Varahamahapuranam-1    Chapters   

అథషోడశోధ్యాయః - పదునారవ అధ్యాయము

ధరణ్యువాచ- భూదేవి యిట్లు పలికెను.

తదా దుర్వాససా శప్తో దేవరాజః శతక్రతుః,

వసిష్యసి త్వం మర్త్యేషు సుప్రతీకసుతేన తు. 1

úxms˳ÏÁW! @xmsöV²R…V ®µ…[ª«sLSÇÁgRiV BLiúµR…V¬s µR…VLS*xqsV²R…V ¬sƒ«sVõ xqsVúxms¼d½NRPV¬s NRPVª«sWLRiV²R…V F¡úµ][ÌÁgS ª«sVƒ«sVÇÁÙÌÁ»][ NRPÖÁzqs ¬sª«szqsLi»R½Vª«s¬s aRPzmsLi¿Áƒ«sVgRiµy!

ఉత్సాదితో దివో మూఢేత్యేవ ముక్తస్తు భూధరః,

ఇన్ద్రో మర్త్య ముపాగమ్య సర్వదేవసమన్వితః. 2

కించకార...

‡ÁVµôðj…{¤¦¦¦ƒ«sV²y! xqsVúxms¼d½NRPV¬s N]²R…VNRPV ¬sƒ«sVõ xqs*LæRiª«sVVƒ«sVLi²T… ú»][ÖÁ\®ªs¿RÁVƒ«sV. @¬s µR…VLS*xqsƒ«sV²R…V xmsÌÁVNRPgS ®µ…[ª«s»R½ÌÁLiµR…Lji»][ NRPW²T…ƒ«s ®µ…[®ªs[LiúµR…V²R…V ª«sVƒ«sVxtsQùÇÁƒ«søª«sVV F~Liµj… G„sV ¿Á[|qsƒ«sV?

..... చ తస్మింస్తు దుర్జయే చ నిపాతితే,

పరమేష్ఠినా భగవతా తేన యోగ విదుత్తమౌ. 3

స్వర్గే విద్యుత్సువిద్యుచ్చ తౌ చకిం చాక్రతు స్తదా,

ఏతన్మే సంశయం దేవ కథయస్వ ప్రసాదతః. 4

మరియు ఆ దుర్జయుని భగవంతుడగు బ్రహ్మకూల్చివేసిన పిదప ఉత్తమ యోగజ్ఞానముగల విద్యుత్తు సువిద్యుత్తు అనువారు స్వర్గమున నేమి చేసిరి ? ప్రభూ! ప్రసన్నుడవై నాయీసంశయమును తీర్పుము.

వరాహ ఉవాచ - వరాహదేవుడిట్లు చెప్పెను,

దుర్జయేన జితో ధాత్రి దేవరాజః శతక్రతుః

భారతే హి తదా వర్షే వరాణాస్యాం తు పూర్వతః,

ఆశ్రిత్యసంస్థితో దేవైః సహ యక్షమహోరగైః. 5

˳ÏÁW®µ…[„ds! ®µ…[®ªs[LiúµR…²R…V²R…V µR…VLêRi¸R…VVƒ«sNRPV J²T… ˳ØLRi»R½ª«sL<Riª«sVVƒ«s ªyLSßázqs ƒyúaRPLiVVLiÀÁ ¸R…VORPVÌÁ»][, ƒygRiVÌÁ»][ ®µ…[ª«s»R½ÌÁÍÜ[ NRPÌÁzqs ¬sª«szqsLi¿Áƒ«sV.

విద్యుత్‌ సువిద్యుచ్చ తదా యోగ మాస్థాయ శోభ##నే,

దీర్ఘతాపజ్వరం వాయుకర్మయోగేన సంశ్రితౌ,

లోకపాలాయతం కృత్స్నం చక్రతు ర్యోగమాయమా. 6

@Li»R½ A „sµR…Vù»`½ xqsV„sµR…Vù»R½VòÌÁV ¹¸…WgRiª«sVV ƒ«sª«sÌÁLiÕ³ÁLiÀÁ ªy¸R…VVNSLRiùxqsLi‡ÁLiµ³R…ª«sVV¿Á[»R½ µk…LçRi»yxmsÇÁ*LRiª«sVVƒ«sV NRPÖÁöLiÀÁ ¹¸…WgRiª«sW¸R…V»][ ÍÜ[NRPFyÌÁVLRiƒ«sV úNRPª«sVVøƒ«sÈýÁV NS„sLiÀÁLji.

తం దుర్జయం మృతం శ్రుత్వా సముద్రాంతం స్థితం సదా,

ఆనీయ చతురఙ్గంతు దేవాన్‌ ప్రతి విజగ్మతుః 7

A µR…VLêRi¸R…VV²R…V ª«sVLRißÓáLi¿Áƒ«s¬s „s¬s xqsª«sVVúµR…ª«sVV NRP²R…ƒ«sVƒ«sõ ¿RÁ»R½VLRiLigRi‡ÁÌÁª«sVVƒ«sV LS„sLiÀÁ ®µ…[ª«s»R½ÌÁ\|msNTP µR…Li²R…V ®ªs²R…ÖÁLji.

ఆగత్య తౌ తదా దైత్యా మహత్సైన్యేన పర్వతమ్‌,

హిమవన్తం సమాశ్రిత్య సంస్థితౌ తు బభూవతుః. 8

అట్లు పెనుసేనతో వచ్చివారు హిమవత్పర్వతము నాశ్రయించి నిలిచియుండిరి.

దేవా అపి మహాత్సైన్యం సఃహత్య కృతదంశితాః,

మన్త్రయాఞ్చక్రు రవ్యగ్రా ఐన్ద్రం పద మభీప్సవః. 9

దేవతలును గోప్పసేన కూర్చుకొని రక్షణ ఏర్పాటులు కావించుకొని ఇంద్రపదవి నొందగోరినవారై మెలకువతో మంతసములాడుచుండిరి.

అబ్రవీత్తత్ర దేవానం గురు రాఙ్గిరసో మునిః,

గోమేధేన యజధ్వం వై ప్రథమం తదనన్తరమ్‌. 10

యష్టవ్యం క్రతుభిః సర్వై రేషా స్థితి రథామరాః,

ఉపదేశో మయా దత్తః క్రియతాం శీఘ్ర ఏష వై. 11

అందు దేవగురుడు బృహస్పతి - మొదట గోమేధము చేయుడు - పిదప తక్కిన యజ్ఞములన్నియు చేయవలయును. దేవతలారా! ఇది పద్ధతి. ఇదినేను మీకిచ్చు ఉపదేశము, దీనిని త్వరగా నాచరింపుడు.

ఏవముక్తా స్తదా దేవా గాః పశూంశ్చానుకల్ప్యతే,

ముముచు శ్చరణార్థాయ రక్షార్థం సరమాం దదుః. 12

ఆతడిట్లు పలుకగా ఆదేవతలు గోవులను, ఇతర పశువులను కూర్చుకొని వానిని సంచారము కొరకు వదలిరి. వారిరక్షకై సరమను ఏర్పరచిరి.

(సరమ - దేవతల కుక్క)

తాశ్చ గావో దేవశున్యా రక్ష్యమాణా ధరాధరే,

తత్ర జగ్ము స్తదా గావ శ్చరన్త్యో యత్ర తేసురాః.13

దేవతలశునకముకాపాడుచున్న ఆగోవులు అందందు తిరుగుచు ఆరక్కసులున్న తావున కరిగెను.

తేచగావస్తు తా దృష్ట్వా శుక్రమూచుఃపురోహితమ్‌,

పశ్యత్వం దేవ గా బ్రహ్మంశ్చార్యన్తే రక్షమాణయా,

దేవశున్యా సరమయా వద కిం క్రియతే7ధునా. 14

అంత నారక్కసులు ఆ గోవులనుగాంచి పురోహితుడగు శుక్రునితో - ప్రభూ! చూడు. దేవతలశుని సరమ కాపాడుచుండగా గోవులనిందు త్రిప్పుచున్నారు. ఇప్పుడు మనమేమి చేయవలయును - అని అడిగిరి.

ఏవ ముక్తా స్తదా శుక్రః ప్రత్యువాచాసురాం స్తదా

ఏతా గా హ్రియతాం శీఘ్ర మసురా మా విలమ్బథ. 15

అంత శుక్రుడు రక్కసులతో - అసురులారా! వెనువెంటనే ఈ గోవులను పట్టుకొనుడు. జాగుసేయకుడు - అని పలికెను.

ఏవముక్తా దైత్యా జహ్రు స్తా గా యదృచ్ఛయా. 16

ఇట్లన్నతోడనే ఆదైత్యులు ఆగోవులను చేజిక్కించుకొనిరి.

హృతాసు తాసు సరమా మార్గాన్వేషణ తత్పరా,

అపశ్యత్సా దితేః పుత్రై ర్నీతా గావో ధరాధరే,

దైత్యైరపి శునీ దృష్టా దృష్టమార్గా విశేషతః. 17

వారట్లు గోవులను హరింపగా సరమ అవి పోయిన దారిని శ్రద్ధతో వెదికెను. కడకు దితికొడుకులు వానిని తోలుకొని పోవుచుండగా కనుగొనెను. దైత్యులును తమదారి నెరిగిన సరమను గాంచిరి.

దృష్ట్వా తే తాం చ సామ్నైవ సామపూర్వ మిదం వచః,

ఆసాం గవాంతు దుగ్ధ్వైవ క్షీరం త్వం సరమే శుభే,

పిబసై#్వవ మితి ప్రోక్త్వా తసై#్య తద్దదు రఞ్జసా. 18

కాంచి వారుమంచిమాటలతో సరమా! ఈ గోవుల పాలుపిండి నీవు త్రాగుము. అని వానిక్షీరమును దాని కొసగిరి.

దత్త్వాతు క్షీరపానంతు తసై#్యతే దైత్యనాయకాః,

మాభ##ద్రే దేవరాజాయ గాస్త్విమా వినివేదయ. 9

అట్లు రాక్షసనాయకులు పాలు సరమ కొసగి ఓయమ్మా! ఈ గోవులనుగూర్చి దేవరాజునకు చెప్పవలదని పలికిరి.

ఏవముక్త్వా తతోదైత్యా ముముచుంస్తాం శునీం వనే,

తైర్ముక్తా సా సురాం స్తూర్ణం జగామ ఖలు వేపతీ. 20

దైత్యులిట్లు పలికి ఆ శునిని వనమున వదలివైచిరి. అంతనా సరమ వణకి పోవుచు వడివడిగా దేవతలకడ కరిగెను.

నమశ్చక్రే చ దేవేన్ద్రం సరమా సురసత్తమమ్‌. 2

సరమ దేవేంద్రునకు మ్రొక్కు లిడెను.

తస్యా శ్చ మరుతో దేవా దేవేన్ధ్రేణ నిరూపితాః,

గూఢం గచ్ఛత రక్షార్థం దేవశున్యా మహాబలాః. 22

దేవేంద్రు డామెకు మరుత్తులను దేవతలను చూపి మహాబలులారా! మీరీ దేవశునితోపాటుగుట్టుగా రక్షణకుగా నరుగుడు' అని పలికెను.

ఇత్యుక్తా స్తేన సూక్ష్మేణ వపుషా జగ్ము రఞ్జసా,

తేప్యాగమ్య సురేన్ద్రాయ సమశ్చక్రు ర్ధరాధరే. 23

దేవేంద్రుడట్లు చెప్పగా వారు సూక్ష్మమగుదేహముతో వడివడిగా నరిగిరి. వారును తిరిగివచ్చి దేవేంద్రునకు నమస్కరించిరి.

తాన్‌ దేవరాజః పప్రచ్ఛ గావః కిం సరమేభవన్‌,

ఏవముక్తా తు సరమా నజానామీతి చాబ్రవీత్‌. 24

దేవేంద్రుడు, సరమా! గోవులేమైనవి? అని యడిగెను. సరమ తెలియదని బదులు చెప్పెను.

తత ఇన్ద్రో రుషా యుక్తో యజ్ఞార్థ ముపకల్పితాః,

గావః క్వ చేతి మరుతః ప్రోవాచేదం శునీ కధమ్‌. 25

అంత ఇంద్రుడు కోపముతో యజ్ఞమునకై ఏర్పరచిన గోవులేవి? ఈశుని సంగతియేమి? అని మరుత్తుల నడిగెను.

ఏవ ముక్తాస్తు మరుతో దేవేంద్రేణ ధరాధరే,

కథయామాసు రవ్యగ్రాః కర్మ తత్సరమాకృతమ్‌. 26

దేవేంద్రుడిట్లు పలుకగా మరుత్తులు మెల్లగా దాపరికములేకుండ సరమచేసినపనిని నివేదించిరి.

తత ఇన్ధ్రః సముత్థాయ పదా సన్తాడయఞ్ఛునీమ్‌,

క్రోధేన మహతా విష్టో దేవేన్ధ్రః పాకశాసనః. 27

అంతపాకశాసనుడగు దేవేంద్రుడు పట్టరానికోపముతో ఆకుక్కను కాలితో మట్టగింపసాగెను.

క్షీరం పీతం త్వయా మూఢే గావస్తాశ్చాసురైర్హృతాః.

ఏవముక్త్వా పదా తేన తాడితా సరమా ధరే. 28

బుద్ధిలేనిదానా! నీవు పాలుత్రాగితివి. ఆ రక్కసులు గోవులను కాజేసిరి. అని పలుకుచు సరమను కాలితో తన్నసాగెను.

తస్యేన్ధ్రపాద ఘాతేన క్షీరం వక్త్రా త్ర్పసుస్రువే,

స్రవతా తేన పయసా సా శునీ యత్ర గా భవన్‌,

జగామ తత్ర దేవేన్ధ్రః సహసైన్యస్తదా ధరే. 29

ఇంద్రుని కాలిదెబ్బలవలన దానినోటినుండి పాలు వెలికివచ్చెను. అట్లు వచ్చుచున్న పాలతో ఆశుని గోవులున్నచోటి కరిగెను. దేవేంద్రుడు సేనలతో కూడి దాని వెంట నరిగెను.

అపశ్యత్తత్ర దేవేన్ద్ర స్తాగా దైత్యైరుపాహృతాః,

చక్రుర్యేపాలనం దైత్యాస్తేదైత్యా బలినో భృశమ్‌,

తైఃసైన్యై ర్నిహతాః సద్యస్తత్యజు ర్గాఃస్వమూర్తిభిః. 30

అంత దేవేంద్రుడు దైత్యుడు అపహరించినగోవులను గాంచెను. వానిని రక్షించుచున్న బలవంతులగు రక్కసలను దేవసేనలు రూపుమాపెను. గోవులు రూపము చెడక వశమాయెను.

సామన్తైశ్చ సురేన్ద్రోథ వృతః పరమహర్షితైః,

తాశ్చలబ్ధ్వా మహేన్ధ్రస్తు ముదా పరమయా యుతః 31

పెల్లుబికిన సంతోషము గల సామంతులతో దేవరాజు గొవులను పొంది పరమానందమందెను.

చకార యజ్ఞాన్‌ వివిధాన్‌ సహస్రా నపి స ప్రభుః,

క్రియమాణౖస్తతో యజ్ఞై ర్వవృధేన్ధ్రస్య తద్బలమ్‌. 32

అట్లు గోవులను చేజిక్కించుకొన్న దేవేంద్రుడు వేలకొలదిగా వివిధములగు యజ్ఞము లాచరించెను. అట్లు చేయుచుండగా ఆతనిబలము పెంపొందసాగెను.

వృద్ధితేన బలేనేన్ద్రో దేవసైన్య మువాచ హ,

సన్నహ్యతాం సురాః శీఘ్రం దైత్యానాంవధకర్మణి. 33

అట్లు పెంపొందిన బలముతో దేవేంద్రుడు దేవసేనను 'దైత్యులను రూపుమాపు కార్యమునకు సిద్ధపడు' డని హెచ్చరించెను.

ఏవముక్తా స్తదా దేవాః సన్నద్ధా స్తతక్షణభవన్‌,

అసురాణా మభావాయ జగ్ముర్దేవాః సవాసవాః. 34

ఆతడట్లు పలుకగనే దేవతలు ఏర్పాటు లన్నియు కావించుకొని రాక్షసులను రూపుమాపుటకై దేవేంద్రునితో కూడి బయలుదేరిరి.

గత్వాతు యుయుధుస్తూర్ణం విజిగ్యుస్త్వాసురీం చమూమ్‌,

జితాశ్చదేవై రసురా హతశేషా ధరాధరే,

మమజ్జుః సాగరజలే భయత్రస్తా విచేతసః. 35

అట్లు వెడలి దేవతలు రక్కసుల మూకతో పోరాడి గెలిచిరి. చావగా మిగిలిన రక్కసులు భయముతో గుండెచెదరి సముద్ర జలములో మునిగిరి.

దేవరాజోపి త్రిదివం లోకపాలైః సమం ధరే,

ఆరుహ్య బుభుజే ప్రాగ్వత్‌ సదేవో దేవరాడ్విభుః. 36

అట్లు దేవరాజు లోకపాలురతో కూడి స్వర్గము నాక్రమించి మునుపటివలె ఏలసాగెను.

య ఏనం శృణుయా న్నిత్యం పరమాఖ్యానముత్తమమ్‌,

స గోమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః. 37

ఈ ఉత్తమకథను ప్రతిదినము వినుమానవుడు గోమేధయజ్ఞముచేసిన ఫలము పొందును.

భ్రష్ట రాజ్యశ్చ యో రాజా శృణోతీదం సమాహితః,

స దేవేన్ధ్ర ఇవ స్వర్గం రాజ్యం స్వం లభ##తే నరః. 38

ఎవ్వడుగాని రాజ్యము కోల్పోయినరాజు ఈ కథను శ్రద్ధతో నాలకించినచో, దేవేంద్రుడు స్వర్గమును పొందినట్లు, తనరాజ్యమును తిరిగి పొందును.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్చాస్త్రే షోడశోధ్యాయః.

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున పదునారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters