. 2

అన్నింట నెలకొని యున్నవానికి, జలమున శయనించు వానికి, భూమిరూపమున, అగ్నిరూపమున తోచువానికి నమస్సు.

నమస్తే వాయురూపాయ నమస్తే వ్యోమరూపిణ,

త్వం దేవః సర్వభూతానాం ప్రభు స్త్వమసి హృచ్ఛయః. 13

వాయువు, ఆకాశము రూపములైన వానికి నమస్సు, ప్రభూ! నీవు సర్వ భూతములకు దేవుడవు. వారి హృదయములలో నెలకొని యున్నవాడవు.

త్వమోఙ్కారో వషట్కారః సర్వత్రైవచ సంస్థితః,

త్వ మాదిః సర్వదేవానాం త వ చా ది ర్న విద్యతే. 4

నీవు ఓంకారమవు. వషట్కారమవు. అన్నింట చక్కగా నెలకొనియున్నవాడవు. సర్వదేవతలకు నీవు మొదటి వాడవు. నీకు మొదలు లేదు.

త్వంభూ స్త్వం చ భువో దేవ త్వంజన స్త్వం మహః స్మృతః,

త్వం తప స్త్వం చ సత్యం చ త్వయి దేవ చరాచరమ్‌. 5

భూలోకము, భువర్లోకము, జనలోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము - నీవే. చరాచర భూతములన్నియు నీయందే నిలిచియున్నవి.

త్వత్తో భూత మిదం విశ్వం త్వదుద్భూతా ఋగాదయః,

త్వత్తః శాస్త్రాణి జాతాని త్వత్తో యజ్ఞాః ప్రతిష్ఠితాః. 16

ఈ విశ్వమంతయు నీ వలననే యేర్పడినది. బుక్కు మొదలగు వేదములన్నియు నీ నుండియే పొడమినవి. శాస్త్రము లన్నియు నీ వలననే పుట్టినవి. యజ్ఞము లన్నియు నీ వలననే నెలకొనియున్నవి.

త్వత్తో వృక్షా వీరుధశ్చ త్వత్తః సర్వా వనౌషధీః,

పశవః పక్షిణః సర్పా స్త్వత్త ఏవ జనార్దన. 17

జనార్దన! చెట్టుచేమలు, మూలికలు సర్వము నీవలననే జనించినవి. పశువులు, పక్షులు, పాములు నీవలననే ఏర్పడినవి.

మమాపి దేవదేవేశ రాజా దుర్జయా సంజ్ఞితః,

ఆగతోభ్యాగత స్తస్య ఆతిథ్యం కర్తు ముత్సహే. 18

దేవదేవా! ప్రభూ! దుర్జయుడనురాజు నాకడకు అభ్యాగతుడై వచ్చెను. ఆతనికి విందు చేయగోరుచున్నాను.

తస్య మే నిర్ధన స్యాద్య దేవదేవ జగత్పతే,

భక్తినమ్రస్య దేవేశ కురుష్వా న్నాద్య సంచయమ్‌. 19

జగత్పతీ! దేవదేవా! ధనము లేనివాడను. భక్తితో నీకు లోబడినవాడను. అట్టినాకు అన్నము మొదలగు వానిని సమకూర్చి పెట్టుము.

యం యం స్పృశామి హస్తేన యం యం పశ్యామి చక్షుషా,

వృక్షం వా తృణకన్దం వా తత్త దన్నం చతుర్విధమ్‌. 20

నేను చేతితో తాకిన దెల్ల, కంటితో చూచిన దెల్ల చెట్టో, గడ్డి పరకయో, దుంపయో - అది నాలుగు విధములైన భోజన పదార్థము కావలయును.

తథా త్వన్యతమం వాపి యద్‌ధ్యాతం మనసా మయా,

తత్‌ సర్వం సిద్ధ్యతాం మహ్యం నమస్తే పరమేశ్వర. 21

పరమేశ్వరా! ఇంక ఏదియైనను నేను మనస్సులో ధ్యానించి నది అంతయు నాకు సిద్ధమగుగాక!

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు చెప్పెను.

ఇతి స్తుత్యా తు దేవేశ స్తుతోష జగతాం పతిః,

మునే స్తస్య స్వకం రూపం దర్శయామాస కేశవః. 22

మునిచేసిన యీ స్తోత్రముతో జగత్పతి పరమసంతోషము పొందెను. ఆతనికి తన రూపమును చూపెను.

ఉవాచ సుప్రసన్నాత్మా బ్రూహి విప్రవరం పరమ్‌.

సుప్రసన్నాత్ముడై విప్రా! శ్రేష్ఠమగు వరమడుగు మని పలికెను.

ఏవం శ్రుత్వాక్షిణీ యావ దున్మీలయతి వై మునిః. 23

తదా శఙ్ఖ గదాపాణిః పీతవాసా జనార్దనః,

గరుడస్థోపి తేజస్వీ ద్వాదశదిత్యసప్రభః. 24

ఈ మాటవిని. ఆ ముని కనులు తెరచినంతలో ఆతనికి శంఖము గదను చేపట్టినవాడు, పట్టు పుట్టము కట్టినవాడు, గరుడునిపై నున్నవాడు, పండ్రెండుగురు సూర్యుల కాంతికి దీటైనవాడు నగు జనార్దనుడు గోచరించెను.

దివి సూర్య సహస్రస్య భ##వే ద్యుగపదుత్థితా,

యది భాః సదృశీ సా స్యాద్భాస స్తస్య మహాత్మనః. 25

గగనమున ఒక్క పెట్టున వేయిసూర్యులు వెలుగొందినచో ఎట్టి కాంతి తోచునో ఆ మహాత్ముని కాంతి యట్టిదై కానవచ్చెను.

తత్రైకస్థం జగత్‌ కృత్న్సం ప్రవిభక్త మనేకధా,

దదర్శ సముని ర్దేవి విసయోత్ఫుల్ల లోచనః. 26

పెక్కుతీరుల ఏర్పడియున్న జగత్తు మొత్తమాతని యందే నిలచియుండెను. దేవీ!అట్టి జనార్దనుగాంచి ఆ ముని అచ్చెరువుతో విప్పారిన కన్నులు కలవాడయెను.

జగామ శిరసా దేవం కృతాఞ్జలి రథాబ్రవీత్‌,

యది మే వరదో దేవ భూయాద్‌ భక్తస్య కేశవ. 27

ఇదానీ మేష నృపతి ర్యథా సబలవాహనః,

మమాశ్రమే కృతాహారః శ్వః ప్రయాతా స్వకం గృహమ్‌. 28

దేవునకు ప్రణమిల్లి చేతులు మోడ్చి, 'కేశవా!భక్తుడనగు నాకు వరమొసగుదు వేని ఈ రాజు తన సేనతో వాహనములతో నా ఆశ్రమమున తనివి తీర భుజించి రేపు తన యింటి కేగు నట్లనుగ్రహింపు మని వేడుకొనెను.

ఇత్యుక్త స్తస్య దేవేశో వరదః సంబభూవ హ,

చిత్తసిద్ధిం దదౌ తసై#్మ మణించ సుమహాప్రభమ్‌. 29

అంత దేవదేవుడు ఆతనికి ప్రసన్నుడాయోను. ఆతనికి చిత్తసిద్ధి నొసగి వెలుగులు చిమ్ము నొక మణి నందించెను.

తం దత్వా న్తర్దధే దేవః గౌరముఖో మునిః,

జగామ చాశ్రమం పుణ్యం నానా ఋషి నిషేవితమ్‌. 30

అట్లొసగి యాతడు అదృశ్యుడాయెను. ఆ గౌరముఖుడును పెక్కండ్రు ఋషులకు నెలవగు తన పుణ్యాశ్రమమున కరిగెను.

తత్ర గత్వా సవిప్రేన్ధ్ర శ్చిన్తయామాస వై మునిః,

హిమవచ్ఛిఖరాకారం మహాభ్ర మివ చోన్నతమ్‌,

శశాఙ్కరశ్మి సంకాశం గృహం వై శతభూమికమ్‌. 31

ఆ విప్రవర్యు డట్లరిగి మంచుకొండ కొమ్ము వంటిదియు గొప్పమేఘమువలె ఎత్తైనదియు, వెన్నెల వలె వెలుగొందు చున్నదియు. నూరు అంతస్తులు గలదియు నగు పెద్ద భవనమును మనమున భావించెను.

తాదృశానాం సహస్రాణి లక్షకోట్యశ్చ సర్వశః,

గృహాణి నిర్మమే విప్రో విష్ణో ర్లబ్దవర స్తదా. 32

విష్ణువువలన వరము పొందిన ఆ బ్రాహ్మణుడు అట్టివేయగు గృహములను వేలకొలది. లక్షలకొలది, కోట్లకొలదిగా నిర్మించెను.

ప్రాకారాణి తతోపాన్తే తల్లగ్నోద్యానకాని చ,

కోకిలాకులఘష్టాని నానాద్విజవరాణి చ,

చమ్పకాశోకపున్నాగ నాగ కేసరవన్తి చ. 33

ప్రాకారములు, వానికడ ఆనుకొని పూదోటలు, కోకిలల కూతలతో, పక్షులసముదాయములతో సంపెంగ, అశోకములు, పున్నాగములు మొదలగు పుష్పవృక్షములతో కూడినవానిని నిర్మించెను.

నానాజాత్య స్తథా వృక్షా గృహోద్యానేషు సర్వశః,

హస్తినాం హస్తిశాలాశ్చ తురగాణాం చ మన్దురాః. 34

పెక్కు జాతుల చెట్లు పూదోటలలో ఏర్పరచెను. ఏనుగులకు గుఱ్ఱములకు శాలలను నిర్మించెను.

చకార సంచయాన్‌ విప్రో నానా భక్ష్యాణి సర్వశః,

భక్ష్యం భోజ్యం తథా లేహ్యం చోష్యం బహువిధం తథా,

చకారాన్నాద్యనిచయం హేమపాత్ర్యశ్చ సర్వతః. 35

ఆ విప్రుడు భోజన పదార్థములను కుప్పలు తిప్పలుగా కూర్చెను. భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములు మొదలగువానిని రాసులు రాసులుగా ఏర్పరచెను. అన్ని వైపుల బంగారు పళ్లెరములను నిలిపెను.

ఏవం కృత్వా స విప్రస్తు రాజానం భూరితేజసమ్‌,

ఉవాచ సర్వసైన్యాని ప్రవిశన్తు గృహా నితి. 36

ఇట్లు కావించి ఆ బ్రహ్మణుడు గొప్పతేజస్సుతో విరాజిల్లుచున్న రాజుతో సేనలన్నియు గృహముల లోనికి ప్రవేశింపవలసినదిగా చెప్పెను.

ఏవ ముక్తస్తతో రాజా తద్గృహం పర్వతోపమమ్‌,

ప్రవివేశాన్తరేష్వన్యే భృత్యా వివిశు రాశు వై. 37

ముని అట్లు పలుకగా రాజు పర్వతము వంటి ఆ యింటిలో ప్రవేశించెను. నడుమశాలలందు సేవకు లెందరో వడివడిగా చొచ్చుచుండిరి.

తతస్తేషు ప్రవిష్టేషు తదా గౌరముఖో మునిః,

ప్రగృహ్య తం మణిం దివ్యం రాజానం చేద మబ్రవీత్‌. 38

వారు ప్రవేశింపగా అంత గౌరముఖుడు ఆ మణిని చేతగొని రాజుతో నిట్లు పలికెను.

మజ్జనాభ్యవహారార్థం పథి శ్రమకృతే తథా,

విలాసినీ స్తథా దాసాన్‌ ప్రేషయిష్యామి తే నృప. 39

స్నానములకు, భోజనములకు, మర్గాయాసము పోవుటకు రాజా! నీకు పనివారిని విలాసవతులగు కాంతులను పంపుదును.

ఏవ ముక్త్వా స విప్రేన్ధ్ర స్తం మణిం వైష్ణవం శుభమ్‌,

ఏకాన్తే స్థాపయామాస రాజ్ఞ స్తస్య ప్రపశ్యతః. 40

ఆ బ్రాహ్మణ ప్రవరు డిట్లు పలికి విష్ణువు ప్రసాదించిన దివ్యమణిని ఆ రాజు తేరిపార చూచుచుండగా ఒకచోట ఉంచెను.

తస్మిన్‌ స్థాపిత మాత్రే తు మణౌ శుద్ధసమప్రభే,

నిశ్చేరు ర్యోషిత స్తత్ర దివ్యరూపాః సహస్రశః. 41

మచ్చలేని సమమైన కాంతులుగల ఆ మణిని అట్లు నిలిపి నంతనే దివ్యరూపము గల కాంతలు వేలకొలదిగా తిరుగసాగిరి.

సుకుమారాఙ్గరాగాద్యాః సుకుమార వరాఙ్గనాః,

సుకపోలాః సుచార్వఙ్గ్యః సుకేశాన్తాః సులోచనాః,

కాశ్చిత్‌ సౌవర్ణపాత్రీశ్చ గృహీత్వా సంప్రతస్థిరే. 42

మెత్తని మైపూతలు, చెక్కిళ్లు, అందమైన అవయవములు, నిగనిగలాదు కేశములు, కన్నులు గల అందకత్తెలగు కాంతలు బంగారు పాత్రలు కై కొని బయలుదేరిరి.

ఏవం యోషి ద్గణా స్తత్ర నరాః కర్మకరా స్తథా,

నిర్జగ్ము స్తస్య నృపతేః సర్వే భృత్యా నృపస్య హ.

ఇట్లు పెక్కండ్రు స్త్రీలు, ఆయాపనులలో ఆరితేరిన మనుష్యులు ఆ రాజు ముందు బయలుదేరిరి. వారందరు ఆ రాజునకు సేవకులుగా వచ్చిరి.

కేవలం భోజనం పూర్వం పరిధానం చ సర్వశః. 43

తాఃస్త్రియః సర్వభృత్యానాం రాజమార్గేణ మజ్జనమ్‌,

దదు స్తేచ నరాశ్వానాం హస్తినాం చ త్వరాన్వితాః. 44

ఆ కాంతలు రాజసేవకులందరికి రాజునకు చేసినట్లు స్నానములు, భోజనమలు, వస్త్రములు సమకూర్చిరి. అట్లే కాల్బంటులకు, గుఱ్ఱములకు, ఏనుగులకును వడివడిగా ఆహారము నొసగిరి.

నానావిధాని తూర్యాణి తత్రావాద్యన్త సర్వశః,

మజ్జనే నృపతే స్తత్ర ననృతు శ్చాన్యయోషితః,

అపరాశ్చ జగుస్తత్ర శక్రస్యేవ ప్రమజ్జతః. 45

పలువిధములగు వాద్యము లచట మ్రోగినవి. కొందరు కాంతలు రాజు స్నానమాడు చుండగా నృత్యము చేసిరి. మరికొందరు, స్నానమాడుచున్న దేవేంద్రునకు వలె, గానములు చేసిరి.

ఏవం దివ్యోపచారేణ స్నాత్వా రాజా మహామనాః,

చిన్తయామాస రాజేన్ద్రో విస్మయావిష్టచేతనః,

కిమిదం మునిసామర్థ్యం తపసో వాథవా మణః. 46

ఇట్లు దివ్యములగు ఉపచారములతో రాజు స్నానమాడి అచ్చెరువుతో తలమున్కలగుచు ఈ మహర్షి సామర్థ్యము తపము వలన నేర్పడినదా? కాక మణి మహిమయా! అని తలపోసెను.

ఏవం స్నాత్వా శుభే వస్త్రే పరిధా యోత్తమే తథా,

వివిధాన్నం తు విధినా బుభుజే స నృపోత్తమః. 47

రాజిట్లు స్నానమాడి శ్రేష్ఠములగు వస్త్రములు ధరించి పలు పదార్థములు గల అన్నమును భుజించెను.

యథా చ నృపతేః పూజా కృతా తేన మహర్షిణా,

తద్వద్‌ భృత్యజన స్యాపి చకార మునిసత్తమః. 48

ఆ మహర్షి రాజున కెట్లో అట్లే సేవక జనమునకు కూడ మన్ననలు గావించెను.

యావత్‌ స రాజా బుభుజే సభృత్యబలవాహనః,

తావదస్తగిరిం భాను ర్జగామారుణసప్రభః. 49

రాజు తన సేవకులతో సైనికులతో వాహనములతో భోజనము ముగించు సరికి ఎఱ్ఱని కాంతులను విరజిమ్ముచు సూర్యుడు అస్తగిరి కరిగెను.

తతస్తు రాత్రిః సమపద్యతాధునా

శరచ్ఛశా ఙ్కోజ్జ్వల ఋక్షమణ్డితా,

కరోతి రాగం సచ రోహిణీధవః

సుసఙ్గతం సౌమ్యగుణషు తాపిచ. 50

అటుపై శరత్కాల చంద్రనితో, మిలమిలలాడు తారకలతో అలరారుచు రాత్రి ఏర్పడెను. రోహిణీకాంతుడగు చంద్రుడు సౌమ్యగుణములు కలవారి యందును హృదయమునకు తాపము కలిగించు రాగమును కలుగజేయుచుండెను.

భృగూద్వహః కృష్ణతరాంశుభానునా

సహోద్యతో దైత్యగురుః సురాధిపః,

అథాన్తరాత్పక్షగతో న రాజతే

స్వభావయోగేన మతిస్తు దేహినామ్‌. 51

మిక్కిలి నల్లని కిరణములు గల శనితో కూడి రాక్షస గురువగు భృగువర్యుడు శుక్రుడుదయించెను. కాని మానవుల బుద్ధి స్వభావదోషముతో ప్రకాశింపని విధమున విరుద్ధలక్షణములు గలవాని సంపర్కము వలన ఆతడు ప్రకాశింపడాయెను.

సురక్తతాం భూమిసుతశ్చ ముచ్యతే

రాహుః సితీ చంద్రమసోంశుభిః సితైః,

ముక్తః స్వభావో జగతః సురాసురై-

రనుస్వభావో బలవాన్‌ సుకృన్నృపః. 52

భూదేవి కుమారుడగు కుజుడు తన ఎఱ్ఱదనమును వదలు చుండెను. చంద్రుని తెల్లని కిరణములతో రాహువు తెల్లదనము తాల్చెను. జగత్తు స్వభావము దేవదానవుల నుండి విడివడెను. సహజమగు లక్షణము కల, సత్కార్యములు చేయు రాజు బలవంతుడాయెను.

సితేశ్వరాఖ్యాపిత రశ్మిమణ్డలే

సూర్యత్వసిద్ధాన్తకషేవ నిర్మలే,

కరోతి కేతు ర్న పరే మహత్తమ

స్తదా కుశీలేషు గతిశ్చ నిర్మలా.

శుక్రుడు తన (కేతువుయొక్క) కిరణముల సముదాయమును క్రమ్మివైవగా, సూర్యకిరణముల అడ్డులేని వెలుగుల ప్రాసారము వలె అంతయు నిర్మలమై యుండగా కేతువు తన గొప్ప చీకటిని వెలువరింపజాలకుండెను. అట్లే చెడునడవడి గలవారి గతి యందును మచ్చలేనిదాయెను.

బుధోచ్చబుద్ధి ర్జగతో విభావయన్‌

రరాజ రాజ్ఞ స్తనయః స్వకర్మభిః,

భృతేచ్ఛకః కక్షవివాహిత శ్చిరం

భ##వేదియం సాధుషు సమ్మతిర్ధ్రువమ్‌. 54

చక్కని జ్ఞానముగల ఉన్నతబుద్ధితో విరాజిల్లుబుధుడు లోకమును తనచేష్టలతో వెలుగొందజేయుచు, తనపరిధిలో ఎక్కువ సేపు విహరించుచు అలరారెను. సాధుజనుల సద్బుద్ధి నిక్కముగా నిట్లే యుండును.

కరోతి కేతుః కపిలం వియచ్చిరం

రాజ్ఞః సురాణాం పథి సంస్థితం భృశమ్‌,

న దుర్జనః సజ్జనసంసది క్వచిత్‌

కరోతి శుద్ధం నిజకర్మ కౌశలమ్‌. 55

చంద్రునిదియు, దేవతలదియునగు మార్గమున చక్కగా నెలకొన్న ఆకాశమును కేతువు కొంతసేపు కపిలవర్ణము కలదిగా చేసెను. దుర్జనుడు సజ్జనుల పజ్జ నెన్నటికిని తన చేష్టలనేర్పును నిర్మలము గావింపజాలడు.

శశాఙ్కరశ్మిప్రవిభాసితా అపి

ప్రకాశ మీయు ర్నిరతాః పదే పదే,

కులంభవాః సంభవధర్మపత్తయో

మహాంశుయోగా న్మహతాం సమున్నతిమ్‌. 56

త్రిదోషసక్తా న్నికృతోస్య సర్వశః

సుతేన రాజ్ఞో వరుణస్య సూర్యజః,

విరాజతే కౌశిక సన్నివేశితా

న వేదకర్మ క్వచి దన్యథా భ##వేత్‌.

ద్వన్ద్వః సమేతాన్‌ మయ యః శిశుః పురా

హరి ర్య ఆరాధితవాన్‌ నృపాసనమ్‌,

లక్ష్మ్యాపి బుద్ధ్యా సుచిరం ప్రకాశ##తే

ధ్రువేణ విష్ణుస్మరణన దుర్లభమ్‌.

ఇతీదృశీ రాత్రి రభూదృషేః శుభే

వరాశ్రమే దుర్జయభూపతేః శుభా,

సభృత్య సామంత వరాశ్వదన్తినః

సుభక్త వస్త్రాభరణాది పూజయా. 59

సేవకులు, సామంతులు, మేలుజాతి గుఱ్ఱములుల, ఏనుగులు మొదలగు వానితో దుర్జయమహారాజునకు మంచిభోజనము, వస్త్రములు, ఆభరణములు మున్నగు వానితో ఋషిగావించిన సత్కారముతో ఆ మేలైన ఆశ్రమమున శుభమగురాత్రి ఈ విధముగా గడచెను.

ఇతీదృశాయాం వరరత్న చిత్రితాః

సుపట్టసంవీత వరాస్తృతా స్తదా,

గృహేషు పర్యఙ్కవరాః సమాశ్రితాః

సురూపయోషి త్కృతభఙ్గ భాసురాః. 60

ఇట్టి రాత్రి యందు అచట ముని నిర్మించిన గృహముల యందు శ్రేష్ఠములు రత్నముల కూర్పుగలవియు, పట్టు కంబళ్లు పరచినవియు, రూపవతులగు కాంతల చేష్టలతో అలరారుచున్నవి యునగు పాన్పులు అమర్పబడి యుండెను.

స తత్ర రాజా విససర్జ భూభృతః

స్వయం సభృత్యానపి సర్వతో గృహాన్‌,

గతేషు సుష్వాప వరస్త్రియా వృతః

సురేశవత్‌ స్వర్గగతః ప్రతాపవాన్‌. 61

అంతరాజు సామంతులను, సేవకులను వారివారి గృహములకు పంపి తన ఉత్తమకాంతతో కూడి, స్వర్గమున నున్న దేవేంద్రుని వలె, నిద్రించెను.

ఏవం సుమనసస్తస్య సభృత్యస్య మహాత్మనః,

ఋషే స్తస్య ప్రభావేన హృష్టాస్తు సుషుపు స్తదా. 62

మంచి మనసు గల మహాత్ముడగు ఋషి ప్రభావము వలన ఈ విధముగా వారందరు సుఖముగా నిద్రించిరి.

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సరాజా తాఃస్త్రియః పునః,

అన్తర్ధానం గతా స్తత్ర దృష్ట్వా తాని గృహాణి చ. 63

ఆ రాత్రి గడువగా దుర్జయమహారాజునకు ఆ కాంతలు, ఆ యిండ్లును కన్పడ కుండెను.

అదృశ్యాని మహార్షాణి వరాసనజలాని చ,

రాజా స విస్మయావిష్ట శ్చిన్తయామాస దుఃఖితః. 64

మేలుజాతి ఆసనములు, జలములు కానరాక పోగా అచ్చెరువంది ఆ రాజు మనసున బాధపడుచు నిట్లు తలపోసెను.

కథ మేవం మణి ర్మహ్యం భవతీతి పునః పునః,

చిన్తయన్నధిగమ్యాథ సరాజా దుర్జయ స్తదా. 65

చిన్తామణి మిమం చాస్య హరామితి విచిన్త్య సః,

ప్రయాణం నోదయామాస స రాజాశ్రమ బాహ్యతః,

ఆశ్రమస్య బహిర్గత్వా నాతిదూరే సవాహనః. 66

ఈ మణి నాకెట్లు చిక్కునా అని అదే పనిగ తలపోయుచు చివరకు దానిని చేజిక్కించుకొందునని నిశ్చయించెను, ఆ రాజు ఆశ్రమమము వెలుపలికి ప్రయాణము తీయించెను. ఆశ్రమము వెలుపలి కరిగి కొంతదూరమున నిలిచెను.

తతో విరోచనాఖ్యం వై ప్రేషయామాస మన్త్రిణమ్‌,

ఋషే ర్గౌరముఖస్యాపి మణ ర్యాచనకర్మణి. 67

విరోచనుడను పేరు గల మంత్రిని గౌరముఖర్షికడకు మణి నడుగుటకై పంపెను.

ఋషిం తంచ సమాగత్య మణిం యాచితు ముద్యతః,

రత్నానాం భాజనం రాజా మణిం తసై#్మ ప్రదీయతామ్‌. 68

విరోచనుడు ఋషికడకు వచ్చి రాజు రత్నము లన్నింటికి స్థానము. మణి నాతని కొసగుమని అడుగజూచెను.

అమాత్యేనైవ ముక్తస్తు క్రుద్ధో గౌరముఖోబ్రవీత్‌,

ప్రతిగృహ్ణాతు విప్రస్తు రాజా చైవ దదాతి చ,

త్వంచ రాజా పునర్భూత్వా యాచసే దీనవత్‌ కథమ్‌. 69

మంత్రి యిట్లు పలుకగా గౌరముఖుడు కోపముతో చెలరేగి యిట్లు పలికెను. 'విద్యలలో ఆరితేరిన విప్రుడు దానములను గ్రహించును. రాజు ఇచ్చును. నీవు రాజవై యుండి దీనునివలె ఎట్లు బిచ్చమెత్తుదువు'.

ఏవం బ్రూహి దురాచారం రాజానం దుర్జయం స్వయమ్‌,

గచ్ఛ ద్రుతం దురాచార మాత్వాం లోకోత్యగా దితి. 70

దురాచారుడగు ఆ దుర్జయునితో ఈ మాట స్వయముగా చెప్పు. వెళ్లు. నీకింకను నూకలు చెల్లపోలేదని పలుకు.

(ఏవ ముక్త్వా మునిః ప్రాగాత్‌ కుశేధ్మాహరణాయ వై,

చిన్తయన్‌ మనసా తంచ మణిం శత్రు వినాశనమ్‌. 71

ఇట్లు పలికి, ఆ మణియే పగవారిని రూపుమాపునని తలపోయుచు, ఆముని దర్భలు, సమిధలు తెచ్చుకొనుటకైవెడలెను.)

ఏవ ముక్త స్తదా దూతో జగామ చ నృపాన్తికమ్‌,

కథయామాస తత్సర్వం యదుక్తం బ్రాహ్మణన చ. 72

ఋషిమాటలు విన్న ఆ దూత రాజుకడ కరిగి బ్రాహ్మణుడు పలికినదంతయు చెప్పెను.

తతః క్రోధపరీతాత్మా శ్రుత్వా బ్రాహ్మణభాషితమ్‌,

దుర్జయః ప్రాహ నీలాఖ్యం సామన్తం గచ్ఛ మాచిరమ్‌,

బ్రహ్మణస్య మణిం గృహ్య తూర్ణమేహి యదృచ్ఛయా. 73

బాపని పలుకువిని దుర్జయుడు నిలువెల్ల కోపముతో ఉడికిపోవుచు, నీలుడను సామంతరాజుతో ఉన్నపాటున వెళ్లు. ఆ బాపనిమణిని లాగుకొని వెంటనే రా! అని పలికెను.

ఏవ ముక్త స్తదా నీలో బహుసేనా పరిచ్ఛదః,

జగామ స చ విప్రస్య వన్య మాశ్రమ మణ్డలమ్‌. 74

రాజిట్లు పలుకగా నీలుడు పెద్దసేనను తీసికొని అడవిలో నున్న ఆ బాపని ఆశ్రమమున కలిగెను.

తత్రాగ్ని హోత్ర శాలాయాం దృష్ట్వా తం మణి మాహితమ్‌,

ఉత్తీర్య స్యన్దనా న్నీలః సోవరోహత భూతలే. 75

అందు అగ్నిహోత్రశాలలో ఉంచిన ఆ మణిని గాంచి నీలుడు రథమునుండి నేలకు దిగెను.

అవతీర్ణే తతస్తస్మిన్‌ నీలే పరమదారుణ,

క్రూరబుద్ధ్యా మణ స్తస్మా న్నిర్జగ్ముః శస్త్ర పాణయః. 76

క్రూరబుద్ధితో పరమదారుణుడగు నీలుడు రథము నుండి దిగిన వెంటనే మణి నుండి ఆ యుధధారులు వెలువడిరి.

సరథాః సధ్వజాః సాశ్వాః సబాణాః సాసిచర్మిణః,

సదనుష్కాః సతూణీరా యోధాః పరమదుర్జయాః,

నిచేరు స్తం మణిం భిత్వా అసంఖ్యేయా మహాబలాః. 77

రథములతో, ధ్వజములతో, గుఱ్ఱములతో, బాణములతో, కవచములతో, విండ్లతో, అమ్ముల పొదులతో కూడి ఎవ్వరికిని గెలువ శక్యముగాని యోధులు ఆ మణిని చీల్చుకొని లెక్క పెట్టరాని సంఖ్యతో అచట తిరుగసాగిరి.

తత్ర సజ్జా మహాశురా దశ పఞ్చ చ సంఖ్యయా,

నామభి స్తాన్‌ మహాభాగే కథయామి శృణుష్వతాన్‌. 78

భూదేవీ! ఆ మణి నుండి పదునైదుగురు మహాశూరులు సిద్ధమై నిలిచిరి. వారి పేర్లను చెప్పెదను వినుము.

సుప్రభో దీప్తతేజాశ్చ సురశ్మిః శుభదర్శనః,

సుకాన్తిః సున్దరః సున్దః ప్రద్యుమ్నః సుమనాః శుభః. 79

సుశీలః సుఖదః శమ్భుః సుదాన్తః సోమ ఏవచ,

ఏతే పఞ్చదశ ప్రోక్తా నాయకా మణితోత్థితాః. 80

సుప్రభుడు, దీప్తతేజుడు, సురశ్మి, శుభదర్శనుడు, సుకాంతి, సుందరుడు, ప్రద్యుమ్నుడు, సుమనుడు, శుభుడు, సుశీలుడు, సుఖదుడు, శంభుడు, సుదాంతుడు, సోముడు అను నీ పదునైదుగురు మణి నుండి వెలువడిన నాయకులు.

తతో విరోచనం దృష్ట్వా బహుసైన్య పరిష్కృతమ్‌,

యోధయామాసు రవ్యగ్రా వివిధాయుధపాణయః 81

అంత పెనుసేనతో తీర్చి నిలిచిన విరోచనుని గాంచి పలు విధములగు ఆయుధములను చేత దాల్చిన ఆ వీరులు దీక్షతో పోరాడిరి.

ధనూంషి తేషాం కనకప్రభాణి

శరాన్‌ సుజామ్బునద పుఙ్ఖనద్దాన్‌,

పతన్తి ఖడ్గాని విభీషణాని

భుశుణ్డిశూలాః పరమప్రధానాః.

మేలిమి బంగారు పిడులుగల ములుకులను బంగారు కాంతులను విరజిమ్ము విండ్లనుండి క్రుమ్మరించిరి. మరియు వెరపు గొలుపు ఖడ్గములు, మేలుజాతి భుశుండులు, శూలములు సైనికులపై వచ్చి పడినవి.

రథో రథం సంపరివార్య తస్థౌ

గజో గజస్యాపి హయో హయస్య,

పదాతి రత్యుగ్ర పరాక్రమశ్చ

పదాతి మేవ ప్రససార చాగ్ర్యమ్‌. 83

రథము రథమును నిలువరించి నిలిచెను. ఏనుగు ఏనుగును, గుఱ్ఱము గుఱ్ఱమును, గొప్ప పోటరితనము గల కాల్బంటు కాల్బంటున దాకెను.

ద్వన్ద్వా న్యనేకాని తథైవ యుద్ధే

ద్రవన్తి శూరాః పరిభర్త్సయన్తః,

విభీషణం నిర్గతచాపమార్గం

బభూవ బహుప్రభవం సుఘోరమ్‌. 84

అట్లా పోరిలో ఎక్కటి కయ్యములు పెక్కులు జరిగినవి. శూరులు పగవారిని బెదరించుచు పారద్రోలిరి. వింటి పోరులను పరమించి కొందరు మహాభయంకరమగు ముష్టియుద్ధములకు తలపడిరి.

తథా ప్రవృత్తే తుములేథ యుద్ధే

హతః సరాజ్ఞః సచివో విసంజ్ఞః,

సహానుగః సర్వబలై రుపేతో

జగామ వైవస్వత మన్దిరాయ.

అట్లు గందరగోళముగా పోరు సాగుచుండగా ఆ రాజు మంత్రి ఏటుపడి మూర్ఛవోయి, అనుచరులతో, సైనికులతో కూడి యమునిమందిరమునకు పయనించెను.

తస్మిన్‌ హతే దుర్జయరాజమన్త్రిణి

ఉపాయ¸° స్వేన బలేన రాజా,

స దుర్జయః సాశ్వరథోతితీవ్రః

ప్రతాపవాం సై#్త ర్మణిజై ర్యుయోధ. 86

దుర్జయరాజు మంత్రి విరోచనుడు అట్లు నేల కూలగా రాజే స్వయముగా మంచి గుఱ్ఱములు పూన్చిన రథముతో తీవ్ర వేగముతో సైనికులతో గూడి వచ్చెను. గొప్ప ప్రతాపముతో మణి నుండి పుట్టిన యోధులతో పోరాడెను.

తతస్తస్మింస్తదా రాజ్ఞో మహత్కదన మాబభౌ. 87

తతో హేతృప్రహేతృభ్యాం శ్రుత్వా జామాతరం రణ,

యధ్యమానం మహాబాహుం తతస్త్వాయయతు శ్చమూః.

అంత నా రాజునకు వారితో పెనుకయ్యము జరిగెను. మహా వీరుడగు తమ అల్లుడు పోరుచుండుట విని హేత, ప్రహేతలు సేనలోనికి చొరబడిరి.

తస్మిన్‌ బలే తు దైత్యా యే తాన్‌ శృణుష్వ ధరేరితాన్‌. 88

భూదేవీ! ఆ సేనలో నున్న రాక్షసులెవ్వరో చెప్పెదను వినుము.

ప్రఘసో విఘసశ్చైవ సఙ్ఘశోశనిప్రభః,

విద్యుత్ర్పభః సఘోశ్చ ఉన్మత్తాక్షో భయంకరః. 89

అగ్నిదన్తోగ్నితేజాశ్చ బాహుశక్రః ప్రతర్దనః,

విరాధో భీమకర్మా చ విప్రచిత్తి స్తథైవచ. 90

ప్రఘసుడు, విఘసుడు, సంఘశుడు, అశనిప్రభుడు, విద్యుత్ర్పభుడు, సుఘోషుడు, ఉన్మత్తాక్షుడు, భయంకరుడు, అగ్నిదంతుడు, అగ్ని తేజుడు, బాహుశక్రుడు, ప్రతర్దనుడు, విరాధుడు, భీమకర్ముడు, విప్రచిత్తి - అనువారు.

ఏతే పఞ్చదశ శ్రేష్ఠా అసురాః పరమాయుధాః,

అక్షౌహిణీపరీవార ఏకైకోత్ర పృథక్‌ పృథక్‌. 91

ఈ పదునైదుగురు శ్రేష్ఠులగు రక్కసులు, గొప్ప ఆయుధములు తాల్చువారు. ఒక్కొక్కడు ఒక్కొక్క అక్షౌహిణి సేనతో కూడినవారు.

మహామాయాస్తు సమరే దుర్జయస్య మహాత్మనః,

యుయుధు ర్మణిజైః సార్ధం మహాసైన్య పరిచ్ఛదాః. 92

పెనుదేహము గల ఆ దుర్జయుని ఈ వీరులు యుద్ధమున గొప్ప మాయలు చేయువారు. పెనుబలముతో వారు మణి నుండి పుట్టిన వీరులతో పోరొనర్చిరి.

(సుప్రభః ప్రఘసం త్వాజౌ తాడయామాస పఞ్చభిః,

శ##రై రాశీవిషాకారైః ప్రతపై#్తః పతగైరివ. 93

అంత యుద్ధమున సుప్రభుడు ప్రఘసుని నాగు బాముల వంటివియు, నిప్పులు వెలిగ్రక్కు సూర్యులవంటివియునగు అయిదు బాణములతో కొట్టెను.)

సప్తతేజాస్త్రిభి ర్బాణౖ ర్విఘసం సంప్రవిధ్యత,

సంఘశం దశభి ర్బాణౖః సురశ్మిః ప్రత్యవిధ్యత. 94

సప్తతేజుడు మూడు బాణములతో విఘసుని చాపమోదెను. సురశ్మి పదిబాణములతో సంఘశుని కూలబొడిచెను.

అశనిప్రభం రణవిధ్యత్‌ పఞ్చభిః శుభదర్శనః,

విద్యుత్ర్పభం సుకాన్తిస్తు సుఘోషం సున్దర స్తథా. 95

శుభదర్శనుడు అశని ప్రభుని అయిదు కోలలతో క్రుమ్మి వైచెను. అట్లే సుకాంతి విద్యుత్ర్పభుని, సుందరుడు సుఘోషుని తాడించిరి.

ఉన్మత్తాక్షం తథావిధ్యత్‌ సున్దః పఞ్చభి రాశుగైః,

చకర్త చ ధనుస్తస్య శితేన సతపర్వణా. 96

అట్లే సుందుడు అయిదు బాణములతో ఉన్మత్తాక్షుని కొట్టెను, వాడిగల వంపు బాణముతో ఆతని విల్లు విరుగగొట్టెను.

సుమనా అగ్ని దంష్ట్రంతు సుశుభశ్చాగ్నితేజసమ్‌,

సుశీలో వాయుశక్రం తు సుముఖశ్చ ప్రతర్దనమ్‌. 97

సుమనుడు అగ్నిదంష్ట్రుని, సుశుభుడు అగ్నితేజుని, సుశీలుడు వాయుశక్రుని, సుముఖుడు ప్రతర్దనుని చావమోదిరి.

(విరాధేన తథా శమ్భుః సుకీర్తి ర్భీమకర్మణా,

విప్రచిత్తి స్తథాసోమ మేతద్‌ యుద్ధం మహానభూత్‌. 98

విరాధునితో శంభుడు, భీమకర్మునితో సుకీర్తి, సోమునితో విప్రచిత్తి పోరిరి. ఆ మహాయుద్ధ మిట్లు సాగెను.)

పరస్పరం సుయుద్ధేన యోధయిత్వాస్త్రలాఘవాత్‌,

యథా సంఖ్యేన తే దైత్యాః పునర్మణిభ##వై ర్హతాః. 99

ఇట్లా రక్కసులు అస్త్రముల ఒడుపుతో, ఒక్కొక్కరిని ఎంచుకొని, పోరాడి మణి నుండి పుట్టిన ఆ వీరులతో వరుసగా చచ్చిరి.

యావత్‌ సంగ్రామ ఘోరో వై మహాంస్తేషాం వ్యవర్ధత,

తావత్‌ సమిత్కుశాదీని కృత్వా గౌరముఖో మునిః. 100

ఇట్లు వారికి పెనుకయ్యము తీవ్రస్థాయికి వచ్చునంతలో పుడకలను, దర్భలను గైకొని గౌరముఖుడు చనుదెంచెను.

ఆగతో మహదాశ్చర్యం సంగ్రామం భీమదర్శనమ్‌,

బహుసైన్యపరీవారం స్థితం తం చాపి దుర్జయమ్‌. 101

అట్లు వచ్చి భయము గొల్పునట్లుగా కానవచ్చు ఆ యుధ్ధమున, పెద్దసేనతో చుట్టియున్న ఆ దుర్జయుని గాంచెను.

తం దృష్ట్వా స ముని ర్ద్వారి చిన్తా పరమ ఏవహి,

ఉపవిశ్యాధిగమ్యాథ మాణః కారణ మేవ హ. 102

ఆతనిని గాంచి ఆ ముని ద్వారముకడనే కూర్చుండి భావన చేయజొచ్చెను. అది యంతయు ఆ మణి కారణముననే జరిగెనని నిర్ణయించెను.

ఏవం కృత్వా మణికృతం రౌద్రం గాఢంచ సంయుగమ్‌,

చిన్తయామాస దేవేశం హరిం గౌరముఖో మునిః. 103

భయంకరమగు ఆకయ్యము మణివలననే అయినదని నిశ్చయించి ఆ గౌరముఖముని దేవదేవుడగు హరిని తలపోసెను.

స దేవః పురత స్తస్య పీతవాసాః ఖగాసనః,

కి మత్ర తే మయా కార్య మితి వాణీ ముదీరయత్‌. 104

పట్టుబట్ట ధరించి గరుడు నెక్కియున్న ఆ దేవుడు ఆ ముని ముందు కానవచ్చిన నీకు నేను చేయదగు పని యేమి యని పలికెను.

స ఋషిః ప్రాఞ్జలి ర్భూత్వా ఉవాచ పురుషోత్తమమ్‌,

జహీమం దుర్జయం పాపం ససైన్యం పరివారిణమ్‌. 105

అంత నా ఋషి చేతులు జోడించి పురుషోత్తమునితో పాపి యగు ఈ దుర్జయుని సేనతో, సేవకులతో పరిమార్పుమని ప్రార్థించెను.

ఏవ ముక్త స్తదా తేన చక్రం జ్వలన సన్నిభమ్‌,

ముమోచ దుర్జయబలే కాలచక్రం సుదర్శనమ్‌. 106

ఆతడట్లు పలుకగా హరి అగ్నివంటి సుదర్శన చక్రమును దుర్జయుని సేనపై, కాలుని చక్రమును వలె, ప్రయోగించెను.

తేన చక్రేణ తత్సైన్య మాసురం దౌర్జయం క్షణాత్‌,

నిమేషాన్తరమాత్రేణ భస్మవద్‌ బహుధా కృతమ్‌. 107

ఆ చక్రమువలన దుర్జయునిదగు ఆ రక్కసులసేన యంతయు రెప్పపాటు మాత్రములో బూడిద బుంగలాయెను.

ఏవం కృత్వా తతో దేవో మునిం గౌరముఖం తదా,

ఉవాచ నిమిషేణదం నిహతం దానవం బలమ్‌. 108

ఇట్లొనర్చి ఆ దేవుడు గౌరముఖునితో ఇట్లు పలికెను. నిమిష మాత్రమున ఈ దానవబలమంతయు నాశనమయ్యెను.

అరణ్యస్మింస్తత స్త్వేవం నైమిషారణ్యసంజ్ఞితమ్‌,

భవిష్యతి యథార్థం వై బ్రాహ్మణానాం విశేషతః. 109

ఈ అరణ్యమున అట్లు వారు నిమేష కాలములో చచ్ఛిరి కావున దీనికి 'నైమిష' మనుపేరు అర్థవంతముగా నేర్పడును. ఇది బ్రాహ్మణులకు విశేషముగా నెలవగును.

అహం చ యజ్ఞ పురుష ఏతస్మిన్‌ వనగోచరే,

నామ్నా యాజ్యా సదా చేమే దశ పఞ్చచ నాయకాః,

కృతే యుగే భవిష్యన్తి రాజానో మణిజా మునే. 110

యజ్ఞపురుషుడనగు నేనును ఈ అరణ్యమున నెలకొని యుందును. ఈ మణివలన పుట్టిన ఈ పదునైదుగురు నాయకులును యజ్ఞములలో మన్నింపదగినవారు. వీరు కృతయుగమున రాజులగుదురు.

ఏవ ముక్త్వా తతోదేవో గతోన్తర్ధాన మీశ్వరః,

ద్విజోపి స్వాశ్రమే తస్థౌ ముదా పరమయా యుతః. 111

ప్రభువిట్లు పలికి అంతర్ధానము చెందెను. ఆ బ్రాహ్మణుడును పరమానందముతో తన యాశ్రమమున నివసించెను.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ఏకాదశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదునొకండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters