Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్వింశో%ధ్యాయః దేవ్యా స్తద్వచనం శ్రుత్వా స దూతః ప్రాహ విస్మితః | కిం బ్రూషే రుచిరాపాంగి స్త్రీస్వభావాద్ధి సాహసాత్.
1 ఇంద్రాద్యా నిర్జితా యేన దేవా దైత్యాస్తథా%పరే | తం కథం సమరే దేవి జేతు మిచ్ఛసి భామిని!
2 త్రైలోక్యే తాదృకో నాస్తి యః శుంభం సమరే జయేత్ | కా త్వం కమలపత్రాక్షి తస్యాగ్రే యుధి సాంప్రతమ్.
3 అవిచార్య న వక్తవ్యం వచనం క్వాపి సుందరి | బలం స్వపరయో ర్ఞాత్వా వక్తవ్యం సమయోచితమ్.
4 త్రైలోక్యాధిపతిః శుంభస్తవరూపేణ మోహితః | త్వాం చ ప్రార్థయతే రాజా కురు తస్యేప్సితం ప్రియే.
5 త్యక్త్వా మూర్ఖస్వభావం త్వం సమ్మాన్య వచనం మమ | భజ శుంభం నిశుంభం వా హిత మేత ద్ర్బవీమి తే.
6 శృంగారః సర్వథా సర్వైః ప్రాణిభిః పరయా ముదా | సేవనీయో బుద్ధిమద్భి ర్నవానా ముత్తమో యతః. 7 నాగమిష్యసి చే ద్బాలే స క్రుద్ధః పృథివీపతిః | అన్యా నాజ్ఞాకరా న్ర్పేష్య బలాన్నేష్యతి సాంప్రతమ్. 8 కేశేష్వాకృష్య తే నూనం దానవా బలదర్పితాః | త్వాం నయిష్యంతి వామోరు తరసా శుంభసన్నిధౌ. 9 స్వ లజ్జాం రక్ష తన్వంగి సాహసం సర్వథా త్యజ | మానితా గచ్ఛ తత్పార్శ్వే మానపాత్రం యతో%సివై. 10 క్వ యుద్ధం నిశితై ర్బాణౖః క్వసుఖం రతిసంగజమ్ | సారాసారం పరిచ్ఛిద్య కురు మే వచనం పటు. 11 భజం శుంభం నిశుంభం వా లబ్ధాసి పరమం శుభమ్ | దేవ్యువాచ : సత్యం దూత మహాభాగ ప్రవక్తుం నిపుణోహ్యసి. 12 నిశుంభ శుంభౌ జానామి బలవంతా వితి ధ్రువమ్ | ప్రతిజ్ఞా మే కృతా బాల్యా దన్యథా సాకథం భ##వేత్. 13 తస్మా ద్ర్బూహి నిశుంభం చ శుంభం వా బలవత్తరమ్ | వినా యుద్ధం న మే భర్తా భవితా కో%పి సౌష్ఠవాత్. 14 జిత్వా మాం తరసా కామం కరం గృహ్ణాతు సాంప్రతమ్ | యుద్ధేచ్ఛయా సమాయాతాం విద్ధి మా మబలాం నృప. 15 ఇరువదినాల్గవ యధ్యాయము ధూమ్రలోచనుని రాయబారము అను శ్రీదేవి వచనములు విని నివ్వెఱపడి దూత మరల దేవి కిట్లనియెను : 'చారునేత్రీ! నీవు స్త్రీ స్వభావముకొలది తెంపు వహించి పల్కుచున్నావు. భామినీ! ఇంద్రాదిదేవతలును దైత్యులును శుంభున కోడిరి. అంతటి వానిని నీవెట్లు యుద్ధములో గెల్వగలవు? ఆ శుంభుని జయించు మొనగా డీ ముల్లోకము లందింతవఱకును లేడు. అతని ముందింక నీవెంతటి దానవు? ఎక్కడనైన ముం దాలోచన చేయక పలుకరాదు. తన-యితరుల బలాబలము లెఱింగి సమయోచితముగ పలుకవలయును. శుంభుడు త్రిలోకపతి. అతడు నీ వంపుసొంపులు చిందులాడు రూపమునకు మోహితుడై నిన్ను కోరుచున్నాడు: ఆతని కోర్కి దీర్చుము. నా మాట వినుము. నీ మొండిపట్టు వదలుము. నీ మేలు గోరి చెప్పుచున్నాను. శుంభునిగాని నిశుంభునిగాని చేపట్టుము. నవరసములలో శృంగారము రసరాజము. సహృదయు లెంతయో నెయ్యము తియ్యము దోప నెల్లవిధముల దానినే సేవింతురు. బాలా! నీ వతనికడ కరుగనిచో నా భూపతి కినుక బూనును. అతడు దూతల నంపి నిన్ను లాగుకొనివచ్చునట్లు చేయగలడు. మదగర్వముగల దానవులు నీ జట్టుపట్టుకొని వేగమే శుంభుని చెంత కీడ్చుకొని కొనిపోగలరు. నీవు మానవతివి. నీ మర్యాద గాపాడుకొనుము. దుస్సాహసము వలదు. అతని చెంతకు మాన్యవై యరుగుము. వాడి బాణములతోడి పోరెక్కడ! రతిక్రీడల సుఖమెక్కడ! ఈ రెంటిలోని మంచిచెడ్డ లెఱిగి నా మాట కొంచెము వినుము. నీవు శుంభనిశుంభులలో నెవని భజించినను నీకు సుఖము గల్గితీరును' అను మాటలకు శ్రీదేవి యిట్లనెను : దూతా! నీవు మహావక్తవు. నిక్కము వక్కాణించుటలో మిక్కిలి నేర్పరివి. శుంభ నిశుంభులు బలవంతులుగారని నే వనుటలేదు. కాని, చిన్న తనమున చేసిన నా ప్రతిన యెట్లు వమ్మొనరింపగలను? కావున శుంభనిశుంభులకు తెలియజెప్పుము. పోరాటమున గెల్వనిచో నాకు పతి యెవ్వడును గాజాలడు. నేను బాలను. ఐనను నేను రణకామమున నరుదెంచితినని యెఱుగుము. కాన, నన్ను గెల్చి వేగమే నా కరము పట్టుకొనుమనుము. యుద్ధం దేహి సమర్థో%సి వీరధర్మం సమాచార | బిభేషి మమ శూలా చ్చేత్పాతాళం గచ్ఛ మా చిరమ్. 16 త్రిదివం చ ధరాం త్యక్త్వా జీవితేచ్ఛా యదస్తి తే | ఇతి దూత వదాశు త్వం గత్వా స్వపతిమాదరాత్. 17 స విచార్య యథా యుక్తం కరిష్యతి మహాబలః | సంసారే దూతధర్మోయం యత్సత్యం భాషణం కిల.18 శత్రౌ పత్యౌ చ ధర్మజ్ఞ తథా త్వం కురు మా చిరమ్ | అథ తద్వచనం శ్రుత్వా నీతిమద్బలసంయుతమ్. 19 హేతుయుక్తం ప్రగల్భం చ విస్మితః ప్రయ¸° తదా | గత్వా దైత్యపతిం దూతో విచార్య చ పునః పునః. 20 ప్రణమ్య పాదయోః ప్రహ్వః ప్రత్యువాచ నృపం చ తమ్ | రాజనీతికరం వాక్యం మృదుపూర్వం ప్రియం వచః. 21 సత్యం ప్రియం చ వక్తవ్యం తేన చింతాపరో హ్యహమ్ | సత్యం ప్రియం చ రాజేంద్ర వచనం దుర్లభం కిల. 22 అప్రియం వదతాం కామం రాజా కుప్యతి సర్వథా | సాక్షా త్కుతః సమాయాతా కస్య వా కింబలా%బలా. 23 న జ్ఞాన గోచం కిం త్కిం బ్రవీమి విచేష్టితమ్ | యుద్ధకామా మయా దృష్టా గర్వితా కటుభాషిణీ. 24 తయా యత్కథితం సమ్యక్తచ్ఛ్రుణుష్వ మహామతే | మయా బాల్యా త్ప్రతిజ్ఞేయం కృతా పూర్వం వినోదతః. 25 సఖీనాం పురతః కామం వివాహం ప్రతి సర్వథా | యో మాం యుద్ధే జయే దద్ధా దర్పంచ విధునోతి వై. 26 తం వరిష్యామ్యహం కామం పతిం సమబలం కిల | నమే ప్రతిజ్ఞా మిథ్యా సా కర్తవ్యా సృపసత్తమ. 27 తస్మా ద్యుధ్యస్వ ధర్మజ్ఞ జిత్వా మాం స్వవశే కురు | తయేతి వ్యాహృతం వాక్యం శ్రుత్వా%హం సముపాగత. 28 యథేచ్ఛసి మహారాజ తథా కురు తవ ప్రియమ్ | సా యుద్ధార్థం కృతమతిః సాయుధా సింహగామినీ. 29 నిశ్చలా వర్తతే భూవ యద్యోగ్యం తద్విధీయతామ్ | ఇత్యాకర్ణ్య వచస్తస్య సుగ్రీవస్య నరాధిపః. 30 పప్రచ్ఛ భ్రాతరం శూరం సమీపస్థం మహాబలమ్ | నీకు శక్తి యున్నచో వీర ధర్మముగ నాతో బోరుము. కాక నా శూలమునకు జంకినచో పాతాళ##మేగుము. నీకు బ్రదకుపై నాసయున్నచో నిపుడే స్వర్గభూములను విడనాడి పాతాళ##మేగుము అని నీపతికి సాదరముగ బలుకుము. ఆ బలశాలి యాలోచించుకొని తనకు తగినట్లు చేయగలడు. జగమున నిజము పల్కుటే దూత ధర్మము. కనుక నీవేగి నీపని చేయుము అని దేవి పలికెను. దేవి పలుకులలో నీతి గలదు. బలము గలదు. ఆమె పల్కులు సహేతుకములు ప్రాగల్భ్యవంతములు. ఆదేవి వాక్కులు వినిన దూత విస్మయమంది దైత్యపతి చెంతకేగి పలుమార్లు చక్కగ నాలోచించుకొనెను. అతడు దైత్యపతి పాదములకు మ్రొక్కి సవినయముగ మెత్తని తీయని మాటలతో రాజనీతి చతురతతో నతని కిట్లనియెను : రాజా! దూత తన ప్రభవు చెంత సత్యహిత వాక్కులు పలుకవలయును. కాని, నేడట్టివి నాయెడల దుర్లభములైనవి. అప్రియము బలుకుచో రాజు కోపించును. ఐనను చెప్పక తప్పుటలేదు. ఆ యువతి యెవతె? ఆమె యెటనుండి వచ్చెను? ఆమె బలమెంత? మున్నగు విషయములు నాకేమియు తెలియలేదు. కాని, యామె గర్వపు పరుష వచనముల వలన నామె యుద్ధకాముకురాలని నాకు తెలిసినది. ఆమె నోట వెడలిన పలుకులు వినుము. తొల్లి బాల్యమున నే నాట పాటలతో వినోదించు చుంటిని. అత్తఱి నేను నా చెలుల యెదుట నన్నాలములో గెల్చిన వానినే వరింతును. అతడే నాకు సమబలుడగు తగిన పతి అని నా వివాహము గూర్చి యొక ప్రతిన బూనితిని. ఇట్టి నా ప్రతిజ్ఞను వమ్మొనరించుట తగదు. కనుక నన్ను పోరిలో గెల్చి నీదానిగ జేసికొనుము అను దేవి పల్కులు విని నేను వచ్చితిని. ఆమె యుద్ధమునకే సిద్ధమై సింహవాహనయై యేతెంచినది. నిండు ధైర్యముతోనున్నది. ఇంక నీకు తగినట్లు చేయుము అను సుగ్రీవుని మాటలు శుంభుడు విని తనకడ నున్న తన తమ్మునిట్లడిగెను. భ్రాతః కిమత్ర కర్తవ్యం బ్రూహి సత్యం మహామతేః 31 నార్యేకా యోద్ధుకామాస్తి సమాహ్వయతి సాంత్రమ్ | అహం గచ్ఛామి సంగ్రామే త్వం వా గచ్ఛ బలాన్వితః. 32 యద్రోచతే నిశుం భాద్య తత్కర్తవ్యం మయా కిల | నిశుంభః: న మయా న త్వయా వీర గంతవ్యం రణమూర్ధని. 33 ప్రేషయస్వ మహారాజ త్వరితం ధూమ్రలోచనమ్ | స గత్వా తాం రణ జిత్వా గృహీత్వా చారులోచనామ్. 34 ఆగమిష్యతి శుంభాత్ర వివాహః సంవిధీయతామ్ | తన్నిశమ్య వచస్తస్య శుంభో భ్రాతుః కనీయసః. 35 కోపాత్యసం ప్రేషయామాస పార్శ్వస్థంధూమ్రలోచనమ్ | థూమ్రలోచన గచ్ఛా%%శు సైన్యేన మహతా%%వృతః. 36 గృహీత్వా%%నయ తాం ముగ్ధాం స్వవీర్య మదమోహితామ్ | దేవో వా దానవో వా%పి మనుష్యోవా మహాబలః. 37 తత్పార్షి గ్రాహతాం ప్రాప్తో హంతవ్య స్తరసా త్వయా | తత్పార్శ్వ వర్తినీం కాళీం హత్వా సంగృహ్యతాం పునః. 38 శీఘ్ర మత్ర సమాగచ్ఛ కృత్వా కార్య మనుత్తమమ్ | రక్షణీయా త్వయా సాధ్వీ ముంచంతీ మృదుమార్గణాన్. 39 యత్నేన మహతా వీర మృదు దేహా కృశోదరీ | తత్సహాయా శ్చ హంతవ్యా యే రణ శస్త్రపాణయః. 40 సర్వథా సా న హంతవ్యా రక్షణీయా ప్రయత్నతః | ఇత్యాదిష్ట స్తదా రాజ్ఞా తరసా ధూమ్రలోచనః. 41 ప్రణమ్య శుంభం సైన్యేన వృతః శీఘ్రం య¸° రణ | అసాధూనాం సహస్రాణాం షష్ట్యా తేషాం వృత స్తథా. 42 స దదర్శ తతో దేవీం రమ్యోపవన సంస్థితామ్ | దృష్ట్వా తాం మృగశాబాక్షీం వినయేన సమన్వితః. 43 ఉవాచ వచనం శ్లక్షం హేతుమద్రసభూషితమ్ | శృణు దేవి మహాభాగే శుంభ స్త్వద్విరహా%%తురః. 44 దూతం ప్రేషితవాన్ పార్శ్వే తవ నీతి విశారదః | రసభంగభ##యేద్విగ్నః సామపూర్వం త్వయి స్వయమ్. 45 తేనాగత్య వచః ప్రోక్తం విపరీతం వరాననే | వచసా తేన మే భర్తా చింతావిష్టమనా నృపః. 46 ఒక నారి పోరదలచి మనల నిప్పుడు పురికొల్పుచున్నది. నీవు సేనతో వెళ్ళెదవా? లేక నేను ముందు వెళ్ళుదునా? నీకేది నచ్చిన దానిని తప్పక చేయగలను అని పలుకగా విని నిశుంభు డిట్లనెను : ఈ పరిస్థితిలో నీవుగాని నేనుగాని సంగ్రామమున కేగుట తగదు. నీవు వెంటనే ధూమ్రలోచను నంపుము. అత డామె నోడించి తీసికొని రాగలదు. ఆ పిమ్మట నామెను నీవే పెండ్లిగావచ్చును అను తన తమ్ముని మాటలను శుంభుడు విని తనప్రక్కనున్న ధూమ్రలోచనుని పంపించుచు నతని కిట్లనెను : ధూమ్రలోచనా! నీవు వెంటనే నీ బలముతో తరలుము. వీర్యమదగర్వములుగల యా ముగుదను పట్టి తెమ్ము. అపుడు దేవ దానవ వీరులలో నెవడైన బలముతో రావచ్చును. ఆమె కండయై దండగ నిలువవచ్చును. అపుడు నీ వతనిని కూడా తెగటార్పుము. ఆమె ప్రక్కనున్న కాళిని సైతము చంపి తెమ్ము? నీవు కార్యము చక్కపెట్టుకొని వెంటనే తిరిగిరమ్ము. అమెకేమాత్రము దెబ్బ తగులనీయక మెత్తని ములుకులు జాగ్రత్తగ ప్రయోగింపుము. ఆ యమ సాధ్వి; సుకుమార శరీర; లతాంగి. ఆమెకు తోడైన శస్త్రపాణుల నంతమొందించుము. ఆమెను మాత్రము చంపవలదు. ఎల్లవిధముల నామెను సురక్షితనుగ దెమ్ము. అను శంభు నాదేశమును ధూమ్రలోచనుడు విని ప్రభునకు దోయిలించి యారువేల దానవసేన వెంటగొని రణమునకు వెడలెను. మృగలోచనియగు దేవి యొక సుందరోద్యానమున నుండగ నతడామెను దర్శించెను. అతడు సహేతుకములు సరసమధురములు నగు వచనములతో నామె కిట్లనియెను: దేవీ! నీవు మిక్కిలి సౌభాగ్యవతివి. శుంభుడు నీ మీద మరులుగొని తపించుచున్నాడు. అతడు నీతి విశారదుడు. కనుక రసభంగమగునేమో యని యెంచి యతడు నీ కడకు దూత నంపెను. వరాననా! ఆ దూత వచ్చి వ్యతిరేకముగ బల్కెను. అందుచే మా రాజు చింతాక్రాంతు డయ్యెను. బభూవ రసమార్గజ్ఞే శుంభః కామవిమోహితః | దూతేన తేన న జ్ఞాతం హేతుగర్భం వచస్తవ. 47 యోమాం జయతి సంగ్రామే యదుక్తం కఠినం వచః | న జ్ఞాత స్తేన సంగ్రామో ద్వివిధః ఖలు మానిని. 48 రతిజో%థో త్సాహజశ్చ పాత్రభేదే వివక్షితః | రతిజ స్త్వయి వామోరు శత్రోరుత్సాహజః స్మృతః. 49 సుఖదః ప్రథమం కాంతే దుఃఖద శ్చారిజః స్మృతః | జానామ్యహం వరారోహే భవత్యా మానసం కిల. 50 రతిసంగ్రామభావ స్తే హృదయే పరివర్తతే | ఇతి తత్‌జ్ఞం విదిత్వా మాం త్వత్సకాశం నరాధిపః. 51 ప్రేషయామాస శుంభో%ద్య బలేన మహతా%%వృతమ్ | చతురా%సి మహాభాగేశృణు మే వచనం మృదు. 52 భజ శుంభం త్రిలోకేశం దేవదర్పనిబర్హణమ్ | పట్టరాజ్ఞీ ప్రియా భూత్వా భుంక్ష్వ భోగాననుత్తమాన్. 53 జేష్యతి త్వాం మహాబాహుః శుంభః కామబలార్థవిత్ | విచిత్రా న్కురు హవాం స్తవం సో%పి భావా న్కరిష్యతి. 54 భవిష్యతి కాళికేయం తత్ర వై నర్మసాక్షిణీ | ఏవం సంగరయోగేన పతి ర్మే పరమార్థవిత్. 55 జిత్వా త్వాం సుఖశయ్యాయాం పరిశ్రాంతాం కరిష్యతి | రక్త దేహం నఖాఘాతై ర్దంతై శ్చ ఖండితాధరామ్. 56 స్వదేక్లిన్నాం ప్రభగ్నాం త్వాం సంవిధాస్యతి భూపతిః | భవితా మానసః కామో రతి సంగ్రామజ స్తవ. 57 దర్శనా ద్వశ ఏవాస్తే శుంభః సర్వాత్మనా ప్రియే | వచనం కురు మే పథ్యం హితకృచ్చాపి పేశలమ్. 58 భజ శుంభం గణాధ్యక్షయం మాననీయా%తి మానినీ | మందభాగ్యా శ్చ తే నూనం హ్యస్త్రయుద్ధ ప్రియాశ్చ యే. 59 న తదర్హా%సి కాంతే త్వం సదా సురతవల్లభే | అశోకం కురు రాజానం పాదఘాత వికాసితమ్. 60 వకుళం సీధు సేకేన తథా కురువకం కురు | ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే చతుర్వింశో%ధ్యాయః రసజ్ఞురాలా! శుంభుడు కామమోహితుడై యున్నాడు. నీ నర్మగర్భితములగు వాక్కులను దూత సరిగ గ్రహింపలేదు. సమరమున నన్ను గెల్వుమను కఠిన వాక్కుల వ్యంగ్యార్థ మతనికి దెలియలేదు. సమరము రెండు విధములు గదా! రంభోరూ! రతివలన గల్గున దొకటి. ఉత్సాహమున గల్గున దింకొకటి. రతి సమరము నీయందు శోభిల్లును. ఉత్సాహము వలని సమరము శత్రులపట్ల నలరును. నితంబినీ! ఈ రెంటిలో మొదటిది సుఖదము. రెండవది దుఃఖదము. నేను నీ మనోభావమును చక్కగ నెఱిగితిని. ఇపుడు నీ యెడదలో రతి సమరభావమే తోచుచున్నది. దానిని గూర్చి నా కెక్కువగ దెలియునని శుంభుడు తలంచెను. అతడు నన్ను సేనతో బంపెను. నీవు చతురవు. నా మృదు వచనము లాలకింపుము. శుంభుడు దేవతల మద ముడిపిన త్రిలోకేశుడు. నీ వతనిని భజించి యతనికి పట్టమహిషికై యనేక భోగము లుపభోగింపుము. ఆ మహాబాహువు కామబల మెఱిగినవాడు. కాన నతడు నిన్ను జయింపగలడు. ఇక నీవు నీ హావభావములు వెల్లడించుచూ నతడును తన యభిప్రాయము వెలిపుచ్చును. ఈ కాళిక మీ నర్మ క్రీడలో సైదోడుగ నుండగలదు. ఇట్టి సంభోగ సమరయోగమున నా పతి పరమార్థవేత్త. అతడు నిన్ను గెల్చి పూసెజ్జపై నిన్నలయ జేయగలడు. అతడు నఖదంతక్షతములతో నిన్ను బాధింపగలడు. అతడు నిన్ను చెమటచే నలసిన దానినిగ జేయలడు. ఆతడు నీ రతి సంగ్రామవాంఛ దీర్చ గలడు. నిన్ను దర్శించినంతనే యతడు తన నిండు మనసున నీకు పశుడగును. ప్రియా! నా కోమలమగు మేలిపల్కులు వినుము. అతడు నీకైవస మగును. మానినీ! దానవ గణాధ్యక్షుడగు శుంభుని సేవించినచో నీవెల్లరిలోన మాననీయ వగుదువు. అస్త్రయుద్ధము గోరువారు మందభాగ్యులు సుమా! నీ వట్టిదానికి తగవు. నీకు సురతసమరము ప్రియమైనది. నీ పదతాడనమున నీ ముఖ మదిరా దానమున నా రాజు నశోకునిగ జేయుము. వకుళము కురవకము మరిదాసేచనమున శోభిల్లును. అశోకము పదాఘాతమున విప్పారును. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీదేవి కడకు ధూమ్రలోచనుని రాయబారమను నిరువదినాల్గవ యధ్యాయము.