Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షడ్వింశోధ్యాయః

ఇత్యాజ్ఞప్తౌ తదా వీరౌ చండ ముండౌ మహాబలౌ | జగ్మతు స్తరస్తెవాజౌ సైన్యేన మహతా%న్వితౌ. 1

దృష్ట్వా తత్ర స్థితా దేవీం దేవానాం హితకారిణీమ్‌ | ఊచతు స్తౌ మహావీర్యౌ తదా సామాన్వితం వచః. 2

బాలే త్వం కిం న జానాసి శుంభం సురబలార్దనమ్‌ | నిశుంభం చ మహావీర్యం తురాషా డ్విజయోద్ధతమ్‌. 3

త్వమేకాసి వరారోహే కాళికా సింహసంయుతా | జేతు మిచ్ఛసి దుర్బుద్ధే శుంభం సర్వబలాన్వితమ్‌. 4

మతిదః కో%పి తే నాస్తి నారీ వా%పి నరో%పి వా | దేవా స్త్వాం ప్రేరయం త్యేవ వినాశాయ తవైవ తే. 5

విమృశ్య కురు తన్వంగి కార్యం స్వపరియో ర్బలమ్‌ | అష్టాదశభుజాత్వా త్త్వం గర్వం చ కురుషే మృషా. 6

కిం భుజై ర్బహుభి ర్వ్యర్థై రాయుధైః కిం శ్రమప్రదైః | శుంభస్యాగ్రే సురాణాం వై జేతుః సమరశాలినః. 7

ఐరావతకరచ్ఛేత్తు ర్దంతి దారణ కారిణః | జయనః సురసంఘానాం కార్యం కురు మనోగతమ్‌. 8

వృథా గర్వాయసే కాంతే కురు మే వచనం ప్రియమ్‌ | హితం తవ విశాలాక్షి సుఖదం దుఃఖనాశనమ్‌. 9

దుఃఖదాని చ కార్యాణి త్యాజ్యాని దూరతో బుధైః | సుఖదాని చ సేవ్యాని శాస్త్రతత్త్వవిశారదైః. 10

చతురా%సి పికాలాపే పశ్య శుంభబలం మహత్‌ | ప్రత్యక్షం సుసంఘానాం మర్దనేన మహోదయమ్‌. 11

ప్రత్యక్షం చ పరిత్యజ్య వృథైవానుమితః కిల | సందేహసహితే కార్యేన విపశ్చి త్ర్పవర్తతే. 12

శత్రుః సురాణాం పరమః శుంభః సమరదుర్జయః | తస్మా త్త్వాం ప్రేరయంత్యత్ర దేవా దైత్యేన పీడితాః. 13

ఇరువది ఆరవ అధ్యాయము

శ్రీకాళికాదేవి చండ ముండులను హతమార్చుట

అట్లు శుంభ నానతి బడసి చండ ముండులు గొప్ప సేనతో రణభూమి కేగిరి. ఆ మహావీరులు దేవహితకారిణియగు దేవిని గాంచి సామ వచనములతో నామె కిట్లనిరి : బాలా ! శుంభ నిశుంభులు దేవతల మదమడచి విజయగర్వమున నుండుట నీ వెఱుగవా యేమి? నితంబినీ! నీకు దుర్బుద్ధి పుట్టినది. కానిచో నీవు సింహమును కాళిని మాత్రము తోడు తీసికొని శుంభనోడించుట కేల వత్తువు? నీకు మంచిబుద్ధి గఱపు పురుషుడుగాని స్త్రీకాని లేరా? దేవతలు నీ చావు కాంక్షించి నిన్ను రణమునకు పురికొల్పి పంపిరి. లతాంగీ! నీ బలము పరులబలము బాగుగ నెఱుగుము. పదునెనిమిది భుజములున్నవి కదా యని వట్టిగ గర్వింతు వేల? నీ యీ యాయుధములు భుజములు వట్టి శ్రమ కల్గించునవి మాత్రమే. శుంభుడు సురవిజేత-సమర చతురుడు. అతనిముం దివి యన్నియు వ్యర్థములే. శుంభు డైరావతపు తొండమును ఛేదించెను. గజములను చెండాడెను. దేవాంతకుడు. నీవతని మనోరథ మీడేర్చుము. విశాలాక్షీ! నా మంచిమాట కొంచెము వినుము. నీకు దుఃఖములు తొలగి సుఖములు గల్గునట్టి హితము చెప్పుచున్నాను. తత్త్వశాస్త్రవిదులు దుఃఖప్రదములగు పనులు వదలుదురు. సుఖకరము లొనరింతురు. సుమధురభాషిణీ! నీవు లలిత చతురపు. శుంభుడు సురల మదమడచి వర్ధిల్లెను. నీవతని బలమును ప్రత్యక్షముగ గనుము. ఇట్టి ప్రత్యక్ష విషయము వదలి యనుమానము నేల నమ్ముదువు? పండితులు సందేహ విషయ కార్యములు నమ్మరు సుమా! శుంభుడు సమరదుర్జయుడు. సురవైరి. కనుక దైత్య పీడితులగు దేవతలు నిన్నతనిపైకి ప్రేరించి పంపిరి.

తస్మాత్త ద్వచనైః స్నిగ్దైర్వచింతా%సి శుచస్మితే | దుఃఖాయ తవ దేవానాం శిక్షా స్వార్థస్య సాధికా. 14

కార్యమిత్రం పరిక్షిప్య ధర్మమిత్రం సమాశ్రయేత్‌ | దేవాః స్వార్థపరాః కామం త్వామహం సత్యమబ్రువమ్‌. 15

భజ శుంభం సురేశానం జేతారం భువనేశ్వరమ్‌ | చతురం సుందరం శూరం కామశాస్త్రవిశారదమ్‌. 16

ఐశ్వర్యం సర్వోలోకానాం ప్రాప్స్యసే శుంభశాసనాత్‌ | నిశ్చియం పరమం కృత్వా భర్తారం భజశోభనమ్‌. 17

ఇతి తస్య వచః శ్రుత్వా చండస్య జగదంబికా | మేఘ గంభీర నినదం జగర్జపునబ్రవీత్‌. 18

గచ్ఛ జాల్మ మృషా కిం త్వం భాషసే వచకం వచః | త్యక్త్వా హరిహరాదీం శ్చ శుంభం కస్మాద్భజే పతిమ్‌. 19

న మే కశ్చి త్పతి: కార్యో న కార్యం పతినాసహ | స్వామినీ సర్వభూతానా మహమేవ నిశామయ. 20

శుంభా మే బహవో దృష్టా నిశుంభాశ్చ సహస్రశః | ఘాతితా శ్చ మయా పూర్వం శతశో దైత్య దానవాః. 21

మమాగ్రే దేవబృందాని వినష్టాని యుగేయుగే | నాశం యాస్యంతి దైత్యానాం యూథాని పునరద్యవై. 22

కాల ఏవాగతో%స్త్యత్ర దైత్యసంహారకారకః | వృథా త్వం కురుషే యత్నం రక్షణాయాత్మసంతతేః. 23

కురు యుద్ధం వీరధర్మరక్షాయై త్వం మహామతే | మరణం భావి దుస్త్యాజం యశో రక్ష్యం మహాత్మభిః. 24

కిం తే కార్యం నిశుంభేన శుంభేన చ దురాత్మనా | వీరధర్మం పరం ప్రాప్య గచ్ఛ స్వర్గం సురాలయమ్‌. 25

శుంభో నిశుంభ శ్చైవాన్యే యే చాత్ర తవ బాంధవాః | సర్వే తవానుగాః పశ్చా దాగమిష్యంతి సాంప్రతమ్‌. 26

వారి తీయని మాటలకు నీవు మోసపోతివి. వారు తమ స్వార్థము గోరి నీకు దుఃఖప్రదమగు నుపదేశము చేసిరి. కార్యవశమున గలసిన మిత్రుని నమ్మరాదు. ధర్మకారణమున గలిసిన మిత్రు నాశ్రయింప వలయును. సురలు స్వార్థపరులని నీతో నిజము పలుకుచున్నాను. నీవు కామశాస్త్ర పండితుడు - వీరుడు-చతురుడు-అందగాడు-సురలను భువనములను గెల్చినవాడునగు శుంభుని సేవింపుము. నీవు శుంభుని శాసనము క్రింద నున్నచో నెల్లలోకముల సంపద లనుభవింపగలవు. కాన శుభకరుడగు శుంభుని పతిగ నిశ్చయించుకొనుము అను చండుని మాటలు విని జగదంబ మేఘ గంభీర వాక్కులతో నతని కిట్లనియెను: ఓరీ పలువా! ఇంక నీ మోసపు మాటలు కట్టిపెట్టుము. వచ్చిన దారి పట్టుము. హరి హరాదులను వదలి శుంభుని పతిగ నెట్లు వరింతును? మూర్ఖా! నాకు పతితో బనిలేదు. ఒకనిని పతిగ జేసికొను నావశ్యకత నాకంతకంటెను లేదు. ఈ సర్వభూతములకు నేను స్వామినిని. మున్ను పెక్కువేల శుంభ నిశుంభులు నసంఖ్యాకులగు దానవులును నా చేతిలో మడిసిరి. యుగయుగమున దేవతలకు క్లేశములు ప్రాప్తించుట గంటిని. ఇపుడెందఱో దైత్యదానవులు నాశము కానున్నారు. ఇపుడు దానవులకు పోగాలము దాపురించినది. ఇక వారి రక్షణోపాయములు చేయనేల? నీవు వీరధర్మము గాపాడుటకు యుద్ధమొనర్పుము. నీకిపుడు చావు మూడినది. దీని నెవరు నాపలేరు. మహాత్ముల కీర్తి ప్రతిష్ఠలు రక్షించుట ముఖ్య కర్తవ్యము. నీకు దుష్టులగు శుంభ నిశుంభులతో నేమిపని? వీర మరణ మొంది స్వర్గసుఖములందుము. నీ తక్కిన బందుగులు శుంభ నిశుంభులు నిపుడే నిన్ను వెంటనంటి రాగలరు.

క్రమశః సర్వదైత్యానాం రిష్యా మ్యద్య సంక్షయమ్‌ | విషాదం త్యజ మందాత్మ న్కురు యుద్ధం విశాంపతే. 27

త్వా మహం నిషానిష్యామి భ్రాతరం తవ సాంత్రమ్‌ | తతః శుంభం నిశుంభం చ రక్తబీజం మదోత్కటమ్‌. 28

అన్యాం శ్చ దానవా న్సర్వా న్హత్వాహం సమరాంగణ | గమిష్యామి యథాస్థానం తిష్ఠ వా గచ్ఛవాద్రుతమ్‌. 29

గృహాణాస్త్రం వృథా పుష్ట కురుయుద్ధం మయా%ధునా | కిం జల్పసి మృషావాక్యం సర్వథా కాతరప్రియమ్‌. 30

తయేత్థం ప్రేరితౌ దైత్యౌ చండముండౌ క్రుధా%న్వితౌ | జ్యాశబ్దం తరసా ఘోరం చక్రతు ర్బల దర్పితౌ. 31

సా%పి శంఖస్వనం చక్రే పూరయంతీ దిశోదశ | సింహో%పి కుపిత స్తావ న్నాదం సమకరో ద్బలీ. 32

తే నాదేన శక్రాద్యా జహర్షు రమరా స్తదా | మునయో యక్షగంధర్వాః సిద్ధాః సాధ్యాశ్చ కిన్నరాః. 33

యుద్ధం పరస్పరం తత్ర జాతం కాతర ఖీతిదమ్‌ | చండికా చండయో స్తీవ్రం బాణఖడ్గ గదాదిభింః 34

చండముక్తాన్‌ శరాన్దేవీ చిచ్ఛేద నిశితైః శ##రైః | ముమోచ పునరుగ్రా సా చండికా పన్నగానివ. 35

గగనం ఛాదితం తత్ర సంగ్రామే విశిఖై స్తదా | శలభై రివ మేఘాంతే కర్షకాణాం భయప్రదైః. 36

ముండో%పి సైనికైః సార్ధం పపాత తరసా రణ | ముమోచ బాణవృష్టిం వై క్రుద్ధః పరమదారుణః. 37

బాణజాలం మహద్దృష్ట్వా క్రుద్ధా తత్రాంబికా భృశమ్‌ | కోపేన వదనం తస్యా బభూవ ఘన సన్నిభమ్‌. 38

కదళీపుష్పనేత్రం చ భ్రుకుటీకుటిలం తదా | నిష్ర్కాంతా చ తదా కాళీ లలాటఫలకాద్ధ్రుతమ్‌. 39

మూఢాత్మా! నేడు సకల దానవత్వమును మంటగలుపుదును. పిమ్మట రక్తబీజుని మదగర్వితులగు శుంభ నిశుంభులను హతమార్తును. మిగిలిన దానవులనెల్ల నంతమొందించి నా స్వస్థానమున కేగగలను. నీకు గుండెబలమున్న నిలుము. లేదా కాలికి బుద్ధిచెప్పుము. పిరికివానివలె పొగరుబోతు మాటలు ప్రేలుటేల? బాగుగ క్రొవ్వుబలిసి యున్నావు. శక్తియున్న నస్త్రము బట్టి నాతో కయ్యమును కాలుదువ్వుము, అని యిట్లు దేవ నాయికచే చండ ముండులు రెచ్చగొట్టబడిరి. వారు కోప మదగర్వములు ముప్పిరిగొనగ వేగ భీకరముగ నారి సారించిరి. శివశక్తియు నంతట దిక్కులు పిక్కటిల్లగ విజయశంఖము పూరించెను. సింహము సైతము మహాక్రోధముతో గుండెలదర గర్జించెను. ఆ సింహనాదమున కింద్రాది దేవతలు - యక్ష-గంధర్వ-కిన్నర-సిద్ధ-సాధ్యులును పరమ హర్షమున పులకిత హృదయులైరి. అంత పిరికి గుండెలు అదురునట్లుగ చండికా చండుల మధ్య బాణ-ఖడ్గ-గదాదులతో భీకర సమరము జరిగెను. దైత్యనిఘాదిని యగు దేవి మహోగ్రమూర్తియై చండుడు వదలిన బాణములను తన కఱకుటమ్ములతో దునుమాడెను. ఆమె తిరిగి వానిపై పాముల వంటి బాణములు ప్రయోగించెను. మిడుతల దండు కృషకులకు వెఱపుగొల్పుచు మేఘములను గప్పివేయును. అట్లే వారి బాణ పరంపరలచేత నింగి యంతయును గప్పబడెను. అంతలో ముండుడు సైతము కొంతసేన వెంటగొని యనిలో దుమికి దారుణ కోపముతో బాణము లేసెను. ఆ బాణ పరంపర గనినంతనే యంబికకు పట్టరాని కోపము వచ్చెను. ఆమె ముఖము కోపముచే మేఘమువలె నల్లనయ్యెను. వెంటనే యనటిపూవువలె నెఱ్ఱని నేత్రములు వంపుసొంపులు దిరిగిన కనుబొమలుగల దేవి నెన్నుదుటినుండి మహాద్భుతముగ శ్రీకాళికాదేవి యుద్భవిల్లెను.

వ్యాఘ్ర చర్మాంబరా క్రూరా గజచర్మోత్తరీయకా | ముండమాలాధరా ఘోరా శుష్కవాపీసమోదరా. 40

ఖడ్గపాశధరా%తీవ భీషణా భయదాయినీ | ఖట్వాంగధారిణీ రౌద్రా కాళరాత్రి రివాపరా. 41

విస్తీర్ణవదనా జిహ్వం చాలయంతీ ముహుర్ముహుః | విస్తార జఘనా వేగా జ్జఘాన సురసైనికాన్‌. 42

కరే కృత్వా మహావీరాం స్తరసా సా రుషాన్వితా | ముఖే చిక్షేప దైతేయా న్పిపేష దశ##నైః శ##నైః 43

గజా సంటాన్వితాన్‌ హస్తే గృహీత్వా నిధదౌ ముఖే | సారోహాన్‌ భక్షయిత్వా%జౌ సా%ట్టహాసం చకార హ. 44

తథైవ తురగా నుష్ట్రాం స్తథా సారథిభిః సహ | నిక్షిప్య వక్త్రే దశ##నై శ్చర్వయంత్యతి భైరవమ్‌. 45

హన్యమానం బలం ప్రేక్ష్య చండముండౌ మహాసురౌ | చాదయామాసతు ర్దేవీం బాణా%%సారైరనంతరైః. 46

చండ శ్చండకరచ్ఛాయం చక్రం చక్రధరాయుధమ్‌ | చిక్షేప తరసా దేవీం ననాద చ ముముర్ముహుః. 47

నదంతం వీక్ష్య తం కాళీ రథాంగం చ రవిప్రభమ్‌ | బాణ నైకేన చిచ్ఛేద సుప్రభం తత్సుదర్శనమ్‌. 48

తం జఘాన శ##రై స్తీక్షైశ్చండం చండీ శిలాశితైః | మూర్చితో%సౌ పపాతోర్వ్యాం దేవీ బాణార్దితో భృశమ్‌. 49

పతితం భ్రాతరం వీక్ష్య ముండో దుఃఖార్దిత స్తదా | చకార శరవృష్టిం చ కాళికోపరి కోపతః 50

చండికా ముండనిర్ముక్తాం శరవృష్టిం సుదారుణామ్‌ | ఈషికాసై#్త్రర్బలాన్ముక్తైశ్చకార తిలశః క్షణాత్‌. 51

అర్ధ చంద్రేణ బాణన తాడయామాస తం పునః | పతితో%సౌ మహావీర్యో మేదిన్యాం మదవర్జితః. 52

ఆ లోక భయంకర - భీషణ యగు కాళి పులితోలు ధరించి గజచర్మ ముత్తరీయముగ దాల్చి పుర్రెలమాలలు మెడలో నలంకరించుకొని యెండిన బావివంటి పొట్టతో మహాఘోరముగ చెన్నొందెను. ఆమె ఖడ్గ-ప్రాస-ఖట్వాంగములు ధరించి మహాకాళరాత్రివలె క్రూరరౌద్రముగ భీకరలీల దనరెను. ఆ కాళిక తన పెద్ద నోరు తెరచుకొని పొడవైన నాలుకును పల్మారు ఆడించుచు దనుజసేనల నెల్ల సత్వరమే చంపబూనుకొనెను. ఆమె జఘన మతివిశాలముగ నుండెను ఆ భీకరమూర్తి పటురోషముతో పెక్కురు దైత్యులను లీలగ పట్టి నోటబెట్టుకొని పటపటపట పండ్లతో కొఱుకుచుండెను. ఆ మహోగ్రరూప ఘలుఘల్లుమని గంటలుగల గజముల నవలీలగ చేతబట్టుకొని నోట పెట్టుకొనుచుండెను. ఆ దేవి మావటీండ్రతో నొప్పు నేనుగులను మ్రింగి వికటాట్టహాస మొనరించెను. ఈ విధముగ యుద్ధమందు శ్రీ భద్రకాలి మహాభీకరముగ నొంటెలను గుఱ్ఱములను సారథులను పండ్లతో కఱ కఱ నమలి వేయుచు పొట్టబెట్టకొనుచుండెను. చండ ముండ మహాసురులు అట్లు తమ బలము నశించుటగని యెడతెగని బాణవర్షముతో దేవిని గప్పివేసిరి. అంత చండుడు చండరశ్మితేజము గల్గి చక్రాయుధములను బోలు చక్రమును వేగమే దేవిపై విసిరివేసి పలుమారులు బొబ్బరిల్లెను. కాళికాదేవి వాని పెడబొబ్బలు విని వెల్గులు చిమ్ముచు సుదర్శనమువంటి చక్రము తనపైకి వచ్చుటగాంచి దాన నొక యమ్ముతో తునుకలు చేసివైచెను. అంతలో చండిక వాడి విశిఖములతో చండుని బాధింపగ వా డా దెబ్బలకు తట్టుకొనలేక నేలపై మూర్ఛిల్లెను. అట్లు తన యన్న పడిపోవుట గనిన ముండుడు దుఃఃంచి కినుకతో కాళికపై ములుకులు ఏసెను. అంతట చండిక యీషికాస్త్రములతో ముండుడు వదలిన దారుణ బాణములను ముక్కలు ముక్కలుగ జేసెను. ఆమె పిదప నర్ధచంద్రాకారము ప్రయోగింపగ దాని ధాటికాగలేక వాని మద మంతయు నుడిగిపోయెను. వాడు తుదకు నేలగూలెను.

హాహాకారో మహానాశీ ద్దానవానాం బలే తదా | జహర్షు రమరాః సర్వే గగనస్థా గతవ్యథాః. 53

విహాయ మూర్చాం చండ స్తు సంగృహ్య మహాతీంగదామ్‌ | తరసా తాయామాస కాళికాం దక్షిణ భుజే. 54

వంచయిత్వా గదాఘాతం తం బబంధ మహాసురమ్‌ | తరసా బాణపాతేన మంత్రముక్తేన కాళికా 55

ఉత్థిత స్తు తదా ముండో బద్ధం దృష్ట్వా%నుజం బలాత్‌ | ఆజగామ సుసన్నద్ధః శక్తిం కృత్వా కరే దృఢామ్‌. 56

ఆగచ్ఛంతం తదా కాళీ దానవం వీక్ష్య సత్వరమ్‌ | బబంధ తరసా తం తు ద్వితీయం భ్రాతరం భృశమ్‌. 57

గృహీత్వా తౌ మహావీర్యౌ చండముండౌ శశా వివ | కుర్వతీ విపులం హాస మాజగామాంబికాం ప్రతి. 58

ఆగత్య తా మథోవాచ గృహాణమౌ వశూ ప్రియే | రణయజ్ఞార్థ మానీతౌ దానవౌ రణ దుర్జ¸°. 59

తా వానీతౌ తదా వీక్ష్య చండికాం తౌ వృకావివ | అంబికా కాళికాం ప్రాహ మాధురీసంయుతం వచః. 60

వధం మా కురు మా ముంచ చతురా%సి రణప్రియే | దేవానాం కార్యసంసిద్ధిః కర్తవ్యా తరసా త్వయా. 61

ఇతి తస్యా వచః శ్రుత్వా కాళికా ప్రాహ తాం పునః | యుద్ధయజ్ఞే%తి విఖ్యాతే ఖడ్గయూపే ప్రతిష్ఠితే. 62

ఆలంభం చ కరిష్యామి యథా హింసా న జాయతే | ఇత్యుక్త్వా సా తదా దేవీ ఖడ్గేన శిరసీ తయోః. 63

చకర్త తరసా కాళీ పపౌ చ రుధిరం ముదా | ఏవం దైత్యౌ హతౌ దృష్ట్వా ముదితోవాచ చాంబికా. 64

కృతం కార్యం సురాణాం తే దదామ్యద్య వరం శుభమ్‌ | చండ ముండౌ హతౌ యస్మా త్తస్మాత్తే నామ కాళికే 65

చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే |

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే చండముండవధే షడ్విం%శోధ్యాయః

అంత దానవ సేవలో హాహాకారములు మిన్నుముట్టెను. నింగిని వెలుగు దేవతలు దిగులుమాని పరమానందమందిరి. అంతలో చండుడు తెప్పరిల్లుకొని పెద్ద గదకొని కాళి కుడిభుజముపై విసరివేసెను. కాళికాదేవి వాని గదాఘాతము వమ్మొనరించి మంత్రించిన బాణపాశమున నా మహాసురుని గట్టివేసెను. పిదప ముండుడు లేచి తన యన్న బంధింపబడుట గని కవచము ధరించి చేత శక్తి బూని బయలుదేరెను. ఆ వచ్చెడు రెండవ దానవుని గాంచి కాళిక వానిని సైతము వెంటనే బంధించి వేసెను. శ్రీభద్రకాళి చండముండులనట్లు కుందేలు పిల్లలనువలె పట్టుకొని పకపక నవ్వుచు జగదంబ సన్నిధికేగెను' జగదంబికా! రణయాగమునకు రణ దుర్జయులగు దానవ పశువులను గొనితెచ్చితిని. గైకొను'మని ఆమె జగదంబతో పలికెను. కాళిక తెచ్చిన తోడేళ్ళవంటి దానవులను చూచి జగన్మాత మధుర వచనములతో రణప్రియులారా! వీరిని వదలక వధింపుము. వేగముగ సురల కార్యము నెరవేర్పుము' అని కాళికతో పలికెను. సర్వతంత్రేశ్వరియగు దేవి పలుకులు విని యామెతో మరల రణయాగమున ఖడ్గము యూపస్తంభముగ పేరొందెను. వారినిట చంపుట హింస కానేరదు' అని పలికి శీఘ్రమే ఖడ్గముతో వారి తలలు తెగనఱకెను. అట్లు శ్రీకాలీదేవి వారిని ఖండించి సంతోషముతో వారి నెత్తురు గ్రోలెను. ఇట్లు చండ ముండులు చచ్చుటగని సర్వలోకేశ్వరి యగు దేవి కాళికకు ఓ భద్రకాళీ! నీవు చండముండులను హతమార్చితివి. దేవకార్యము నెరవేర్చితివి. కాన నీవు భూతలమందు చాముండయను పేర ప్రఖ్యాతి జెందగలవు అని వరము నిచ్చెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీ కాళిక చండముండులను సంహరించుటయను నిరువదారవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters