Varahamahapuranam-1    Chapters   

భూమిక.

ధర్మశాసనకర్తమనువు ఇతిహాస పురాణముల ద్వారమున వేదమును పెంపొందించుకొనవలయునని ఆదేశించెను. ''ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌'' - ఇచట సముపబృంహణ మనగా వేదార్ధము యొక్క సమ్యగర్థభావనను పొందుట యనియే తాత్పర్యము. వేదము అపౌరుషేయము కనుక, వేదవాక్యములు మహాగంభీరముగా నుండును కనుక, లౌకిక వాక్యములకు వలె కొంచెముపాటి జ్ఞానముతో ఇచ్చవచ్చిన చొప్పున అర్థమును చెప్పుకొని 'ఇదిఇంతే', 'ఇందలి అర్థము ఇంతమాత్రమేనా?' అన్న ధోరణితో తేలికపరచి చూడరాదన్న ఎచ్చరిక మనువు వాక్యమున సంభావింపదగినది.

దీనినిబట్టి చూడగా పురాణములు వేదములకు భాష్యముల వంటివని యెఱుగదగును. సాక్షాచ్ఛ్రీమన్నారాయణుడే అయిన వేదవ్యాసులవారు సర్వపురాణములకు కర్తగా ప్రస్తుతి కెక్కినారు. సర్వమానవసమాజమునందును నిర్వ్యాజము, అపారమునైన వాత్స్యలముగల శ్రీవేదవ్యాసులవారు మానవుడు మాధవుడు కావలయునన్న తపనతో, రుచికనుగుణముగా ఎన్నుకొని ఎన్నిక కెక్కవలయునన్న భావనతో పరమ పవిత్రము. సర్వసమర్థము, వేదసమ్మితము నైన వాజ్మయమును తనబుద్ధి విశేషముతో దర్శించి రూపకల్పన చేసి మనకు ప్రసాదించిరి. అందులో ఒకటి చిన్న, మఱి యొకటి మిన్న అని తలచుట అవివేకపు మొదటి మెట్టు. అది అంతయు ఏకాకారమున వేదమే అనదగినది. వేదరహస్యములను విప్పి చెప్పుటకు ప్రవర్తించినదియే యని సంభావింపదగినది. దానిలో ఒక భాగమే పురాణవాజ్మయము.

పురాణమును తత్త్వజ్ఞు లొకవిద్యగా పరిగణించిరి. ''సా విద్యా యా విముక్తయే'' అని ఒక ఆర్షవాక్కు. విముక్తికి పనికివచ్చునదియే విద్య అని దాని తాత్పర్యము. కనుక పురాణములు మానవుని అజ్ఞానరూపసంసారబంధమునుండి విడిపించి ఆతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదించి కైవల్యరూపమహా సామ్రాజ్యపట్టభద్రుని గావింప సమర్థములయిన వాక్స్వరూపములని గుర్తింపదగును.

మహాపురాణములుగా ప్రసిద్ధి కెక్కినవి పదునెనిమిది. వీనిని ప్రాయశః 'జయ' శబ్దముతో వ్యవహరింతురు. ''కాదినవ, టాదినవ, యాద్యష్టౌ'' అన్న సంఖ్యా సంకేత క్రమము ననుసరించి 'జ' అనునది ఎనిమిదికి సంకేతము. యకారము ఒకటికి సంకేతము. ''అంకానాం వామతో గతిః'' అను న్యాయము ననుసరించి జ-8, య-1 =18 అను స్థితి ఏర్పడును. ఇది కేవలము సంఖ్యను చెప్పుటకు మాత్రమే కాదు పూర్ణత్వస్ఫోరకము కూడ. 1+8=9. తొమ్మిది పూర్ణసంఖ్య. మఱియు 'యజ' -యజింపుము. అన్న సంస్కృతపదమును త్రిప్పి చదివినచో 'జయ' అగును. అనగా జయ నామక గ్రంథమును పురుషుడు పురుషోత్తమస్థితిలాభమునకై యజనరూపమున నిరంతరము ఉపాసింపవలయునన్న అర్థము స్ఫురించును. ఈ వంకరదారియేల? సూటిగా చెప్పరాదా? అని ఏబుద్ధిమంతుడైన ప్రశ్నించునన్న సంభావనతోడనే శ్రుతిమాత ''పరోక్షప్రియా ఇవహి దేవాః'' అని వక్కాణించినది. దివ్యభావములు పరోక్ష ప్రియములవలె నుండును. అని ఆ వాక్యమునకు తాత్పర్యము లోకమునందును గొప్పవిలువగల వస్తువులను గుట్టుగా నుంచుటయు, అందరకు తెలియరాని విషయములను భంగ్యంతరముగా చెప్పుకొనుటయు కానవచ్చుచున్నదిగదా! ఆర్ష వాఙ్మయమునందే 'కశ్యప' శబ్దమొక్కటి కలదు. పశ్యకుడను నర్థము దానికి వేదమాతయే చెప్పినది. సర్వమును అంతట చక్కగా దర్శించువాడను భావమును గూడ వివరించినది. కనుక జయ శబ్దమును త్రిప్పిచూచుకొనుట సంప్రదాయ విరుద్దముకాదు.

పురాణములను సులభముగా గుర్తించుటకు ఒక శ్లోకమును ఋషులు మనకు అనుగ్రహించిరి.

''భద్వయం మద్వయంచైవ బ్రత్రయం వచతుష్టయమ్‌ '

అనాపలింగకూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌''

(1) భద్వయమ్‌ - ˳ÏÁNSLRiª«sVV»][ úFyLRiLi˳ÏÁª«sVgRiVƒ«s„s lLiLi²R…V 1. ˳ÏÁ„sxtsQùxmsoLSß᪫sVV 2. ˳ØgRiª«s»R½xmsoLSß᪫sVV.

(2) మద్వయమ్‌ - ª«sVNSLRiª«sVV»][ lLiLi²R…V. 3. ª«sV»R½=Qù 4. ª«sWLRiäLi®²…[¸R…VxmsoLSß᪫sVVÌÁV

(3) బ్రత్రయమ్‌ - ú‡ÁNSLRiª«sVV»][ ª«sVW²R…V. 5. ú‡Áx¤¦¦¦ø 6. ú‡Á¥¦¦¦øLi²R… 7. ú‡Áx¤¦¦¦øQ\®ªsª«sLRiòxmsoLSß᪫sVVÌÁV

(4) వచతుష్టయమ్‌ - ª«sNSLSµR…VÌÁV ƒyÌÁVgRiV 8. „sxtñsv 9. ªyª«sVƒ«s 10. ªy¸R…VV 11. ª«sLSx¤¦¦¦ xmsoLSß᪫sVVÌÁV.

5. అనాపలింగకూస్కాని - (12) @gjiõ (13) ƒyLRiµR… (14) xmsµR…ø (15) ÖÁLigRi (16) gRiLRiV²R… (17) NRPWLRiø (18) xqsäLiµR… xmsoLSß᪫sVVÌÁV

ఇందులో దశావతారములకు సంబంధించి నాలుగు పురాణములు గలవు - (1) మత్స్య (2) కూర్మ (3) వరాహ (4) వామన పురాణములు

ప్రాయశః పురాణములలో ఆదిసృష్టి, అనంతర సృష్టి, రాజవంశములు, మన్వంతరములు, వంశానుచరితము అను ఐదు అంశములు ఉండునని భావన. పంచలక్షణాత్మకమయినది, ఈ విధముగా, పురాణము, దీనిని జాగ్రత్తతో పరిశీలించినచో అనంతమైన కాలభావనతో రూపందిన వాఙ్మయమే పురాణమని తెలియవచ్చును. భగవంతుడు కాలాత్మకుడు. ఆ విధముగా మరల పురాణవిద్య కాలరూపపరమాత్మను వివిధకోణములనుండి దర్శించి వర్ణించినదను నర్థము సిద్ధించుచున్నది.

గీతలో స్వామి తనకు మూడు కర్తవ్యములు కలవని వక్కాణించెను. సాధు పరిత్రాణనము, దుష్టవినాశనము, ధర్మస్థాపనము అనువానికై ప్రతియుగమున తా నవతరింతునని చెప్పెను. అవతారమనగా దిగివచ్చుట. ఇచ్ఛాపూర్వకమైన జన్మకర్మములతో స్వామి భూమికి దిగివచ్చి తన కర్తవ్యములను మూడింటిని నిర్వహించి మరల తన ధామమునకు చేరుకొనుట సాధారణముగా ప్రతి అవతారమునందును కానవచ్చును. మఱియొక విధముగా చూచినచో సర్వాంతర్యామియు, నామరూపాది రహితుడును నగు పరమాత్మ తన అంశము నొక ఉపాధియందు ప్రవేశ##పెట్టి నామరూపములతో విలాసముగా వర్తించుటయే అవతారము. నిజమున కిట్టి అవతారము లనంతములుగా నున్నను పరిమిత జ్ఞానముగల మానవులకు పరిగణించి చెప్పవలసిన పరిస్థితి యుండుటచే దశావతారములు, ఏకవింశత్యవతారములు మున్నగు సంఖ్యా పూర్వక కథనమను శ్రీ వ్యాసులు సంభావించిరి. అట్టి వానిలో వరాహావతారము సుప్రసిద్ధమైనది. వరాహరూప శ్రీమన్నారాయణుడు వసుంధరకు తెలిపిన జ్ఞానస్వరూపమే వరాహపురాణము.

''వర మాహన్తీతి వరాహః'' అని వరాహ శబ్దమునకు లింగాభట్టు భావించిన అర్థము. వరము - మేలైనది - శ్రేష్ఠమైనది - దానిని నాశనము చేయునది - వరాహము - పంటలు మొదలగు వానిని పాడుచేయునది అని స్థూలముగా తాత్పర్యము. జంతుపరముగా ఈ అర్థము సరియైనదేకాని స్వామిపరముగా ఇది యెట్లు కుదురునో పరిశీలింపవలసియున్నది. వరమనగా కోరబడునది యనియు నొక అర్థము. సాధారణముగా మానవుడు భౌతికములు, నశ్వరములు నగు నెన్నింటినో కోరుచుండును. అవి స్వభావతః ఆతనియందు మమకారాదులను గలిగించి ఆతని ప్రణాశస్థితికి మొదటి మెట్టులగుచుండును.

''ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే,

సంగా త్సంజాయతే కామః కామాత్ర్కోధోభిజాయతే.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతి విభ్రమః,

స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ర్పణశ్యతి''

@¬sgRiµy gki»R½ ª«sNSäßÓáLiÀÁƒ«sµj…. NRPƒ«sVNRP µR…¸R…WryLiúµR…V\®²…ƒ«s xmsLRiª«sW»R½ø ¬s»yù¬s»R½ù„s®ªs[NRPª«sVVƒ«sV gRiÖÁgjiLi¿RÁV¿RÁV @¬s»R½ùª«sVV\ÛÍÁƒ«sƒ«sV, @„s®ªs[NRPª«sVV¿Á[ ª«sWƒ«sª«so²R…V N][lLi²R…V ""ª«sLRiª«sVVÌÁƒ«sV'' Fy²R…V¿Á[¸R…VVƒ«sV. A„sµ³R…ª«sVVgS A»R½²R…V ª«sLSx¤¦¦¦§²R…V. ª«sVLji¸R…V x¤¦¦¦ƒ«sµ³y»R½Vª«soƒ«sNRPV gRi»R½ùLóRiª«sVV NRPW²R… NRPÌÁµR…V. µy¬s¬s‡ÁÉíÓÁ ª«sLRiª«sVVƒ«sV F~Liµj…Li¿RÁVªy²R…¬s¸R…VV @LóRiª«sVVƒ«sV xqsLi˳؄sLiÀÁƒ«s¿][ ¬s»R½ùQ\®ªsVƒ«s µy¬s¬s F~Liµj…Li¿RÁVªy²R…ƒ«sV ƒ«sLóRiª«sVV zqsµôðj…Li¿RÁVƒ«sV. A „sµ³R…ª«sVVgRiƒ«sV A»R½²R…V ª«sLSx¤¦¦¦§²R…V. aRP‡ôÁaSxqsòQûª«sVV NRPÖÁöLiÀÁƒ«s @ª«sNSaRPª«sVVƒ«sV ‡ÁÉíÓÁ ˳ÏÁgRiª«sµj…*xtsQ¸R…VNRPª«sVVgS BÉíÓÁ @LóRiª«sVVÌÁƒ«sV xqsLi˳؄sLi¿RÁVÈÁ ®ªs[Vµ³y„sÌÁxqsƒ«sª«sVVgS N]ÉíÓÁ®ªs[¸R…VµR…gjiƒ«s „sxtsQ¸R…Vª«sVV NSµR…V.

వరాహ పురాణమున భూదేవి వరాహదేవుని, మానవకల్యాణమునకు సంబంధించిన అనేక విషయములను గూర్చి పరిప్రశ్నచేసెను. సర్వజ్ఞుడైన భగవంతుడు ఆనందముతో అన్ని ప్రశ్నలకు సంతృప్తికరములైన సమాధానములను చెప్పెను. ఆమె తపన యంతయు మానవజాతి సముద్దరణ మెట్లగునా? అనియే. తల్లి హృదయము తనయుల పాట్లకు తల్లడిల్లుచుండునుగదా! తనయులు కర్మవశాధీనులై గమ్య మెరుగక సంసారచక్ర పరిభ్రమణమున సతమతమగుచుందురు. వారి కష్టములన్నియు తనవిగా భావించి తల్లి కుందిపోవుచుండును. ఎవ్వనికి ఏది దారియో తెలిసికొని అందరిని గట్టెక్కింపవలయునను ఆరాటముతో ఆమె అడుగుచునే యుండును. దయాసముద్రుడైన శ్రీమన్నారాయణుడు ''పితాహమస్య జగతః'' అని ప్రకటించెను గనుక ఆఆరాటములో ఆయనయు తలమున్కలై పరిష్కారమార్గములను చెప్పుచునే యుండును. దౌర్భాగ్యము విచిత్రమైనది! పట్టించుకొననివాడు బయటపడవలసినబాలుడు మాత్రమే. అయినను తల్లిదండ్రులకు అలుపుసొలుపులుండవు. ఆధోరణిలో సాగిన ప్రశ్నోత్తరరూపమైన ఈ పురాణమున సదవగాహన కాని కర్మబద్దునకు పునరుక్తులు. 'చాదస్తపు' వర్ణనలు, రసవిహీన విషయకథనములు, తన అల్పాల్పబుద్ధికి తోచిన సమన్వయరాహిత్యము - మున్నగు లక్షణములు కన్పట్టును. ఏదృష్టితో వీని నిట్లు చెప్పుట అనివార్యమైనదో సమన్వయించుకొనగలిగెడు బుద్ధి చాతుర్యము కలవానికి ఇదియొక అమృతకలశము. ఈ విషయమున పాఠకుని బాధ్యత ఎటువంటిదో నొక్కిచెప్పుటకై యీమాటలు వ్రాయవలసివచ్చినది.

భూదేవి సృష్టిక్రమమున గూర్చి ప్రశ్నించుట, శ్రీవరాహ దేవడు ఆదిసృష్టిని వక్కాణించుట, ప్రియవ్రతోపాఖ్యానము, నారదోపాఖ్యానము, అశ్వశిర ఉపాఖ్యానము, రైభ్యబృహస్పతి సంవాదము, వసుకథ, ధర్మవ్యాధోపాఖ్యానము, మత్స్యావతారకథనము, దుర్జయుని వృత్తాంతము, దుర్జయగౌరముఖ సంవాదము, మార్కండేయ గౌరమఖసంవాదము, పితృదేవతల ఆవిర్భావము, శ్రాద్ధవర్ణనము, శ్రాద్దవిది, సరమాకథ, ప్రజాపాల మహాతపులకథలతో ఈపురాణము ప్రారంభమయినది. తిథుల ప్రత్యేకతలను వివరించు వృత్తాంతములతో పురాణము కొనసాగినది.

అటుపై దుర్వాసస్సత్యతపుల సంవాదరూపమున అనేక ద్వాదశీవ్రతముల వివరణలు రూపొందినవి. ఇవికాక ధన్యవ్రత, కాంతివ్రత సౌభాగ్యవ్రతాదులనుగూర్చిన కథనములున్నవి.

ఆపై విష్ణు నారదసంవాదమున యుగాదుల ప్రమాణము, బ్రాహ్మణపరిభ్రష్టత, ప్రాయశ్చిత్తకాండ మున్నగునవి ప్రస్తావనకు వచ్చినవి. జంబూద్వీపాది భౌగోళిక వర్ణనము అతివిస్తృతముగా రూపొందినది. దాని వెనుక శక్తిలీలలు, విష్ణుభక్తుల లీలలు, నారాయణార్చన విధానములు, కోలాముఖ తీర్థవర్ణన, ఋతుభేదము ననుసరించి అర్చనలభేదములు వర్ణనకు వచ్చినవి. విష్ణుమాయనుగూర్చి ఈ పురాణము అతివిస్తృతమైన, రసవత్తరమైన కథలను చెప్పినది. అందులోనివే. సొమశర్మోపాఖ్యానము, కోలాముఖతీర్థవర్ణనము, కుబ్జామ్రక తీర్థవర్ణనలు మొదలైనవి. వేరువేరువర్ణముల వారికి సంబంధించిన దీక్షలు, పాపములు, ప్రాయశ్చిత్తములు మొదలగువానిని విస్తృతముగా వర్ణించున్నది ఈ పురాణము. .

ఇంతవరకు ఇది ఈ ప్రథమసంపుటమునందలి వృత్తాంతముల సంగ్రహపరిచయము.

ఇక ఈ పురాణమునందలి భాషను గూర్చి రెండు మాటలు. ఈనాటికి స్థిరపడిన

ప్రామాణిక సంస్కృతభాషకు లొంగని ప్రయోగము లెన్నియో యిందుకలవు. విశేషణ విశేష్యములలో లింగవచన విభ##క్త్యైక్యము, కర్తృక్రియలలో వచనమున కేకరూపత మొదలగు నియమములు సరిపడని తావులు పెక్కులు కలవు. అవి యన్నియు ఆర్షసంస్కృతమునకు సంబంధించిన ప్రయోగములుగా భావించి సవరించు పనికి పూనుకొనలేదు. ఇంతకు పూర్వము ఆచార్యాఆనంద స్వరూపగుప్తగారి సంపాదకత్వమున దేవనాగరిలిపిలో ఆంగ్లతాత్పర్యముతో ఈ పురాణమును ప్రకటించిన ఆల్‌ఇండియా కాశీరాజ్‌ ట్రష్టువారుగానీ, పండిత హృషీకేశశాస్త్రిగారి సంపాదకత్వమున నాగరలిపిలో మూలమూత్రము ప్రకటించిన చౌఖంబా అమరభారతి ప్రకాశన్‌వారు గానీ పాఠములను మార్చు ప్రయత్నము చేయలేదు. అది సముచితమగు నిర్ణయమే అనినా అభిప్రాయము. జనార్దనుడు భావగ్రాహియే కానీ భాషాగ్రాహికాదు. అదియుగుగాక ఒకనాటి భాషానియమములెట్లుండెడివో మనకు తెలియదు. ఆభావనతో భాషాపరిష్కారము చేయుటకు ప్రయత్నింపలేదు. సహృదయభావుకులు ఈ విషయమును మనసునందుంచుకొనవలయునని మనవి.

తెలుగు తాత్పర్య రచనలో నుడికారమునకు ప్రాధాన్యము నిచ్చితిని. సంస్కృతాంధ్ర వాగ్విన్యాసములకు అపాతతః భేదము కానవచ్చినపుడు దీనిని స్మరింపవలయుననియు మనవి.

ఇతిశమ్‌.

Varahamahapuranam-1    Chapters