Varahamahapuranam-1    Chapters   

చతుఃసప్తతితమో7ధ్యాయః - డెబ్బదినాలుగవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లనెను.

పునస్తే ఋషయః సర్వే తం పప్రచ్ఛుః సనాతనమ్‌,

రుద్రం పురాణ పురుషం శాశ్వతం ధ్రువ మవ్యయమ్‌,

విశ్వరూప మజం శంభుం త్రినేత్రం శూలపాణినమ్‌. 1

సనాతనుడు, పురాణపురుషుడు శాశ్వతుడు, స్థిరుడు, అవ్యయుడు, విశ్వరూపుడు, అజుడు, శంభువు, ముక్కంటి, శూలపాణి అయిన ఆ రుద్రుని ఋషులందరు మరల ఇట్లు ప్రశ్నించిరి.

ఋషయః ఊచుః - ఋషు లిట్లనిరి.

త్వం పరః సర్వదేవానా మస్మాకం చ సురేశ్వర,

పృచ్ఛామ తేన త్వాం ప్రశ్న మేకం తద్వక్తు మర్హసి. 2

భూమి ప్రమాణ సంస్థానం పర్వతానాంచ విస్తరమ్‌,

సముద్రాణాం నదీనాం చ బ్రహ్మాండస్య చ విస్తరమ్‌,

అస్మాకం బ్రూహి కృపయా దేవ దేవ ఉమాపతే. 3

దేవదేవా! నీవు మాకును, సర్వదేవతలకును అధికుడవు. కావున నిన్నొక ప్రశ్న నడుగుచున్నాము. దానిని గూర్చి చెప్పవలయును. ఈ భూమికొలతయు, పర్వతముల వైశాల్యము, అనువానిని మాయందు కృపతో నీవు చెప్పుము.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

సర్వేష్వేవ పురాణషు భూర్లోకః పరికీర్త్యతే,

బ్రహ్మ విష్ణు భవాదీనాం వాయవ్యేచ సవిస్తరమ్‌. 4

ఇదానీం చ ప్రవక్ష్యామి సమాసాద్‌ వః క్షమాన్తరమ్‌,

తన్నిబోధత ధర్మజ్ఞా గదతో మమ సత్తమాః. 5

బ్రహ్మ, విష్ణు, శివమొదలగు పేర్లు కలవియు, వాయు సంబంధమైనదియునగు అన్ని పురాణములయందును భూలోకమును విస్తరముగా చెప్పియున్నారు. ఉత్తములారా! ధర్మజ్ఞులారా! ఇప్పుడు సంగ్రహముగా భూమికొలతను గూర్చి మీకు చక్కగా చెప్పెదను. చక్కగా తెలిసికొనుడు.

యోసౌసకల విద్యావబోధిత పరమాత్మరూపీ విగత

కల్మషః పరమాణు రచిన్త్యాత్మా నారాయణః సకల

లోకాలోక వ్యాపీ పీతాంబరోరువక్షః క్షితిధరో గుణతో

ముఖ్యతస్తు అణుమహద్ధీర్ఘ హ్రస్వ మకృత మలోహిత

మిత్యేవమాద్యోపలక్షిత విజ్ఞాన మాత్రారూపమ్‌.

సమస్త విద్యలచేత చక్కగా తెలియబడు ఆ పరమాత్మ కల్మసములు లేనివాడు, అతి సూక్ష్మస్వరూపుడు. ఊహింపనలవికాని ఆత్మకలవాడు. నారాయణుడు. భౌతికము, పారమార్థికము అయిన రెండులోకములందును వ్యాపించియున్నవాడు. పచ్చని వస్త్రము ధరించినవాడు. విశాలమైనవక్షస్సు కలవాడు. భూమిని ధరించినవాడు. గుణములనుబట్టియు, ప్రధానముగను అంతయు తానే అయినవాడు. అణు స్వరూపుడు, మహాస్వరూపుడు. పొడవైనవాడు, హ్రస్వరూపుడు. చేయబడనివాడు. ఎర్రదనము లేనివాడు, మొదలైన లక్షణములతో గుర్తింపదగిన వాడయ్యు కేవలము విజ్ఞాన స్వరూపుడు.

స భగవాంస్త్రి ప్రకారః సత్వరజస్తమోద్రిక్తః సలిలం ససర్జ.

సత్వము, రజస్సు, తమస్సు అనువాని ఉద్రేకములు కలిగి మూడు విధములైనవాడై ఆ భగవానుడు మొదట జలమును సృజించెను.

తచ్చ సృష్ట్వా నాది పురుషః పరమేశ్వరో నారాయణః

సకలజగన్మయః సర్వమయో దేవమయో యజ్ఞమయ

ఆపోమయ ఆపోమూర్తి ర్యోగనిద్రయా సుప్తస్య తస్య

నాభౌ సదబ్జం నిస్ససార.

దానిని సృజించి ఆ అనాదిపురుషుడు, పరమేశ్వరుడు ఆనారాయణుడు, సకలజగన్మయుడు, సర్వమయుడు, దేవమయుడు, యజ్ఞమయుడు, జలమయుడు, జలస్వరూపుడు అగు ఆ దేవుడు యోగనిద్రతో నిద్రించుచున్నవాడై తన బొడ్డునందు ఒకచక్కని పద్మమును వెలువరించెను.

తస్మిన్‌ సకల వేదనిధి రచిన్త్యాత్మా పరమేశ్వరో

బ్రహ్మా ప్రజాపతి రభవత్‌

ఆ పద్మమునందు సమస్తవేదములకు నిధి, ఊహింపనలవి కానివాడు, పరమేశ్వరుడు, నగు బ్రహ్మయను ప్రజాపతి ఉదయించెను.

సచ సనక సనందన సనత్కుమారాదీన్‌ జ్ఞానధర్మిణః

పూర్వ ముత్పాద్య పశ్చాన్మనుం స్వాయంభువం మరీచ్యా

దీన్‌ దక్షాంతాన్‌ ససర్జ.

ఆతడును సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, మొదలగు జ్ఞానస్వరూపులగు వారిని తొలుత సృష్టించి పిదప స్వాయంభువమనువును, మరీచి మొదలుకొని దక్షుడు తుదిగా గల ప్రజాపతులను సృష్టిచేసెను.

యః స్వాయంభువో మను ర్భగవతా సృష్ట స్తస్మా

దారభ్య భువనస్యాతి విస్తరో వర్ణ్యతే.

ఆ స్వాయంభువమనువును భగవంతుడు సృజింపగా ఆతని వలన భువనమును మిక్కిలి విశాలమై రచిత మాయెను.

తస్య చ మనోర్ద్వౌ పుత్రౌ బభూవతుః ప్రియవ్రతో త్తాన పాదౌ.

ఆమనువున కిద్దరుకొడుకులు. ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనువారు కలిగిరి.

ప్రియవ్రతస్య దశపుత్రా బభూవుః - ఆగ్నీథ్రోగ్ని

బాహుర్మేధో మేధాతిథి ర్ధ్రువో జ్యోతిష్మాన్‌ ద్యుతిమాన్‌

హవ్యవపుష్మత్సవనాన్తాః.

ప్రియవ్రతునకు, ఆగ్నీధ్రుడు, అగ్నిబాహువు, మేథుడు, మేధాతిథి, ధ్రువుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, వపుష్మంతుడు, సవనుడు అను పదుగురు కొడుకులు కలిగిరి.

సచప్రియవ్రతః సప్తద్వీపేషు సప్తపుత్రాన్‌

స్థాపయామాస తత్ర చాగ్నీధ్రం జంబూద్వీపేశ్వరం చక్రే.

ఆ ప్రియవ్రతుడు ఏడుద్వీపములయందును ఏడుగురు కుమారులను నిలిపెను. అందు ఆగ్నీధ్రుని జంబూద్వీపమునకు అధిపతిగా చేసెను.

శాకద్వీపేశ్వరం మేధాతిథిం కుశే జ్యోతిష్మ న్తం

క్రౌఞ్చిద్యుతి మన్తం శాల్మలే వపుష్మన్తం గోమేదస్యేశ్వ

రం హవ్యం పుష్కరాధిపతిం సవన మితి.

శాకద్వీపమునకు, ఈశ్వరునిగా మేధాతిథిని, కుశద్వీపమున జ్యోతిష్మంతుని, క్రౌంచమున ద్యుతిమంతుని, శాల్మలమున వపుష్మంతుని, గోమేదమునకు హవ్యుని, పుష్కరద్వీపమున కధిపతిగా నవనుని చేసెను.

పుష్కరేశ్వరస్యాపి సవసస్య ద్వౌ పుత్రౌ మహావీతధాతకీ

భ##వేతామ్‌.

పుష్కరద్వీపప్రభువగు సవమనకు మహావీతుడు ధాతకి అను ఇరువురు పుత్రులు కలరు.

తయో ర్దేశా గోమేదశ్చ నామ్నా వ్యవస్థితౌ ధాతకే ర్ధాతకీఖండం కుముదస్యచ కౌముదమ్‌.

వారి దేశములును వారిపేరులతో ఏర్పడినవి, ధాతకిది ధాతకీఖండము. కుముదునిది కౌముదము.

శాల్మలాధిపతే రపి వపుష్మస్తస్య త్రయః పుత్రాః

సకుశ##వైద్యుత జీమూతనామానః. సకుశస్య సకుశనామా

దేశః వైద్యుతస్య వైద్యుతః జీమూతస్య జీమూత ఇతి

ఏతే శాల్మలే ర్దేశా ఇతి

శాల్మలీద్వీపము అధిపతి వపుష్మంతునకు ముగ్గురు పుత్రులు సకుశుడు, వైద్యుతుడు, జీమూతుడు అను వారు. సకుశునకు సకుశమను పేరుగల దేశము, వైద్యుతునకు వైద్యుతము. జీమూతునకు జీమూతము అనునివి శాల్మలి యొక్క దేశములు.

తథా చ ద్యుతిమతః సప్త పుత్రకాః కుశలో మమ

గోష్ఠౌష్ణః పీవరో ద్యాంధకారకముని దుందుభి శ్చేతి తన్నామ్నా క్రౌఞ్చే సప్త మహాదేశనామాని.

అట్లే ద్యుతిమంతునకు ఏడుగురు కొడుకులు. కుశలుడు, మనువు, గోష్ఠుడు, ఉష్ణుడు, పీవరుడు, ఉద్యాంధకారకుడు, ముని దుందుభి అనువారు. వారి పేర్లతో క్రౌంచమున ఏడు మహాదేశముల పేర్లు కూడా ఇట్టివియే.

కుశద్వీపేశ్వరస్యాపి జ్యోతిష్మతః సపై#్తవ పుత్రా స్తద్యథా

ఉద్భిదోవేణుమాంశ్యైవ రథోపలంబనో ధృతిః ప్రభాకరః

కపిల ఇతి తన్నా మన్యేవ వర్షాణి ద్రష్టవ్యాని.

కుశద్వీపాధిపతి జ్యోతిష్మంతునకును ఏడుగురు పుత్రులు. ఉద్భిదుడు, వేణుమంతుడు, రథుడు, ఉపలంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారు. వారి పేరులతోడనే దేశములును చూడదగును.

శాకాధిప స్యాపి సప్త పుత్రా మేధాతిథే స్తద్యథా

శాంతభయ శిశిర సుఖోదయ నందశివ క్షేమక ధ్రువా

ఇతి. ఏతే సప్తపుత్రాః. ఏతన్నామా న్యేవ వర్షాణి.

శాకద్వీపము అధిపుడగు మేధాతిథికిని ఏడుగురు కొడుకులు. శాంతభయుడు, శిశిరుడు, సుఖోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనువారు. ఇవియే వారేలెడు దేశములకును పేర్లు.

అథ జంబూద్వీపేశ్వరస్యాపి ఆగ్నీధ్రస్య నవ పుత్రా

బభూవుః తద్యథానాభిః కింపురుషో హరివర్ష

ఇలావృతోరమ్యకో హిరణ్మయః కురు ర్భ్రద్రాశ్వః

కేతుమాల శ్చేతి. ఏతన్నామాన్యేవ వర్షాణీ నాభేర్హేమవన్తం

హేమకూటం కింపురుషం నైషధం హరివర్షం మేరుమధ్య

మిలావృతం నీలం రమ్యకం శ్వేతం హిరణ్మయం

ఉత్తరం చ శృంగ వతః కురవో మాల్యవంతం భద్రాశ్వం

గంధమాదనం కేతుమాల మితి. ఏవం స్వాయంభువేన్తరే

భువనప్రతిష్ఠా కల్పేకల్పే చైవ మేవ సప్తసప్త పార్థివైః

క్రియతే భూమేః పాలనం వ్యవస్థాచ.

ఇంక జంబూద్వీపాధిపతి ఆగ్నీధ్రునకు తొమ్మండుగురు కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనువారు వీరిపేర్లే దేశములకును ఏర్పడినవి. నాభికి మంచుగల హేమకూటము కింపురుషునిది కింపురుషము, నైషధునిది హరివర్షము, మేరుపునడిమి భాగము ఇలావృతునిది, నీలము రమ్యకునిది. శ్వేతము హిరణ్మయునిది, ఉత్తరపర్వతములు కురువునకు చెందినవి, మాల్యవంతము భద్రాశ్వునిది, గంధమాదనము కేతుమాలునిది. స్వాయంశువమన్వంతరమున భువన ప్రతిష్ఠ ఇట్టిది. ప్రతికల్పము నందును ఇట్లే ఏడుగురేడుగురు భూమిని పాలింతురు. భూమివ్యవస్థయు ఇట్టిదిగా నుండును.

ఏష స్వభావః కల్పస్య సదా భవతీతి.

ఎల్లప్పుడు కల్పము స్వభావము ఇదియే యగును.

అత్ర నాభేః సర్గం కథయామి నాభి ర్మేరు దేవ్యాం

పుత్ర మజనయద్‌ ఋషభనామానం తస్య భరతో

పుత్రశ్చ తావదగ్రజః తస్య భరతస్య పితా ఋషభో

హిమాద్రే ర్దక్షిణం వర్ష మాదాద్‌ భారతం నామ. భరతస్యాపి

పుత్రః సుమతి ర్నామా తస్య రాజ్యం దత్వా భరతోపి

వనం య¸°.

ఇందు నాభి సృష్టిని చెప్పెదను. నాభి మేరుదేవి యందు ఋషభుడను పేరుగల కొడుకును కాంచెను. ఆతని పెద్దకుమారుడు భరతుడు. ఆ భరతునకు తండ్రి ఋషభుడు హిమవత్పర్వతమునకు దక్షిణమున గల భారతమను వర్షము నిచ్చెను. భరతునకు సుమతియను కొడుకుపుట్టెను. అతనికి రాజ్యమొసగి భరతుడు వనమున కరిగెను.

సుమతే స్తేజ స్తత్ర్పుత్రః సత్సు ర్నామా తస్యాపీన్ద్ర

ద్యుమ్నో నామ, తస్యా పి పరమేష్ఠీ తస్యాపి ప్రతిహర్తా

తస్య నిఖాతః నిఖాతస్య ఉన్నేతా, ఉన్నేతు రప్యభావ

స్తస్యోద్గాతా తస్య ప్రస్తోతా, ప్రస్తోతుశ్చ విభుః విభోః

పృథుః పృథోరనన్తః అనంతస్యాపి గయః గయస్య నయ

స్తస్య విరటః తస్యాపి మహావీర్య స్తతః సుధీమాన్‌,

ధీమతో మహాన్‌ మహతో భౌమనో భౌమనస్య తృష్టా

త్వష్టు ర్విరజాః తస్య రాజో రాజస్య శతజిత్‌.

సుమతికి తేజుడు, అతనికి సత్సువు, అతనికి ఇంద్రద్యుమ్నుడు, అతనికి పరమేష్ఠి, అతనికి ప్రతిహర్త, అతనికి నిఖాతుడు, అతనికి ఉన్నేత, అతనికి అభావుడు, అతనికి ఉద్గాత, ఉద్గాతకు ప్రస్తోత, ప్రస్తోతకు విభువు, విభువునకు పృథువు, పృథువునకు అనంతుడు, అనంతునకు గయుడు, గయునకు నయుడు, అతనికి విరాటుడు, అతనికి మహావీర్యుడు, అతనికి సుధీమంతుడు, అతనికి మహత్తు, అతనికి భౌవనుడు, అతనికి శతజిత్తును పుత్రులు.

తస్య పుత్రశతం జజ్ఞే తేనేమా వర్ధితాః ప్రజాః,

తై రిదం భారతం వర్సం సప్తద్వీపం సమాంకితమ్‌. 6

ఆ శతజిత్తునకు నూరుగురు కొడుకులు పుట్టిరి. వారిచేత ప్రజలు వృద్ధిపొందిరి. వారిచేత ఏడు ద్వీపములుగల భారతవర్షము గుర్తింపబడినది.

తేషాం వంశప్రసూత్యా తు భుక్తేయం భారతీప్రజా,

కృతత్రేతావియుక్త్యాతు యుగాఖ్యా హ్యేకసప్తతిః. 7

వారి వంశపు సంతానము ఈ భారత ప్రజలను కృత, త్రేత మొదలగు పేర్లు గల డెబ్బదియొక్క యుగముల కాలము పాలించినది.

భువనస్య ప్రసంగేన మన్వంతర మిదం శుభమ్‌,

స్వాయంభువం చ కథితం మనోర్ద్వీపా న్నిబోధత. 8

భువనప్రసంగముచేత శుభమగు స్వాయంభువమును గూర్చి చెప్పితిని. మనుపుయొక్క ఇతర ద్వీపములను గూర్చి ఇటుపై తెలిసికొనుము.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుః సప్తతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదినాలుగవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters