Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రయోవింశో%ధ్యాయః ఏవం స్తుతా తదా దేవీ దైవతైః శత్రుతాపితైః | స్వశరీరా త్పరంరూపం ప్రాదుర్భూతం చకార హ.
1 పార్వత్యా స్తు శరీరా ద్వై నిః సృతా చాంబికా యదా | కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పఠ్యతే.
2 నిః సృతాయాం తు తస్యాం సా పార్వతీ తనువ్యత్యయాత్ | కృష్ణరూపా%థ సంజాతా కాళికా సా ప్రకీర్తితా.
3 మషీవర్ణా మహాఘోరా దైత్యానాం భయవర్ధినీ | కాళరాత్రీతి సా ప్రోక్తా సర్వకామఫలప్రదా.
4 అంబికాయాః పరం రూపం విరరాజ మనోహరమ్ | సర్వభూషణసంయుక్తం లావణ్యగుణసంయుతమ్.
5 తతో%ంబికా తదా దేవా నిత్యువాచ హ సస్మితా | తిష్ఠంతు నిర్భయా యూయం హరిష్యామి రిపూనిహ.
6 కార్యం వః సర్వథా కార్యం విహరిష్యా మ్యహం రణ | నిశుంభాదీ న్వధిష్యామి యుష్మాకం సుఖహేతవే.
7 ఇత్యుక్త్వా తదా దేవీ సింహారూఢా మదోత్కటా | కాళికాం పార్శ్వతః కృత్వా జగామ నగరే రిపోః.
8 సా గత్వోపవనే తస్థా వంబికా కాళికాన్వితా | జగావథ కలం తత్ర జగ న్మోహనమోహనమ్.
9 శ్రుత్వా తన్మధురం గానం మోహమేయుః ఖగా మృగాః | ముదం చ పరమాం ప్రాపు రమరా గగనే స్థితా. 10 తస్మిన్న వసరే తత్ర దానవౌ శుంభ##సేవకౌ | చండము డాభిధౌ ఘోరౌ రమమాణౌ యదృచ్ఛయా. 11 ఆగతౌ దదృశాతే తు తాం తదా దివ్యరూపిణీమ్ | అంబికాం గానసంయుక్తాం కాళికాం పురతః స్థితామ్. 12 దృష్ట్వా తాం దివ్యరూపాం చ దానవౌ విస్మయాన్వితౌ | జగ్మతు స్తరసా పార్శ్వం శుంభ స్య నృప సత్తమ. 13 తౌ గత్వా తుసమాసీనం దైత్యాహ మధిపం గృహే | ఊచతు ర్మధురాం వాణీం ప్రణమ్య శిరసా నృపమ్. 14 ఇరువది మూడవ యధ్యాయము సుగ్రీవుని రాయబారము ఈ ప్రకారముగ దేవతలు రాక్షస పీడితులైన శ్రీ పరాభట్టారికా దేవిని సంస్తుతించిరి. ఆ దేవి తన శరీరమునుండి యొకానొక దివ్యతేజోరూప ముద్భవింప జేసెను. ఆ మహోజ్జ్వల రూపము పార్వతీ శరీర కోశమునుండి వెలువడినది. అందుచే నామెకు కౌశికి యని యెల్లలోకములు పేరిడెను. అట్లు తన శరీరమునుండి కౌశికి యుద్భవించిన మీదట పార్వతి కృష్ణవర్ణము దాల్చి కాళికయను పేర ప్రసిద్ధి గాంచెను. కాళికాదేవి నీలవర్ణముతో ఘోర రూపముతో భీకరముగ నుండెను. ఆమె దనుజులకు భయము గొల్పుచు భక్తులకు కోర్కులు గురియుచు కాళరాత్రి యనుపేర ప్రఖ్యాతి గాంచెను. ఆ కాళికాంబా రూపము సకల లావణ్య పుంజమై సుమనోహరమై సకల భూషణములతో చెన్నొందెను. అపుడా భగవతీ దేవి దేవతలతో నిట్లనెను: మీరు భయపడవలదు. వగవవలదు. నేను పగతుర నిపుడే సంహరింపగలను. మీ కార్యము తప్పక నెరవేర్తును. మీ యోగక్షేమములకు రణమున దూకి శుంభనిశుంభుల నంతమొందింపగలను అని దేవతల కూరట గల్గించి దేవి యుద్ధమదోత్కటయై సింహవాహన మధిష్ఠించి కాళికతోడుగాగల జగదంబ యొక యుద్యానవనము జేరెను. ఆందామె జగదేక సుందరిగ వెల్గులు జిమ్ముచు కలకంఠముతో నమరగానము మధుర మోహనముగ సాగించెను. ఆ గాన మధుర రాగమాలకించి పశుపక్షులు సైతము పరవశతనందెను. దివి దేవతలు పరమహర్షము వెలిపుచ్చిరి. అంతలోనిట శుంభుని సేవకులు-చండ ముండులను ఘోర దానవులు తమ యిచ్చమెచ్చునట్లు గ్రుమ్మరు చుండిరి. వారు గానమొనరించు నంబికా దివ్య సుందర రూపము నాదేవి సన్నిధినున్న కాళికను సందర్శించిరి. ఆ దేవి యజ్ఞానము రూపుమాపు రవిప్రభవలె విరాజిల్లెను. వారామె రూపలావణ్యముల కచ్చెరువొంది వేగ శుంభునిచెంతకేగి దైత్యపతిముందు తలలువంచి దోసిలొగ్గి తీయని మాటల నిట్లనిరి: రాజ న్హిమాలయా త్కామం కామినీ కామమోహినీ | సంప్రాప్తా సింహమారూఢా సర్వలక్షణసంయుతా. 15 నేదృశీ దేవలోకే%స్తిన గంధర్వపురే తథా | న దృష్టా న శ్రుతా క్వా%పి పృథివ్యాం ప్రమదోత్తమా. 16 గానం చ తాదృశం రాజన్కరోతి జనరంజనమ్ | మృగా స్తిష్ఠంతి తత్పార్శ్వే మధుర స్వరమోహితాః. 17 జ్ఞాయతాం కస్య పుత్రీయం కిమర్థమిహ చాగతా | గృహ్యతాం రాజశార్దూల తవ యోగ్యా%స్తి కామినీ. 18 జ్ఞాత్వా%%నయ గృహే భార్యాం కురు కల్యాణలోచనామ్ | నిశ్చితం నాస్తి సంసారే నారీత్వేవం విధా కిల. 19 దేవానాం సర్వరత్నాని గృహీతాని త్వయా నృప | కస్మా న్నే మాం వరారోహాం ప్రగృహ్ణాసి నృపోత్తమ. 20 ఇంద్ర సై#్యరావతః శ్రీమా న్పారిజాత తరు స్తథా | గృహీతో%శ్వః సప్తముఖ స్త్వయా నృప బలాత్కిల. 21 విమానం వైధసం దివ్యం మరాళధ్వజ సంయుతమ్| త్వయా%%త్తం రత్నభూతం తద్బలేన నృప చాద్భుతమ్. 22 కుబేరస్య నిధిఃపద్మ స్త్వయారాజన్సమాహృతః | ఛత్రంజలపతేః శుభ్రం గృహీతం తత్త్వయా బలాత్. 23 పాశశ్చాపి నిశుంభేన భ్రాత్రాతవ నృపోత్తమ | గృహీతో%స్తి హఠాత్కామం వరుణస్య జితస్య చ. 24 అవ్లూనపంకజాంతుభ్యం మాలాం జలనిధిర్దదౌ | భయాత్తవ మహారాజ రత్నాని వివిధాని చ. 25 మృత్యోః శక్తిర్యమస్యాపి దండః పరమదారుణః | త్వయా జిత్వా హృతః కామం కిమన్య ద్వర్ణ్యతే నృప. 26 కామధేను ర్గృహీతా%ద్య వర్తతే సాగరోద్భవా | మేనకాద్యా వశే రాజం స్తవ తిష్ఠంతి చాప్సరాః. 27 ఏవం సర్వాణి రత్నాని త్వయా%%త్తాని బలాదపి | కస్మాన్న గృహ్యతేకాంతా రత్నమేషా వరాంగనా. 28 రాజా! ఒక దివ్యకామిని కామమోహినిగ నున్నది. ఆమె పవిత్ర హిమాచలమునుండి దిగివచ్చెను. ఆమె సర్వ శుభ లక్షణములతో వెలుగొందుచు సింహము నధిష్ఠించి యున్నది. మనమిట్టి స్త్రీ రత్నమును దేవ గంధర్వ లోకములలో నెచ్చటనేని కనివిని యెఱుగము. ఆమె మనోరంజని. ఆమె మధురగాన రవళులకు మోహించి మృగములు సైతమామె సన్నిధిలో ఱాపడి నిలుచుండెను. ఆమె యెవరికూతురో? ఏలవచ్చెనో? యెఱుగుము. నీ వామెను చేపట్టుము. ఆమె మీకన్ని విధముల తగినది. ఇట్టి నారీమణి యీ నారీలోకమునం దెచ్చటను లేదు. కావున నన్నియు నెఱిగి నీవీ సులోచనను భార్యగ స్వీకరింపుము. నీవు దేవరత్నములెల్ల గైకొంటివి కద! మఱి యీ స్త్రీ రత్నమునేల గ్రహింపవు? నీ వింద్రుని యైరావతమును ఏడు మొగాల యుచ్చైః శ్రవమును కల్పతరువును బల్మికొలది గ్రహించితివి. హంస ధ్వజముగల బ్రహ్మ విమానమును బలముతో నబ్బురముగదుర గైకొంటివి. కుబేరుని పద్మనిధిని వరుణుని వెల్లగొడుగును విక్రమముమెఱయ చేకొంటివి. వరుణుడోడిన పిదప నతని పాశమును నీ అన్నయగు నిశుంభుడు లాగుకొనెను. సాగరుడు నీకు జడిసి వాడని కమల మాలలు-నానావిధరత్నరాసు లొసంగెను. నీవు యమునిగెల్చి దారుణ మృత్యుపాశమును యమదండమును వశము చేసికొంటివి. ఇంకేమని చెప్పగలను? సాగరమునుండి యుద్భవించిన మేనక మున్నగు నచ్చరలును కామధేనువును నీ వశమందున్నవి గదా! ఇట్టి దివ్యరత్నములను నీవు విక్రమముతో హరించితివి. ఇపుడీకాంతారత్నము నేల గ్రహింపవు? సర్వాణితే గృహస్థాని రత్నాని విశదా న్య థ | అనయా సంభవిష్యంతి రత్నభూతానిభూపతే. 29 త్రిషులోకేషు దైత్యేంద్ర నేదృశీ వర్తతే ప్రియా | తస్మాత్తా మానయాశు త్వంకురుభార్యాం మనోహరామ్. 30 ఇతిశ్రుత్వాతయోర్వాక్యం మధురంమధురాక్షరమ్ | ప్రసన్నవదనః ప్రాహ సుగ్రీవం సన్నిధౌ స్థితమ్. 31 గచ్ఛ సుగ్రీవ దూతత్వం కురుకార్యం విచక్షణ | వక్తవ్యం చ తథా తత్ర యథా%భ్యేతి కృశోదరీ. 32 ఉపా¸° ద్వౌ ప్రయోక్తవ్యౌ కాంతాసు సువిచక్ష ణౖః సామదానే ఇతి ప్రాహుః శృంగారరసకోవిదాః. 33 భేదే ప్రయుజ్యమానే%పి రసాభాస స్తు జాయతే | నిగ్రహే రసభంగః స్యా త్తస్మా త్తౌ దూషితౌ బుధైః. 34 సామదానము ఖైర్వాక్యైః శ్లక్షైణర్నర్మయుతై స్తథా | కా న యాతి వశే దూత కామినీ కామపీడితా. 35 సుగ్రీవస్తు వచః శ్రుత్వా శుంభోక్తం సుప్రియం పటు | జగామ తరసా తత్ర యత్రాస్తే జగదంబికా. 36 సో%పశ్య త్సుముఖీం కాంతాం సింహ స్యోపరి సం స్థితామ్ | ప్రణమ్య మధురం వాక్య మువాచ జగదంబికామ్. 37 వరోరు త్రిదశారాతిః శుంభః సర్వాంగసుందరః | త్రైలోక్యాధిపతిః శూరః సర్వజిద్రాజతే నృపః. 38 తేనాహం ప్రేషితః కామం త్వత్సకాశం మహాత్మనా | త్వద్రూపశ్రవణాసక్త చిత్తేనాతివి దూయతా. 39 వచనం తస్య తన్వంగి శృణు ప్రేమ పురఃసరమ్ | ప్రణిపత్య యథా ప్రాహ దైత్యానామధిప స్త్వయి. 40 నీ యింటిలో ఈ రత్న మొక్కటి యున్నప్పుడే యితర రత్నరాసులు విశదములైన యథార్థ రత్నరాసులనబడును. దైత్యపతీ! ఈ ముజ్జగములందు నిట్టి లలన దుర్లభ కావున నీ వామెను తెచ్చుకొని నీ దానిగ జేసికొనుము అను చండ ముండుల తీయని మాటలు విని దైత్యరాజు ప్రసన్నుడై తన చెంతనున్న సుగ్రీవునితో నిట్లుపలికెను : సుగ్రీవా! నీవు నాకు దౌత్యము నెఱపుము. ఆ రమణి నన్ను జేరునట్టు లామెతో వ్యవహరింపుము. స్త్రీల యెడల సామ దానములను రెండుపాయములు ప్రయోగింప దగినవని రసజ్ఞులందురు. భేదమువలన రసాభాసము నిగ్రహమున రసభంగము గల్గును. కనుక నివి ప్రయోగింపదగనివని బుధులందురు. కామిని సామదానములతోడి నర్మ వాక్యములచే వశమగును అను శుంభుని తీపి పల్కులు విని సుగ్రీవు డంబికయున్నచోటి కేగెను. సింహ వాహనయగు జగదంబకు దోసిలొగ్గితీయగ నిట్లుపలికెను: సుందరీ! శుంభుడను రాజు సురారి - అందగాడు-శూరుడు త్రిలోకపతి - ఎల్లరిని గెల్చినవాడు. నీ యంద చందాలు విని సంతాపించు చిత్తముతో ఆ మహాత్ముడిపుడు నన్ను నీ చెంత కంపెను. ఆ దైత్యపతి నీకు ప్రణమిల్లి పల్కిన ప్రేమ వచనము లాలకింపుము. దేవా మయా జితాః సర్వేత్రైలోక్యాధిపతి స్త్వహమ్ | యజ్ఞభాగా నహం కాంతే గృహ్ణామీహ స్థితంః సదా. 41 హృతసారా కృతా నూనం ద్యౌర్మయా రత్న వర్జితా | యాని రత్నాని దేవానాం తాని చా%%హృతవా నహమ్. 42 భోక్తాహం సర్వరత్నానాం త్రిషులోకేషుభామిని | వశానుగాః సురాః సర్వే మమ దైత్యాశ్చ మానవాః. 43 త్వద్గుణౖః కర్ణమాగత్య ప్రవిశ్య హృదయాంతరమ్ | త్వదధీనః కృతః కామం కింకరో%స్మి కరోమికిమ్. 44 త్వ మా జ్ఞాపయ రంభోరు తత్కరోమి వశానుగః | దాసో%హం తవ చార్వంగి రక్షమాం కామబాణతః. 45 భజ మాం త్వం మరాళాక్షి తవాధీనం స్మరాకులమ్ | త్రైలోక్యస్వామినీ భూత్వా భుంక్ష్వ భోగా ననుత్తమాన్. 46 తవ చాజ్ఞాకరః కాంతే భవామి మరణావధి | అవధ్యో%స్మి వరారోహే సదేవా సురమానుషైః. 47 సదా సౌభాగ్యసంయుక్తా భవిష్యసి వరాననే | యత్రతే రమతే చిత్తం తత్ర క్రీడస్వ సుందరి. 48 ఇతి తస్యవచశ్చిత్తే విమృశ్య మదమంథరే | వక్తవ్యం యద్భవే త్ర్పేవ్ణూ తద్బ్రూహి మధురం వచః. 49 శుంభాయ చంచలాపాంగి తద్బ్రవీ మ్యహమాశువై | తద్దూతవచనం శ్రుత్వాస్మితం కృత్వాసుపేశలమ్. 50 తే ప్రాహ మధురాం వాచం దేవీ దేవార్థసాధికా | జానామ్యహం నిశుంభం చ శుంభం చాతిబలం నృపమ్. 51 జేతారం సర్వదేవానాం హంతారం చైవ విద్విషామ్ | రాశిం సర్వ గుణానాం చ భోక్తారం సర్వసంపదామ్. 52 దాతారం చాతి శూరం చ సుందరం మన్మథాకృతిమ్ | ద్వాత్రింశల్లక్షణౖర్యుక్త మవధ్యం సురమానుషైః. 53 కాంతా! నేను సురలను గెల్చితిని త్రిలోకపతినైతిని హవిర్భాగములు గొనుచున్నాను. దివ్య రత్నములెల్ల గ్రహించితిని. స్వర్గమును నిస్తేజముగ రత్నకాంతి హీనముగ జేసితిని. ఈ ముజ్జగము లందలి రత్నరాసులెల్ల నేనే యనుభవింతును. నర సురాసురులెల్లరును నా చెప్పు చేతల మెలగుదురు. నీ సుగుణ గణములు నా చెవుల నుండి యెడదలో ప్రవేశించినవి. నేను నీకు వశుడను నీ బానిసను. నన్నేమి చేయుమందువో చెప్పుము. తరుణీ! నేను నీ యధీనుడను; నీ దాసుడను; నన్నాజ్ఞాపింపుము. నన్ను మదనుని విరిములుకులనుండి కాపాడుము. వలరాజు వస్త్రముల సెగలు పొగలు నా గుండె నలముకొన్నవి నన్ను జేరుము త్రిలోకేశ్వరివై భోగమునెల్ల ననుభవింపుము. నారీమణీ! నాకు చావులేదు. నేను మనుజదేవాసురులకవధ్యుడను; అట్టి నేను నీ యాన తల దాల్తును. వరాననా! సౌభాగ్యవతివి కమ్ము. నీ యిచ్చవచ్చుచోట మనము సయ్యాటలాడవచ్చును దేవీ! అని యిట్లు పల్కిన శుంభుని పల్కులు నీ చిత్తమందాలోచించుకొని ప్రేమ మధురముగ బలుకుము. చంచలాక్షీ! నీ పల్కులు శుంభునకు నివేదింతును అను దూతవాక్కులాలించి దేవి చిర్నగవు నగి దేవ కార్యార్థమై తీయని వాక్కులతో నిట్లనెను: నేను శుంభ నిశుంభుల నెఱుగని దాననుగాను. అతడెల్ల దేవతలను గెల్చి వైరులను సంహరించెను. సుగుణములు గని, ఎల్ల సంపదలు భోగించుచున్నవాడు. దాత; శూరుడు; మదనసుందరుడు; ముప్పదిరెండు లక్షణములు గల వాడు; సురమనుజుల కవధ్యుడు. జ్ఞాత్వా సమాగతా%స్మ్యత్ర ద్రష్టు కామా మహాసురమ్ | రత్నం కనకమాయాతి స్వశోభాధికవృద్ధయే. 54 తత్రాహం స్వపతిం ద్రష్టుం దూరాదేవాగతాస్మి వై | దృషా మయా సురాః సర్వే మానవా భువి మానదాః. 55 గంధర్వా రాక్షసా శ్చాన్యే యేచాతి ప్రియదర్శనాః | సర్వే శుంభభయా ద్భీతా వేపమానా విచేతసః. 56 శ్రుత్వా శుంభగుణా నత్ర ప్రాప్తా2స్మద్య దిద్బక్షయా | గచ్ఛదూత మహాభాగ బ్రూహి శుంభం మహాబలమ్. 57 నిర్జనే శ్లక్షయా వాచా వచనం వచనా న్మమ | త్వాం జ్ఞాత్వా బలినాం శ్రేష్ఠం సుందరాణాంచ సుందరమ్. 58 దాతారం గుణినం శూరం సర్వవిద్యావిశారదమ్ | జేతారం సర్వదేవానాం దక్షం చోగ్రం కులోత్తరమ్. 59 భోక్తారం సర్వరత్నానాం హ్యధీనం స్వబలోన్నతమ్ | పతికామా%స్మ్యహం సత్యం తవ యోగ్యా నరాధిప. 60 స్వేచ్ఛయా నగరే తే%త్ర సమాయాతా మహామతే | మమాస్తి కారణం కించి ద్వివాహే రాక్షసోత్తమ. 61 బాలభావా ద్ర్వతం కించిత్కృతం రాజ న్మయా పురా | క్రీడంత్యా చ వయస్యాభిః సహైకాంతే యదృచ్ఛయా. 62 స్వదేహబలదర్పేణ సఖీనాం పురతో రహః | మత్సమానబలః శూరో రణ మాం జేష్యతి స్ఫుటమ్. 63 తం వరిష్యామ్యహం కామం జ్ఞాత్వా తస్య బలాబలమ్ | జహసు ర్వచనం శ్రుత్వా సఖ్యో విస్మితమానసాః. 64 కి మేతయా కృతం క్రూరం వ్రత మద్భుత మాశు వై | తస్మా త్త్వమపి రాజేంద్ర జ్ఞాత్వా మే హీదృశంబలమ్. 65 జిత్వా మాం స్వబలేనాత్ర వాంఛితం కురు చాత్మనః | త్వం వా తవా%నుజో భ్రాతా సమేత్య సమరాంగణ. 66 జిత్వా మాం సమరే ణాత్ర వివాహం కురు సుందర. 67 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే త్రయోవింశో%ధ్యాయః. ఇన్నిటి నెఱిగియే యా మహాసురుని చూచు వేడ్క నరుదెంచితిని. రత్నము తన కాంతి నినుమడింప జేయుటకది బంగారమును జేరునుగదా! అట్లే నా పతినిచూచి పోవుటకే నెంతయో దూరమునుండి వచ్చితిని. నేనెందఱనో నరులను గాంచితిని. సురలను జూచితిని. ప్రియ దర్శనులగు గంధర్వులను రాక్షసులను జూచితిని. వీరెల్లరును నేడు శుంభుని భయమున గడగడలాడుచు చేష్టలుడిగి యున్నారు. ఇట్టివాని గుణములు విని వానిని చూడవచ్చితిని. దూతా! నీవదృష్టవంతుడవు. నీవు మహాబలుడగు శుంభుని జేరుము. అతనితో నొంటరిగ తీయగ నా మాటగ నిట్లుపలుకుము: నీవు బలశాలురలో మహాబలివి. అందగాండ్రలో నందగాడవు. దాతవు గుణివి శూరుడవు విద్యావిశారదుడవు-నేర్పరివి-కులీనుడవు-మహోగ్రుడవు-సుర విజేతవు. నీవు నీ బలముతో నెల్ల రత్నములు స్వాధీనము చేసికొని యనుభవించు చున్నవాడవు. నేను నీకు దగిన దానను. నాకు పతిగావలయును. నేను స్వయముగ నీ పురికి వచ్చితిని. కాని, నా వివాహమునకు కొలదిగ నాటంకము గలదు. నేను నా బాల్యమున నా నెచ్చెలులతో నాడుకొనునాడు బాల్య చాపల్యమున ఆ నాడున్న బలగర్వమున-నాతో సమాన బలముగల శూరుడు నన్ను రణముగ గెల్వవలయును. అపుడు బలాబలము లెఱిగి నేనతనిని వరింపగలను అని వారి ముందేనొక ప్రతిన బూనితిని. దానికి నా చెలులు విస్తుపోయిరి. ఇంత క్రూరము నద్భుతమునగు నియమమీమె యేల పూనెనని నా చెలులు నన్ను నవ్విరి. కాన దైత్యపతీ! నీవు నా బల మెఱుగుము. నీ బలముతో నన్ను గెల్చి నా కోర్కి దీర్పుము. నీవుగాని నీ సోదరుడుగాని సమరాంగణమునకు రావచ్చును. నన్నోడించి నన్ను పెండ్లికమ్ము. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి పంచమ స్కంధమందు దేవి సన్నిధికి సుగ్రీవ రాయబారమను నిరువది మూడవ యధ్యాయము.