Varahamahapuranam-1    Chapters   

షడ్వింశో7ధ్యాయః - ఇరువది ఆరవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలుడిట్లు పలికెను.

శరీరస్య కథం మూర్తిం గ్రహణం జ్యోతిషో ద్విజ,

ఏతన్మే సంశయం ఛిన్ది ప్రణతస్య ద్విజోత్తమ. 1

ఓ బ్రాహ్మణోత్తమా! వెలుగునకు ఆకారమేర్పడుట యెట్లు? నీకు నమస్కరింతును. నాయీ సంశయమును తీర్పుము.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

యోసా వాత్మా జ్ఞానశక్తి రేక ఏవ సనాతనః,

స ద్వితీయం యదా చైచ్ఛత్‌ తదా స్మాత్మ స్థితోజ్వలత్‌. 2

జ్ఞానమనుశక్తి గల సనాతనమగు ఆత్మ ఒక్కటియే మొదట ఉండెడిది. అది రెండవ దానిని కోరునప్పటికి తనలో నున్న వెలుగు వెలువడియెను.

యః సూర్య ఇతి భాస్వాంస్తు అన్యోన్యేన మహాత్మనః,

లీలాభూతాని తేజాంసి భాసయన్తి జగత్త్రయమ్‌. 3

అదియే గొప్ప వెలుగు గల సూర్యుడు. ఆతని వెలుగులు ఒక దానితో నొకటి బాగుగా కలిసిపోయి ఈ మూడు లోకములను ప్రకాశింప జేయుచున్నవి.

తస్మిన్‌ సర్వే సురాః సిద్ధా గణాః సర్వే మహర్షిభిః,

సమం సూతా ఇతి విభో తస్మాత్‌ సూర్యోభవత్‌ స్తుతః. 4

ఆతనియందు ఒక్కమారుగా సురలు, సిద్ధులు, అన్ని విధములైన దేవగణములు, మహర్షులతోపాటు పుట్టిరి. అందువలననే ఆతడు 'సూర్యు' డామెను (సూర్యుడనగా పుట్టుటకు కారణమైవాడు)

లోలీభూతస్య తస్యాశు తేజసోభూ చ్ఛరీరకమ్‌,

పృథక్త్వేన రవిః సోథ కీర్త్యతే వేదవాదిభిః. 5

బాగుగా కాదలాడిన ఆతని తేజస్సునుండి వేరుగా ఒక శరీర మేర్పడెను. వేదవాదులు ఆ శరీరముగలవానిని రవి యని కీర్తించిరి.

భాసయన్‌ సర్వలోకాంస్తు యతోసా వుత్థితో దివి,

అతోసౌ భాస్కరః ప్రోక్తః ప్రకర్షాచ్చ ప్రభాకరః. 6

ఆతడు ఆకాశమున ఉదయించుచు లోకము లన్నింటిని ప్రకాశింపజేసెను. కావున ఆతనికి భాస్కరుడనుపేరు కలిగెను. ఆ ప్రకాశ##మే అధికమగుటవలన ప్రభాకరుడనియు నందురు.

దివా దివస ఇత్యుక్త స్తత్కారిత్వా ద్దివాకరః,

సర్వస్య జగత స్త్వాది రాదిత్య స్తేన ఉచ్యతే. 7

పగటిని దివసమందురు. దానిని చేయువాడు కనుక దివాకరుడు. జగమున కంతటికిని మొదటి వాడు కావున ఆదిత్యుడను పేరేర్పడెను.

ఏతస్య ద్వాదశాదిత్యాః సంభూతా స్తేజసా పృథక్‌,

ప్రధాన ఏవ సర్వేషాం సర్వదా స విబుధ్యతే. 8

ఈతని తేజస్సు చేతనే పండ్రెండుగురు ఆదిత్యులు విడిగా పుట్టిరి. ఆ అందరకు ప్రధానునిగా ఎల్లవేళల ఈతనినే చెప్పుదురు.

తం దృష్ట్వా జగతో వ్యాప్తిం కుర్వాణం పరమేశ్వరమ్‌,

తసై#్యవాన్తః స్థితా దేవా వినిష్క్రమ్య స్తుతిం జగుః. 9

జగము నంతటిని వ్యాపించుచున్న ఆ పరమేశ్వరుని గాంచి ఆతనిలోనే యున్న దేవతలందరు వెలుపలికివచ్చి యిట్లు స్తుతించిరి.

దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.

భవాన్‌ ప్రసూతి ర్జగతః పురాణః

ప్రయాసి విశ్వం ప్రలయే చ హంసి,

సముత్థితో నాథ శమం ప్రయాహి

మా దేవ లోకాన్‌ ప్లుష కర్మసాక్షిన్‌. 10

దేవా!ఈ సమస్త జగత్తునకు నీవే కారణమవు. విశ్వమంతట తిరుగుచు ప్రళయమున నాశనము చేయుచున్నావు. ప్రభూ! శాంతింపుము. కర్మసాక్షీ! దేవ లోకములను మాడ్చి వేయకుము.

త్వయా తతం సర్వత ఏవ తేజః

ప్రతాపినా సూర్య యజుఃప్రవృత్తే,

తిగ్మం రథాఙ్గం తవ దేవకల్పం

కాలాన్త మధ్వాన్తకరం వదన్తి. 11

లోకములన్నింటిని తపింపజేయు తేజమును, యజ్ఞముల ప్రవృత్తికొరకు నీవు వ్యాప్తి చేయుచున్నావు. తీక్షణము దివ్యము నైన నీ చక్రమును కాలమనుపేరుతో వ్యవహరింతురు. అది చీకట్లను పారద్రోలును.

ప్రభాకర స్త్వం రవి రాదిదేవ

ఆత్మా సమస్తస్య చరాచరస్య,

పితామహ స్త్వం వరుణో యమశ్చ

భూతం భవిష్యచ్ఛ వదన్తి సిద్ధాః.

నీవు ప్రభాకరుడవు, రవివి. ఆదిదేవుడవు. ఈ చరాచరమైన సమస్తమునకు ఆత్మవు. తాతావు. వరుణుడు, యముడు నీవే గడచినది గడుపనున్నదియు నీవే అని సిద్ధులు పల్కుదురు.

ధ్వాన్తం ప్రణుత్వం సురలోక పూజ్య

ప్రయాహి శాన్తం పితరో వదన్తి,

వేదాన్త వేద్యోసి మఖేషు దేవ

త్వం హూయసే విష్ణు రసి ప్రసహ్య. 12

సురలోకము పూజలందుకొను దేవా! నీవు చీకట్లను చీల్చివేయుము. శాంతింపుము. పితృదేవతలు నిన్ను కొనియాడుదురు. నీవు వేదాంతముచేత తెలియదగినవాడవు. యజ్ఞములలో నిన్నే అర్చింతురు. నీవు విష్ణుడవు.

ఇతిస్తుత సై#్తః సురనాథ భక్త్యా,

ప్రసాహి శంభో న ఇతి ప్రసహ్య, 13

ఓ సురనాథా! శంభూ, మమ్ము చక్కగా పాలింపుము అని వారు భక్తితో స్తుతించిరి.

ఏవముక్త స్తదా దేవైః సౌమ్యాం మూర్తి మథాకరోత్‌,

ప్రకాశత్వం జగామాశు దేవతానాం మహాప్రభుః. 14

ఇట్లు దేవతలు స్తుతింపగా ఆతడు సౌమ్యమైన రూపమును దాల్చెను. గొప్పకాంతిగలవాడై వెనువెంటనే దేవతలకు గానవచ్చెను.

ఏతత్‌ సర్వం సురాణాం తు దహనం శామితం పురా,

సప్తమ్యాం ఖలు సర్యేణ మూర్తిత్త్వం కృతవాన్‌ భువి. 15

దేవతలకు తాపము కలిగించుట, మరల చల్లబడుట అను నిదియంతయు సప్తమినాడు జరిగెను. సూర్యు డాదినముననే భూమండలముపై ఆకృతిని పొందెను.

ఏతాం యః పురుషో భక్త్యా ఉపాస్తే సూర్యమర్చయేత్‌,

భాస్కరేణ చ తస్యా సౌ ఫలమిష్టం ప్రయచ్ఛతి. 16

ఈ తిథిని, సూర్యుని భక్తితో ఉపాసించు పురుషునకు భాస్కరుడు ఇష్టఫలము ననుగ్రహించును.

ఏతత్‌ తే కథితం రాజన్‌ సూర్యాఖ్యానం పురాతనమ్‌,

ఆదిమన్వన్తరే వృత్తం మాతరః శృణు సాంప్రతమ్‌. 17

రాజా! ప్రాతకాలపునాటి సూర్యునికథను నీకు వివరించితిని. మొదటి మన్వంతరమున నిది జరిగెను. ఇప్పుడు మాతృదేవత లను గూర్చి చెప్పెదను. వినుము.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే షడ్వింశోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువది యారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters