Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్దశో%ధ్యాయః దుర్ముఖం నిహతం శ్రుత్వా మహిషః క్రోధమూర్ఛితః | ఉవాచ దానవా న్సర్వా న్కిం జాతమితి చాసకృత్.
1 నిహత్ దానవౌ శూరౌ రణ దుర్ముఖబాష్కలౌ | తన్వ్యా తత్పరమాశ్చర్యం పశ్యంతు దైవచేష్టితమ్.
2 కాలో హి బలవాన్కర్తా సతతం సుఖదుఃఖయోః | నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః. 3 నిహతౌ దానవశ్రేష్ఠౌ కిం కర్తవ్య మతఃపరమ్ | బ్రువంతు మిళితాః సర్వే యద్యుక్తం కార్యసంకటే. 4 ఏవం బ్రువతి రాజేంద్ర మహిషే%తిబలాన్వితే | చిక్షురాఖ్య స్తు సేనానీ స్తమువాచ మహారథః. 5 రాజన్నహం హనిష్యామి కా చింతా స్త్రీవిహింసనే | ఇత్యుక్త్వా స్వబలై ర్యుక్తః ప్రయ¸° రథసంయుతః. 6 ద్వితీయం పార్షిరక్షం తు కృత్వా తామ్రం మహాబలమ్ | మహతా సైన్యఘోషేణ పూరయ న్గగనం దిశః. 7 త మాగచ్ఛంత మాలోక్య దేవీ భగవతీ శివా | చకార శంఖజ్యాఘోషం ఘంటానాదం మహాద్భుతమ్. 8 తత్రసు స్తేన శ##బ్దేన తే చ సర్వే సురారయః | కి మేత దివి భాషంతో దుద్రువు ర్భయకంపితాః. 9 చిక్షురాఖ్య స్తు తా న్దృష్ట్వా పలాయనపరాయణాన్ | ఉవాచాతీవ సంక్రుద్ధః కిం భయం వః సమాగతమ్. 10 అద్యైవాహం హనిష్యామి బాణౖ ర్బాలాం మదోన్నతామ్ | తిష్ఠంత్వత్ర భయం త్యక్త్వా దైత్యాః సమరమూర్ధని 11 ఇత్యుక్త్వా దానవశ్రేష్ఠ శ్చాపపాణి ర్బలాన్వితః | ఆగత్య సంగరే దేవీ మిత్యువాచ గతవ్యథః. 12 కిం గర్జసి విశాలాక్షి! భీషయంతీతరా న్నరాన్ | నామం బిభేమి తన్వంగి! శ్రుత్వా తే%ద్య విచేష్టితమ్. 13 స్త్రీ వధే దూషణం జ్ఞాత్వా తథైవా కీర్తిసంభవమ్ | ఉపేక్షాం కురుతే చిత్తం మదీయం వామలోచనే. 14 పదునాల్గవధ్యాయము శ్రీదేవి తామ్ర చిక్షురులను తెగనఱకుట అట్లు దుర్ముఖుడు చనిపోయిన పిమ్మట మహిషుడు కోపాంధుడై యేమయ్యె నేమయ్యెనని పల్మరు దానవుల నడుగుచుండెను. దుర్ముఖ బాష్కలులు శూరదానవులు. వారొక పడతి చేతిలో రణమున కూలుటయా? ఆహా! దైవమెంత యాశ్చర్యకరమైనదో చూడుడు. నరుడు పుణ్యపాపము లొనర్చుటలో పరతంత్రుడు. కాలము బలవత్తరమైనది. దానినిబట్టి నరులకు సుఖదుఃఖములు గల్గుచుండును. దానవీరు లిద్దఱును రణమున హతులైరి. ఈ సంకటస్థితిలో మీరెల్లరును గలిసి తగిన కర్తవ్యము తెలుపుడు అని బలశాలియగు మహిషుడు పలుకగ మహారథుడు సేనాపతియగు చిక్షురు డతనితో నిట్లనియెను : ఒక్క యాడుదానిని చంపుట కింత చింత యేటికి? నే నొక్కడను చాలుదును. ఆమెను చంపుదును అని యతడు రథమెక్కి సేనతో తరలెను. అతని కంగ రక్షకుడుగ మహాబలుడగు తామ్రుడుండెను. అతని సేనాఘోషము వలన దిక్కులు పిక్కటిల్లెను. ఆ వచ్చు వానిని గని దేవి మహాద్భుతభీకరముగ శంఖారవము జ్యాటంకారము ఘంటాధ్వని ఒక్కపెట్టున నొనరించెను. ఆ గంభీర భీకరధ్వని వినిన దానవుల గుండె లదరెను. ఈ వింత యెన్నడును మనము గానమనుకొని వారు వచ్చిన దారి పట్టిరి. ఆ పారిపోవు వారిని గని కోపించి చిక్షురుడు వారికిట్లనెను: మీకు వచ్చిన భయమేమి? చూడుడు. నేనిప్పుడీ మత్తబాలికను హతమార్తును. మీరు భయముపాసి పోరునకు నిలువబడుడు అని పలికి బలశాలియగు చిక్షురుడు చాపము చేబూని సమరమున దుమికి నిబ్బరముతో దేవితో నిట్లు పలికెను: తన్వంగీ! విశాలాక్షీ! ఊరక గర్జించి నరుల నేల భయ పెట్టుదువు? నీ చేతలకు నేను జంకువాడను గాను. వామాక్షీ! ఒక యాడు దానిని చంపిన దోషమును నపకీర్తియు గల్గునేమో యని నా మది యుపేక్షించుచున్నది. స్త్రీణాం యుద్ధం కటాక్షై శ్చ తథా హావైశ్చ సుందరి | న శ##సై#్త్ర ర్విహితం క్వాపి త్వాదృశీనాం కదాచన. 15 పుషై#్పరపి న యోద్ధవ్యం కిం పున ర్నిశితైః శ##రైః | భవాదృశీనాం దేహేషు దునోతి మాలతీదళమ్. 16 ధిగ్జన్మ మానుషే లోకే క్షాత్ర ధర్మానుజీవినామ్ | లాలితో%యం ప్రియా దేహః కృంతనీయః శితైః శ##రైః. 17 తైలాభ్యంగైః పుష్పవాతై స్తథా మిష్టాన్నభోజనైః | పోషితో%యం ప్రియో దేహో ఘాతనీయః పరేషుభిః. 18 దేహం ఛిత్త్వా%సి ధారాభి ర్ధన భృజ్జాయతే నరః | ధిగ్ధనం దుఃఖదం పూర్వం పశ్చా త్కిం సుఖదం భ##వేత్. 19 త్వ మ ప్యజ్ఞైవ వామోరు యుద్ధమాకాంక్ష సే యతః | సుఖం సంభోగజం త్యక్త్వా కం గుణం వేత్సి సంగరే. 20 ఖడ్గపాతం గదాఘాతం భేదనం చ శిలీ ముఖైః | మరణాంతే తు సంస్కారో గోమాయుముఖకర్షణమ్. 21 తసై#్యవ కవిభి ర్ధూర్తైః కృతం చాతీవ శంసనమ్ | రణ మృతానాం స్వః ప్రాప్తి రర్థవాదో%స్తి కేవలః. 22 తస్మా ద్గచ్ఛ వరారోహే యత్ర తే రమతే మనః | భజ వా భూపతిం నాథం హయారిం సురమర్దనమ్. 23 ఏవం బ్రువాణం తం దైత్యంప్రోవాచ జగదంబికా | కిం మృషా భాషసే మూఢ బుద్ధిమానివ పండితః. 24 నీతి శాస్త్రం న జానాసి విద్యాం చాన్వీక్షికీం తథా | న సేవితా స్త్వయా వృద్ధా న ధర్మే యతి రస్తి తే. 25 మూర్ఖసేవాపరో యస్మాత్తస్మాత్త్వం మూర్ఖ ఏవ హి | రాజధర్మం న జానాసి కిం బ్రవీషి మమాగ్రతః 26 సంగ్రామే మహిషం హత్వా కృత్వా రుధిరకర్దమమ్ | యశః స్తంభం స్థిరం కృత్వా గమిష్యామి యథాసుఖమ్. 27 దేవానాం దుఃఖదాతారం దానవం మదగర్వితమ్ | హనిష్యేహం దురాచారం యుద్ధం కురు స్థిరో భవ. 28 జీవితేచ్ఛా%%స్తి చేన్మూఢ మహిషస్య తథా తవ | తదా గచ్ఛంతు పాతాళం దానవాః సర్వ ఏవ తే. 29 ముమూర్షాయది వ శ్చి త్తే యుద్ధం కుర్వంతు సత్వరాః | సర్వానేవ వధిష్మామి నిశ్చయో%యం మమాధునా. 30 సుందరీ! నెఱజాణలు హావభావములతో కడగంటి చూపులతో పోరు సల్పుదురు. నీ వంటి జవరాలికి శస్త్ర యుద్ధము తగదు. నీ వంటి లతాంగిని పూలతోగూడ గొట్టరాదు. మాలతీ మాలలుగూడ నీ వంటివారి మేనులు నొప్పించును. ఇక వాడి ములుకుల సంగతి చెప్పనేల? క్షత్త్రియ జన్మమున బ్రదుకు వ్యర్థము. ఈ నీ తనువు మమకారముతో పెరిగినది. దీనిని వాడి శరముల పాలు చేయకుము. తైలాభ్యంగము మృష్టాన్న భోజనము పూలవాసనలు మున్నగు వానిచే నీ శరీరము ముద్దుగ పెంచబడినది. ఇది పరుల బాణములకు గురిగావలసినదేనా? నరులు వాడి కత్తులతో కత్తుకలు కత్తిరించి విత్తము గడింతురు. ఆ పనికిమాలిన డబ్బు వలన దుఃఖమే కల్గును. ఇక సుఖమెట్లు గల్గును? వామోరూ! నీవు బవరమే వాంఛించెద వేని నీవు నిజముగ తెలివి మాలిన దానవు. ఈ రణమందేమి సుఖమున్నదని సంభోగ సుఖములు విడనాడుచున్నావు? ఈ యుద్ధమందేమున్నది? గదాఘాతము-ఖడ్గప్రహారము-బాణభేదనము-తుదకు మరణము. అపుడు నక్కలు పీకికొని తినును. కవులు ధూర్తులై రణమున చచ్చిన వారికి స్వర్గప్రాప్తి గల్గునని యర్థవాములు పల్కుచు దానిని పొగడుదురు. కనుక నీ నచ్చినచోటి కేగుము. లేక సురమర్దనుడగు మహిష భూపతిని పతిగ భజింపుము. ఇట్లు పలుకు దైత్యునకు జగదంబ యిట్లనియెను. 'ఓరీ మూఢా! నీవు పండితుడు ధీశాలి పల్కినట్లు ప్రజ్ఞావాదములు పల్కుచున్నావు. ఆన్వీక్షికీ విద్యను నీతిశాస్త్రమును నీవెఱుగవు. నీవు పెద్దలను సేవింపలేదు. నీకు ధర్మబుద్ధి లేదు. నీవు మూర్ఖుని గొల్చితివి. నీవును మూర్ఖుడవైతివి. రాజధర్మ మెఱిగిన వాడవుగావు. ఐనను నాముందేమేమో ప్రేలుచున్నావు. నే నా మూఢ మహిషుని యుద్ధమందు సంహరింప గలను. ఈ నేలను రక్తసిక్త మొనర్పగలను. కీర్తి స్తంభము గట్టిగ బాతి స్వేచ్ఛగ నేగగలను. దేవతలకు క్లేశములు గల్గించిన మదనమత్తుడగు దైత్యు నంతమొందింప గలను. ఇక ప్రలాపములు కట్టిపెట్టి పోరు సల్పుము. మూర్ఖుడా! నీకు నీ మహిషునకు బ్రదుకుతీపి యున్నచో నితర దానవులను వెంటగొని పాతాళ మేగుడు. మీ మనస్సులందు చావుకోర్కి యున్నచో శీఘ్రమే యుద్ధ మొనర్పుడు. అందఱి నిపుడే మట్టుపెట్టగలను. ఇదే నా దృఢనిశ్చయము.'' తచ్ఛ్రుత్వా వచనం తస్య దానవో బలదర్పితః | ముమోచ బాణవృష్టిం తాం ఘనవృష్టి మివాపరామ్. 31 చిచ్ఛేద తస్య సా బాణాన్ స్వబాణౖ ర్నిశితై స్తదా | జఘాన తం తథా ఘోరై రాశీవిషసమై శ##రై. 32 యుద్ధం పరస్పరం తత్ర బభూవ విస్మయప్రదమ్ | గదయా ఘాతయామాస తం రథా జ్జగదంబికా. 33 మూర్ఛాం ప్రాప స దుష్టాత్వా గదయాభిహతో భృశమ్ | ముహూర్త ద్వయమాత్రం తు రథోవస్థ ఇవాచలః. 34 తం తథా మూర్ఛితం దృష్ట్వాం తామ్రః పరబలార్దనః | ఆ జగామ రణ యోద్ధుం చండికాం ప్రతి చాపలాత్. 35 ఆగచ్ఛంతం తు తం వీక్ష్య హసంతీ ప్రాహ చండికా | ఏహ్యేహి దానవశ్రేష్ఠ యమలోకం నయామ్యహమ్. 36 కిం భవద్భిః సమాయాతై రబలైశ్చ గతాయుషః | మహిషః కిం గృహే మూఢః కరోతి జీవనోద్యమమ్. 37 కిం భవద్భి ర్హతై ర్మందై ర్మమాపి విఫలః శ్రమః | ఆహతే మహిషే పాపే సురశత్రౌ దురాత్మని. 38 తస్మా ద్యూయం గృహం గత్వా మహిషం ప్రేషయం త్విహ | వశ్యే న్మాం సో%పి మందాత్మా యాదృశీం తాదృశీం స్థితామ్. 39 తామ్ర స్తద్వచనం శ్రుత్వా బాణవృష్టిం చకార హ | చండికాం ప్రతి కోపేనా కర్ణా%%కృష్ణశరాసనః. 40 భగవత్యపి తామ్రాక్షీ సమాకృష్య శరాసనమ్ | బాణా న్ముమో చ తరసా హంతుకామా సురాహితమ్. 41 దేవి మాటలు విని దానవుడామెపై మేఘము వర్షించినట్లు బాణములు కురిసెను. వాని బాణముల నెల్ల జగదంబ ఖండించి మరల వాడి యమ్ములతో వానిని ప్రహరించెను. వారి పోరాట మచ్చెరువు గొల్పుచుండెను. వీర రసమున తేజరిల్లు తల్లి వానిని గదతో మోది రథము నుండి క్రింద పడవేసెను. ఆ దుష్టుడు గదా ప్రహారము తినియును రెండు మూర్తములు రథము క్రింద పర్వతమువలె మూర్ఛపడియుండెను. అట్లతడు మూర్ఛిల్లుటగని పరబల మర్దనుడగు తామ్రుడు రణ చాపల్యము కొలది చండికతో బోర ముందునకు వచ్చెను. ఆ వచ్చు వానిని గని చండిక పకపక నవ్వి యిట్లనెను: ' దానవ వీరా! రారమ్ము. నిన్నిపుడే యమునింటి కతిథిగ నంపుదను. మీరాయువు తక్కువవారు. దుర్బలులు - మీ రెందులకు వచ్చెదరురా! మూర్ఖ మహిషుడు తన యింట తన బ్రదుకు విధము చూచుకొను చున్నాడు! దుర్బలులగు మిమ్ము చంపిన నా శ్రమ యంతయును వ్యర్థమే. లోకంటకుడగు సురవైరి చచ్చిన నాడు నాశ్రమ ఫలించును. మీ రెల్లరేగి మహిషుని బంపుడు. ఆ మందుడు నన్నెట్లున్నదానిని నట్లు చూడగలడు.' దేవి మాటలు విని తామ్రు డాకర్ణాంతము చాపము లాగి చండికపై బాణవర్షము కురిసెను. ఓజో బలవతి యగు భగవతియును క్రోధతామ్రాక్షియై తామ్రుని చంపదలచి ధనువులాగి యతనిపై బాణములు వర్షించెను. చిక్షురాఖ్యో%పి బలవా న్మూర్ఛాం త్యక్త్వోత్థితః పునః | గృహీత్వా సశరం చాపం తస్థౌ తత్సమ్ముఖః క్షణాత్. 42 చిక్షురాఖ్యశ్చ తామ్రశ్చ ద్వావప్యతి బలోత్కటౌ | యుయుధాతె మహావీరౌ సహ దేవ్యా రణాంగణ. 43 కుపితా చ మహామాయా వవర్ష శర సంతతిమ్ | చకార దానవా న్సర్వా న్బాణ క్షతతనుచ్ఛదాన్. 44 అసురాః క్రోధసమ్మూఢా బభూవుః శరతాడితాః | చిక్షివుః శరజాలాని దేవీం ప్రతి రుషా%న్వితాః. 45 బభు స్తే రాక్షసా స్తత్ర కింశుకా ఇవ పుష్పిణః | శిలీ ముఖక్షతాః సర్వే వసంతే చ వనే రణ. 46 బభూవ తములం యుద్ధం తామ్రేణ సహ సంయుగే | విస్మయం పరమం జగ్ముర్దేవా యేప్రేక్షకాః స్థితాః. 47 తామ్రో ముసల మాదాయ లోహజం దారుణం దృఢమ్ | జఘాన మస్తకే సింహం జహాస చ ననర్ద చ. 48 నర్దమానం తదా తం తు దృష్ట్వా దేవీ రుషా%న్వితా | ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద సత్వరా. 49 ఛిన్నే శిరసి తామ్ర స్తు విశీర్షో ముసలీ బలీ | బభ్రామ క్షణమాత్రం తు పపాత రణమస్తకే. 50 పతితం తామ్ర మాలోక్య చిక్షురాఖ్యో మహాబలః | ఖడ్గ మాదాయ తరసా దుద్రావ చండికాం ప్రతి. 51 భగవత్యపి తం దృష్ట్వా ఖడ్గపాణి ముపాగతమ్ | దానవం పంచభి ర్బాణౖ ర్జఘాన తరసా రణ. 52 ఏకేన పతితం ఖడ్గం ద్వితీయేన తు తత్కరః | కంఠా చ్చ మస్తకం తస్య కృంతితం చాపరైః శ##రైః. 53 ఏవం తౌ నిహతౌ క్రూరౌ రాక్షసౌ రణదుర్మదౌ | భగ్నం సైన్యం తయో స్తూర్ణం దిక్షు సంత్రప్త మానసమ్. 54 దేవా శ్చ ముదితాః సర్వే దృష్ట్వా తౌ నిహతౌ రణ | పుష్ప వృష్టిం ముదా చక్రుర్జయశబ్దం నభః స్థితాః. 55 ఋషయో దేవగంధర్వా వేతాళాః సిద్ధచారణాః | ఊచు స్తే జయ దేవీతి చాంబికేతి పునః పునః. 56 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే చతుర్ద శో%ధ్యాయః. అంతలో చిక్షురుడు తెప్పరిల్లి లేచి విల్లమ్ములందుకొని దేవికెట్ట యెదుట నిలిచెను. తామ్ర చిక్షురు లిర్వురు గలిసి మహోత్కటముగ రణమున దేవితో బోరిరి. మహామాయ మహోగ్ర కోపముతో శరవర్షము వర్షించి దానవుల కవలచములు చిల్లులుపడ చేసెను. ఆ వీరులను బాణతాడితులై కోపముతో దేవిపై శరములు విసిరిరి. ఆ యుద్ధము నందు రాక్షసులు శరీరములు వసంత వనమున బూచిన మోదుగు పూల పొలుపు వహించెను. తామ్రునితో దేవికి జరిగిన యుద్ధమును మింట చూపఱగు సురలు పరమ విస్మయ మందిరి. తామ్రుడు సింహము తలపై లోహ మయమగు ముసలముతో గొట్టి నవ్వి పెద్దగ నినాద మొనర్చెను. విజయరూపిణియగు దేవి రోషాతిరేకముతో గర్జించు తామ్రుని తలతెగ నఱికెను. తల తెగినను వాడు ముసలము పట్టి క్షణముసేపు గిరగిర తిరిగి నేలకొరిగెను. తామ్రుడు పడిపోవుటగని చిక్షురుడు ఖడ్గము బూని వేగముగ చండికపై కురికెను. ఖడ్గపాణియై వచ్చు దానవునిగని దేవి సత్వరమే యైదు బాణములతో వానిని నొప్పించెను. దేవి యొక్క బాణముతో వానిచేతి కత్తిని మరొక శరముతో వాని చేతిని నింకను కొన్ని వాడి యమ్ములతో వాని తల తెగనఱికెను. దుర్మదులగు క్రూర దానవులు నిహతులుగాగా తక్కిన సేనలు భయంకంపముతో దిక్కులేక దిక్కులు పట్టెను. వారు రణనిహతులగుట గని మింట నమరులు హర్షమున పూలజల్లు గురిసిరి. జయజయధ్వానము లొనరించిరి. ఋషులు-దేవ-గంధర్వ-వేతాళ-సిద్ధ-చారణలులును సారెసారెకు దేవీ! అంబికా! నీకు జయము జయమని నినాదము లొనరించిరి. ఇతి శ్రీ మద్దేవీభాగవత మందలి పంచమ స్కంధమందు శ్రీదేవి తామ్రచిక్షురులను తెగ నఱకుటయు చతుర్దశాధ్యాయము.