Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తదశో%ధ్యాయః వ్యాసః: ఇతి శ్రుత్వా వచస్తస్య దేవీ పప్రచ్ఛదానవమ్ | కా సా మందోదరి నారీ కో%సౌ త్యక్తో నృపస్తయా.
1 శఠః కో వా నృపః పశ్చాత్తన్మే బ్రూహి కథానకమ్ | విస్తరేణ యథా ప్రాప్తం దుఃఖం వనితయా పునః.
2 మహిషః: సింహళో నామ దేశో%స్తి విఖ్యాతః పృథివీతలే | ఘనపాదపసంయుక్తో ధనధాన్య సమృద్ధిమాన్.
3 చంద్రసేనా%భిధ స్తత్ర రాజా ధర్మ పరాయణః | న్యాయదండధరః శాంతః ప్రజాపాలన తత్పరః.
4 సత్యవాదీ మృదుః శూర స్తితిక్షు ర్నీతిసాగరః | శాస్త్ర వి త్సర్వ ధర్మజ్ఞో ధనుర్వేదే%తి నిష్ఠితః. 5 తస్య భార్యా వరారోహా సుందరీ సుభగాశుభా | సదాచారా%తి సుముఖీ పతిభక్తి పరాయణా.
6 నామ్నా గుణవతీ కాంతా సర్వలక్షణ సంయుతా | సుషువే ప్రథమే గర్భే పుత్త్రీం సా చాతి సుందరీమ్.
7 పితా చాతీవ సంతుష్టః పుత్త్రీం ప్రాప్య మనోరమామ్ | మందోదరీతి నామాస్యాః పితా చక్రే ముదాన్వితః.
8 ఇందోః కలేవ చాత్యర్థం వవృధే సా దినే దినే | దశవర్షా యదా జాతా కన్యా చాతిమనోహరా. 9 పరార్థం నృపతి శ్చింతా మవాప చ దినేదినే | మద్ర దేశాధిపః శూరః సుధన్వా నామ పార్థివః. 10 తస్య పుత్త్రో%తి మేధావీ కంబు గ్రీవో%తి విశ్రుతః | బ్రాహ్మణౖః కథితో రాజ్ఞే స యుక్తో%స్యాఃపతి శుభః. 11 సర్వలక్షణ సంపన్నః సర్వ విద్యార్థ పారగః | రాజ్ఞ పృష్టా తదా రాజ్ఞీ నామ్నా గుణవతీ ప్రియా. 12 పదుహేడవధ్యాయము మహిషుడు శ్రీదేవికి మందోదరికథ వినిపించుట దానవుని మాటలు విని శ్రీదేవి ఆ మందోదరి యెవరు? ఆమె యెవనిని వదలివేసినది? ఆ శఠు డెవడు? ఆమెకు దుఃఖమెట్లు ప్రాప్తించెను? అంతయు నాకు తెల్పుము అన మహిషు డిట్లనెను : మున్ను సింహళమను దేశమీ భూమిపై ధన ధాన్య సంపదలతో విశాల తరువులతో నొప్పుచు వన్నె కెక్కెను. ఆ దేశపాలకుడు చంద్రసేన మహారాజు. అతడు ధర్మరతుడు శాంతుడు దండధరుడు. సత్యవాది-శూరుడు-నీతిసాగరుడు-సహనశీలి-ధనుర్వేదమున ధర్మశాస్త్రమునందు కుశలుడు. ఆ రాజు భార్య యందాలరాశి-పతివ్రత-సదాచార. ఆ రాణిపేరు గుణపతి. సర్వలక్షణ సంయుత. ఆమె తొలికాన్పున నొక బాలను గనెను. రాజు తన యందాల గాదిలి కూతును గని యామెకు మందోదరియని పేరు పెట్టెను. ఆ చిన్నారి పాప చంద్రకళవలె దినదిన ప్రవర్థమాన మయ్యెను. ఆమె పదేండ్లకు సౌందర్యరాశిగ చెన్నొందెను. అప్పుడు ఆమె తండ్రి యామెకు దగిన వరుని వెదుక నారంభించెను. ఆ నాళ్ళలో మద్ర దేశపతి సుధన్వుడనురాజుండెను. ఆతనికి కంబుగ్రీవుడని తెల్విగని కొడుకుండెను. అతడు తన కూతునకు తగినవరుడని రాజు విప్రులవలన నెఱింగెను. ఆ రాకొమరుడు సర్వలక్షణ సంపన్నుడు సర్వవిద్యాపారగుడనని తెలిసి రాజు తన భార్యతో - కంబుగ్రీవాయ కన్యాం స్వాం దాస్యామి వర వర్ణనీమ్ | సా తు పత్యు ర్వచః శ్రుత్వా పుత్రీం పప్రచ్ఛసాదరమ్. 13 వివాహం తే పితా కర్తుం కంబుగ్రీవేణ వాంఛతి | తచ్ఛ్రుత్వా మాతరం ప్రాహ వాక్యం మందోదరి తదా. 14 నాహం పతిం కరిష్యామి నేచ్ఛా మే%స్తి పరిగ్రహే | కౌమారం వ్రత మాస్థాయ కాలం నేష్యామి సర్వథా. 15 స్వాతంత్య్రేణ చరిష్యామి తప స్తీవ్రం సదైవ హి | పారతంత్ర్యం పరం దుఃఖంమాతః సంసార సాగరే. 16 స్వాతంత్ర్యా న్మోక్షమిత్యాహుః పండితాః శాస్త్ర కోవిదాః | తస్మా న్ముక్తా భవిష్యామి పత్యామే న ప్రయోజనమ్. 17 వివాహే వర్తమానే తు పావకస్య చ సన్నిధౌ | వక్తవ్యం వచనం సమ్యక్త్వ దధీనా%స్మి సర్వదా. 18 శ్వశ్రూ దేవరవర్గాణాం దాసీత్వం శ్వశురాలయే | పతి చిత్తానువర్తిత్వం దుఃఖా ద్దుఃఖతరం స్మృతమ్. 19 కదా చిత్పతి రన్యాం వా కిమినీం చ భ##జే ద్యది | తదా మహత్తరం దుఃఖం సపత్నీ సంభవం భ##వేత్. 20 తదేర్ష్యా జాయతే పత్యౌ క్లేశశ్చాపి భ##వేదథ | సంసారే క్వ సుఖం మాత ర్నారీణాం చ విశేషతః. 21 స్వభావా త్పరతంత్రాణాం సంసారే స్వప్న ధర్మిణి | శ్రుతం మయా పురా మాత రుత్తాన చరణాత్మజః. 22 ఉత్తమః సర్వధర్మజ్ఞో ధ్రువా దవరజో నృపః | పత్నీం ధర్మపరాం సాధ్వీం పతిభక్తిపరాయణామ్. 23 అపరాధం వినా కాంతాం త్యక్తవా న్విపినే ప్రియామ్ | ఏవం విధాని దుఃఖాని విద్యమానే తు భర్తిరి. 24 ''మన కన్నియను కంబుగ్రీవునకిత్తము అనెను. పతిమాట విని రాణి తన కూతుతో ప్రియము గదురీ నీ తండ్రి నిన్ను కంబుగ్రీవునకీయ నిశ్చయించుకొనెను'' అనెను తన తల్లి మాట విని యాబాలిక యిట్లనెను : అమ్మా! నేను పతిని గోరను. నాకు పెండ్లివలదు. ఇట్లే కౌమార వ్రతముతో కాలము వెళ్ళబుత్తును. నేను స్వతంత్రముగ నుందును. ఈ దుస్తర సంసార సాగరమందు పారతంత్య్రము దుఃఖకరము. ఆత్మ స్వాతంత్ర్యమున ముక్తి గల్గునని పండితులు వక్కాణింతురు. కాన ముక్తికి యత్నింతును. నాకిక పతితో బనియేమి? వివాహ మందగ్ని సన్నిధానమున పతి కధీనురాలనుగ నుందునని ప్రతిజ్ఞ చేయవలయును. అత్తవారింట నత్తమామలకు బావమఱదులకు లొంగి యుండవలయును. పతిబొందు సుఖ దుఃఖములను బట్టి సుఖదుఃఖము లనుభవింపవలయును. ఇది మిక్కిలి దుఃఖతరము. ఒకవేళ పతి వేరొక కామినిని వలచినచో నపుడు సవతి పోరు ఘటిల్లును. అది ఇంతింతనరానిది. అంత పతిపట్ల నసూయ ఏర్పడును. క్లేశములు గల్గును ఇట్టి సంసారమందు స్త్రీలకు సుఖమెక్కడిది? స్త్రీలు సహజముగ పరాధీనులు. ఈ జగమొక పెద్ద కలవంటిది. తల్లీ! తొల్లి యుత్తానపాదునకు ఉత్తముడను కొడుకుండెను. అతడు ధర్మజ్ఞుడు. ధ్రువుని కంటే చిన్నవాడు. అతడు రాజయ్యెను. ఉత్తమునకు పతివ్రతయగు భార్య గలదు. ఆమె నిరపరాధ. ఇట్టి తన భార్యను రాజడవుల కంపెను. పతి యుండగనే భార్య కిట్టి దుఃఖము గల్గుచుండును. కాలయోగా న్మృతే తస్మి న్నారీ స్యాద్ధుఃఖ భాజనమ్ | వైధవ్యం పరమం దుఃఖం శోకసంపాత కారకమ్. 25 పరోషిత పతిత్వే%పి స్యా దధికం గృహే | మదనాగ్ని విదగ్ధాయాః కిం సుఖం పతిసంగజమ్. 26 తస్మా త్పతి ర్న కర్తవ్యః సర్వథేతి మతిర్మమ | ఏవం ప్రొక్తా తదా మతా పతిం ప్రాహ నృపాత్మజా. 27 న చ వాంఛతి భర్తారం కౌమార త్రధారిణీ | వ్రతజాప్య పరా నిత్యం సంసార ద్విముఖీ సదా. 28 న కాంక్షతి పతి కర్తు బహుదోష విచక్షణా | భార్యాయా భాషితం శ్రుత్వా తథైవ సంస్థితో నృపః. 29 వివాహో న కృతః పుత్ర్యా జ్ఞాత్వా భావ వివర్జితామ్ | వర్తమానా గృహేష్వేవం పిత్రా మాత్రా చ రక్షితా. 30 ¸°వన స్యాంకురా జాతా నారీణాం కామదీపకాః | తథా%పి సా వయస్యాభిః ప్రేరితా%పి పునః పునః. 31 చకమే న పతిం కర్తుం జ్ఞానార్థపదభాషిణీ | ఏకదోద్యానదేశే సా విహర్తుం బహుపాదపే. 32 జగామ సుముఖీ ప్రేవ్ణూ సైరంధ్రీగణసేవితా | రేమే కృశోదరీ తత్రాపశ్య త్కుసుమితా లతాః. 33 పుష్పాణి చిన్వతీ రమ్యా వయస్యాభిః సమావృతా | కోసలాధిపతి స్తత్ర మార్గే దైవవశా త్తదా. 34 ఆజగామ మహావీరో వీరసేనో%తి విశ్రుతః | ఏకాకీ రథమారూఢః కతిచిత్సేవకై ర్వృతః. 35 సైన్యం చ పృవ్ఠత స్తస్య సమాయాతి శ##నైః శ##నైః | దృష్ట స్తస్యా వయస్యా తు దూరతః పార్థివ స్తదా. 36 కాలము తీరినచో పతి చనిపోవును. అపుడా స్త్రీ దుఃఖము చెప్పనలవిగాదు. వైధవ్యము శోకసంతాప కారకము. అది దుఃఖమయము. పతి విదేశముల కేగినను స్త్రీకి దుఃఖము గల్గును. ఆమె మదనాగ్ని పీడితురాలైనచో నామెకు పతి సుకమెక్కడిది? కనుక పతిని చేసికొనకూడదు. ఇది నా మతము' అను తన కూతు మాటలను రాణి తన భర్త కీవిధముగా చెప్పెను. ఆమెకు పతి వలదట. కౌమార వ్రతమున జప వ్రతము లొనర్చునట. ఆమెకు సంసారము ఇష్టము కాదట. పతి యందు పెక్కు దోషము లుండును. అని యామె పెండ్లి చేసుకొనుట కంగీకరించుట లేదు.' రాణి మాటలు రాజు వినెను. తన కూతునకు పెండ్లి యిష్టము కాకుండు టెఱిగి రాజామెకు పెండ్లి చేయలేదు. ఆమె తన తల్లిండ్రుల యింట నుండి వారిచే పోషింపబడుచుండెను. సాధారణముగ స్త్రీలకు కామమును ఉద్దీపింపచేయు ¸°వనాంకురములు కలిగిన తరువాత కూడ మాటి మాటికి తన చెలులెంతగ ప్రేరించినను ఆమె జ్ఞానవిషయములగు మాటలనే ఆడుచుండెను కాని భర్తకావలెనని మాత్రము అనుకొనలేదు. ఒకనాడామె వన విహారమునకు వెడలెను. ఆ వనమందు తీవియలు విరియబూచియుండెను. మందోదరిని చెలికత్తెలు సేవించుచుండిరి. ఆ సుముః ప్రేమమీర వన శోభ తిలకించు చుండెను. అట్లు చెలియలు పూలుగోయుచు నామె చుట్టు మూగి యేమేమో పల్కుచుండిరి. అంతలోనే దైవయోగమున నచటికి కోసలపతి యేతెంచెను. అతనిపేరు వీరసేనుడు. మహావీరుడు. అతడు ఒంటరియై రథమెక్కి యుండెను. అతని వెంటకొలది సైన్యముండెను. వెనుకనుండి పెద్ద సైన్యము మెల మెల్లగ వచ్చుచుండెను. ఆమె చెలి వీరసేనుని దూరమందుండగనే చూచెను. మందోదర్యై తదా ప్రోక్తం సమాయాతి నరః పథి | రథారూఢో మహాబాహూ రూపవా న్మదనో%పరః. 37 మన్యే%హం నృపతిః కశ్చి త్ర్పాప్తో భాగ్యవశా దిహ | ఏవం బ్రువంత్యాం తత్రాసౌ కోసలేంద్రః సమాగతః. 38 దృష్ట్వా తామసితా పాంగీం విస్మయం ప్రాప భూపతిః | ఉత్తీర్య చ రథాత్తూర్ణం పప్రచ్ఛ పరిచారికామ్. 39 కేయం బాల విశాలాక్షి కస్య పుత్రీ వదాశు మే | ఏవం పృష్టా తు సైరంధ్రీ తమువాచ శుచిస్మితా. 40 ప్రథమం బ్రూహి మే వీర పృచ్ఛామి త్వాం సులోచనమ్ | కో%సి త్వం కిమిహాయాతః కిం కార్యం వద సాంప్రతమ్. 41 ఇతి పృష్ట స్తు సైరంధ్ర్యా తా మువాచ మహీపతిః | కోసలో నామ దేశో%స్తి పృథివ్యాం పరమాద్భుతః. 42 తస్య పాలయితీ చాహం వీరసేనాభిధః ప్రియే | వాహినీ పృష్ఠతః కామం సమాయాతి చతుర్విధా. 43 మార్గభ్రమా దిహ ప్రాప్తం విద్ధి మాం కోసలాధిపమ్ | సైరంధ్ర్యువాచ: చంద్రసేనసుతా రాజ న్మామ్నా మందోదరీ కిల. 44 ఉద్యానే రంతుకామేయం ప్రాప్తా కమలలోచనా | శ్రుత్వా తద్భాషితం రాజా ప్రత్యువాచ ప్రసాధికామ్. 45 సైరంధ్రి చతురా%సి త్వం రాజపుత్త్రీం ప్రబోధయ | కకుత్థ్సవంశజ శ్చాహం రాజా%స్మి చారులోచనే. 46 గాంధర్వేణ వివాహేన పతిం మాం కురు కామిని | న మే భార్య%స్తి సుశ్రోశణి వయసో%ద్భుత ¸°వనామ్. 47 వాంఛామి రూపసంపన్నాం సుకులాం కామినీం కిల | అథవా తే పితా మహ్యం విధినా దాతు మర్హతి. 48 ఆమె మందోదరి కిట్లనెను: అదిగో, యొక యందగాడు - రెండవ కాముని వలె చూడనొప్పుచున్నాడు. ఇటే వచ్చు చున్నాడు. నీ యదృష్టమున నతడు రాజే యగునని తలంతుము అని ఆమె అనుచుండగనే యతడెట్ట యెదుటికి రానేవచ్చెను. అతడా సుందరిని కన్నారగాంచి ఆశ్చర్యపడెను. అతడు రథము దిగి యొక పరిచారికతో ఈ విశాలాక్షి యెవతె? ఎవరి కూతురు? వెంటనే చెప్పుము, అనగా సైరంధ్రి యతని కిట్లు మారు పలికెను: వీరవరా! మొదట నీవెవరో చెప్పుము. ఇటకేల వచ్చితివి? ఏమి పని? అన రాజు సైరంధ్రితో ఈభూమిపై కోసలమను పెద్ద దేశము గలదు. నేను దాని పాలకుడను. వీర సేనుడను. నా వెనుక చతురంగ బలము వచ్చుచున్నది. దారితప్పి వచ్చితిని.' సైరంధ్రి కోసలపతి కిట్లనెను : రాజవర్యా! ఈ సుందరి చంద్రసేనుని ముద్దులపట్టి. పేరు మందోదరి. ఈ యుద్యానవనము నందు విహరించు కోర్కితో నీమె యిచటకు వచ్చినది అను సైరంధ్రి మాటలు విని రాజామెకు మరల నిట్లనెను : సైరంధ్రీ! నీవు చతురవు. నీ రాకుమార్తెకు నచ్చ చెప్పుము. నేను కాకుత్థ్స వంశజుడను. రాజును. ఈ కామిని నన్ను గాంధర్వ విధితో పెండ్లి కావచ్చును. సుశ్రోణీ! నాకును పెండ్లి కాలేదు. ఈమె అబ్బురము గొలుపు నిండు పరువముతో మెండుకొనియున్నది. ఈమె కామిని-కులవతి-రూపవతి-యువతి. ఈమెను నేను కోరుచున్నాను. ఈమె తండ్రియైన ఈమెను నాకు యథావిధిగ నీయవచ్చును. అనుకూలవతి శ్చాహం భవిష్యామి న సంశయః | ఇత్యాకర్ణ్య వచ స్తస్య సైరంధ్రీ ప్రాహతాంతదా. 49 ప్రవస్య మధురం వాక్యం కామశాస్త్ర విశారదా ! మందోదరి ! నృపః ప్రాప్తః సూర్యవంశసముద్భవః. 50 రూపవా న్బలవా న్కాంతో వయసా త్వత్సమః పునః ప్రీతిమా న్నృపతి ర్జాత స్త్వయి సుందరి సర్వథా. 51 పీతా%పి తే విశాలాక్షి పరితప్స్యతి సర్వథా | వివాహకాలం తే జ్ఞాత్వా త్వాం చ వైరాగ్యసంయుతామ్. 52 ఇత్యాహ%స్మా న్స నృపతి ర్వినిఃశ్యస్య పునః పునః | పుత్రీం ప్రభోధయా త్వేతాం సైరంధ్ర్యః సేవనేరతాః. 53 వక్తుం శక్తా వయం న త్వాం హఠధర్మరతాం పునః | భర్తుః శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో%బ్రవీ న్మనుః. 54 భర్తారం సేవమానా వై నారీ స్వర్గ మవాప్నుయాత్ | తస్మా త్కురు విశాలాక్షి వివాహం విధిపూర్వకమ్. 55 మందోదరీ : నా%హం పతిం కరిష్యామి చరిష్యే తపమద్భుతమ్ | నివారయ నృపం బాలే కిం మాం పశ్యతి నిస్త్రపః. 56 సైరంధ్రీ: దుర్జయో దేవి కామో%సౌ కాలో%సౌ దురతిక్రమః | తస్మా న్మే వచనం పథ్యం కర్తు మర్హసి సుందరి. 57 అన్యథా వ్యసనం నూన మాపతే దితి నిశ్చయః | ఇతి తస్యా వచః శ్రుత్వా కన్యోవాచాథ తాం సఖీమ్. 58 యద్య ద్భవేత్త ద్భవతు దైవయోగా దసంశయమ్ | న వివాహం కరిష్యే%హం సర్వథా పరిచారికే. 59 ఇతి తస్యా స్తు నిర్బంధం జ్ఞాత్వా ప్రాహ నృపంపునః | గచ్ఛరాజ న్యథాకామం నేయ మిచ్ఛతి తత్పతిమ్. 60 నృ ప స్తు తద్వచః శ్రుత్వా నిర్గతః సహసేనయా | కోసలా న్విమనా భూత్వా కామినీం ప్రతి నిఃస్పృహః. 61 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే సప్తదశో%ధ్యాయః. ఈమెకు నేను తగిన పతి నగుదును సందేహము లేదు అను రాజు పలుకులు విని కామశాస్త్ర విశారద యగు సైరంధ్రి తీయగ నవ్వి యిట్లనెను: 'మందోదరీ! ఇదిగో! ఇతడు రాజవర్యుడు. సూర్యవంశజుడు. బలరూపవంతుడు. నీ కీడుజోడైనవాడు. నిన్నతడు నిండారగ కామించుచున్నాడు. నీకు వివాహోచిత వయస్సు వచ్చినను నీవు విరాగిణివై నందులకు నీ తండ్రి మిక్కిలి చింతించుచున్నాడు. నీ తండ్రి నిట్టూర్చుచు నాతో నీ వామెను సేవించుచు నామె మనస్సు మార్చుము' అనినాడు. కాని, నీవేమో పట్టిన మొండిపట్టు వదలుటలేదు. నీకు చెప్పలేకున్నాను. సతులకు పతి సేవయే పరమ ధర్మమని మనువు ప్రవచించెను. సతికి పతిసేవచేతనే స్వర్గము లభించును. కునుక నీవు విధి విధానమున పెండ్లి గమ్ము అన మందోదరి యిట్లనెను : 'నాకు పతితో నేమి పని? నేను తీవ్ర తప మాచరింతును. అతడు సిగ్గుమాలి యేల అట్లు చూపులతో నన్ను జూచుచున్నాడు? నన్నట్లు చూడవలదని అతనితో ననుము. సైరంధ్రి యిట్లనెను : దేవీ! కాముడు దుర్జయుడు. కాలము దాటరానిది. కాన నా మేలు మాట పాటించుట మంచిది. కానిచో నీకు తప్పక యాపద మూడును అను మాటలకు మరల కన్యక సైరంధ్రి కిట్లనెను : ఓ సైరంధ్రీ! దైవయోగమున నేది కావలసినదో అది కాగలదు. నేను మాత్రము పెండిగాను.' అపుడు సైరంధ్రి రాజుతో రాజా! నీ యిష్టమున్నచోటి కరుగుము. ఈమె తగిన పతిని గోరుటలేదు' అనెను. ఆమె మాటలు విని రాజా కామిని యెడల నిరాశుడై మనసు మార్చుకొని సేనతో తన కోసలదేశ మేగెను. ఇది శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధమందు మహిషుడు దేవికి మందోదరి కథ వినిపించుటయను సప్తదశాధ్యాయము.