Varahamahapuranam-1    Chapters   

సప్తషష్టితమోధ్యాయః - అరువది యేడవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లనెను.

భగవన్‌ సితకృష్ణే ద్వే యే తే జగతి సత్తమ,

స్త్రి¸° బభూవతుః కే ద్వే సితా కృష్ణా చ కాశుభా. 1

కస్యాసౌ పురుషో బ్రహ్మన్‌ పాపకః సప్తధాభవత్‌,

కోసౌ ద్వాదశధా విప్ర ద్విదేహః షట్‌శిరాఃప్రభుః. 2

దంపత్యశ్చ ద్విజశ్రేష్ఠ కృతసూర్యోదయా దలమ్‌,

కస్మాదే తజ్జగదిదం వితతం ద్విజసత్తమ. 3

ఉత్తముడా! తెల్లని నల్లని స్త్రీలు ఇరువురున్నారని అందురు. వారెవరు? అందు పవిత్ర యెవ్వరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? ఈ పాపకుడు ఏడుగానయ్యెనట! అతడెవరు? పండ్రెండు విధముగా, రెండు దేహములతో, ఆరుశిరస్సులతో ఉండెడు ఆ పురుషుడెవ్వడు? సూర్యోదయము మొదలుకొని వారు దంపతులుగా నుందురట. ఎవనివలన ఈ జగత్తంతయు పెంపొందినది?

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

సితకృష్ణే స్త్రి¸° యేతే తేభగిన్యౌ ప్రకీర్తితే,

సత్యాసత్యే ద్వివర్ణా చ నారీ రాత్రి రుదాహృతా. 4

ఆ నల్లనితెల్లని స్త్రీలు అక్కచెల్లెండ్రు, సత్య, అసత్య అనువారు. రెండురంగుల పడతి రాత్రి.

యః పుమాన్‌ సప్తధా జాత ఏకో భూత్వా నరేశ్వర,

స సముద్ర స్తు విజ్ఞేయః సప్తధైకో వ్యవస్ధితః. 5

ఒక్కడై ఏడురూపములు పొందిన ఆ పురుషుడు సముద్రుడు అని తెలియదగును. ఏడు రూపములు పొందియు ఒక్కడై యున్నాడు.

యోసౌ ద్వాదశధా రాజన్‌ ద్విదేహః షట్‌శిరాః ప్రభుః,

సంవత్సరః సవిజ్ఞేయః శరీరౌ ద్వే గతీ స్మృతే,

ఋతవః షట్‌ చ వక్త్రాణి ఏష సంవత్సరః స్మృతః 6

పండ్రెండుగా నయి రెండుదేహములు, ఆరుశిరస్సులుగల ఆ ప్రభువు సంవత్సరపురుషుడు, రెండుదేహములు రెండు అయనములు. ఆరుతలలు ఆరుఋతువులు. ఇతడే సంవత్సర పురుషుడు.

దంపత్యం తదహోరాత్రం సూర్యాచంద్రమసౌ తతః,

తతో జగత్‌ సముత్తస్థౌ దేవస్యాస్య నృపోత్తమ. 7

ఆ ఆలుమగలు రాత్రిపగలు అనునవి. అవి చంద్రుడు సూర్యుడు అనువాని రూపమున నుండును. ఆ పరమేశ్వరుని వలన జగత్తు ఏర్పడినది.

స విష్ణుః పరమో దేవో విజ్ఞేయో నృపసత్తమ,

న చ వేదక్రియాహీనః పశ్యతే పరమేశ్వరమ్‌. 8

ఆ పరమదైవము విష్ణువని తెలియనగును. వేదసంబంధమగు క్రియలు లేనివానికి ఆ పరమేశ్వరుడు కానరాడు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తషష్టితమోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున అరువదియేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters