Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకత్రింశోధ్యాయః

ఇతి తేషాం వచః శ్రుత్వా శుంభో దైత్యపతి స్తథా | ఉవాచ సైనికా నాశు కోపాకులితలోచనః. 1

జాల్మాః కిం బ్రూత దుర్వాచ్యం కృత్వా జీవితు ముత్సహే | నిహత్య సచివా న్ర్భాతౄ న్నిర్లజ్జో విచరామి కిమ్‌. 2

కాలః కర్తా శుభానాం వా%శుభానాం బలవత్తరః | కా చింతా మమ దుర్వారే తస్మి న్నీ శే%ప్యరూపకే. 3

యద్భవతి తద్భవతు యత్కరోతి కరోతు తత్‌ | న మే చింతా%స్తి కుత్రాపి మరణా జ్జీవనాత్తథా. 4

స కాలో%ప్యన్యథా కర్తుం భావితో నేశ##తే క్వచిత్‌ | న వర్షతి చ పర్జన్యః శ్రావణ మాసి సర్వధా. 5

కదాచిన్మార్గశీర్షే దా పౌషే మాఘే%థ ఫాల్గునే | అకాలే వర్షతీవాశు తస్మా న్ముఖ్యో న చాస్త్యయమ్‌. 6

కాలో నిమిత్తమాత్రం తు దైవం హి బలవత్తరమ్‌ | దైవేన నిర్మితం సుర్వం నాన్యథా భవతీత్యదః. 7

దైవమేవ వరం మన్యే దిక్పౌరుష మనర్థకమ్‌ | జేతా యః సర్వదేవానాం నిశుంభో%ప్యనయా హతః. 8

రక్తబీజో మహాశూరః సో%పి నాశం గతో యదా | తదా%హం కీర్తి మత్సుజ్య జీవితాశాం కరోమి కిమ్‌. 9

ప్రాప్తే కాలే స్వయం బ్రహ్మ పదార్థద్వయ సమ్మితే | నిధనం యాతి తరసా జగత్కర్తా స్వయంప్రభుః. 10

చతుర్యుగసహస్రే తు బ్రహ్మాణో దివసే కిల | పతంతి భవనా త్పంచ నవ చేంద్రా స్తథా పునః. 11

తథైవ ద్విగుణ విష్ణు ర్మరణా యోపకల్పతే | తథైవ ద్విగుణ కాలే శంకరః శాంతి మేతి చ. 12

కా చింతా మరణ మూఢా నిశ్చలే దైవనిర్మితే | మహీ మహీ ధరాణాం చ నాశః సూర్యశశాంకయోః. 13

జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మమృతస్యచ | అధ్రువే%స్మి న్శరీరే తు రక్షణీయం యశః స్థిరమ్‌. 14

ముప్పదియొకటవ యధ్యాయము

శుంభాసురుని మరణము

తన సైనికుల మాటలు విని శుంభాసురుడు క్రోధముతో వారి కిట్లనియెను : మూఢలారా! మీరేమి పల్కుచున్నారు? నా మంత్రులును సోదరులును చావగా నేను తలయెత్తుకొని యెట్లు తిరుగ గలను? ఈ దుర్భరమైన ముప్పు వలన నేనెట్లు మన గలను? కాల మింద్రజాలము వంటిది; బలవత్తరమైనది. అది మంచిచెడ్డలకు కర్త-అరూపము-దుర్వారము-విశ్వప్రభువు. ఇక నేను మాత్ర మేమిచేయగలన? ఏది కానున్నదో కానిమ్ము. ఎవడు కుశలుడో వాడే ధన్యుడు; కార్యశూరుడు. నాకు చావుబ్రదుకుల గూర్చిన చింత యెంతమాత్రమును లేదు. ఈ చావుపుట్టువులను మార్చు శక్తి కాలమునకు గూడ లేదు. వానకాలమున మేఘము వర్షించును. కాని యొకొకప్పుడు శ్రావణ మాసమందును మేఘములు కురియకుండును గదా! ఒక్కొక్కప్పుడు మార్గశీర్షపుష్యము లందును - మాఘపాల్గుణములందును కాలముగాని కాలమున వానలు గురియును గదా! కావున పెక్కు భేదములుగల కాలము ముఖ్యముగాదని తెలియుచున్నది. కనుక కాలముకూడ నిమిత్తమాత్రమే. అన్నిటను దైవమే బలిష్ఠమైనది. దానిచేతనే విశ్వము సృజింపబడును. ఇతరముచే గాదు. దైవమే గొప్పదని తలంతును. పౌరుషము వ్యర్థము. పనికిమాలినది. ఏలయన, నెల్ల దేవతలను గెల్చిన నిశుంభుడు నేడొక స్త్రీ చేతిలో గూలిపోయెను గదా! రక్తబీజుడును మహా శూరుడు గదా! అంతటివాడును మిత్తి వాతబడెను. ఇంక నేనెట్లు కీర్తిని వదలుదును? జీవితాశ యెట్లు గల్గియుందును? బ్రహ్మ జగత్కర్త-స్వయంప్రభువు. అతడును కాలము తీరినచో మృత్యువువాత పడవలసినవాడే గదా! నాలుగువేల యుగములు బ్రహ్మ కొకదినము. ఒక్క బ్రహ్మదినములో పదునాల్గు రింద్రులు పుట్టి గిట్టుదురు. బ్రహ్మకు రెండింతల కాలము గడచిన మీదట విష్ణునాయువు పూర్తి యగును. విష్ణుని యాయువునకు రెండింతలైన శంకరుడు శాంతించును. మూఢులారా! దుర్దమ దైవమీ విశాల ప్రపంచములోని భూమి పర్వతములు సూర్యచంద్రులు మున్నగువానికి ముందే చావు వ్రాసి పెట్టియున్నది. ఇంక నా కీ చచ్చు చింతయేల? పుట్టినది తప్పక గిట్టును. గిట్టినది పుట్టును. ఈ నిలువని బొంది యుండగనే కీరితి దక్కించుకొనవలయును.

రథో మే కల్ప్యతాం శీఘ్రం గమిష్యామి రణాజిరే | జియో వా మరణం వా%పి భవత్వద్యైవ దైవతః. 15

ఇత్యుక్త్వా సైనికాన్‌ శుంభో రథ మాస్థాయ సత్వరః | ప్రయయా వంబికా యత్ర సంస్థితా తు హిమాచలే. 16

సైన్యం ప్రచలితం తస్య సంగే తత్ర చతుర్విధమ్‌ | హస్త్వశ్వరథ పాదాతి సంయుతం బహుసాయుధం. 17

తత్ర గత్వా%చలే శుంభః సంస్థితాం జగదంబికామ్‌ | త్రైలోక్యమోహినీం కాంతామపశ్య త్సింహవాహినీమ్‌. 18

సర్వాభరణభూషాఢ్యాం సర్వలక్షణ సంవృతామ్‌ | స్తూయమానాం సురైః స్వస్థై ర్గంధర్వయక్షకిన్నరైః. 19

పుషై#్పశ్చ పూజ్యమానాం చ మందారపాదపోద్భవైః | కుర్వాణాం శంఖనినదం ఘంటానాదం మనోహరమ్‌. 20

దృష్ట్వా తాం మోహమగమచ్ఛుంభః కామవిహిమోతః | పంచబాణాహతః కామం మనసా సమచిం తయత్‌. 21

అహో రూప మింద సమ్య గహో చాతుర్యమద్భుతమ్‌ | సౌకుమార్యం చ ధైర్యం చ పరస్పర విరోధి యత్‌. 22

సుకుమారా%తి తన్వంగీ సద్యః ప్రకట¸°వనా | చిత్ర మేత దసౌ బాలా కామభావవిర్జితా. 23

కామకాంతసమా రూపే సర్వలక్షణలక్షితా | అంబికేయం కిమేతత్తు హంతి సర్వాన్మహాబలాన్‌. 24

ఉపాయః కో%త్ర కర్తవ్యో యేన మే వశగా భ##వేత్‌ | స మంత్రా వా మరాలక్ష్మీ సాధనే సన్నిధౌ మమ. 25

సర్వమంత్రమయీ హ్యేషా మోహినీ మదగర్వితా | సుందరీయం కథం మే స్యా ద్వశగా వరవర్ణినీ. 26

పాతాళగమనం మే%ద్య న యుక్తం సమరాంగణాత్‌ | సామదానవిభేదై శ్చ నేయం సాధ్యా మహాబలా. 27

కనుక మీరు రథమాయాత్త పరచుడు. రణమున కేగగలను. చావో గెలుపో దైవమే నిర్ణయింపగలదు అని శుంభుడు తన సేనలతో నిట్టు పలికి యరదమెక్కి సదాశివ కుటుంబినియగు జగదంబిక యున్న హిమగిరికి తరలెను. అతని వెనువెంట రథాశ్వ గజాపదాతి బలములును నడచెను. అతడు పోయి ఆ హిమాద్రిపై నెలకొని యున్న త్రైలోక్యమోహిని - మనోహర - సింహవాహన యగు జగదంబికను గాంచెను. సర్వాభరణ భూషారంజిత సర్వలక్షణసంయుత - నిశ్చలచిత్తయగు దేవిని దివిజ-యక్ష-గంధర్వ-కిన్నరులచే సన్నుత. పారిజాత సుమముల చేత పూజింపబడుచు మనోమరమగు శంఖ నినదమును ఘంటానాదమును చేయుచున్న ఆ దేవిని చూచిన శుంభుడు కామవిమోహితుడు అగుచు మోహమునొంది పంచబాణాహతిచే మిగుల పీడితుడై తన మదినిట్లు తలపోసెను : ఓహో! ఏమా రూపము! ఏమా యద్భుతము! చాతుర్యము! పరస్పర విరుద్ధములగు శౌర్యము సౌకుమార్యము నొక్కెడ రూపుదాల్చి యున్నవే! ఈ బాల సుకుమార. సూక్ష్మమగు దేహము కలది. ప్రకటమై ఉదయించిన జవ్వనము గలది - ఐనను కామవికారము లేనిది. ఓహో, ఏమా విచిత్రము! ఈమె రతీ దేవివలె జగదేక సుందరి. సర్వశుభలక్షణలక్షిత-జగదేకమాత. అయ్యును మహాబలులగు రాక్షసవీరులను అందరను తుదముట్టించుచున్నది. ఈమె నాకు హస్తగతయగు నుపాయమేది? ఈ హంసగమనను నా దానిగ జేసికొనుటకు నా యొద్ద వశీకరణ మంత్రములైన లేవే! ఉన్న మాత్రనేమి? ఈ మదగర్వితయగు మోహనాంగి సర్వమంత్రాత్మిక యగు విశ్వ సుందరి. ఇంక నీ వరవర్ణిని నాకెట్లు వశగత కాగలదు? ఈ పరిస్థితిలో నేను యుద్ధరంగము వదలి పాతాళ##మేగుటి నీతిగాదు. ఈమె మహాబలిష్ఠ. ఈమె సామదానభేదములచేతను వశ్యగాదు.

కిం కర్తవ్యం క్వం గంతవ్యం విషమే సముపస్థితే | మరణం నో త్తమం చా%త్ర స్త్రీక్భతం తు యశో%పహృత్‌. 28

మరణ మృషిభిః ప్రోక్తం సంగరే మంగళాస్పదమ్‌ | యత్తత్సమాన బలయో ర్యోధయో ర్యుధ్యతోః కిల. 29

ప్రాప్తేయం దైవరచితా నారీ నరశతోత్తమా | నాశాయాస్మత్కుల స్యేహ సర్వథా%తిబలా%బలా. 30

వృథా కిం సామవాక్యాని మయా యోజ్యాని సాంప్రతమ్‌ | హననా యాగతా హ్యేషా కింతు సామ్యా ప్రసీదతి. 31

న దానై శ్చాలితుం యోగ్యా నానాశస్త్రవిభూషితా | భేద స్తు వికలః కామం సర్వదేవ వశానుగా. 32

తస్మాత్తు మరణం శ్రేయో న సంగ్రామే పలాయనమ్‌ | జయో వా మరణం వా%ద్య భవత్యేవ యథావిధి. 33

ఇతి సంచింత్య మనసా శుంభః సత్త్వాశ్రితో%భవత్‌ | యుద్ధాయ సుస్థిరో భూత్వా తా మువాచ పురః స్థితామ్‌. 34

దేవి! యుద్య స్వ కాంతే%ధ్య వృథా%యం తే పరిశ్రమః | మూర్ఖా%సి కిల నారీణాం నా%యం ధర్మః కదాచన. 35

నారీణాం లోచనే బాణా భ్రువావేవ శరాసనమ్‌ | హావభావా స్తు శస్త్రాణి పుమాంల్లక్ష్యం విచక్షణః. 36

సన్నాహ శ్చాంగరాగో%త్ర రణశ్చాపి మనోరథః | మంద ప్రజల్పితం భేరీశబ్దో నాన్యం కదాచన. 37

అన్యాస్త్రధారణం స్త్రీణాం విడంబన మసంశయమ్‌ | లజ్జైవ భూషణం కాంతే న చ ధార్ఱ్యం కదాచన. 38

యుధ్యమానా వరా నారీ కర్వశేవాభి దృశ్యతే | స్తనౌ సంగోపనీ¸° వా ధనుషః కర్షణ కథమ్‌. 39

క్వ మందగమనం కుత్ర గదామాదాయ ధావనమ్‌ | బుద్ధిదా కాళికా తే%త్ర చాముండా పరనాయికా. 40

ఇపుడెంత విషమస్థితి వచ్చిపడినది! ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఒక యాడుదాని చేతిలో చచ్చుట నా కీర్తిని అపహరించునదగును. అది దగదు. సంగ్రామమందు సమాన బలశాలురతోడి పోరున మరణము మంగళకరమని ఋషులు వాక్రుత్తురు. అట్టి చావు గొప్పది. నూరుగురు పురుషుల కంటె మేటియగు ఈ యన్నులమిన్న - అతిబల యగు ఈ యబల - నా కులనాశమున కెల్లభంగుల నిర్ణయింపబడి వేల్పులచే సృజింపబడినది. ఈ పట్టున నా మెత్తని పల్కులు పనికిమాలినవి. ఈమె మమ్ము హతమార్ప నేతెంచిన ప్రళయమూర్తి. ఐనను నా సామవాక్కులకీమె ప్రసన్నురాలు గావచ్చును. ఈమె నానా శస్త్రభూషితురాలు. కనుక నీమె దానములకు లొంగదు. ఈమె యెడల భేదమును పనిచేయదు. ఏలన, నీమెకు వశవర్తులై దేవతలండగ నిల్చియున్నారు. కనుక నా కిపుడు రణమున మరణమే మంచిది. పలాయనము తగదు. చావో గెలుపో విధి విధానమున్నట్లుగ జరిగి తీరును అని శుంభుడిట్లు తలపోసి బలము కూర్చుకొని పోర సమకట్టెను - అతడు తన ఎదుటనున్న దేవితో ఇట్లు పలికెను : ఓ శ్రీదేవీ! నీవెంత మూర్ఖురాలవు. నీవు నాతో పోరినంత మాత్రాన నాకు హాని జరుగునా? నీ పడిన శ్రమయంతయు వ్యర్థమగును. స్త్రీల ధర్మము యుద్ధము చేయుట కాదు. ఏలన, నారికి బాణములు కన్నులు; ధనువు కనుబొమలు; శస్త్రములు హావములు; లక్ష్యము పురుషుడు; కవచమంగరాగములు; రథము మనోరథము; భేరీభాంకృతులు తియ్యని మాటలు; ఇవికాక స్త్రీకి వేరేమియుండును? ఓ కాంతా! కాంతల కస్త్రధారణ మాడంబరమే యగును. ఆమెకు సిగ్గు పెట్టని మానికము. రమణికి ధృష్టత్వమెన్నడును తగదు. ఒక రమణి రణమునందు పోరాడుచున్నచో కర్కశముగ నుండును. ఆమె చాపము లాగునవు డామె బిగువైన స్తనము లెట్లు దాగగలవు? నీవు గదయెత్తి పరుగెత్తునపుడు నీ మందగమన మేమగునో కదా! ఈ కాళిక - యీ చాముండిక చతురలుకారు.

చండికా మంత్రమధ్యస్థా లాలనే%సుస్వరా శివా | వాహనం మృగరాడాస్తే సర్వసత్త్వభయంకరః. 41

వీణానాదం పరిత్యజ్య ఘంటానాదం కరోషియత్‌ | రూప¸°వనయోః సర్వం విరోధి వరవర్ణిని. 42

యది తే సంగరేచ్ఛా%స్తి కురూపా భవ భామిని | లంబోష్ఠే కునఖీ క్రూరా ధ్వాంక్షవర్ణా విలోచనా. 43

లంబపాదా కుదంతీ చ మార్జారనయనాకృతిః | ఈ దృశం రూప మాస్థాయ తిష్ఠ యుద్ధే స్థిరా భవ. 44

కర్కశం వచనం బ్రూహి తతో యుద్ధం కరోమ్యహమ్‌ | ఈ దృశీం సుదతీం దృష్ట్వా న మే పాణిం ప్రసీదతి. 45

హంతుం త్వాం మృగశాబాక్షి! కామకాంతోపమే మృధే | ఇతి బ్రూవాణం కామార్తం వీక్ష్యం తం జగదంబికా. 46

స్మితపూర్వ మిదం వాక్య మువాచ భరతోత్తమ | కిం విషీదసి మందాత్మ న్కామబాణ విమోహితః. 47

ప్రేక్షికా%హం స్థితా మూఢ కురు కాళికయా మృధమ్‌ | చాముండయా వా కుర్వేత తవ యోగ్యే రణాంగణ. 48

ప్రహరస్వ యథాకామం నాహం త్వాం యోద్ధు ముత్సహే | ఇత్యుక్త్వా కాళికాం ప్రాహ దేవీ మధురయా గిరా. 49

జహ్యేనం కాళికే క్రూరే కురూపప్రియమాహనే | ఇత్యుక్త్వా కాళికా కాలప్రేరితా కాలరూపిణీ. 50

గదాం ప్రగృహ్య తరసా తస్థా వాజౌ కృతోద్యమా | తయోః పరస్పరం యుద్ధం బభూవాతి భయానకమ్‌. 51

పశ్యతాం సర్వదేవానాం మునీనాం చ మహాత్మనామ్‌ | గదా ముద్యమ్య శుంభో%థ జఘాన కాళికాం రణ. 52

కాళికా దైత్యరాజానం గదయా న్యహనద్భృశమ్‌ | బభంజాస్య రథం చండీ గదయా కనకోజ్జ్వలమ్‌. 53

ఖరాన్హత్వా జఘానాశు దారుణస్వనా | స పదాతి ర్గదాం గుర్వీం సమాదాయ క్రుధా%న్వితః. 54

ఈ కర్కశవాక్కులు గల చండిక నీకు మంత్రాలోచనము నెఱపునదా! నిన్ను లాలించుమాత్రపుదా! సకల జంతు భీకరమగు నీసింహము నీకు వాహనమా! సురసుందరీ! సుమధుర వీణానాదము వదలి యీ ఘంటానాద మొనరింతువేల? ఇదంతయు నీ సురూప ¸°వనములకు భిన్నమైనది సుమా! వ్రేలాడు పెదవులు - చెడుగోళ్ళు గల్గి కాకవర్ణమున నుండుము. లంబపాదములు - చెడిన పండ్లు - పిల్లికండ్లు గల్గిన రూపున రణమున నిలుము. నేను నీవంటి సుందరాంగిపై చేయిచేసికోజాలకున్నారు. కనుక తొలుత నాతో నీవు పరుషములు పలుకుము. పిదప నీతో నేను పోరు సాగింతును. ఓ మృగాక్షి! నీవు రతి సమానవు. నిన్నెట్లు చంపగలను? అనగ విని దేవి శుంభుని కామార్తునిగ నెఱింగెను. ఆమె చిర్నగవుతో వానితో నిట్లు పలికెను : ఓరి మందమతీ! కామబాణపీడితుడవై యేల విలపింతువురా. నాతో పోరుటకు నీవుత్సహింపనిచో కాళికతోగాని చండికతోగాని పోరుము. వారును నీకు తగినవారే. నీవు వారితోనే పోరుము. నేను నీతో పోర సమకట్టను అని పలికి దేవి మధురవచనములతో కాళికకిట్లు పలికెను : కాళికా ! ఇతడు కురూపమును కామించువాడు. నీవును క్రూరురాలవు - కనుక నితనిని నీవే తునుమాడుము? అని దవి పలుకగనే కాలభయంకరియగు కాళిక కాలప్రేరితురాలయ్యెను. ఆమె సత్వరమే గద చేబూని రణాంగమున సిద్ధమయ్యెను. అంత కాశీశుంభుల మధ్య పో రతిభీకరముగ జరిగెను. సకల మునుల దేవతలు చూచుచుండగ శుంభుడు గదగొని కాళికపై విసరెను. కాళికయు వెనువెంటనే గదతో దైత్యపతిని చావమోదెను. చండిక గదగొని వాని బంగారు టరదము విఱుగగొట్టెను. ఆమె వెంటనే వాని సారథిని నేలగూల్చెను. వాడొక పెద్ద గదపూని కోపముతో లేచెను.

కాళికా ముభయోర్మధ్యే ప్రహసన్నహనత్తదా | వంచయిత్వా గదాపాతం ఖడ్గమాదాయ సత్వరా. 55

చిచ్ఛేదాస్య భుజం సవ్యం సాయుధం చందనార్చితమ్‌ | స చ్ఛిన్నబాహు ర్విరథో గదాపాణిః పరిప్లుతః. 56

రుధిరేణ సమాగమ్య కాళికా మాహనత్తదా | కాళీ చ కరవాలేన భుజం తస్థాథ దక్షిణమ్‌. 57

చిచ్ఛేద ప్రహసంతీ సా సగదం కిల సాంగదమ్‌ | కర్తుం పాదప్రహారం స కుపితః ప్రయ¸° జవాత్‌. 58

కాళీ చిచ్ఛేద చరణౌ ఖడ్గేనాస్య త్వరాన్వితా | స చ్ఛిన్నకరపాదో%పి తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్‌. 59

ధావమానో యయావాశు కాళికాం భీషయన్నివ | త మాగచ్ఛంత మాలోక్య కాళికా కమలోపమమ్‌. 60

చకర్త మస్తకం కంఠా ద్రుధిరౌ ఘవహం భృశమ్‌ | ఛిన్నే%సౌ మస్తకే భూమౌ పపాత గిరిసన్నిభః. 61

ప్రాణా వినిర్యయు స్తస్య దేహాదుత్ర్కమ్య సత్వరమ్‌ | గతాసుం పతితం దైత్యం దృష్ట్వాదేవాః సవాసవాః. 62

తుష్టువు స్తాం తదా దేవీం చాముండాం కాళికాం తథా | వపుర్వాతాః శివాస్తత్ర దిశశ్చ విమలా భృశమ్‌. 63

బభూవు శ్చాగ్నయో హోమే ప్రదక్షిణశిఖాః శుభాః | హతశేషాశ్చ యే దైత్యాః ప్రణమ్య జగదంబికామ్‌. 64

త్యక్త్వా%%యుధాని తే సర్వే పాతాళం ప్రయయు ర్నృప | ఏతత్తే సర్వ మాఖ్యాతం దేవ్యాశ్చరిత ముత్తమమ్‌. 65

శుంభాదీనాం వధం చైవ సురాణం రక్షణం తథా | ఏతదాఖ్యానకం సర్వం పఠంతి భువి మానవాః. 66

శృణ్వంతి చ సదా భక్త్వా తే కృతార్థా భవంతి హి | అపుత్రో లభ##తే పుత్రా న్నిర్ధనశ్చ ధనం బహు. 67

రోగీ చ ముచ్యతే రోగా త్సర్వాన్కామానవాప్నుయాత్‌ | శత్రుతో న భయం తస్య య ఇదం చరితం శుభమ్‌. 68

శృణోతిపఠతే నిత్యం ముక్తిమాన్‌ జాయతేనరః.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ఏకత్రింశో%ధ్యాయః.

అతడు కాళికపై గదవేసి నవ్వెను. కాని కాళిక వాని గదాఘాతమును విఫలమొనరించి ఖడ్గము చేపట్టెను. వాని యెడమ భుజము చందనమలందుకొని యాయుధము దాల్చియుండెను. కాళి దానిని తెగనఱికెను. తన బాహు వట్లు తెగగ నతడు విరథుడై మరల గద చేతబట్టెను. వాడు నెత్తుట తొప్పదోగుచు వచ్చి కాళికను మోదెను. ఆమె కరవాలము చేత ధరించెను. శ్రీ కాళిదేవి గదాభూషణములుగల వాని కుడిచేతిని మెత్తగ నవ్వుచునే ఖండించెను. వాడు కోపముతో ఆమెను తన్నబోయెను. ఆ వెంటనే కాళి వాని కాళ్ళను సైతము నఱికివేసెను. వాడట్లు కాలు సేతులు తెగినను నిలునిలుమని చావుకేకలు వేయుచు కాళికను బెదిరించుచు పరుగెత్తి వచ్చుచుండెను. ఆ వచ్చు వానిని గని కాళికాదేవి కమలమును కత్తిరించినట్లు వాని తల కత్తిరించెను. వాని కుత్తుక నుండి నెత్తురు వరదలై ప్రవహించెను. తల తెగిన వెంటనే వాడు గిరి పగిది నేలగూలెను. వాని ప్రాణములు వాని తనువు వదలి లేచిపోయెను. ఆ చచ్చిపడిన దానవు నింద్రాదులు చూచిరి. దేవత లంతట శ్రీకాళి చాముండలను సన్నుతింపదొడగిరి. అంత వాయువు చల్లగ మెల్లగ వీచెను. దిక్కులు విమలము లయ్యెను. అగ్ని ప్రదక్షిణ శిఖలతో మేలు వెల్గులు విరజిమ్ముచు హోమమున ప్రజ్వరిల్లెను. మిగిలిన దానవులు జగన్మాతకు కైమోడ్పు లందించిరి. వా రాయుధములు విడనాడి పాతాళము త్రోవపట్టిరి. ఇట్టి మహాద్భుతమైన శ్రీదేవి వీర రసభరిత చరిత్ర నీకు వివరించితిని. ఈ శుంభాదుల వధ సురసంరక్షణము గల ఈ దేవ్యుపాఖ్యానము చదివినవారు పరమ భక్తులు. దీనిని విన్నవారు పరమభాగవతోత్తములు. ధన్యజీవులు. ఈ భూమిపై శ్రీదేవీ చరిత్ర వలన పుత్త్రహీనుడు పుత్త్రవంతుడగును. లేనివాడు కలవాడగును. రోగి రోగములేనివాడు అగును. సర్వకామములు దేవీభక్తుని వరించి వచ్చును. మహాకాళీశక్తి శుభ పవిత్ర చరిత్ర విన్న - చదివిన వారికి శత్రుభీతి లేదు. అతడు మృత్యుముక్తుడు.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శుంభాసురుని మరణమను ముప్పదియొకటవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters