Varahamahapuranam-1    Chapters   

త్రయోదశాధికశతతమోధ్యాయః - నూటపదుమూడవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు పలికెను.

సంస్తూయమానో భగవాన్‌ మునిభి ర్మన్త్రవాదిభిః,

తుష్టో నారాయణో దేవః కేశవః పరమో విభుః. 1

మునులు, వేదపండితులు మున్నగువారు ఇట్లు చక్కగా స్తుతించుచుండగా నారాయణుడు, దేవుడు, కేశవుడు, పరముడు, విభువు తుష్టుడాయెను.

తతో ధ్యానం సమాస్థాయ దివ్యం యోగం చ మాధవః,

మధురం స్వరమాస్థాయ ప్రత్యువాచ వసుంధరామ్‌. 2

అంత కొంతవడి ధ్యానమును పొంది, దివ్యమగు యోగమును పొంది మాధవుడు తీయని స్వరముతో వసుంధరతో నిట్లనెను.

తవ దేవి ప్రియార్థాయ భక్త్యా యచ్చ వ్యవస్థితమ్‌,

కారయిష్యామి తే సర్వం యత్తే హృది వ్యవస్థితమ్‌. 3

దేవీ! నీప్రియముకొరకును, నీభక్తిచేతను, నీ హృదయమున ఏదికలదో అది అంతయు చేసెదను.

అహం త్వాం ధారయిష్యామి సశైలవనకాననామ్‌,

ససాగరాం ససరితాం సప్తద్వీపసమన్వితామ్‌. 4

కొండలతో, అడవులతో, సముద్రములతో, నదులతో ఏడుద్వీపములతో కూడిన నిన్నునేను పట్టుకొని నిలిపెదను.

ఏవ మాశ్వాసయిత్వాతు వసుధాం సతు మాధవః,

రూపం సంకల్ప యామాస వారాహం సుమహౌ జసమ్‌. 5

ఇట్లు వసుధకు ఊరట కలిగించి మాధవుడు పిక్కటిల్లిన దేహబలము గల వరాహరూపమును భావించెను.

షట్‌ సహస్రాణి చోచ్ఛ్రాయో విస్తారేణ పునస్త్రయః,

ఏవం నవ సహస్రాణి యోజనానాం విధాయ చ. 6

ఆరువేల యోజనముల ఎత్తు, మూడు వేలయోజనముల వెడల్పుగా మొత్తము తొమ్మిదివేల యోజనముల రూపమును కల్పించెను.

వామయా దంష్ట్రయా గృహ్య ఉజ్జహార స మేదినీమ్‌,

సపర్వతవనాకారాం సప్తద్వీపాం సపత్తనామ్‌. 7

ఎడమకోరతో పట్టుకొని కొండలు, అడవులు, ఏడు ద్వీపములు, పత్తనములు గలభూమి నంతటిని పైకి లాగెను.

నగా విలగ్నాః పతితాః కేచిద్‌ విజ్ఞాన సంశ్రితాః,

శోభ##న్తే చ విచిత్రాంగా మేఘా వర్షాగమే యథా., 8

పట్టు దొరకని కొన్ని పర్వతములు పడిపోయినవి. ఏదోతెలియ వచ్చునట్లు వ్రేలాడుచుండినవి. విచిత్రములగు అంగములు కల అట్టివి వర్షకాలములో మేఘములవలె శోభిల్లినవి.

చన్ద్ర నిర్మలసంకాశా వరాహముఖ సంస్థితాః,

శోభ##న్తే చక్రపాణశ్చ మృణాళం కర్దమే యథా. 9

చక్రము చేత దాల్చిన వరాహస్వామి ముఖమున వ్రేలుచు ఆ కొండలు చంద్రునివలె నిర్మలస్వరూపము కలవియై బురదలో తామరతూడులవలె ప్రకాశించినవి.

ఏవం విధార్యమాణా సా పృథివీ సాగరాన్వితా,

వర్షాణాం చ సహస్రం హి వజ్రదంష్ట్రేణ సాధునా. 10

ఈ విధముగా వజ్రములవంటికోరలు గల ఉత్తమస్వభావము గల ఆ విష్ణువు సాగరములతో కూడిన భూమిని వేయిఏండ్లు పట్టుకొని నిలిపెను.

తస్యామేవం తు కాలస్య పరిమాణం యుగేషు చ,

ఏకసప్తతిమే కల్పే కర్దమోయం ప్రజాపతిః 11

అట్లు ఎన్నోయుగముల కాలము ఆ భూమి ఆ విధముగా నుండగా డెబ్బదియొకటవ కల్పమున కర్దముడు ప్రజాపతి అయి ఉండెను.

తతః పృథివ్యా దేవశ్చ భగవాన్‌ విష్ణురవ్యయః,

అన్యోన్యాభిమతాశ్చైవ వారాహే కల్ప ఉత్తమే. 12

అపుడు భగవానుడు, అవ్యయుడు, దేవుడునగు విష్ణువును, భూమియు ఆ ఉత్తమమగు వరాహకల్పమున ఒకరియందొకరు ప్రీతి కలవారైయుండిరి.

సా గౌః స్తువతి తం చైవ పురాణం పరమవ్యయమ్‌,

యోగేన పరమేణౖవ శరణం చైవ గచ్ఛతి 13

ఆ భూమి పురాణుడు, అవ్యయుడు, పరముడునగు ఆ దేవుని స్తుతించెను. పరమమగు యోగముతో ఆతనిని శరణు చొచ్చెను.

ఆధారః కీదృశో దేవ ఉపయోగశ్చ కీదృశః,

కాలేకాలే చ దేశే చ కర్మణశ్చాపి కీదృశః. 14

దేవా! నన్ను పట్టుకొనుటలో నీకు ఆధారమెట్టిది? ఉపయోగ మెట్టిది? ఆయాకాలమునందు, ఆయాదేశమునందు, ఆయా కర్మమునందు నీవ్యవసాయ మెట్టిది?

కీదృశా పశ్చిమా సంధ్యా కీదృశా హ్యర్ధవాహ్యతః,

శేషాః సమానా స్త్వాం దేవైః యేతు కర్మాణి కుర్వతే. 15

పడమటి సంధ్య ఎట్టిది? ఆ పై విషయము లెట్టివి? నీయెడల ఆయాపనులు చేయుచున్న దేవతలతో తక్కిన వారు సమానులా?

కింను సంస్థాపనా దేవ ఆవాహనవిసర్జనే,

అగురుం గన్ధధూపంచ ప్రాపణం గృహ్యసే కథమ్‌. 16

నిన్ను నెలకొల్పుట ఎట్లు? ఆవాహన యెట్లు? విసర్జన ఎట్లు? అగురు గంధధూపనము నీవెట్లు గ్రహింతువు?

కథం పాద్యం చ గృహ్ణాసి స్థాపనా లేపనాని చ,

కథం దీపం చ దాతవ్యం కందమూలఫలాని చ. 17

నీకు పాద్యమొసగుట ఎట్లు? నిన్ను నిలుపుట ఎట్లు? నీకు గంధము పూయుట ఎట్లు? నీకు దీపమొసగుట ఎట్లు? నీకు దుంపలు పండ్లు నివేదించుట ఎట్లు?

ఆసనం శయనం చైవ కిం కర్మణి విధీయతే,

కథం పూజా ప్రకర్తవ్యా ప్రాపణా స్తత్ర వై కతి,

పూర్వపశ్చిమ సంధ్యాయాం కిం పుణ్యం చాపితత్రవై. 18

నీకు ఆసనము, శయనము కూర్చుట ఎట్లు? నీ పూజ చేయుట ఎట్లు? ఎన్ని సందర్భములలో పూజచేయవలయును. తూర్పు, పడమరల సంధ్యలలో పూజించుటవలన కలుగు పుణ్యమెట్టిది?

శరది కీదృశంకర్మ శిశిరేకర్మ కీదృశమ్‌,

వసన్తే కీదృశం కర్మ గ్రీష్మే కిం కర్మ కారయేత్‌,

ప్రావృట్‌ కాలేచ కిం కర్మ వర్షాన్తే కించ కారయేత్‌. 19

శరత్తు, శిశిరము, వసంతము, గ్రీష్మము, వర్షము, వర్షము ముగిసిన కాలము-అనునీ ఋతువులలో చేయదగు కర్మమెట్టిది?

యాని తత్రోపయోగ్యాని పుష్పాణి చ ఫలాని చ,

కర్మణ్యాశ్చ అకర్మణ్యా యే వై శాస్త్ర బహిష్కృతాః. 20

అందు ఉపయోగింపదగు పూలెట్టివి? పండ్లెట్టివి? కర్మము, అకర్మము అనువానిలో శాస్త్రము వెలిపెట్టిన పదార్థము లెట్టివి?

కిం కర్మణా భోగవతా యావద్‌ గచ్ఛతి కీదృశాః.

కథం కర్మ నచాన్తేషు అతిగచ్ఛతి కీదృశాః. 21

భోగవంతులు ఏ పని చేసి లక్ష్యమున కరుగుదురు? ఎట్టివారు ఆయాపనుల తుదిభాగములందు అతిక్రమింపకుందురు?

అర్చాయాః కిం ప్రమాణం తు స్థాపనం చాపి కీదృశమ్‌,

పరిమాణం కథం దేవ ఉపవాసశ్చ కీదృశః. 22

పూజకు ప్రమాణమేమి? స్థాపనము ఎట్టిది? పరిమాణ మెంతటిది? ఉపవాసమనగా నెట్టిది?

పీతకం శుక్ల రక్తం వా కథం గృహ్ణీత శాశ్వతమ్‌,

తేషాం తు కానివస్త్రాణి యై ర్హితం ప్రతిపద్యతే. 23

పసుపు, తెలుపు, ఎరుపు రంగుల అభరణములలో ఎట్టివానిని నీవు శాశ్వతముగా గ్రహింతువు? ఏరంగు వస్త్రములు నీకు ఇచ్చినవారు మేలు పొందెదరు?

కేషు ద్రవ్యేషు సంయుక్తం మధుపర్క చ దీయతే,

కే తు కర్మగుణా స్తస్య మధుపర్కస్య మాధవ,

కాని లోకాని గచ్ఛన్తి మధుపర్కస్య ప్రాశనాత్‌. 24

ఏ ద్రవ్యములు కలిపి మధుపర్కమును నీకీయవలయును? అందు కర్మమెట్టిది? గుణములెట్టివి? మధుపర్కము పుచ్చుకొనుట వలన నరుడు ఏ లోకముల కరుగును?

స్తవే పరమకాలేపి తవ భక్తస్య మాధవ,

కిం ప్రమాణం తు దాతవ్యం మధుపర్కసమన్వితమ్‌. 25

నీ స్తోత్రము చేయు పరమ పుణ్యకాలమున నీ భక్తుడు మధుపర్కమును ఏ ప్రమాణములో ఈవలయును?

కాని మాంసాని తే దేవ ఫలం శాకశ్చ కీదృశః,

ప్రాపణష్వపి యుజ్యేత కర్మశాస్త్ర సమాయుతమ్‌. 26

ఏ యే మాంసములు, ఏకూరలు, ఏ పండ్లు నీసంబంధము లగు పనులలో నివేదనకు శాస్త్రముననుసరించి యోగ్యములు?

ఆహూతస్య చ మన్త్రేణ ఆగతే భక్తవత్సలే,

కేన మన్త్రవిధానేన ప్రాశనం తే ప్రదీయతే. 27

మంత్రముతో నిన్నాహ్వానింపగా భక్తవత్సలుడవు నీవరుదెంతువు. అప్పుడు ఏ మంత్రవిధానముతో నీకు నైవేద్యము ఒసగవలయును?

కిం తస్య చోపచారేణ అర్చయిత్వా యథావిధి,

కాని కర్మాణి కుర్వీత తవ భక్తస్య భోజనాత్‌. 28

నిన్నాయా ఉపచారములతో యథావిధిగ అర్చించి భక్తుడు చేయవలసిన పనులెట్టివి? భోజనమైన తరువాత చేయదగిన కర్మము లెట్టివి?

యత్‌ స్తుతం ప్రాపనం దేవ నచదోష ప్రసాదితమ్‌,

కేత్ర భుంజన్తి తద్దేవ సర్వశుద్ధికరం శుభమ్‌. 29

నీ స్తుతి, నీ అర్పణములు ఏ దోసములేకుండ ముగిసిన తరువాత సర్వశుద్ధికరము, శుభము అగు నీ ప్రసాదమును భుజించు వారెవ్వరు?

యేతు ఏకాశిరో దేవ ముపసర్పన్తి మాధవమ్‌,

తేషాంతు కా గతిర్దేవ తవ భక్తి పరాయణాః. 30

ఒంటిపూట భోజనముచేసి నీకడకు వచ్చు భక్తి పరాయణులు ఏగతికి పోవుదురు?

షష్ఠాష్టమేవ కాలేన యోభిగచ్ఛేత మాధవమ్‌,

తేషాంతు కా గతిర్దేవ తవ భక్తి పరాయణమ్‌. 31

షష్ఠాష్టమ కాలమున భక్తిపరాయణ భావముతో మాధవుని కడ కేతెంచు వారి గతియేమి?

కృచ్ఛ్రం చాన్ద్రాయణం కృత్వాయేభిగచ్ఛన్తి మాధవమ్‌,

తేషాంతు కా గతి ర్దేవ తవ కర్మపరాయణమ్‌. 32

కృచ్ఛ్రు చాంద్రాయణములను కర్మములందు ఆసక్తికలిగి నిర్వహించువారు మాధవునికడ కేతెంచినచో వారు పొందెడు స్థితి యెట్టిది?

వ్రతం కృత్వా యథోక్తేన యేభిగచ్ఛన్తి మాధవమ్‌,

కాం గతిం పురుషా యాన్తి భావితా స్తవ శాసనే. 33

శాస్త్రముచెప్పినవిధముగా వ్రతమొనరించి నీ శాసనము నందు చక్కగా మెలగువారు మాధవుని గూర్చి ప్రయాణింతురేని వారు పొందెడు గతి యెట్టిది?

కృచ్ఛ్రం సాంతపనం కృత్వా యేభిగచ్ఛన్తి మాధవమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే తవ కర్మపరాయణాః. 34

నీ కర్మములందు పరమశ్రద్ధకలవారై అతికష్టమైన సాంతపనమను వ్రతమును చేయువారు మాధవుని కడకరుగుచు ఏ గతి పొందుదురు?

వాయ్వాహారం తతః కృత్వా కృష్ణం సమధిగచ్ఛతి,

తేషాంతు కా గతిః కృష్ణ తవభక్తి వ్యవస్థితాః. 35

కృష్ణా! వాయువే ఆహారముగా గ్రహించి నీయందలిభక్తితో అచంచలముగా నుండు వారు కృష్ణుని పొందుచు పొందుగతి యేమి?

అక్షారలవణం కృత్వా యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే తవ కర్మానుసారిణః. 36

స్వామీ! నీ కర్మముననుసరించువారై ఉప్పుకారములు లేని భోజనము తినుచు అచ్యతునివైపు ప్రయాణించువారు ఏగతిని పొందుదురు?

తులాపురుషకం కృత్వా యేభిచ్ఛన్తి కేశవమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే నరా యే వ్రతచారిణః. 37

వ్రతముల నాచరించుచు తులాపురుషక వ్రతమును చేసి కేశవునివైపు పోవునరులు ఏగతిని పొందెదరు?

కృత్వా పయోవ్రతం చైవ యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే నరా యే వ్రతచారిణః. 38

అచ్యుతుని కడకరుగు వారై పాలను మాత్రమే పుచ్ఛుకొని వ్రతము చేయువారు ఏగతిని కరుగుదురు?

దత్వా గవాహ్నికం చైవ యే ప్రపద్యన్తి మాధవమ్‌,

కాం గతిం తేప్రపద్యన్తే తవ భక్త్యా వ్యవస్థితాః. 39

నీయందు చెదరనిభక్తి కలవారై ప్రతిదినము ఆవునకు మేత ఇడుచు మాధవార్చన చేయువారు ఏగతి కరుగుదురు?

ఉఞ్ఛవృత్తిం సమాస్థాయ యేభిగచ్ఛన్తి మాధవమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే నరా భిక్షోపజీవినః. 40

బిచ్చమెత్తుకొని బ్రదుకుచు రాలిన గింజ లేరుకొని తిను వ్రతము నవలంబించి మాధవు నర్చించువారేగతి పొందుదురు?

గృహస్థధర్మం కృత్వా వై యేభిగచ్ఛన్తి కేశవమ్‌,

కాం గతిం తే ప్రపద్యన్తే తవకర్మ పరాయణాః. 41

నీకర్మములందు మిక్కిలి శ్రద్ధకలిగి గృహస్థధర్మమును పాటించుచు కేశవు నర్చించువారు ఏగతి పొందుదురు.

వైకుంఠ తవ క్షేత్రేషు యేతు ప్రాణాన్‌ విముంచతే,

కాంల్లోకాంస్తే ప్రపద్యన్తే తవ క్షేత్రేషు యే మృతాః. 42

వైకుంఠా! నీ క్షేత్రములందు ప్రాణములు విడుచువారు. మరణము పొందినవారు ఏలోకముల కరుగుదురు?

కృత్వా పఞ్చాత్మకం చైవ మాధవాయ ప్రపద్యతి,

కాంగతిం తు పరాం యాన్తి యేతే పఞ్చత్వ మాశ్రితాః. 43

పంచాగ్ని మధ్య తపస్సునాచరించి మాధవుని శరణుచొచ్చిన వారు మరణించిన పిదప ఎట్టి పరమగతి కరుగుదురు?

కణ్టశయ్యాం సమాసాద్య యే ప్రపద్యన్తి చాచ్యుతమ్‌,

తేషాంతు కా గతిర్దేవ కణ్టశయ్యాం సమాశ్రితాః. 44

ముళ్లపానుపు నెక్కి అచ్యుతు నారాధించుచు తపము చేయువారు ఏగతి కరుగుదురు?

ఆకాశశయంన కృత్వా యేప్రపద్యన్తి చాచ్యుతమ్‌,

తేషాం తు కాగతిః కృష్ణ తవ భక్తి పరాయణాః. 45

నీ భక్తిపై మిక్కిలి అనురక్తి కలవారై కృష్ణా! ఆకాశశయనము కావించి తపస్సుచేయు వారిగతి యెట్టిది?

గోవ్రజే శయనం కృత్వా యే ప్రపద్యన్తి కేశవమ్‌,

తేషాం తు కాగతి ర్దేవ తవభక్తిపరాయణాః. 46

నీపై అచంచలమగు భక్తి కలవారై ఆవులమందలో నిద్రించు వ్రతమాచరించువారి గతి యెట్టిది?

శాకాహారం తతః కృత్వా యేభిగచ్ఛన్తి చాచ్యుతమ్‌,

తేషాంతు కాగతి ర్దేవ తవభక్తి పరాయణాః. 47

నీయందలి పరమభక్తితో కూరలు మాత్రమే తినుచు అచ్యుతుని వైపు ప్రయాణించువారు పొందెడు గతి యెట్టిది?

పఞ్చగవ్యం తతః పీత్వా యేభిగచ్ఛన్తి మాధవమ్‌,

తేషాంతు కా గతిర్దేవ యే నరా యావకాశినః. 48

పంచగవ్యములను త్రావి విష్ణుని ఆరాధించు భక్తులగతి యెట్టిది? (పంచగవ్యములు - ఆవుపాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మూత్రము.)

ఆహారం గోమయం కృత్వా యేభిగచ్ఛన్తి కేశవమ్‌,

నారాయణ గతి స్తేషాం కీదృశ్యత్ర విధీయతే. 49

గోమయమునే ఆహారముగా గొని కేశవు నర్చించు వారిగతి. నారాయణా! ఎట్టిది?

సక్తూంశ్చ భక్షయిత్వా తు యేప్రపద్యన్తి చాచ్యుతమ్‌,

తేషాం తు కా గతిర్దేవ తవ కర్మపరాయణాః. 50

నీ సేవలో శ్రద్ధకలవారై పేలపిండినిమాత్రము తినుచు మాధవు నారాధించువారు పొందుగతి యేమి?

శిరసా దీపకం కృత్వా యేభిగచ్ఛన్తి కేశవమ్‌,

తేషాంతు కా గతి ర్దేవ శిరసా దీపధారణాత్‌. 51

తలపై దీపముంచుకొని కేశవు నర్చించు వారికి దేవా! గతి యెట్టిది?

యే హినిత్యం పయః పీత్వా తవచిన్తావ్య వస్థితాః,

తేగతికాం ప్రపద్యన్తి తవచిన్తా పరాయణాః. 52

నిత్యము పాలు మాత్రము త్రావుచు నిన్నే విడువక ధ్యానించు చుండువారు ఏగతి నందుదురు?

ఆమాశనం వ్రతం కృత్వా యే ప్రపద్యన్తి నిత్యశః,

తేషాంతు కా గతిర్దేవ తవభక్తి పరాయణాః. 53

నీభక్తి యందు పరమానురాగము కలవారై ఆమబోజనము అనువ్రతముతో నిన్నర్చించువారి గతి ఏమి ?

(ఆమము - వడంని పదార్థము)

భక్షయిత్వా తు దుర్వాం యే ప్రపద్యన్తి మీనీషిణః,

తేషాం తుకా గతిర్దేవ స్వకర్మ గుణచారిణః. 54

గరికము మాత్రమే తినుచు తమ కర్మములను గుణములను అనుసరించుచు నిన్ను చేరుకొనువారు పొందుగతి యెట్టిది?

జానుభ్యాం ప్రతిపద్యన్తి తవ ప్రీత్యా చ మాధవ,

తేషాంతు కా గతి ర్దేవ తన్మమాచక్ష్వ పృచ్ఛతః. 55

నీ యందలి ప్రీతితో మోకాళ్లపై కూర్చుండి ధ్యానించు వారిగతి యెట్టిదో అడుగుచున్న నాకు తెలియజెప్పుము.

ఉత్తానశయనం కృత్వా యే విధారన్తి దీపికాః,

తేషాంతు కాగతిర్దేవ తన్మమాచక్ష్వ పృచ్ఛతః. 56

వెల్లికిలగా పండుకొని పైన దీపములుంచుకొని నిన్నర్చించు వారు పొందెడుగతి యెట్టిదో చెప్పుము.

జానుభ్యాం దీపకం కృత్వా కేశవాయ ప్రపద్యతే.

తేషాంతు కాగతి ర్దేవ తవ ధర్మపారయణాః. 57

నీ ధర్మమున శ్రద్ధకలిగిన మోకాళ్లమీద దీపముంచుకొని కేశవు నర్చించువారి గతి ఎట్టిది ?

కరభ్యాం దీపకం గృహ్య కేళవాయ ప్రపద్యతే,

తేషాం తు కాగతి ద్రేవ కథ్యతే చైవ శాస్వతీ. 58

రెండు చేతులలో దీపముంచుకొని కేశవు నర్చించు వారి శాశ్వత గతి యెట్టిదో చెప్పుము.

అవాక్‌ శిరాస్తు భూత్వా వై యఃప్రపద్యే జ్జనార్దనమ్‌,

భగవన్‌ కాగతిస్తస్య అవాక్‌ శిరసి శాయినః. 59

తలక్రిందుగా ఉంచుకొని పండుకొనివారు జనార్దునుని ఆశ్రయించి పొందెడు గతి ఏమి?

పుత్రదారగృహం చైవముక్త్వా యో నుప్రపద్యతే.

తేషాంతు కా గతిః సిద్ధా కథయస్వ సురోత్తమ. 60

కొడుకులను, భార్యను, ఇంటిని వదలి నిన్నేగతిగా కైకొను సిద్ధు లెట్టిగతి నందుదులో తెలియబలుకుము.

భాషితో సి మయాహ్యేవం సర్వలోకసుఖావహమ్‌,

గమనాగమనం చైవ త్వత్రసన్నేన మాధవ. 61

మాధవా !అన్నిలోకములకు సుఖకారణమైన రాకపోకలను గూర్చి నీవు ప్రసన్నుడవైన కారణముగా నేను పలుకగలిగితిని.

త్వం మాతా త్వంపితా త్వంచ సర్వధర్మ వినిశ్యయః,

అతస్త్వయైన వక్తవ్యం యోగసాంఖ్య వినిశ్చయః.62

నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వధర్మములకు నిశ్చయరూపుడవు. కావున యోగము, సాంఖ్యము అనువాని నిర్ణయమును గూర్చి చెప్పవలయును.

త్వాం భజం శ్చ గతే జీవే మధుపర్కసమన్వితమ్‌,

భస్మాకులేషు నిక్షిప్య కథం చాగ్నౌ ప్రపద్యతే. 63

నిన్ను భజించుచు జీవుడు మృతిచెందినచో మధుపర్కముతో పాటు భస్మమునందు కలిసి వానిదేహమును అగ్నిలో దహనము చేయు విధానమెట్టిది ?

కాంగతిం తే ప్రపద్యన్తే త్వద్భక్తే జలసంస్థితే.

త్వత్‌క్షేత్ర సంస్థితో వా పి తన్మమాచక్ష్వ పృచ్ఛతః. 64

నీభక్తుడు నీటమునిగినప్పుడు, నీక్షేత్రమున నిలిచి యున్న పుడు నిన్ను పొందినచో అతని గతి యెట్టిది?

స్మరణం తేషు చే కృష్ణ యైస్తు నామప్రకీర్తితమ్‌,

నమో నారాయణత్యుక్త్వా తేషాం వై కా గతిర్భవేత్‌. 65

నీ నామములను కీర్తించుచు '' నమో నారాయణాయ ''ని పలుకుచు దానినే స్మరించుచువారి గతి యెట్టిది?

ఉద్యతేష్వసి శ##స్త్రేషు హన్యమానా రణ నరాః,

యేతు నామ ప్రకీర్త్యన్తే తేషాం వై కీదృశీ భ##వేత్‌. 66

ఆయుధము నెత్తపట్టుకొని శత్రువులు చంపుచున్నపుడు. నీనామమును కీర్తించువారు పొందుగతి యెట్టిది?

అహం శిష్యా చ దాసీ చ దవభ##క్తై వ్యవస్థితా,

రహస్యం ధర్మసంయుక్తం తన్మమాచక్ష్వ మాధవ. 67

నేను నీకు శిష్యను, నీ దాసినీ, నీభక్తియందు స్థిరముగా నుండుదానను. ధర్మముతో కూడిన ఈ రహస్యమును మాధవా !నాకు చెప్పుము.

ఏవంతే పరమం గుహ్యం మమప్రీత్యా జగుద్గురో,

లోకధర్మార్థం చిన్త్యత్వం తధ్‌ భవాన్‌ వక్తుమర్హసి. 68

జగద్గురూ! ఇది పరమ రహస్యం%ు. నా యందలి ప్రీతితో లోకధర్మమును విచారించి నీవు నాకు చెప్పవలయును.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్తే త్రయోదసాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదుమూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters