Sri Devi Bhagavatam-1    Chapters   

అథషోడశో%ధ్యాయః

తేషాంతద్వచనం శ్రుత్వా క్రోధయుక్తో నరాధిపః | దారుకం ప్రాహ తరసా రథ మానయ మే%ద్భుతమ్‌. 1

సహస్ర ఖరసంయుక్తం పతాకాధ్వజ భూషితమ్‌ | ఆయుధైః సంయుతం శుభ్రం సుచక్రం చారుకూబరమ్‌ 2

సూతో%పి రథామానీయ తమువాచత్వరాన్వితః | రాజన్రథో%య మానీతో ద్వారి తిష్ఠతి భూషితః. 3

సర్వాయుధ సమాయుక్తో వరాస్తరణ సంయుతః | ఆ నీతం తం రథం జ్ఞాత్వా దానవేంద్రో మహాబలః. 4

మానుషం దేవమాస్థాయ సంగ్రామే గంతు ముద్యతః | విచార్య మనసాచేతి దేవీ మాంప్రేక్షదుర్ముఖమ్‌. 5

శృంగిణం మహిషం నూనం విమనా సా భవిష్యతి | నారీణాంచ ప్రియం రూపం తథా చాతుర్య మిత్యపి. 6

తస్మా ద్రూపం చ చాతుర్యం కృత్వాయాస్యామి తాం ప్రతి | యథా మాం వీక్ష్య సా బాలా ప్రేమయుక్తా భవిష్యతి. 7

మమాపి చ తదైవ స్యా త్సుఖం నాన్య స్వరూపతః | ఇతి సంచిత్య మనసా దానవేంద్రో మహాబలః. 8

త్యక్త్వా తన్మాహిషం రూపం బభూవ పురుషః శుభః | సర్వాయుధధరః శ్రీమాం శ్చారుభూషణ భూషితః. 9

దివ్యాంబరధరః కాంతః పుష్పబాణ ఇవా పరః | రథో పవిష్టః కేయూర స్రగ్వీ బాణధనుర్ధరః. 10

సేనా పరివృతో దేవీం జగామ మదగర్వితః | మనోజ్ఞం రూపమాస్థాయ మానినీనాం మనోహరమ్‌. 11

తమాగతంస మాలోక్య దైత్యానా మధిపం తదా | బహుభిః సంవృతం వీరై ర్దేవీ శంఖ మనాదయాత్‌. 12

స శంఖనినదం శ్రుత్వా జనవిస్మయ కారకమ్‌ | సమీప మేత్య దేవ్యా స్తు తామువాచ హసన్నివ. 13

పదుహారవధ్యాయము

మహిషుడు శ్రీదేవినిగని మోహవశుడగుట

మహిషుడట్లు తన సేనల మాటలు విని కన్నులెఱ్ఱజేసి వేగిరమే తన యద్భుత రథము దెమ్మని దారుకునితో ననెను. ఆ రథము ధ్వజపతాకములతో నాయుధములతో మంచి చక్రములతో శోభిల్లి వేయిఖరములచే నడుపడుచుండెను. సూతుడా రథము దెచ్చి, రాజా! రథము దెచ్చితిని. ద్వారము చెంత నలంకృతమై యున్నదని యతని కనియెను. సకలాభరణములతో నొప్పురథమును మహిషుడు చూచెను. అతడు నరరూపముతో రణమునకేగదలచె. శ్రీదేవి నా దుర్ముఖమును గనును. ఆమె నా పొడుగైన కొమ్ములుగని మహిష రూపమును గాంచును. దాన నామె మనస్సు వికలమై నాయందు తగులదు. స్త్రీలు సురూపము చాతుర్యము కోరుదురు. కనుక నేనిపుడామె చెంతకు సురూపము చాతుర్యముగల నరాకారముతో వెళ్ళుదును. ఆమె నన్ను చూచిన తొలిచూపులోనే ప్రేమయుక్త కావలయును. నాకు నాదేవి సోయగము చూచిననే కాని సుఖము గలుగదు. ఇట్లు దానవేంద్రుడు మహాబలుడునగు మహిషుడు దలపోసెను. మహిషరూపము విడనాడి చక్కని పురుషరూపము దాల్చెను. సకలాయుధధరుడు భూషణ భూషితుడు దివ్యాంబరధరుడునై మెడలో పూలమాల దాల్చి విల్లమ్ములు చేతబట్టి రెండవ మదనుడో యన నొప్పుచు నరదముపై కూర్చుండెను. ఇట్లతడు రమణులకు మనోహరమగు రూపము దాల్చి సకలసేనలతో నహంకార మదగర్వితుడై శ్రీజగదంబను సమీపించెను. అట్లు పెక్కు వీరసైనికులతో వచ్చిన మహిషునిగని దేవి శంఖము పూరించెను. లోక విస్మయకరమగు ఆ శంఖధ్వని విని యతడు చెంతకేగి నవ్వుచు దేవితో నిట్లనెను :

దేవి సంసార చక్రే%స్మి న్వర్తమానో జనః కిల | నరో వా%థ తథా నారీ సుఖం వాంఛతి సర్వథా. 14

సుఖం సంయోగజం నౄణాం నాసంయోగే భ##వేదిహ | సంయోగో బహుధా భిన్న స్తా న్బ్రవీమి శృణుష్వ హ. 15

భేదా న్సు ప్రీతి హేతూత్థా న్స్వభావోత్థా ననేకశః | తత్ర ప్రీతిభవా నాదౌ కథాయామి యథామితి. 16

మాతాపిత్రో స్తు పుత్త్రేణ సంయోగ స్తూత్తమః స్మృతః | భ్రాతుర్భాత్రా తథా యోగః కారణా న్మధ్య మోమతః. 17

ఉత్తమస్య సుఖసై#్యన దాతృత్వా దుత్తమః స్మృతః | తస్మా దల్ప సుఖసై#్యవ ప్రదతృత్వా చ్చ మధ్యమః. 18

నావికానాం తు సంయోగః స్మృతః స్వాభావికో బుధైః | వివిధావృత చిత్తానాం ప్రసంగ పరివర్తనామ్‌. 19

అత్యల్పసుఖదాతృత్వా త్కనిష్ఠో%యం స్మృతో బుధైః | అత్యుత్తమస్తు సంయోగః సంసారే సుఖదః సదా. 20

నారీపురుషయోః కాంతే ! సమానవయసోః సదా | సంయోగో యః సమాఖ్యాతః స ఏవాత్యుత్తమః స్మృతః. 21

అత్యుత్తమసుఖసై#్యవ దాతృత్వా త్స తథావిధః | చాతుర్య రూపవేషాద్యైః కులశీలగుణౖ స్తథా. 22

పరస్పర సముత్కర్షః కథ్యతే హి పరస్పరమ్‌ | తం చేత-రోషి సంయోగం వీరేణ చ మయా సహ. 23

అత్యుత్తమ సుఖసై#్యవ ప్రాప్తిః స్యాత్తే న సంశయః | నానావిధాని రూపాణి కరోమి స్వేచ్ఛయా ప్రియే. 24

ఇంద్రాదయః సురాః సర్వే సంగ్రామే విజితా మయా | రత్నాని యాని దివ్యాని భవనే%స్మి న్మమాధునా. 25

భుంక్ష్వ త్వం తాని సర్వాణి యథేష్టం దేహి వా యథా | పట్టరాజ్ఞీ భవాద్య త్వం దాసో%స్మి తవ సుందరి. 26

దేవీ! ఈ విశాలవిశ్వమందలి స్త్రీపురుషులెల్లరును సర్వవిధముల సుఖమునే కోరుదురుగద! అట్టి సుఖము నరులకు సంయోగమందే కల్గునుగాని వియోగమున గల్గదు. ఆ సంయోగ సుఖము పలురీతుల గలదు. దానిని వచింతును వినుము. సుఖభేదములు ప్రేమవలన స్వభావము వలన ననేకముగ నుండును. తొలుత ప్రీతిభావములు దెల్పుదును వినుము. తల్లి దండ్రులకు తమ పుత్త్రులపై ప్రేమవలన సంయోగము గల్గును. అది ఉత్తమ సుఖప్రదము. కారణవశమున సోదరుల నడుమ కలయిక గల్గును. అది మధ్యమము. ఉత్తమ సుఖము గల్గించు సంయోగము శ్రేష్ఠము. అల్పసుఖమొసగునది మధ్యమము. నావికులు పెక్కుపనుల వలన వ్యాకుల చిత్తులై ప్రసంగ వశమున కలిసికొందురు. వారి సంయోగము స్వాభావికమని బుధులందురు. ఇది మిక్కిలి కొలది సుఖము గల్గించుట వలన దీని నల్ప సుఖమని బుధులందురు. జగమున నత్యుత్తమ సంయోగముత్తమ సుఖము నొసంగు చుండును. కాంతా! సరిఈడుజోడుగల యువతీయువకుల మేలుకలయిక యత్యుత్తమము. అట్టివారి కలయిక యత్యుత్తమ సుఖప్రదమైనది. ఈ కలయికకు రూపగుణ చతురతలు-కులశీలములు నావశ్యకములు. ఈ గుణము లొకరియందు కంటె నొకరి యందెక్కువ నుండవలయును. నేనన్ని విధముల నట్టి వర గుణములు గల వీరుడను. నా మూలమున నీకు నిస్సంశయముగ నత్యుత్తమ సుఖము గల్గును. ప్రియా! నేను బహూరూపములు దాల్చు మొనగాడను. ఇంద్రాది దేవతలే నాతో బోరలేక పారిపోయిరి. నా యింట వారి దివ్య రత్నములు పదిలముగ నుంచితిని. వానినెల్ల నీ యిష్టము వచ్చి నట్టు లనుభవింపుము. లేదా దానము చేసికొమ్ము, సుందరీ! నాకు పట్ట మహిషివిగమ్ము! నేను నీ చరణదాసుడను.

వైరం త్యజే%హందేవైస్తు తవవాక్యాన్న సంశయః | యథాత్వం సుఖమాప్నోషి తథా%హంకరవాణివై. 27

ఆజ్ఞాపయ విశాలాక్షి! తథా%హం ప్రకరోమ్యథ ! చిత్తం మే తవరూపేణ మోహితం చారుభాషిణి. 28

ఆతురో%స్మి వరారోహే ప్రాప్తస్తే శరణం కిల | ప్రపన్నం పాహి రంభోరు కామబాణౖః ప్రపీడితమ్‌. 29

ధర్మాణా ముత్తమో ధర్మః శరణాగత రక్షణమ్‌ | త్వదీయో%స్మ్యసితాపాంగి! సేవకో%హం కృశోదరి! 30

మరణాంతం వచః సత్యం నాన్యథా ప్రకరోమ్యహమ్‌ | పాదౌ నతో%స్మి తన్వంగి త్యక్త్వా నానాయుధాని తే. 31

దయాం కురు విశాలాక్షి తప్తో%స్మి కామమార్గణౖః | జన్మ ప్రభృతి చార్వంగి దైన్యం నాచరితం మయా. 32

బ్రహ్మాదీ నీశ్వరాన్ర్పాప్య త్వయి తద్విదధామ్యహమ్‌ | చరితం మమ జానంతి రణ బ్రహ్మదయః సురాః. 33

సో%ప్యహం తవ దాసో%స్మి మన్ముఖం పశ్య భామిని | ఇతి బ్రువాణం తం దైత్యం దేవీ భగవతీ హి సా. 34

ప్రహస్య సస్మితం వాక్యమువాచ వరవర్ణినీ | నాహం పురుష మిచ్ఛామి పరమం పురుషం వినా. 35

తస్య చేచ్ఛా%స్మ్యహం దైత్య సృజామి సకలం జగత్‌ | స మాం పశ్యతి విశ్వాత్మా తస్యాహం ప్రకృతిః శివా. 36

తత్సాన్నిధ్యవశాదేవ చైతన్యం మయి శాశ్వతమ్‌ | జడా%హం తస్య సంయోగా త్ర్పభవామి సచేతనా. 37

అయస్కాంతస్య సాన్నిధ్యా దయస శ్చేతనా యథా | న గ్రామ్య సుఖవాంఛా మే కదాచిదపి జాయతే. 38

మూర్ఖ స్త్వమసి మందాత్మ న్యత్ర్సీసంగం చికీర్షసి | నరస్య బంధనార్ధాయ శృంఖలా స్త్రీ ప్రకీర్తితా. 39

నీ మాట చొప్పున నే నీనాటినుండి సులరతో పగ మానివేయుదును. నీకు దేనివలన సుఖము గల్గునో దాననే యొనరింతును. విశాలాక్షీ! చారుభాషిణీ! నీ మోహనరూపమునకు నా చిత్తము ముగ్ధమైనది. కనుక నన్నాజ్ఞాపింపుము. నీ చెప్పినట్లు చేయుదును. రంభోరూ! వలరాజు బాణములచే పీడితుడనై యాతురతతో నీ మరుగు జొచ్చితిని. నన్ను రక్షించుము. తలోదరీ! శరణాగతరక్షణ ధర్మ మత్యుత్తమము. నేను నీవాడను. నీ దాసుడను. తన్వంగీ! ప్రాణములు పోయినను సరియే నీమాట జవదాటను. నా యాయుధములు వదలి నీ పాదములమీద పడుదును. కామ బాణములకు నా యెద తపించిపోయినది. దయగనుము. నేను పుట్టిన నాటినుండి దీనత్వ మెరుగనివాడను. నేను బ్రహ్మాదుల ముందుగూడ దీనముగ నుండలేదు. నేడు నేను నీకు దీనుడను గావలసివచ్చినది. బ్రహ్మాది దేవతలు రణమందున నా లావెఱుంగుదురు. అంతటి నేను నీకు దాసుడనైతిని. భామినీ! నా మెగము చూడుము అను మహిషుని మదమెక్కిన పలుకులు దేవి వినెను. అంత లీలా భగవతి యగు దేవి చిరునగవుతో నతనితో నిట్లనెను : నే నా పరమపురుషుని దక్కొరుని వరింపను. దైత్యాధమా! నే నా పరమశివుని యిచ్ఛాశక్తిని. ఈ సకల జగములను నేనే సృజింతును. నేను శివాప్రకృతిని. ఆ విశ్వాత్ముడు నన్ను వీక్షించువాడు. నేను జడమను. ఆతని సాన్నిధ్యము వలన శాశ్వత చైతన్య మందుదును. ఆతని సంయోగవశమున నేను చైతన్యవంతురాల నగుదును. ఇను మయస్కాంతపు సన్నిధివలన నయస్కాంతముగ మారును. నేను నా పరమశివును సన్నిధిచే సచేతన యగుదును. నాలో తుచ్ఛమైన గ్రామ్యసుఖవాంఛఖలేదు. మందమతీ! నీవు వట్టి మూఢుడవు. పరస్త్రీ సాంగత్యము కోరుచున్నావు. స్త్రీ నరుని బంధించు నినుప సంకెలయని చెప్పబడెను.

లోహబద్ధో%పి ముచ్చేత స్త్రీబద్ధో నైవముచ్యతే | కిమిచ్ఛసి చ మందాత్మ న్మూత్రాగారస్య సేవనమ్‌. 40

శమం కురు సుఖాయ త్వం శమా త్సుఖ మావాప్స్యసి | నారీసంగే మహద్దుఃఖం జాన న్కిం త్వం విముహ్యసి. 41

త్యజ వైరం సురైః సార్థం యథేష్టం విచరావనౌ | పాతాళం గచ్ఛ వా కామం జీవితేచ్ఛా యదస్తితే.

అథవా కురు సంగ్రామం బలవత్యస్మి సాంప్రతమ్‌ | ప్రేషితా%హం సురైః సర్వై స్తవ నాశయ దానవ. 43

సత్యం బ్రవీమి యేనాద్య త్వయా వచనసౌహృదమ్‌ | దర్శితం తేన తుష్టా%స్మి జీవన్గచ్ఛ యథాసుఖమ్‌ .44

సతాం సాప్తపదీ మైత్రీ తేన ముంచామి జీవితమ్‌ | మరణచ్ఛా%స్తి చేద్యుద్ధం కురు వీర యథాసుఖమ్‌. 45

హనిష్యామి మహాబాహో త్వామహం నాత్ర సంశయః | ఇతి తస్యా వచః శ్రుత్వా దానవః కామమోహతః. 46

ఉవాచ శ్లక్షణయా వాచా మధురం వచనం తతః | బిభేమ్యహం వరారోహే త్వాం ప్రహర్తుం వరాననే. 47

కోమలాం చారు సర్వాంగీం నారీం నరవిమోహినీమ్‌ | జిత్వా హరిహరాదీం శ్చ లోకపాలాం శ్చ సర్వశః. 48

కిం త్వయా సహ యుద్ధం మే యుక్తం కమలలోచనే | రోచతే యది చార్వంగి వివాహం కురు మాం భజ. 49

నో చేద్గచ్ఛ యథేష్టం తే దేశం యస్మా త్సమగతా ! నాహం త్వాం ప్రహరిష్యామి యతో మైత్రీ కృతా త్వయా. 50

హిత ముక్తం శుభం వాక్యం తస్మాద్గచ్ఛ యథాసుఖమ్‌ | కా శోభా మే భ##వేదంతే హత్వా త్వాం చారులోచనామ్‌. 51

స్త్రీహత్యా బాలహత్యా చ బ్రహ్మహత్యా దురత్యయా | గృహీత్వా త్వాం గృహం నూనం గచ్ఛామ్యద్య వరాననే. 52

ఒకవేళ లోహబంధనములనుండి యైన విడివడవచ్చును. స్త్రీబద్ధుడేనాటికిని ముక్తి జెందడు. ఈ మల మూత్రముల కొంప నేల సేవింపగోరుదువురా? సుఖము కొఱకు చిత్తశాంతి బొందుము. శాంతి వలన సుఖము గల్గును. నారీ సంగమమున దుఃఖము గల్గునని తెలిసియును మోహమునబడుదువేల? ఇకనైన నిఃలసురలతోడి వైరము బాసి యథేచ్ఛముగ వర్తింపుము. కాక జీవితాశ గలదేని రసాతలమున కేగుము. కానిచో నాతో బోరుము. నీకంటె మిక్కిలి బలముగలదానను. దేవతలందఱును కలిసికట్టుగ నన్ను నీ చావునకు పంపిరి. నేను నిజము పలుకుచున్నాను. నీవు సామవచనములు పల్కుటవలన నీకు సంతుష్టి జెందితిని. ఇకనైన బుద్ధికల్గి ప్రాణాలతో వెడలిపొమ్ము. ఏడు పదముల వలననే సాధువులకు పరస్పమైత్రి గల్గును. నిన్ను ప్రాణాలతో వదులుచున్నాను. పొమ్ము. చావగోరుదువేని నాతో పోరునకు రమ్ము. మహాబాహూ! నిన్ను చంపితీరుదును. ఇది ముమ్మాటికి నిజము అను దేవి వాక్కులు విని దానవుడు కామపరవశుడయ్యెను. అతడు తీపి మాటలతో నిట్లనెను : వరాననా! వరారోహా! నిన్ను చంపుటకు నేను భయపడుచున్నాను. నీవు కోమలాంగివి; భువనమోహినివి కనుక నిన్ను చంపజాలను. నేను హరిహరాదులను లోకపాలురను గెల్చితిని. కమలలోచనా! శుభాంగీ! ఇట్టి నీతో పోరాటము నాకు తగునా? నీ మదికి నచ్చినచో నన్ను చేపట్టి భజింపుము. కానిచో నీవచ్చిన చోటికేగుము. నీతో నేస్తము పాటించుటచే నేను నిన్ను నా చేజేతుల చంపజాలకున్నాను. హితము శుభకరము నగు మాట చెప్పితిని. ఇంక నీ చోటికి నీవేగుము. నీవు చారులోచనవు. నిన్ను చంపినంత మాత్రాన నాకేమి లాభము? స్త్రీ హత్య - బాలహత్య-బ్రహ్మహత్య-ఇవి చాల చెడ్డవి. కనుక నిన్ను గ్రహించి యింటికేగుదును. నా వెంట రమ్ము.

తథా%పి మే ఫలం న స్యా ద్బలా ద్భోగ సుఖం కుతః | ప్రబ్రవీమి సుకేశి త్వాం వినయావనతో యతః | 53

పురుషస్య సుఖం నస్యా దృతే కాంతా ముఖాంబుజాత్‌ | తత్త థైవ హి నారీణాం న స్యా చ్చం పురుషం వినా. 54

సంయోగే సుఖ సంభూతి ర్వియోగే దుఃఖసంభవః | కాంతా%సి రూపసంపన్నా సర్వా%%భరణ భూషితా. 55

చాతుర్యం త్వయి కిం నాస్తి యతో మా న భజస్యహో | తవోపదిష్టం కేనేదం భోగానాం పరివర్జనమ్‌. 56

వంచితా%సి ప్రియాలాపే వైరిణా కేన చి త్త్విహ | ముంచాగ్రహ మిమం కాంతే | కురు కార్యం సుశోభనమ్‌. 57

సుఖం తవ మమాపి స్యా ద్వివాహే విహితే కిల | విష్ణు ర్లక్ష్మ్యా సహభాతి సావిత్ర్యా చ సహాత్మభూః. 58

రుద్రో భాతి చ పార్వత్యా శచ్యా శతమఖ స్తథా | కా నారీ పతిహీనా చ సుఖం ప్రాప్నోతి శాశ్వతమ్‌. 59

యేన త్వ మసితాసాంగి న కరోషి పతిం శుభమ్‌ | కామః క్వాద్య గతః కాంతే యస్త్వాం బాణౖః సుకోమలైః. 60

మాదనైః పంచభిః కామం న తాడయతి మందధీః | మన్యే%హమివ కామో%పి దయావాం స్త్వయి సుందరి. 61

అబలేతి చ మన్వానో న ప్రేరయతి మార్గణాన్‌ | మనోభవస్య వైరం వా కిమప్యస్తి మయా సహ. 62

తేన చ త్వయ్యరాళాక్షి న ముంచతి శిలీముఖాన్‌ | అథవా మే%హితైర్దేవై ర్వారితో%సౌ ఝషధ్వజః. 63

సుఖవిధ్వంసిభి స్తేన త్వయి న ప్రహరత్యపి | త్యక్త్వా మాం మృగశాబాక్షి పశ్చాత్తాపం కరిష్య సి. 64

మందోదరీ వ తన్వంగి పరిత్యజ్య శుభం నృపమ్‌ | అనుకూలం పతిం పశ్చా త్సా చకార శఠం పతిమ్‌.

కామార్తా చ యదా జాతా మోహేన వ్యాకులాంతరా. 65

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే షోడశో%ధ్యాయః.

భోగ సుఖములు బలాత్కారము వలన గలుగవు. కనుక నేను వినయముగ చెప్పుచుంటిని. పురుషునికి యువతి ముఖమున దక్క మరెక్కడ సుఖము గలుగదు. అట్లే పురుషుడు లేనిచో యువతికిని సుఖములేదు. వారిర్వురి మనస్సులొక్కటైనచో సుఖ ప్రాప్తి గల్గును. వియోగమున దుఃఖము గల్గును. నీవు కాంతవు రూప సంపన్నవు సర్వాభరణ భూషితవు. నీలో చతురతలేదు. నీవు నన్ను భజింపకున్నావు. సుఖభోగములు వీడుమని నీకెవరు బోధించిరోకదా! నీ శత్రువెవరైన నీకు చెప్పినచో నీవు మోసగింపబడితివి. ఇకనైన పట్టు వదలి శుభకార్యమునకు గడంగుము. మన యిర్వురి వివాహమున మనకు సుఖము గల్గును. లక్ష్మి విష్ణుని - సావిత్రి బ్రహ్మను-పార్వతి రుద్రుని-శచి యింద్రుని చేపట్టినట్లు నీవు నన్ను చేపట్టుము. దీనివలన నీకును నాకును సుఖముగల్గును. పురుషుడులేని స్త్రీ యెన్నడును సుఃంపదు. నల్లని కడగంటి చూపుదానా! కాంతా! నావంటి వీరుని పతిగ గ్రహింపవేల? పూవిల్తుడు నీ హృదయమందు మెత్తని పూముల్కులు వేయడేమి? మందమతియగు మదనుడు తన యైదు బాణములతో నీమది మరుల్గొన జేయడేమి? సుందరీ! తెలిసెనులే. అతడు నాయందువలె నీయందును దయగలవాడని దలతును. నీ వబలవని మన్మథుడు నీపై బాణములు వేయుటలేదేమో? లేక అతనికి నామీద నేదేని పగ గలదో? దానిచే నతడు నీమీద బాణములు వేయుటలేదేమో? లేక వైరులగు దేవతలు మదనుని వారించిరేమో? సురలు నా సుఖము గోరువారుగారు. నన్ను వదలిన తర్వాతనైన నీవు పశ్చాత్తాపమొందగలవు. తొల్లి మందోదరి యను పడతి తన కనుకూలుడగు గొప్పరాజును త్రోసి రాజని యొక శఠుని పతిగ వరించెను. ఆమె పిదప మోహపరవశతచే కామార్తయై పశ్చాత్తపించినది.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు మహిషుడు శ్రీదేవిని గని మోహవశుడగుట యను షోడశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters