Varahamahapuranam-1    Chapters   

అష్టత్రింశో7ధ్యాయః - ముప్పది యెనిమిదవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహు డిట్లు పలికెను.

సశుభం శోభనం మార్గ మాస్థాయ వ్యాధ సత్తమః,

తపస్తేపే నిరాహార స్తం గురుం మనసా స్మరన్‌. 1

ఆ కిరాతుడు మంగళ##మైన మార్గము నవలంబించి ఆహారము వదలి, ఆగురువును మనసులో స్మరించుచు తపస్సుచేసెను.

భిక్షాకాలే తు సంప్రాప్తే శీర్ణ పర్ణాస్య భక్షయత్‌,

స కదాచిత్‌ క్షుధావిష్టో వృక్షమూలం సమాశ్రితః. 2

భోజనసమయము రాగా రాలిన ఆకులను తినుచుండెను. ఆత డొకనాడు ఆకలిపైకొనగా ఒకచెట్టుమొదటికి చేరుకొన్న వాడాయెను.

బుభుక్షిత స్తరోః పర్ణ మైచ్ఛద్‌ భక్షితు మన్తికాత్‌,

ఇత్యేవం కుర్వతో వ్యోమ్ని వాగువాచాశరీరిణీ. 3

ఆకలిగొన్న వాడై దగ్గరగా నున్న ఆకును తినగోరెను. ఇట్లు చేయుచుండగా ఆకాశమున అశరీరవాణి వినవచ్చెను.

మా భక్షయస్వ సకట ముచ్చైరేవం ప్రభాషితే,

తతోసౌ తం విహాయాన్యద్‌ వార్షం పతిత మగ్రహీత్‌. 4

'అపవిత్రమైన దానిని తినకు' అని బిగ్గరగా అశరీరవాణి పలుకగా అంత నాతడు దానిని వదలివైచి రాలిన మరియొకచెట్టు ఆకును కైకొనెను.

తమప్యేకం నిషిద్ధం స్యా దన్యదేవ తథైవచ,

ఏవం స సకటం మత్వా వ్యాధః కించిన్న భక్షయత్‌. 5

దాని విషయమున కూడ ఇట్లే నిషేధము వినవచ్చెను. మరొక దానియెడలను అట్లే యాయెను. ఇట్లతడు అంతయు అపవిత్రమే అని తలచి ఏమియు తినకుండెను.

నిరాహార స్తపస్తేపే స్మరన్‌ గురు మతన్ద్రితః,

తస్యాథ బహునా కాలే గతే ఋషి వరోభ్యగాత్‌. 6

ఏ ఆహారములేనివాడై, గురువును స్మరించుచు, మెలకువతో ఆతడు తపమొనర్చెను. ఇట్లు పెక్కుకాలము గడువగా ఒకనాడాతని కడకు ఋషివరు డరుదెంచెను.

దుర్వాసాః శంసితాత్మా వై కిఞ్చిత్ర్పాణ మపశ్యత,

వ్యాధం తపోత్థతేజోభి ర్జ్వలమానం హవిర్యథా. 7

ఆతడు దొడ్డబుద్ధిగల దుర్వాసుడు. ఆతడు తపము వలన పైకిలేచిన వచ్చెడు తేజస్సులతో జ్వలించుచున్న హవిస్సువలె ఉన్న వాడును ప్రాణములు కడబట్టిన వాడును అగు ఆ బోయవానిని చూచెను.

సోపి వ్యాధస్తు తం సత్వా శిరసాథ మహామునిమ్‌,

ఉవాచ స కృతార్థోస్మి భగవన్‌ దర్శనాత్‌ తవ. 8

ఆ వ్యాధుడును ఆ మహామునికి తలతో నమస్కరించి 'భగవానుడా! నీ దర్శనమువలన కృతార్థుడనయితిని.'

ఇదానీం శ్రాద్ధకాలం మే ప్రాప్తం త్వ మవధారయ,

శీర్ణవర్ణాని భక్షయన్‌ వై తై రేవాహం మహామునే,

భవన్తం ప్రీణయామీతి వ్యాధ స్తం వాక్యమబ్రవీత్‌. 9

ఇప్పుడు నాకు శ్రాద్ధకాలము. నీవు అనుగ్రహిపుము. రాలిన ఆకులను పుచ్చుకొనుము. నేను వానితోడనే శ్రాద్ధమును నిర్వహింతును. వానితోడనే నీకు ప్రీతి కలిగింతునని పలికెను.

దుర్వాసా అపి తం శుద్ధం శుద్ధభావం జితేన్ద్రియమ్‌,

జిజ్ఞాసు స్తత్తపో వాక్యమిద ముచ్చై రువాచ హ. 10

పరిశుద్ధుడు, ఇంద్రియములను గెలిచినవాడును, శుద్ధమైన భావములు కలవాడును అగు అతని తపస్సును పరీక్షింపగోరి దుర్వాసుడును పెద్దగా ఇట్లు పలికెను.

యవగోధూమా శాలీనా మన్నం చైవ సుసంస్కృతమ్‌,

దీయతాం మే క్షుధార్తాయ త్వాముద్దిశ్యాగతాయచ. 11

ఆకలితో నుండి, నీకడకు వచ్చిన నాకు యవలు, గోధుమలు, సన్నబియ్యముల అన్నమును చక్కగా వండిన దానిని పెట్టుము.

ఇత్యుక్తేన త్వసౌ వ్యాధ శ్చిన్తాం పరమికాం గతః,

క్వ సంభవిష్యతే మహ్య మితి చిన్తాపరోభవత్‌. 12

ఆముని యిట్లు పలుకగా ఆ వ్యాధుడు పెద్ద ఆలోచనలో పడెను. నాకిట్టిది ఎక్కడ దొరకును? అని విచారించెను.

తస్య చిన్తయతః పాత్ర మాకాశాత్‌ పతితం శుభమ్‌,

సౌవర్ణం సిద్ధిసంయుక్తం తజ్జగ్రాహ కరేణ సః. 13

అట్లు చింతించుండగా ఆకాశమునుండి బంగారు పాత్ర శుభ##మైనది, సిద్ధులతో కూడినది ఒకటి పడెను. దాని నాతడు చేతితో గ్రహించెను.

తద్గృహీత్వా మునిం ప్రాహ దుర్వాసాఖ్యం ససాధ్వసః,

అత్రైవ స్థీయతాం బ్రహ్మన్‌ యావద్‌ భిక్షాటనం త్వహమ్‌.

కరోమి మత్ర్పసాదోయం క్రియతాం బ్రహ్మవిత్తమ. 14

అది కైకొని వెరగుపడుచు ఆ వ్యాధుడు దుర్వాసునితో ఇట్లు పలికెను. 'మహర్షీ! నేను బిచ్చమెత్తివచ్చు వరకు నీవు ఇచటనే నిలువుము. నాయందు అనుగ్రహము చూపుము.

ఏవముక్త్వా తతో భిక్షా మటనం వ్యాధ సత్తమః,

నాతిదూరేణ నగరం ధనయోష సమన్వితమ్‌. 15

ఇట్లు పలికి ఆ మంచిబోయ చేరువలో నున్నదియు ధనములు మంచి యిల్లాండ్రు గలదియునగు నగరమునకు భిక్ష మెత్తుటకై యరిగెను.

తస్య తత్ర ప్రయాతస్య అగ్రతః సర్వశోభనాః,

వృక్షేభ్యోనిర్యయు శ్చాన్యా హేమపాత్రాగ్రపాణయః,

వివిధాన్నాని తస్యాశు దత్త్వా పాత్రం ప్రపూరితమ్‌. 16

అతడిట్లు బయలుదేరినంతనే వృక్షములనుండి వెలువడి బంగారుపాత్రలు చేత ధరించిన సుందర వనితలు పెక్కు విధముల అన్నములను అతనికి అందించిరి. ఆతని పాత్ర పూర్తిగా నిండిపోయెను.

స చ భూతార్థ మాత్మానం మత్వా పున రథాశ్రమమ్‌,

ఆజగామ తతోపశ్యత్‌ తమృషిం జపతాం పరమ్‌. 17

అతడును తన్ను కృతార్థునిగా భావించుచు తిరిగి ఆశ్రమ మునకు వచ్చి మహర్షి శ్రేష్ఠుడగు ఆ దుర్వాసుని కాంచెను.

తం దృష్ట్వా స్థాప్య తాం భిక్షాం శుచౌ దేశే ప్రసన్నధీః,

ప్రణమ్య తమృషిం వాక్యమువాచ వ్యాధసత్తమః. 18

కాంచి ఆ భిక్షను శుచి యైన తావున ఉంచి ప్రసన్నబుద్ధియై ప్రణమిల్లి ఆ ఋషితో ఇట్లు పలికెను.

భగవన్‌ క్షాళనం పద్భ్యాం క్రియతాం ఋషిపుంగవ,

యది త్వహమనుగ్రాహ్య స్తదేవం కర్తు మర్హసి. 19

పూజ్యుడా! ఋషివరా! కాళ్ళుకడుగుకొనుము. నన్నను గ్రహింతువేని ఇట్లు చేయదగును.

ఏవముక్తః స జిజ్ఞాసు స్తపోవీర్యం శుభం మునిః,

నదీం గన్తుం న శక్నోమి జలపాత్రం చ నాస్తిమే. 20

అత డట్లు పలుకగా ఆముని శుభ##మైన ఆతని తపోబలము నెరుగ గోరి 'ఓయీ! నేను నదికి పోజాలను. నాకడ జలపాత్రయు లేదు'.

కథం ప్రక్షాళయా మ్యాశు వ్యాధ పాదౌ మహామతే,

ఇత్యేతన్మునినా వ్యాధః శ్రుత్వా చిన్తాపరోభవత్‌,

కిం కరోమి కథం చాస్యభోజనం వై భవిష్యతి. 21

ఓ మహామతీ! నేను కాళ్ళెట్లు కడుగుకొందును? అని పలుకగా వ్యాధుడు అది విని మరల ఏమి చేయుదును? ఈతనికి భోజనము ఎట్లు అగును? అని విచారించెను.

ఏవం సంచిన్త్య మనసా గురుం స్మృత్వా విచక్షణః,

జగామ శరణం తాం తు సరితం దేవికాం సుధీః. 22

మనసులో చక్కగా ఆలోచించి ఆ వివేకి గురువును స్మరించి ఆ బుద్ధిమంతుడు ఆదేవికానదిని శరణు చొచ్చెను.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లనెను.

వ్యాధోస్మి సాపకర్మాస్మి బ్రహ్మహాస్మి సరిద్వరే,

తథాపి సంస్మృతా దేవి పాహి మాం శరణం గతమ్‌. 23

అమ్మా! నదీమతల్లీ! నేను కిరాతకుడను. పాపకర్ముడను బ్రహ్మహత్యలు చేసినవాడను. అయినను నిన్ను భావించితిని. శరణుజొచ్చిన నన్ను కాపాడుము.

దేవతాం నైవ జానామి న మన్త్రం న తథార్చనమ్‌,

గురుపాదౌ పరం ధ్యాత్వా పశ్యామి సతతం శుభే. 24

దేవత నెరుగను. మంత్రము నెరుగను. అట్లే పూజించు పద్ధతి నెరుగను. గురుపాదములను శ్రద్ధతో ధ్యానించి శుభమును గాంచుచున్నాను.

ఏవం విధస్య మే దేవి దయాం కురు సరిద్వరే,

ఋషేః క్షాళార్థ సలిలం సమీపం కురు మాచిరమ్‌. 25

ఓ పుణ్యనదీ! ఇట్టి నాయెడల దయచూపుము. ఋషి పాదములు గడుగుకొనుటకు నీటిని దగ్గరకు తెమ్ము. ఆలసింపకుము.

ఏవ ముక్త్వాథ వ్యాధేన దేవికా పాపనాశినీ,

ఆ జగామ యత స్తస్థౌ దుర్వాసాః సంశితవ్రతః. 26

ఆ బోయ అట్లు పలుకగా పాపములను నశింపజేయుదేవిక సంశితవ్రతుడగు దుర్వాసుడున్న కడకు వచ్చెను.

తస్య పాదౌ స్వయం దేవీ క్షాళయన్తీ సరిద్వరా,

జగామ హ్రాదినీ భూత్వా వ్యాధాశ్రమ సమీపతః. 27

ఆ గొప్పనది దేవిక స్వయముగా ఆ ముని పాదములను కడుగుచు వ్యాధుని ఆశ్రమముకడ హ్రాదినియై ప్రవహించెను.

తం దృష్ట్వా మహదాశ్చర్యం దుర్వాసా విస్మయం య¸°,

ప్రక్షాళ్య హస్తౌ పాదౌచ తదన్నం శ్రద్ధయాన్వితమ్‌,

బుభుజే పరమప్రీత స్తథాచమ్య విచక్షణః. 28

ఆ గొప్పవింతనుగాంచి దుర్వాసుడు అచ్చెరువందెను. కాలుసేతులు కడుగుకొని ఆచమించి శ్రద్ధతో పెట్టిన ఆ అన్నమును మిక్కిలి ప్రీతుడై భుజించెను.

తమస్థిశేషం వ్యాధం తు క్షుధా దుర్బలతాం గతమ్‌,

ఉవాచ వేదాధ్యయనం సర్వేవేదాః ససంగ్రహాః,

బ్రహ్మమిద్యా పురాణాని ప్రత్యక్షాని భవన్తు తే. 29

ఎముకలు మాత్రము మిగిలిన వాడు, ఆకలితో అల్లాడుచున్న వాడునగు ఆ బోయతో ఆ మహర్షి వేదాధ్యయనము, సంగ్రహ గ్రంథములతోకూడిన సమస్తవేదములు, బ్రహ్మవిద్యయు, పురాణములు నీకు ప్రత్యక్షము లగుగాక అని పలికెను.

ఏవం ప్రాదాద్‌ వరం తస్య దుర్వాసా నామ చాకరోత్‌,

భవాన్‌ సత్యతపా నామ ఋషి రాద్యో భవిస్యతి. 30

దుర్వాసు డిట్లాతనికి వరమొసగెను. పేరు కూడ పెట్టెను. నీవు సత్యతపుడవు, ఆది ఋషి వగుదు వని పలికెను.

ఏవం దత్తవరో వ్యాధ స్తమాహ మునిసత్తమమ్‌,

వ్యాధో భూత్వా కథం బ్రహ్మన్‌ వేదానధ్యాపయా మ్యహమ్‌. 31

ఇట్లాతడు వర మీయగా నాతడు ఆమునిశ్రేష్ఠునితో ఇట్లుపలికెను. స్వామీ! నేనుబోయజాతివాడనై వేదము నెట్లు చదివించెదను?

ఋషి రువాచ - ఋషి యిట్లనెను.

ప్రాక్శరీరం గతం తేద్య నిరాహారస్య సత్తమ,

తపోమయం శరీరం తే పృథ గ్భూతం న సంశయః. 32

ఉత్తముడా! నీ ప్రాతదేహమిపుడు పోయినది. నీవు ఆహారము కొనవైతినిగదా! ఇప్పుడు నీది తపోమయమైన శరీరము. ఇది వేఱు. సంశయము లేదు.

ప్రాగ్విజ్ఞానం గతం నాశ మిదానీం శుద్ధ మక్షరమ్‌,

విద్ధి తం శుద్ధకాయోపి తథాన్యత్తే శరీరకమ్‌,

తేన వేదాః సమం శాసై#్త్రః ప్రతిభాస్యన్తి తే మునే. 33

నీదగు ప్రాత విజ్ఞానము నశించినది. ఇప్పటినీవిజ్ఞానము శుద్ధము. అక్షరము (నశింపనిది) కావున ఓ మునీ! నీకు వేదములు శాస్త్రములతో పాటు స్పష్టముగా తెలియవచ్చును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టత్రింశోధ్యాయంః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదియెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters