Varahamahapuranam-1    Chapters   

చత్వారింశో7ధ్యాయః - నలుబదియవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

తథైవ పౌషమాసే తు అమృతం మథితం సురైః,

తత్రకూర్మో భ##వేద్దేవః స్వయమేవ జనార్దనః. 1

అట్లే పౌషమాసమున దేవతలు సముద్రమును చిలికిరి. అప్పుడు స్వయముగా జనార్దనుడే తాబేలుగా ఆయెను.

తస్యేయం తిథి రుద్దిష్టా హరే ర్వై కూర్మరూపిణః,

పుష్యమాసస్య యా శుద్దా ద్వాదశీ శుక్లపక్షతః. 2

కూర్మరూపముగల ఆ హరి నుద్దేశించి పుష్యమాస శుద్ధద్వాదశి ఏర్పడినది.

తస్యాం ప్రాగేవ సంకల్ప్య ప్రాగ్వత్‌ స్నానాదికాః క్రియాః,

నిర్వర్త్యారాధయేద్‌ రాత్ర్యా మేకాదశ్యాం జనార్దనమ్‌,

పృథజ్మన్తై ర్మునిశ్రేష్ఠ దేవదేవం జనార్దనమ్‌. 3

ఏకాదశినాటి రాత్రియే ముందుగా సంకల్పించి స్నానము మొదలగు పనులు ముందువలెనే ఆచరించి మునిశ్రేష్ఠా! వేర్వేరు మంత్రములతో దేవదేవుడగు జనార్దనుని ఆరాధింపవలయును.

ఓం కూర్మాయ పాదౌ ప్రథమం ప్రపూజ్య

నారాయణాయేతి హరేః కటించ,

సంకర్షణాయే త్యుదరం విశోకే

త్యురోభవాయేతి తథైవ కంఠమ్‌.

''ఓంకూర్మాయ నమః' అని పాదములను మొదట పూజించి ''నారాయణాయ నమః'' అని హరి నడుమును, ''సంకర్సణాయ నమః'' అని ఉదరమును, ''విశోకాయ'' ఉరోభవాయనమః'' అనికంఠమును పూజింపవలయును.

సుబాహవేత్యేవ భుజౌ శిరశ్చ,

నమో విశాలాయ రథాంగసారమ్‌. 4

ఓం నమః సుబాహవే'' యని భుజములను. 'నమో విశాలాయ'' అని శిరస్సును, చక్రమును పూజింపవలయును.

స్వనామమంత్రేణ సుగంధపుషై#్ప

ర్నానా నివేద్యై ర్వివిధైః ఫలైశ్చ,

అభ్యర్చ్యదేవం కలశం తదగ్రే

సంస్థాప్య మాల్యైః సితకంఠదామ.

తన పేరు పేర్కొనుచు, మంచివాసనగల పూవులతో పెక్కువిధములగు పండ్లతో చక్కగా పూజించి ఆతని ముందు మాలలు కట్టిన మెడగల కలశమును స్థాపించవలయును.

తం రత్న గర్భంతు పురేవకృత్వా

స్వశక్తితో హేమమయం తు దేవమ్‌,

సమన్దరం కూర్మరూపేణ కృత్వా

సంస్థాప్య తామ్రే ఘృత పూర్ణపాత్రే,

పూర్ణే ఘటస్యోపరి సంనివేశ్య

శ్వో బ్రాహ్మణాయైవ మేవంతు దద్యాత్‌. 6

తనశక్తి ననుసరించి లోపల రత్నములుగల బంగారు కలశమును ముందు వలెనే చేసి మందరపర్వతముతో కూడిన కూర్మరూపుడగు విష్ణువును నేతితో నిండిన రాగిపాత్ర యందుంచి దానిని కలశముపైనిడి మరునాడు బ్రాహ్మణున కొసగవలయును.

శ్వో బ్రాహ్మణాన్‌ భోజ్య సదక్షిణాంశ్చ

యథాశక్త్యా ప్రీణయేద్‌ దేవదేవమ్‌,

నారాయణం కూర్మరూపేణ పశ్చాత్‌

తతా స్వయం భుఞ్జీత సభృత్యవర్గః. 7

చక్కని దక్షిణలతో మరునాడు బ్రాహ్మణులకు శక్తిని బట్టి భోజనముపెట్టి కూర్మరూపముతో దేవదేవుడగు నారాయణుని తృప్తిపరుపవలయును. పిదప తన అనుచరులతో భుజింపవలయును.

ఏవం కృతే విప్ర సమస్త తాపం

వినశ్యతే నాత్ర కుర్యాద్‌ విచారమ్‌,

సంసారచక్రం తు విహాయ శుద్ధం

ప్రాప్నోతి లోకం చ హరేః పురాణమ్‌,

ప్రయాంతి పాపాని వినాశ మాశు

శ్రీమాం స్తథా జాయతే సత్యధర్మః. 8

విప్రా! ఇట్లు చేసినచో అన్నితాపములను రూపుమాసి పోవును. విచారముచేయవలదు. అట్టి సత్యధర్ముడు సంసార చక్రమును వదలివైచి నిర్మలము, సనాతనము అగు హరిలోకమును పొందును. అక్కడి కక్కడ పాపములన్నియు నశించిపోవును. వాడు శ్రీమంతుడగును.

అనేక జన్మాంతర సంచితాని

నశ్యన్తి పాపాని సరస్య భక్త్యా,

ప్రాగుక్తరూపం తు ఫలం లభేత

నారాయణ స్తుష్టి మాయాతి సద్యః. 9

భక్తితో ఇట్లు చేసిన నరుని పెక్కు తొలిజన్మముల పాపము లన్నియు పటాపంచలగును. మున్ను చెప్పిన ఫలము నతడు పొందును. వెనుపవెంటనే నారాయణుడు తుష్టిపొందును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే చత్వావింశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబదియవయధ్యాయము

Varahamahapuranam-1    Chapters