Varahamahapuranam-1    Chapters   

ఏకచత్వారింశో7ధ్యాయః - నలుబదియొకటవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు పలికెను.

ఏవం మాఘే సితే పక్షే ద్వాదశీం ధరణీభృతః

వరాహస్య శృణుష్వాద్యాం మునే పరమధార్మిక. 1

ఓ మునీ! పరమధార్మికుడా! భూమిని తాల్చిన వరాహదేవుని మొదటి ద్వాదశిని గూర్చి వినుము. అది మాఘమాసమున శుక్ల పక్షమున వచ్చును.

ప్రాగుక్తేన విధానేన సంకల్పస్నాన మేవ చ,

కృత్వా దేవం సమభ్యర్చ్య ఏకాదశ్యాం విచక్షణః. 2

మునుపు చెప్పిన పద్ధతి ప్రకారమే వివేకము కలవాడు ఏకాదశియందు సంకల్పము, స్నానము ఆచరించి దేవుని అర్చింపవలయును.

ధూపనైవేద్యగంధైశ్చ అర్చయిత్వాచ్యుతం నరః,

పశ్చాత్‌ తస్యాగ్రతః కుంభం జలపూర్ణంతు విన్యసేత్‌. 3

ధూపము, నైవేద్యము, గంధములతో అచ్యుతుని అర్చించి ఆతనిముందు నీరునింపిన కుంభమును ఉంచవలయును.

ఓం వరాహాయేతి పాదౌతు మాధవాయేతి వైకటిమ్‌,

క్షేత్రజ్ఞాయేతి జఠరం విశ్వరూపేత్యురో హరేః. 4

సర్వజ్ఞాయేతి కంఠం తు ప్రజానాం పతయే శిరః,

ప్రద్యుమ్నాయేతి భుజౌ దివ్యాస్త్రాయ సుదర్శనమ్‌,

అమృతోద్భవాయ శంఖం తు ఏష దేవార్చనే విధిః. 5

'ఓం వరాహాయనమః' అని పాదములను, 'మాధవాయనమః' అని నడుమును, 'క్షేత్రజ్ఞాయనమః' అని కడుపును, ''విశ్వరూపాయ నమః' అని హరి వక్షమును, ''సర్వజ్ఞాయనమః'' అని కంఠమును, ''ప్రజాపతయేనమః'' అని శిరస్సును, 'ప్రద్యుమ్నాయనమః' అని భుజములను, 'దివ్యాస్త్రాయనమః' అని సుదర్శనమును, అమృతోద్భవాయనమః' అని శంఖమును పూజింపవలయును. ఇది దేవార్చనయందు పద్ధతి.

ఏవ మభ్యర్చ్య మేధానీ తస్మిన్‌ కుంభేతు విన్యసేత్‌,

సౌవర్ణం రౌప్యతామ్రం వా పాత్రం విభవ శక్తితః. 6

తెలివిగలవాడు ఇట్లు అర్చించి ఆ కుంభమున తన విభవశక్తిమేరకు బంగారము తోడనో, వెండితోడనో, రాగితోడనో పాత్రము నుంచవలయును.

సర్వబీజైస్తు సంపూర్ణం స్థాపయిత్వా విచక్షణః,

తత్ర శక్త్యాతు సౌవర్ణం వారాహం కారయేద్‌ బుధః. 7

ఆ కుంభమును అన్నివిత్తనములతో నిండిన దానినిగా జేసి శక్తి ననుసరించి అందు బంగారు వరాహప్రతిమను ఉంచవలయును.

దంష్ట్రాగ్రేణద్ధృతాం పృధ్వీం సపర్వతవనద్రుమామ్‌,

మాధవం మధుహన్తారం వారాహం రూప మాస్థితమ్‌. 8

సర్వభీజభృతే పాత్రే రత్నగర్భం ఘటోపరి,

స్థాపయేత్‌ పరమం దేవం జాతరూపమయం హరిమ్‌. 9

కొండలతో, ఆడవులతో, చెట్లతో కూడిన భూమినంతటిని కోరచివరతో ఎత్తినవాడును, మధువనురక్కసుని చంపినవాడును, మాధవుడును, వరాహరూపమును తాల్చినవాడును అగు హరిని బంగారు రూపముతో చేసి ఆ బీజములన్నియు నింపిన పాత్రలపై నిలువ వలయును.

సితవస్త్రయుగచ్ఛన్నం తామ్రపాత్రం తు వై మునే,

స్థాప్యార్చయేద్‌ గన్ధపుషై#్ప ర్నైవేద్యై ర్వివిధై శ్శుభైః. 10

తెల్లని వస్త్రములజంట కప్పిన రాగిపాత్ర యందు నిలిపి గంధములతో, పూవులతో, పెక్కువిధములగు నైవేద్యములతో అర్చింపవలయును.

పుష్పమండలికాం కృత్వా జాగరం తత్ర కారయేత్‌,

ప్రాదుర్భావాన్‌ హరేస్తత్ర వాచయేద్‌ భావయేద్బుధః. 11

పూవులు రంగవల్లిని తీర్చి ఆరాత్రి అచట జాగరము చేయవలయును. హరి అవతారములను చదివింపవలయును. భావించు చుండవలయును.

ఏవం పూజాం విధాయాథ ప్రభాతే ఉదితే రవౌ,

శుచిః స్నాత్వా హరిం పూజ్య బ్రాహ్మణాయ నివేదయేత్‌. 12

ఈ విధముగా నియమమును పూర్తిచేసి తెల్లవారినపిదప సూర్యుడుదయించు సమయమున స్నానము చేసి శుచియై హరిని పూజించి ఆ పాత్రను ఉత్తమ బ్రామ్మణునకు సమర్పింప వలయును.

వేదవేదాంగవిదుషే సాధువృత్తాయ ధీమతే,

విష్ణు భక్తాయ విప్రర్షే విశేషేణ ప్రదాపయేత్‌. 13

వేదములను, వేదాంగములను ఎరిగినవాడు, మంచి నడవడి కలవాడు, బుద్ధిమంతుడు, విష్ణుభక్తుడునగు విప్రర్షికి విశేషముగా అర్పింపవలయును.

దేవం సకుంభం తం దత్వా హరిం వారాహరూపిణమ్‌,

బ్రాహ్మణాయ భ##వేద్‌ యద్ధి ఫలం తన్మే నిశామయ. 14

వరాహ ప్రతిమరూపముననున్న హరిదేవుని కుంభముతో పాటు బ్రహ్మణునకు దానమిచ్చిన కలుగు ఫలమేమో చెప్పెదను వినుము.

ఇహ జన్మని సౌభాగ్యం శ్రీః కాన్తి స్తుష్టి రేవచ,

దరిద్రో విత్తవాన్‌ సద్యః అపుత్రో లభ##తే సుతమ్‌,

అలక్ష్మీర్నశ్యతే సద్యో లక్ష్మీః సంవిశ##తే క్షణాత్‌. 15

ఈ జన్మము నందతనికి సౌభాగ్యము, సంపద, కాంతి, తుష్టి కలుగును. దరిద్రుడు ధనవంతుడగును. కొడుకులు లేనివాడుకుమారుని పొందును. దరిద్ర దేవత వెనువెంటనే నశించును. లక్ష్మి అప్పటికప్పుడు వచ్చి చేరును.

ఇహజన్మనిసౌభాగ్యం పరలోకే నిశామయ,

అస్మిన్నర్థే పురావృత్త మితిహాసం పురాతనమ్‌. 16

ఈ జన్మమునందు పరలోకమునందును కలుగు సౌభాగ్యమును గూర్చి ప్రాతకాలపు కథ యొకటి కలదు. వినుము.

ఇహ లోకేభవద్‌ రాజా వీరధన్వేతి విశ్రుతః,

స కదాచిద్‌ వనం ప్రాయాన్‌ మృగహేతోః పరంతపః. 17

ఈ లోకమున పూర్వము వీరధన్వుడను రాజుండెడివాడు. ఆ మహావీరుడొకనాడు వేటకొరకు అడవి కరిగెను.

వ్యాపాదయన్‌ మృగగణాన్‌ తత్రర్షివనమధ్యగః,

జఘాన మృగరూపాన్‌ సోజ్ఞానతో బ్రాహ్మణాన్‌నృపః. 18

ఆ అడవియందు మృగముల గుంపులను చంపుచు, అడవినడుమ తిరుగుచు, మృగరూపమున నున్న బ్రాహ్మణులను తెలియక ఆరాజు చంపెను.

భ్రాతర స్తత్ర ఞ్చా శన్మృతరూపేణ సంస్థితాః,

సంవర్తస్య సుతా బ్రహ్మన్‌ వేదాధ్యయనతత్పరాః. 19

అట్లు మృగరూపమున నున్నవారు సంవర్తుడను వాని పుత్రులు, అన్నదమ్ములు, ఏబదిమంది వేదాధ్యయనము నందు నిష్ఠ కలవారు.

సత్యతపా ఉవాచ - సత్యతపుడిట్లు పలికెను

కారణం కిం సమాశ్రిత్య తే చక్రు ర్మృగరూపతామ్‌,

ఏతన్మే కౌతుకం బ్రహ్మన్‌ ప్రణతస్య ప్రసీద మే. 20

మహర్షీ! వారేకారణమున మృగరూపమును ధరించిరి? ఇది వినుటకు వేడుక కలదు. మ్రొక్కెదను. నాకు దానిని వినిపింపుము.

దుర్వాసా ఉవాచ - దుర్వాసుడిట్లనెను.

తే కదాచిద్‌ వనం యాతా దృష్ట్వా హరిణపోతకాన్‌,

ఏకైకం జగృహుస్తే హి తే మృతాః స్కంధసంస్థితాః. 21

వారొకప్పుడు అడవి కరిగిరి. పుట్టినంతనే తల్లిని కోల్పోయిన లేడిపిల్లలను చూచి ఒక్కొక్కరొక్కొక్క దానిని గ్రహించిరి. బుజముపై నిలుపుకొనగా అవి చనిపోయెను.

తతస్తే దుఃఖితాః సర్వే యయుః పితర మన్తికమ్‌,

ఊచుశ్చ వచనం చేదం మృగహింసామృతే మునే. 22

అంతవారందరు దుఃఖితులై తండ్రికడకరిగి మృగహింస చేయనివారు కనుక ఇట్లు పలికిరి.

ఋషిపుత్రకా ఊచుః - ఋషికుమారు లిట్లనిరి.

జాతమాత్రా మృగాః పఞ్చ అస్మాభి ర్నిహతా మునే,

అకామత స్తతో7స్మాకం ప్రాయశ్చిత్తం విధీయతామ్‌. 23

మహర్షీ! అప్పుడే పుట్టిన అయిదు లేడిపిల్లలు మావలన మా నిమిత్తము లేకయే చనిపోయినవి. అందువలన మాకు ప్రాయశ్చితమును విధింపుము.

సంవర్తువాచ - సంవర్తుడిట్లనెను.

మత్పితా హింసక స్త్వాసీ దహం తస్మా ద్విశేషతః,

భవన్తః పాపకర్మాణః సంజాతా మమ పుత్రకాః. 24

నాతండ్రి హింసచేసినవాడు. నేనంతకంటెను పాపాత్ముడను. కనుక పాపకర్ములైన మీరు నాకు పుత్రకులై పుట్టిరి.

ఇదానీం మృగచర్మాణి పరిధాయ యతవ్రతాః,

చరధ్వం పఞ్చవర్షాణి తతః శుద్ధా భవిష్యథ. 25

ఇప్పుడు మృగచర్మములు ధరించి నియమజీవితము గడపుచు అయిదేండ్లు తిరుగుడు. మీరు శుద్ధు లగుదురు.

ఏవముక్తాస్తు తే పుత్రా మృగచర్మోపవీతినః,

వనం వివిశు రవ్వగ్రా జపన్తో బ్రహ్మ శాశ్వతమ్‌. 26

తండ్రి యిట్లు పలుకగా ఆ కొడుకులు మృగచర్మము ధరించి ఏకాగ్రచిత్తముతో శాశ్వతమగు బ్రహ్మమును జపించుచు అడవిలోనికి ప్రవేశించిరి.

తథా వర్షే వ్యతిక్రాన్తే వీరధన్వా మహీపతిః,

తత్రాజగామ యస్మింన్తే చరన్తి మృగరూపిణః. 27

అట్లు ఒక యేడుగడువగా వీరధన్వమహారాజు వారు లేడిరూపములతో తిరుగు వనమునకు వచ్చెను.

తే చాప్యేక తరో ర్మూలే మృగచర్మోపవీతినః,

జపన్తః సంస్థితా స్తే హి రాజ్ఞా దృష్ట్వా మృగా ఇతి,

మత్వా విద్ధాస్తు యుగప న్మృతాస్తే బ్రహ్మవాదినః. 28

ఒక చెట్టుమొదట మృగచర్మములను ధరించి జపము చేసికొనుచున్న వారిని గాంచి ఆతడు మృగములే యనుకొని కొట్టగా ఆ వేద పారాయణము చేయువారు ఒక్కమారుగా మృతిచెందిరి.

తాన్‌దృష్ట్వా తు మృతాన్‌ రాజా బ్రాహ్మణాన్‌ సంశితవ్రతాన్‌

భ##యేన వేపమానస్తు దేవరాతాశ్రమం య¸°,

తత్రా పృచ్ఛద్‌ బ్రహ్మవధ్యా మమాయాతా మహామునే. 29

చక్కని వ్రతములుగల ఆ బ్రాహ్మణులను మరణించిన వారిని-చూచి ఆ రాజు భయముతో వణకిపోవుచు దేవరాతుని ఆశ్రమమున కరిగెను. ఓ మహామునీ! నాకు బ్రహ్మహత్యా పాతకము కలిగినదని పలికెను.

ఆమూలం తద్‌ వధం వృత్తం కథయిత్వా నరాధిపః,

భృశం శోకపరీతాత్మా రురోద భృశదుఃఖితః, 30

ఆ వధ వృత్తాంతము మొదటినుండియు చెప్పి ఆరాజు పరమశోకము పైకొనగా పెద్దపెట్టున ఏడ్చెను.

స ఋషి ర్దేవరాతస్తు రుదన్తం నృపసత్తమమ్‌,

ఉవాచ మాభై ర్నృపతే అపనేష్యామి పాతకమ్‌. 31

ఆ దేవరాతమహర్షి అట్లు విలపించుచున్న రాజవరుని గాంచి రాజా! భయపడకుము. నీ పాతకమును నేతు తొలగింతును.

పాతాలే సుతలాఖ్యే చ యథా ధాత్రీ నిమజ్జతీ,

ఉద్ధృతా దేవదేవేన విష్ణునా క్రోడమూర్తినా. 32

సుతలమను పాతాళమున భూధేవి మునిగి పోయినపుడు దేవుడగు విష్ణువు వరాహరూపము తాల్చి పైకెత్తినట్లు నిన్ను ఉద్ధరించెను.

తద్వద్‌ భవన్తం రాజేన్ద్ర బ్రహ్మవధ్యా పరిప్లుతమ్‌,

ఉద్ధరిష్యతి దేవో7 సౌ స్వయమేవ జనార్దనః. 33

బ్రహ్మహత్యపాపము చుట్టుకొన్న నిన్ను ఆజనార్దనదేవుడే స్వయముగా ఉద్ధరించును.

ఏవముక్తస్తతో రాజా హర్షితో వాక్య మబ్రవీత్‌,

కతరేణ ప్రకారేణ స మే దేవః ప్రసీదతి,

ప్రసన్నే చాశుభం సర్వం యేన నశ్యతి సత్తమ. 34

ముని యిట్లు పలుకగా ఆరాజు సంతోషించి, ఏవిధముగా ఆదేవడు నాయెడ ప్రసన్నుడగును.? ప్రసన్నుడై నాపాపము నెట్లు రూపుమాపును? అని అడిగెను.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లనెను.

ఏవముక్తో మునిస్తేన దేవరాత ఇమంవ్రతమ్‌,

ఆచఖ్యౌ సో7పి తంకృత్వా భుక్త్వా భోగాన్‌ సుపుష్కలాన్‌. 35

మృత్యుకాలే మునిశ్రేష్ఠ సౌవర్ణేన విరాజతా,

విమానే నాగమత్‌ స్వర్గ మిన్ద్రలోకం సపార్థివః. 36

అతడట్లు పలుకగా ఆ దేవరాతుడతనికీ వ్రతమును పదేశించెను. ఆతడును దానిని చక్కగా నొనరించి పుష్కలములైన భోగముల ననుభవించి అంత్యకాలమున బంగారు విమానముతో ఇంద్రలోకమగు స్వర్గమున కరిగెను.

తస్యేన్ద్ర స్త్వర్ఘ్య మాదాయ ప్రత్యుత్థానేన నిర్య¸°,

ఆయాన్త మిన్ద్రం దృష్ట్వాతు తమూచుర్విష్ణు కింకరాః,

న ద్రష్టవ్యో దేవరాజ స్త్వద్ధీన స్తపసా ఇతి. 37

ఆర్ఘ్యమును గొని దేవరాజు ఆతనికి ఎదురుగా వెడలెను. అట్లువచ్చుచున్న ఇంద్రుని చూచి విష్ణుకింకరులు - దేవరాజు నిన్ను చూడరాదు. నీకంటె అతడు తక్కువతపస్సు కలవాడు- అనిరి.

ఏవం సర్వే లోకపాలా నిర్యయు స్తస్య తేజసా,

ప్రత్యాఖ్యాతా శ్చ తైర్విష్ణు కింకరై ర్హీనకర్మణః,

ఏవం స సత్యలోకాంతం గతో రాజా మహామునే. 38

ఇట్లే లోకపాలు రందరు ఆతని కెదురుగా అరిగిరి. వారినందరిని విష్ణుకింకరులు మీరందరు హీనకర్ములని కాదనిరి, ఇట్లతడు సత్యలోకముతుది వరకు వెడలెను.

అపునర్మారకే లోకే దాహ ప్రలయ వర్జితే,

అద్యాపి తిష్ఠతే దేవైః స్తూయమానో మహానృపః,

ప్రసన్నే యజ్ఞపురుషే కిం చిత్రం యేన తద్భవేత్‌. 39

మరల మరణము లేనిది దాహము ప్రళయము దాపురింపనిది అగులోకమున ఆ మహారాజు దేవతలు కొనియాడుచుండగా ఈనాటికిని నిలిచియున్నాడు. యజ్ఞపురుషుడు ప్రసన్నుడు కాగా ఆతడు అట్టిస్థితి పొందుటలో వింతయేమి?

ఇహ జన్మని సౌభాగ్యమాయు రారోగ్యసంపదః,

ఏకైకా విధినోపాస్తా దదాత్యమృతముత్తమమ్‌. 40

విధిననుసరించి చేసిన ఒక్కొక్క వ్రతము కూడ ఈ జన్మమున సౌభాగ్యము, ఆయువు, ఆరోగ్యము, సంపద అనువానిని, పరమున ఉత్తమమగు అమృతస్థితిని ఒసగును.

కిం పునర్వర్షసంపూర్ణే స దదాతి స్వకం సదమ్‌,

నారాయణ శ్చతుర్మూర్తిః పరార్ధ్యం చ న సంశయః. 41

నిండు సంవత్సరము పూర్తియైనచో నాలుగు రూపములు కల నారాయణుడు తన పదము నొసగుననుటలో సందేహమేమి కలదు?

యధైవోద్ధృతవాన్‌ వేదాన్‌ మత్య్సరూపేణ కేశవః,

క్షీరాంబుధౌ మథ్యమానే మందరం ధృతవాన్‌ ప్రభుః

తద్వచ్చ కూర్మరూపాఖ్యా ద్వితీయా పశ్చవైష్ణవీ. 42

ఆకేశవుడు పాలసముద్రము చిలుకునపుడు చేప రూపుతాల్చి వేదములను పైకి తెచ్చెను. అట్లే ఈ తాబేటి రూపము రెండవ విష్ణుస్వరూపము.

యథా సరాతలాత్‌ క్ష్మాంచ ధృతవాన్‌ పురుషోత్తమః,

వరాహరూపీ తద్వచ్చ తృతీయా పశ్చవైష్ణవీ. 43

ఆ పురుషోత్తముడు వరాహరూపము తాల్చి భూమిని పైకెత్తెను. అదిమూడవ వైష్ణవరూపము.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకచత్వారింశో7ధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమును భగవచ్చాస్త్రమున నలుబది యొకటవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters