Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టావింశో%ధ్యాయః

కృత్వా హాసం తతో దేవీ తమువాచ విశాంపతే | మేఘగంభీరయా వాచా యుక్తియుక్తమిదం వచః. 1

పూర్వమేవ మయాప్రోక్తం మందాత్మ న్కిం వికత్థసే | దూతస్యాగ్రే యథాయోగ్యం వచనం హితసంయుతమ్‌. 2

సదృశో మమ రూపేణ బలేన విభ##వేన చ | త్రిలోక్యాం యది కో%పి స్యాత్తం పతిం ప్రవృణోమ్యహమ్‌. 3

బ్రూహి శుంభం నిశుంభం చ ప్రతిజ్ఞా మే పురా కృతా | తస్మా ద్యుధ్యస్వ జిత్వా మాం వివాహం విధివ త్కురు. 4

త్వం వై తదాజ్ఞయా ప్రాప్త స్తస్య కార్యామర్థసిద్ధయే | సంగ్రామం కురు పాతాళం గచ్ఛ వా పతినా సహ. 5

తచ్ఛ్రుత్వా వచనం దేవ్యాః స దైత్యో%మర్షపూరితః | ముమోచ తరసా బాణా న్సింహస్యోపరి దారుణాన్‌. 6

అంబికా తాన్‌ శరాన్వీక్ష్య గగనే పన్నగోపమాన్‌ | చిచ్ఛేద సాయకై స్తీక్షైర్లఘుహస్తతయా క్షణాత్‌. 7

అన్యై ర్జఘాన విశిఖై రక్తబీజం మహాసురమ్‌ | అంబికాచాప నిర్ముకైః కర్ణాకృష్టైః శిలావితైః. 8

దేవీబాణహతః పాపో మూర్ఛామాస రథోపరి | పతితే రక్తబీజే తు హాహాకారో మహా నభూత్‌. 9

సైనికా శ్చుక్రుశుః సర్వే హతాః స్మఇతి చాబ్రువన్‌ | తతో బుంబారవం శ్రుత్వా శుంభః పరమదారుణమ్‌. 10

ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానా మాదిదేశ హ | నిర్యాంతు దానవాః సర్వే కాంభోజాః స్వబలైర్వృతాః. 11

అన్యేప్యతిబలాః శూరాః కాలకేయా విశేషతః | ఇత్యాజ్ఞప్తం బలం సర్వం శుంభేన చ చతుర్విధమ్‌. 12

నిర్జగామ మదావిష్టం దేవీ సమరమండలే | తమాగతం సమాలోక్య చండికా దానవం బలమ్‌. 13

ఇరువదియెనిమిదవ యధ్యాయము

శ్రీదేవి కితర దేవతలు తోడుపడుట

శ్రీదేవీ రక్తబీజుని మాటలకు నవ్వి మేఘ గంభీర రావముతో యుక్తి యుక్తముగ నిట్లు పలికెను : మూఢాత్మా! గొప్పలేల చెప్పుకొందువు? నేను ముందుగనే దూతతో తగిన మంచిమాటలన్నియు చెప్పిపంపితిని గదా! నేనీ ముల్లోకములలో రూప బలసంపదలలో నాకీడుజోడైన వానిని వరింపగలను. నేను శుంభనిశుంభులతో ముందే శపథము చేసితిని. కనుక నాతో బోరుసల్పి గెల్చి నన్ను పెండ్లిచేసికొమ్మనుము. నీవతని పనిమీద నతని యానతో వచ్చితివి. నీకు శక్తియున్న నాతో పోరుము లేదా నీ పతిని గూడి పాతాళ##మేగుము. దేవిమాటలు వినిన దానవుడు రోషముతో ఆమెపై దారుణ బాణములు ప్రయోగించెను. అతని బాణములు నింగిపై పాములవలె వచ్చుచుండెను. అంబిక వానినెల్ల తన హస్త లాఘవముతో క్షణమాత్రన తుత్తునియలు చేసెను. రుద్రరూపిణి యగు దేవి చెవిదాక చాపములాగి యినుపములుకుల శరములచే రక్తబీజుని నొప్పించెను. దేవి బాణఘాతమున కా పాపాత్ముడు రథముపై మూర్ఛిల్లెను. వాడు పడగనే సేనలో కలకలము బయలుదేరెను. సైనికులు చచ్చితిమని కేకలు వేసిరి. వారి కఠినమైన యేడ్పు గోల శుంభుని చెవుల బడెను. దానవ సేనలను పురికొల్పుచు కాంభోజగణము - కాలకేయాది శూరుల బలము - దానవులెల్లరు యుద్ధమునకు బయలుదేరుడు అని శుంభుడు తన చతురంగబలము నాజ్ఞాపించెను. వారెల్లరును కండకావరముతో శ్రీదేవి చెంతకేగిరి. చండిక తనచెంత కేతెంచు దానవ సేనలను గాంచెను.

ఘంటానాదం చకారాశు భయదం ముహుః | జ్యాస్వనం శంభనాదం చ చకార జగదంబికా. 14

తేన నాదేన సా జాతా కాళీ విస్తారితాననా | శ్రుత్వా తన్నినదం ఘోరం సింహో దేవ్యాశ్చవాహనమ్‌. 15

జగర్జ సో%పి బలవాన్‌ జనయన్బల మద్భుతమ్‌ | తన్నినాద ముపశ్రుత్య దానవాః క్రోధమూర్ఛితాః. 16

సర్వే చిక్షిపు రస్త్రాణి దేవీం ప్రతి మహాబలాః | తస్మి న్నేవాయతే యుద్ధే దారుణ లోమహర్షణ. 17

బ్రహ్మాదీనాం చ దేవానాం శక్తయ శ్చండికాం యయుః | యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనమ్‌. 18

తాదృగ్రూపా స్తదా దేవ్యః ప్రయయః సమరాంగణ | బ్రహ్మాణీ వరటారూఢా సాక్షసూత్రకమండలుః. 19

ఆగతా బ్రహ్మణః శక్తి ర్ర్బహ్మాణీతి ప్రతిశ్రుతా | వైష్ణవీ గరుడారూఢా శంఖచక్రగదాధరా. 20

పద్మహస్తా సమాయాతా పీతాంబరవిభూషితా | శాంకరీ తు వృషారూఢా త్రిశూలవర ధారిణీ. 21

అర్ధచంద్రధరా దేవీ తథా%హివలయా శివా | కౌమారీ శిఃసంరూఢా శక్తిహస్తా వరాననా. 22

యుద్ధకామా సమాయాతా కార్తికేయ స్వరూపిణీ | ఇంద్రాణీ సుష్ఠువదనా సుశ్వేతగజవాహనా. 23

వజ్రహస్తా%తిరోషాఢ్యా సంగ్రామాభిముఖీ య¸° | వారాహీ సూకరాకారా ప్రౌఢప్రేతాసనా%%గతా. 24

నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపుః | యామ్యా చ మహిషారూఢా దండహస్తా భయప్రదా. 25

సమాయాతా%థ సంగ్రామే యమరూపా శుచిస్మితా |

అపుడు జగదంబ భీషణ ఘంటాశంఖధ్వని చేసి నారి సారించెను. కాళికయును తన పెద్దనోరు తెఱచి యఱచెను. ఆ ధ్వని శ్రీదేవి యొనర్చిన ధ్వనివలె భీకరముగ నుండెను. ఆ ఘోర ధ్వనులను విని సింహము తాను గూడ భయంకరముగ గర్జించెను. దానవులా గర్జాధ్వని విని భయాద్భుతము లొందిరి. వారు కోపముతో మూర్ఛిల్లిరి. అంత వారితో మహాబలులందఱు నొక్కుమ్మడిగ దేవిపై తూపులేసిరి. అపుడు వారి నడుమ భీకర దారుణ సమరము సంఘటిల్లెను. బ్రహ్మాది దేవతలలోని శక్తులన్నియు నొక్క పెట్టుగ జగదంబను చేరెను. ఏ దేవత రూపభూషణము లెట్టివో అట్టివి కలవారై దేవతలు సంగ్రామాంగణమునకు రాజొచ్చిరి. వారిలో బ్రహ్మశక్తి సూత్రము - అక్షకమండలువులు దాల్చి హంసి నెక్కి వచ్చెను. ఆమె బ్రహ్మాణియను నామమున ప్రసిద్ధిగాంచెను. శ్రీ వైష్ణవశక్తి పీతాంబరముగట్టి శంఖ చక్ర గదా పద్మములు ధరించి వెల్గులు జిమ్ముచు గరుడ వాహనమెక్కి వచ్చెను. శాంకరీ దేవి వృష వాహనయై త్రిశూలము ధరించి యుండెను. ఆ దేవి నెన్నొసట చంద్రరేఖ వెల్గుచుండెను. చేతులకు సర్పవలయములు శోభించుచుండెను. శ్రీ షష్ఠీదేవి నెమలి వాహనమెక్కి చేత శక్తి దాల్చి యుద్ధము చేయు కోరికతో కౌమారీ రూపమున వచ్చెను. సుముఃయగు నింద్రాణీదేవి యైరావతమెక్కి చేత వజ్రము ధరించి పటురోషముతో రణరంగమున దుమికెను. శ్రీవారాహీ దేవి ప్రేతాసనయై వరాహరూపముతో వచ్చెను. శ్రీ నరసింహ రూపముగొని శ్రీ నారసింహీ దేవి వచ్చెను. యామ్యాదేవి మహిష వాహనారూఢయై దండధారిణయై భయంకరముగ నవ్వుచు యమరూపముతో రణస్థలి కేతెంచెను.

తథైవ వారుణీ శక్తిః కౌబేరీ చ మదోత్కటా. 26

ఏవం విధా స్తథా%%కారా యయుః స్వస్వబలైర్యృతాః | ఆగతా స్తాః సమాలోక్య దేవీ ముదమవాప చ. 27

స్వస్థా ముముదిరే దేవా దైత్యా శ్చ భయ మాయయుః | తాభిఃపరివృత స్తత్ర శంకరో లోక శంకరః. 28

సమాగమ్య చ సంగ్రామే చండికా మిత్యువాచ హ | హన్యంతా మసురాః శీఘ్రం దేవానాం కార్య సిద్ధయే. 29

నిశుంభం చైవ శుంభం చ యే చాన్యే దానవాఃస్థితా | హత్వా దైత్య బలం సర్వం కృత్వా చ నిర్భయం జగత్‌. 30

స్వాని స్వాని చ ధిష్ణ్యాని సమాగచ్ఛంతు శక్తయః | దేవా యజ్ఞభుజః సంతు బ్రాహ్మణా యజనేరతాః. 31

ప్రాణినః సంతు సంతుష్టాః సర్వే స్థావరజంగమాః | శమం యాంతు తథోత్పాతా ఈతయశ్చ తథా పునః. 32

ఘనాః కాలే ప్రవర్షంతు కృషి ర్బహుఫలా తథా | ఏవం బ్రువతి దేవేశే శంకరే లోక శంకరే. 33

చండికాయాః శరీరాత్తు నిర్గతా శక్తి రుద్భుతా | భీషణా%తి ప్రచండా చ శివాశతనినాదినీ. 34

ఘోరరూపా%థ పంచాస్య మిత్యువాచ స్మితాననా | దేవ దేవ వ్రజాశు త్వం దైత్యానామధిపం ప్రతి. 35

దూతత్వం కురు కామారే బ్రూహి శుంభం స్మరాకులమ్‌ | నిశుంభం చ మదోత్సిక్తం వచనా న్మమ శంకర. 36

ముక్త్వా త్రివిష్టపం యాత యూయం పాతాళ మాశువై | దేవాః సర్వే సుఖం యాంతు తురాషాట్‌ స్వాసనం శుభమ్‌. 37

ప్రాప్నోతు త్రిదివం స్థానం యజ్ఞభాగం శ్చ దేవతాః |

శ్రీ వారుణీ కౌబేరీ శక్తులును రణమునకు వచ్చిరి. అటులే తక్కిన దేవతలును రూపు దాల్చిన కోపములవలె తమతమ రూపబల సంపదలతో విజయము చేసిరి. వారి నెల్లరినిగాంచి శ్రీదేవి పరమానంద భరితురాలయ్యెను. ఆ సమయమున దేవత లెల్లరును స్వస్థులై ప్రమోద మందిరి. దానవులు భయకంపితులైరి. అచ్చోటి కంతలో లోకశంకరుడగు శంకరుడు పరమ శివుడు దేవతలను వెంటగొని యుద్ధభూమి కేతెంచి శ్రీ చండికతో నీవు దేవతల కార్యసిద్ధికై వెంటనే దానవులను రూపుమాపుము. శుంభనిశుంభులను తక్కిన రక్కసులను చక్కడంచుము. దానవ బలమును నిర్మూలించి విశ్వమును భయరహితముగ చేయుము. ఆ పిదప నెల్ల శక్తులును తమ తమ వాసముల కరుగ వలయును. మరల పూర్వమువలె దేవతలు హవిర్భుజులగుదురుగాక! భూమి దేవతలు యాగనిరతులగుదురు గాత! ఈ చరాచర ప్రాణులెల్లరు సంతుష్టులగు గాక! ఈతి బాధలుత్పాతములుపశమించుగాక! మేఘములు సకాలమున వర్షించుగాక! పైరు పచ్చని పొలములు పంటలతో నుండుగాక! అని వచించెను. అంతట శ్రీ చండికాదేవి శరీరమునుండి యొక మహాద్భుత దివ్యశక్తి ప్రాదుర్భవించెను. ఆమె మహాభీషణముగ ప్రచండముగ నూఱు ఆడునక్కలంతగ భయంకర ధ్వని చేయుచు ఘోరరూపమున తేజరిల్లెను. ఆమె మందహాసము చిందులాడగ శివునితో నిట్లు పలికెను : దేవ దేవా! నీవు దానవపతి చెంతకేగి దౌత్యము నెఱపుము. నా మాటలుగ మదాంధులగు శుంభనిశుంభులతో నిట్లనుము. 'మీరు స్వర్గము వీడి వేగపాతాళ మేగుడు. ఇంద్రుడింద్రాసనమున సురలు స్వర్గసీమలో మరల స్వస్థులగుదురుగాక! వారు మరల యాగభాగము లనుభవింతురుగాక!

జీవితేచ్ఛా చ యుష్మాకం యది స్యాత్తు మహత్తరా. 38

తర్హి గచ్ఛత పాతాళం తరసా యత్ర దానవాః | అథవా బల మాస్థాయ యుద్ధేచ్ఛా మరణాయ చేత్‌. 39

తదా%%గచ్ఛంతు తృప్యంతు మచ్ఛివాః పిశితేన వః | తుచ్ఛ్రుత్వా వచనం తస్యాః శూల పాణి స్త్వరాన్వితః. 40

గత్వా%%హ దైత్యరాజానం శుంభం సదసి సంస్థితమ్‌ | రాజన్దూతో%హ మంబాయాస్త్రిపురాంతకరో హరః. 41

త్వత్సకాశ మిహాయాతో హితం కర్తుం తవాఃలమ్‌ | త్యక్త్వా స్వర్గం తథా భూమి యూయం గచ్ఛత సత్వరమ్‌. 42

పాతాళం యత్ర ప్రహ్లాదో బలిశ్చ బలినాం వరః | అథవా మరణచ్ఛా చేత్తర్హ్యాగచ్ఛత సత్వరమ్‌. 43

సంగ్రామే వో హనిష్యామి సర్వానేవాహ మాశువై | ఇత్యువాచ మహారాజ్ఞీ యుష్మత్కల్యాణ హేతవే. 44

ఇతి దైత్యవరా న్దేవీవాక్యం పీయూషసన్నిభమ్‌ | హితకృ చ్ఛ్రావయిత్వా స ప్రత్యాయాత శ్చ శూలభృత్‌. 45

యయా%సౌ ప్రేరితః శంభుర్దూతత్వే దాన వాన్ర్పతి | శివదూతీతి విఖ్యాతా జాతా త్రిభు వనేః%లే. 46

తే%పి శ్రుత్వా వచో దేవ్యాః శంకరోక్తం తు దుష్కరమ్‌ | యుద్ధాయ నిర్యయుః శీఘ్రం దంశితాః శస్త్రపాణయం. 47

తరసా రణమాగత్య చండికాం ప్రతి దానవాః | నిర్జఘ్ను శ్చ శ##రై స్తీ క్షైః కర్ణాకృష్టైః శిలాశితైః. 48

కాళికా శూలపాతై స్తాన్‌ గదాశక్తి విదారితాన్‌ | కుర్వంతీ వ్యచరత్తత్ర భక్షయంతీ చ దానవాన్‌. 49

కమండలు జలాక్షేపగత ప్రాణా న్మహాబలాన్‌ | బ్రహ్మాణీ చాకరో త్తత్ర దానవా న్సమరాంగణ. 50

మీరు జీవింపగోరినచో వెంటనే దానవులుండు రసాతమునకు వెళ్ళుడు. మీ బలముతో గలిసి పోరి చావదలతురా రండు. నేడు నా పరివారమగు ఆడునక్కలు మా మాంసముతో సంతృప్తిజెందుగాక!' అను వచనములను శూలపాణి విని సత్వరమే యేగి సభలోకొలువున్న శుంభునిజేరి యిట్లనెను : రాజా! నేను జగదంబిక దూతను. త్రిపుర హరుడను - హరుడను. నీ మేలుగోరి నేనిటకు వచ్చితిని. నీవు స్వర్గము వదలి సత్వరమే వెళ్ళుము. మహాబలిశాలియగు బలి-బ్రహ్లాదుడువసించు పాతాళ##మేగుము. చావుగోరుకొందువా రణమునకు సిద్ధపడుము. రణమునకు రమ్ము. మిమ్మెల్లర నిపుడే యుద్ధమందు దునుమాడగలను. అని అమృతమువలె మేలొడగూర్చు శ్రీదేవి వాక్కులు శివుడు దానవముఖ్యులకు వినిపించి తిరిగి వచ్చెను. అట్లు శివుని దానవుని చెంతకు దూతగ పంపిన దేవి లోకమునందు శివదూతియను పేరు గాంచెను. దానవులు దేవి వాక్కులు శివునివలన విని కవచములు శస్త్రములు దాల్చి రణోన్ముఖులై బయలుదేరిరి. వారు వేగమే యుద్ధమందు దుమికి వాడి ములుకులు చెవులవఱకు లాగి చండికమీద ఏసిరి. అంత శ్రీభద్రకాళికాశక్తి కొందఱిని శూలములతో బొడుచుచు-మఱికొందఱిని గదాశక్తులతో మోది చెండాడుచు-నింక కొందఱిని నోట కఱకఱ నమలుచు నుండెను. బ్రహ్మాణీదేవి సమరాంగణమందలి దానవవీరులపై తన కమండలు జలము మంత్రించి చల్లి వారి ప్రాణములు దీయుచుండెను.

మహేశ్వరీ వృషారూఢా త్రిశూలేనాతి రంహసా | జఘాన దానవా న్సంఖ్యే పాతయామాస భూతలే. 51

వైష్ణవీ చక్రపాతేన గదాపాతేన దానవాన్‌ | గత ప్రాణం శ్చకారాశు చోత్తమాంగ వివర్జితాన్‌. 52

ఐంద్రీ వజ్రప్రహారేణ పాతయామాస భూతలే | ఐరావత కరాఘాతపీడితా న్దైత్యపుంగవాన్‌. 53

వారాహీ తుండఘాతేన దంష్ట్రాగ్రపాతనేన చ | జఘాన క్రోధసంయుక్తా శతశో దైత్యదానవాన్‌. 54

నారసింహీ నఖై స్తీవ్రై ర్దారితా న్దైత్యపుంగవాన్‌ | భక్షయంతీ చచారాజౌ ననాద చ ముహుర్ముహుః. 55

శివదూతీ సా%ట్టహాసైః పాతయామాస భూతలే | తాం క్చఖాదాథ చాముండా కాళికా చ త్వరాన్వితా. 56

శిఃసంస్థాచ కౌమారీ కర్ణాకృష్టైః శిలాశితైః | నిజఘాన రణ శత్రూ న్దేవానాం చ హితాయ వై. 57

వారుణీ పాశసంబద్ధా న్దైత్యా న్సమరమస్తకే | పాతయామాస తత్పృష్ఠే మూర్చితా న్గతచేతనాన్‌. 58

ఏవం మాతృగణ నాజా వతివీర్యపరాక్రమమ్‌ | మర్దితం దానవం సైన్యం పలాయనపరం హ్యభూత్‌. 59

బుంబారవస్తు సుమహా నభూత్తత్ర బలార్ణవే | పుష్పవృష్టిం తదా దేవా శ్చక్రు ర్దేవ్యా గణోపరి. 60

తచ్ఛ్రుత్వా నినదం ఘోరం జయశబ్దం చ దానవాః | రక్తబీజ శ్చుకోపాశు దృష్ట్వా దైత్యా న్పలాయితాన్‌. 61

గర్జమానం స్తథా దేవా న్వీక్ష్య ద్తెత్యో మహాబలః | రక్తబీజ స్తు తేజస్వీ రణమజభ్యాయ¸° తదా. 62

సాయుధో రథో సంవిష్టః కుర్వన్‌ జ్యాశబ్ద మద్భుతమ్‌ | ఆజగామ తదా దేవీం క్రోధర క్తేక్షణోద్యతః. 63

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే%ష్టావింశో%ధ్యాయః.

మహేశ్వరీదేవి వృషారూఢయై రణమందలి దానవుల నెల్ల తన త్రిశూలముతో బొడిచి చంపిపడవేయుచుండెను. శ్రీవైష్ణవీదేవి తన గదాచక్రప్రహారములతో రక్కసుల కుత్తుకలు కత్తిరించి ప్రాణములు దీయుచుండెను. ఐరావతము తన తొండముతో దానవవీరులను బాధించుచుండెను. ఇంద్రాణీదేవి వారిని తన వజ్రముతో గొట్టి నేల పడవేయుచుండెను. వారాహీదేవి తన గట్టిముట్టెతో కోపాతిరేకమున వాడి కోఱలతో పెక్కు దైత్యదానవులను బడగొట్టి చంపుచుండెను. శ్రీనారసింహీ దేవియును తన వాడి గోళ్లతో దైత్యవరులను జీల్చి తినుచు పల్మారు ఘోర సింహనాద మొనరించుచుండెను. శివదూతి మహాట్టహాసముతో నేలగూలనేసిన దానవుల నెల్ల చాముండాకాళికలు తినుచుండిరి. దేవహితము గోరివచ్చిన శ్రీ కౌమారీదేవి మయూర మెక్కి వింటినారి చెవులవరకు లాగి దానవులపై బాణములు ప్రయోగించుచుండెను. శ్రీవారుణీదేవి తన పాశములతో దైత్యవర్యులను బంధించి వారిని మూర్ఛితులగ విగతజీవులగ చేయుచుండెను. ఈ ప్రకారముగ మాతృకాగణము వీరవిహారము సల్పుచుండగా వీరదానవ సైనికులు పీడితులై ఘోరాపజయమంది వెన్నుచూపి పారిపోయిరి. ఆ దానవసేనలో నేడ్పులు కల కలములు చెలరేగెను. అమరులు మాతృకాగణముపై పూలవానలు గురిసిరి. అట్లు దానవులు పలాయనము చిత్తగించిరి. అసురుల యార్తధ్వనులు విని రక్తబీజుడు కోపోద్రిక్తుడయ్యెను. పరాక్రమిమగు రక్తబీజుడు హర్షధ్వానము లొక్కపెట్టున నొనరించు దేవతలను గనిరణమున కుద్యమించెను. అతని కనుగ్రుడ్లెఱ్ఱగ నుండెను. అతడాయుధములు దాల్చి రథమెక్కి నారి మ్రోగించుచు శ్రీదేవి చెంతకు వచ్చెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీదేవి కితర దేవతలు తోడగుటయను నిరువదియెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters