Varahamahapuranam-1    Chapters   

ద్వాత్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పది రెండవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

స్పృశ్యమానోథ మాం భూమి వాతకర్మ ప్రముఞ్చతి,

పురీష సదృశం వాయుం వాయు పీడితమానసః. 1

మక్షికా పఞ్చవర్షాణి త్రయోవర్షాణి మూషకః,

శ్వా చైవ త్రీణి వర్షాణి కూర్మో వై జాయతే నవ. 2

భూదేవీ! నన్ను తాకుచు మలమువంటి అపానవాయువును వదులువాడు, వాయువుచే పీడింపబడిన మనస్సు కవలవాడై అయిదేండ్లు ఈగయై, మూడేండ్లు ఎలుకయై, మూడేండ్లు కుక్కయై, తొమ్మిదేండ్లు తాబేలై పుట్టును.

ఏష వై తాపనం దేవి మోహనం మమ సాంప్రతమ్‌,

యో వై శాస్త్రం విజానాతి మమ కర్మ పరాయణః,

శ్రుత్వా వాక్యం హృషీకేశం ప్రత్యువాచ వసుంధరా. 3

ఈ పాపమునకు ఇది నేను విధించెడు శిక్ష. ఈతప్పు చేసినవాడు శాస్త్ర మెరిగినవాడు, నా భక్తుడైనను ఇదియే అతనికి శిక్ష.

ఈ మాట విని భూదేవి హృషీకేశునితో ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

అతులం కర్మ కృత్త్వైవ తవ కర్మ పరాయణః,

తేషాం దేవ సుఖార్థాయ విశుద్ధిం వక్తు మర్హసి. 4

నీ భక్తులు సరికాని పనిచేసి పరిశుద్ధి నెట్లు పొందుదురు? అట్టి వారి సుఖము కొఱకు దీనిని నిన్నడుగుచున్నాను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

శృణు కార్త్స్నే మే దేవి కథ్యమానం మయానఘే,

అపరాధ మిమం కృత్వా సంతరేద్‌ యేన కర్మణా. 5

దేవీ! పుణ్యురాలా! ఏ పనిచేసి ఈ దోషము నుండి దాటుదురో దానిని మొత్తముగా చెప్పుచున్నాను. వినుము.

యావకేన దినత్రీణి నక్తేన చ పునస్త్రయః,

కర్మ చైవం తతః కృత్వా స చ యే నా పరాధ్యతి,

సర్వసఙ్గం పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి. 6

అలసందల పిండితో మూడు దినములు, రాత్రి భోజనముతో మూడు దినములు కడపి ప్రాయశ్చిత్తము చేసికొనువాడు నాకు దోషము చేయనివాడు అగును. అన్ని అంటులను వదలివైచి నాలోకమున కరుగును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే మరుత్కర్మాపరాధినమ్‌,

దోషం చైవ గుణం చైవ యత్‌ త్వయా పరిపృచ్ఛితమ్‌. 7

మంచిదానా! మలవాయువునకు సంబంధించి అపరాధము చేసిన వాని దోషమును, ప్రాయశ్చిత్తము వలన కలుగు గుణమును నీకు చెప్పితిని.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వాత్రింశదధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పది రెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters