Varahamahapuranam-1    Chapters   

షట్చిత్వారింవో ధ్యాయః - నలుబది యారవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు పలికెను.

ఆషాఢే ప్యేవమేవంతు సంకల్ప్య విధినా నరః,

అర్చయేత్‌ పరమం దేవం గన్ధపుషై#్ప రనేకశః. 1

మనుజుడు ఆషాఢమాసమునందును ఇట్లే సంకల్పించి విధి పూర్వకముగా ఆ పరమ దైవమును గంధ పుష్పములతో పెక్కు విధములుగా పూజింప వలయును.

వాసుదేవాయ పాదౌతు కటిం సంకర్షణాయ చ,

ప్రద్యుమ్నాయేతి జఠర మనిరుద్థాయ వై ఉరః. 2

చక్రపాణయ ఇతి భుజౌ కంఠం భూపతయే తథా,

స్వనామ్నా శఙ్ఖ చక్రౌ తు పురుషాయేతి వై శిరః. 3

'ఓం నమో వాసుదేవాయ' అని పాదములను, సంకర్షణాయ నమః అని నడుమును, 'ప్రద్యుమ్నాయ నమః' అని కడుపును, 'అనిరుద్ధాయ నమః' అని రొమ్మును, 'చక్రపాణయే నమః' అని భుములను, 'భూపతయే నమః' అని కంఠమును, వానిపేరులతో శంఖ చక్రములను (నమః పాంచజన్యాయ, నమః సుదర్శనాయ అని) 'నమః పురుషాయ' అని శిరస్సును పూజింప వలయును.

ఏవ మభ్యర్చ్య మేధావీ ప్రాగ్వత్తస్యాగ్రతో ఘటమ్‌,

విన్యస్య వస్త్ర సంయుక్తం తస్యోపరి తతో న్యసేత్‌,

కాఞ్చనం వాసుదేవం తు చతుర్వ్యాహం సనాతనమ్‌. 4

బుద్ధిశాలియగు నరుడు ఇట్లర్చించి మునుపటి వలెనే వస్త్రములు చుట్టిన ఘటమును నిలుప వలయును. దానిపై నాలుగు వ్యూహములు గల సనాతనుడగు వాసుదేవుని బంగారు ప్రతిమను నిలుప వలయును.

తమభ్యర్చ్య విధానేన గన్థపుష్పాదిభిః క్రమాత్‌,

ప్రాగ్వత్‌ తం బ్రాహ్మణ దద్యాద్‌ వేదవాదిని సువ్రతే,

ఏవం నియమయుక్తస్య యత్పుణ్యం తచ్ఛ్రుణుష్వ మే. 5

విధి ననుసరించి గంధపుష్పాదులతో క్రమముగా దేవుని అర్చించి, వేదము నధ్యయనము చేయువాడు, చక్కని నియముములు గలవాడును అగు బ్రాహ్మణునకు దానిని దాన మీవలెను. ఇట్లు నియమములతో కూడినవాడు పొందు పుణ్యమెట్టిదో తెలిపెదను వినుము.

వసుదేవో భవద్‌ రాఆ యదు వంశ వివర్ధనః,

దేవకీ తస్య భార్యాతు సమానవ్రత ధారిణీ. 6

యదువంశమును పెంపొందించెడు వసుదేవుడను రాజుండెడి వాడు. అతని భార్య దేవకి. ఆమెయు నతనితో సమానముగ వ్రతముల నాచరించు నట్టిది.

సా త్వపుత్రా భవత్‌ సాధ్వీ పతిధర్మ పరాయణా,

తస్య కాలేన మహతా నారదోభ్యగమద్‌ గృహమ్‌. 7

పతి ధర్మమున శ్రద్ధ కలదియు, పతివ్రతయు నగు ఆ దేవకి సంతానము లేనిదాయెను. పెద్ద కాలము గడచిన పిదప ఆ వసుదేవునింటికి నారదుడు వచ్చెను.

పూజితో వసుదేవేన భక్త్యా సౌ వాక్య మబ్రవీత్‌,

వసుదేవ శృణుష్వ త్వం దేవకార్యం మమానఘ,

శ్రుత్వైతాం చ కథాం శీఘ్ర మాగతోస్మి తవాన్తికమ్‌. 8

వసుదేవు డతనిని భక్తితో పూజింపగా నారదు డిట్లనెను. వసుదేవా! నాకొక దేవకార్యము కలదు. వినుము. ఈ కథను విని నేను త్వరగా నీ కడకు వచ్చితిని.

పృథివీ దేవసమితౌ మయా దృష్టా యదూత్తమ,

గత్వా చ జల్పతీ భారం నశక్తా ఊహితుం సురాః. 9

యదువరా! దేవతల సభలో నేను భూదేవిని చూచితిని. దేవతలారా! నేనీ భారమును మోయజాలకున్నాను అని పల్కుచున్నది.

సౌభ కంస జరాసంధాః పున ర్నరక ఏవ చ,

కురు పాంచాల భోజాశ్చ బలినో దానవాః సురాః,

పీడయన్తి సమేతా మాం తాన్‌ హనధ్వం సురోత్తమాః. 10

దేవతోత్తములారా! సౌభుడు, కంసుడు, జరాసంధుడు, మరియు నరకుడు, కురువులు, పాంచాలురు, భోజులు, ఇంకను బలవంతులయిన దానవులు అందరు కూడి నన్ను పీడించు చున్నారు. వారిని చంపుడు.

ఏవ ముక్తాః పృథివ్యా తే దేవా నారాయణం గతాః,

మనసా సచ దేవేశః ప్రత్యక్ష స్తత్‌ క్షణాత్‌ బభౌ. 11

పృథివి యిట్లు పలుకగా ఆ దేవతలందరు మనసులో నారాయణుని భావించిరి. ఆ దేవదేవుడు తత్‌ క్షనమున అచట ప్రత్యక్ష మాయెను.

ఉవాచ స సురశ్రేష్ఠః స్వయం కార్య మిదం సురాః,

సాధయామి న సందేహో మర్త్యం గత్వా మనుష్యవత్‌. 12

దేవతల పెద్ద ఆ విష్ణువు ఇట్లు పలికెను : దేవతలారా! ఈ పనిని నేను మనుష్యునివలె మర్త్య లోకమున కరిగి స్వయముగా సాధింతును.

కిం త్వాషాఢే శుక్లపక్షే యా నారీ సహ భర్తృణా,

ఉపోష్యతి మనుష్యేషు తస్యా గర్భే భవామ్యహమ్‌. 13

మరియ, ఆషాఢమాసమున శుక్ల పక్షమున భర్తతోపాటు ఉపవాసమున్న మానవ స్త్రీ కడుపున నేను జన్మింతును.

ఏవ ముక్త్వా గతో దేవః స్వయం చాహ మిహాగతః,

ఉపదిష్టం తు భవతో అపుత్రస్య విశేషతః,

ఉపోష్య లభ##సే పుత్రం సహభార్యో న సంశయః. 14

ఇట్లని దేవుడు వెడలి పోయెను. నేను స్వయముగా నిటు వచ్చితిని. పుత్రులు లేని నీకిది తెలియ జెప్పితిని. నీవు భార్యతో పాటు ఉపవాస ముండి పుత్రుని పొందెదవు. సంశయము లేదు.

ఏతాం చ ద్వాదశీం కృత్వా వసుదేవ స్తథాప్తవాన్‌,

మహతీం చశ్రియం ప్రాప్తః పుత్రపౌత్ర సమన్వితః. 15

వసుదేవుడు ఇట్లు ఈ ద్వాదశీ వ్రతమును చేసి కుమారుని పొందెను. గొప్ప సంపదను, పుత్రులతో, పౌత్రులతో కూడిన వాడై, పొందెను.

భుక్త్వా రాజ్యశ్రియం సోథ గతః పరమికాం గతిమ్‌,

ఏష తే విధి రుద్దిష్టం ఆషాఢే మాసి వై మునే. 16

రాజ్యసంపద ననుభవించి తుది కతడు పరమగతి నందెను. మునీ! ఆషాఢ మాసము నందలి విధిని నీకు తెలిపితిని.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే షట్చత్వారింశోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది యారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters