Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రింశో%ధ్యాయః నిశుంభో నిశ్చయై కృత్వా మరణాయ జయాయ వా | సోద్యమః సబలః శూరో రణ దేవీ ముపాయ¸°.
1 తమాజగామ శుంభో%పి స్వబలేన సమావృతః | ప్రేక్షకో%భూ ద్రణ రాజా సంగ్రామరసపండితః.
2 గగనే సంస్థితా దేవా స్తదా%భ్రపటలావృతాః | దిదృక్షవస్తు సంగ్రామే సేంద్రా యక్షగణా స్తథా. 3 నిశుంభో%థ రణ గత్వా ధను రాదాయ శార్ణకమ్ | చకార శరవృష్టిం స భీషయన్ జగదంబికామ్. 4 ముంచంతం శరజాలాని నిశుంభం చండికా రణ | వీక్ష్యాదాయ ధనుః శ్రేష్ఠం జహాస సుస్వరం ముహు. 5 ఉవాచ కాళికాం దేవి పశ్య మూర్ఖత్వ మేతయోః | మరణాయాగతౌ కాళి! మత్సమీప మిహాధునా. 6 దృష్ట్వా దైత్యవధం ఘోరం రక్తబీజాత్యయం తథా | జయాశాం కురుతస్త్వేతౌ మోహితౌ మమ మాయయా. 7 ఆశా బలవతీ హ్యేషా న జహాతి నరం క్వచిత్ | భగ్నం హతంబలం నష్టం గతపక్షం విచేతనమ్. 8 ఆవాపాశనిబద్ధౌ ద్వౌ యుద్ధాయ సముపాగతౌ | నిహంతవ్యౌ మయా కాళి రణ శుంభనిశుంభకౌ. 9 ఆసన్నమరణా వేతౌ సంప్రాప్తౌ దైవమోహితౌ | పశ్యతాం సర్వ దేవానాం హనిష్యా మ్యహమద్య తౌ. 10 ఇత్యుక్త్వా కాళికాం చండీ కర్ణాకృష్ణ శరోత్కరైః | ఛాదయామాస తరసా నిశుంభం పురతః స్థితమ్. 11 దానవో%పి శరాం స్తస్యా శ్చిచ్ఛేద నిశితైః శ##రైః | తయోః పరస్పరం యుద్ధం బభూవాతిభయానకమ్. 12 ముప్పదవ యధ్యాయము నిశుంభుడు మరణించుట ఆ శూరుడగు నిశుంభాసురుడు చావో గెలుపో చేకూరవలయునని మదినెంచి బలముతో ప్రయత్నముతో రణములో దేవి నెదుర్కొనెను. నిశుంభునికి బాసటగ సమరకోవిదుడగు శుంభుడుగూడ తన సేనలతోవెళ్ళి సంగ్రామము చూచుచుండెను. ఇంద్రాది దేవతలును యక్షగుణమును యుద్ధము తిలకించు వేడుకతో నింగిపై మేఘముల మాటున బారులు దీర్చిరి. నిశుంభుడు రణరంగములో శార్గకమను ధనువు చేపట్టి జగన్మాతను బెదరించుచు బాణములు గురిసెను. అట్లు విల్లు చేబూని బాణములు వదలుచున్న నిశుంభునిగాంచి చండికాదేవి పలుమారు పకపక నవ్వెను. దేవి కాళికతో నిట్లనెను: ఓ కాళీ! వీరి మూర్ఖత్వము చూడుము. నేడు వీరు చావుగోరుకొని నా యెదుటబడినారు. వీరు రక్తబీజుని చావు-దానవ సంక్షయము గనియును నా మాయచే మోహితులై జయాశ వీడకున్నారు. ఆశ యెంత బలవత్తరమైనదో చూడుము. అది నరులనెప్పుడును వదలిపెట్టదు. దానవ పక్షములో బలము తగ్గించెడి ప్రాణాలు గోలుపోయిన వారెందఱో కలరు. ఐనను శుంభనిశుంభు లాశాపాశబద్ధులై యుద్ధసన్నద్ధులైరి. కాళీ! నేను వీరి నిపుడే యంతమొందింప గలను. వీరు దైవమోహితులు. వీరికి చావు మూడినది. సురలెల్లరు చూచుచుండగ వీరిని నేడే సంహరింపగలను. ఇట్లు దేవి కాళికతో పలికిన పిదప చండిక ధనువు చెవినరకు లాగి శరములతో తన ముందున్న నిశుంభుని నొప్పించెను. ఆతడు తన వాడి బాణములతో నామె శరములు దునిమెను. ఇట్లు వారిర్వురినడుమ భీకరమగు పోరాటము సాగుచుండెను. కేసరీ కేశజాలాని ధున్వానః సైన్యసాగరమ్ | గాహయమాస బలవా న్సరసీం వారణో యథా. 13 నఖై ర్దంతప్రహారై స్తు దానవా న్పురితః స్థితాన్ | చఖాద చ విశీర్ణాంగా నజా నివ మదోత్కటాన్. 14 ఏవం విమథ్యమావే తు సైన్యే కేసరిణా తదా | అభ్యధాన న్నిశుంభో%థ వికృష్ట వరకార్ముకః. 15 అన్యే%పి క్రుద్ధా దైత్యేంద్రా దేవీం హంతు ముపాయయుః | సందష్టదంతరసనా రక్తనేత్రా హ్యనేకశః. 16 తత్రాజగామ తరసా శుంభః సైన్యసమావృతః | నిహత్య కాళికాం కోపాత్ గ్రహీతుం జగదంబికామ్. 17 తత్రాగత్య దదర్శాజా వంబికాం చ పురః స్థితామ్ | రౌద్రరసయుతాం కాంతాం శృంగారరస సంయుతామ్. 18 తాం వీక్ష్య విపులాపాంగీం త్రైలోక్యవర సుందరీమ్ | సురక్తనయనాం రమ్యాం క్రోధరక్తేక్షణాం తథా. 19 వివాహేచ్ఛాం పరిత్యజ్య జయాశాం దూరత స్తథా | మరణ నిశ్చయం కృత్వా తస్థావాహితకార్ముకః. 20 తం తథా దానవం దేవీ స్మితపూర్వ మిదం వచః | బభాషే శృణ్వతాం తేషాం దైత్యానాం రణమస్తకే. 21 గచ్ఛధ్వం పామరా యూయం పాతాళం వా జలార్ణవమ్ | జీవితాశాం స్థిరాం కృత్వా త్యక్త్వా%త్రైవాయుధాని చ. 22 అథవా మచ్ఛరాఘాతహతప్రాణా రణాజిరే | ప్రాప్య స్వర్గసుఖం సర్వే క్రీడంతు విగతజ్వరాః. 23 కాతరత్వం చ శూరత్వం న భవత్యేవ సర్వథా | దదాన్యభయదానం వై యాంతు సర్వే యథాసుఖమ్. 24 మహాగజము కాసారమును చీకాకు పరచునట్లే విక్రమముగల సింహము తన జూలు విదలించుచు సేనా వాహినిలో దుమికెను. అది తన వాడియైన నఖ దంతములతో తన ముందున్న శత్రుసేనలను మదపుటేనుంగులను జీల్చునట్లు చీల్చి చెండాడి తినుచుండెను. సింహముచే సేనలు మడియుటగని నిశంభుడు గొప్ప చాపము చేబూని విజృంభించెను. అంతలో నితర దానవు లనేకులు కోపాటోపముతో కండ్లెఱ్ఱచేసి పటపటపండ్లు కొఱుకుచు దేవిని చంపుటకు గడంగిరి. వెంటనే శుంభుడు తన బలముతో కాళినిచంపి దేవిని గ్రహించు తలంపున కోపముతో నచటికి వచ్చెను. అతడు తన సమక్షమున శృంగార రసమున నొప్పారు చున్న రౌద్ర భీకరయగు జగదంబను యుద్ధభూమిలో గనెను. ఆ త్రిజగన్మోహిని కరుణా కటాక్షములు సహజముగ నెఱ్ఱ నందగించు చుండెను. ఐన నపుడవి క్రోధ సంరక్తములైన చూపులు గల్గియుండెను. అతడు నెమ్మదిలో పెండ్లిమీద జయము మీద ఆసమానుకొని చావునిశ్చయించుకొని ధనుస్సుచేదాల్చి నిలుచుండెను. అట్టి దానవునిగని రణమందలి దైత్యులెల్లరు విన శ్రీదేవి మందహాసముచేసి యీ రీతిగ పలికెను : మూఢులారా! మీకు జీవితాశగలదేని మీమీ యాయుధములు వదలుడు. పాతాళ మేగుడు - సముద్రమునైన జేరుడు. కానిచో రణమందు నా బాణఘాతములతో ప్రాణములు విడనాడి నిశ్చింతగ స్వర్గసీమలో క్రీడా సుఖము లందుడు. వీరత్వము భీరుత్వమను నీ రెండొకచో నెన్నడు నుండజాలవు. మీకిప్పటికైన నభయమిచ్చుచున్నాను. మీ నచ్చినచోటి కేగుడు. ఇత్యాకర్ణ్య వచ స్తస్యా నిశుంభో మదగర్వితః | నిశితం ఖడ్గ మాదాయ చర్మ చైవాష్టచంద్రకమ్. 25 ధావమాన స్తు తరసా%సినా సింహం మదోత్కటమ్ | జఘానాతిబలాన్మూర్ధ్ని భ్రామయన్జగదంబికామ్. 26 తతో దేవీ స్వగదయా వంచయిత్వా%సిపాతనమ్ | తాడయామాస తం బాహ్వోర్మూలే పరశునా తదా. 27 ఖడ్గేన నిహతః సో%పి బాహుమూలే మహామదః | సంస్తభ్య వేదనాం భూయో జఘన చండికాం తదా. 28 సా%పి ఘంటాస్వనం ఘోరం చకార భయదం నృణామ్ | పపౌ పునః పునఃపానం నిశుంభం హంతు మిచ్ఛతీ. 29 ఏవం పరస్పరం యుద్ధం బభూవా%తి భయప్రదమ్ | దేవానాం దానవానాం చ పరస్పరజయైషిణామ్. 30 పలాదాః పక్షిణః క్రూరాః సారమేయాశ్చ జంబుకాః | ననృతు శ్చా%తిసంతుష్టా గృధ్రాః కంకాశ్చ వాయసాః. 31 రణభూ ర్భాతి భూయిష్ట పతితా%సుర వర్ష్మకైః | రుధిరస్రావ సంయుక్తై ర్గజాశ్వదేహసంకులా. 32 పతితా న్దానవా న్దృష్ట్వా నిశుంభో%తిరుషాన్వితః | ప్రయ¸° చండికాం తూర్ణం గదామాదయ దారుణామ్. 33 సింహం జఘాన గదయా మస్తకే మదగర్వితః | ప్రహృత్య చ స్మితం కృత్వా పునర్దేవీ మతాడయత్. 34 సా%పి తం కుపితా%తీవ నిశుంభం పురతః స్థితమ్ | ప్రహరంతం సమీక్ష్యా%థ దేవీ వచన మబ్రవీత్. 35 తిష్ఠ మందమతే తావ ద్యావత్ఖడ్గ మిదం తవ | గ్రీవాయాం ప్రేరయామ్యస్మా ద్గంతాపి యమసాదనమ్. 36 అను దేవి పలుకులు వినిన నిశుంభుడు దుర్మదగర్వముతో వాడికత్తిని ఎనిమిది చంద్రకములు (అర్ధ చంద్రాకృతి అంచులుగల) డాలును చేతదాల్చెను. అతడు తొలుత మదమత్తసింహము తలపై కత్తి విసరి పిమ్మట జగదంబపై విసరెను. అంత శ్రీదేవియును తన గదతో వాని కత్తి వ్రేటు తప్పించుకొని వెంటనే వాని బాహుమూలములందు గొడ్డట కొట్టెను. ఆ క్రొవ్వుపట్టినవాడు తన చంకలో దగిలిన దెబ్బ బాధ సైచి తిరిగి చండికపై కత్తి విసరెను. ఆమె నరులకు భీతి గొల్పునట్టి ఘోరఘంటానాద మొనరించి నిశుంభుని చంపదలచి మత్తుగ మరల మరల మధుపాన మొనరించెను. ఈ రీతిగ జయశీలురగు దేవీ దానవుల భీకర యుద్ధము సాగుచుండెను. అపుడు మాంసాహారులగు క్రూరమైన పక్షులు కుక్కలు నక్కలు గ్రద్దలు కంకకాకములు పటు సంతోషముతో నర్తించెను. రణరంగమున దనుజులు గజాశ్వములు తెగిపడెను. వాని నెత్తుటితో రణస్థలి బీభత్సముగ నుండెను. నిశుంభుడట్లు నేలగూలిన తన సేననుగని అతిరోషముతో వేగమే గదపూని కఠినముగ చండికపై కురికెను. అతడు దుర్మదముతో సింహము తలపై గదాఘాత మొనర్చి వికవిక నవ్వి పిమ్మట దేవిని గదతో మోదెను. అట్లు తన ముందు నిలుచుండి పోరుచున్న నిశుంభుని దేవి చూచి మహారౌద్రమూర్తియై యతని కిట్లనెను : ఓరీ మందమతీ! ఈ నా బెడదపుటడిదము నీ కుత్తునకు తగులనంతవఱకు నిలువుము. తగిలినచో నీకు యమాలయమే నిలయ మగును. ఇత్యుక్త్వా తరసా దేవీం కపాణన సమాహితా | చిచ్ఛేద మస్తకం తస్య నిశుంభస్యా%ధ చండికా. 37 స చ్ఛిన్న మస్తకో దేవ్యా కబంధో%తీవ దారుణః | బభ్రామ చ గదాపాణి స్త్రాసయ న్దేవతాగణాన్. 38 దేవీ తస్య శిత్యై ర్బాణౖ శ్చిచ్ఛేద చరణౌ కరౌ | పపాతోర్వ్యాం పాపీ గతాసుః పర్వతోపమః. 39 తస్మి న్నిపతితే దైత్యే నిశుంభే భీమవిక్రమే | హాహాకారో మహానాసీ త్తత్పైన్యే భయకంపితే. 40 త్యక్త్వా%%యుధాని సర్వాణి సైనికాః క్షతజా%%ప్లుతాః | జగ్ము ర్బుంబారవం సర్వే కుర్వాణా రాజమందిరమ్. 41 తా నాగతా న్సు సంప్రేక్ష్య శుంభః శత్రునిఘాదనః | పప్రచ్ఛ క్వ నిశుంభో%సౌ కథం భగ్నాః పలాయితాః. 42 తచ్ఛ్రుత్వా వచనం రాజ్ఞ స్తే ప్రోచుః ప్రణతా భృశమ్ | రాజం స్తే నిహతో భ్రాతా శేతే సమరమూర్ధని. 43 తయా నిపాతితాః శూరా యే చ లే%ప్యనుజానుగాః | వయం త్వాం కథితుం సర్వం వృత్తాంతం సముపాగతాః. 44 నిశుంభో నిహత స్తత్ర తయా చండికయాధునా | న హి యుద్ధస్య కాలో%ద్య తవ రాజన్రణాంగణ. 45 దేవకార్యం సముద్దిశ్య కా%పీయం పరమాంగనా | హంతుం దైత్యకులం నూనం ప్రాప్తేతి పరిచింతయ. 46 నైషా ప్రాకృతయోషైవ దేవీశక్తి రునుత్తమా | అచింత్యచరితా క్వా%పి దుర్జేయా దైవతైరపి. 47 నానారూపధరాతీవ మాయామూలవిశారదా | విచిత్రభూషణా దేవీ సర్వాయుధధరా శుభా. 48 అని వచించి చండికాదేవి తన వాడికత్తితో బలునేర్పుతో నిశుంభుని తల తెగనఱికెను. అట్లు దేవిచే వాని తల తెగినప్పటికిని వాని మొండెము గదగొని సురలను జడింపించుచు భీకరముగ తిరుగసాగెను. పిమ్మట దేవి వాడిబాణములతో వాని కాలు సేతులు తెగనఱికెను. అంత పాపాత్ముడగు నిశుంభ దానవు డసువులుపాసి నేలగూలెను. అట్లు పరాక్రమియగు నిశుంభుడు చచ్చిన పిదప వాని సేనలు భయకంపితములై హాహాకారము లొనర్చెను. సైనికు లెల్లరును నెత్తుట దోగాడుచు నాయుధములు విడనాడి ఘోర పరాజయముతో విలపించుచు శుంభుని రాజమందిరము జేరిరి. అట్లు వచ్చిన వారినిగని శత్రునాశకుడగు శుంభుడు. నిశుంభు డేమయ్యెను? మీరేల పారివచ్చితి' రని వారి నడిగెను. రాజు మాటలు విని వారు వినతులై యతని కిట్లనిరి.' ఓ రాజా! నీ సోదరుడు రణమందు నిహతుడై పడిపోయెను. అతని యనుచరుల నందఱిని దేవి తునుమాడెను. హతశేషులమగు మేము నీ కా విషయము తెలుపవచ్చితిమి. నేడు చండిక చేతిలో నిశుంభుడు హతుడయ్యెను. రాజా! కనుక నిపుడు మనకు రణమందు బోరుటకు తగిన కాలముగాదు. ఒక పరమదేవత నేడు దేవతలను పునరుజ్జీవింప జేయుటకును దానవకులమును నశింపజేయుటకును వచ్చినదని యెఱుంగుము. ఈ దేవి కేవలస్త్రీ కాదు. ఈమె నిజముగ గొప్పశక్తి. దేవాత్మశక్తి. ఈమె దేవతలకు సైతము తెలియరానిది. ఈమె నానా రూపధరి. మాయామూల తత్త్వము నెఱిగినది. విచిత్ర భూషణములు సర్వాయుధములును ధరించిన శుభస్వరూప. గహనా గూఢచరితా కాళరాత్రి రివాపరా | అపారపారగ పూర్ణా సర్వలక్షణసంయుతా. 49 అంతరిక్షస్థితా దేవా స్తాం స్తువంత్యకుతోభయాః | దేవకార్యం చ కుర్వాణాం శ్రీదేవీం పరమాద్భుతామ్. 50 పలాయనం పరోధర్మః సర్వధా దేవరక్షణమ్ | దక్షితేకిల దేహే%స్మి న్కాలే%స్మత్సుఖతాం గతే. 51 సంగ్రామే విజయో రాజ న్భవితా తే న సంశయః | కాలః కరోతి బలినం సమయే నిర్బలం క్వచిత్. 52 తం పునః సబలం కృత్వా జయాయోపదధాతిహి | దాతారం యాచకం కాలః కరోతి సమయే క్వ చిత్. 53 భిక్షుకం ధనదాతారాం కరోతి సమయాంతరే | విష్ణుః కాలవశే నూనం బ్రహ్మ వా పార్వతీపతిః. 54 ఇంద్రాద్యా నిర్జరాః సర్వే కాల ఏవ ప్రభుః స్వయమ్ | తస్మా త్కాలం ప్రతీక్షస్వ విపరీతం తవాధునా. 55 సమ్ముఖో దేవతానాం చ దైత్యానాం నాశ##హేతుకః | ఏకైవ చ గతి ర్వాస్తి కాలస్య కిల భూపతే. 56 నానారూపధరా%ప్యస్తి జ్ఞాతవ్యం తస్య చేష్టితమ్ | కదాచి త్సంభవో నౄణం కదాచిత్ర్పలయ స్తథా. 57 ఉత్పత్తిహేతుః కాలో%న్యః క్షయహేతుస్తథా%పరః | ప్రత్యక్షం తే మహారాజ దేవ్యాః సర్వే సవాసవాః. 58 కరదా స్తే కృతాః పూర్వం కాలేన సమ్ముఖేన చ | తేనైవ విముఖే నాద్య బలినో%బలయా%సురాః. 59 నిహతా నితరాం కాలః కరోతి చ శుభాశుభమ్ | నైవాత్ర కారణం కాళీ నైవ దేవాః సనాతనాః. 60 యథా తే రోచతే రాజం స్తథా కురు విమృశ్య చ | కాలో%యం నాత్ర హేతు స్తే దానవానాం తథా పునః. 61 త్వ దగ్రతో గతః శక్రో భగ్నః సంఖ్యే నిరాయుధః | తథా విష్ణు స్తథా రుద్రో వరుణో ధనదో యమః. 62 తథా త్వమపి రాజేంద్ర ! వీక్ష్య కాలవశం జగత్ | పాతాళం గచ్ఛ తరసా జీవన్భద్ర మవాప్స్యసి. 63 మృతే త్వయి మహారాజ శత్రవస్తే ముదాన్వితాః | మంగళాని ప్రగాయంతే విచరిష్యంతి సర్వతః. 64 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే త్రింశో%ధ్యాయః. ఈమె గహనమగు తత్త్వము - సర్వశుభలక్షణ లక్షిత - పరిపూర్ణ - అపారపారగురాలు - అపర కాళరాత్రి - గూఢగహన చరిత - ఇట్టి శ్రీదేవి దేవకార్యము సాధించునట్టి పరమాద్భుత మూర్తి. ఈమెను గగన సీమలో విరాజిల్లు దేవగణములు పలుగతుల భయముడిగి నుతించు చున్నవి. ఇపుడు మనము బలుసాకునైన తిని బ్రతుకుదము. పారిపోవుట మంచిది. ఈ దేహమున్నచో మనకు మరల తగిన మంచి దినములు ముందు రావచ్చును. వేరొక యుద్ధములో తప్పక జయము గాంచగలవు. కాలము బలశాలిని బలహీనునిగ జేయుము. తిరిగి వానినే బలవంతునిగ జేయును. వానికి జయము చేకూర్చి పెట్టగలదు. అదే కాలము మహాదాతను బిచ్చగానిగ మార్చగలదు. బిచ్చగానిని మహాదాతగ జేయగలదు. హరిహర బ్రహ్మలును ఇంద్రాది దేవతలును కాలమునకు కట్టుపడినవారే సుమా! కాలము స్వయముగ తానే ప్రభువు. కనుక మంచి కాలమున కెదురుచూడుము. నేడు నీకది యెదురు తిరిగినది. కాలమిపుడు దేవతల యెట్టయెదుట దనుజ వినాశము చేయుచున్నది. కనుక రాజా! కాలగతి యెన్నడు నొక్కరీతిగ నుండదు. కాలమును బహురూపములు దాల్చుదానిగ నెఱుగుము. దాని పనులు తీరుతెన్నులు వింత వింతలుగ నుండును. అది ఒక్కొకప్పుడు నరులను పుట్టించును. మరొకప్పుడు మహాప్రళయమును తెచ్చిపెట్టును. కనుక నొకే కాల ముతృత్తి హేతువు - నాశ##హేతువునగును. ఈ విషయము నీవును ప్రత్యక్షముగ నింద్రాది దేవతల విషయమున నెఱిగియేయున్నావు. ఒకప్పుడింద్రాదులే నీకు కప్పము చెల్లించిరి గదా! ఆ కాలేమ నీకిపుడు ప్రతికూలమయ్యెను. దాన నే డొక్కయబల బలము గల దైత్యులను మట్టుపెట్టినది. కనుక శుభాశుభములకు కాలము కారణముగాని సనాతన దేవి గాదు. కాళి కాదు. కాలము నేడు నీకు నీ దానవులకును కలిసిరాలేదు. కావున చక్కగ నాలోచించుకొని నీకు రుచించినట్లు చేయుము. ఒక కాలమున విష్ణువు - రుద్రుడు - వరుణ కుబేర యములు - ఇంద్రుడు నీతో బోరి నిరాయుధులై పారిపోయిరి. అటులే నేడు నీవును జగము కాలవశమని తెలసి పాతాళ##మేగుము. బ్రతికి యున్న నూఱండ్లకైన సుఖములు పడయ వచ్చును గదా! ఇక నీవును చచ్చినచో దేవతలు ప్రమోదభరితులై మంగళ గీతికలు పాడుచు నెల్లెడల విహరింతురు. ఇది శ్రీ మద్దేవీ భాగవత మందలి పంచమస్కంధమందు నిశుంభుని మరణమను ముప్పదవ యధ్యాయము.