Varahamahapuranam-1    Chapters   

పంచ షష్టితమోధ్యాయః - అరువది అయిదవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు పలికెను.

సార్వభౌమ వ్రతం చాన్యత్‌ కథయామి సమాసతః,

యేన సమ్య క్కృతేనాశు సార్వభౌమో నృపో భ##వేత్‌. 1

సార్వభౌమ వ్రతమును గూర్చి సంగ్రహముగా చెప్పెదను. దీని నాచరించి రాజు వెంటనే సార్వభౌముడగును.

కార్తికస్య తు మానస్య దశమీ శుక్లపక్షికా,

తస్యాం నక్తాశనో నిత్యం దిక్షు శుద్ధ బలిం హరేత్‌. 2

కార్తికమాసమున శుక్లపక్షము దశమినాడు రాత్రి భోజనము చేయువాడై ప్రతిదినము అన్నిదిక్కుల యందును శుద్ధమైన బలిని ఉంచవలయును.

విచిత్రైః కుసుమై ర్భక్త్యా పూజయిత్వా ద్విజోత్తమాన్‌,

దిశాం తు ప్రార్థనాం కుర్యా న్‌ మన్త్రేణానేన సువ్రతః,

సర్వా భవన్త్యః సిద్ధ్యన్తు మమ జన్మని జన్మని. 3

రంగురంగుల పూవులతో భక్తితో ఉత్తమ విప్రులను పూజించి ఆయా దిక్కును గూర్చి 'దిక్కులారా! మీరందరు నాకు ప్రతిజన్మము నందును సిద్ధిని కూర్చువారగుదురుగాక' అను నర్థము గల మంత్రముతో దిక్ర్పార్థనము కావింపవలయును.

ఏవ ముక్త్వా బలిం తాసు దత్వా శుద్ధేన చేతసా,

తతో రాత్రౌ తు భుంజీత దధ్యన్నంతు సుసంస్కృతమ్‌. 4

ఇట్లు పలికి ఆ దిక్కులయందు నిర్మలమగు మనస్సుతో బలిని ఉంచవలయును. ఆ రాత్రి చక్కగా మంత్రములతో సంస్కరించిన పెరుగన్నమును భుజింపవలయును.

పూర్వం పశ్చాద్‌ యథేష్టంతు ఏవం సంవత్సరం నృప,

యః కరోతి నరో నిత్యం తస్య దిగ్విజయో భ##వేత్‌. 5

మొదట ఇట్లు దధ్యోదనమును తిని తరువా ఇష్టము ననుసరించి భుజింప నగును. ఇట్లీ వ్రతమును ఏడాదికాలము చేయువానికి దిగ్విజయము తప్పక కలుగును.

ఏకాదశ్యాంతు యత్నేన నరః కుర్యాద్‌ యథావిధి,

మార్గశీర్షే శుక్లపక్షా దారభ్యాబ్దం విచక్షణః,

మార్గశీర్షమాసము శుక్లపక్షము ఏకాదశినాటి నుండి ప్రారంభించి యీ వ్రతమును వివేకవంతుడు పట్టుదలతో చేయవలయును.

తద్‌వ్రతం ధనదస్యేష్టం కృతం విత్తం ప్రయచ్ఛతి. 6

కుబేరున కిష్టమైన ఈ వ్రతమును చేసినచో ఇది పుష్కలముగా ధనము నిచ్చును.

ఏకాదశ్యాం నిరాహారో యో భుంక్తే ద్వాదశీ దినే,

శుక్లే వాప్యథవా కృష్ణే తద్‌ వ్రతం వైష్ణవం మహత్‌. 7

ఏవం చీర్ణం సుఘోరాణి హన్తి పాపాని పార్థివ,

త్రయోదశ్యాం తు నక్తేన ధర్మవ్రత మథోచ్యతే. 8

ఏకాదశినాడు, శుక్లపక్షమున గాని, కృష్ణ పక్షమున గాని ఆహారము కైకొనక ద్వాదశిదినమున పారణ చేయుట అను ఈ వైష్ణవ వ్రతమును ఆచరించువాడు మిక్కిలి ఘోరములైన పాపములను పరిమార్చును. త్రమోదశినాడు నక్తమును పాటించుట ధర్మ వ్రతముగా చెప్పబడును.

శుక్లపక్షే ఫాల్గునస్య తథారభ్య విచక్షణః,

రౌద్రం వ్రతం చతుర్దశ్యాం కృష్ణపక్షే విశేషతః,

మాఘమాసా దథారభ్య పూర్ణం సంవత్సరం నృప. 9

ఫాల్గునమాసము శుక్లపక్షము మొదలుకొని ఈ వ్రతము చేయవలయును. కృష్ణపక్షమునందు విశేషముగా రౌద్రవ్రతము మాఘమాసము మొదలుకొని ఒక సంవత్సరము వరకు చేయవలయును.

ఇందు వ్రతం పంచదశ్యాం శుక్లాయాం నక్తభోజనమ్‌,

పితృవ్రత మమావాస్యా మితి రాజన్‌ తథేరితమ్‌. 10

శుక్లపక్షమున పూర్ణిమతిథియందు నక్తభోజనము (రాత్రి పూటమాత్రము భోజనము చేయుట) ఇందు వ్రతము. అమావాస్య నాడు చేయుట పితృవ్రతము.

దశ పఞ్చ చ వర్షాణి య ఏవం కురుతే నృప,

తిథివ్రతాని కస్తస్య ఫలం వ్రతప్రమాణతః. 11

పదునైదేండ్లు ఈ విధముగా తిథివ్రతములను చేయువానికి వ్రతము ప్రమాణము ననుసరించి మహాఫలములు లభించును.

అశ్వమేధ సహస్రాణి రాజసూయశతాని చ,

యష్టాని తేన రాజేంద్ర కల్పోక్తాః క్రతవ స్తథా. 12

వేలకొలది అశ్వమేధములు, వందలకొలది రాజసూయములు కల్పము ప్రకారము ఆతడు చేసినట్లగును.

యః పునః సర్వ మేతద్ధి కుర్యా న్నరవరాత్మజ,

స శుద్ధో విరజో లోకా నాప్నోతి సకలం నృప. 13

రాజోత్తమా! దీని నంతటిని చక్కగా చేయు నరుడు శుద్ధుడు, రజస్సులేనివాడునై సర్వలోకములను పొందును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే పంచ షష్టి తమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది అయిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters