Sri Devi Bhagavatam-1
Chapters
అథ ఏకోనత్రింశో%ధ్యాయః వరదాన మిదం తస్య దానవస్య శివార్పితమ్ | అత్యద్భుతతరం రాజన్ శృణు తత్ప్రబ్రవీమ్యహమ్.
1 తస్యా దేహా ద్రక్తబిందు ద్యదా పతతి భూతలే | సముత్పతంతి దైతేయా స్తద్రూపా స్తత్పరాక్రమాః.
2 అసంఖ్యాతా మహావీర్యా దానవా రక్తసంభవాః | ప్రభవంత్వితి రుద్రేణ దత్తో%స్త్యత్యద్భుతో వరః.
3 స తేన వరదానేన దర్పితః క్రోధసంయుతః | అభ్యగా త్తరసా సంఖ్యే హంతుం దేవీం సకాళికామ్.
4 స దృష్ట్వా వైష్ణవీం శక్తిం గరుడోపరి సంస్థితామ్ | శక్త్యా జఘాన దైత్యేంద్ర స్తాం వై కమలలోచనామ్.
5 గదయా వారయామాస శక్తిం సా శక్తి సంయుతా | అతాడయ చ్ఛ చక్రేణ రక్తబీజం మహాసురమ్.
6 రథాంగమతదేహా త్తు బహు సుస్రావ శోణితమ్ | వజ్రాహతగిరేః శృంగా న్నిరరా ఇవ గైరికాః.
7 యత్రయత్ర యదా భూమౌ పతంతి రక్తబిందవః | సముత్తస్థు స్తదాకారాః పురుషాశ్చ సహస్రశః.
8 ఐంద్రీ తమసురం ఘోరం వజ్రేణాభిజఘాన చ | రక్తబీజం క్రుధా%%విష్టా నిఃససార చ శోణితమ్.
9 తత స్తతతజా జ్జాతా రక్తబీజా హ్యనేకళః | తద్వీర్యా శ్చ తదాకారః సాయుధా యుద్ధదుర్మదాః.
10 బ్రహ్మాణి బ్రహ్మదండేన కుపితా హ్యమన ద్భృశమ్ | మహేశ్వరీ త్రిశూలేన దారయామాస దానవమ్. 11 నారసింహీ నఖాఘాతై స్తం వివ్యాథ మహాసురమ్ | అహనత్తుండఘాతేన క్రుద్ధా తం రాక్షసాధమమ్. 12 ఇరువదితొమ్మిదవ యధ్యాయము రక్తబీజుని మరణము వ్యాసు డిట్లనెను : ఓ రాజా! పూర్వము పరమశివుడు రక్తబీజున కద్భుత వర మొసగెను. దానిని గూర్చి తెల్పుదును. వినుము. రక్తబీజుని శరీరమునుండి నెత్తుటిబొట్లు నేల పడగనే యందుండి యతనిబోలు రూపపరాక్రమములుకల దానవులు పుట్టుదురు. అట్లు మహావీరులు లెక్కలేనంత మంది పుట్టుదురను విచిత్రవరమును శివు డతని కొసంగెను. అట్టి రక్తబీజుడు వరగర్వముతో మహాకోపముతో కాళికాదేవిని సంహరించుటకు రణభూమికి వేగమే వచ్చెను. వాడు గరుడవాహనయై వెలుగుచున్న శ్రీవైష్ణవీదేవిని గాంచి యామెపై శక్తిని ప్రయోగించెను. ఆమె తన గదతో వాని శక్తిని నివారించి తిరిగి రక్తబీజునిపై చక్రమును ప్రయోగించెను. ఆ చక్రఘాతమునకు వాని శరీరమునుండి వజ్రపు దెబ్బకు పర్వతమునుండి సెలయేళ్లవోలె రక్తము కాల్వలు గట్టెను. వాని రక్తబిందువులు పడినచోట్ల నెల్ల వానిని బోలువారు వేలకొలది పుట్టిరి. పిదప నింద్రాణీదేవి మహాక్రోధముతో తన వజ్రాయుధముతో రక్తబీజుని కొట్టగ వానినుండి నెత్తురు మిక్కుటముగ చిమ్మి పడుచుండెను. ఆ రక్తమునుండి మరల వానిని బోలు పెక్కురు రక్తబీజులు యుద్ధమదముతో సాయుధులై పుట్టిరి. బ్రహ్మాణి బ్రహ్మదండముతో మాహేశ్వరి త్రిశూలముతో రౌద్రరూపమున వానిని బాధ పెట్టుచుండిరి. శ్రీనారసింహి తన వాడి కొనగోళ్లతో వానిని చీల్చివేయుచుండగ శ్రీవారాహి తన పెనుముట్టెతో వానిని పొడుచుచుండెను. కౌమారీ చ తథా శక్త్యా వక్షస్యేన మతాడయత్ | సో%పి క్రుద్ధః శరాసారై ర్బిభేద నిశితైశ్చతాః. 13 గదాశక్తిప్రహారై స్తు మాతౄః సర్వాః పృథక్పృథక్ | శక్తయ స్తం శరాఘాతై ర్వివిధు స్తత్ర్పకోపితాః. 14 తస్యశ స్త్రాణి చిచ్ఛేద చండికా స్వశ##రైః శితైః | జఘానాన్యైశ్చ విశిఖై స్తం దేవీ కుపితా భృశమ్. 15 తస్య దేహాచ్చ సుస్రావ రుధిరం బహుధా తు యత్ | తస్మా త్త త్సదృశః శూరాః ప్రాదురాస న్సహస్రశః. 16 రక్తబీజై ర్జగ ద్వ్యాప్తం రుధిరౌఘసముద్భవైః | సన్నద్ధైః సాయుధైః కామం కుర్వద్భి ర్యుద్ధ మద్భుతమ్. 17 ప్రహరంత శ్చ తాన్దృష్ట్వా రక్తబీజా ననేకశః | భయభీతాః సురాస్త్రేసుర్విషణ్ణాః శోకకర్శితాః. 18 కథ మద్య క్షయం దైత్యా గమిష్యంతి సహస్రశః | మహాకాయా మహా వీర్యా దానవా రక్త సంభవాః. 19 ఏకైవ చండికా%త్రాస్తి తథా కాళీ చ మాతరః | ఏతాభి ర్దనవాః సర్వే జేతవ్యాః కష్ట మేవ తత్. 20 నిశుంభో వా%థ శుంభో వా సహసా బలసంవృతః | ఆగమిష్యతి సంగ్రామే తతో%నర్థో మహా న్భవేత్. 21 ఏవం దేవా భయోద్విగ్నా శ్చింతా మాపు ర్మహత్తరామ్ | యదా తదాంబికా ప్రాహ కాళీం కమలలోచనామ్. 22 చాముండే కురు విస్తీర్ణం వదనం త్వరితా భృశమ్ | మచ్ఛస్త్రపాత సంభూతం రుధిరం పిబ సత్వరా. 23 భక్షయంతీ చర రణ దానవా నద్య కామతః | హనిష్యామి శ##రై స్తీక్షైర్గదాసిముసలై స్తథా. 24 శ్రీకౌమారీదేవి తన శక్తితో వాని ఱొమ్ము పగులగొట్టగ వాడు కోపముతో నా దెబ్బలకు తట్టుకొనుచు మరల బాణములు కురియసాగెను. అతడు గదాశక్తులతో మాతృకా దేవతలను వేర్వేరుగ ప్రహరించుచుండగ నా దేవతా శక్తులును ప్రకోపముజెంది వానిని తమ నిశిత శరాఘాతములతో నొప్పించిరి. అంతట శ్రీచండికాదేవి మహోగ్రమూర్తియై తన వాడి శరములతో వని ములుకులు ఛేదించి పిదప వానిని నివితశిలీముఖములతో నొప్పించెను. వాని శరీరమునుండి నెత్తురు వెడలుటే తడవుగ నందుండి వేలకొది దానవులు పుట్టుచుండిరి. ఆ నెత్తుట బుట్టిన రక్తబీజుల గుంపు సాయుధముగ కవచములు దాల్చి యెల్లెడల పోరు సాగించుచుండిరి. అట్లు పోరుచున్న పెక్కురు రక్తబీజులను గాంచి యమరులు భయభ్రాంతులై చింతాక్రాంతులై తమలోతా మిట్లనుకొనిరి: ఈ నెత్తుట బుట్టిన పెక్కురు మహావీర్య మహాకాయులగు దైత్యు లెట్లు చావగలరు? ఇచ్చట శ్రీచండికయు కాళికయు మాతృకలు మాత్రము గలరు. ఈ దానవుల నెల్లరను గెల్చుట వీరికి కష్టసాధ్యముగ నుండును. శుంభనిశుంభులుగూడ నిపుడే వచ్చినచో మరింత కీడు కల్గును. అని దేవతలు భయవ్యాకులురై చింతాగ్రస్తులై యుండగ శ్రీజగదంబిక శ్రీకాళికాదేవి కిట్లు పలికెను: చాముండా! నేను వీరినెల్ల శస్త్రఘాతమున బాధింతును. నీవు వానినుండి వెడలు నెత్తురంతయు నోరు తెరచుకొని త్రాగివేయుము. నేను గద-అసి-ముసలములతో వీరిని చంపుదును. నీవు పిదప వీరితో పొట్ట నింపుకొని స్వేచ్ఛగ విహరింపుము. తథా కురు విశాలాక్షి పానం తద్రుధిరస్య చ | బిందు మాత్రం యథా భూమ్యాం న పతే దపి సాంప్రతమ్. 25 భక్షమాణా స్తదా దైత్యా న చోత్పత్స్యంతి చాపరే | ఏవ మేషాం క్షయో నూనం భవిష్యతి న చాన్యథా. 26 ఘాతయిష్యా మ్యహం దైత్యంత్వం భక్షయ చ సత్వరా | పిబతీ క్షతజం సర్వం యతమానా%రి సంక్షయే. 27 ఇత్థం దైత్యక్షయం కృత్వా దత్వా రాజ్యం సురాలయమ్ | ఇంద్రాయ సుస్థిరం సర్వం గమిష్యామో యథా సుఖమ్. 28 ఇత్యుక్తా %ంబికయా దేవీ చాముండా చండవిక్రమా | పపౌ చ క్షతజం సర్వం రక్తబీజ శరీరజమ్. 29 అంబికా తం జఘానాశు ఖడ్గేన ముసలేన చ | చఖాద దేహశకలాం శ్చాముండా తాన్కృశోదరీ. 30 సో%పి క్రుద్ధో గదాఘాతై శ్చాముండాం సమఘాతయత్ | తథా%పి సా పపావాశు క్షతజం సమభక్షయత్. 31 యే%న్యే రుధిరజాః క్రూరా రక్తబీజా మహాబలాః | తే%పి నిష్ఫాతితాః సర్వే భక్షితా గతశోణితాః. 32 కృత్రిమా భక్షితాః సర్వే యస్తు స్వాభావికో%సురః | సో%పి ప్రపాతితో హత్వా ఖడ్గేతాతి విఖండితః. 33 రక్త బీజే హతే రౌద్రే యే చాన్యే దానవా రణ | పలాయనం తతః కృత్వా గతాస్తే భయ కంపితాః. 34 హాహేతి విబ్రువంత స్తే శుంభం ప్రోచుః సువిహ్వలాః | రుధిరారక్త దేహాశ్చ విగతాస్త్రా విచేతసః. 35 రాజన్నంబికయా రక్తబీజో%సౌ వినిపాతితః | చాముండా తస్య దేహాత్తు పపౌ సర్వంచ శోణితమ్. 36 విశాలాక్షీ! వీరినుండి యొక్క నెత్తుటిబొట్టుగూడ క్రింద పడకముందే త్రాగివేయుము. తినబడినవారు మరల పుట్టరు గదా! ఇట్లు చేసినచో వీరు తప్పక నశింతురు. ఇంకొక విధముగ వీరు చావరు. అంతలో సర్వనాశనమునకు వాని నెత్తు రెల్ల గ్రోలుము. ఇట్లు దైత్యనాశ మొనరించి స్వర్గ మింద్రున కొసంగి మనము సుఖముగ వెళ్ళుదము. అని యిట్లు శ్రీదేవి యనినంతనే చండవిక్రమయగు చాముండ రక్తబీజుని నుండి కారిన రక్తమెల్ల క్రోలసాగెను. శ్రీ మహామాయ ఖడ్గముసలములతో రక్తబీజుని ఖండఖండములు చేయగా శ్రీచాముండా దేవి వాని తెగిన యవయవములనెల్ల తినసాగెను. అపుడు రక్తబీజుడు కోపముతో గదాఘాతముతో శ్రీ చాముండా దేవిని నొప్పించెను. దెబ్బతినియును ఆ దేవి వాని రక్తమెల్లగ్రోలుచు నంగములు తినుచుండెను. నెత్తుట బుట్టిన తక్కిన క్రూరులగు రక్తబీజులందఱును శ్రీదేవి చేతిలో నేలగూలిన వెంటనే కాళిక వారినెత్తురు త్రాగసాగెను. అట్టుల పుట్టిన వారెల్లరు పుట్టినట్లుగ హతులుగాగా జగదంబిక నిజమైన రక్తబీజుని ఖడ్గముతో ముక్కలు ముక్కలుచేసి నేలగూల్చెను. అట్లు క్రూరుడగు రక్తబీజుడంతమొందగ తక్కిన దానవులు భయకంపితులై పరుగిడ సాగిరి. వారస్త్రములు వదలి చేష్టలుడిగి నెత్తుట దోగి వ్యాకులురై హాహాకారములు చేయుచు శుంభునిచేరి యిట్లు మొఱ పెట్లుకొనిరి: రాజా! భువనైకమాత యగు దేవి రక్తబీజుని నేలగూల్చినది. వెనువెంటనే చాముండా దేవి యతని రక్తమెల్ల త్రాగివేసినది. యే చాన్యే దానవాః శూరా వాహనే నాతిరంహసా | సింహేన నిహతాః సర్వే కాల్యా చ భక్షితాః పరే. 37 వయం తా కథితుం రాజ న్నాగతా యుద్ధచేష్టితమ్ | చరితం తథా దేవ్యాః సంగ్రామే పరమాద్భుతమ్. 38 అజేయేయం మహారాజ సర్వథా దైత్యదానవైః | గంధర్వాసురయక్షై శ్ప పన్నగోరగరాక్షసైః. 39 అన్యా స్తత్రాగతా దేవ్య ఇంద్రాణీప్రముఖా భృశమ్ | యుధ్యమానా మహారాజ వాహనై రాయుధై ర్యుతాః. 40 తాభిః సర్వం హతం సైన్యం దానవానాం వరాయుధైః | రక్తబీజో%పి రాజేంద్ర తరసా వినిపాతితః. 41 ఏకా%పి దుఃసహా దేవి కిం పున స్తాభి రన్వితా | సంహో%పి హంతి సంగ్రామే రాక్షసా నమితప్రభః. 42 అతో విచార్య సచివై ర్యద్యుక్తం తద్విధీయతామ్ | న వైర మనయా యుక్తం సంధి రేవ సుఖప్రదః. 43 ఆశ్చర్య మేత దఃలం యన్నారీ హంతి రాక్షసాన్ | రక్తబీజో%పి నిహతః పీతం తస్యాపి శోణితమ్. 44 అన్యే నిపాతితా దైత్యాః | సంగ్రామేంబికయా నృప | చాముండయా చ మాంసం వై భక్షితం సకలం రణ. 45 వరం పాతాళగమనం తస్యాః సేవా%థవా వరా | న తు యుద్ధం మహారాజ కార్య మంబికయా సహ. 46 న నారీ ప్రాకృతా హ్యేషా దేవకార్యార్థ సాధినీ | మాయేయం ప్రబలా దేవీ క్షపయంతీయ ముత్థితా. 47 ఇతి తేషాం వచ స్తథ్యం శ్రుత్వా కాలవిమోహితః | ముమూర్షుః ప్రత్యువాచేదం శుంభః ప్రస్ఫురితాధరః. 48 కొందఱు దానవులు దేవివాహనమగు సింహమువాతబడి మడిసిరి. ఇంకను మిగిలిన వారిని కాళికాదేవి మ్రింగివేసెను. ఆ రాక్షసఘ్నియగు దేవి సమరాద్భుత నైపుణ్యము నీకు వినిపింపవచ్చితిని. ఆ కాలకాలరూపిణియగు దేవిని గంధర్వాసుర-యక్ష-పన్నగోరగ-దైత్య-దానవ-రాక్షసులలో నెవ్వరు నే విధముగనైన జయింపజాలరు. ఆ యుద్ధములో నింద్రాణి మున్నగు తక్కిన దేవతలును తమ వాహనము లెక్కి యాయుధములుదాల్చి వచ్చి పోరు సాగించుచుండిరి. వారి యాయుధములచే దానవసేన యంతయు నిహతమయ్యెను. రక్తబీజుడును నేలగూలెను అతుల ప్రభావముగల సింహము సైతము రాక్షసుల నెల్ల చీల్చి చెండాడెను. ఆ దేవి నొక్కతెను గెల్చుటే కష్టము. ఇక తక్కిన దేవతలతోనున్న యామె నెట్లు గెల్వగలము? కనుక నీవు నీ మంత్రులతో నాలోచించి తగినది చేయుము. ఇంతకు నా దేవితో మనకు పగ తగదు. సంధి మేలు. ఆ మహాదేవి రాక్షసులనెల్ల జంపి రక్తబీజునంతటి వానిని మట్టుపెట్టి వాని నెత్తురు గ్రాగినదే! ఇది ఆశ్చర్యకరముగ లేదా? అంబిక దానవులను పడగొట్టుచుండగ కాళికాదేవి వారి రక్తమాంసము లారగించెను. కనుక మన కిపు డా విశ్వమాతను సేవించుటయో లేక పాతాళ మేగుటయో తగును గాని రణము చేయుట తగదు. ఆమె సామాన్య స్త్రీ కాదు. ఆమె దేవాభ్యుదయముగోరి దానవ కులక్షయ మొనరింప ప్రతిజ్ఞబూని వచ్చిన ప్రబల మాయాదేవి అను సేనల వాస్తవము లైన మాటలు వినియును శుంభుడు కాలమోహితుడై తన చావు తానే కొనితెచ్చుకొని పెదవి కంపింప నిట్లనియెను: యూయం గచ్ఛత పాతాళం శరణం వా భయాతురాః | హనిష్యా మ్యహ మద్యైవ తాం చ తాశ్చ సముద్యతః. 49 జిత్వా సర్వా న్సురా నాజౌ కృత్వా రాజ్యం సుపుష్కలమ్ | కథం నారీభయోద్విగ్నః పాతాళం ప్రవిశామ్యహమ్. 50 నిహత్య పార్షదా న్సర్వా న్రక్తబీజముఖా న్రణ | ప్రాణత్రాణాయ గచ్ఛామి హిత్వా కిం విపులం యశః. 51 మరణం త్వనివార్యం వై ప్రాణినాం కాలకల్పితమ్ | తద్భయం జన్మనోపాత్తం త్యజే త్కో దుర్లభం యశః. 52 నిశుంభా హం గమిష్యామి రథారూఢో రణాజిరే | హత్వా తా మాగమిష్యామో నాగమిష్యామి చాన్యథా. 53 త్వం తు సేనాయుతో వీర పార్తిగ్రాహో భవస్వ మే | తరసా తాం శ##రై స్తీక్షైర్నారీం నయ యమాలయే. 54 నిశుంభః: అహమద్య హనిష్యామి గత్వా దుష్టాంచ కాళికామ్ | ఆగమిష్యా మ్యహం శీఘ్రం గృహీత్వా తామథాంబికామ్. 55 మాచింతాం కురు రాజేంద్ర వరాకాయాస్తు కారణ | క్వైషా బాలా క్వ మే బాహువీర్యం విశ్వవశంకరమ్. 56 త్యక్త్వా%%ర్తిం విపులాం భ్రాతర్భుంక్ష్వ భోగాననుత్తమాన్ | ఆనయిష్యా మ్యహం కామం మానినీం మానసంయుతామ్. 57 మయి తిష్ఠతి తే రాజ న్న యుక్తం గమనం రణ | గత్వా%హ మనాయిష్యామి తవార్థే వై జయశ్రియమ్. 58 ఇత్యుక్త్వా భ్రాతరం జ్యేష్ఠం కనీయాన్బలగర్వితః | రథ మాస్థాయ విపులం సన్నద్ధః స్వబలావృతః. 59 జగామ తరసా తూర్ణం సంగరే కృతమంగలః | సంస్తుతో వందిసూతై శ్చ సాయుధః సపరిష్కరః. 60 ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ఏకోనత్రింశో%ధ్యాయః. మీరు పిరికిపందలు. మీ రా దేవినే శరణు వేడుడు. లేదా పాతాళ మేగుడు. నేను మాత్రము ప్రయత్నించి యామెను చంపగలను. నే నాలములో దేవతలనెల్ల గెల్చి విపుల సామ్రాజ్యము బొందితిని. అట్టి నేను నేడొక నారికి జంకి యెట్లు పాతాళ మేగగలను? రక్తబీజాదులు నా యనుచరులు. వారి చావునకు నేనే కారణమైతిని అట్టి నేను నా కీర్తి మంటగలిపి ప్రాణాలమీది తీపితో నే డెట్లు పారిపోగలను? ఎల్ల ప్రాణులు కాలవశమున సృజింపబడుదురు. వారెల్లరుకు మరణము ధ్రువము. పుట్టువుతోడనే చావు భయము గల్గును. ఐనను దుర్లభ##మైన యశము నెవడు కాలదన్నుకొనును? నిశుంభా! నే నిపుడు రథమెక్కి సమరమున కేగుదును. ఆమెను చంపి తిరిగి రాగలను. చంపజాలనిచో రాజాలను. నీవు నీ సేనలతో నా ప్రక్కనే నిలిచి నా వాడి తూపులతో నా దేవిని యమాలయమున కంపుము అన నిశుంభుడును ఇపుడు నేనే వెళ్ళుదును. ఆ దుష్టకాళిని చంపి దేవిని గ్రహించి వెంటనే మరలి వత్తును. జగములెల్ల గెల్చిన యీ బాహువీర్యున కాబాల యొక లెక్కయా? ఆమె నాకొక సామాన్యయువతి. నీ వింక నిశ్చింతగ నుండుము. అన్నా! ఆ నెలతను సగౌరవముగ నిపుడే కొనితెత్తును. దిగులు మానుము. భోగము లనుభవింపుము. నేనుండగ నీవు యుద్ధమున కేగుట తగదు. నేనే వెళ్ళి నీకు జయలక్ష్మిని గొనితెత్తును'' అని తన యన్నతో బలికి మదగర్వమున యుద్ధసన్నద్ధుడై సేనల గూర్చుకొనెను. మంగళకృత్యములు జరుపుకొని నిశుంభుడు వందిమాగధులు సంస్తుతించుచుండ సాయుధుడై వేగమే యుద్ధమునకు తరలెను. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు రక్తబీజుని మరణమను నిరువదితొమ్మిదవ యధ్యాయము.