Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచవింశో%ధ్యాయః ఇత్యుక్త్వా విరరామాసౌ వచనం ధూమ్రలోచనః | ప్రత్యువాచ తదా కాళీ ప్రహస్య లలితం వచః.
1 విదూషకో%సి జాల్మ త్వం శైలూష ఇవ భాష సే | వృథా మనోరథాం శ్చిత్తే కరోషి మధురం వదన్.
2 బలవా న్బలసంయుక్తః ప్రేషితో%సి దురాత్మనా | కురు యుద్ధం వృథా వాదం ముంచ మూఢమతే%ధునా.
3 హత్వా శుంభం నిశుంభం చ త్వ దన్యాన్వా బలాధికాన్ | దేవీ క్రుద్ధా శరాఘాతై ర్ర్వజిష్యతి నిజాలయమ్.
4 క్వాసౌ మందమతిః శుంభంః క్వ వా విశ్వవిమోహినీ | అయుక్తః ఖలు సంసారే వివాహ విధి రేతయోః.
5 సింహీ కిం త్వతికామార్తా జంబుకం కురుతే పతిమ్ | కరిణీ గర్దభం వా%పి గవయం సురభిః కిము.
6 గచ్ఛ శుంభం నిశుంభం చ వద సత్యం వచో మమ | కురు యుద్ధం న చే ద్యాహి పాతాళం తరసా%ధూనా.
7 కాళికాయా వచః శ్రుత్వా సదైత్యో ధూమ్రలోచనః | తామువాచ మహాభాగ క్రోధ సంరక్తలోచనః.
8 దుర్దర్శే త్వాం నిహత్యాజౌ సింహం చ మదగర్వితమ్ | గృహీత్వైనాం గమిష్యామి రాజానం ప్రత్యహం కిల. 9 రసభంగభయో త్కాళి బిభేమి త్విహ సాంప్రతమ్ | నో చే త్త్వాం నిశితై ర్బాణౖ ర్హన్మ్యద్య కలహప్రియే. 10 కాళికోవాచ: కిం వికత్థసి మందాత్మ న్నాయం ధర్మో ధనుష్మతామ్ | స్వశక్త్వాయ ముంచ విశిఖా న్గంతాపి యమ సంసది. 11 తచ్ఛ్రుత్వా వచనం దైత్యః సంగృహ్య కార్ముకందృఢమ్ | కాళికాం తాం శరాసారై ర్వవర్షాతి శిలశితైః. 12 దేవా స్తు ప్రేక్షకా స్తత్ర విమానవర సంస్థితాః | తాం స్తవంతో జయేత్యూచు ర్దేవీం శక్రపురోగమాః. 13 తయోః పరస్పరం యుద్ధం ప్రవృత్తిం చాతిదారుణమ్ | బాణఖడ్గ గదాశక్తి ముసలాదిభి రుత్కటమ్. 14 ఇరువదియైదవ అధ్యాయము శ్రీకాళికాదేవి ధూమ్రలోచనుని సంహరించుట ధూమ్రలోచనుడు ఇట్లు పలికి విరమించెను. అతని మాటలు విని కాళికాదేవి పకపక నవ్వి లలిత గంభీరవాక్కులతో నతనికిట్లనెను : ''మూర్ఖుడా! నీవు వదరుబోతవు. విదూషకుడవు. నటునివలె పల్కుచున్నావు. తీయగ పల్కినంత మాత్రాన లోని కోర్కులు తీరునటరా? మందమతీ! నీవు బలశాలివి. బలవంతుడవు. ఆ దుర్మదాంధునిచే పంపబడితివి. కనుక వట్టిమాటలు కట్టిపెట్టి నాతో బోరరమ్ము. శ్రీదేవి శత్రుమారిణి. దనుజలోక భయంకరి. ఈమె మహారౌద్రముతో వాడి బాణములతో నిన్నును నీ శుంభ నిశంభులను తక్కిన వీరులను హతమార్చికాని తన నిలయమున కేగదు. ఈ లసన్మరకత స్వచ్ఛ విగ్రహ విశ్వమోహిని యెక్కడ! ఆ మందమతియగు శుంభుడెక్కడ! వీరిర్వురికీ ప్రపంచములో వివాహము కడు దుర్లభము. ఈ జగన్మోహిని గుణసుందరియగు దేవి నీ పతిని తన పతిగ వరించునటరా! ఏ యందాల రాశియైన యొక్క నక్కను భర్తగ గోరుకొనునటరా? ఆడుయేనుగు గాడిదను కామించునటరా? కామధేనువు కుందేలును వలచునటరా? ఇక నీవు శుంభ నిశంభుల చెంతకేగవచ్చును. 'నాతో బోరుము లేదా పాతాళమునకు వెళ్ళిపొమ్ము' ని వారితో నేను నిజముగ బలికితి ననుము'' అను కాళికాదేవి వాక్కులు విని ధూమ్రలోచనుడు కన్నులెఱ్ఱజేసి యామె కిట్లనెను : 'కుత్సితాంగీ! నేనిపుడు నిన్ను నీ మదగర్విత సింహమును చంపి దేవిని మా రాజు చెంతకు గొనిపోదును. కలహప్రియా! నిన్నుచంపినచో రసభంగమగునని యెంచి యింతసేపూరకుంటిని. కానిచో నా వాడి బాణములతో నిన్నెప్పుడో దునిమాడి యుండునా? అన కాళి యిట్లనియెను: మూఢమతీ! ఊరక నిన్ను నీవేల పొగడుకొందువు? ఇది ధనుర్ధరుల ధర్మముగాదు. నీ శక్తి కొలది బాణములు వదలుము. యమాలయమునకు నడువుము అను కాళిక వాక్కులు విని యతడు విల్లందుకొని కాళిపై వాడితూపులు వాన కురిసెను. అపుడింద్ర ప్రముఖులు విమానముల నుండి చూచుచు శ్రీదేవిని సంస్తుతించుచు జయఘోషలు పెట్టసాగిరి. అంత వారిర్వురికిని బాణ-ఖడ్గ-గదా-శక్తి-ముసలములతో భయంకర యుద్ధము ఘటిల్లెను. కాళికా బాణపాతై స్తు హత్వా పూర్వం ఖరానథ | బభంజ తద్రథం వ్యూఢం జహాస చ ముహుర్ముహుః. 15 స చాన్యం రథ మారూఢః కోపేన ప్రజ్వలన్నివ | బాణవృష్టిం చకోరోగ్రాం కాళికోపరి భారత. 16 సా%పి చిచ్ఛేద తరసా తస్య బాణా నసంగతాన్ | ముమోచాన్యా నుగ్రవేగా న్దానవోపరి కాళికా. 17 తై ర్బాణౖ ర్నిహతా స్తస్య పార్పి గ్రాహః సహస్రశః | బభంజ చ రథం వేగా త్సూతం హత్వా ఖరానపి. 18 చిచ్ఛేద తద్ధనుః సద్యో బాణౖ రురుగసన్నిభైః | ముదం చక్రే సురాణాం సా శంఖనాదం తథా%కరోత్. 19 విరథః పరిఘం గృహ్య సర్వలోహమయం దృఢమ్ | ఆజగామ రథోపస్థం కుపితో ధూమ్రలోచనః. 20 వాచా నిర్భక్త్సయ న్కాళీం కరాళః కాలసన్నిభః | అద్యైవ త్వాం హనిష్యామి కురూపే పింగలోచనే. 21 ఇత్యుక్త్వా సహసా%గత్య పరిఘం క్షిపతే యదా | హుం కారే ణౖవ తంభస్మ చకార తరసా%ంబికా 22 దృష్ట్వా భస్మీకృతం దైత్యం సైనికా భయవిహ్వాలాః | చక్రుః పలాయనం సద్యో హ తాతేత్యబ్రు వన్పథి. 23 దేవా స్తం నిహతం దృష్ట్వా దానవం ధూమ్రలోచనమ్ | ముముచుః పుష్పవృష్టిం తే ముదితా గగనే స్థితా. 24 రణభూమి స్తదా రాజ న్దారుణా సమపద్యత | నిహతై ర్దానవై రశ్వైః ఖరై శ్చ వారణౖ స్తథా. 25 గృధ్రాః కాకా వటాః శ్యేనా వరఫా జంబుకా స్తథా | ననృతు శ్చుక్రుశుః ప్రేతా న్పతితా న్రణభూమిషు. 26 అంబికా తద్రణస్థానే త్యక్త్వా క్రూరం స్థలాంతరే | గత్వా చకార చాప్యుగ్రం శంఖనాదం భయప్రదమ్. 27 తంశ్రుత్వా దరశబ్దం తు శుంభః సద్మని సంస్థితః దృష్ట్వా%థ దానవా న్భగ్నా నాగతా న్రుధిరోక్షితాన్. 28 ఛిన్నపాదకరాక్షాంశ్చ మంచకారోపితా నపి | భగ్న పృష్ఠకటిగ్రీవా న్క్రందమానా ననేకశః. 29 శ్రీకాళి మొదటిసారిగ వాని రథమును మోయు గాడిదలను రథమును దునిమాడి వికటాట్టహాస మొనరించెను. అంత నతడు మఱియొక రథమెక్కి కోపముతో మండిపడుచు కాళీదేవిపై తీవ్ర బాణవర్షము గురిసెను. కాళియును వానిబాణములెల్ల నడుమనే తుత్తునియలొనర్చి వానిపై తీవ్ర వేగముగల బాణములు ప్రయోగించెను. ఆ కాళి బాణప్రయోగమున వాని వేలాది యంగరక్షకులు మడిసిరి. రథము తునుకలయ్యెను. గాడిదలు నేలగూలెను. కాళిక వెంటనే నాగబాణమలుతో వాని వింటిని రెండుగ దునిమెను. సురలకు ప్రమోదము గూర్చి విజయ శంఖము పూరించెను. విరథుడైన ధూమ్రలోచనుడు కోపముతో లోహమయమగు పరిఘనుకొని రథమును సమీపించెను. కాలభయంకరుడగు ఆ దానవుడు శ్రీ కాళికతో ఓ కురూపా! పింగళాక్షీ! నిన్నిపుడే చంపుదున' ని చావుకేకలు పెట్టి పరిఘను వేసిన వెంటనే హ్రీంకారనిలయ యగు దేవి తన హుంకార మాత్రమున వానిని భస్మము చేసెను. ధూమ్రలోచనుని బూదిప్రోవుగని తక్కిన దానవులు భయాకులురై పరుగులు దీసిరి. ధూమ్రలోచనుడు చచ్చుట గని వారాపథమందలి దేవతలు పూలజల్లు కురిసిరి. అట్లు దానవులు గజాశ్వఖరములు చావగ రణరంగము భీకరదారుణమై బీభత్సముగ నుండెను. ఆ యుద్ధ భూమిలో పడిన పీనుగుల పెంటగని నక్కలు-గ్రద్దలు-డేగలు-కాకులు-పిశాచములు నర్తించుచు కోలాహలమొనరించెను. అత్తఱి జగదంబిక రణభూమి వదలి వేరొకచోటికేగి శత్రుల గుండెలవియగ శంఖనాద మొనరించెను. ఆ భీకర శంఖధ్వని తన యింటనున్న శంభుని చెవిలోబడెను. అంతలో కొందఱు నెత్తురులు కారుచుండగ రొప్పుచు రోదించుచు పరుగెత్తి వచ్చిరి. కాలుసేతులు-కన్నులు-నడుములు-వీపులు-మెడలు తెగిన దానవులు కొందఱు మంచములపై గిలగిల తన్నుకొనుచుండగ వారిని శుంభుడు చూచెను. వీక్ష్య శుంభో నిశుంభశ్చ క్వగతో ధూమ్రలోచనః | కథంభగ్నాః సమాయాతా నానీతా కిం వరాననా. 30 సైన్యం కుత్ర గతం మందాః కథయంతు యథాగతమ్ | కస్యాయం శంఖనాదో%ద్య భూయతే భయవర్ధనః. 31 గణాఊచుః: బలం చ పతితం సర్వం నిహతో ధూమ్రలోచనః | కృతం కాళికయా కర్మ రణభూమా వమానుషమ్. 32 శంఖనాదో%ంబికాయా స్తు గగనం వ్యాప్య రాజతే | హర్షదః సురసంఘానాం దానవానాం చ శోకకృత్. 33 యదా నిపాతితాః సర్వే తేన కేసరిణా విభో | రథా భగ్నా హయాశ్చైవ బాణపాతై ర్వినాశితాః. 34 గగనస్థాః సురా శ్చక్రుః పుష్పవృష్టిం ముదా%న్వితాః | దృష్ట్వా భగ్నం బలం సర్వం పాతితం ధూమ్రలోచనమ్. 35 నిశ్చయ స్తు కృతో%స్మాభి ర్జయో నైవ భ##వేదితి | విచారం కురు రాజేంద్ర మంత్రిభి ర్మంత్రవిత్తమైః. 36 విస్మయో%యం మహారాజ యదేకా జగదంబికా | భవద్భిః సహ యుద్ధాయ సంస్థితా సైన్యవర్జితా. 37 నిర్భయైకాకినీ బాలా సింహారూఢా మదోత్కటా | చిత్ర మేత న్మహారాజ భాసతే%ద్భుత మంజసా. 38 సంధి ర్వా విగ్రహో వా%ద్య స్థానం నిర్ణయ మేవ చ | మంత్ర యిత్వా మహారాజ కురు కార్యం యథా రుచి. 39 తత్సన్ని ధౌ బలం నా%స్తి తథా%పి శత్రుతాపన | పార్షిగ్రాహాః సురాః సర్వే భవిష్యంతి కిలాపది. 40 సమయే తత్సమీపస్థౌ జాతౌ చ హరిశంకరౌ | లోకపాలాః సమీపే%ద్య వర్తంతే గగనే స్థితాః. 41 రక్షోగణా శ్చ గంధర్వాః కిన్నరా మానుషా స్తథా | తత్సహాయా శ్చ మంతవ్యాః సమయే సురతాపన. 42 అస్మాకం మతిమానేన జ్ఞాయతే సర్వ థే దృశమ్ | అంబికాయాః సహాయా%శా తత్కార్యాశా న కాచన. 43 అది గని శుంభ నిశుంభులిట్లనిరి: ఆ ధూమ్రలోచను డెక్కడ? మీరేల వెన్ను చూపి పారివచ్చితిరి? ఆమె నేల తేలేదు మూఢులారా! తక్కిన సేన యెక్కడ? ఈ భయంకర శంఖధ్వని యెవరిదో సాకల్యముగ తెలుపుడు అన సైనికు లిట్లనిరి: ధూమ్రలోచను డీల్గెను. సైన్య మంతయును పడిపోయెను. ఈ లోకాతీత కార్యక్రమమంతయు రణమందొక్క కాళికవలననే జరిగెను. ఈ నింగి మారుమ్రోగు విజయశంఖధ్వని జగదంబది. ఈ మహాధ్వని నిఃల సురులకు విజయానందమును దానవులకు శోకమును గల్గించునది. కాళికా ఘోరబాణముల మూలమున ధూమ్రలోచనుడు-అతని రథము-గుఱ్ఱములువినాశిత మయ్యెను. తక్కిన సేన శ్రీదేవి సింహము వాతబడి మడిసెను. ధూమ్రలోచనుడు నేలగూలిన వెంటనే యతని సైన్యము చెల్లాచెదరయ్యెను. అపుడమరులు నింగినుండి విరిజల్లులు కురిపించిరి. రాజా ! ఇక మనకు జయము గల్గదని మా దృఢనిశ్చయము. కనుక నేర్పు తీర్పుగల మంత్రులతో చక్కగ నాలోచింపుము. ఆ దుష్టవిద్రావిణియగు జగన్మాతయే బలము-తోడులే కొంటరిగ మీతో బోర సిద్దమగుట యెంతయో వింతగ నున్నది. ఆ బాల సింహాధిరూఢయై మదగర్వితయై జంకుకొంకులు లేకొంటిగ విశిష్టముగ ప్రకాశించుట యెంతే నద్భుతముగ చిత్రవిచిత్రముగ నున్నది. రాజా! ఇపుడు సంధి-విగ్రహము-పలాయనము-ఔదాసీన్యమునను వానిలో దేనినైన చక్కగ నాలోచించి తోచినట్లు చేయుము. పరంతపా! ఆమెకు తోడుగ బలము లేకున్నను సురలామెకు పార్శ్వరక్షకులుగ నుందురు. హరిహరులు తఱియెఱింగి యామెకు సహకార మొనర్తురు. తారాపథ మాశ్రయించిన దేవతలు సైత మా దేవి సన్నిధినే యుండగలరు. శత్రుతాపనా! నరకిన్నర-గంధర్వులెల్లరును సమయ మేతెంచినప్పుడామె కండదండలుగ నిలువగలరు. ఆ యంబిక కొకని సహాయ సంపత్తులు గావలయుననికాని యొక డెవడో యామె పని చేయవలయుననికాని యామెకు లేనేలేదని మే మెఱింగితిమి. ఏకా నాశయితుం జగత్సర్వం చరాచరమ్ | కా కథా దానావానాం తు సర్వేషామితి నిశ్చయః. 44 ఇతి జ్ఞాత్వా మహాభాగ యథారుచి తథా కురు | హితం సత్యం మితం వాక్యం వక్తవ్య మనుయాయిభిః. 45 తచ్ఛ్రుత్వా వచనం తేషాం శుంభః పరబలార్దనః | కనీయాంసం సమానీయ పప్రచ్ఛ రహసి స్థితః. 46 భ్రాతః కాళికయా%ద్యైవ నిహతో ధూమ్రలోచనః | బలం చ శాతితం సర్వం గణా భగ్నాః సమాగతాః. 47 అంబికా శంఖనాదం వై కరోతి మదగర్వితా | జ్ఞానినాం చైవ దుర్జేయా గతిః కాలస్య సర్వథా. 48 తృణం వజ్రాయతే నూనం వజ్రం చైవ తృణాయతే | బలవాన్బలహీనం స్యా ద్దైవస్య గతి రీదృశీ. 49 పృచ్ఛామి త్వాం మహాభాగ కిం కర్తవ్య మితః పరమ్ | అభోగ్యా చాంబికా నూనం కారణా దత్రవా గతా. 50 యుక్తం పలాయనం వీర యుద్ధం వా వద సత్వరమ్ | లఘు జ్యేష్టం విజానామి త్వామహం కార్యసంకటే. 51 నిశుంభ ఉవాచ: న వా పలాయనం యుక్తం న దుర్గగ్రహణం తథా | యుద్ధ మేవ పరం శ్రేయః సర్వథైవా నయా%నఘ. 52 ససైన్యో%హం గమిష్యామి రణ తు పరమాశ్రితః | హత్వా తామాగమిష్యామి తరసా త్వబలామిమామ్. 53 అథవా బలవద్దైవా దన్యథా చే ద్భవిష్యతి | మృతే మయి త్వయా కార్యం విమృశ్య చ పునః పునః. 54 ఇతి తస్య వచః శ్రుత్వా శుంభం ప్రోవాచ చానుజమ్ | తిష్ఠ త్వం చండముండౌ ద్వౌ గచ్ఛతాం బలసంయుతౌ. 55 శశకగ్రహణాయాత్ర న యుక్తం గజమోచనమ్ | చండముండౌ మహావీరౌ తాం హంతుం సర్వథా క్షమౌ. 56 ఇత్యుక్త్వా భ్రాతరం శుంభం సంభాష్య చమహాబలౌ | ఉవాచ వచనం రాజా చండముండౌ పురః స్థితౌ. 57 గచ్ఛతాం చండముండౌ ద్వౌ స్వసైన్య పరివారితౌ | హంతుం తా మబలాం శీఘ్రం నిర్లజ్ఞాం మదగర్వితామ్. 58 గృహీత్వా%థ నిహత్యాజౌ కాళికాం పింగలోచనామ్ | ఆగమ్యతాం మహాభాగౌ కృత్వా కార్యం మహత్తరమ్. 59 సా నాయతి గృహీతా%పి గర్వితా చాంబికాయది | తదా బాణౖ ర్మహాతీక్షైర్హంతవ్యా%%హవపండితా. 60 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే వంచవింశో%ధ్యాయః. ఆ దేవి యొకతెయే యీ చరాచరజగములను నశింపజేయ శక్తురాలు. ఇక నీ సకల దానవు లామె కొక లెక్కయా? మహాభాగా! ఇది అంతయు నెఱిగి నీకు దోచినట్లు చేయుము. భృతుడెల్లప్పుడును మిత-హిత-సత్యవాక్యములు, పలుకవలయును అను సేనల మాటలు విని వైరిభీకరుడగు శుంభుడు తన తమ్ముని బిలిచి రహస్యముగ నతని కిట్లనెను : తమ్ముడా! కాళిక ధూమ్రలోచను నంతమొందించెను. మన సేనయు నంతమందెను. చెదరిన సేనలు పారివచ్చెను. ఇప్పుడంబిక మదగర్వముతో విజయశంఖము పూరించుచున్నది. కనుక జ్ఞానులకు సైతము కాలగతి తెలియరాదు. కాల వైపరీత్యమున వజ్రము గడ్డిపోచగ గడ్డిపోచ వజ్రముగ బలశాలి దుర్బలుడుగ మారును. దైవగతి యిట్టిదిగ నుండును. మహాభాగా! ఇపుడు మన కర్తవ్యమేమో తెలుపుము. ఆ యంబిక భోగింపరానిదని తెలియుచున్నది. మనకిపుడు పారిపోవుటుచితమా? నీవు చిన్నవాడవైనను నిట్టి సంకట సమయమున పెద్దవాడవనియే నిన్ను నేను దలతును. అన నిశుంభు డిట్లనెను : ఇపుడు మనకు పరుగెత్తుటకాని దూరమున దాగుటకాని తగదు. మన మామెతో బోరుట ఎల్లభంగుల మంచిది. నే నిపుడు వీర సైనికులతో వెళ్ళి యా యబలను చంపి తిరిగి రాగలను. ఒకవేళ దైవము మన కనుకూలింపక నేను మరణించినచో నీవు పల్మారు విచారించి పనిచేయుము అను మాటలు విని శుంభుడు తన తమ్మునితో మరల నిట్లనెను : నీవుండుము. చండ ముండు లిర్వురును సేనలతో పోరనేగగలరు. కుందేటిని పట్టుటకు గజమును పంపుట యుక్తముగాదు. చండ ముండ మహా వీరు లామెను దునుముటకు చాలుదురు అని శుంభుడు తన తమ్మునితోనని తన ముందున్న చండ ముండుల కిట్లనెను : ఓ చండ ముండులారా! మీరు శీఘ్రముగ సేనలతో మదగర్వమున సిగ్గులేని యా యబలను చంపుట కేగుడు. పింగళాక్షియగు కాళిని చంపి యంబికను గొనితెండు. ఈ బృహత్తర కార్యమును మీరు నెఱవేర్చుడు. ఆ యంబిక పట్టువడియును గరువము కొలది రానిచో రణాలంకార యగు నామెను వాడి బాణములతో చంపుడు. ఇది శ్రీమద్దేవీభాగవతమందలి పంచమస్కంధమందు కాళికాదేవి ధూమ్రలోచనుని సంహరించుట అను నిరువదియైదవ అధ్యాయము.