Varahamahapuranam-1    Chapters   

అధ ద్వావింశత్యధిక శతతమోధ్యాయః - నూటయిరువదిరెండవ అధ్యాయము

శ్రుత్వా తు కోకామాహాత్మ్యం పృథివీ ధర్మసంహితమ్‌,

విస్మయం పరమం గత్వా శ్రుత్వా ధర్మం మహౌజసమ్‌. 1

ఇట్లు భూదేవి ధర్మమునిండుగాగల కోకామాహాత్మ్యమును,

పిక్కటిల్లిన సత్తువగల ధర్మమును విని పరమాశ్చర్యమును పొందెను.

ధరణ్యావాచ - ధరణి పలికెను

అహో ప్రభావం కోకాయా మాహాత్మ్యం క్రోడరూపిణః,

తిర్యగ్యోనిగతౌ చాపి ప్రాప్తౌ యత్‌ పరమాం గతిమ్‌. 2

అహో! కోకాతీర్థప్రభావము, వరాహరూపదేవుని మహిమ! పశుపక్ష్యాదుల కడుపున పుట్టినవియు పరమగతిని పొందినవి.

తవ దేవ ప్రసాదేన కిఞ్చ దిచ్ఛామి వేదితుమ్‌,

యన్మయా పూర్వ పృష్టోసి కేన ధర్మేణ మానవాః. 3

తపసా కర్మణా వాపి పశ్యన్తి త్వాం హి మాధవ,

ప్రసాదసుముఖో భూత్వా నిఖిలం వక్తు మర్హసి. 4

దేవా! నీదయతో మరియొక విషయము తెలియ గోరుచున్నాను. దీనిని కూడ మున్ను నిన్నడిగితిని. ఏధర్మముతో, ఏతపస్సుతో, ఏకర్మముతో, మాధవా! మానవులు నిన్ను దర్శింతురో దానిని ప్రాసాదముఖుడవై సర్వమును చెప్పుము.

ఏవం పృష్ట స్తదా దేవ్యా మాధవ్యా సతు మాధవః,

ప్రహస్య పున రేవేదం వక్తుం సముపచక్రమే. 5

ఆ మాధవీదేవి యిట్లడుగగా మాధవుడు నవ్వి ఇట్లు చెప్ప మొదలిడెను.

ఏవ మేత న్మహాభాగే యథా త్వం భీరు భాషసే,

కథయిష్యామి తే సర్వం ధర్మం సంసార మోక్షణమ్‌. 6

పుణ్యాత్మురాలా! నీవు పలికినట్లే సంసారమునుండి ముక్తిని ప్రసాదించు ధర్మము నంతటిని చెప్పెదను.

గతే మేఘాగమే దేవి ప్రసన్న శరదాగమే,

అంబరే విమలే జాతే విమలే శశిమండలే. 7

నాతిశీతే చ నాత్యుష్ణే కాలే హంసవిరావిణి,

కుముదోత్పల కహ్లార పద్మసౌరభ నిర్భరే. 8

కుముదస్యతు మానస్య భ##వేద్‌ యా ద్వాదశీ శుభా,

తస్యాం మామర్చయేద్‌ యస్తుప్రభావం తం శృణు ప్రియే. 9

వర్షర్తువుగడచిన తరువాత ప్రసన్నమగు శరత్కాలము రాగా ఆకాశము నిర్మలమై చంద్రబింబము స్వచ్ఛమైయుండగా, ఎక్కువచలి ఎక్కువవేడి లేనికాలమున హంసల మధుర నాదములు వినవచ్చు వేళ కార్తీక మాసము శుక్లపక్షమున ద్వాదశినాడు నన్నర్చింపవలయును. ప్రభావమును వినుము.

యావల్లోకాశ్చ ధార్యన్తే తావత్కాలం వసుంధరే,

మద్భక్తో జాయతే ధన్యో నాన్యభక్తః కదాచన. 10

వసుంధరా! లోకములన్నియు నిలుచుకాలము దాక నాభక్తుడు ధన్యుడై యుండును. అన్య భక్తుడట్లెన్నటికిని కాడు.

కృత్వా మమైవ కర్మాణి ద్వాదశ్యాం తత్ర మాధవి,

మమై వారాధనార్థాయ ఇమం మన్త్రముదీరయేత్‌. 11

ఆ ద్వాదశియందు పూజాకార్యములన్నియు చేసికొని నా ఆరాధన కొఱకు ఈ మంత్రమును పఠింపవలయును.

మంత్రః - మంత్రము.

బ్రహ్మణా రుద్రేణ చ యః స్తూయమానో భగవానృషిః

వవ్దితో వన్దనీయః ప్రాప్తా ద్వాదశీయం తే. 12

బ్రహ్మరుద్రులు స్తుతించు ఆ భగవంతుడు ఋషి వందితుడు, వన్దనీయుడు. స్వామీ! ఈ ద్వాదశి తిథి ప్రాప్తించినది.

ప్రబుద్ధ్యస్వ జాగ్రతో లోకనాథ మేఘా గతాః,

నిర్మలః పూర్ణ శ్చన్ద్రః శారదాని పుష్పాణి లోకనాథ,

తుభ్యమహం దదామీతి ధర్మహేతో స్తవ ప్రీతయే. 13

దేవా! లోకనాథా! మేల్కొనుము. మేఘములు వెడలిపోయినవి చంద్రుడు నిండుగా నిర్మలుడైయున్నాడు. నీవు ధర్మముకు హేతువవు. అట్టినీకై శరత్కాలపు పూవులను సమర్పించు కొందును.

ప్రబుద్దం జాగ్రతం లోకనాథ త్వాం భ్రాజమానం యజ్ఞేన,

యజన్తే సత్రే సత్రిణో వేదైః పఠన్తి భాగవతాః.

శుద్ధాః ప్రబుద్ధా జాగ్రన్తో లోకనాథ. 14

లోకనాథా! మేల్కొని మెలకువతో ప్రకాశించుచున్న నిన్ను యజ్ఞముతో యజించుచున్నారు. భాగవతులు వేదములతో నిన్ను కొనియాడు చున్నారు. పరిశుద్ధులు, మేల్కొన్నవారు, నీ యెడల జాగరూకత కలవారునై నిన్నర్చించుచున్నారు.

ఏవం కర్మాణి కుర్వీత ద్వాదశ్యాం వై యశస్విని,

మమ భక్త వ్రతశ్రేష్ఠం తే యాన్తి పరమాం గతిమ్‌. 15

ఇట్లు ద్వాదశినాడు నాభక్తులు మిక్కిలి శ్రేష్ఠమైన వ్రతమును, పూజాకార్యమలను చేయవలెను. దాని వలన పరమగతి పొందుదురు.

ఏవం వై శారదం కర్మ నిఖిలం కథితం మయా,

దేవి సంసారమోక్షార్థం మమ భక్త సుఖావహమ్‌. 16

దేవీ! శరత్కాల పూజావిధానమును సర్వమును ఇట్లు నీకు తెలిపితిని. ఇది భక్తునికి సంసారమోక్షమును కలిగించును. సుఖమునకు తావలమగును.

అన్యచ్చ తేప్రవక్ష్యామి శైశిరం కర్మ శోభనమ్‌,

యాని కర్మాణి కుర్వన్తః పుంసో యాన్తి పరాంగతిమ్‌. 17

దేవీ! నీకు మరియొక విషయము చెప్పెదను. అది శుభ##మైన శిశిరర్తు పూజనము. ఆ పనులు భక్తితో చేయ మానవులు పరమగతి నందుదురు.

శీత వాతాభి సంతస్తా మమ భక్తా వ్యవస్థితాః,

అనన్యమనసో భూత్వా యోగాయ కృతనిశ్చయాః. 18

శిశిరే యాని కర్మాణి పుష్పితాశ్చ వనస్పతీః

తైరేవ చార్చనం కృత్వా జానుభ్యాం పతితః క్షితౌ,

కరాభ్యా మంజలిం కృత్వా ఇమం మన్త్ర ముదీరయేత్‌. 19

చలి ఈదురుగాలి అనువానికి పీడనొందిన వారయ్యు నాభక్తులు చెదరని హృదయముతో యోగము కొఱకు నిశ్చయము చేసికొని శిశిరమున చేయవలసిన పనులను వివరించెదను. మోకాళ్లపై నిలిచి చేతులను జోడించి ఈ మంత్రమును పఠింపవలయును.

శిశిరో భవాన్‌ ధర్త లోకనాథ హిమం దుస్తరం,

దుష్ప్రవేశం కాలం సంసారాన్మాం తారమేమం ధర్త త్రిలోకనాథ. 20

లోకనాథ! ఈ శిశిరర్తువు మంచుతో గడపశక్యము కానిది. చొరరాని కాలము ఇట్టి సంసారమునుండి నన్ను తిరంపజేయుము. నన్ను చేపట్టుము.

యస్త్వ ధైతేన మన్త్రేణ శిశిరే కర్మ కరయేత్‌,

స గచ్ఛేత్‌ పరమాం సిద్ధిం మమ భక్తి వ్యవస్థితః. 21

నా భక్తి యందు స్థిరముగానిలిచి శిశిరమున ఈ మంత్రముతో పూజ చేయువాడు పరమసిద్ధి పొందును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

మాసం మార్గశిరం చైవ వైశాఖం చ మమ ప్రియమ్‌. 22

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. మార్గశిరవైశాఖ మాసములు నాకు మిక్కిలి ప్రియములైనవి.

అహం తత్ర ప్రవక్ష్యామి పుష్పాదీనాం చ యత్ఫలమ్‌,

నవవర్ష సహస్రాణి నవవర్ష శతాని చ. 23

తిష్ఠతే విష్ణులోకేస్మిన్‌ ప్రదదాతి సునిశ్చలమ్‌,

ఏకైకం గన్ధపత్రంచ దాన మేతన్మహత్ఫలమ్‌.

మతిమాన్‌ ధృతిమాన్‌ భూత్వా గంధపత్రం హి దాపయేత్‌ 24

నేనిపుడు ఆ ఋతువు నందలి పుష్పాదుల ఫలమును వివరింతును. గంధపత్రమను పూవును నాకు ఈ కాలమున సమర్పించువాడు తొమ్మిదివేల తొమ్మిది వందల ఏండ్లు బుద్ధి ప్రజ్ఞలు కలవాడై విష్ణులోకమున నిశ్చలముగా నిలుచును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి గంధపత్రస్య యత్ఫలమ్‌,

ద్వాదశ్యాం చైవ యో దద్యాత్‌ త్రీన్‌ మాసాంశ్చ సమాహితః 25

కౌముదస్యతు మాసస్య మార్గశీర్షస్య వై తథా,

వైశాఖస్యతు మాసస్య వనమాలాం సుపుష్పితామ్‌. 26

ఏకచిత్తం సమాధాయ గంధపత్రాణి యోన్యసేత్‌,

వర్షాణి ద్వాదశేవైహ కృతా గన్ధేన పూజితా. 27

మరియొక విషయము చెప్పెదను. కార్తీకము, మార్గశిరము వైశాఖము అనుమూడు నెలలు ఏకాగ్రచిత్తముతో ద్వాదశినాడు నాకు గంధపత్రపుష్పములను సమర్పించినచో పండ్రెండు సంవత్సరములు నాకు ఆ పూలతో పూజ చేసినట్లగును.

శాలపుష్పేణ మిశ్రేణ కౌముద్యాం గన్ధనేన చ,

మాసి మార్గశిరే భ##ద్రే దద్యా దుత్పల మిశ్రితమ్‌,

ఏవం మహత్ఫలం భ##ద్రే గంధపత్రస్య కారయేత్‌. 28

కార్తీకమున గంధపత్రముతో శాలపుష్పములను కలిపి అర్చింపవలయును. మార్గశిరమున కలువపూవులతో కలిపి అర్చింపవలయును. అదిమహాఫలము నొసగును.

శ్రుత్వేతి వచనం తస్య ప్రశ్రయేణ తు మాధవీ,

ప్రహస్య ప్రణయాద్‌ వాక్య మువాచ మధుసూదనమ్‌. 29

మాధవుని యిల్లాలు భూదేవి ఈ మాట విని చనవుతో మెల్లగా నవ్వి మధుసూదనునితో ఇట్లు పలికెను.

ఏతే ద్వాదశమాసాశ్చ షష్ట్యుత్తర శతత్రయమ్‌,

సంపూర్ణ వత్సరే దేవ ద్వౌ మాసౌ కిం ప్రశంససి,

ద్వాదశీం చాపి దేవేశ ప్రశంససి సదా మమ. 30

నిండువత్సరమున మూడువందల అరువది దినములలో ఇవి పండ్రెండు నెలలు కాగా నీవు రెండేమాసములను ఏల పోగడుచున్నావు. అట్లే ద్వాదశిని కూడ ఎల్లప్పుడు నాముందు ఏల పెద్ద చేయుచున్నావు?

ఇతి పృష్ట స్తదా దేవ్యా ధరణ్యా సతు మాధవః,

ప్రహస్య తామువాచేదం వచనం ధర్మసంశ్రితమ్‌. 31

ఇట్లు భూదేవి తన్నడుగగా మాధవుడు నవ్వి ధర్మముతో కూడిన వాక్యము నిట్లు పలికెను.

శృణు తత్వైన మే దేవి యేనేమౌ మమ చ ప్రి¸°,

తిథీనాం ద్వాదశీ చాపి సర్వయజ్ఞ ఫలాధికా. 32

దేవీ! ఈ రెండు నెలలును నాకెందుకు మిక్కిలి ప్రియుములైనవో తత్త్వముతో చెప్పెదను. వినుము. తిథులలో ద్వాదశి సర్వజ్ఞముల ఫలముల కంటె మిన్న అయినది.

దత్త్వా ద్విజసహస్రేభ్యో యత్ఫలం ప్రాప్నుయాన్నరః,

తదేకం సంప్రదాయైవ ద్వాదశ్యా మఖివిన్దతి. 33

వేలకొలది బ్రాహ్మణులకు దానమొసగిన ఫలమంతటిని ద్వాదశినా డిచ్చి పొందును.

కౌముద్యాం చ ప్రబుద్ధోస్మి వైశాఖ్యాంత్వం సముద్ధృతా,

మహాదానాధిక యోగ స్తేనైతత్‌ ప్రభవో ధరే. 34

నేను కార్తీకమున మేల్కొంటిని. వైశాఖమున నిన్నుద్ధరించితిని. కనుక ఈ యోగము మహాదానముల కంటె గొప్పది. అందువలన వీనికి ఈ ప్రభావము కలిగినది.

అతః కౌముదికాయాం తు వైశాఖ్యాం యతమానసః,

గంధపత్రం కరే గృహ్య ఇమం మన్త్ర ముదీరయేత్‌. 35

అందువలన కార్తీకమునందును, వైశాఖమునందును మనస్సును నిగ్రహించుకొని గంధపుష్పమును చేతదాల్చియీ మంత్రమును ఉచ్చరింపవలయును.

భగవన్నాజ్ఞాపయ;-

ఇమం బహుతరం నిత్యం వైశాఖం చైవకార్తికమ్‌,

గృహాణ గంధపుష్పాణి ధర్మమేవం ప్రవర్ధయ,

నమో నారాయణత్యుక్త్వా గంధపత్రం ప్రదాపయేత్‌. 36

భగవంతుడా! ఆనతిమ్ము. ఇది మిక్కిలి గొప్పకాలము. వైశాఖము, కార్తీకము. ఈ గంధపుష్పములను స్వీకరింపుము. ధర్మమును వృద్ధిపరపుము. అనిపలికి ఓంనమో నారాయణాయ అని గంధపత్రమును సమర్పింపవలయును.

పుష్పాణం చ ప్రవక్ష్యామి యో గుణో యచ్చవైఫలమ్‌,

దత్త్వా వై గంధపత్రాణి మమ భ##క్తేషు సుందరి.

క్రమికం సుమనో గృహ్య ఇమం మన్త్ర ముదీరయేత్‌. 37

గంధపత్రపుష్పములను సమర్పించుట వలన నా భక్తులకు కలుగు గుణమును ఫలమును తెలిపెదను. ఆ పుష్పమును గ్రహించి ఈ మంత్రమును పఠింపవలయును.

మన్త్రః - భగవన్నాజ్ఞాపయతి.

సుమనో భగవన్‌ సర్వాన్‌ విశుద్ధాత్మా సునిశ్చితాః,

గృహ్ణీష్వ సుమనస్కేన దేవదేవ సుగన్ధికాః. 38

మంత్రము - భగవంతుడాజ్ఞాపించుచున్నాడు. విశుద్ధములగు ఆత్మకల చక్కని నిశ్చయజ్ఞానము కల ఓ భగవంతుడా! మంచిపరిమళముగల ఈ పుష్పమును స్వీకరింపుము.

ప్రాప్నోతి దదమానస్తు మమ కర్మపరాయణః,

న జన్మమరణం చైవ న గ్లానిం నచ వై క్షుధామ్‌,

దివ్యం వర్షసహస్రం వై మమ లోకేషు తిష్ఠతి. 39

నా పూజయందు పరమశ్రద్ధగలిగి నాకిట్లు పుష్పము నర్పించువాడు వేయి దివ్యవర్షములు, పుట్టుక, చావు, అలసత, ఆకలి అనునవి లేక నాలోకములయందు నివసించును.

ఏకైకస్య తు పుష్పస్య పుణ్య మేత న్మహత్ఫలమ్‌,

సుమనో గంధ సంభూతం యత్త్వయా పరిపృచ్ఛితమ్‌. 40

దేవీ! ఒకొక్కక్క పుష్పము యొక్క పుణ్యము, మహాఫలము అనువానిని నీవడిగినదానికి సమాధానముగా చెప్పితిని.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వావింశత్యధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది రెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters