Varahamahapuranam-1    Chapters   

త్రిసప్తతితమోధ్యాయః - డెబ్బదిమూడవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

శృణు చాన్యద్‌ ద్విజశ్రేష్ఠ కౌతూహలసమన్వితమ్‌,

అపూర్వభూతం సలిలే మగ్నేన మునిపుంగవ. 1

మునివరా! వేడుకగొలుపు ఒక వృత్తాంతమును వినుము. నేను నీట మునిగినపుడు ఒక అపూర్వసంఘటన సంభవించినది.

బ్రాహ్మణాహం పురా సృష్టః ప్రోక్తశ్చ సృజ వై ప్రజాః,

అవిజ్ఞాన సమర్థోహం నిమగ్నః సలిలే ద్విజ. 2

మొదట బ్రహ్మ నన్ను సృజించి ప్రజలను సృష్టిచేయుమని నాతో పలికెను. అది యెట్లో తెలియక, సమర్థత లేని నేను నీట మునిగి యుంటిని.

తత్రయావత్‌ క్షణం చైకం తిష్ఠామి పరమేశ్వరమ్‌,

అంగుష్ఠమాత్రం పురుషం థ్యాయన్‌ ప్రయతమానసః. 3

చెదరని మనస్సుకలవాడనై బొట్టనవ్రేలంత పురుషుడగు పరమేశ్వరుని ధ్యానించుచు నేనచట క్షణకాలము నిలిచితిని.

తావ జ్జలాత్‌ సముత్తస్థుః ప్రళయాగ్నిసమప్రభాః,

పురుషా దశ చైకశ్చ తాపయన్తోంశుభి ర్జలమ్‌. 4

ఇంతలో ఆ జలమునుండి ప్రళయాగ్ని వంటి కాంతులు గల పురుషులు పదునొకండ్రు ఆ జలముల నుండికించుచు పైకి లేచిరి.

మయా పృష్టాః కే భవన్తో జలాదుత్తీర్య తేజసా,

తాపయన్తో జలం చేదం క్వవా యాస్యత శంసత. 5

అయ్యా! నీటినుండి లేచి తేజస్సుతో ఈ జలమును తపిపంజేయుచున్న మీరెవ్వరు? ఎక్కడి కేగుచున్నారు? చెప్పుడు? అని నేను వారి నడిగితిని.

ఏవ ముక్తా మయా తే తు నోచుః కించన సత్తమాః,

ఏవమేవ గతాస్తూష్ణీం తే నరా ద్విజపుంగవ. 6

నేనిట్లనగా వారు ఏమియు పలుకకుండిరి. ఊరక ఆ పురుషులు వెడలిపోయిరి.

తత స్తేషా మను మహాపురుషోతీవ శోభనః,

స తస్మిన్‌ మేఘసంకాశః పుండరీకనిభేక్షణః. 7

అంతవారివెనుక ఒక మహాపురుషుడు, పరమసుందరుడు, మేఘమువంటి వన్నెకలవాడు, పద్మములకు ఈడైన కన్నులుకలవాడు, అందు కానవచ్చెను.

తమహం పృష్టవాన్‌ కస్త్వం కే చమే పురుషా గతాః,

కింవా ప్రయోజన మిహ కథ్యతాం పురుషర్షభ. 8

ఓ మహాపురుషా! నీవెవరు? ఆ వెడలిన పురుషులెవ్వరు? ఇచట మీ పనియేమి? నాకు చెప్పుము. అని అతని నడిగితిని.

పురుష ఉవాచ - ఆ పురుషు డిట్లనెను.

య ఏతే వై గతాః పూర్వం పురుషా దీప్తతేజసః,

ఆదిత్యాస్తే త్వరం యాన్తి ధ్యాతా వై బ్రహ్మణా భవ. 9

భవా! వెలిగిపోవుచున్న తేజస్సుతో అట్లు అరిగినవారు ఆదిత్యులు. బ్రహ్మవారిని తలపోయగా త్వరతో అరుగుచున్నారు.

సృష్టిం సృజతి వై బ్రహ్మా తదర్థం యాన్త్యమీ నరాః,

ప్రతిపాలనాయ తస్యాస్తు సృష్టే ర్దేవ న సంశయః. 10

బ్రహ్మ సృష్టిని చేయును, ఈ పురుషులు ఆ సృష్టిని పరిరక్షించుటకొర కరుగుచున్నారు. సంశయములేదు.

శంభు రువాచ - శంభు డిట్లనెను.

భగవన్‌ కథం జానీషే మహాపురుషసత్తమ,

భ##వేతి నామ్నా తత్సర్వం కథయస్వ పరోహ్యహమ్‌. 11

స్వామీ! నేను నీకు తెలియనివాడనుకదా! నన్ను భవా! అని పేరు పెట్టి పిలిచితివి. నీకది నీకది యెట్లు తెలిసినది? అది యంతయు నాకు చెప్పుము.

ఏవ ముక్తస్తు రుద్రేణ స పుమాన్‌ ప్రత్యభాషత,

అహం నారాయణో దేవో జలశాయీ సనాతనః. 12

రుద్రుడిట్లనగా ఆ పురుషుడు సమాధానము నిట్లు చెప్పెను. నేను నారాయణదేవుడను నీటియందు నిద్రింతును. సనాతనుడను.

దివ్యంచక్షు ర్భవతు వై తవ మాం పశ్య యత్నతః,

నీకు దివ్యమగు కన్ను ఏర్పడుగాక! ప్రయత్నించి నన్ను చూడుము.

ఏవ ముక్త స్తదా తేన యావత్‌ పశ్యామ్యహంతు తమ్‌. 13

తావదంగుష్ఠమాత్రం తు జ్వలద్భాస్కరతేజసమ్‌,

తమేవాహం ప్రపశ్యామి తస్య నాభౌతు పంకజమ్‌. 14

బ్రహ్మాణం తత్ర పశ్యామి ఆత్మానంచ తదఙ్గతః.

ఇట్లతడు పలుకగా నేను అటు చూచునంతలో వెలుగొందుచున్న సూర్యుని తేజస్సు కలవాడు, బొట్టనవ్రేలంత వాడునగు స్వామి కానవచ్చెను. నేనాతనినే పరీక్షించి చూచితిని. ఆతని బొడ్డున పద్మమును, అందు బ్రహ్మను, దేహమున నన్ను కాంచితిని.

ఏవం దృష్ట్వా మహాత్మానం తతో హర్షముపాగతః,

తం స్తోతుం ద్విజశార్దూల మతి ర్మే సమజాయత. 15

ఆమహాత్మునట్లు కాంచి పరమానందమందితిని. ఆతనిని స్తుతింపవలయునను బుద్ధి పుట్టినది.

తస్య మూర్తౌతు జాతాయాం స్తోత్రేణానేన సువ్రత,

స్తుతో మయా స విశ్వాత్మా తపసా స్మృతకర్మణా. 16

ఆతనికొక ఆకృతి ఏర్పడగా, తపస్సుచేత స్మృతికి వచ్చిన కర్తవ్యము గలనేను ఆ విశ్వాత్ముని ఈ స్తోత్రములతో కొనియాడితిని.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

సరూప రూపాయ సహస్రబాహవే,

సహస్రరశ్మిప్రవరాయ వేధసే

విశాలదేహాయ విశుద్ధకర్మిణ. 17

అనంతుడు, విశుద్ధహృదయుడు, తనకుతానే సాటి యగు రూపము కలవాడు, వేయిబాహువులు గలవాడు, వేలకొలది కిరణములుగల శ్రేష్ఠుడు సృష్టికర్త, విశాలమగు దేహము, పవిత్రమగు కర్మములు కలవాడు అగు దేవా! నీకు నమస్కారము.

సమస్తవిశ్వార్తి హరాయ శంభ##వే

సహస్ర సూర్యానిల తిగ్మతేజసే,

సమస్త విద్యా విధృతాయ చక్రిణ

సమస్త గీర్వాణ నుతే సదానఘ. 18

విశ్వములన్నింటి ఆర్తిని హరించువాడు, శంభువు, వేలకొలది సూర్యుల వాయువుల తీవ్ర తేజము కలవాడు, ఎల్లవిద్యలను ధరించువాడు, చక్రముకలవాడు, దేవతలందరి స్తుతు లందు కొనువాడు, ఎల్లప్పుడు పాపములు లేనివాడు అగు దేవా! నీకు నమస్కారము.

అనాది దేవాచ్యుత శేషశేఖర

ప్రభో విభో భూతపతే మహేశ్వర,

మరుత్పతే సర్వపతే జగత్పతే

భువః పతే భువసపతే సదా నమః. 19

దేవా! నీకు మొదలు లేదు. చ్యుతిలేదు. శేషుడే నీకు శేఖరము. ప్రభూ! సర్వపతీ! జగత్పతీ! భువఃపతీ! భువనపతీ! నీకు సర్వదా నమస్కారము.

జలేశ నారాయణ విశ్వశంకర

క్షితీశ విశ్వేశ్వర విశ్వలోచన,

శశాంకసూర్యాచ్యుత వీర విశ్వగా-

ప్రతర్క్య మూర్తేమృతమూర్తి రవ్యయః. 20

దేవా! జలములకు ప్రభుడవు. నారాయణుడవు. విశ్వము లన్నింటికి శుభము కూర్చువాడవు. భూమికి భర్తవు. విశ్వేశ్వరుడవు. విశ్వమునకు నేత్రమయిన వాడవు. నీవే చంద్రుడవు. సూర్యడవు. అచ్యుతుడవు. వీరుడవు. విశ్వమంతయు వ్యాపించువాడవు. ఊహలకందని మూర్తి కలవాడవు. అమృతమూర్తివి. అవ్యుయుడవు.

జ్వలద్ధుతాశార్చి విరుద్ధమండల

ప్రపాహి నారాయణ విశ్వతోముఖ,

నమోస్తు దేవార్తి హరామృతావ్యయ

ప్రపాహి మాం శరణగతం సదాచ్యుత. 21

జ్వలించుచున్న అగ్నికీలలతో అన్యులకు చొరవశక్యము కానిమండలము కలనారాయణా! విశ్వతోముఖా! నన్ను కాపాడుము. దేవతల ఆర్తిని అంతముచేయు అమృతుడవు. అవ్యయుడవు. అచ్యుతుడవు, ఎల్లప్పుడు శరణుజొచ్చిన నన్ను కాపాడుము.

వక్త్రాణ్య నేకాని విభో తవాహం

పశ్యామి మధ్యస్థగతం పురాణమ్‌,

బ్రహ్మాణ మీశం జగతాం ప్రసూతిం

నమోస్తు తుభ్యం తు పితామహాయ. 22

ప్రభూ! నీ మోములను పెక్కింటిని నేను చూచుచున్నాను. నీ బొడ్డునందున్న పురాణుడు, ఈశ్వరుడు, సర్వలోకములకు సృష్టికర్త అయిన బ్రహ్మను నేను కనుగొనుచున్నాను. అట్టి పితామహునకు నీకు నమస్సు.

సంసారచక్రభ్రమణౖ రనేకైః

క్వచిద్‌ భవాన్‌ దేవవరాది దేవ,

సన్మార్గిభి ర్జాన విశుద్ధ సత్వై

రుపాస్యసే కిం ప్రలపామ్యహం త్వామ్‌. 23

సంసారమును చక్రమున తిరుగుచుండు పెక్కండ్రు, జ్ఞానము చేత విశుద్ధమైన సత్వగుణముగల సన్మార్గులు ఓ ఆదిదేవా! దేవదేవా! ఒక్కచో నిన్ను ఉపాసింతురు. అట్టి నిన్ను గూర్చి నేనేమి పలుకుదును?

ఏకం భవన్తం ప్రకృతేః పరస్తాద్‌

యో వేత్త్యసౌ సర్వవిదాదిబోద్ధా,

గుణా సతేషు ప్రసభం విభేద్యా

విశాలమూర్తి ర్హి సుసూక్ష్మరూపః. 24

ప్రకృతి కావల ఒక్కడవై యున్న నిన్నెరిగినవాడు. సర్వము తెలిసినవాడు మొదటిజ్ఞాని. నీ గుణములు వారియందు (జ్ఞానుల యందు) విభజించి చూపగలిగినవి కావు. నీవు విశాలమూర్తవి. పరమసూక్ష్మరూపుడవు.

నిర్వాక్యో నిర్మన విగతేన్ద్రియోసి

కర్మాభవాన్నో విగతైకకర్మా,

సంసారవాం స్త్వం హి న తాదృశోపి

పునః కథం దేవవరాసి వేద్యః. 25

నీకు పలుకు లేదు. మనసు లేదు. ఇంద్రియములు లేవు. కర్మములు లేకున్నను చైతన్యము నిండినవాడవు. సంసారము కలవాడవు. సంసారములేనివాడవు. దేవవరా! నిన్ను తెలియుట ఎట్లు?

మూర్తామూర్తం త్వతులం లభ్యతే తే

పరం వపు ర్దేవ విశుద్ధభావైః,

సంసార విచ్ఛిత్తికరై ర్యజద్భి-

రతోవసీయేత చతుర్భుజ స్త్వమ్‌. 26

ఆకారముకలదియు, లేనిదియు, సాటిలేనిదియునగు నీ పరమదేహము విశుద్ధభావులకు, సంసారమును తెగత్రెంపులు చేసికొనగోరి అర్చించువారికి మాత్రమే లభించును. అందువలననే నిన్ను చతుర్భుజుడని నిర్ణయింతురు.

పరం న జానన్తి యతో వపుస్తే

దేవాదయోప్యద్భుత కారణం తత్‌,

అతోవతారోక్తతనం పురాణ-

మారాధయేయుః కమలాసనాద్యాః. 27

కాని అచ్చెరువు కొలువు నీ దేహమును దేవాదులు కూడ ఎరుగజాలరు. కనుకనే బ్రహ్మమొదలగువారు అవతారములుగా చెప్పడు నీ పురాణమైన తనువును ఆరాధింతురు.

స తే వపు ర్విశ్వసృగజ్జయోని

రేకాంతతో వేద మహానుభావః,

పరం త్వహం వేద్మి కవిం పురాణం

భవన్త మాద్యం తపసా విశుద్ధః. 28

విశ్వము నెల్ల సృజించువాడు, పద్మము పుట్టుక తానైనవాడు, మహానుభావుడు నగుబ్రహ్మయు మొత్తముగా నీ దేహము నెరుగడు. నేను మాత్రము తపస్సుచేత విశుద్ధుడనై ఆద్యుడవు. పురాణుడవు. కవివి అగు నిన్నెరుగుదును.

పద్మాసనో మే జనకః ప్రసిద్ధ-

శ్చైతత్‌ ప్రసూతా వసకృత్పురాణౖః,

సంబోధ్యతే నాథ న మద్విధోపి

విదుర్భవన్తం తపసా విహీనాః. 29

బ్రహ్మదేవుడు నాకు జనకుడని, పెక్కుమారులు పురాణములు చేత ప్రసిద్ధుడు. ఈ పుట్టుక విషయమున నావంటివాడు కూడ తెలియరాకున్నాడు. ఇంక తపశ్శక్తి లేనివారు నిన్నెట్లెరుగుదురు?

బ్రహ్మాదిభి స్తత్ర్పవరై రభోధ్యం

త్వాం దేవ మూర్ఖాః స్వమననన్త సత్యా,

ప్రబోధ మిచ్ఛన్తి సతేషు బుద్ధి-

రుదారకీర్తి ష్వపి వేదహీనాః. 30

బ్రహ్మమొదలగు శ్రేష్ఠులకును తెలియని నిన్ను వేదహీనులగుమూర్ఖులు అనంతములగు నమస్కారములతో తెలియ గోరుచుందురు. గొప్పకీర్తి కల అట్టివారియందును సరియగు బుద్ధి లేదు.

జన్మాంతరై ర్వేదవిదాం వివేక-

బుద్ధి ర్భవే న్నాథ తవ ప్రసాదాత్‌,

త్వల్లబ్ధ లాభస్య స మానుషత్వం

న దేవగంధర్వ గతిః శివం స్యాత్‌. 31

నీ అనుగ్రహమువలన వేదములను చక్కగా ఎరిగినవానికి పెక్కుజన్మములలో వివేకబుద్ధి కలుగును. నీవు దొరికిన లాభమునకు మనుష్యత్వము, దేవత్వము, గంధర్వత్వము మొదలగునవి శుభములు కావు. (అవియేవియు నిన్నుపొందుట వంటివి కావని తాత్పర్యము)

త్వం విష్ణురూపోసి భవాన్‌ సుసూక్ష్మః

స్థూలోసి చేదం కృతకృత్యతాయాః,

స్థూలః సుసూక్ష్మః సులభోసి దేవ

త్వద్బాహ్యవృత్త్యా నరకే పతన్తి. 32

నీవు అంతట వ్యాపించినరూపము కలవాడవు. మిక్కిలి సూక్ష్మరూపుడవు. స్థూల రూపుడవును. ఈ స్థూలరూపము భక్తులను కృతకృత్యులను చేయుటకొరకు ఏర్పడినది. ఇట్లు స్థూల సూక్ష్మరూపములతో నుండు నీవు మిక్కిలి సులభుడవు. నీకు వెలియైన నడవడితో జనులు నరకమున కూలుదురు.

కి ముచ్యతే వా భవతి స్థితేస్మిన్‌

ఖాత్మ్యేన్దు వహ్న్యర్క మహీమరుద్భిః,

తత్వైః సతోయైః సమరూపధారి,

ణ్యాత్మస్వరూపే వితతస్వభావే. 33

వితతమైన స్వభావము గల నీవు ఆకాశము, చంద్రుడు, అగ్ని, సూర్యుడు, భూమి, వాయువు, జలము అనుతత్వములతో ఆత్మస్వరూపముతో, సమానమగు రూపములను ధరించు వానితో కూడియుండగా నింక చెప్పవలసిన దేమికలదు?

ఇతి స్తుతిం మే భగవన్ననంత

జుషస్వ భక్తస్య విశేషతస్య,

సృష్టిం సృజస్వేతి తవోదితస్య

సర్వజ్ఞతాం దేహి నమోస్తు విష్ణో. 34

అనంతా! భగవానుడా! భక్తుడనగు నాయీ స్తుతిని స్వీకరింపుము. సృష్టిచేయుమని నీవు పలికితివి. దానికై ఓ విష్ణూ! నాకు సర్వజ్ఞతను ప్రసాదింపుము.

చతుర్ముఖో యో యది కోటివక్త్రో

భ##వేన్నరః క్వాపి విశుద్ధచేతాః,

స తే గుణానా మయుతై రనేకై

ర్వదేత్‌ తదా దేవవరా ప్రసీద. 35

నాలుగుమోములు కలవాడు కానిమ్ము కోటిమోముల వాడు కానిమ్ము. ఎందైనను విశుద్ధబుద్ధి యైనచో కాని కోట్లకొలది అయిన నీ గుణములను చెప్పజాలడు. నాయందు ప్రసన్నుడవు కమ్ము.

సమాదియుక్తస్య విశుద్ధబుద్ధే

స్త్వద్భావ భావైక మనోనుగస్య,

సదా హృదిస్థోసి భవాన్నమస్తే

న సర్వగస్యాస్తి పృథగ్వ్యవస్థా. 36

ప్రభూ! సమాధిభావమును పొందినవాడు, పరిశుద్ధమైన బుద్ధికలవాడు, నీ భావముతప్ప అన్యమెరుగని మనస్సు కలవాడు అగువాని హృదయమున నీవు ఎల్లప్పుడు నుందువు. నీకు నమస్కారము. అంతటనుండు వానికి విడిగా నుండు స్థితి ఎక్కడిది?

ఇతి ప్రకాశం కృత మేత దీశ

స్తవం మయా సర్వగతం విబుద్ధ్యా,

సంసారచక్ర క్రమమాణ యుక్త్యా

భీతం పునీహ్యచ్యుత కేవలత్వమ్‌. 37

ప్రభూ! ఇట్లు నేను అంతటను ఉండెడు నిన్ను గూర్చి పరమశుద్ధమైన బుద్ధితో ఈ స్త్రోత్రమును చేసితిని. సంసారమను చక్రమును దాటు ఉపాయముచేత కేవలత్వమునకై భీతుడనైన నన్ను పవిత్రుని చేయుము.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

ఇతి స్తుత స్తదా దేవో రుద్రేణామిత తేజసా,

ఉవాచ వాక్యం సంతుష్టో మేఘగంభీర నిస్వనః. 38

మహాతేజస్సు గల రుద్రి డిట్లు స్తుతింపగా అంత ఆదేవుడు సంతుష్టుడై మేఘమువంటి గంభీరమగు కంఠధ్వనితో ఇట్లు పలికెను.

విష్ణు రువాచ - విష్ణువనెను

వరం వరయ భద్రం తే దేవదేవ ఉమాపతే,

న భేద శ్చావయో ర్దేవ ఏకా వావాముభా వపి. 39

దేవా! ఉమాపతీ! నీకు మేలగును. వరము కోరుకొనుము. మన యిరువురకు భేదము లేదు. మనయిరువురము ఒక్కటియే.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

బ్రహ్మణాహం నియుక్తస్తు ప్రజాః సృజ ఇతి ప్రభో,

తత్ర జ్ఞానం ప్రయచ్ఛస్వ త్రివిధం భూతభావనమ్‌. 40

ప్రభూ! బ్రహ్మ నన్ను ప్రజలను సృజింపుమని నియోగించెను. మూడు విధములైన భూతముల భావన కల ఆజ్ఞానమును నాకు ప్రసాదింపుము.

విష్ణు రువాచ - విష్ణు విట్లనెను.

సర్వజ్ఞ స్త్వం ససందేహో జ్ఞానరాశిః సనాతనః,

దేవానాంచ పరం పూజ్యః సర్వదా త్వం భవిష్యసి. 41

నీవు సర్వజ్ఞుడవు. సనాతనుడవగు జ్ఞానరాశివి. దేవత లందరకు నీవు ఎల్లవేళల పరమ పూజ్యుడవగుదువు.

ఏవముక్తః పున ర్వాక్య మువాచోమాపతిర్ముదా,

అన్యం దేహి వరం దేవ ప్రసిద్ధం సర్వజన్తుషు. 42

మూర్తో భూత్వా భవానేవ మామారాధయ కేశవ,

మాం వహస్వ చ దేవేశ వరం మత్తో గృహాణ చ,

యేనాహం సర్వదేవానాం పూజ్యాత్‌ పూజ్యతరో భ##వే. 43

హరి యిట్లనగా ఉమాపతి పరమసంతోషముతో మరల ఇట్లనెను. దేవా! నాకు మఱియు నొక వరమిమ్ము. నీవు ఆరాధింపుము. దేవదేవా! నన్ను వహింపుము. నా నుండి వరము కైకొనుము. దానితో నేను సర్వదేవతలకు పరమ పూజ్యుడ నగుదును.

విష్ణు రువాచ - విష్ణువిట్లనెను

దేవ కార్యావతారేషు మానుషత్వ ముపాగతః,

త్వామే వారాధయిష్యామి త్వం చ మే వరదో భవ. 44

దేవకార్యములకొరకైన అవతారములయందు నేను మనుష్యభావమును పొందువాడనై నిన్నే ఆరాధింతును. నీవు నాకు వరముల నొసంగువాడ వగుము.

యత్‌ త్వయోక్తం వహస్వేతి దేవదేవ ఉమాపతే,

సోహం వహామి త్వాం దేవ మేఘో భూత్వా శతం సమాః. 45

నీవు నన్ను వహింపుమంటివి. కావున దేవదేవా! ఉమాపతీ! నేను మేఘుడనై నిన్ను నూరేండ్లు మోయుదును.

ఏవా ముక్త్వా హరి ర్మేఘః స్వయం భూత్వా మహేశ్వరమ్‌,

ఉజ్జహార జలాత్‌ తస్మాద్‌ వాక్యం చేద మువాచ హ. 46

ఇట్లు పలికి హరి తనంతతాను మేఘరూపము నంది మహేశ్వరుని ఆ నీటినుండి పైకి తెచ్చెను. మరియు ఇట్లనెను.

య ఏతే దశ చైకశ్చ పురుషాః ప్రాకృతాః ప్రభో,

తే వై రాజా మహీం యాతా ఆదిత్యా ఇతి సంజ్ఞితాః. 47

మదంశో ద్వాదశో యస్తు విష్ణునామా మహీతలే,

అవతీర్ణో భవన్తం తు ఆరాధయతి శంకర. 48

ఈ పదునొకండుగురు పురుషులున్నారే, వీరు వైరాజులు. భూమికి దిగి ఆదిత్యులను పేరుతో వెలుగొందుదురు. నా అంశ గల పండ్రెండవ వాడు విష్ణువను పేరు కలవాడై భూమికి దిగి, శంకరా!, నిన్నారాధించును.

ఏవముక్త్వా స్వకాదంశాత్‌ సృష్ట్వాదిత్యం ఘనం తథా,

నారాయణః శబ్దవచ్చ స విద్మః క్వ లయం గతః. 49

ఇట్లు పలికి తనదైన అంశమువలన ఆదిత్యుని, మేఘమును సృజించి నారాయణుడు, శబ్ధమువలె, ఎందు లయమయ్యెనో మేమెరుగుము.

రుద్ర ఉవాచ - రుద్రు డనెను.

ఏవ మేష హరి ర్దేవః సర్వగః సర్వభావనః,

వరదోభూత్‌ పురా మహ్యం తేనాహం దైవతై ర్వరః. 50

ఇట్లా హరిదేవుడు అంతట నుండువాడు. అన్ని బావనలు కలవాడు పూర్వము నాకు వరము నొసగెను. అందువలన నేను దేవతలలో శ్రేష్ఠుడ నైతిని.

నారాయణాత్‌ పరో దేవో న భూతో న భవిష్యతి,

ఏతద్‌ రహస్యం వేదానాం పురాణానాం చ సత్తమ,

మయా వః కీర్తితం సర్వం యథా విష్ణు రిహేజ్యతే. 51

నారాయణుని కంటె మిన్నయగు దేవుడు మునుపు లేడు. ముందు కలుగడు. ఇది వేదములయు, పురాణములయు రహస్యము. విష్ణువు ఎట్లు పూజ్యుడయ్యెనో నేను మీకంతయు తెలియజెప్పితిని.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే త్రిసప్తతి తమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదిమూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters