Varahamahapuranam-1    Chapters   

ద్విషష్టితమోధ్యాయః - అరువది రెండవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

అధాపరం మహారాజ వ్రత మారోగ్య సంజ్ఞితమ్‌,

కథయామి పరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్‌. 1

మహారాజ! మిక్కిలి పుణ్యమైనది, పాపములన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియజేసెదను.

తసై#్యవ మాఘమాసస్య సప్తమ్యాం సముపోషితః,

పూజయేద్‌ భాస్కరం దేవం విష్ణురూపం సనాతనమ్‌. 2

మాఘమాసము శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కరదేవుని పూజింపవలయును.

ఆదిత్య భాస్కర రవే భానో సూర్య దివాకర,

ప్రభాకరేతి సంపూజ్య ఏవం సంపూజ్యతే రవిః. 3

ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింపవలయును.

షష్ఠ్యాం చైవ కృతాహారః సప్తమ్యాం భాను మర్చయేత్‌,

అష్టమ్యాం చైవభుంజీత ఏష ఏవ విధిక్రమః. 4

షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమినాడు భానుని పూజింప వలయును. అష్టమినాడు మరల భొజనము చేయవలయును. ఇది యిందలి విధిక్రమము.

అనేన వత్సరం పూర్ణం విధినా యోర్చయేద్‌ రవిమ్‌,

తస్యారోగ్యం ధనం ధాన్య మిహ జన్మని జాయతే,

పరత్ర చ శుభం స్థానం యద్గత్వా సనివర్తతే. 5

ఈ విధితో ఒకనిండు సంవత్సరము సూర్యునర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగున

సార్వభౌమః పురా రాజా అవరణ్యో మహాబలః,

తేనాయ మర్చితో దేవో వ్రతే నానేన పార్థివ,

తస్య తుష్టో వరం దేవః ప్రాదా దారోగ్య ముత్తమమ్‌.

మునుపు అసరణ్యుడను గొప్పబలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతనియెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమమగు ఆరోగ్యమును ప్రాసాదించెను.

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లనెను.

కిమసౌ రోగవాన్‌ రాజా యేనారోగ్య మవాప్తవాన్‌,

సార్వభౌమస్య చ కథం బ్రహ్మన్‌ రోగస్య సంభవః. 7

ఈ వ్రతముతో ఆరోగ్యమును పొందిన ఆరోగము గల రాజెవ్వడు? సార్వభౌమునకు అంతటి రోగమెట్లు కలిగినది?

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

స రాజా సార్వభౌమోభూద్‌ యశస్వీచ సురూపవాన్‌,

స కదాచిన్నృపశ్రేష్ఠో నృపశ్రేష్ఠ మహాబలః. 8

గతవాన్‌ మానసం దివ్యం సరో దేవగణాన్వితమ్‌,

తత్రా పశ్యద్‌ బృహత్‌ పద్మం సరో మధ్యగతం సితమ్‌. 9

ఆతడు సార్వభౌముడును, గొప్పకీర్తియగు మంచి రూపమును కలవాడైయుండెను. ఒకనాడా రాజశ్రేష్ఠుడు మహాబలుడు దేవగణము లతో కూడిన దియు దివ్యమును అగుమానససరోవరమున కరిగెను. అందు సరస్సునడుమ నున్న తెల్లని పెద్ద తామరపూవును చూచెను.

తం దృష్ట్వా సారథిం ప్రాహ పద్మమేతత్‌ సమానయ,

ఇదం తు శిరసా బిభ్రత్‌ సర్వలోకస్య సన్నిధౌ,

శ్లఘనీయో భవిష్యామి తస్మాదాహర మాచిరమ్‌. 11

చూచి సారథితో ఇట్లనెను : ఈ పద్మమును కొనిరమ్ము. దీనిని తలపై తాల్చి అందరి యెదుట ప్రశంసకు పాత్రుడనగుదును. కనుక ఆలసింపక కొనిరమ్ము.

ఏవ ముక్త స్తదా తేన సారథిః ప్రవివేశ హ,

గ్రహీతు ముపచక్రామ తం పద్మం నృపసత్తమ. 12

ఇట్లు రాజు పలుకగా సారథి ఆ కొలనులోనికి ప్రవేశించి ఆ పద్మమును కైకొన నుంకించెను.

స్పృష్జమాత్రే తతః పద్మే హుంకారః సమజాయత,

తేన శ##బ్దేన సత్రస్తః పపాత చ మమార చ. 13

ఆ పద్మమును తాకినంత మాత్రమున ఒక హుంకారము యలు వెడలెను. ఆ శబ్దముతో ఆతడు భీతుడై నేలcగూలి మరణించెను.

రాజా చ తత్షణాత్‌ తేన శ##బ్దేన సమపద్యత,

కుష్ఠీ విగతవర్ణశ్చ బలవీర్యవివర్జితః. 14

నృపతియు ఆ శబ్దముతో ఒక్క పెట్టున రంగు మారిపోయి కుష్ఠియు, బలవీర్యములు లేనివాడును ఆయెను.

తథాగత మథాత్మానం దృష్ట్వా స పురుషర్షభః,

తస్థౌ తత్రైవ శోకార్తః కిమేత దితి చిన్తయన్‌. 15

అట్లు అయిన తన్ను చూచుకొని ఆ పురుషవరేణ్యుడు శోకము పైకొనగా ఇది ఏమి? అని చింతించుచు అందే ఉండెను.

తస్య చిన్తయతో ధీమా నాజగామ మహాతపాః,

వసిష్ఠో బ్రహ్మపుత్రోథ తం స పప్రచ్ఛ పార్థివమ్‌. 16

అట్లు చింతించుచుండగా ఆతనికడకు మహాతపస్వి బ్రహ్మపుత్రుడు, బుద్ధిశాలియునగు వసిష్ఠుడరుదెంచి ఆ రాజు నిట్లడిగెను.

కథం తే రాజశార్దూల తవ దేహస్య శాసనమ్‌,

ఇదానీ మేవ కిం కార్యం తన్మమాచక్ష్వ పృచ్ఛతః. 17

మహారాజా! నీ దేహమునకీ శిక్ష యేమి? ఇప్పుడు నీవు చేయవలసిన దేమి? నాకు చెప్పుము.

ఏవ ముక్త స్తతో రాజా వసిష్ఠేన మహాత్మనా,

సర్వం పద్మస్య వృత్తాంతం కథయామాస సప్రభుః. 18

ఇట్లు మహాత్ముడగు వసిష్ఠుడు పలుకగా ఆ రాజు ఆ పద్మ వృత్తాంతము నంతటిని ఆతనికి తెలిపెను.

తం శ్రుత్వా స ముని స్తత్ర సాధు రాజ న్నథాబ్రవీత్‌,

అసాధు రథవా తిష్ఠ తస్మాత్‌ కుష్ఠిత్వ మాగతః. 19

అది విని ముని రాజా! నీవు మంచివాడవు, చెడ్డవాడవు అయితివి కనుక నీకీ కుష్ఠరోగము కలిగినది. అని పలికెను.

ఏవ ముక్త స్తదా రాజా వేపమానః కృతాంజలిః,

పప్రచ్ఛ సాధ్వహం విప్ర కథవా సాధ్వహం మునే,

కథం చ కుష్ఠం మే జాత మేతన్మే వక్తు మర్హసి. 20

అతడట్లు పలుకగా రాజు చేతులు జోడించి వణకి పోవుచు విప్రా! నేనెట్లు సాధువను, అసాధువను అయితిని? నాకీ కుష్ఠరోగ మెట్లు వచ్చినది? దీనిని నీవు చెప్పవలయునని పలికెను.

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠు డిట్లనెను.

ఏతద్‌ బ్రహ్మోద్భవం నామ పద్మం త్రైలోక్య విశ్రుతమ్‌,

దృష్టమాత్రేణ చానేన దృష్టాః స్యుః సర్వదేవతాః,

ఏతస్మిన్‌ దృశ్యతే చైతత్‌ షణ్మాసం క్వాపి పార్థివ. 21

రాజా! ఇది మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కిన బ్రహ్మోద్భవ మను పద్మము. దీనిని చూచినంతనే సర్వదేవతలును కానవత్తురు. ఇది ఎందైనను ఆరు నెలలు మాత్రమే కానవచ్చును.

ఏతస్మిన్‌ దృష్టమాత్రే తు యో జలం విశ##తే నరః,

సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణ మర్హతి. 22

దీనిని చూచినంతనే జలమున ప్రవేశించు నరుడు పాపము లన్నింటిని పాడు చేసికొని మోక్షమును పొందును.

బ్రహ్మణః ప్రాగవస్థాయా మూర్తి రప్సు వ్యవస్థితా,

ఏతాం దృష్ట్వా జలే మగ్నః సంసారాద్‌ విప్రముచ్యతే. 23

బ్రహ్మముయొక్క మొదటి దశయగు మూర్తి నీటి యందు నెలకొని యున్నది. దానిని చూచి జలమున మునిగినవాడు సంసారము నుండి ముక్తి పొందును.

ఇమం చ దృష్ట్వా తే సూతో జలే మగ్నో నరోత్తమ,

ప్రవిష్టశ్చ పున రిమం హర్తు మిచ్ఛ న్నరాధిప,

ప్రాప్తవానసి దుర్బుద్ధౌ కుష్ఠిత్వం పాపపూరుష. 24

రాజా! దీనిని చూచి, దానిని కైకొనుటకై జలమున మునిగి నీసూతుడు సుగతి కరిగెను. నీవు పాడు బుద్ధితో ఈ కుష్ఠరోగమును పొందితివి.

దృష్ట మేతత్‌ త్వయా యస్మాత్‌ త్వం సాధ్వితి తతః ప్రభో,

మయోక్తో మోహ మాపన్న స్తేనా సాధు రితీరితః. 25

నీవు దీనిని చూచినందువలన నిన్ను నేను 'సాధువు' అంటివి. మోహము పొందితిని కావున 'అసాధుడవు' అంటిని.

బ్రహ్మపుత్రో హ్యహం చేమం పశ్యామి పరమేశ్వరమ్‌,

అహన్యహని చాగచ్ఛం స్తం పున ర్దృష్టవానసి. 26

నేను బ్రహ్మపుత్రుడను. నేను ప్రతిదినము వచ్చి ఈ పరమేశ్వరుని చూచుచుందును. అట్లే నీవును చూచితివి.

దేవా అపి వదన్తైతే పద్మం కాంచన ముత్తమమ్‌,

మానసే బ్రహ్మపద్మంతు దృష్ట్వా చాత్ర గతం హరిమ్‌,

ప్రాప్స్యామ స్తత్‌ పరం బ్రహ్మ యద్‌ గత్వా న పునర్భవేత్‌. 27

ఈ బంగారు పద్మమును గాంచి దేవతలును బ్రహ్మ పద్మ రూపమున మానససరోవరమునకు హరి వచ్చి యున్నాడు మేము మరల తిరిగి వచ్చుటన్నది లేని ఆ పరబ్రహ్మమును పొందెదమని పలుకుదురు.

ఇదం చ కారణం చాన్యత్‌ కుష్ఠస్య శృణు పార్థివ,

ఆదిత్యః పద్మగర్భేస్మిన్‌ స్వయమేవ వ్యవస్థితః. 28

తం దృష్ట్వా తత్వతో భావః పరమాత్మై ష శాశ్వతః,

ధారయామి శిరస్యేనం లోకమధ్యే విభూషణమ్‌. 29

ఏవం తే జల్పతా పాప మిదం దేవేన దర్శితమ్‌,

ఇదానీ మిమమేవ త్వా మారాధయ మహామతే. 30

రాజా! నీ కుష్ఠరోగమునకు కారణమును కూడ చెప్పెదను వినుము. ఈ పద్మముగర్భమున స్వయముగా సూర్యదేవుడు నెలకొని యున్నాడు. ఆతడు నిజమునకు శాశ్వతుడగు పరమాత్మయే అట్టి ఈ పద్మమును గాంచి నీవు దీనిని తలపై విభూషణముగా తాల్చి లోకమున వెలిగిపోయెద నని భావించితివి. ఇట్లు వాగిన నీకు ఈ పాపము నా దేవుడు చూపెను. నీవిపుడా దేవునే ఆరాధింపుము.

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

ఏవ ముక్త్వా వసిష్ఠస్తు ఇమ మేవ వ్రతం తదా,

ఆదిత్యారాధనం దివ్య మారోగ్యాఖ్యం జగాద హ. 31

ఇట్లు పలికి ఆ వసిష్ఠమహర్షి ఆతనికి ఆరోగ్యవ్రతమను పేరుగల ఈ వ్రతవిధానమును, సూర్యారాధన పద్ధతిని వివరించెను.

సోపి రాజాకరో చ్చేమం వ్రతం భక్తి సమన్వితః,

సిద్ధించ పరమం ప్రాప్తో విరోగశ్చాభవత్‌ క్షణాత్‌. 32

ఆ రాజును భక్తితో కూడినవాడై ఈ వ్రతమును కావించెను. పరమ సిద్ధిని పొందెను. వెనువెంటనే రోగములేనివాడాయెను.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ద్విషష్టి తమోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది రెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters