Varahamahapuranam-1    Chapters   

పంచచత్వారింశోధ్యాయః - నలుబది యైదవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసుడిట్లు పలికెను.

జ్యేష్ఠమాసే7 ప్యేవ మేవ సంకల్ప్య విధినా వరః,

అర్చయేత్‌ పరమం దేవం పుషై#్ప: ర్నానావిధైః శుబైః. 1

మానవుడు జ్యేష్ఠమాసమునందు ఇట్లే సంకల్పించి రానానిధైః శుభైః 1

మానవుడు జ్యేష్ట మాసమునందును ఇట్లే సంకల్పించి పరమదేవుని పెక్కు తీరులగు పూవులతో అర్చింప వలయును.

నమో రామాభిరామయ పాదౌ పూర్వం సమర్చయేత్‌,

త్రివిక్రమాయేతి కటిం ధృతవిశ్వాయ చోదరమ్‌. 2

ఉరః సంవత్సరాయేతి కంఠం సంవర్తకాయ చ '

సర్వాస్త్రధారిణ బహూ స్వనామ్నాబ్జరంథాంగకే. 3

సహస్ర శిరసే7 భ్యర్చ్య శిరస్తస్య మహాత్మనః.

ఏవమభ్యర్చ్య విధివత్‌ ప్రాగుక్తం కుంభం విన్యసేత్‌. 4

'ఓం నమో రామాభిరామాయ' అని పాదములను ముందుగా పూజింప వలయును. 'త్రివిక్రమాయనమః' అని కటిని, 'ధృతవిశ్వాయనమః' అని ఉదరమును, 'సంవత్సరాయనమః' అని రొమ్మును, 'సంవర్తకాయ నమః' అని కంఠమును, 'సర్వాస్త్రధారిణ నమః' అని బాహువులను, వాని పేరులతో శంఖచక్రములను, 'సహస్రశిరసే నమః' అని ఆ మహాత్ముని శిరస్సును పూజింప వలయును. పిదప మునుపటి వలెనే కుంభమును నిలుప వలయును.

ప్రాగ్వద్‌ వస్త్రయుగచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ,

అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ,

దాతవ్యౌ మనసా కామ మిహతా పురుషేణ తు. 5

ఏదేని కోరిక గల పురుషుడు మునుపటి వలెనే జమిలి వస్త్రముతో చుట్టిన బంగారపు రామలక్ష్మణుల ప్రతిమలను విధానము ప్రకారము అర్చించి మరునాటి ప్రభాతమున బ్రాహ్మణునకు మనః పూర్వకముగా దాన మివలెను.

అపుత్రేణ పురా పృష్టో రాజ్ఞా దశరథేన చ,

పుత్రకామపరః పశ్చాద్‌ వసిష్ఠః పరమార్చితః. 6

మునుపు పుత్రులు లేని దశరథ మహారాజు వసిష్ఠ మహర్షిని చక్కగా పూజించి సంతానుముగూర్చి అడిగెను.

ఇద మేవ విధానం తు కథయామాస సద్విజః,

ప్రాగ్రహస్యం విదిత్వా తు సరాజా కృతవా నిదమ్‌. 7

ఆ బ్రాహ్మణుడు పూర్వకాలపు రహస్యము నెరిగి ఆదశరథున కిదియే విధానము నుపదేశించెను.

తస్య పుత్రః స్వయం జజ్ఞే రామనామా సుతో బలీ,

చతుర్థా సో వ్యయో విష్ణుః పరితుష్టో మహామునే,

ఏతదైహిక మాఖ్యాతం పారత్రిక మతః శృణు. 8

ఆతనికి ఆ విష్ణువు స్వయముగా రాముడను పేరు, మహాబలము గల పుత్రుడై జన్మించెను. అవ్యయుడగు విష్ణువు మిక్కిలి సంతోషము చెంది ఆ మహారాజునకు నాలుగు రూపములతో పుట్టెను. ఇది ఇహలోకవిషయము నీకు చెప్పితిని. పరవలోక విషయమునకు ఇటుపై చెప్పెదను వినుము.

తావద్‌ భోగాన్‌ భుఞ్జ తే స్వర్గ సంస్థో

యావదిన్ద్రా దశ చ ద్విద్విసంఖ్యా,

అతీతకాలే పున రేత్య మర్త్యో

భవతే రాజా శతయజ్ఞయాజీ,

నశ్యన్తి పాపాని చ తస్య పుంసః

ప్రాప్నోతి నిర్వాణమలం చ శాశ్వతమ్‌. 9

పదునలుగురు ఇంద్రుల జీవిత కాలము స్వర్గమున నున్నవాడై భోగముల ననుభవించును. ముగిసిన తరువాత మరల మనుజుడై నూరు యజ్ఞములు చేయు మహారాజగును. అట్టి పురుషునికి సర్వ పాపములు నశించును. సంపూర్ణము, శాశ్వతము నగు నిర్వాణమును పొందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పంచచత్వారింశో ధ్యాయః.

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది యైదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters