Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

శృణు రా న్ప్రవక్ష్యామి దేవ్యా శ్చరిత ముత్తమమ్‌ | సుఖదం సర్వజంతూనాం సర్వపాపప్రణాశనమ్‌. 1

యథా శుంభో నిశుంభ శ్చ భ్రాతరౌ | బభూవతు ర్మహావీరా వవధ్యౌ పురుషైః కిల. 2

బహు సేనావృతౌ శూరౌ దేవానాం దుఃఖదౌ సదా | దురాచారౌ మదోత్సిక్తౌ బహుదానవ సంయుతౌ. 3

హతా వంబికయా తౌ తు సంగ్రామే%తీవ దారుణ | దేవానాం చ హితార్థాయ సర్వైః సహ. 4

చండముండౌ మహాబాహూ రక్తబీజో%తి దారుణః | ధూమ్రలోచన నామాచ నిహతా స్తే రణాంగణ. 5

తా న్నిహత్య సురాణాం సా జహార భయ ముత్తమమ్‌ | స్తుతా సంపూజితా దేవై ర్గిరౌ హేమాచలే శుభే. 6

రాజోవాచ : కాచేతా వసురాదాదౌ కథం తౌ బలినాం వరౌ | కేన సంస్థాపితౌ చేహ స్త్రీవధ్యత్వం కుతో గతౌ. 7

తపసా వరదానేన కస్య జాతౌ మహాబలౌ | కథం చ నిహతౌ సర్వం కథయస్వ సవిస్తరమ్‌. 8

వ్యాస ఉవాచ : శృణు రాజ న్కథాం దివ్యాం సర్వపాపప్రణాశినీమ్‌ | దేవ్యా శ్చరిత సంయుక్తాం సర్వార్థ ఫలదా శుభమ్‌. 9

పురా శుంభ నిశుంభౌ ద్వావసురౌ భూమిమండలే | పాతాళతశ్చ సంప్రాప్తౌ భ్రాతరౌ శుభదర్శనౌ. 10

తౌ ప్రాప్త ¸°వనౌ చైవ చేరతు స్తప ఉత్తమమ్‌ | అన్నోదకం పరిత్యజ్య పుష్కరే లోకపావనే. 11

వర్షాణా మయుతం యావ ద్యోగవిద్యాపరాయణౌ | ఏకత్రై వాసనం కృత్వాతేపేతే| పరమంతపః. 12

ఇరువది యొకటవ యధ్యాయము

శుంభనిశుంభుల వరగర్వము

రాజా ! ఆ సర్వేశ్వరీ దేవి పావన చరితము సకల జంతు పాపహరణము. దానిని వినిపింతును. సావధానముగ నాలింపుము పూర్వము శుంభనిశుంభులను సోదరులు దానవవీరులు. పురుషులచే చంపబడనివారు మదోన్మత్తులు దురాచారపరులు. వారు దానవసేనలను గూడి దేవతలను బాధించుచుండిరి. అపుడాదిశక్తియగు జగన్మాత దేవతల శ్రేయోభివృద్ధికై ఘోరసంగ్రామమందు దానవ వీరులను దెగటార్చెను. ఆ సంగ్రామ రంగమందు మహావీరులగు చండముండులును రక్త బీజ ధూమ్రలోచనలును మడిసిరి. ఇట్లు లోకానుగ్రహకారిణియగు దేవి రాక్షసులజంపి సురలభయము తొలగించెను. దేవతలు మేరుగిరిపై శివప్రియను బూజించి సన్నుతించిరి అనిన వ్యాసభగవానునితో జనమేజయ మహారా జిట్లనెను : ఆ దానవ వీరు లెవరు? వారెట్లు మహాబలశాలురైరి వారి నెవరు నిలిపిరి? వారు స్త్రీ చేతిలో చచ్చుటకు కారణమేమి? విపులముగ నంతయును దెలుపుము. వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీ పరదేవతా చరిత్రము సర్వపాపహరము సర్వార్థ ఫలప్రదము మంగళకరము. దానిని వినుము. మునుపు శుంభనిశుంభులను దానవులు పాతాళమునుండి భూమిపైకి వచ్చిరి. వారు నిండు పరువములోనుండి పావన పుష్కర తీర్థమందు నీరాహారములు మాని యోగవిద్యా నిపుణులై యొకేయాసనమందు వేలేండ్లు ఘోర తపమొనరించిరి.

తయో స్తు ష్టో%భవ ద్ర్బహ్మా సర్వలోకపితామహః | తత్రా%గత శ్చ భగవా నారుహ్య వరటాపతిమ్‌. 13

తా వుభౌ చ జగత్ర్ప ష్టా దృష్ట్వా ధ్యానపరౌ స్థితౌ | ఉత్తిష్ఠతం మహాభాగౌ తుష్టో%హం తపసా కిల. 14

వాంఛితం వాం వరం కామం దదామి బ్రువతా మిహ | కామందో%హం సమాయాతో దృష్ట్వా వాం తపసోబలమ్‌. 15

ఇతి శ్రుత్వా వచ స్తస్య ప్రబుద్ధౌ తౌ సమాహితౌ | ప్రదక్షిణక్రియాం కృత్వా ప్రణామం చక్రతు స్తదా. 16

దండవత్ర్పణిపాతం చ కృత్వా తౌ దుర్బలాకృతీ | ఊచతు ర్మధురాం వాచం దీనౌ గద్గదయా గిరా. 17

దేవదేవ దయాసింధో భక్తానా మభయప్రద | అమరత్వం చ నౌ బ్రహ్మ న్దేహి తుష్టో%సి చే ద్విభో. 18

మరణా దపరం కించి ద్భయం నాస్తి ధరాతలే | తస్మా ద్భయా చ్చ సంత్రస్తౌ యుష్మాకం శరణం గతౌ. 19

త్రాహి త్వం దేవదేవేశ జగత్కర్తః క్షమానిధే | పరస్ఫోటయ విశ్వాత్మ న్సద్యో మరణజం భయమ్‌. 20

బ్రహ్మా: కిమిదం ప్రార్థనీయం వో విపరీతం తు సర్వథా | అదేయం సర్వథా సర్వైః సర్వేభ్యో భువనత్రయే. 21

జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ | మర్యాదా విహితా లోకే పూర్వం విశ్వకృతా కిల. 22

మర్తవ్యం సర్వథా సర్వైః ప్రాణిభి ర్నాత్ర సంశయః | అన్యం ప్రార్థయతం కామం దదామి యచ్చ వాంఛితమ్‌. 23

తదాకర్ణ్య వచస్తస్య సువిమృశ్యచ దానవౌ | ఊచతుః ప్రణిపత్యాథ బ్రహ్మాణం పురతః స్థితమ్‌. 24

వారి తపమునకు సంతసించి లోకపితామహుడగు బ్రహ్మ హంసవాహనమెక్కి యచ్చటి కేతెంచి ధ్యానరతులైన దానవులనుగని యిట్లనెను : లెండు, మీ తపమునకు సంతసించితిని. మీ తపో మహిమగాంచి వచ్చితిని. కోరుకొనుడు. మీ వాంఛితము లీడేర్తును. వరము లిత్తును. బ్రహ్మవాక్కులు విని వారు ధ్యానము వదలి లేచి బ్రహ్మకు ప్రదక్షిణ నమస్కారములొనర్చిరి. తనువులు కృశించియున్న ఆ ఇరువురు దండ ప్రణామమొనర్చి గద్గదమధుర వాక్కులతో బ్రహ్మకిట్లనిరి. 'దేవ దేవా! దయాసాగరా! అభయ దాయకా! నీకు మాపట్ల సంతోషము గల్గినచో మా కమరత్వము ప్రసాదింపుము. ఈ భూమిపై చావును మించిన భయములేదు. మేము మరణ భీతితో నిన్ను శరణు వేడితిమి. దేవేదా! జగత్కర్తా! క్షమానిలయా! విశ్వాత్మా! మా మరణ భయము బాపి మమ్ము గాపాడుము' అన బ్రహ్మ యిట్లనెను. 'మీరు కోరునదిదియా? ఇది విపరీతమైనది. ఇట్టి వరమీలోకములందింతవరకెవ్వడు నెవ్వనికి నీయలేదే! పుట్టినవాడు గిట్టుట-గిట్టినవాడు పుట్టుట అను పద్ధతిని విశ్వకర్త యీ లోకములందు సృష్టికిమున్నే యేర్పరచెను. ప్రాణులెల్లవిధముల తప్పక చావవలసినదే. కనుక వేరొకటి కోరుకొనుడు-ఇచ్చెదను.' దానవులు బ్రహ్మ వాక్కులు విని చక్క నాలోచించుకొని తమముందున్న బ్రహ్మకు ప్రణమిల్లి యిట్లనిరి :

పురుషై రమరాద్యైశ్చ మానవై ర్మృగ పక్షిభిః | అవధ్యత్వం కృపాసింధో దేహి నౌ వాంచితం వరమ్‌. 25

నారీ బలవతీ కా%స్తి యా నో నాశం కరిష్యతి | న బిభీవః స్త్రియ కామం త్రైలోక్యే సచరాచరే. 26

అవధ్యౌ భ్రాతరౌ స్యాతాం నరేభ్యః పంకజోద్భవ | భయం న స్త్రీజనేభ్య శ్చ స్వభావా దబలా హి సా. 27

ఇతి శ్రుత్వా తయోర్వాక్యం ప్రదదౌ వాంఛితం వరమ్‌ | బ్రహ్మ ప్రసన్న మనసా జగామాథ స్వమాలయమ్‌. 28

గతే%థ భవనే తస్మి న్దానవౌ స్వగృహం గతౌ | భృగుం పురోహితం కృత్వా చక్రతుః పూజనం తదా. 29

శుభే దినే సునక్షత్రే జాతరూపమయం శుభమ్‌ | కృత్వా సింహాసనం దివ్యం రాజ్యార్థం ప్రదదౌ మునిః. 30

శుంభాయ జ్యేష్ఠభూతాయ దదౌ రాజ్యాసనం శుభమ్‌ | సేవనార్థం తదైవాశు సంప్రాప్తా దానవోత్తమాః. 31

చండముండౌ మహావీరా భ్రాతరౌ బలదర్పితౌ | సంప్రాప్తౌ సైన్యసంయుక్తౌ రథవాజిగజాన్వితౌ. 32

ధూమ్రలోచన నామా చ తద్రూప శ్చండ విక్రమః | శుంభం చ భూపతిం శ్రుత్వా తదా%గాద్బల సంయుతః. 33

రక్తబీజ స్తథా శూరో వరదానబలాధికః | అక్షౌహిణీభ్యాం సంయుక్త స్తత్రెవాగత్య సంగతః. 34

తసై#్యకం కారణం రాజ న్సంగ్రామే యుధ్యతః సదా | దేహా ద్రుధిర సంపాత స్తస్య శస్త్రాహతస్య చ. 35

జాయతే చ యదా భూమా పుత్పద్యంతే హ్యనేకశః | తాదృశాః పురుషాః క్రూరా బహవః శస్త్రపాణయః. 36

సంభవంతి తదాకారా స్తద్రూపా స్తతప్రరాక్రమాః | యుద్ధం పునస్తే కుర్వంతి పురుషా రక్త సంభవాః. 37

అతః సో%పి మహావీర్యః సంగ్రామే%తీవ దుర్జయః | అవధ్యః సర్వభూతానాం రక్తబీజో మహాసురః. 38

దయామయా! మాకు నర-పశు-పక్షులవలన చావులేని వరమిమ్ము - అదిచాలును. ఇంక స్త్రీలలో మమ్ము చంపగల బలవతియగు యువతి యెవతె యుండును? ఈ చరాచర ప్రపంచమున మేమొక స్త్రీకి జంకము. కునుక ఓ విధీ! మేమిర్వురము నరుల కవధ్యముగనట్లు వరమిమ్ము. స్త్రీలు సహజముగ నబలలు; వారివలన మా కెట్టి భయమును లేనేలేదు. వారి యీ కోర్కి విని బ్రహ్మ వారికోర్కి దీర్చి సంతోషముతో నిజాలయమున కరిగెను. బ్రహ్మ వెళ్ళిన పిదప దానవులును తమ తమ యిండ్లకేగి శుక్రుని పురోహితునిగ నేర్పరచుకొని యతనిని పూజింపసాగిరి. శుక్రుడొక శుభదినమున శుభనక్షత్రమున నొక బంగరు సింహాసమును నేర్పరచి దానిని రాజనకొసంగెను. శుంభుడు జ్యేష్ఠుడు కనుక రాజసింహాసన మతని కీయబడెను. ఇతర దానవులందఱు నతనిని కొలువ నేతెంచిరి. వారిలో చండ ముండులను వీర సోదరులు గలరు. వారు బలగర్వితులు. వారు తమ రథగజ సేనలతో వచ్చి చేరిరి. శుంభుడు రాజగుట విని చండవిక్రముడగు ధూమ్రలోచనుడనువాడు తాను తన బలముతో వచ్చి చేరెను. అంతలో వరబలముగల రక్తబీజుడనువాడును తన రెండక్షౌహిణుల సేనలతో వచ్చి చేరెను. అత డజేయుడగుట కొక కారణము గలదు. అతడు పోరుచుండగ శత్రులయాయుధపు దెబ్బచే నతని నెత్తుటిబొట్లు నేలపడును. అపు డతని ప్రతి నెత్తుటి బొట్టు నుండి యతనివంటి క్రూరులు శస్త్రపాణులు లెక్కకు మిక్కిలిగ బుట్టుచుందురు. అట్లు నెత్తుట బుట్టిన వీరు లతనివంటి పరాక్రమములగల్గి వారును తిరిగి యుద్ధ మొనర్చుచుందురు. రక్త బీజ మహాసురుడందువలన నజేయుడు. మహావీరుడు. యుద్ధమున సకల భూతముల కవధ్యుడు.

అన్యే చ బహువః శురా శ్చతురంగ సమన్వితాః | శుంభం చ నృపతి మత్వా బభూవు స్తస్య సేవకాః. 39

అసంఖ్యాతా తదా జాతా సేనా శుంభనిశుంభయోః | పృథివ్యాః సకలం రాజ్యం గృహీతం బలవత్తయా. 40

సేనాయోగం తదా కృత్వా నిశుంభః పరవీరహా | జగామ తరసా స్వర్గే శచీపతి జయాయ చ. 41

చకారా%సౌ మహాయుద్ధం లోకపాలైః సమం తతః | వృత్రహా వజ్రపాతేన తాడయామాస వక్షసి. 42

స వజ్రాభిహతో భూమౌ పపాత దానవానుజః | భగ్నం బలం తదా తస్య నిశుంభస్య మహాత్మనః. 43

భ్రాతరం మూర్ఛితం శ్రుత్వా శుంభః పరబలార్దనః | తత్రాగత్య సురాన్సర్వాం స్తాడమామాస సాయకైః. 44

కృతం యుద్ధం మహత్తేన శుంభేనాక్లిష్ట కర్మణా | నిర్జితా స్తు సురాః సర్వే సేంద్రా పాలాశ్చ సర్వశః. 45

ఐంద్రం పదం తదా తేన గృహీతం బలవత్తయా | కల్పపాదప సంయుక్తం కామధేను సమన్వితమ్‌. 46

త్రైలోక్యం యజ్ఞభాతా శ్చ హృతా స్తేన మహాత్మనా | నందనం చ వనం ప్రాప్య ముదితో%భూ న్మహాసురః. 47

సుధాయా శ్చైవ పానేన సుఖమాప మహాసురః | కుబేరం స చ నిర్జిత్య తస్య రాజ్యం చకార హ. 48

అధికారం తథా భానోః శశిన శ్చ చకార హ | యమం చైవ వినిర్జిత్య జగ్రాహ తత్పదం తథా. 49

వరుణస్య తథా రాజ్యం చకార వహ్నికర్మ చ | వయోః కార్యం నిశుంభ శ్చ చకార స్వబలాన్వితః. 50

శుంభుడు రాజైన పిదప నిట్లు పెక్కురు వీరులు తమ సేనలతో వచ్చి శుంభుని భృత్యులుగ జేరిరి. ఇట్లు శుంభ నిశుంభుల సేన లపరిమితముగ నుండెను. వారు తమ బాహుబలముతో భూమిపై నున్న రాజ్యము లన్నిటిని వశము చేసికొనిరి. పిమ్మట నిశుంభుడు గొప్ప సేన కూర్చుకొని యింద్రునిపై దాడి చేయుటకు స్వర్గమునకు తరలెను. అతడు లోకపతులతో బోరుచుండగ నింద్రు వజ్రముతో నతని ఱొమ్ముపై గొట్టెను. ఆ వజ్రఘాతమును నిశుంభుడు నేలగూలెను. అతని సేన చెల్లాచెదరయ్యెను. తన సోదరుడు మూర్ఛిల్లుట విని శుంభుడు స్వర్గమేగి సురలపై బాణములు వదలెను. యుద్ధకుశలుడగు శుంభుడు పోరుచుండగ నింద్రాది దిక్పాలకులు దిక్కులు పట్టిరి. శుంభుడపుడింద్రాసనమును - కామధేనువును-కల్పతరువును బల్మితో గ్రహించెను. త్రైలోక్యరాజ్యమును - యాగభాగముల హరించి నందనవనముజేరి ప్రమోదమొందెను. సుధాపాన మొనర్చి సుఖము బడసెను. కుబేరు నోడించి యతని రాజ్యమును కైవసము చేసికొనెను. సూర్య-చంద్ర-యములను గెలిచి వారి పదవులు గ్రహించెను. వహ్ని-వరుణ-వాయువుల రాజ్యములను బలముతో చేపట్టి వారి పనులు తానే నిర్వహించుచుండెను.

తతో దేవా వినిర్ధూతా హృతరాజ్యా హృతశ్రియః | సంత్యజ్య నందనం సర్వే నిర్యయు ర్గిరి గహ్వరే. 51

హృతాధికార స్తే సర్వే బభ్రము ర్విజనే వనే | నిరాలంబా నిరాధార నిస్తేజస్కా నిరాయుధాః. 52

విచేరు రమరాః సర్వే పర్వతానాం గుహాసు చ | ఉద్యానేషు చ శూన్యేషు నదీనాం గహ్వరేషు చ. 53

న ప్రాపు స్తే సుఖం క్వా%పి స్థానభ్రష్టా విచేతసః | లోకపాలా మహారాజ దైవాధీనం సుఖం కిల. 54

బలవంతో మహాభాగా బహుజ్ఞా ధనసంయుతాః | కాలే దుఃఖం తథా దైన్య మాప్నువంతి నరాధిప. 55

చిత్ర మేత న్మహారాజ కాలసై#్యవ విచేష్టితమ్‌ | యః కరోతి నరం తావద్రాజానం భిక్షుకం తతః. 56

ధాతారం యాచకం చైవ బలవంతం తథాబలమ్‌ | పండితం వికలం కామం శూరం చా%తీవ కాతరమ్‌. 57

మఖానాం చ శతం కృత్వా ప్రాప్యేంద్రాసన ముత్తమమ్‌ | పునర్దుఃఖం పరం ప్రాప్తం కాలస్య గత రీదృశీ. 58

కాలః కరోతి ధర్మిష్ఠం పురుషం జ్ఞానసంయుతమ్‌ | తమేవా%తీవ పాపిష్ఠం జ్ఞానలేశవివర్జితమ్‌. 59

న విస్మయో%త్ర కర్తవ్యః సర్వథా కాలచేష్టితే | బ్రహ్మ విష్ణుహరాదీనా మపిదృ క్కష్ట చేష్టితమ్‌. 60

విష్ణు ర్జనన మప్నోతి సూకరాదిషు యోనిషు | హరః కపాలీ సంజాతః కాలేనైవ బలీయసా. 61

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే భగవతీ మాహాత్మ్యేఏకవింశో%ధ్యాయః.

రాజ్యసంపదలు గోల్పోయిన దేవతలు నందనవనము వదలి గిరిగుహలపాలైరి. వా రధికారములు గోల్పోవుట వలన నిస్తేజస్కులైరి. నిరాయుధులైరి. నిరాలంబులైరి. దిక్కుమ్రొక్కులేనివారై వనములవెంట గ్రుమ్మరిరి. వారెల్లరును కొండగుహలందు నదీవనములందు విజన ప్రదేశములందు దిరుగాడుచుండిరి. లోకపాలురు పదచ్యుతులైరి. వికలమనస్కులైరి. ఎచ్చటనైనను సుఖము జెందకుండిరి. సుఖము దైవాధీనము గదా! గొప్ప జ్ఞానము-బలము-ధనము గలవాడు సైతము తనకు కాలము కలిసి రానప్పుడు దుఃఖదైన్యము లనుభవించును. కాలగతి విచిత్రము. అది రాజును బిచ్చగానిగ మార్చును. దాతను యాచకునిగ బలశాలిని దుర్బలునిగ పండితుని వికలునిగ శూరుని పిఱికివానిగ నొనర్చును. ఇంద్రు డంతటివాడు నూఱు యాగము లొనర్చియు నింద్రాసనము బడసియు దుఃఖము లనుభవించెను. కాలగతి యిట్లే యుండును. కాలపాకము పామరుని జ్ఞానముగల ధర్మిష్ఠునిగ మార్చును. అదే కాలపాకము జ్ఞానములేని పాపిష్ఠునిగగూడ మార్చును. ఇట్టి కాలగతి కచ్చెరువంద బనిలేదు. ఏలయన హరిహరబ్రహ్మలకు సైత మిట్టి కడగండ్లు తప్పని వయ్యెను. విష్ణువు సూకరాది జన్మములెత్తెను. హరుడు నరుని పుర్రె చేత దాల్చెను. ఇది యంతయును కాలపరిపాక ప్రభావమే కదా!

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శుంభనిశుంభుల వరగర్వమను నిరువదియొకటవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters