Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టాదశో%ధ్యాయః తస్యాస్తు భగినీ కన్యా నామ్నా చేందుమతీ శుభా | వివాహ యోగ్యా సంజాతా సురూపా%వరజా యథా.
1 తస్యా వివాహః సంవృత్తః సంజాతశ్చ స్వయంవరః | రాజానో బహుదేశీయాః సంగతా స్తత్ర మండపే.
2 తయా వృతో నృపః కశ్చి ద్బలవా న్రూప సంయుతః | కులశీల సమాయుక్తః సర్వలక్షణ సంయుతః.
3 తదా కామాతురా జాతా విటం వీక్ష్య నృపం తు సా | చకమే దైవయోగా త్తు శఠం చాతుర్యభూషితమ్.
4 పితరం ప్రాహ తన్వంగీ వివాహం కురు మే పితః | ఇచ్ఛా మే%ద్య సముద్భూతా దృష్ట్వా మద్రాధిపం త్విహ.
5 చంద్రసేనో%పి తచ్ఛ్రుత్వా పుత్ర్యా యద్భాషితం రహః | ప్రహసన్నేవ మనసా తత్కార్యే తత్పరో%భవత్. 6 తమాహూయ నృపం గేహే వివాహ విధినా దదౌ | కన్యాం మందోదరీం తసై#్మ పారిబర్హం తథా బహు.
7 చారుదేషోణ%పి తాం ప్రాప్య సుందరీం ముదితో%భవత్ | జగామ స్వగృహం తుష్టో రాజా%పి సహితః స్త్రియా.
8 రేమే నృపతి శార్దూలః కామిన్యా బహువాసరాన్ | కదాచి ద్దాసపత్న్యా స రమమాణో రహః కిల.
9 సైరంధ్ర్యా కథితం తసై#్య తయా దృష్టః పతి స్తథా | ఉపాలంభం దదౌ తసై#్మ స్మితపూర్వం రుషా%న్వితా.
10 కదాచిదపి సామాన్యాం రహో రూపవతీం నృపః | క్రీడయం ల్లాలయ న్దృష్టః ఖేదం ప్రాప తదైవసా. 11 న జ్ఞాతో%యం శఠః పూర్వం యదా దృష్టః స్వయంవరే | కిం కృతం తు మయా మోహా ద్వంచితా%హం నృపేణ హ. 12 కిం కరోమ్యద్య సంతాపం నిర్లజ్జే నిరృణ శ##ఠే | కా ప్రీతి రీదృశే పత్యౌ ధిగద్య మమ జీవితమ్. 13 అద్య ప్రభృతి సంసారే సుఖం త్యక్తం మయా ఖలు | పతి సంభోగజం సర్వం సంతోషో%ద్య మయా కృతః. 14 పదుఎనిమిదవధ్యాయము శ్రీదేవి మహిషుని సంహరించుట ఆ మందోదరి కిందుమతి యను చెల్లెలు గలదు. ఆమె చూడచక్కనిది. పెండ్లికి తగిన వయస్సున నున్నది. ఆమె వివాహమునకు స్వయంవర మేర్పరుపబడెను. అందు పలు దేశముల రాజులు వచ్చి సమావిష్టులైరి. ఆ రాజకుమారులలో కులశీలములు-రూపబలములు-సర్వలక్షణములు గల యొక రాకొమరు నిందుమతి వరించెను. అంత మందోదరి యోపలేని కోపముతో దైవయోగమున నొక శఠుడు-చతురుడు-విటుడు నగు రాజును గని కామించెను. మద్రభూపతి నాకు నచ్చినవాడు. నన్నతని కిచ్చి పెండ్లి చేయు'మని యామె తన తండ్రితో ననెను. తన కూతు మాట లాలించి సంతసించి చంద్రసేనుడు పెండ్లి పనులు మొదలుపెట్టెను. ఆ రాజకుమారుని రావించి యథావిధిగ నతనికి మందోదరిని ధనరాసులను నొసంగి రాజు వివాహము జరిపించెను. చారుదేష్ణుడను ఆ మద్రపతి యా సుందరిని బడసి సంతుష్టుడై యామెను వెంటగొని తన యింటి కేగెను. అతడామె పెక్కేండ్లు రమించెను. ఒకనా డతడు తన దాసితో రహస్యముగ క్రీడించుచుండగా ఆ విషయ మొక చేటిగని మందోదరికి తెలె.... ఆమె నవ్వి రోషముతో తన పతిని తూలనాడెను. మరొకప్పుడు తన పతి యొక సామాన్య వనిత యెదలోన కొలువై యామె లాలించుచు నామె కోర్కులు దీర్చుటగని ఇట్లు మందోదరి మిక్కిలి పరితపించెను : నాకితడు స్వయంవరమందు శఠుడు దోచలేదు. ఇపు డితడు నన్ను వంచించెను. నేను మోహముతో నెంత పనిచేసితిని? ఇపు డేమి చేయుదును? నా పతి దయ యెగ్గుసిగ్గులు - లేని శఠుడు. ఇతనితో నాకిక ప్రేమబంధ మెట్లు పొసగును? ఇక నా బ్రతుకు వ్యర్థమే కదా! నే నీనాటినుండియు వీడని పతి సంభోగసౌఖ్యములు గోల్పోతిని. పనికిమాలిన సంతోషమే చివరకు మిగిలెను. అకర్తవ్యం కృతం కార్యం తజ్జాతం దుఃఖదం మమ | దేహత్యాగః క్రియతే చే ద్ధత్యా%తీవ దురత్యయా. 15 పితృగేహం వ్రజామ్యాశు తత్రా%పి న సుఖం భ##వేత్ | హాస్యయోగ్యా సఖీనాం తు భ##వేయం నాత్ర సంశయః. 16 తస్మా దత్రైవ సంవాసో వైరాగ్య యుతయా మయా | కర్తవ్యః కాలయోగేన త్యక్త్వా కామసుఖంపునః. 17 ఇతి సంచింత్య సా నారీ దుఃఖశోకపరాయణా | స్థితా పతిగృహం త్యక్త్వా సుఖం సంసారజం తతః. 18 తస్మా త్త్వమపి కల్యాణి ! మామనాదృత్య భూపతిమ్ | అన్యం కాపురుషం మందం కామార్తా సంశ్రయిష్యసి. 19 వచనం కురు మే తథ్యం నారీణాం పరమం హితమ్ | అకృత్వా పరమం శోకం లప్స్యసే నాత్ర సంశయః. 20 దేవ్యువాచ : మందాత్మ న్గచ్ఛ పాతాళం యుద్ధం వా కురు సాంప్రతమ్. మత్వా త్వా మసురా న్సర్వా న్గమిష్యామి యథా సుఖమ్. 21 యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ | తదా తేషాం చ రక్షార్థం దేహం సంధారయామ్యహమ్. 22 అరూపాయాశ్చ మే రూప మజన్మాయా శ్చ జన్మ చ | సురాణాం రక్షణార్థాయ విద్ధి దైత్య వినిశ్చితమ్. 23 సత్యం బ్రవీమి జానీహి ప్రార్థితాహం సురైః కిల | త్వద్వధార్థం హయారే త్వాం హత్వా స్థాస్యామి నిశ్చలా. 24 తస్మా ద్యుధ్యస్వ వా గచ్ఛ పాతాళ మసురాలయమ్ | సర్వథా త్వా హనిష్యామి సత్యమేతద్బ్రవీ మ్యహమ్. 25 ఇత్యుక్తః స తయాదేవ్యా ధనురాదాయ దానవః | యుద్ధకామః స్థిత స్తత్ర సంగ్రామాంగణభూమిషు. 26 ముమోచ తరసా బాణా న్కర్ణా%%కృష్టాన్ శిలాశితాన్ | దేవీ చిచ్ఛేద తా న్బాణౖః క్రోధా న్ముక్తైరయోముఖైః. 27 తయోః పరస్పరం యుద్ధం సంబభూవ భయప్రదమ్ | దేవానాం దానవానాం చ పరస్పరజయైహిషిణామ్. 28 నేను జేసిన యకార్యమే నన్నీ దుఃఖాలపాలు చేసెను. నేనిపుడు దేహత్యాగము చేసికొన్నచో ఆత్మహత్య యగును. ఒకవేళ నేను నా తండ్రి యింటి కేగినచో నటగూడ సంతోషము గల్గదు. అల నా తొంటి చెలులే నన్ను పరిహసింతురు. కనుక నిచటనే కామసుఖములు పాసి-వైరాగ్యము బూని కాలము గడుపుట మంచిది. మహిషుడిట్లనియె : అని యామె దుఃఖముతో సంసార సుఖములను వదలివేసెను. నిత్య కళ్యాణి! అట్లే నీవును భూపతినగు నన్ను నిరాకరించితివి. పిదప నీవు కామార్తవై మందుండును కాపురుషుడు నగు వాని నాశ్రయింపగలవు. నా యీ మంచిమాటలు స్త్రీలకు దగినవి. కాన నా మాట వినుము. విననిచో నీవు నిజముగ శోకముల పాలగుదువు. శ్రీదేవి యిట్లనియె : మూఢుడా! పాతాళమున కేగుము. లేదా నాతో పోరు సాగింపుము. నిన్ను, నీ దానవుల గుంపులనెల్ల చంపిగాని నేను స్వేచ్ఛగ వెళ్ళను. సాధువులకు క్లేశములు గల్గినపుడెల్ల వారినభిరక్షించుటకునే నవతరింతును. నాకు సహజముగ రూపము జన్మము లేదు. కాని దేవాభ్యుదయమునకు సాధుసంరక్షణమునకు రూపము దాల్చి యవతరింతునని యెఱుగుము. మహిషాధమా! నేను నిజము చెప్పుచుంటిని, వినుము. నేను దేవతల ప్రార్థన మంగీకరించి పిమ్మట నిన్ను చంపుటకే వచ్చితిని. నిన్ను చంపిన నేను స్థిమితము చెందుదును. కనుక నీవు పాతాళ##మేగుము లేదా యుద్ధము చేయుము. అన్ని విధముల నిన్ను చంపి తీరుదును. ఇది నిజము అను దేవి పలుకులు విని మహిషుడు యుద్ధకాముడై ధనస్సుచేపట్టి రణాంగణమున దుమికెను. అతడు చెవివఱకు వింటినారి లాగి బాణములు ఏయగ, దేవి మహాక్రోధముతో వానినెల్ల తన యినుప ములుకులతో తుత్తునియలు చేసెను. అంత వారిర్వురకును భీషణ సంగ్రామము సంఘటిల్లెను. అది జయమును గోరుచున్న దేవదానవులకును భయంకరముగ నుండెను. మధ్యే దుర్ధర ఆగత్య ముమోచచశీలీముఖాన్ | దేవీం ప్రతి విషాసక్తా న్కోపయ న్నతిదారుణాన్. 29 తతో భగవతీ క్రుద్ధా తం జఘాన శ##తైః శ##రైః | దుర్ధర స్తు పపాతక్షర్య్యాం గతాసు ర్గిరిశృంగవత్. 30 తం తథా నిహతం దృష్ట్వా త్రిణత్రః పరమాస్త్రవిత్ | ఆగత్య సప్తభి ర్బాణౖ ర్జఘాన పరమేశ్వరీమ్. 31 అనాగతాం స్తు చిచ్ఛేద దేవీ తా న్విశిఖైః శరాన్ | త్రిశూలేన త్రినేత్రం తు జఘాన జగదంబికా. 32 అంధక స్త్వాజగామాశు హతం దృష్ట్వా త్రిలోచనమ్ | గదయా లోహమయ్యా%%శు సింహం వివ్యాధమస్తకే. 33 సింహ స్తు నఖఘాతేన తం హత్వా బలవత్తరమ్ | చఖాద తరసా మాంసమంధకస్య రుషా%న్వితః. 34 తా న్రణ నిహతా న్వీక్ష్య దానవో విస్మయం గతః | చిక్షేప తరసా బాణా నతి తీక్షాన్ శిలాశితాన్. 35 ద్విధా చక్రే శరాన్దేవీ తా నప్రాప్తాన్ శిలీముఖైః | గదయా తాడయామాస దైత్యం వక్షసి చాంబికా. 36 స గదాభిహతో మూర్ఛా మవాపామరబాధకః | విషహ్య పీడాం పాపాత్మా పున రాగత్య సత్వరః. 37 జఘాన గదయా సింహం మూర్ధ్ని క్రోధసమన్వితః | సింహో%సి నఖఘాతేన తం దదార మహాసురమ్. 38 విహాయ పౌరుషం రూపం సో%పి సింహో బభూవ హ ! నఖై ర్విదారయామాస దేవీ సింహం మదోత్కటమ్. 39 తం చ కేసరిణం వీక్ష్య దేవీ క్రుద్ధా హ్యయోముఖైః | శ##రై రవాకిర త్తీక్షైః శ##రై రాశీవిషై రివ. 40 త్యక్త్వా సహరిరూ పంతు గజో భూత్వా మదస్రవః | శైలశృంగం కరే కృత్వా చిక్షేప చండికాం ప్రతి. 41 ఆగచ్ఛతం గిరేః శృంగం దేవీ బాణౖః శిలాశితైః | చకార తిలశః ఖండాన్ జహస జగదంబికా. 42 అంతలో దుర్ధరుడనువా డుగ్రుడై వచ్చి విషము గ్రక్కు దారుణ బాణములు దేవిపై కురిసెను. భగవతియును మహోగ్రమున వాడి శరములనేయగ నతడు పర్వతమువలె నేలగూలి యసువులు పాసెను. అదిగని మహాస్త్రవిదుడగు త్రినేత్రుడు వచ్చి దేవిపై నేడు బాణములను ఏసెను. అవి తన్ను జేరకముందే శ్రీదేవి ఆ బాణములు దునిమి త్రినేత్రుని తన త్రిశూలముతో పొడిచి చంపెను. అదిగని యంధకుడను వాడు లోహగద గొనివచ్చి సింహము తలపై మోదెను. సింహము సైతము క్రోధముతో తన వాడి గోళ్ళతో వాని చీల్చి చెండాడి మాంసము తినసాగెను. ఇట్లందఱును సమరమున మరణించుట గని మహిషుడు విస్మితుడై వేగమువ దేవిపై బాణముల ఏసెను. అవి తన్ను జేరకమునుపే అంబికాదేవి వాని త్రుంచి గదతో నతని ఱొమ్ము పగులగొట్టెను. అతడా బెట్టిదపు గదాఘాతమునకు మూర్ఛిల్లి కొంచెమాగి మరల లేచెను. అతడు గదతో సింహము తలపై గొట్టగా సింహము తన వాడి గోళ్ళతో నా మహాసురుని చీల్చివేసెను. వాడంతట నరరూపము వదలి సింహరూపము దాల్చి మదించిన దేవి సింహమును తన వాడి గోళ్ళతో నా మహాసురుని చీల్చివేసెను. వాడంతట నరరూపము వదలి సింహరూపము దాల్చి మదించిన దేవి సింహమును తన గోళ్ళతో తిరిగి చీల్చెను. వాడు సింహరూపము దాల్చుటగని శత్రుసూరిణియగు దేవి వానిపై నినుపములుకులుగల విషబాణములు ప్రయోగించెను. అతడు సింహరూపము వదలి గజరూపము దాల్చి తొండముతో పర్వత శిఖరము పెకలించి దేవిపై విసెరెను. తనపైకి వచ్చు గిరిశిఖరములను శ్రీరణదుర్గ తన వాడి శరములతో నుగ్గునుగ్గొనర్చి వికటాట్టహాస మొనరించెను. ఉత్పత్య చ తదా సింహస్తస్య మూర్ధ్ని వ్యవస్థితః | నఖై ర్విదారయామాస మహిషం గజరూపిణమ్. 43 విహాయ గజరూపం చ బభూవాష్టపదీతథా | హంతుకామోహరింకోపాద్దారుణో బలవత్తరః. 44 తం వీక్ష్య శరభం దేవీ ఖడ్గేన సా రుషా%న్వితా | ఉత్తమాంగే జఘానాశు సో%పి తాం ప్రాహరత్తదా. 45 తయోః పరస్పరం యుద్ధం బభూ వాతి భయప్రదమ్ | మాహిషం రూపం మాస్థాయ శృంగాభ్యాం ప్రాహర త్తదా. 46 పుచ్ఛ ప్రభ్రమణనాశు శృంగఘాతై ర్మహాసురః | తాడయామాస తన్వంగీం ఘోరరూపో భయానకః. 47 పుచ్ఛేన పర్వతాన్ శృంగే గృహీత్వా భ్రామయ నబలాత్ | ప్రేషయామాస పాపాత్మా ప్రహస న్పరయాముదా. 48 తా మువాచ బలోన్మత్త స్తిష్ట దేవి రణాంగణ | అద్యాహం త్వాం హనిష్యామి రూప¸°వనభూషితామ్. 49 మూర్ఖా%సి మదమత్తా%ద్య యన్మయా సహ సంగరమ్ | కరోషి మోహితా%తీవ మృషా బలవతీ ఖరా. 50 హత్వా త్వాం నిహనిష్యామి దేవ న్కపట పండితాన్ | యే నారీం పురతః కృత్వా జేతు మిచ్ఛంతి మాం శఠాః. 51 దేవ్యువాచ : మా గర్వం కురు మందాత్మం స్తిష్ట తిష్ఠ రణాంగణ | కరిష్యామి నిరాతంకా న్హత్వా త్వాం సురసత్తమాన్. 52 పీత్వా%ద్య మాధవీ మిష్టాం శాతయామి రణ%ధమ | దేవానాం దుఃఖదం పాపం మునీనాం భయకారకమ్. 53 ఇత్యుక్త్వా చషకం హైమం గృహీత్వా సురయా యుతమ్ | పపౌపునః పునః క్రోధా ద్ధంతుకామా మహాసురమ్. 54 పీత్వా ద్రాక్షాసవం మిష్టం శూల మాదాయ సత్వరా | దుద్రావ దానవం దేవీ హర్షయ న్దేవతాగణాన్. 55 దేవా స్తాం తుష్టువు ప్రేవ్ణూ చక్రుః కుసుమవర్షణమ్ | జయ జీవేతి తే ప్రోచు ర్దుందుభీనాం చ నిః స్వనైః. 56 ఋషయః సిద్ధ గంధర్వాః పిశాచోరగచారణాః | కిన్నరాః ప్రేక్ష్య సంగ్రామం ముదితా గగనే స్థితాః. 57 దేవి సింహము గజము తలపై దుమికి గజరూప మహిషుని కఱకు గోళ్ళతో చీల్చివేసెను. వాడపుడు గజరూపము వీడి సింహమును చంపగల శరభాకృతి దాల్చెను. శరభముగని మదమర్ధినియగు దేవి రోషముతో ఖడ్గముగొని వాని తలపై వేయగ నదియు దేవిని తిరిగి కొట్టెను. అప్పటి వారిర్వురి పోరాట మతి భయంకరముగ నుండెను. వాడు మరల మహిష రూపము దాల్చి కొమ్ములతో పొడిచెను. వాడు భీకరముగ తోకనాడించుచు ప్రక్క ప్రక్కలు చూచుచు దేవిని కొమ్ములతో పొడిచెను. పిదప తన తోకతో గిరి శిఖరములు లాగి త్రిప్పుచు దేవిపై విసరి నవ్వుచు దేవి కిట్లనెను : దేవీ! ఈ రణరంగమున నీ పోరికచాలును. నేనిపుడు రూప¸°వన భూషితవగు నిన్ను చంపుదును. నీవు మూర్ఖురాలవు. మదమోహితవు విద్యాభిమానినివి. నా తోడనే పోరుచున్నావు. నేను మొదట నిన్ను చంపుదును. పిదప ముందుంచుకొని నన్ను చంపుటకు యత్నించుచున్న కపట పండితులగు దేవతలను చంపుదును అన దేవి యిట్లనెను : మందమతీ! గర్వింపకుమురా - రణమున నిలబడుమురా! నిన్ను చంపి దేవతలను నిర్భయులనుగ జేయుదును. నీచుడా! నేనిపుడు మధువుగ్రోలి నిన్ను రణమున గూల్తును. నీవు దేవతలకు దుఃఖమును మునులకు భయమును గల్గించువాడవు అని యిట్లు పలికి జగన్మాత బంగరు పాత్రలోని మధువు మాటి మాటికి గ్రోలి క్రోధముతో మహాసురుని చంపదలచెను. పిదప దేవి ద్రాక్షరసము గ్రోలి త్రిశూలముగొని దేవతలు సంతసింపగ దానవునిమీదకురికెను. సురలు ప్రేమ భక్తులతో హర్షించిరి. పూలజల్లులు కురిసిరి. జయజయ దేవమాతా! యనుచు దుందుభి ధ్వానములు జేయుచు జయఘోషలు పెట్టిరి. గగన తలమునుండి సిద్ధ గంధర్వ కిన్నరులును పిశాచచారుణులను ఋషులును పోరుగనుచు సంతసిల్లిరి. సో%పి నానావిధా న్దేహా న్కృత్వా కృత్వా పునః పునః | మాయామయాన్ జఘానాజౌ దేవీం కపట పండితః. 58 చండికా%పి చ తం పాపం త్రిశూలేన బల ద్ధృది | తాడయామాస తీక్షేన క్రోధా దరుణలోచనా. 59 తాడితో%సౌ పపాతోర్వ్యాం మూర్ఛామాప ముహూర్తకమ్ | పునరుత్థాయ చాముండాం పద్భ్యాం వేగా దతాడయత్. 60 వినిహత్య పదాఘాతై ర్జహాస చ ముహుర్ముహుః | రురావ దారుణం శబ్దం దేవానాం భయకారకమ్. 61 తతో దేవీ సహస్రారం సునాభం చక్ర ముత్తమమ్ | కరే కృత్వా జగదోచ్చైః సంస్థితం మహిషాసురమ్. 62 పశ్య చక్రం మదాంధాద్య తవ కంఠనికృంతనమ్ | క్షణమాత్రం స్థిరోభూత్వా యమలోకం వ్రజాధునా. 63 ఇత్యుక్త్వా దారుణం చక్రం ముమోచ జగదంబికా | శిర శ్ఛిన్నం రథాంగేన దానవస్య తదా రణ. 64 సుస్రావ రుధిరం చోష్ణం కంఠనాలా ద్గిరే ర్యథా | గైరికా ద్యరుణం ప్రౌఢం ప్రవాహ మివ నైర్ఝరమ్. 65 కంబంధ స్తస్య దైత్యస్య భ్రమన్వై పతితః క్షితౌ | జయశబ్ద శ్చ దేవానాం బభూవ సుఖవర్ధనః. 66 సింహ స్త్వతిబల సత్ర పలాయనాపర నథ | దానవా న్భక్షయామాస క్షుదార్త ఇవ సంగరే. 67 మృతే చ మహిషే క్రూరే దానవా భయపీడితాః | మృతశేషా శ్చ యే కేచి త్పాతాళం తే యయుర్నృప. 68 ఆనందం పరమం జగ్ముర్దేవా స్తస్మి న్నిపాతితే | మునయోమానవాశ్చైవ యే చాన్యే సాధవః క్షితౌ. 69 చండికా%పి రణం త్యక్త్వా శుభే దేశే%థ సంస్థితా | దేవా స్తత్రా%యయుః శీఘ్రం స్తోతుకామాః సుఖప్రదామ్. 70 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే మహిషా%సురవధో నామా%ష్టా దశో%ధ్యాయః. ఆ కపట పండితుడు పెక్కు తీరుల మాయ రూపులు దాల్చి తాల్చి దేవిని దెబ్బకొట్టెను. చండికయును క్రోధారుణ నేత్రములతో తీవ్రముగ త్రిశూలముతో బలముకొలది వాని ఱొమ్మున పొడిచెను. వాడు దెద్బతిని మూర్ఛిల్లెను. పిదప వెంటనే లేచి కాళ్ళతో దేవిని తన్నెను. దేవిని కాలిగిట్టలతో తన్ని వికటముగ నవ్వెను : ఆ భీకర ధ్వని విని సురలు వెఱగందిరి. అంత దేవి సునాభమను సహస్రార చక్రరాజము గ్రహించి ముందున్న మహిషునిగని పేరెలుంగున వాని కిట్లనెను : ఓరీ మదాంధా! క్షణమాగుము. ఇపుడే యీ చక్రము నీ కుత్తుక కత్తిరించగలదు. నీవు యమపురి కేగగలవు. అని పలికి దేవి చక్రము విసరెను. దానవుని తల వెంటనే తెగిపడెను. పర్వతము నుండి వేడి నెత్తురు పారెను. వాని మొండె మటునిటు నెగురుచు నేలపై బడెను. మింట నిఃల సురులు జయజయ నినాదములు లోకములకు సుఖమును వర్ధిల్లచేయుచు విజృంభించెను. తక్కిన దానవులు పరుగిడ సాగిరి. సింహ మాకలిగొన్నదానివలె వారి వెంటబడి వారిని తన పొట్టబెట్టుకొనెను. అట్లు క్రూర మహిషుడు చావగనే మిగిలిన దానవులెల్లరును భీతిల్లి పాతాళమునకు పారిపోయిరి. వాని చావువార్తవిని భూమిపైగల మునులు సాధుజనులు పరమానంద భరితులైరి. అపుడు శ్రీదేవి చండిక రణస్థలము వదలి యొక పవిత్ర ప్రదేశమునందు విరాజిల్లెను. దేవత లెల్లరును సుఖప్రదాయినియగు శ్రీదేవిని సంస్తుతింప వేగ దేవి సన్నిధి కరిగిరి. ఇది శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధ మందు శ్రీదేవ మహిషాసురుని సంహరించుటయను పదునెనిమిదవ యధ్యాయము.