Varahamahapuranam-1    Chapters   

చతుఃషష్టితమోధ్యాయః - అరువది నాల్గవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లనెను.

అథాపరం ప్రవక్ష్యామి శౌర్య వ్రత మనుత్తమమ్‌,

యేన భీరో రపి మహచ్ఛౌర్యం భవతి తత్‌ క్షణాత్‌. 1

ఇటుపై నీకు మిక్కిలి శ్రేష్ఠమైన శౌర్య వ్రతమును గూర్చి చక్కగా తెలిపెదను. దీనివలన పిరికి వానికిని అప్పటికప్పుడు గొప్ప శౌర్యము కలుగును.

మాసి చాశ్వయుజే శుద్ధాం నవమీం సముపోషయేత్‌,

సప్తమ్యాం కృతసంకల్పః స్థిత్వాష్టమ్యాం నిరోదనః. 2

ఆశ్వయుజమాస శుక్ల పక్షమున నవమినాడు ఉపవాసము చేయవలయును. సప్తమినాడు సంకల్పము చేసి అష్టమినాడును ఉపవాసముండవలయును.

నవమ్యాం పారయేత్‌ షిష్టం ప్రథమం భక్తితో నృప,

బ్రాహ్మణాన్‌ భోజయేద్‌ భక్త్యా దేవీం చైవతు పూజయేత్‌,

దుర్గాం దేవీం మహాభాగాం మహామాయాం మహాప్రభామ్‌. 3

నవమినాడు మొదట పిండిని భుజింపవలయును. భక్తితో బ్రాహ్మణుకు సంతర్పణము చేయవలయును. మహామాయ, మహాప్రభ మహాభాగ యగు దుర్గా దేవిని పూజింపవలయును.

ఏవం సంవత్సరం యావ దుపోష్యేతి విధానతః,

వ్రతాంతే భోజయేద్‌ ధీమాన్‌ యథాశక్త్యా కుమారికాః. 4

ఇట్లు ఒక సంవత్సర కాలము విధానము ననుసరించి ఆతిథియందు ఉపవాసముండి బుద్ధిమంతుడగు నరుడు వ్రతము ముగిసిన వెనుక శక్తి ననుసరించి కన్యకలకు అన్న మొసగవలయును.

హేమవస్త్రాదిభి స్తాస్తు భూషయిత్వాతు శక్తితః,

పశ్చాత్‌ క్షమాపయేత్‌ తాస్తు దేవీ మే ప్రీయతా మితి. 5

బంగారు వస్త్రములు మున్నగు వానితో శక్తి మేరకు వారి నలంకరించి పిదప దేవి నా యెడల ప్రీత యగుగాక అని వారినుద్దేశించి విన్నపము చేయవలయును.

ఏవం కృతే భ్రష్టరాజ్యో లభేద్‌ రాజ్యం న సంశయః,

అవిద్యో లభ##తే విద్యాం భీతః శౌర్యం చ విన్దతి. 6

ఇట్లు చేసినచో రాజ్యమును కోలుపోయినవాడు రాజ్యమును తప్పకపొందును. విద్యలేనివాడు విద్యను పొందును. భయమునందిన వాడు శౌర్యమును పొందును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే చతుఃషష్టితమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది నాల్గవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters