Varahamahapuranam-1    Chapters   

త్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పదియవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు చెప్పెను.

దన్త కాష్ఠ మఖాదిత్వా యో హి మా ముపసర్పతి,

పూర్వకాలకృతం కర్మ తేన చైకేన నశ్యతి. 1

ఉదయమున పలుదోముపుల్ల నుపయోగింపక (పండ్లు తోముకొనక) నా కడకు వచ్చువాని పూర్వపుణ్య మంతయు ఆ ఒక్కపాపముతో నశించును.

నారాయణవచః శ్రుత్వా పృథివీ ధర్మసంస్థితా,

విష్ణుభక్త సుఖార్థాయ హృషీకేశ మువాచ హ. 2

నారాయణుని మాట విని ధర్మమునందు నిలుకడ గల భూదేవి విష్ణుభక్తుల సుఖముకొరకై విష్ణువుతో నిట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

సర్వకాలకృతం కర్మ క్లేశేన మహతానఘ,

కథ మేకాపరాధేన సర్వ మేవ ప్రణశ్యతి, 3

ఎంతో కష్టపడి సంపాదించిన సర్వకాలసంబంధమగు పుణ్యమంతయు ఒక్క తప్పుతో ఎట్లు నశించును?

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు సుందరి తత్త్వేన కథ్యమానం మయానఘే,

యేన చైకాపరాధేన పూర్వకర్మ ప్రణశ్యతి. 4

సుందరీ! ఒక్క తప్పుచేత పూర్వపుణ్య మంతయు ఎట్లు నశించునో నేను చెప్పెదను. వినుము.

మనుష్యః కిల్బిషీ భ##ద్రే కఫపిత్తసమన్వితః,

పూయశోణిత సంపూర్ణం దుర్గన్థి ముఖమస్య తత్‌. 5

మనుష్యుడు సహజముగా దోషములు కలవాడు. కఫము, పిత్తములతో కూడినవాడు. కుళ్ళిన రక్తముతో నిండిన ఆతని ముఖము చెడువాసన కలదియై యుండును.

న సహే దుచితం దేవి దన్తకాష్ఠస్య భక్షణాత్‌,

శుద్ధిం భాగవతీం చైవ ఆచారేణ వివర్జితామ్‌. 6

పలుదోముపుల్లను వాడుటవలన, ఆదోషము నిలువదు. ఆచారము వదలిని భక్తునికి శుద్ధి కలుగును.

ధరణ్యువాచ - ధరణి యిట్లనెను.

దన్తకాష్ఠ మఖాదిత్వా యః కర్మాణి కరోతి తే,

ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి యేన ధర్మం న నశ్యతి. 7

పలుదోముపుల్లను నమలక నీ పూజాకర్మముల నాచరించు వానికి ప్రాయశ్చిత్తమేమి? దేవనివలన నాతని ధర్మము నశింపకుండును? నాకు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవు డిట్లు పలికెను.

ఏవ మేత న్మహాభాగే యన్మాం త్వం పరిపృచ్ఛసి,

కథయిష్యామి తే హీదం యథా శుద్ధ్యన్తి మానవాః. 8

పుణ్యాత్మురాలా! నీవు నన్నడిగినదానికి సమాధానముగా మానవు లెట్లు శుద్ధి పొందుదురో చెప్పెదను.

ఆకాశశయనం కృత్వా దినాని ద్వే చ పఞ్చ చ,

అభుక్త్వా దన్తకాష్ఠస్య ఏవం శుద్ధ్యతి మానవః. 9

ఏడుదినములు ఆకాశశయనము చేసినచో పలుదోమని పాపమునుండి మానవుడు శుద్ధి పొందును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న తసై#్య వాపరాధోస్తి ఏవ మేవ న సంశయః. 10

ఈ విధానముతో ప్రాయశ్చిత్తమొనరించిన వానికి దోషము కలుగదు. సంశయము లేదు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రింశదిధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పదియవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters