Varahamahapuranam-1    Chapters   

అష్టత్రింశ దధిక శతతమోధ్యాయః - నూట ముప్పది యెనిమిదవ అధ్యాయము

సూత ఉవాచ - సూతు డిటుప్పెను.

ఏతత్‌ పుణ్యం తతః శ్రుత్వా రమ్యే సౌకరకే తథా,

గుణస్తవం చ మాహాత్మ్యం జాత్యానాం పరివర్తనమ్‌. 1

తతః కమలపత్రాక్షీ సర్వధర్మవిదాం వరా,

విస్మయం పరమం గత్వా నివృత్తే నాన్త రాత్మనా,

పునః పప్రచ్ఛ తం దేవం విస్మయావిష్టమానసా. 2

సౌకరక తీర్థమునందలి ఈ పుణ్యమును, గుణస్తుతిని, మాహాత్మ్యమును, జాతుల మార్పును విని కమలపత్రాక్షి, సర్వ ధర్మములనెరిగిన వారిలో మిన్న అయిన భూదేవి పరమాశ్చర్యమును పొంది, ఆనందమందిన అంతరంగముతో మరల ఆ దేవునిట్లడిగెను.

అహో తీర్థస్య మాహాత్మ్యం క్షేత్రే సౌకరకే తవ,

అకామాన్ర్మియమాణస్య మానుషత్వ మజాయత. 3

ఆహా! ఏమీ నీ సౌకరక క్షేత్రమునంది ఈ తీర్థమహిమ! కోరక మరణించిన దానికిని మనుష్యత్వము సిద్ధించినది.

కిం చాన్యం పరం దేవ వృత్తం సౌకరకే పునః,

తన్మమాచక్ష్వ తత్త్వేన పరం కౌతూహలం హి మే. 4

దేవా! సౌకరమునందు జరిగిన మరియొక వింత ఏదైన నున్న నాకు తెలుపుము. నాకు వినువేడుక మిక్కుటముగా నున్నది.

లిప్యమానస్య కింపుణ్యం గోమయస్య చ కింఫలమ్‌,

సలిం దీయమానస్య పుణ్యం కీదృశ ముచ్యతే. 5

అచట నేల అలికిన దాని పుణ్యవిశేషమెట్టిది? ఆవుపేడ ఫలమేమి? నీటినొసగినచో కలుగు పుణ్యమెటువంటిది?

యో భువం మార్జయేద్‌ దేవ తవ కర్మపరాయణః,

మనసా హృష్టతుష్టేన తస్య పుణ్యంతు కింభ##వేత్‌. 6

దేవ! నీభక్తుడు నిండారు సంతోషము గల మనస్సుతో అచటి నేలను ఊడ్చినచో దాని పుణ్యమెట్టిదగును?

గీయమానే చ కిం పుణ్యం వాద్యమానే చ కిం ఫలమ్‌,

నృత్యతః కిం భ##వే త్పుణ్యం జాగ్రమాణస్య కిం ఫలమ్‌. 7

అచట పాడినచో, వాద్యములు మ్రోయించినచో, నృత్యము చేసినచో, జాగరణము చేసినచో కలుగు ఫలమెట్టిది?

ఉపాహార్యేణ పుష్పేణ చాన్యేన కర్మణన చ,

కాం గతిం తే ప్రపద్యన్తే నానాపుష్పోపహారిణః. 8

పుష్పమును భక్తితో ఒసగినచో అనేక పుష్పముల మాలలను కానుకగా ఇచ్చినచో, అట్టివా రేగతి పొందుదురు?

ఏతన్మే పరమం గుహ్యం మమ యద్‌ హృది వర్తతే,

తవ భక్త సుఖార్థాయ తద్‌భవాన్‌ వక్తు మర్హతి. 9

ఈ పరమ రహస్యము నెరుగుకోరిక నా హృదయమున నున్నది. భక్తుల సుఖము కొరకై దీనిని నీవు చెప్పవలయును.

తతో మహ్యా వచః శ్రుత్వా సర్వదేవమయో హరిః,

ఉవాచ మధురం వాక్యం ధర్మకామాం వసుంధరామ్‌. 10

అంత భూదేవి పలుకు విని సర్వదేవమయుడగు హరి ధర్మకామ అయిన వసుంధరతో తీయగా నిట్లు పలికెను.

శృణు సుందరి తత్త్వేన యన్మాం త్వం పరిపృచ్ఛసి,

సర్వం తే కథయిష్యామి పుణ్యం గుహ్యం సుఖావహమ్‌. 11

సుందరి! నన్ను నీవడిగిన దానికి ఉన్నదున్నట్లు, బదులు చెప్పెదను. ఆ పుణ్యమెట్టిదో, అది రహస్యమైనను, సుఖమును కలిగించునది,కనుక అంతయు నీకు తెలిపెదను.

తస్మిన్‌ సౌకరకే చైవ శరది శఞ్జరీటకః,

కీటాం శ్చైవ పతఙ్గాంశ్చ భక్షితుం సచ గృహ్ణతి. 12

ఆ సౌకరకక్షేత్రమున శరత్కాలమున కాటుక పిట్ట యొకటి పురుగులను పక్షులను తినుటకు పట్టుకొనుచుండెను.

ఆహారస్య చ దోషేణ తతోజీర్ణేన పీడితః,

తతో విహ్వల నిశ్చేష్టో మరణ కృతనిశ్చయః,

అజీర్ణస్య తు దోషేణ స తు పఞ్చత్వ మాగతః. 13

ఆహార దోషము చేత అజీర్ణముతో బాధపడినదై గిలిగిలలాడి స్పృహతప్పి అది చనిపోవుటకు నిశ్చయించెను. అజీర్ణ దోషము చేత చనిపోయెను.

ఖంజరీటం చ తం దృష్ట్వా బాలకాః క్రీడితుం గతాః,

గృహ్య క్రీడావసానేన తే రమన్తి యథా తథా. 14

ఆ పిట్టను చూచి అచట ఆడుకొనుటకు వెళ్ళిన బాలకులు, ఆటలు ముగిసిన పిదప దానిని పట్టుకొని యిష్టము వచ్చినట్లు కదలింపసాగిరి.

అన్యోన్యం తు తతో బాలాః పక్షా నేవ చ జానతః,

మమ భ##వేతి చోచ్యన్తే తేషాం వై జాయతే కలిః. 15

అంత నా బాలురు దాని రెక్కలను తీసికొన దలచినవారై, నాదినాది అని పలుకుచు వారిలో వారు కలహమాడజొచ్చిరి.

తత ఏకేన బాలేన గృహీత్వా ఖఞ్జరీటకమ్‌,

యుష్మాకం నాభవత్‌ తత్ర ప్రాక్షిపజ్జాహ్నవీజలే. 16

అంత ఒక బాలుడు ఆ పక్షిని పట్టుకొని ఇది మీది కాదనుచు గంగనీటిలో దానిని విసరివైచెను.

తత ఆదిత్యతీర్తేషు యన్మయా పూర్వకీర్తితమ్‌,

పతితః సలిలే గాజ్గే జలప్రక్లిన్నపక్షకః. 17

నేను నీకు మునుపు వివరించి చెప్పన ఆదిత్యతీర్థమునందు గంగనీటిలో పడి అది నీటితో తడసిన రెక్కలు కలదాయెను.

వైశ్యస్య తు గృహే జాతో అనేక క్రతుయాజినః,

ధనరత్న సమృద్ధే తు రూపవాన్‌ గుణవాన్‌ శుచిః,

విశుద్ధశ్చ పవిత్రశ్చ మద్భక్తశ్చ వసుంధరే. 18

వసుంధరా! అంత ఆ పక్షి పెక్కు యజ్ఞములాచరిలంచు వైశ్యుని యింట, ధనరత్నములు నిండుగా గల చోట, రూపవంతుడు, గుణవంతుడు, పవిత్రుడు, విశుద్ధుడు నగు నాభక్తుడై జన్మించెను.

అథ తం జాతమాత్రం వైవర్షా గచ్చన్తి ద్వాదశ,

తతో మాతపితుశ్చైవ సబాలః ప్రత్యభాషత. 19

అతడు పుట్టిన పండ్రెండేండ్లు గడచిన పిమ్మట ఒకనాడు ఆతడు తలిదండ్రలలో ఇట్లు పలికెను.

తతో హ్యేకమనా శ్చన్త్య యన్మయా హృది వర్తతే,

మత్ర్పియం యది జానీత ఏకో మే దీయతాం వరః. 20

అతడు మనసు కుదుట పరచుకొని, నా ప్రియము నెరిగిన వారైనచో నాహృదయమున నున్న దానిని చెప్పెదను. నాకొక వరము నొసగవలయును.

న చాహం వారణయో వై పిత్రా మాత్రా కదాచన,

సత్యం శపామి గురుణా యథానను కృతం భ##వేత్‌. 21

నన్ను అమ్మగాని, నాన్నగాని ఎన్నటికి వారింపరాదుప. గురువుపై ఒట్టువేసి చెప్పుచున్నాను. అది మీ రంగీకరించినట్లే భావింతును.

పుత్రస్య వచనం శ్రుత్వా దమ్పతీ చోభయం తథా,

ఉవాచ చ శుభం వాక్యం బాలం కమలలోచనమ్‌. 22

కొడుకు పలుకు విని ఆ దంపతులిద్దరు, కమలముల వంటి కన్నులుగల ఆ బాలునితో మేలైన పలుకునిట్లు పలికిరి.

యద్యత్త్వం వక్షసే వత్స యత్త్వయా హృది వర్తతే,

సర్వం తం కారయిష్యామ ఏవ మేతన్న సంశయః. 23

తండ్రీ! నీ మనసున నున్నదేదో, నీవేమి చెప్పుదువో దానినంతిని చేయుదుము. ఇందు సంశయము లేదు.

వింశద్‌ గానః సహస్రాణి సర్వాశ్చ శుభదోహనాః,

యత్ర యద్‌ రోచతే పుత్ర దరాహి త్వమవారిత్తె. 24

చక్కని పాలిచ్చెడు ఇరువది వేలగోవులు మనకు కలవు. ఎచట ఏది నీకిష్టమగునో అచట దానిని దానమిమ్ము. నీకడ్డు చెప్పము.

పునరన్యం ప్రవక్ష్యావఆవయోః శృణు పుత్రక,

వైవ్యా వై వాణికర్మాణి వాణిజం కిం భవిష్యతి,

పుత్ర మిత్రాణి వర్ధన్తే పృష్ఠతం సహక్రీడితమ్‌. 25

నాయనా! మరియొకమాట చెప్పదము. మామాటలు వినుము. మనము వైశ్యులము. వర్తకము మనవృత్తి. అది ఏమగును? నీ వెనుకబడి ఆడుకొనెడి మిత్రులు పెరిగిపోవుచున్నారు.

తత్‌ కురుష్వ యథాన్యాయం మిత్రేభ్యో దీయతాం ధనమ్‌,

ధనధాన్యాని రత్నాని దేహి పుత్ర న వారితః . 26

కనుక తగు విధముగా మిత్రులకు ధనమొసగుము. ధనములను, ధాన్యములను, రత్నములను ఇమ్ము. నీకు అడ్డు లేదు.

కన్యావై రమణీయాశ్చ స్వజాతీని శుభాని చ,

ఆనయిష్యావ భద్రంతే ఉద్వాహేన క్రమేణ చ. 27

చక్కని అందచందములు గల మనకులపు కన్నెలు కలరు. వారిని తీసికొని వచ్చెదము. క్రమముగా పెండ్లియాడుము.

యదిచ్ఛసి పునశ్చాన్యం యజ యజ్ఞె ర్హిపుత్రక,

విధినా పూర్వదృష్టేన వైశ్యాయేన యజన్తిచ. 28

లేక నీవు కోరుదువేని వైశ్యులు చేసెడు యజ్ఞములను శాస్త్ర పూర్వకముగా చేసి దేవతలను పూజింపుము.

అష్టౌ సంపూర్ణధుర్యాణాం హలానాం తావతాం శతమ్‌,

వైశ్య కర్మణ్యు పాదాయ కిం పునః కృషి మిచ్ఛసి. 29

ఎనిమిది వందల నిండు బలముగల ఎద్దులు గలనాగళ్ళు మనకు గలవు. వ్యవసాయము వైశ్యకర్మము కనుక వానిన గొని సేద్యము చేయగోరుదువా?

యావన్త మివ భాషన్తి అతిథీన్‌ భోజయిష్యసి,

యావద్‌ భోజనతృప్తాన్‌ వాద్విజా నిచ్ఛసి తర్పితుమ్‌ ,

సర్వం నిజేచ్ఛయా పుత్ర కర్తు మర్హసి సాంప్రతమ్‌. 30

ఎందరు నీతో మాటాడుదురో అందరు అతిథులకు అన్నమిడుదువా? భోజనముతో తృప్తిపడిన బ్రాహ్మణులకు దనము లిచ్చి తృప్తిపరుతువా? నీ యిష్టము ననుసరించి అది. అంతయు నీవు చేయవలచ్చను.

పితృమాతృవచః శ్రుత్వా సబాలో ధర్మసంశ్రుతః,

ఉభౌ చ చరణౌ గృహ్య పితామాత్రోః పునర్ర్బవీత్‌. 31

ధర్మమును చక్కగా వినియున్న ఆ బాలకుడు తలిదండ్రుల మాటలు విని వారిరువుది చరణములు పట్టుకిని మరల ఇట్లు పలికెను.

గోప్రదానే న మే కార్యం మిత్రం చాపి న చిన్తితమ్‌,

కన్యాలాభే న చే చ్ఛాస్తి నైవయజ్ఞఫలే తథా. 32

గోదానమున నాకు పనిలేదు. మిత్రములను గూర్చి నేను భావించుట లేదు. కన్యల పొందులో నాకు కోరికలేదు. యజ్ఞఫలము నందు ఆశ##లేదు.

నాహం వాణిజ్య మిచ్చామి కృషిగో రక్ష మేవచ,

న చ సర్వాతిథిత్వం వై మమ చిత్తే ప్రసజ్జతి. 33

వాణిజ్యమును నేనుకొరను. వ్యవసాయము, గోరక్ష నాకు పట్టవు. అతిథులందరిని మెప్పించుట నాహృదయమున ఉన్న విషయము కారు.

ఏకం మే పరమం గుహ్యం యన్మమేచ్ఛా ప్కకర్తతే,

చిన్తా నారాయణం క్షేత్రం గన్తుం సౌకరకం ప్రతి. 34

నాదైన పరమ రహస్యమొక్కటియే. దానియందే నా కోరిక తిరుగాడుచున్నది. శ్రీ నారాయణ క్షేత్రమైన సౌకరకమునకు పోవుటయే నాభావన.

తతః పుత్రవచః శ్రుత్వా మమ కర్మపరాయణః,

కరుణం పరిదేవన్తే రుద్తా వుభయో స్తథా. 35

నా అచ్చన యందు పరమానురాగము గల ఆ కుమారుని మాట విని అతిదీనముగా ఆ దంపతులు విలసింపదొడగిరి.

అద్య ద్వాదశవర్షాణి తవజాతస్య పుత్రక,

కిమిదం చిన్తితం వత్స త్వయా నారాయణాశ్రయమ్‌. 36

కొడుకా! నీవు పుట్టి పండ్రెండేండ్లే అయినది. ఇప్పుడే నీవు నారాయణుని ఆశ్రయమునకు పోవుచింత చేసితివి. ఇదియేమి?

చిన్తయిష్యసి భద్రంతే యదా తత్ర్పాప్నుయా వయః,

అద్యాపి భాజనం గృహ్య దావమానాస్మి పృష్ఠతః. 37

నీకు మేలగుగాక! ఆ వయస్సు వచ్చినప్పుడు తప్పక దానిని గూర్చి ఆలోచింపవచ్చును. ఇప్పటి నుండియే నీవెనుక భిక్షాపాత్రను గొని మమ్ములను పరుగెత్తమందువా?

కిమిదం చిన్తితం వత్స గమనే సౌకరం ప్రతి,

అద్యాపి తేన పశ్యన్తి ఫలం దత్తం మహౌజసమ్‌. 38

సౌకరమున కరుగు బావన ఇది ఏమి నాయానా! నీవకొసగిన గొప్పశక్తిగల ఔషదము మొదలగు వాని ఫలమైన మేము గాంచముకదా!

కిమిదం చిన్తితం వత్స వేలాతిక్రమభోజనే,

అకస్మాద్‌ బుద్ధి రుత్పన్నా క్షేత్రం నారాయణం ప్రతి. 39

చక్కగా అన్నము తినువేళ అతిక్రమించుచుండగా హఠాత్తుగా నారాయణక్షేత్రమునకు పోవు బుద్ధి నీకు పుట్టినది. ఇది ఏమి?

అద్యాపి తౌ స్తనౌ మహ్యం ప్రస్తుతస్తు దివానశమ్‌,

పుత్ర త్వత్స్పర్శనాశాయ కిమేత చ్చిన్తతం త్వయా. 40

ఈనాటికిని రాత్రింబవళ్ళు నా చన్నులు చేపుచున్నవి. బిడ్డా! అట్టి నీ స్పర్శను రూపుమాపెడు ఆలోచనను నీవేల చేయుచున్నావు?

రాత్రౌ సుప్తో సి వత్సత్వం శయ్యాసు పరివర్తితః,

అంబేతి భాససే ద్యాపి కథ మేతద్‌ విచిన్త్యతే. 41

రాత్రివేళ నిద్రించి పాన్పున పొరలాడుచు ' అమ్మా' అని సలుకుచుందువు.అట్టి నీ విట్లేల చింతించితివి?

స్పృశన్తి తవ నార్యోపి క్రీడమానస్తు పుత్రక,

పురుషాశచ విశాలాక్ష తవ రూపేణ విస్మితాః. 42

చిన్నినాయనా! నీవాటలాడు కొనుచుండగా నీ రూపమున కచ్చెరువడు స్త్రీలును, పురుషులను నిన్ను తాకుచుందురు.

అప్రియం నోక్తపూర్వం మేసంతుష్టేనాపి పుత్రక,

కస్య దోషాపరాధేన చిన్తితం గమనం తవ. 43

బాలకా! ఎప్పుడైన నీయెడల చిరాకు కలిగినను, నిన్ను నొప్పించెడు మాట ఇంతవరకు పలుకము. ఎవరిదోషము వలన నీవు వెళ్లిపోవుటకు చింతించితివి?

అపరాధం న విద్యేత పుత్ర క్షేత్రగృహేష్వపి,

వస్తుం స్వజనవత్‌ తత్ర పరుషం నైవ భాషితమ్‌. 44

ఇల్లు వాకిండ్లలో ఏ దోషము లేదు గదా! ఇంటిలోని వారెవ్వరు నీయెడల పరుషముగా పలుకురు కదా!

రుష్టే వా త్వయి పుత్రే హ ముచ్చతేపి చ యష్టికః,

పుత్ర హన్తుం న శక్నోమి త్వయా వాదా ప్రపీడితా. 45

ఎప్పుడైన నీపై కోపము వచ్చి చేత నొక కర్ర పట్టుకొనియు నిన్ను కొట్టుటకు నాకు మనసు వచ్చెడిదికాదు. నీ యందలి అనురాగము నన్ను ఉక్కిరిబిక్కిరి చేసెడిది.

తతో మాతు ర్వచః శ్రుత్వా స వైశ్యకుల నన్దనః,

ఉవాచ మధురం వాక్యం జనీనం సంవితవ్రతః. 46

అంత తల్లి మాటవిని ఆ వైశ్యకులనందనుడు తల్లితో మెల్లగా ఇట్లు పలికెను.

ఉషితోస్మి త్వదిఙ్గేషు అన్ధే గర్బేశయ స్తథా,

క్రీడితో స్మి యథాన్యాయం తవోత్సఙ్గే యశస్విని. 47

అమ్మా! నీ కడుపున పడుకొని నీ అంగములలో నిలిచి యుంటిని. నీ ఒడిలో ఆడుకొంటిని.

స్తనౌ హ్యేతౌ మయా పీతౌ లలితేన విజృంబితౌ,

అఙ్కం తవ సమారుహ్య పాంశుభి ర్గాత్ర గుణ్ఠితః. 48

చక్కగా పొగారెడు నీ స్తనములయందు నేను పాలుత్రావితిని. దుమ్ముకొట్టుకొన్న ఒడలితో నీ ఒడిలో నేను పొరలాడితిని.

అంబ మా చైవ కారుణ్యం కురు మ యత్సుతోన్ముఖమ్‌,

ముఞ్చ పుత్ర కృతం శోకం న మాం శోచితు మర్హసి. 49

అమ్మా! ఏడువకుము. పుత్ర దుఃఖమును విడిచ పెట్టుము. కొడుకు కోరికను తీర్పుము. నన్ను గూర్చి దుఃఖపడవలదు.

ఆయాన్తి చ పునర్యాన్తి గతా గచ్ఛన్తి చాపరే,

దృశ్యన్తే చ పునర్నష్టా న దృశ్యన్తే పునః క్వచిత్‌. 50

మనుజులు వచ్చుచున్నారు. పోవుచున్నారు. వచ్చిరి. కొందరు వత్తురు. ఇప్పుడు కన్పట్టుచున్నారు. మరల నశింతురు. తిరిగి ఎన్నటికిని కానరారు.

కుతో జాతః క్వ సంబంధ మలం త్వం చ పితా చ మే,

ఇమాం యోని మనుపరాప్తో ఘోరసంసారసాగరమ్‌. 51

ఎక్కడనుండి పుట్టితిని? ఏమి సంబంధము? నీవును తల్లివి. ఆయన తండ్రి. ఈ యోనిలో ఈ ఘోరసంసారసాగరములో పడితిని.

మాతాపితృ సహస్రాణి పుత్రదార శతాని చ,

జన్మజన్మని వర్తన్తే కుతస్తే కస్య వా వయమ్‌.

వేలకొలది తల్లిదండ్రులు, వందల కొలది భార్యలు కొడుకులు. ప్రతిజన్మమునందును ఇట్టి బంధములు గలుగుచునే యున్నవి. వారెక్కడివారో, మేమెవరి వారమో!

ఏవం చిన్తాం సమాసాద్య అంబ మా పరిశోచసి. 52

అమ్మా! ఈ విచారమును పోంది నీవు దుఃఖింపరాదు.

ఏవం శ్రుత్వా పితా మాతా విస్మయాత్‌ పునరూచతుః,

అహో బత మహద్‌ గుహ్యం కిమేతత్‌ తాత కథ్యతామ్‌. 53

ఇది విని తండ్రియు తల్లియు ఆశ్చర్యముతో మరల ఇట్లు పలికిరి. ఆయ్యో! ఏదో పెద్ద రహస్యము. నాయానా! చెప్పుము.

ఏతద్‌ వచన మాకర్ణ్య స వైశ్య కులబాలకః,

ఉవాచ మధురం వాక్యం జననీం పితరం తథా. 54

ఈ మాట విని ఆ వైవ్య కుల బలకుడు తల్లిదండ్రులతో మరల నిట్లనెను.

ది శ్రుతేన వై కార్యం గుహ్యేన పరినిశ్చయాత్‌,

తన్మాం ప్రక్ష్యతి తతో వై గత్వా సౌకరకం ప్రతి. 55

మిరు గట్టి నిర్ణయముతో ఈ రహస్యమును వినగోరుదు రేని సౌకరక్షేత్రమున కరిగి అచట నన్నడుగుడు.

అంబా చ జననీ మహ్యం కుక్షిణా యేన ధారితః,

తాతసార్థం తేన యామ క్షేత్రం సౌకరకం ప్రతి. 56

ఈ అమ్మ నన్ను కడుపున పెట్టుకొని కనినట్టిది. తండ్రితో పాటు మనము సౌకరక్షేత్రమున కరుగుదము.

తత్రాహం కథయిష్యామి మమ గుహ్యం మహౌజసమ్‌,

సూర్యతీర్తం సమాసాద్య యత్‌ తాత పరిపృచ్ఛసి. 57

అచట కరిగి నా గొప్పశక్తిగల గుట్టును తెలియ జేసెదను. సూర్యతీర్థమనను చేరుకొని, నాయానా! నీ వడిగిన దానిని చెప్పదను.

బాఢ మిత్యేవ తం పుత్రం దమ్పతీ పరిభాషితౌ,

గమనే కృతసంకల్పౌ తతః సౌకరకం ప్రతి. 58

ఆ దంపతులు అట్లే అని కొడుకుతో పలికి సౌకరక క్షేత్రమునకు పోవుటకై సంకల్పించిరి.

ఆద్య పక్షేణ వై పుత్ర కృతకృత్యో భవిష్యతి,

సర్వద్రవ్య సమాయుక్తోగమనే సౌకరం ప్రతి. 59

నాయానా! నీవు ఈ నెల మొదటి పక్షమున కృతకృత్యుడవు కాగలవు. అని వలసినవస్తు సామగ్రితో వారు సౌకరకక్షేత్రమునకు పయనమైరి.

తతః స పద్మపత్రాక్షః అభీరాణాం జనేశ్వరః,

గావో వింశత్సహస్రాణి ప్రేషయత్యగ్రతో ద్రుతమ్‌. 60

అంత ఆ పద్మపత్రములవంటి కన్నులు గల ఆ భీరప్రభువు (వైశ్యుడు) మందుగా వడివడిగా ఇరువదివేల గోవులను తరలించెను.

అగ్రేయయు స్తా గాః సర్వా ద్రవ్యేణ చ సమాయుతాః,

యచ్చ కిఞ్చీద్‌ గృహే వా స్త కృతం నారాయణం ప్రతి. 61

ఆ గోవులు ముందుగా తగుద్రవ్యములతో కూడినవై బయలు దేరినవి. ఇంటనున్న వస్తువు సమస్తము నారాయణునికి సమర్పితమైనది.

తతః పూర్వార్థమాసేన మాగమాసస త్రయోదశీమ్‌,

సర్వం స్వజన మామన్త్ర్య సంబంధం చ యథావిధి. 62

అంత మాఘ మాస శుక్ల పక్షమున త్రయోదశినాడు తమ వారికి, చుట్టములకుపోయి వత్తుమని చెప్పిరి.

ముహూర్తేన తు శుభ్రేణ గమనం కురుతే తతః,

స్నాత్వా చ కృతశౌచాయ నారాయణ ముదావమమ్‌. 63

స్నానము చేసి, శౌచకారయములు ముగించు కొని నారాయణునికి ప్రీతి యగునట్లుగా దోషములులేని ముహూర్తములన బయలు దేరిరి.

తేథ దేర్ఘేణ కాలేన మమ భక్త్యా వ్యవస్థితాః,

వైశాఖస్య తు ద్వాదవ్యాం మమక్షేత్ర ముపాగతాః. 64

అంత పెద్ద కాలమునకు నాయందు చెదరని భక్తి కలవారు వైశాఖ ద్వాదశినాడు నా క్షేత్రమును చేరుకొనిరి.

గఙ్గాయాం స్నాన్తి వై తత్ర క్షోమవస్త్ర విభూషితాః,

గావో వింశసహస్రాణి మమైవ ముపసాదయేత్‌. 65

గంగయందు స్నానముచేసిరి. శుభ్రమైన వస్త్రములను తాల్చిరి. ఇరువదివేల గోవులను నాకు సమర్పించిరి.

తత్ర భాఙ్గురసో నామ మమ కర్మ పరాయణః,

తేన తా గా గృమీతా వై విధిదృస్టేన కర్మణా. 66

అచట భాంగురసుడను నా భక్తుడు విధిపూర్వకముగా ఆ గోవులను నా కొరకై గ్రహించెను.

మత్తః స ప్రదదౌ తస్య వింశా గావో మహాధనాః,

మఙ్గల్యాశ్చ పవిత్రా శ్చ సర్వాశ్చ వరదోహనాః. 67

గొప్ప వెలగల యిరువది గోవులను శుభ##మైనవి, పవిత్రము లైనవి. ఎక్కువ పాలిచ్చునవి యగువానిని నా నుండి గ్రహించి ఆతడు దానమొసగెను.

ప్రదదౌ ధనరత్నాని నిత్యమేవ దినే దినే,

మోదతే సహ పుత్రేణ భార్యయా స్వజనేన చ. 68

ప్రతిదినము ధనములను, రత్నములను దానమిచ్చు చుండెను. ఇట్లు కుమారునితో, భార్యతో, తనవారితో ఆవైశ్యుడు ఆనందముగా కాలము గడపుచుండెను.

ఏవం తు వసత స్తస్య వర్షాకాల ఉపస్థితః,

ప్రావృడుపస్థితా తత్ర సన్య సస్య ప్రవర్థనీ. 69

ఇట్లచట అతడు నివసించుచుండగా వర్షాకాలము వచ్చెను. అన్నిపంటలను పెంపొందించు వర్షముల చనుదెంచెను.

పుష్పితాని కదంబాని కుటజార్జునకాని చ,

ఏవం దుఃక సముత్పన్నాః స్త్రియో యా రహితాః పియైః. 70

కడిమిచెట్లు, కుటజములు, అర్జునకములు విరియబూచినవి. ప్రియుల దగ్గరలేని స్త్రీలు కుమిలి పోసాగిరి.

మేఘా సవిద్యుత శ్చైవ బలాకాఙ్గద భూషితాః. 71

మేఘములు మెరుపులతో బెగ్గురుపక్షులనెడి అలంకారములతో ఉరిమిరిమి కుండపోతగా కురిసినవి.

మయూరాణాం చ నిర్ఘోష్తె ర్బలాకానాం మహాస్వనైః,

కులజార్జున గన్దైశ్చ కదంబార్జున పాదపాః. 72

నెమళ్లక్రేంకాములతో, బెగ్గురుపక్షుల కలకలారావములతో కడిమి మొదలగు పూలచెట్ల సూవాసనలతో ఆతావు నిండిపోయెను.

వాతాః ప్రవాన్తి తే తత్ర శిఖీనాం చ సుఖావహాః,

శోకేన కామినీనాం చ భర్త్రా విరహితాశ్చ యాః. 73

నెమిళ్లకు సుఖము కలిగించునవియును, భర్తల ఎడబాటుకల వనితలకు దుఃఖము కలిగించునవియును అగు చక్కని గాలులుల వీచుచున్నవి.

ఏవం స గచ్ఛతే కాలో మేఘదున్దుభినాదితః,

శరత్కాల మనుప్రాప్త మగస్తి రుదితో మహాన్‌. 74

మేఘముల దుందుభినాదములతో కాలము గడచుచున్నది. పిదప శరత్కాలము వచ్చినది. అగస్త్య మహర్షి ఉదయించెను.

తడాగాని ప్రసన్నాని భూషితా కుముదోత్పలైః,

పద్మషణ్డాని రమ్యాణి పుష్పితాని యథోచితాః, 75

చెరువులన్నియు ప్రసన్నములైనవి. తామరలతో కలువలతో కలకలలాడుచున్నవి. పద్మముల వనములు కన్నులకింపుడగా చక్కగా పూచియున్నవి.

ఆవాన్తి సుసుఖా వాతాః కహ్లారసుఖ శీతలాః,

సప్తపర్ణ విమిశ్రేణ శీతలాః కామివల్ల భాః. 76

తెల్లని పద్మముల చల్లదనములను, కర్పూరపుటనటుల సువాసనను కలుపుకొని కామిజనులకు ప్రియములైన సుఖకరములగు మెల్లని వాయువులు వీచుచున్నవి.

ఏవం శరది నిర్వృత్తే కౌముద్యే సముపాగతే,

స తస్య మాసే సుశ్రోణి శుక్లపక్షాన్తరే తదా. 77

ఏకాదశ్యాం తతః సుభ్రు స్నాతౌ క్షామ విభూషితౌ,

ఉభౌ తౌ దమ్పతీ తత్ర ఊచతుః పుత్ర మేవ తౌ. 78

ఇట్లు శరత్కాలము నడచుచుండగా కార్తీకమాస శుక్లపక్ష ఏకాదశినాడు ఆ దంపతులు స్నానములు చేసి తెల్లని పట్టుపుట్టముల ధరించి కుమారునితో ఇట్లు పలికిరి.

ఉషితాః పుత్ర షణ్మాసాన్‌ రహః శ్వో ద్వాదశీ భ##వేత్‌,

కిన్నో న వక్ష్యే సే గుహ్యం యేన వై వారితా వయమ్‌. 79

పుత్రా! ఇచట ఆరు నెలలుంటిమి. రేపు ద్వాదశి. మమ్ములను ఇంతవరకు నిలువరించిన ఆ రహస్యమును మాకేల చెప్పకున్నావు?

పిత్రో స్తు వచనం శ్రుత్వా స పుత్రో ధర్మనిష్ఠితః,

ఉవాచ మధురం వాక్యం మరణ కృతనిశ్చయః. 80

తల్లిదండ్రుల మాటనాలకించి ధర్మమున నిష్ఠగల ఆ కుమారుడు, మరణమునకు నిశ్చయము చేసికొని మెల్లగా వారి కిట్లనెను.

ఏవ మేత న్మహాభాగ యత్త్వయా పరిభాషితమ్‌,

కల్యం తే కథయిష్యామి ఇదం గుహ్యం మహౌజసమ్‌. 81

నాయానా! నీవు పలికిన దది అట్టిదే. రేవు ఉదయమున నీకు నా పరమరహస్యమును చెప్పుదును.

ఏషా వై ద్వాదశీ తాత ప్రభో ర్నారాయణప్రియా,

మఙ్గలా చ విచిత్రా చ విష్ణుభక్త సుఖావహా. 82

తండ్రీ! ఇదిగో ఈ కార్తీక ద్వాదశి ప్రభువగు నారాయణునకు ప్రియమైనది. మంగళకరము, విచిత్రము నయినది. విష్ణుభక్తులకు సుఖము కూర్చునది.

దదన్తే యేపి హృష్టాత్మా కౌముద్యాయాం తు ద్వాదశీమ్‌,

దీక్షితా స్తే యోగికులే విష్ణోశ్చ పరివర్థతే. 83

సంతోషముతో కూడిన హృదయముతో ఈ కార్తిక ద్వాదశినాడు దానము లొసగువాడు యోగుల కులమున దీక్షకలవారు, విష్ణుభక్తులలో వృద్ధి పొందినవారు అగుదురు.

తేన దానప్రభావేన విష్ణుకర్మ పరాయణాః,

తరన్తి విపులం తాత ఘోరం సంసారసాగరమ్‌,

ఏవం కథయతాం తేషాం ప్రభాతా రజనీ శుభా. 84

ఆ దానము మహిమచేత విష్ణుభక్తులు ఘోరము, విస్తారము అయిన సంసారమును దాటుదురు. ఇట్లు మాటాడు కొనుచుండగా వారికి ఆ రాత్రి కడచి తెల్లవారెను.

తతః సంధ్యా మపక్రాన్తే7భ్యుదితే సూర్యమండలే,

శుచి ర్భూత్వా యథాన్యాయం క్షౌమవస్త్రవిభూషితః. 85

సంధ్యాకాలము కడచి సూర్యమండలము ఉదయింపగా ఆ బాలుడుశుచియై పట్టువస్త్రమును తాల్చెను.

ప్రణమ్య శిరసా దేవం కృత్వా తత్ర ప్రదక్షిణమ్‌,

ఉభౌ తౌ చరణౌ గృహ్య మాతాపితర మబ్రవీత్‌. 86

దేవునకు తలతో ప్రణమిల్లి ప్రదక్షిణ మాచరించి తల్లితండ్రుల పాదములకు నమస్కరించి వారితో ఇట్లు పలికెను.

శృణు తాత మహాభాగ యేన తత్త్వ మిహాగతః,

యద్భవాన్‌ పృచ్ఛతే మాం హి గుహ్యం సౌకరకం ప్రతి. 87

తండ్రీ! మనమీ సౌకరక క్షేత్రమునకు ఏల వచ్చితిమి? అని నీవడుగు దానికి సమాధానము వినుము.

ఖఞ్జరీటో హ్యనం తాత తిర్యగ్జాతో హ పక్షిణః,

భక్షితాని పత ని అజీర్ణే నాతి పీడితః. 88

నేను కాటుకపిట్టను. తిర్యగ్జాతికి చెందిన పక్షిని. పురుగులను తింటిని. అజీర్ణముతో మిక్కిలి బాధ నొందితిని.

అహం తేనైన దోషేణ న శక్నోమి విచేష్టితుమ్‌,

దృష్ట్వా మాం విహ్వలం బాలా గృహీత్వా క్రీడితుం గతాః. 89

అదే దోషముచేత నేను మెదలుటకు చాలని వాడనైతిని. అట్లు విలవిలలాడుచున్న నన్ను బాలకులు పట్టుకొని ఆడుకొన జొచ్చిరి.

హస్తా ద్దస్తేన క్రీడన్త శ్చాన్యోన్య పరిహాసయా,

త్వయా దృష్టో మయాదృష్టో అన్యోన్యం జాయతే కలిః. 90

ఒకని చేతినుండి మరియొకని చేతికి విసరివైచుచు,కేరింతలు కొట్టుచు, దీనిని నీవు చూచితివి, కాదు నేను చూచితిని అనని వారిలో వారు కలహించిరి.

తత ఏకేన బాలేన భ్రామయిత్వా7క్షయే 7మ్భసి,

న తే చేతి న మేత్యుక్త్వా ఆదిత్యం తీర్థమాశ్రితః,

తీవ్రం క్రోధం సమాధాయ క్షిప్తో7హం జాహ్నవీజలే. 91

అంత ఒక బాలుడు తరుగువోని నీటిలో గిరికీలు కొట్టుచు, నీదికాదు, అనుచు ఆదిత్య తీర్థమును చేరుకొని తీవ్రమగు క్రోఢమును పూని గంగనీటిలో నన్ను విసరివైచెను.

తత్ర ముక్తా మయా ప్రాణాః సూర్యతీర్తే మహౌజసి,

అకామేన విశాలాక్షి జాతో7స్మి తవపుత్రకః. 92

గొప్పశక్తికల ఆసూర్య తార్థమున నేను కోరుకొనకయే ప్రాణములను విడిచితిని. అమ్మా! నీ కొడుకనై పుట్టితిని.

అయం స వర్తతే కాలో ఏషా చైవ తు ద్వాదశీ,

అకామా న్మ్రియమాణస్య వర్షాణ్యద్య త్రమయోదశ. 93

ఇప్పు డాకాలము నడుచుచున్నది. ఇదిగో ద్వాదశి కోరుకనకయే మరణించిన నాకు పదుమూడేండ్లు నిండినవి.

ఏతత్‌ తే కథితం తాత గుహ్య మాగమనం ప్రతి,

అహం కర్మ కరిష్యామి గచ్ఛ తాత నమో7స్తు తే. 94

నాయనా! ఇచ్చటికి వచ్చుటలో రహస్యమగు దీనిని నీకు చెప్పితిని. నేను నాపని చేసికొందును. నీవు ఇంటికేగుము. నీకు నమస్కారము.

తతో మాతా పితా చైవ పుత్రం పున రువాచ హ,

విష్ణుప్రోక్తాని కర్మాణి యంయం కారయితా భవాన్‌. 95

తాన్‌ వయం చ కరిష్యామో విధిదృష్టేన కర్మణా,

ఘటమానా యథాన్యాయం గర్భసంసాన మోక్షణమ్‌. 96

అంత నతని తల్లిదండ్రులు కొడుకుతో మరల నిట్లనిరి. నాయనా! విష్ణువుచెప్పిన కర్మములు నీవు చేసెడి వేవి కలవో మేమును శాస్త్ర మార్గము ననుసరించి వానిని చేసేదము. దానివలన మాకు సంసార బంధము వదలిపోవును.

తేపి దీర్ఘేణ కాలేన మమ కర్మపరాయణాః,

కృత్వా తు విపులం కర్మ తతః ప్జఞ్చత్వ మాగతాః. 97

వారును పెద్దకాలము నాఆరాధనయందు శ్రద్ధకలవారై విపులముగా పూజల నాచరించి పిదప మరణించిరి.

మమ క్షేత్ర ప్రభావేన చాత్మనః కర్మనిశ్చయాత్‌,

ప్రముక్త సర్వసంసారాః శ్వేతద్వీపముపాగతాః. 98

నా క్షేత్రము ప్రభావమువలనను, వారి కర్మపరిపాకము వలనను సంసారబంధమునన్నింటిని త్రెంచుకొని వారు శ్వేతద్వీపమున కరిగిరి.

యో7సౌ పరిజనః కశ్చిద్‌ గృహేభ్యశ్చ సమాగతః,

సౌ7పి కృత్వా తు కర్మాణి యస్యయద్‌ రోచతే యథా. 99

వారి యింటినుండి వచ్చిన పరిచారకులును చక్కని పూజాకర్మములను ఎవరికి తోచినవిధముగా వారాచరించిరి.

ప్రముక్తః సర్వసంసారా న్మమ కర్మపరాయణాః,

దేవి క్షేత్రప్రభావేన శ్వేతద్వీప ముపాగతః,

సర్వశ్రియావృత స్తత్ర వ్యాధిరోగ విర్జితః. 100

అట్లు నాపూజలయందు శ్రద్దగల వారందరు సంసార బంధము నుండి ముక్తి పొందిక్షేత్ర ప్రభావముచేత సకలైశ్వర్యములతో కూడినవారై, వ్యాధులు, రోగములులేనివారై శ్వేతద్వీపమును చేరుకొనిరి.

సర్వే చ యోగినస్తత్ర సర్వే చోత్పలగన్దినః,

మోదన్తే తు యథాన్యాయం ప్రసాదాత్‌క్షేమమోవచ. 101

అందందరు యోగులే. అందరు కలువలకమ్మని వాసనలు కలవారే. నా అనుగ్రహమువలన అందరు క్షేమమును, ఆనందమును పొందువారే.

ఏతత్‌ తే కథితం దేవి మహాఖ్యానం మహౌజసమ్‌,

పునరన్యద్‌ యథావృత్తం తం తు సౌకరకే విధౌ. 102

దేవీ! ఇది గొప్పశక్తిగల మహాఖ్యానము. నీకు చెప్పితిని. సౌకరకక్షేత్రమున జరిగిన మరియొక విషయమును కూడ నీకు చెప్పెదను.

ఏషా వ్యుష్టి ర్మహాభాగే క్షేత్రే సౌకరకే మమ,

తిర్యగ్యోని మనుప్రాప్య శ్వేతద్వీప ముపాగతాః. 103

సౌకరకక్షేత్రము మహాభాగ్య మిట్టిది. పశువులు పక్షులు కూడ దీనిని పొంది శ్వేతద్వీపమున కరుగుచున్నారు.

య ఏతత్‌ పఠతే నిత్యం కల్యముత్థాయ మానవః,

స కులం తారయేత్‌ తూర్ణం దశపూర్వాన్‌ దశాపరాన్‌. 104

ఉషః కాలమున నిద్రలేచి దీనిని పఠించు మానవుడు తనకులమున ముందు పదితరముల వారిని, తరువాత పదితరముల వారిని తరింపజేయును.

న పఠే న్మూర్ఖమధ్యే తు పాపిష్ఠే శాస్త్రదూషకే,

న పఠేత్‌ పిశునాం మధ్యే ఏకాకీ తు పఠేద్‌ గృహే. 105

మూర్ఖుల నడుమ, పాపిష్ఠులదగ్గర, శాస్త్రములను నిందించువారి సమీపమున. నీచులుండుచోట దీనిని చదువరాదు. ఇంట ఒంటరిగా నుండి దీనిని పఠింపవలయును.

పఠేద్‌ భగవతాం మధ్యే యేచ శాస్త్రగుణాన్వితాః,

విశుద్దానాం వనీతానాం సర్వసంసారమోక్షణమ్‌. 106

భగవద్భక్తులు, శాస్త్రగుణములతో కూడినవారు. విశుధ్దుల, వినయవంతులు నగువారి నడుమ దీనిని పఠింపవలయును. ఇది సమస్తమగు సంసారదోషములను పోగొట్టును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టత్రింశ దధికశతతమో7ధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవాచ్ఛాస్త్రమున నూటముప్పది యెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters