Varahamahapuranam-1    Chapters   

అష్టషష్టితమోధ్యాయః - అరువది ఎనిమిదవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వుడిట్లనెను.

యోసౌ పరాపరో దేవో విష్ణుః సర్వగతో మునే,

చతుర్యుగే త్వసౌ కీదృగ్‌ విజ్ఞేయః పరమేశ్వరః. 1

ఓమునీ! పరుడు, అపరుడు, సర్వగతుడు అయిన ఈ విష్ణుదేవుడు నాలుగు యుగములందు ఎట్టివాడు? ఆ పరమేశ్వరుని నెట్లు తెలిసికొననగును.

యుగే యుగే క ఆచారో వర్ణానాం భవితా మునే,

కథం చ శుద్ధి ర్విప్రాణా మన్యస్త్రీ సంకరై ర్మునే. 2

మునీ! ప్రతియుగము నందు ఆయావర్ణముల వారి ఆచార మెట్టిది? ఇతర జాతుల స్త్రీలతో సంకర మేర్పడినపుడు విప్రులకు శుద్ధి ఎట్లగును?

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

కృతే యుగే మహీ దేవై ర్భుజ్యతే వేదకర్మణా,

యజద్భి రసురై స్త్రేతా తద్వద్‌ దేవైశ్చ సత్తమ. 3

ద్వాపరే సత్వరజసో బహుళే నృపసత్తమ,

యావద్‌ ధర్మసుతో రాజా భవిష్యతి మహామతే. 4

తత స్తమః ప్రభవితా కలిరూపో నరేశ్వర,

తస్మిన్‌ కలౌ వర్తమానే స్వమార్గా చ్చ్యవతే ద్విజః. 5

శ్రేష్ఠుడా! కృతయుగమున ఈ భూమిని దేవతలు వేదకర్మముతో అనుభవింతురు. త్రేతయందు అసురులు, దేవతలు యజ్ఞములు చేయుచు అనుభవింతురు. ద్వాపరమున సత్త్వరజస్సులు అతిశయముగా నుండును. రాజు ధర్మమూర్తియై ఒప్పారును. అటుపై కలిరూపమున తమస్సు ఏర్పడును. ఆ కలియుగము రాగా బ్రాహ్మణుడు తన మార్గము నుండి భ్రష్టుడగును.

రాజానో వైశ్యశూద్రాశ్చ ప్రాయశో హీనజాతయః,

భవిష్యన్తి నృపశ్రేష్ఠ సత్యశౌచ వివర్జితాః. 6

రాజులు, వైశ్యులు, శూద్రులు తరచుగా జాతి భ్రష్టులగుదురు. సత్యము, శుద్ధియు లేనివారగుదురు.

అగమ్యా గమనం తత్ర కరిష్యన్తి ద్విజాతయః,

అనృతం చ వదిష్యన్తి వేదమార్గ బహిష్కృతాః,

వివాహాంశ్చ కరిష్యన్తి సగోత్రా నసమాం స్తథా. 7

పొందరాని స్త్రీలను బ్రామ్మణులు పొందుచుందురు. వేద మార్గము నుండి భ్రష్టులై అబద్ధములాడుచుందురు. తమ గోత్రముల వారితో, ఈడుకాని వారితో వివాహములను కూడ చేసికొను చుందురు.

రాజానో బ్రాహ్మణాన్‌ హింస్యు ర్విత్తలోభాన్వితాః శఠాః,

అన్త్యజా అపి వైశ్యత్వం కరిష్యంతి పణ రతాః,

అభిమానినో భవిష్యన్తి శూద్రజాతిషు గర్వితాః. 8

ధనములందు లోభము గల మూఢులగు రాజులు బ్రహ్మజ్ఞాన సంపన్నులను హింసింతురు. శూద్రులును వర్తకవృత్తియందు ఆసక్తి కలవారై వైశ్యవృత్తిని చేయుచుందురు.

శూద్ర జాతుల యందు గర్వితులై అభిమానముకలవారై యుందురు.

సర్వాశినో భవిష్యన్తి బ్రాహ్మణాః శౌచివర్జితాః,

సురాపేయ మితి ప్రాహుః సత్యశౌచ వివర్జితాః. 9

బ్రాహ్మణులు శౌచమును పాటింపక సత్యమును వదలివైచి అన్నివిధముల తిండిని తినువారగుదురు. మద్యము సేవింపదగినదని నొక్కిపలుకుదురు.

తతో వినశ్యతే లోకో వర్ణధర్మశ్చ నశ్యతే. 10

అంత లోకస్ధితి చెడిపోవును. వర్ణధర్మము నశించును.

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లు పలికెను.

అగమ్యాగమనం కృత్వా బ్రాహ్మణః క్షత్రియోపి వా,

శూద్రోపి శుద్ధ్యతే కేన కిం వాగమ్యంతు శంస మే. 11

పొందరానిస్త్రీని పొంది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఎట్లు శుద్ధి పొందును. పొందరినితనమెట్లు కలుగును? నాకు చెప్పుము.

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

చాతుర్గామీ భ##వేద్విప్ర స్త్రిగామీ క్షత్రియో భ##వేత్‌,

ద్విగామీతు భ##వేద్‌ వైశ్యః శూద్ర ఏకగమః స్మృతః. 12

బ్రాహ్మణుడు నాలుగువర్ణములవారిని, క్షత్రియుడు మూడు వర్ణములవారిని, వైశ్యుడు రెండువర్గములవారిని, శూద్రుడు తన వర్ణమువారిని గమ్యలుగా (భార్యలుగా) భావింపవచ్చును.

అగమ్యాం బ్రాహ్మణీం ప్రాహుః క్షత్రియస్య నరేశ్వర,

క్షత్రాణీం చైవ వైశ్యస్య వైశ్యాం శూద్రస్య పార్థివ,

అధమ స్యోత్తమా నారీ అగమ్యా మమ రబ్రవీత్‌. 13

బ్రాహ్మణస్త్రీ క్షత్రియునకు, క్షత్రియకాంత వైశ్యునకు, వైశ్యకాంత శూద్రునకు అగమ్య అని చెప్పుదురు. క్రిందికులము వానికి పై కులపుకాంత అగమ్య అని మనువు చెప్పెను.

మాతా మాతృష్వసా శ్వశ్రూ ర్భ్రాతృపత్నీ చ పార్థివ,

స్నుషా చ దుహితా చైవ మిత్రపత్నీ స్వగోత్రజా. 14

రాజజాయ೭೭త్మజా చైవ అగమ్యా ముఖ్యతః స్త్రియః,

రాజకాదిషు చాన్యాశ్చ స్త్రియోగమ్యాః ప్రకీర్తితాః,

అగమ్యాగమనం చైతత్‌ కృతం పాపాయ జాయతే. 15

రాజా! తల్లియు, తల్లిసోదరియు, అత్తయు, వదినయు మరదలును, కోడలును,

కూతురు, మిత్రుని భార్య, తనగోత్రము నందలికాంతయు, రాజపత్నియు, 'రాజు' బిడ్డయు నగుస్త్రీలు ముఖ్యముగా మనుజునకు పొందరానివారు. అట్లే వృత్తి పని చేయునట్టి చాకలిమున్నగు స్త్రీలు కూడ అగమ్యలు. ఈ అగమ్యా గమనము వలన పాపము కలుగును.

వియోనిగమనాయాశు బ్రాహ్మణాయ భవత్యలమ్‌.

శేషస్య శుద్ధి రేషైవ ప్రాణాయామశతం భ##వేత్‌. 16

బ్రాహ్మణుడు ఇతరస్త్రీని పొందినంత మాత్రమున బ్రాహ్మణత్వమునుండి భ్రష్టుడగును. ఇతరునకు నూరు ప్రాణాయామముల వలన శుద్ధి ఏర్పడును.

బహునాపి హి కాలేన యత్‌ పాపం సముపార్జితమ్‌,

వర్ణ సంకరసంగత్యా బ్రాహ్మణన నరర్షభ. 17

దశ ప్రణవగాయత్రీం ప్రాణాయామశ##తై స్త్రి భిః,

ముచ్యతే బ్రహ్మహత్యాయాః కింపునః శేషపాతకైః. 18

పెక్కుకాలమునందు చేసిన పాపము వర్ణసంకర సంబంధము, బ్రహ్మహత్యమున్నగు మహా పాపములన్నియు ప్రణవ పూర్వకమైన గాయత్రిని పదిమారులు చేయుటచేతను, మూడునూర్ల ప్రాణాయామముల చేతను బ్రాహ్మణునకు నశించును. ఇతర పాతకముల సంగతి చెప్పనేల?

అథవా పరరూపం యో వేద బ్రాహ్మణ పుంగవః,

వేదాధ్యాయీ పాపశ##తైః కృతై రపి నలిప్యతే. 19

మరియును బ్రాహ్మణ శ్రేష్ఠుడు వేదములను అధ్యయనము చేయువాడై పరమాత్మ స్వరూపము నెరిగినచో వందలకొలది పాపముల నుండియు ముక్తుడగును.

స్మరన్‌ విష్ణుం పఠన్‌వేదం దదద్‌ దానం యజన్‌ హరిమ్‌, బ్రాహ్మణః శుద్ధ ఏవాస్తే విరుద్ధ మపి తారయేత్‌. 20

విష్ణువును స్మరించుచు, వేదమును పఠించుచు, దాన మొసగుచు, హరిని పూజించుచు బ్రాహ్మణుడు శుద్ధుడే యగును. ఇతరుని కూడ తరింపజేయును.

ఏతత్‌తే సర్వ మాఖ్యాతం యత్‌ పృష్టో 7హం త్వయా నృప,

మన్వాదిభి ర్విస్తరశః కథ్యతే యేన పార్థివ,

సమాసత స్తేన మయా కథితం తే నృపోత్తమ. 21

రాజా! నన్ను నీవడిగిన విషయమంతటిని నీకు చెప్పితిని. దీనినంతటిని మనువు మున్నగువారు విస్తరించి చెప్పుదురు. నేను నీకు సంగ్రహముగా చెప్పితిని.

ఇతి శ్రీ వరహా పురాణ భగవచ్ఛాస్త్రే అష్ట షష్టితమో7ధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది ఎనిమిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters