Varahamahapuranam-1    Chapters   

ద్వాపఞ్చాశో7ధ్యాయః - ఏబది రెండవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు చెప్పెను.

స త్రివర్ణో నృపోత్సృష్టః స్వతంత్రత్వాచ్ఛ పార్థివ,

అహం నామాన మసృజత్‌ పుత్రం పుత్ర స్త్రి వర్ణకమ్‌. 1

రాజా! ఆ మూడు వన్నెల పురుషుడు, పశుపాలుని తనయుడు స్వతంత్రతవలన 'అహమ్‌' అను మూడు రంగుల కుమారుని సృజించెను.

తస్యాపి చాభవత్‌ కన్యా అవబోధ స్వరూపిణీ,

సా తు విజ్ఞానదం పుత్రం మనోహ్వం విససర్జ హ. 2

అతనికి జ్ఞానస్వరూపిణి యగు కన్య ఉదయించెను. ఆమె చక్కని మనోహరుడగు విజ్ఞానదుడను పుత్రుని కనియెను.

తస్యాపి సర్వరూపాః స్యు స్తనయాః పఞ్చభోగినః,

యథాసంఖ్యే పుత్రాస్తు తేషా మక్షాభిధానకాః. 3

ఆతనికిని అందమైన కొడుకులు అయిదుగురు అన్నింటిని అనుభవించువారు కలిగిరి. సంఖ్యల వరుసతో వారి పేర్లు 'అక్ష' శబ్ధముతో అంతమగునవి. అనగా ఏకాక్షుడు, ద్వ్యక్షుడు, త్ర్యక్షుడు, చతురక్షుడు, పంచాక్షుడు అనివారి పేర్లు.

ఏతే పూర్వం దస్యవస్స్యు స్తతో రాజ్ఞా వశీకృతాః,

అమూర్తా ఇవ తే సర్వే చక్రు రాయతనం శుభమ్‌. 4

వీరు మునుపు దొంగలు, తరువాత రాజునకు వశ##మైరి. ఆకారము లేనివారందరు శుభ##మైన నెలవును చేసికొనిరి.

నవద్వారం పురం తస్య త్వేకస్తంభం చతుష్పథమ్‌,

నదీసహస్రసంకీర్ణం జలకృత్య సమాస్థితమ్‌. 5

ఆ పురము తొమ్మిది ద్వారములు కలది. ఒక స్తంభము కలది. నాలుగుబాటలు కలది. వేలనదులు,నీటిలోనికి మెట్లు కలది.

తత్పురం తే ప్రవివిశు రేకీభూతా స్తతో నవ,

పురుషో మూర్తిమాన్‌ రాజా పశుపాలోభవత్‌ క్షణాత్‌. 6

ఆ తొమ్మిదిమంది ఒక్కటిగానై ఆ పురమును ప్రవేశించిరి. 1. ఆత్రివర్ణుడు 2. అహమ్‌ 3. అవబోధకన్య 4. విజ్ఞానదుడు 5. ఏకాక్షుడు 6. ద్వ్యక్షుడు 7. త్ర్యక్షుడు 9. పంచాక్షుడు ఈ తొమ్మిదిమంది). వారందరు కలసి ఒక్కక్షణమున ఆకారమును పొంది పశుపాలుడను రాజాయెను.

తత స్తత్పురసంస్థస్తు పశుపాలో మహానృపః,

సంసూచ్య వాచకా ఞ్ఛబ్దాన్‌ వేదాన్‌ సస్మార తత్పురే. 7

అంత నా పురమందున్న పశుపాలుడను మహారాజు తనకు వాచకములగు శబ్దములు గల వేదములను స్మరించెను.

ఆత్మస్వరూపిణో నిత్యా స్తదుక్తాని వ్రతాని చ,

నియమాన్‌ క్రతవశ్చైవ సర్వాన్‌ రాజా చకార హ. 8

తన స్వరూపములు కలవి, నిత్యములు అగు వేదములను స్మరించి అందు చెప్పబడిన వ్రతములను, నియమములను యజ్ఞములను మొదలగువాని నన్నింటిని ఆ రాజు నిర్మించెను.

స కదాచి న్నృపః ఖిన్నః కర్మకాణ్డం ప్రరోచయన్‌.

సర్వజ్ఞో యోగనిద్రాయాం స్థిత్వా పుత్రం ససర్జ హ.

ఆ రాజొకనాడు దుఃఖపడి కర్మకాండము నిష్టపడుచు సర్వమొరిగినవాడు కనుక యోగనిద్రయందుండి ఒక పుత్రుని సృజించెను.

చతుర్వక్త్రం చతుర్బాహుం చతుర్వేదం చతుష్పథమ్‌. 9

ఆ కొడుకునకు నాలుగు ముఖములు, నాలుగు బాహువులు, నాలుగు వేదములు, నాలుగు బాటలు కలవు.

తస్మాదారభ్య నృపతే ర్వశే పశ్వాదయః స్థితాః. 10

తస్మిన్‌ సముద్రే స నృపో వనే తస్మింస్త థైవ చ,

తృణాదిషు నృపసై#్సవ హస్త్యాదిషు తథైవ చ,

సమోభవత్‌ కర్మకాణ్డా దనుజ్ఞాయ మహామతే. 11

అది మొదలు కొని పశువులు మొదలైన వన్నియు ఆ రాజునకు వశ##మైనవి. అతడు కర్మకాండము నుండి వెలువడి సముద్రమునందు, వనమునందు, తృణాదుల యందు, ఏనుగు మొదలగు వానియందు సముడాయెను.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ద్వాపంచాశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది రెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters