Sri Devi Bhagavatam-1    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

తౌ తయా నిహతౌ శ్రుత్వా మహిషో విస్మయాన్వితః | ప్రేషయామాస దైతేయాం స్త ద్వధార్థం మహాబలాన్‌. 1

అసిలోమబిడాలాఖ్య ప్రముఖా న్యుద్ధ దుర్మదాన్‌ | సైన్యేన మహతా యుక్తా న్సాయుధా న్సపరిచ్ఛదాన్‌. 2

తే తత్ర దదృశు ర్దేవీం సింహస్యోపరిసంస్థితామ్‌ అష్టాదశభుజాం దివ్యాం ఖడ్గఖేటకనారిణీమ్‌. 3

అసిలోమా%గ్రతో గత్వా తామువాచ హసన్నివ | వినయావనతః శాంతో దేవీం దైత్య వధోద్యతామ్‌. 4

దేవి బ్రూహి వచః సత్యం కిమర్థ మిహ సుందరి | ఆగతా%సి కిమర్థం వా హంసి దైత్యాన్నిరాగసః. 5

కారణం కథయాద్య త్వం త్వయా సంధిం కరోమ్యహమ్‌ | కాంచనం మణిరత్నాని భాజనాని వరాణి చ. 6

యా నిచ్ఛసి వరారోహే గృహీ త్వా గచ్ఛ మా చిరమ్‌ | కి మర్థం యుద్ధ కామా%సి దుఃఖ సంతాపవర్ధనమ్‌. 7

కథయంతి మహాత్మానో యుద్ధం సర్వసుఖాపహమ్‌ | కోమలే%తీవ తే దేహే పుష్పఘాతాసహే భృశమ్‌. 8

కిమర్థం శస్త్ర సంపాతా న్సహ సీతి విసిష్మ హే | చాతుర్య స్య ఫలం శాంతిః సతతం సుఖసేవనమ్‌. 9

తత్కిమర్థం దుఃఖహేతుం సంగ్రామం కర్తు మిచ్ఛసి | సంసారే%త్ర సుఖం గ్రాహ్యం దుఃఖం హేయమితి స్థితిః. 10

తత్సుఖం ద్వివిధం ప్రోక్తం నిత్యానిత్య ప్రభేదతః | ఆత్మజ్ఞానం సుఖం నిత్య మనిత్యం భోగజం స్మృతమ్‌. 11

నాశాత్మకం తు తత్త్యాజ్యం వేదశాస్త్రార్థ చింతకైః | సౌగతానాం మతం చేత్త్వం స్వీకరోషి వరాననే. 12

త థా%పి ¸°వనం ప్రాప్య భుంక్ష్వ భోగా ననుత్తమాన్‌ | పరలోకస్య సందేహో యది తే%స్తి కృశోదరి. 13

స్వర్గభోగపరా నిత్యం భవ భామిని భూతలే | అనిత్యం ¸°వనం దేహి జ్ఞాత్వేతి సుకృతం చరేత్‌. 14

పరోపతాపనం కార్యం వర్జనీయం సదా బుధైః | అవిరోధేన కర్తవ్యం ధర్మార్థ కామసేవనమ్‌. 15

తస్మాత్త్వమ పి కళ్యాణి మతి ధర్మే సదా కురు | అపరాధం వినా దైత్యా న్క స్మా న్మారయసే%ంబికే. 16

దయా ధర్మో%స్య దేహో%స్తి సత్యే ప్రాణాః ప్రకీర్తితాః | తస్మా ద్దయా తథా సత్యం రక్షణీయం సదా బుధైః. 17

పదుహేనువధ్యాయము

శ్రీదేవి యసిలోమ బిడాలులను సంహరించుట

అట్లు వారు మడియుట విని మహిషుడు విస్మయమందెను. అతడు దేవివధకు మఱికొందఱి నంపెను. వారు బలశాలురు - రణ దుర్మదులు - మహా సేనాయుతులు - ఆయుధాలంకృతులు అగు నసిలోమబిడాలులను దైతేయులు. వారు రణ స్థలము నందు శ్రీమత్సింహవాహనమైన యష్టాదశభుజాఢ్యయై ఖడ్గ-ఖేటాది దివ్యాయుధ ధారిణియై వెలుగువెల్లువలయైన దేవిని గాంచిరి. అసిలోముడు వికవికనగుచు నతి వినయశాంతులతో దైత్య వధకు కంకణము కట్టుకొనిన యాదిపరాశక్తి కిట్లనెను : ఓ కళామయీ! దేవీ! నీ విచటి కేల వచ్చితివి? ఏ పాపమెఱుగని దానవుల నేల చంపితివి? నిజము పలుకుము. ఆ కారణము చెప్పినచో నేను నీతో సంధి చేసికొందును. నీ కేమి కావలయునో కోరుకొమ్ము. బంగారమా? మణిరత్నములా? వరపాత్రములా? నీకు కావలసిన దెల్ల గ్రహించి శీఘ్రమే వెళ్ళుము. దుఃఖ సంతాపకారకమగు బవరమేల కోరుచున్నావు? యుద్ధము సకలసుఖములకు గొడ్డలిపెట్టని మహాత్ములందురు. నీ మేని నిగనిగలు సోయగము - మెత్తందనము - పూదెబ్బకు సైతము తాళజాలదే! ఇట్టి లావణ్యతివగు నీ విట్టి శస్త్రబాధ లోర్చుకొనుట వింతగ నున్నది. చతురతకు ఫలము శాంతి, దానివలన నిత్య సుఖములు బడయవచ్చును. కనుక దఃఖమూలమగు సంగరమేల చేయదలంతువు? సుఖము లనుభవింప వలయును - దుఃఖములు బాపుకొనవలయుననుట లోకమర్యాద గదా! సుఖము నిత్యము - అనిత్యము నని రెండు తెఱంగులు - ఆత్మ జ్ఞానానంద సుఖము నిత్యము. విషయ విషభోగములచే సుఖమనిత్యము. ఈ నాశకరమగు దుఃఖమును వేదశాస్త్రార్థములు విచారించువారు వీడుదురు. వరాననా! నీవు బుద్ధమతము స్వీకరించినచో పరలోకము లేదని నమ్మినచో నీ యందాల పరువము బొందినందులకు గొప్ప విషయభోగము లనుభవింపుము. ఈ మురిపించు జవ్వనము నీటిబుడగ. ఇట్లెఱిగి స్వర్గసుఖములు గల్గించు పున్నెము లొనరింపుము. బుధులెల్లవేళల పరపీడనము విడనాడవలయును. ధర్మార్థ కామములు వరుసగ చక్కగ నాచరింపవలయును. కునుక నో సర్వమంగళా! శ్రీ మాతా! ధర్మమతివి గమ్ము. నిరపరాధులగు దైత్యుల నూరక ఏల చంపుదువు? ఈ ప్రాణులు సత్యనిష్ఠులు. ఈ శరీరములు దయాధర్మములాచరించుటకు తావులు. కావున బుధులు చక్కగ దయాసత్యములు పాటించవలయును.

కారణం వద సుశ్రోణి దానవానాం వధే తవ | దేవ్యువాచ: త్వయా పృష్టం మహాబాహో కిమర్థ మిహచాగతా. 18

తదహం సంప్రవక్ష్యామి హననే చ ప్రయోజనమ్‌ | విచరామి సదా దైత్య ! సర్వలేకోషు సర్వదా. 19

న్యాయాన్యా¸° చ భూతానాం పశ్యంతీ సాక్షిరూపిణీ | న మే కదాపి భోగేచ్ఛాన లోభో న చ వైరితా. 20

ధర్మార్థం విచరామ్యత్ర సంసారే సాధురక్షణమ్‌ | వ్రతమేతత్తు నియతం పాలయామి నిజం సదా. 21

సాధూనాం రక్షణం కార్యం హం తవ్యాయే%ప్యసాధవః | వేదసంరక్షణం కార్యమవతారై రనేకశః. 22

యుగే యుగే తానేవా%హ మవతారా న్బిభర్మి చ | మహిష స్తు దురాచారో దేవాన్వై హంతు ముద్యతః. 23

జ్ఞాత్వా%హం తద్వధార్థం భోః ప్రాప్తా%స్మి రాక్షసాధునా | తం హనిష్యే దురాచారం సురశత్రుం మహాబలమ్‌. 24

గచ్ఛ వా తిష్ఠ కామం త్వం సత్య మేత దుదాహృతమ్‌ | బ్రూహి వా తం దురాత్మానం రాజనం మహిషీసుతమ్‌. 25

కిమన్య త్ర్పేషయస్యత్ర స్వయం యుద్ధం కురుష్వహ | సంధిం చే త్కర్తు మిచ్చా%స్తి రాజ్ఞ స్తవమయాసహ. 26

సర్వే గచ్ఛంతు పాతాళం వైరం త్యక్త్వాయథాసుఖమ్‌ | దేవద్రవ్యంతు యత్కించి ద్ధృ తం జిత్వారణ సురాన్‌. 27

తద్దత్వా యాంతు పాతాళం ప్రహ్లాదో యత్ర తిష్ఠతి | తచ్ఛ్రుత్వా వచనం దేవ్యా అసిలోమా పురః స్థితః. 28

బిడాలాఖ్యం మహావీరం పప్రచ్ఛ ప్రీతిపూర్వకమ్‌ | శ్రుతం తే%ద్య బిడాలాఖ్య భవాన్యా కథితం చ యత్‌. 29

ఏవం గతే కిం కర్తవ్యో విగ్రహః సంధిరేవవా

బిడాల ఉవాచ : న సంధికామో%స్తి నృపో%భిమానీ యుద్ధే చ మృత్యుం నియతం హి జానన్‌. 30

శాతోదరీ! ఈ ఘోరదానవ వధకు కారణమేమో తెలుపుము. శ్రీదేవి యిట్లనెను : మహాబాహూ! నన్ను నీవేల వచ్చితివని యడిగితివి. వధ కారణము వక్కాణింతును వినుము. నేనెల్ల లోకములందెల్లవేళల సంచరింతును. నేను సర్వ సాక్షిణిని. ఎల్ల భూతముల న్యాయాన్యాయములు సమీక్షింతును. నాకు భోగేచ్ఛగాని లోభ##వైరములుగాని లేవు. నేను ధర్మాభ్యుదయమును సంరక్షింప తిరుగుదును. ఈ రేడు లోకాలలోని పరమ సాధువుల పరిరక్షణము నా వ్రతము. నేను దీనిని నియతముగ నిత్య మనుసరింతును. నేను పెక్కు లవతారములు దాల్చి వేదములను సాధువులను బ్రోతును. దుర్మార్గుల వినాశ మొనరింతును. నేను యుగయుగమున నవతరింతును. మహిషుడు దుష్టుడు. దేవత పాలి శత్రువు. వీడిట్టివాడని యెఱిగి నేను వీనిని చంప నేతెంచితిని. సురవైరి-దురాచారుడు-మహాబలుడగు మహిషుని నే నమరతేజమునై పరిమార్పగలను. నా యీ పలుకులు నిజములు. నీకు చేతనైన నిలుము. లేదా వెళ్ళుము. నేను పలికిన పై మాట సత్యము. ఆ దురాత్ముడగు మహిషరాజున కంతయు నిట్లు చెప్పుము - నీ వితరుల నేల పంపుదువు? నీవే వచ్చి యుద్ధ మొనర్పుము. నీకు నాతో సంధి యిష్టమైనచో రమ్ము. నీవు పగలు పెంచుకొనక వైరము విడిచి పాతాళ మేగుము రణమందు దేవతల నోడించి దేవ ద్రవ్యము లపహరించితివి. వారివి వారి కిచ్చి ప్రహ్లాదుడు వసించు పాతాళ మేగుము. అను దేవి మాటలు విని యసిలోముడు దేవి కెదురుగ నిలిచెను. ఆ వీరుడు బిడాలునితో నెమ్మి నిట్లనెను: 'బిడాలా! భవాని పల్కిన పల్కులు నీవు వింటివి గదా! ఇప్పుడు మన కర్తవ్య మేమి? సంధియా?' అన బిడాలు డిట్లనెను : చావు నిక్కమని మన రాజునకు తెలియును. అతడు దేహాభిమాని - సంధి కోరడు.

దృష్ట్వా హత న్ర్పేరయతే తథా%స్మా న్దైవం హి కో%తిక్రమితుం సమర్థః

''దుఃసాధ ఏవాస్త్విహ సేవకానాం ధర్మః సదా మానవివర్జితానామ్‌

ఆజ్ఞాపరాణాం వశవర్తికానాం పాంచాలికానా మివ సూత్రభేదాత్‌''

గత్వా కథం తస్య పుర స్త్వయా చ మయా%పి వక్తవ్య మిదం కఠోరమ్‌. 31

గచ్ఛంతు పాతాళ మిత శ్చ సర్వే దత్త్వా%థరత్నాని ధనం సురాణామ్‌

ప్రియం హి వక్తవ్య మసత్యమేవ న చప్రియం స్యాద్ధితకృత్తు భాషితమ్‌

సత్యం ప్రియం నో భవతీయ కామం మౌనం తతో బుద్ధిమతాం ప్రతిష్ఠితమ్‌''

న ఫల్గువాక్వైః ప్రతిబోధనీయో రాజాతు వీరైరితి నీతిశాస్త్రమ్‌. 32

న నూనం తత్ర గంతవ్యం హితం వా వక్తు మాదరాత్‌ | ప్రష్టుం వా%పి గతే రాజా కోపయుక్తో భవిష్యతి. 33

ఇతి సంచింత్య కర్తవ్యం యుద్ధం ప్రాణస్య సంశ##యే | స్వామికార్యం వరం మత్వా మరణం తృణవత్తథా. 34

ఇతి సంచింత్య తౌ వీరౌ సంస్థితౌ యుద్ధ తత్పరౌ | ధనుర్భాణధరౌ తత్ర సన్నద్ధౌ రథసంగతౌ. 35

ప్రథమం తు బిడలాఖ్యః సప్తబాణా న్ముమోచహ | అసిలోమా స్థిరో దూరే ప్రేక్షకః పరమాస్త్రవిత్‌. 36

చిచ్ఛేద తాంస్తథా ప్రాప్తా నంబికా స్వశ##రైః శరాన్‌ | బిడాలాఖ్యం త్రిభిర్బాణౖ ర్జఘాన చ శిలాశితైః. 37

ప్రాప్య బాణవ్యథాం దైత్యః పపాత సమరాంగణ | మూర్ఛితో%థ మమారా%శు దానవో దైవయోగతః. 38

బిడాలాఖ్యం హతం దృష్ట్వా రణ శక్తిశరోత్కరైః - అసిలోమా ధనుష్పాణిః సంస్థితో యుద్ధతత్పరః. 39

ఊర్ధ్వం సవ్యం కరం కృత్వా తా మువాచ మితం వచః | దేవి జానామి మరణం దానవానాం దురాత్మనామ్‌. 40

తథా%పి యుద్ధం కర్తవ్యం పరాధీనేన వై మయా | మహిషో మందబుద్ధి శ్చ న జానాతి ప్రియా ప్రియే. 41

తదగ్రే నైవ వక్తవ్యం హితం చైవాప్రియం మయా | మర్తవ్యం వీరధర్మే ణ శుభం వాప్యశుభం భ##వేత్‌. 42

దైవమేవ పరం మన్యే ధిక్పౌరుష మనర్థకమ్‌ | పతంతి దానవా స్తూర్ణం తవ బాణహతా భువి. 43

అతడు నిహతులను గనియును మనల మరణ రణమునకు పురికొల్పుచున్నాడు. విధి దాట నెవని తరము? సేవకు అభిమానము లేనివారు. వారి ధర్మ మెల్లప్పుడు దుస్సాధమైనదే. వారు త్రాడు పట్టి పలురీతుల నాడించు వానికి వశమగు తోలుబొమ్మల వంటివారు. ఇంక నతని ముందున కేగి నీవు నేను నిట్టి బెట్టిదపు పల్కులెట్టుల పల్కగలము? ధనమును రత్నములు సురల కొసంగి పాతాళ##మేగుట మంచిదని యతని కెట్లు చెప్పుదుము? అసత్య మెప్పుడును ప్రియముగ నుండును. మేలుగూర్చు నిజ మప్రియముగ నుండును. ఈ లోకమందు సత్యము ప్రియముగల పలుకు దుర్లభము. కాని, నిట్టి పట్టుల మౌనముగ నుండుట బుద్ధిశాలుర లక్షణము. వీరు డెప్పుడును తన ప్రభువును లోభముచే వశము చేసికొనరాదని నీతిశాస్త్రము వాక్రుచ్చును. కనుక నిపుడు మనము ప్రేమతో హితము చెప్పుటకు గాని కుశల మడుగుటకు గాని మన రాజు చెంతకు పోదగదు. పోయినచో నతడి వేడి కోపము రేగును. మన మిట్లెఱిగి ప్రాణ సంకటము గల్గినను స్వామికార్యమే గొప్పదని యెంచి చావును గడ్డిపోచగ దలచి యుద్ధమునకు తలపడవలయును అని యిట్లు విచారించుకొని వారిర్వురును విల్లమ్ములు దాల్చి రథమెక్కి యుద్ధ సన్నద్ధులైరి. మొదట బిడాలు డేడు బాణములు వదలెను. అస్త్రవిదుడగు నసిలోముడు దూరమునుండి యంతయు గనుచుండెను. నిరంకుశయగు దేవి తన మీదికి వచ్చు బాణములను ఖండ ఖండములు చేసి వానిపై మూడు కఱకుటమ్ములు వదలెను. దానవు డా వాడి బాణముల దెబ్బకు రణరంగమునబడి మూర్ఛిల్లి వెంటనే విధివశమున ఈల్గెను. అట్లు దేవి బాణములకు రణమున బిడాలుడు హతు డగుటగని యసిలోముడు విల్లమ్ములు దాల్చి పోర సమకట్టెను. అతను తన యెడమచేయి పైకెత్తి యిట్లనెను : దేవీ! దుష్ట దానవులు తప్పక నిహతులగు టే నెఱుంగుదును. ఐనను మా మహిషుడు మందమతి. మంచి చెడ్డ లెఱుగడు. నేను పరాధీనుడను. కనుక నాకు యుద్ధము చేయుట తప్పని పని. అతని యెదుట మేలు గల్గించు నప్రియము బలక జాలను. మేలో - కీడో వీరమరణమందుట నా ధర్మము. నీ బాణమునకు దానవు లెల్లరు బలి యగుచున్నారు. కనుక దైవమే గొప్పము. పౌరుషము పనికి మాలినది అని తలంతును.

ఇత్యుక్త్వా శరవృష్టిం స చకార దానవోత్తమః | దేవీ చిచ్ఛేద తాన్బాణౖ రప్రాప్తాంస్తు నిజాంతికే. 44

అనై ర్విధాయ తం తూర్ణ మసిలోమాన మాశుగైః | వీక్షితా%నుర సంఘైశ్చ కోపపూర్ణాననా తదా. 45

చుక్షుభే దానవః కామం బాణౖ ర్విద్ధతనుః కిల | స్రవద్రుధిరధారః స ప్రపుల్లః కింశుకో యథా. 46

అసిలోమా గదాం గుర్వీం లౌహీ ముద్యమ్య వేగతః | దుద్రావ చండికాం కోపా త్సింహమూర్ధ్ని జఘాన హ. 47

సింహోపి నఖరాఘాతై స్తం దదార భుజాంతరే | అగణయ్య గదా ఘాతం కృతం తేన బలీయసా. 48

ఉత్పత్య తరసా దైత్యో తదా పాణిః సుదారుణః | సింహమూర్ధ్ని సమారుహ్య జఘాన గదయాంబికామ్‌. 49

కృతం తేన ప్రహారం తు వంచయిత్వా విశాంపతే | ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద కంఠతః. 50

ఛిన్నే శిరసి దైత్యేంద్రః పపాత తరసా క్షితౌ | హాహాకారో మహానాసీత్యైన్యే తస్య దురాత్మనః. 51

జయ దేవీతి దేవా స్తాం తుష్టువు ర్జగదంబికామ్‌ | దేవదుందుభయో నేదు ర్జగుశ్చ నృప! కిన్నరా! 52

నిహతౌ దానవౌ వీక్ష్య పతితౌ చ రణాంగతే | నిహతా! సైనికాః సర్వే తత్రా కేసరిణా బలాత్‌. 53

భక్షితా శ్చ తథా కేచి న్నిః శేషం తద్రణం కృతమ్‌ | భగ్నాః కేచి ద్గతా మందా మహిషం ప్రతి దుఃఃతాః. 54

చక్రూశూ రురుదు శ్చైవ త్రాహి త్రాహీతి భాషణౖః | అసిలోమబిడాలాఖ్యౌ నిహతౌ నృపసత్తమ. 55

అన్యే యే సైనికా రాజ న్నింహేన భక్షితా శ్చ తే | ఏవం బ్రువంతో రాజానం తదా చక్రుశ్ఛ వైశసమ్‌. 56

తచ్ఛ్రుత్వా వచనం తేషాం మహిషో దుర్మనా స్తదా | బభూవ చింతాకులితో విమనా దుఃఖసంయుతః. 57

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే పంచదశో%ధ్యాయః

అని పలికి యసిలోముడు బాణముల నేసెను. శ్రీ విష్ణుమాయ యవి తన్నుజేరక మున్నే వాని నెల్ల దునుమాడెను. వెనువెంటనే యసిలోముని తన నిశిత శరములతో గాయపఱచెను. అమరులెల్ల వినువీథి నంతయును వీక్షించుచుండిరి. బాణపుదెబ్బలు తినుట వలన వాని మేను రక్తధారలు చిమ్ముచు విచ్చిన మోదుగుపూవులవలె నొప్పెను. అంత డంత నొక పెద్ద యినుపగద గొని వాడిగ చండికపై కురికి కోపావేశమున సింహము తలపై మోదెను. ఆ బెట్టిదపు గద దెబ్బ లెక్కచేయక మృగరాజు తన వాడి గోళ్లతో నతని బుజములు తెగచీల్చెను. దైత్యుడు వెంటనే గదబూని సింహము తలపై కెక్కి యంబికను మోదెను. రుద్రరూపిణి వాని దెబ్బ వమ్మొనరించి కఱకు కత్తితో వాని తల తెగనఱికెను. దైత్యుడు నేలగూలెను. వాని సేనలో హాహాకారములు చెలరేగెను. దేవత లందఱును జయజయ నినాదములతో శ్రీత్రిభువనేశ్వరిని సన్నుతించిరి. దేవదుందుభులు మొరసెను; కిన్నరులు పాడిరి. అట్లు దానవు లిర్వురు మడిసిన పిదప తక్కిన సైన్యము సింహము నోటికి బల్మి బలియైనది. సింహము కొందఱిని పొట్ట పెట్టుకొనెను. కొందఱు దుఃఃతులై మహిషుని చెంతకు పారిరి. రణ స్థలము శూన్యమయ్యెను. పారిన వారు కావుకావుమని మహిషుని జేరి విలపించిరి. అసిలోమ బిడాలులు మడిసిరి. ఇతర సైనికులు సింహము వాతబడిరి అని పలికి వారు రాజునకు మరింత దుఃఖము గల్గించిరి. వారి మాట లన్నియు విని మహిషుడు దుఃఃతుడై చింతాక్రాంతు డయ్యెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు పంచదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters