Sri Devi Bhagavatam-1
Chapters
అథ ఏకోనవింశో%ధ్యాయః అథ ప్రముదితాః సర్వే దేవా ఇంద్రపురోగమాః | మహిషం నిహతం దృష్ట్వా తుష్టువు ర్జగదంబికామ్.
1 బ్రహ్మ సృజత్యవతి విష్ణురిదం మహేశః | శక్త్యా తవైవ హరతే నను చాంత కాలే | ఈశా న తే%పి చ భవంతితయా విహీనా స్తస్యా త్త్వమేవ జగతః స్తితినాశకర్త్రీ.
2 కీర్తి ర్మతిః స్మృతిగతీ కరుణా దయా త్వం | శ్రద్ధా ధృతిశ్చ వసుధా కమలా జపా చ | పుష్టిః కళా%థ విజయా గిరిజా జయా త్వం తుష్టిః ప్రమా త్వమసి బుద్ధి రుమారమాచ.
3 విద్యా క్షమా జగతి కాంతి రహీనమేధా సర్వం త్వమేవ విదితా భువనత్రయే%స్మిన్ | ఆభిర్వానా తవతు శక్తిభిరాశు కర్తుం కో వాక్షమః సకలలోక నివాసభూమే. 4 త్వం ధారణా నను న చేదసి కూర్మనాగౌ ధర్తుం క్షమౌకథ మిలామపి తౌ భ##వేతామ్ | పృథ్వీ న చేత్త్వమసి వా గగనే కథం స్థాస్యత్యేత దంబ నిఃలం బహుభారయుక్తమ్. 5 యే వా స్తువంతి మనుజా అమరా న్విమూఢా మాయాగుణౖస్తవ చతుర్ముఖ విష్ణురుద్రాన్ | శుభ్రాంశువహ్ని యమవాయు గణశముఖ్యా న్కింత్వామృతే జనని! తే ప్రభవంతి కార్యే. 6 యే జుహ్వతి ప్రవితతే%ల్పధియో%ంబ యజ్ఞవహ్నౌ సురాన్ సమధికృత్య హవిః సమృద్ధమ్ | స్వాహా నచేత్త్వమసి తే కథ మాపురద్ధా త్వా మేవ కిం నహియజంతి తతోహి మూఢాః. 7 భోగప్రదా%సి భవతీహ చరాచరాణాం స్వాం శైర్దదాసి ఖలు జీవన మేవ నిత్యమ్ | స్వీయా న్సురాన్ జనని పోషయసీహ యద్వత్తద్వత్పరానపి చ పాలయసీతి హేతోః. 8 మాతః స్వయం విరచితా న్విపినే వినోదా ద్వంధ్వా న్పలాశ రహితాం శ్చ కటూంశ్చ వృక్షాన్ | నోచ్ఛేదయంతి పురుషా నిపుణాః కథంచి త్తస్మాత్త్వమ ప్యతితరాం పరిపాసి దైత్యాన్. 9 యత్త్వంతు హంసి రణమూర్ధ్ని శ##రైరరాతీ న్దేవాంగనాసురతికేళిమతీ న్విదిత్వా | దేహాంతరే%పి కరుణారసమాదదానా తత్తే చరిత్ర మిద మీప్సితపూరణాయ. 10 చిత్రం త్వమీ యదసుభీ రహితా న సంతి త్వచ్చింతితేనదనుజాః ప్రధిత ప్రభవాః యేషాం కృతే జనని దేహ నిబంధనం తే క్రీడా రస స్తవ న చాన్యతరో%త్ర హేతుః. 11 ప్రాప్తే కలా వహహ దుష్టతరే చ కాలే నత్వాం భజంతి మనుజా నను వంచితాస్తే | ధూర్తైః పురాణ చతురై ర్హరిశంకరాణాం సేవా పరాశ్చ విహితా స్తవ నిర్మితానామ్. 12 జ్ఞాత్వా సురాం స్తవ వశానసురార్దితాంశ్చ యేవైభజంతి భువి భావయుతా విభగ్నాన్ | ధృత్వా కరే సువిమలం ఖలు దీపకం తే కూపే పతంతి మనుజా విజలే%తిఘెరే. 13 విద్యా త్వమేవ సుఖదా%సుఖదా ప్యవిద్యా మాతస్త్వమేవ జననార్తి హరా నరాణామ్ మోక్షార్థిభి స్తు కలితా కిల మంద ధీభి ర్నారాధితా జనని భోగపరై స్తథా%జ్ఞైః. 14 పందొమ్మిదవ యధ్యాయము దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట అట్లు మహిషాసురుడు నిహతుడైన పిదప నింద్రాది దేవతలు పరమానందమంది జగదంబిక నీవిధముగ ప్రస్తుతింప గడంగిరి : భగవతీ ! దేవీ ! నీ దివ్య శక్తి ప్రభావముననే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకార్యము లొనరింపగల్గుచున్నారు. కాని, నీ శక్తి తోడులేనిచో వారా యా పనులు చేయజాలరు. కనుక వాస్తవముగా సృష్టి-స్థితి-సంహారకారిణిని నీవే. శ్రీమాతా! నీవు సత్యముగ ధ్రువకీర్తివి-ధృతివి-మతివి-విశ్వగతివి; కరుణవు-దయవు-శ్రద్ధవు-వసుధవు; ఆజప గిరిజ కమల కల జయ యను పేరుగల దానవు; తుష్టి-పుష్టి-ప్రమ-బుద్ధి-ఉమ-రమ మున్నగు వారందఱు నీవే. ఈ భువన త్రయమందలి విద్యా-క్షమా-మేధాకాంతులు నీవే. సకల లోక నివాసభూమివి నీవే. ఈ నీ శక్తులు లేనివాడు లోకమందెందులకును కొఱగాడు. ఏమియు చేయనోపడు. విశ్వధారిణీ! నీవు ధారణాశక్తివి గానిచో శేషుడు భూమిని మోయునా? కూర్మము గిరిని భరించునా? అమ్మా! నిజమునకు నీవే భూమాతవు కానిచో మహాభారముగల భూమి నిరాధారముగ గగనతలము నందెట్లు నిలువగలదు? లోకజననీ! ఈ జనులు నీ మాయామోహితులై బ్రహ్మ విష్ణు రుద్ర చంద్రాగ్ని యమ వాయు గణపత్యాది దేవతలను సంస్తుతింతురు. ఆ దేవతలును నీచే శక్తి యుక్తులుగానిచో కార్యదక్షులగారుగదా! జగజ్జననీ! మూఢులు దేవతల నుద్దేశించి యజ్ఞాగ్నిలో హవిస్సు వేల్తురు. నీవు స్వాహా దేవివి గానిచో దేవతలా హుతము నెట్లు స్వీకరింపగలరు? జనులు నిన్ను వదలి యితరులను గొల్చుట వలన నిజముగ మూఢులేకదా మహేశ్వరీ! నీ నిజాంశముల వలన చరాచరప్రాణులకు వారివారి కర్మానుసారముగ భోగానుభవము లొసగుదువు. నీవు నీవారైన దేవతలను పోషించు విధమున పరులను సైతము పోషింతువు తల్లీ! మాతా! తోటలో వినోదమునకు నాటిన చెట్లు ఫలపుష్ప రసములు లేనివైనను పండితులు వానిని నఱికివేయరు. అట్లే నీవే దైత్యులను సైతము పాలింతువు. తల్లీ! నీ దయామృతరసమెంతని వర్ణింపగలము? నీవు నా బాణములతో దైత్యులను వధింతువు. ఏలన, వారును స్వర్గసీమలో సురాంగనలతో సురత క్రీడలనుభవించవలయునని నీవట్లు చేయుదువు. నీ పరమ చరితము భక్తుల కోర్కు లీడేర్చునది! అసురులు గొప్ప బలవంతులు. ఐనను వారు నీ సంకల్ప మాత్రమున నసువుల బాయుదురు. ఇది యాశ్చర్యకరము. నీవు దేహము దాల్చుట లీలా విలాసముగానే కాని మరే హేతువుచే గాదు. కలికాలమున పురాణ చతురులగువారు వంచకులు. వారి ప్రేరణవలన మూఢులు హరిశంకరులను సేవింతురేకాని నిన్ను భజింపరు. నరులకెంత దురవస్థ పట్టినది తల్లీ! లోకశరణ్యా! దేవతలు రాక్షసపీడితులు - అట్టి దేవతలు నీకు వశ్యులు - ఐనను నరులీలోకమున మూఢులై యా దేవతలనే భజింతురు. అయ్యో! చేతిలో నిర్మలదీప ముండినను వీరు నీరులేని చీకటి నూతిలో కూలుచున్నారే! జననీ! నీవు సుఖశాంతులొసగు సారవిద్యవు - ఘోర సంసార దుఃఖములు గల్గించునట్టి యవిద్యవు నీవే-నిన్నే నెఱనమ్మి యారాధించునట్టి ముముక్షుల యార్తి బాపు తల్లివి నీవే - అజ్ఞులు భోగలాలసులు మందమతులు నిన్ను సేవింప జాలరు. బ్రహ్మ హరశ్చ హరిరప్యనిశం శరణ్యం పాదాంబుజం తవ భజంతి సురా స్తథా%న్యే | తద్వై న యేల్పమతయో మనసా భజంతి భ్రాంతాః పతంతి సతతం భవసాగరే తే. 15 చండి త్వదంఘ్రి జలజోత్థరజః ప్రసాదై ర్భ్రహ్మా కరోతి సకలం భువనం భవదౌ | శౌరిశ్చపాతి ఖలు సంహరతే హరస్తు త్వాం సేవతే న మనుజ స్త్విహ దుర్భగో% సౌ. 16 వాగ్దేవతా త్వమసి దేవి సురాసురాణాం వక్తుం న తే%మరవరాః ప్రభవంతి శక్తా ! త్వం చేన్ముఖే వససి నైవ యదైవ తేషాం యస్మా ద్భవంతి మనుజా న హి తద్విహీనాః. 17 శప్తో హరిస్తు భృగుణా కుపితేన కామం మీనో బభూవ కమఠః ఖలు సూకర స్తు పశ్చా న్నృసింహఇతి యశ్ఛల కృద్ధరాయాం తా న్సేవతాం జనని మృత్యుభయం న కిం స్యాత్. 18 శంభోః పపాత భువి లింగమిదం ప్రసిద్ధం శాపేన తేన చ భృగో ర్విపినే గతస్య తం యే నరా భువి భజంతి కపాలినం తు తేషాం సుఖం కథ మిహాపి పరత్ర మాతః. 19 యో%భూ ద్గజానన గణాధిపతి ర్మహేశాత్తం యే భజంతి మనుజా వితథ ప్రసన్నాః. జానంతి తే న సకలార్థ ఫల ప్రదాత్రీం త్వాం దేవి విశ్వజననీం సుఖసేవనీయామ్. 20 చిత్రం త్వయా%రిజనతా%పి దయార్ద్రభావా ద్ధత్వా రణ శితశ##రైర్గమితా ద్యులోకమ్ | నో చే త్స్వ కర్మ నిచితే నిరయ నితాంతం దుఃఖాతి దుఃఖగతి మాపద మాపతే త్సా. 21 బ్రహ్మ హరిశ్చ హరిరప్యుత గర్వభావా జ్జానంతి తే%పి విబుధా న తవ ప్రభావమ్ | కే%న్యే భవంతి మనుజా విదితుం సమర్థాః సమ్మోహితాస్తవ గుణౖ రమిత ప్రభావైః. 22 క్లిశ్యంతి తే%పి మునయస్తవ దుర్విభావ్యం పాదాంబుజం న హి భజంతి విమూఢ చిత్తాః. సూర్యాగ్ని సేవనపరాః పరమార్థతత్వం జ్ఞాతం న తైః శ్రుతిశ##తై రపి వేదసారమ్. 23 మన్యేగుణాస్తవ భువి ప్రథిత ప్రభావాః కుర్వంతి యే హి విముఖా న్నను భక్తిభావాత్ | లోకాన్స్వబుద్ధి రచితైర్వివిధా%%గమైశ్చ విష్ణ్వీశభాస్కరగణశపరా న్విధాయ. 24 కుర్వంతి యే తవ పదా ద్విముఖా న్నరాగ్ర్యాన్స్వో క్తాగమై ర్హరిహరార్చన భక్తియోగైః | తేషాం న కుప్యసి దయాం కురు షే2ంబికే త్వం తాన్మోహమంత్ర నిపుణాన్ర్పథయస్యలంచ. 25 తుర్యే యుగే భవతి చా2తిబలం గుణస్యతుర్యస్య తే న మథితా న్యసదాగమాని | త్వాం గోపయంతి నిపుణాః కవయః కలౌ వై త్వత్కల్పితా న్సురగణానపి సంస్తువంతి. 26 ధ్యాయంతి ముక్తిఫలదాం భువి యోగసిద్ధాం విద్యాం పరాంచ మునయో%తి విశుద్ధసత్త్వాం | తే నాప్నువంతి జననీజఠరేతు దుఃఖం ధన్యా స్త ఏవ మనుజా స్త్వయి యే విలీనాః. 27 చిచ్ఛక్తి రస్తి పరమాత్మని తేన సో%పి వ్యక్తో జగత్సు విదితో భవకృత్య కర్తా. కో%న్యస్త్వయా విరహితః ప్రభవత్యముష్మి న్కర్తుం విమర్తుమపి సంచలితు స్వశక్త్వా. 28 తత్త్వాని చిద్విరహితాని జగద్దిధాతుం కిం వా క్షమాణి జగదంబ యతో జడాని | కించేంద్రియాణి గుణకర్మయుతాని సంతి దేవి త్వయా విరహితాని ఫలం ప్రదాతుమ్. 29 వరేణ్యము శరణ్యమునగు నీ పాదకమల యుగమును హరి హర బ్రహ్మాది దేవతలు సంతతము కొల్చు చుందురు. అల్పమతులగు భ్రాంతులు నిన్ను సేవింప నోపక సంసారసాగరమున గూలుదురు. చండికా! భవదీయ దివ్యచరణ కమల ప్రసాదముననే బ్రహ్మ-విష్ణు-మహేశులు-సృష్టి-పాలన-సంహార కార్యము లొనరింతురు. ఈ భూమిపై నిన్ను గొల్వనివారికి నోటమాట యెటుల వచ్చును? పరా వాగ్దేవీ! నీ దయలేనిచో మనుజులు సైతము మాటాడజాలరుగదా! జగదేకమాతా! భృగు మహర్షి కుపితుడై హరిని శపించెను. అందుచే హరి మీన-కూర్మ-వరాహ-నారసింహ-వామనాది రూపములు దాల్చెను. అట్టి పరాధీనుడగు వానిని గొల్చినవానికి మృత్యుభయమెట్లు పాయును? దయా కల్పవల్లీ! తల్లీ! తొల్లి శివుడు వనమునందు చరించు చుండగ భృగు మహర్షి శివుని శపించెను. అపుడు శివుని లింగము నేలపైపడెను. ఇది అందఱికిని దెలిసినదే కదా! అట్టి కపాలిని గొల్చినవారి కిటనట సుఖమెటుల గల్గును? అమ్మా! శివుని కొడుకు గణపతి. అతనిని గొల్చువారెంతటి భ్రాంతులనవలయును. వారు సకలార్థ ప్రదాయినివి సుఖసేవ నీయవు విశ్వజననివియగు నిన్నుఱుగ జాలరు గదమ్మా? అమ్మా! నీ శరములచే రాక్షసులు రణమున మరణింతురు. దయగల నీ యమృతపు చూడ్కులు వారిని సైతము స్వర్గమున కంపును గదా? కానిచో వారు తప్పక తమ కర్మాను సారముగ పాపగతియగు నరకమున గూలెడి వారే కదా! హరిహర బ్రహ్మలును గర్వమోహమున నీ మహోజ్జ్వల దివ్యప్రభావము నెఱుగజాలరు. ఇంక నీ గుణ ప్రభావములకు మాయామోహితులగు నరులు నిన్నెట్టులెఱుగ జాలుదురు? విశ్వమాతా! మహామునులు సైతము సూర్యాగ్నులను సేవించి మూఢ మతులగుదురు. నీ భవ్యపదపద్మములు వేదశతములకును దెలియరాని పరమార్థతత్త్వము వంటివి. అట్టి నీ పదపద్మములను మునులు సేవింపక కర్మక్లేశము లనుభవింతురు. శుభకారిణీ! జననీ! ఈ లోకములందు త్రిగుణమాయా మూలమున వివిధాగమముల మూలమున హరి-హర-రవి-గణపతుల యుపాసనలు వ్యాపించినవి. మూఢులు వీనిని గల్పించుకొని నీ విషయమున భక్తిభావమును విముఖులై యుందురు. ఓహో త్రిభువనేశ్వరీ! తల్లీ! జనులు విప్రులాగమ శాస్త్రములను తామే రచించుకొనిరి. వారు వానితో భక్తిభావముతో హరిహరుల నర్చింతురు. కాని, వారు మహామహిమగల నీ పదపద్మ సేవకు పెడమొగము పెట్టుదురు. ఐనను నీవు వారిని కోపింపక మోహకమంత్రశాస్త్ర నిపుణులుగ జేతువు. వారిపై నీ యపారదయామృతమును ప్రసరింపజేయుదువు. ప్రణతసౌభాగ్యదాయినీ! జననీ! తొల్లిటి సత్యయుగమునందు శుద్ధసత్త్వగుణము ప్రధానముగ నుండెను. ఆనాడు సచ్ఛాస్త్రములు కానివి లేవు. కాని, యీ కలియుగమున బుద్ధిచతురులగు కవులు-పండితులు నీ నిత్య సత్యోపాసనకు స్వస్తి చెప్పి, నీవు కల్పించిన సురగణములను పూజింతురు. అవిద్యను బాపు భార్గవీ! తల్లీ! నిర్మలసత్త్వగుణముగల మునులు పరావిద్య-దరిద్ర చింతామణి - చైతన్య మధుఝురి-ముక్తియోగఫలసిద్ధిద అగు నిన్నాత్మవిచారముతో ననుధ్యానించి తల్లీనులై గర్భనరకములో గూలరు. అట్టివార లెట్టి పుణ్యులు ధన్యులు మహాత్ములో కదా! మమ్మాదుకొను అభయవరదపదకమలా! అమ్మా! నీవు చిచ్ఛక్తి రూపమున నిర్గుణ పరమాత్మయందు వెలయుచుందువు. అందుచేతనే పరమాత్ముడు సృష్టిపాలన సంహారము లొనర్పగల్గునని తెలియుచున్నది. హృదయాంతరమున నీ స్పందనశక్తి లేనిచో ప్రాణికి శక్తి యెక్కడిది? నీ శక్తిలేని నరుడు తిరుగుటకును చలించుటకును పనిచేయుటకును జగమున నెట్లు సమర్థుడు కాగలడు? చైతన్య సుమమధూ! అంబా! చతుర్వింశతి తత్త్వములును జడతామయములు- చిచ్ఛక్తి రహితములు. అవి జగములను నిర్మింపజాలవు. ఇంద్రియములు గుణకర్మయుతములు. అవియును నీ శక్తితో గూడనిచో ఫలితము లొసగజాలవు. దేవా మఖేష్వపి హుతం మునిభిః స్వభాగం గృహ్ణీయు రంబ విధివ త్ప్రతిపాదితం కిమ్ | స్వాహా న చేత్త్వమసి తత్ర నిమిత్తభూతా తస్మాత్త్వ మేవ న తు పాలయసీవ విశ్వమ్. 30 సర్వం త్వయేద మఃలం విహితం భవాదౌ త్వం పాసి వై హరిహర ప్రముఖా న్దిగీశాన్ | కాలే%సి విశ్వమపి తే చరితం భవాద్యం జానంతి నైవ మనుజాః క్వ ను మందభాగ్యాః. 31 హత్వా%సురం మహిషరూపధరం మహోగ్రం మాత స్త్వయా సురగణః కిల రక్షితో%యమ్ | కాం తేస్తుతిం జనని మందధియో విదామో వేదా గతిం తవ యథార్థతయా న జగ్ముః. 32 కార్యం కృతం జగతి నో యదసౌ దురాత్మా వైరీహతో | భువనకంటక దుర్విభావ్యః | కీర్తిః కృతానను జగత్సు కృపా విధేయా%ప్యస్మాం శ్చ పాహి జనని ప్రథిత ప్రభావే. 33 ఏవం స్తుతా సురైర్దేవీ తానువాచ మృదుస్వరా | అస్యత్కార్యం చ దుఃసాధం బ్రువంతు సురసత్తమాః. 34 యదా యదా హి దేవానాం కార్యం స్యా దతి దురటమ్ | స్మర్త్యవ్యా%హం తదా శీఘ్రం నాశయిష్యామిచా%%పదమ్. 35 దేవా ఊచుః: సర్వం కృతం త్వయా దేవి కార్యం నః ఖలు సాంప్రతమ్ | య దయం నిహతః శత్రు రస్మాకం మహిషాసురః. 36 స్మరిష్యామో యథాతే%ంబ సదైవ పదపంకజమ్ | తథాకురు జగన్మాత ర్భక్తిం త్వయ్యప్యచంచలామ్, 37 అపరాధ సహస్రాణి మాతైవ సహతే సదా | ఇతి జ్ఞాత్వా జగద్యోనిం న భజంతే కుతో జనాః. 38 ద్వౌ సుపర్ణౌ తు దేహే%స్మిం స్తయోః సఖ్యం నిరంతరమ్ | నాన్యః సఖా తృతీయో%స్తి యో%పరాధం సహేత హి. 39 తస్మా జ్జీవః సఖాయం త్వాం హిత్వా కిం ను కరిష్యతి | పాపాత్మా మందభాగ్యో%సౌ సురమానుష యోనిషు. 40 ప్రాప్య దేహం సుదుష్ప్రాపం న స్మరేత్త్వాం నరాధమః | మనసా కర్మణా వాచా బ్రూమః సత్యం పునః పునః 41 సుఖే వా%ప్యథవా దుఃఖే త్వం నః శరణ మద్భుతమ్ | పాహి నః సతతం దేవి సర్వై స్తవ వరాయుధైః. 42 అన్యథా శరణం నాస్తి త్వత్పదాంబుజరేణుతః | ఏవం స్తుతా సురై ర్దేవీ తత్రైవాంతరధీయత. 43 విస్మయం పరమం జగ్ముర్దేవా స్తాం వీక్ష్య నిరత్గామ్. 44 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ఏకోనవింశోధ్యాయః. అమ్మా! భవానీ! మునులు విధిప్రకారమున యజ్ఞములందు హోమము చేయుదురు. నీవు యజ్ఞములందు స్వాహాదేవివై నిమిత్తమాత్రముగ నుందువు. కానిచో దేవతలు హవిర్భాగములు గ్రహింపజాలరు. కనుక తల్లీ! ఈ విశ్వమున కేడుగడ నీవే అమ్మా, మాతా! తొలిసృష్టి రచన తొలుదొల్త నీవలననే జరిగినది. నీవు హరిహరాదులను దిక్పతులను పరిపాలింతువు. నీవంతకాలమున విశ్వమంతటిని సంహరింతువు. కనుక నీ సచ్చరిత్ర దేవతలకే యెఱుగరానిది. ఇక మందభాగ్యులగు నరు లెట్లెఱుగగలరు? బ్రహ్మ గ్రంథి విచ్ఛేదినీ! శివమహిషీ! మహిషరూపము దాల్చిన మహోగ్ర రాక్షసు నంతమొందించి దేవతలను బ్రోచితివి. నీ తత్త్వమును వేదములు సైత మెఱుగజాలవు. మందమతులమగు మేమెట్లు నిన్ను నుతింపగలము? ఓ మహిషాసురమర్దినీ! అహంమమతానాశినీ! భువనకంటకుడు దుర్దముడు దుష్టుడు నగు రాక్షసుని సంహరించి మాకు శుభము గూర్చితివి. నీ చల్లని కీర్తిచంద్రికలు జగము లెల్ల నిండినవి. కాన తల్లీ! మమ్మనుగ్రహించి సతతము కాపాడగదవమ్మా! అని విబుధులు సన్నుతింపగ శ్రీదేవి సంతసించి వారికి మృదుమధుర స్వరమున నిట్లనియెను : సురలారా! మీ కింకను సాధ్యముగాని పని యున్నచో దెలుపుడు. మీ కసాధ్యమైన కార్య మెప్పుడెపుడు సంభవించునో యప్పుడపుడు నన్ను స్మరింపుడు. తలచినంతనే నేను మిమ్మాదుకొందును. మీ యాపదలు తొలగింతును'' అన దేవత లిట్లనిరి: దేవీ! అఃల దేవతాత్మా! మా శత్రువగు మహిషాసురుని సంహరించితివి. మమ్ముద్ధరించితివి. మా కార్యము నెరవేర్చితివి. అమ్మా! అభయ వరము లొసగు నీ పదపద్మములను మేము నిరంతరము సంస్మరించునట్లును మాకు నీయందు నిశ్చలైకాంతికభక్తి గల్గునట్లు ననుగ్రహింపుము. అమ్మా! నీవమ్మవలె మా యపరాధము లన్నియు సైతువని జనులకు తెలియును. ఐనను ఆరు జగత్కారణవగు నిన్ను భజింపరు. ఈ శరీరమునందు రెండు పక్షులు స్నేహముతో నివసించుచున్నవి. అపరాధములు సైచు మూడవ మిత్రు డెవడును లేడు. ఆ రెంటిలో జీవు డొక పక్షి. అతడు నిన్ను వదలినచో నతనికి గతులు లేవు. అట్టివాడు దేవమనుజులందు మహాపాపి-మందభాగ్యుడు. ఈ మనుజ జన్మము కడు దుర్లభ##మైనది. ఇట్టి యుత్తమజన్మ బడసియును మనోవాక్కాయ కర్మలతో నిన్ను స్మరింపనివాడు నిజముగ నరాధముడని మేము పలుమారులు నొక్కి పలుకుచున్నాము. కావున తల్లీ! లోకశరణ్యా! మా సుఖదుఃఖములందు మాకు నీవే శరణ్యము. దేవీ! నీ సర్వాయుధములతో మమ్ము సర్వకాలము బ్రోచుచుండుము తల్లీ! నీ పదపద్మరజము గాక మాకు మఱి శరణము లేదమ్మా!'' అని యీ ప్రకారముగ స్తుతింపబడి శ్రీదేవి యచ్చట నదృశ్యురాలయ్యెను. అట్లు దేవి యంతర్ధానమందుట గని దేవత లెల్లరును పరమ విస్మయమందిరి. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు దేవతలు శ్రీదేవిని సంస్తుతించుటయను పందొమ్మిదవ యధ్యాయము.