Varahamahapuranam-1    Chapters   

ఏకపఞ్చాశోధ్యాయః - ఏబది యొకటవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

శ్రుత్వా దుర్వాససో వాక్యం ధరణీవ్రత ముత్తమమ్‌,

య¸° సత్యతపాః సద్యోహిమవత్పార్మ్వ ముత్తమమ్‌. 1

ధరణీ వ్రతమును గూర్చిన ఉత్తమమగు వాక్యమును దుర్వాసుని వలన విని సత్యతపుడు హిమవత్పర్వతము ప్రక్క భాగమునకు వెంటనే అరిగెను.

పుష్పభద్రా నదీ యత్ర శిలా చిత్రశిలా తథా,

వటో భద్రవటో యత్ర తత్ర తస్యాశ్రమో బభౌ.

పుష్పభద్ర, యనునదియు, చిత్రశిలయను శిలయు, భద్రపటమను మఱ్ఱిచెట్టును గల ఆతావునందు అతని ఆశ్రమము విరాజిల్లెను.

తత్రోపరి మహత్‌ తస్య చరితం సంభవిష్యతి. 2

అందాతని ఉదాత్తచరిత్రము సంభవించును.

ధరణ్యువాచ - దరణి పలికెను.

బహుకల్పసహస్రాణి వ్రతస్యాస్య సనాతన,

మయా కృతస్య తపస స్తన్మయా విస్మృతం ప్రభో. 3

ఓయి సనాతనా! నేనీ వ్రతము నాచరించి పెక్కువేల కల్పములయినది. ఈ తపస్సును గూర్చి, ప్రభూ! నేను మరచితిని.

ఇదానీం త్వత్ప్రసాదేన స్మరణం ప్రాక్తనం మమ,

జాతం జాతిస్మరా చాస్మి విశోకా పరమేశ్వర. 4

ఇప్పుడు నీ అనుగ్రహమున ఆ ప్రాత విషయము గుర్తునకు వచ్చినది. పూర్వజన్మస్మరణము కలిగినది. పరమేశ్వరా! నా దుఃఖము నశించినది.

యది నామ పరం దేవ కౌతుకం హృది వర్తతే,

అగస్త్యః పున రాగత్య భద్రాశ్వస్య నివేశనమ్‌,

యచ్చకార స రాజా చ తన్మమాచక్ష్వ భూధర. 5

ప్రభూ! నీ హృదయమున నాయందు ప్రీతియున్నచో అగస్త్యుడు మరల భద్రాశ్వుని మందిరమునకు వచ్చి యేమి చేసెనో, ఆ రాజేమి యొనరించెనో నాకు తెలియజెప్పుము.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు చెప్పెను.

ప్రత్యాగత మృషిం దృష్ట్వా భద్రాశ్వః శ్వేతవాహనః,

వరాసనగతం దృష్ట్వా కృత్వా పూజాం విశేషతః,

అపృచ్ఛన్మోక్ష ధర్మాఖ్యం ప్రశ్నం సకలధారిణి. 6

తిరిగి వచ్చి శ్రేష్ఠమగు ఆసనమున కూర్చున్న ఆ అగస్త్య మహర్షిని చూచి విశేషముగా పూజ యొనర్చి మోక్షధర్మమను ప్రశ్నను అడిగెను.

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లు పలికెను.

భగవన్‌ కర్మణా కేన ఛిద్యతే భవసంసృతిః,

కిం వా కృత్వా నశోచన్తి మూర్తామూర్తోపపత్తిషు. 7

మహానుభావా! ఏ కర్మముతో సంసారబంధము తెగిపోవును? ఆకారముకలవి లేనివి అనువాని విషయమున మానవు లేమి చేసి శోకింపకుండుదురు?

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు పలికెను.

శృణు రాజన్‌ కథాం దివ్యాం దూరాసన్నవ్యవస్థితామ్‌,

దృశ్యాదృశ్య విభాగోత్థాం సమాహితమనా నృప. 8

రాజా! దూరముగా నున్నది మరియు దగ్గరగానుండునది, కన్నట్టునట్టిది, కన్పడనిది అను విభాగముల కలదియు నగు ఒక దివ్య కథకలదు. వినుము.

నాహో న రాత్రి ర్న దిశోదిశశ్చ

న ద్యౌ ర్న దేవా న దినంన సూర్యః,

తస్మిన్‌ కాలే పశుపాలేతి రాజా

స పాలయామాస పశూ ననేకాన్‌. 9

అది పగలు కాదు. రాత్రియు కాదు. దిక్కులు కావు. దిక్కులు కానివియుకావు. అది ఆకాశము కాదు. వారు దేవతలు కారు. అది దినము కాదు. సూర్యుడును కాదు. అట్టి కాలమున పశుపాలుడను రాజు పెక్కుపశువులను పాలించుచుండెను.

తాన్‌ పాలయన్‌ స కదాచిద్‌ దిదృక్షుః

పూర్వం సముద్రం స జగామ తూర్ణమ్‌,

అనంత పారస్య మహోదధేస్తు

తీరే వనం తత్ర వసన్తి సర్పాః. 10

వానిని పాలించుచు అతడొకనాడు తూర్పుసముద్రమును చూడగోరినవాడై వడివడిగా నచటి కరిగెను. అంతులేని ఒడ్డుగల ఆ మహాసముద్రము తీరమున ఒక వనము కలదు. అందు పాములు నివసించుచున్నవి.

అష్టౌ ద్రుమాః కామవహా నదీ చ

తిర్యక్‌ చోర్ధ్వం బభ్రము స్తత్ర చాన్యే,

పఞ్చ ప్రధానాః పురుషా స్తథైకాం

స్త్రియం బిభ్రతే తేజసా దీప్యమానామ్‌. 11

ఎనిమిది వృక్షములు, కామవహ అనునదియు అడ్డముగా పైకిని, వ్యాపించుచు నచట ఉన్నవి. గొప్ప తేజస్సుతో వెలిగిపోవు చున్న ఒక స్త్రీని అయిదుగురు ప్రధాన పురుషులు పట్టుకొని యున్నారు.

సాపి స్త్రీ స్వే వక్షసి ధారయన్తీ

సహస్ర సూర్యప్రతిమం విశాలమ్‌,

తస్యాధర స్త్రి వికార స్త్రి వర్ణ -

స్తం రాజానం పశ్య పరిభ్రమన్తమ్‌. 12

ఆ యింతియు వేయి సూర్యులకు సమానమైన పెద్దరత్నమున తన ఎడదపై దరించి యున్నది. ఆమె క్రింది పెదవి మూడువికారములు, మూడు వర్ణములు కలదియై యున్నది. అటునిటు తిరుగుచున్న ఆ రాజును చూడు.

తూష్ణీంభూతా మృతకల్పా ఇవాసన్‌

నృపోప్యసౌ తద్వనం సంవిశేశ,

తస్మిన్‌ ప్రవిష్టే సర్వ ఏతే వివిశు-

ర్భయాదైక్యం గతవన్తః క్షణన. 13

తక్కినవారందరు మిన్నక చచ్చినవారివలె ఉన్నారు. ఈ రాజు అట్టి వనమున ప్రవేశించెను. అతడు ప్రవేశింపగా ఒక్క క్షణమున అందరు భయమువలన ఒక్కరుగానై ఆ వనమును ప్రవేశించిరి.

తైః సర్పై స నృపో దుర్వినీతైః

సంవేష్టితో దస్యుభి శ్చిన్తయానః,

కథం చైతేన భవిష్యన్తి యేన

కథం చైతే సంసృతాః సంభ##వేయుః. 14

మిక్కిలి చెడ్డవియగు ఆ పాములు, క్రూరులు చుట్టు ముట్టగా ఆ రాజు ఇట్లు చింతించుచుండెను. ఇవి ఇచట లేకుండుట యెట్లు? ఇవి యిటనుండి చెదరిపోవుట యెట్లు?

ఏవం రాజ్ఞ శ్చిన్తయతస్త్రి వర్ణః పురుషః పరః

శ్వేతం రక్తం తథాకృష్ణం త్రివర్ణం ధారయన్నరః. 15

స సంజ్ఞాం కృతవాన్‌ మహ్య మపరోథ క్వ యాస్యసి,

ఏవం తస్య బ్రువాణస్య మహన్నామ వ్యజాయత. 16

ఇట్లు ఆ రాజు చింతించుచుండగా మరియొక పురుషుడు మూడు వన్నెలు కలవాడు తెల్లని, ఎర్రని, నల్లని రంగులను దరించినవాడు కానవచ్చి నాకంటె ఇతరుడెవ్వడవు నీవు? ఎక్కడకు పోవుచున్నావు? అని సంజ్ఞ చేసెను అట్లు పలుకుచున్న ఆతనికి 'మహత్తు' అను పేరు కలిగెను.

తేనాపి రాజా సంవీతః స బుధ్యస్వేతి చాబ్రవీత్‌,

ఏవముక్తే తతః స్త్రీ తు తం రాజానం రురోధ హ. 17

ఆ పురుషుడును ఈ రాజును చుట్టుకొనగా అతడు మేల్కొనుము' అని పలికెను. అంత ఆ స్త్రీ ఆ రాజును అడ్డగించెను.

మా యాతతం తం మాభైష్టతతోన్యః పురుషోనృపమ్‌,

సంవేష్ట్య స్థితవాన్‌ వీరస్తతః సర్వేశ్వరేవ్వరః. 18

అంతనొక మహాపురుషుడు, వీరుడు సర్వేశ్వరేశ్వరుడు అతనిని చుట్టుకొని నిలిచి ఇది యంతయు మాయచే వ్యాపించినది. భయపడకు మని పలికెను.

తతోన్యే పఞ్చ పురుషా ఆగత్య నృప సత్తమమ్‌,

సంవేష్ట్య సంస్థితాః సర్వే తతో రాజా విరోధితః. 19

అంత ఇతరులు అయిదుగురు పురుషులు ఆ నృపసత్త ముని చుట్టుముట్టి నిలిచిరి. రాజుతో వారు పగపెట్టుకొని యుండిరి.

రుద్ధే రాజని తే సర్వే ఏకీ భూతాస్తు దస్యవః,

మథితుం శస్త్ర మాదాయ లీనాన్యోన్యం తతో భయాత్‌. 20

రాజునట్లు క్రమ్ముకొని యుండగా ఆ క్రూరులు అందరు ఒక్కటిగానై ఆతనిని మథించుటకై ఆయుధమును పట్టుకొని ఒకరిలో ఒకరు భయముతో కలిసికొని పోయిరి.

తై ర్లీనై ర్నృపతే ర్వేశ్మ బభౌ పరమశోభనమ్‌,

అన్యేషా మపి పాపానాం కోటిః సాగ్రా భవన్నృప. 21

ఇట్లు వారు ఒక్కటియై పారిపోగా ఆ రాజభవనము మిక్కిలి సుందరమయ్యెను. ఇతర పాపుల కోట్లు కూడ రూపుమాసి పోయినవి.

గృమే భూసలిలం వహ్నిః సుఖశీతశ్చ మారుతః,

సావకాశాని శుభ్రాణి పఞ్చైకోనగుణాని చ. 22

ఆ యింటభూమి, నీరు, నిప్పు, సుఖము చల్లనిది అగుగాలి. శుభ్రమైన అవకాశములు - అనునవి అయిదు ఒక్కొక్క గుణము తక్కువ కలవియై ఏర్పడినవి.

ఏ కైవ తేషాం సుచిరం సంవేష్ట్యా సజ్యసంస్థితా,

ఏవం స పశుపాలోసౌ కృతవా నఞ్జసా నృప. 23

అవి యున్నయు ఒక్క ఆకారముతో కూడి మాడి ఆతనిని చుట్టుకొని నిలిచినవి. ఇట్లా పశుపాలుడు దీని నంతటిని అప్పటికప్పుడు ఏర్పరచెను.

తస్య తల్లాఘవం దృష్ట్వా రూపం చ నృపతే ర్మృధే,

త్రివర్ణః పురుషో రాజ న్నబ్రవీద్‌ రాజసత్తమమ్‌. 24

యుద్ధమునందలి ఆతని ఆ చురుకుతనమును, రూపమును గాంచి మూడురంగుల పురుషుడు ఆ రాజశ్రేష్ఠునితో ఇట్లు పలికెను.

త్వత్పుత్రోస్మి మహారాజ బ్రూహి కింకరవాణి తే,

అస్మాభి ర్బన్ధు మిచ్ఛద్భి ర్భవన్తం నిశ్చయః కృతః. 25

మహారాజా! నేను నీ కుమారుడను. నీ కేమి చేయుదును? బంధుత్వము కోరెడు మేమొక నిశ్చయము చేసితిమి.

యది నామ కృతాః సర్వే వయం దేవ పరాజితాః,

ఏవ మేవ శరీరేషు లీనాస్తిష్ఠామ పార్థివ. 26

మేమందరమును, దేవా! నీచేత పరాజితులము కావింపబడినచో ఇట్లే మేము శరీరములందు కలిసి పోయి యుందుము.

మయ్యేకే త పుత్రత్వం గతే సర్వేషు సంభవః,

ఏవ ముక్త స్తతోరాజా తం నరం పున రబ్రవీత్‌. 27

నేనొక్కడను నీ పుత్రత్వమును పొందగా సర్వమునందును సృష్టి ఏర్పడును. అని అతడట్లు పలుకగా రాజు ఆ నరునితో ఇట్లు పలికెను.

పుత్రో భవతి మే కర్తా అన్యేషామపి సత్తమ,

యుష్మత్సుఖై ర్నరై ర్భావై ర్నాహం లిప్యే కదాచన. 28

నా పుత్రుడు ఇతరుల కందరికి సృష్టికర్తయగును. మీ సుఖములతో, నరులతో, భావములతో నేను మాత్రము ఎన్నటికిని తగులమందను.

ఏవముక్త్వా స నృపతి స్తమాత్మజ మథాకరోత్‌,

తై ర్విముక్తః స్వయం తేషాం మధ్యే స విరరామ హ. 29

ఇట్లు పలికి ఆ రాజు ఆతనిని తనకుమారుని గావించెను. వారిని విడనాడి తాను స్వయముగా వారినడుమ క్రీడించెను.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ఏకపఞ్చాశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబదియొకటవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters