Sri Devi Bhagavatam-1
Chapters
అథ త్రయస్త్రింశో%ధ్యాయః మునే వైశ్యో%య మధునా వనే మే మిత్రతాంగతః | పుత్రదారై ర్నిరస్తో%యం ప్రాప్తో%త్ర మమసంగమమ్. (కుటుంబ విరహేణాసౌ దుఃఃతో%తీవ దుర్మనాః | న శాంతి ముపయాత్యేష తథా%పి మమ సాంప్రతమ్. గత రాజ్యస్య దుఃఖేన శోకార్తో%స్మి మహామతే|) నిష్కారణా చ మే చింతా హృదయా న్ననివర్తతే. హయా మే దుర్బలాః స్యుః కిం గజాః శత్రువశంగతాః. 2 భృత్యవర్గ స్తథా దుఃఖీ జాతః స్యాత్తు మయా వినా | కోశోక్షయం కరిష్యంతి రిపవో%తిబలా తక్షణాత్. 3 ఇత్యేవం చింతయానస్య న మే నిద్రా తనౌ సుఖమ్ | జానామీదం జగన్మిథ్యా స్వప్నవ త్సర్వ మేవ హి. 4 జానతో%పి మనో భ్రాంతం న స్థిరం భవతి ప్రభో | కో%హం కే%శ్వా గజాః కే%మీ న తే మే చ సహోదరాః. 5 న పుత్రా న చ మిత్రాణి యేషాం దుఃఖం దునోతి మామ్ | భ్రమో%యమితి జానామి తథా%పి మమ మానసః. 6 మోహో నైవాపసరతి కిం తత్కారణ మద్భుతమ్ | స్వామిం స్త్వమసి సర్వజ్ఞః సర్వసంశయనాశకృత్. 7 కారణం బ్రూహి మోహస్య మమాస్య చ దయానిధే | ఇతి పృష్ట స్తదా రాజ్ఞా సుమేధా మునిసత్తమః. 8 తమువాచ పరం జ్ఞానం శోకమోహవినాశనమ్ | శ్రుణు రాజ న్ర్పవక్ష్యామి కారణం బంధమోక్షయోః. 9 మహామాయేతి విఖ్యాతా సర్వేషాం ప్రాణినా మిహ | బ్రహ్మ విష్ణు స్తథేశానస్తురాషా డ్వరుణో%నిలః. 10 సర్వే దేవా మనుష్యా శ్చ గంధర్వోరగరాక్షసాః | వృక్షా శ్చ వివిధా వల్ల్యః పశవో మృగపక్షిణః. 11 మాయాధీనా శ్చ తే సర్వే భాజనం బంధేమోక్షయోః | తయా సృష్ట మిదం సర్వం జగత్థ్సావర జంగమమ్. 12 తద్వశే వర్తతే నూనం మోహజాలేన యంత్రితమ్ | త్వం కియా న్మానుషే ష్వేకః క్షత్రియో రజసా%%విలః. 13 ముప్పది మూడవ యధ్యాయము మహామాయకు దేవతలు సైతము మోహితులగుట రాజిట్లనియెను : మునీశ్వరా! ఇతడు వైశ్యుడు. ఇతని దారపుత్త్రులితని నిల్లు వెడలగొట్టిరి. ఇట్టి ఇతడీ వనమును జేరి నాతో నెయ్యము నెఱపెను. ఇతడు కుటుంబ వియోగముతో దుఃఖముతో దుర్మనస్కుడై చిత్తశాంతి గోల్పోయెను. నేను నట్లే రాజ్యభ్రష్టుడనై దుఃఖార్తుడనైతిని. ఈ యకారణమైన చింత నా యెదను దహించివేయుచున్నది. అక్కటా! నాగజాశ్వములు శత్రువులపాలై యెంతగ దుర్బలమైనవో కదా! నా సేవకులు నన్ను క్షణమైన జూడకున్నచో కొందలపాటు జెందుదురు. నా శత్రువులు నా ధనాగారమును త్రుటిలో శూన్యము చేసియుందురు. ఇట్టి చింతలచే నాక నిద్రాసుఖముగూడ గల్గుటలేదు. ఈ జగము కలవంటిదని యెఱుంగుదును. ఐనను నా మది కుదుటపడుట లేదు. నేను వాస్తవమున ఎవడను? ఈ గజాశ్వములతో నాకేమి సంబంధము? వాస్తవముగ ఈ సోదరులును ఈ పుత్త్రమిత్త్రులును లేరు. ఐనను వారి వియోగమున నాకు బాధ గల్గుచున్నది. ఇది అంతయును మిథ్యయని యెఱుంగుదును. ఐనను నా మదికి శాంతి చేకూరుటలేదు. నా మనసునుండి మోహభ్రాంతులు తొలగుటలేదు. ఇది అంతయు వింతగ నున్నది. స్వామీ! నీవు సర్వవిదుడవు. సర్వసంశయములు తీర్చువాడవు. కనుక దయానిధీ! నా యొక్కయు వైశ్యుని యొక్కయు మోహమునకు కారణమేమో తెలుపుము అని యిట్లు రాజు మునితో బలికెను. అంత ముని రాజునకు శోకమోహ నాశకమగు జ్ఞానబోధము నిట్లు చేసెను. రాజా! వినుము. నీకు బంధమోక్షముల కారణము వివరింతును. ఎల్ల ప్రాణులందలి త్రిగుణముల సమావస్థ మహామాయ యనబడును. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు - ఇంద్రాగ్ని వరుణులు - సకల దేవతలు - గంధర్వోరగ రాక్షసులు - మనుజులు - మృగ-పశు-పక్షులు-చెట్లు-తీగలు-ఈ మున్నగున వన్నియును మహామాయ కధీనములు. ఇవన్నియును బంధమోక్షము లందవలసినవే. ఈ చరాచర జగమంతయును మాయచేతనే సృజింపబడినది. సకల జీవరాశి మోహజాలమందు బంధింపబడి - మాయకు జిక్కియున్నది. నీవొక క్షత్రియుడవు. మనుజమాత్రుడవు. రజోగుణముతో మలినుడవు. నీవెంతటివాడవు! జ్ఞానినామపి చేతాంసి మోహయత్యనిశం హి సా | బ్రహ్మేశవాసుదేవాద్యా జ్ఞానే సత్యపి శేషతః. 14 తే%పి రాగవశాల్లోకే భ్రమంతి పరిమోహితాః | పురా సత్యయుగే రాజ న్విష్ణు ర్నారాయణః స్వయమ్. 15 శ్వేతద్వీపం సమాసాద్య చకార విపులం తపః | వర్షాణా మయుతం యావద్ర్బహ్మ విద్యా ప్రసక్తయే. 16 అనశ్వర సుఖాయాసౌ చింతయాన స్తతః పరమ్ | ఏకస్మి న్నిర్జనే దేశే బ్రహ్మా%పి పరమాద్భుతే. 17 స్థిత స్తపసి రాజేంద్ర మోహస్య వినివృత్తయే | కదాచిద్వాసుదేవో%సౌ స్థలాంతరమతి ర్హరిః. 18 తస్మా ద్దేశా త్సముత్థాయ జగామాన్య ద్దిదృక్షయా | చతుర్ముఖో%పి రాజేంద్ర తథైవ నిఃసృతః స్థలాత్. 19 మిళితౌ మార్గమధ్యే తు చతుర్ముఖ చతుర్భుజౌ | అన్యోన్యం తౌ పృష్టవంతౌ కస్త్వం కస్త్వమితి స్మహ. 20 బ్రహ్మ ప్రోవాచ తం దేవం కర్తా%హం జగతః కిల | విష్ణు స్తమాహ భో మూర్ఖ జగత్కర్తా%హ మచ్యుతః. 21 త్వం కియా న్బలహీనో%సి రజోగుణసమాశ్రితః | సత్త్వాశ్రితం హి మాం విద్ధి వాసుదేవం సనాతనమ్. 22 మయా త్వం రక్షితో%ద్యైవ కృత్వా యుద్ధం సు దారుణమ్ | శరణం మే సమాయాతో దానవాభ్యాం ప్రపీడితః. 23 మయా తౌ నిహతౌ కామం దానవౌ మధుకైటభౌ | కథం గర్వాయసే మంద మోహో%యం త్యజ సాంప్రతమ్. 24 న మత్తో%భ్యధికః కశ్చి త్సంసారే%స్మి న్ర్పసారితే | ఋషిరువాచ : ఏవం ప్రవదమానౌ తౌ బ్రహ్మవిష్ణూ పరస్పరమ్. 25 స్ఫురదోష్ఠౌ వేపమానౌ లోహితాక్షౌ బభూవతుః | ప్రాదుర్బభూవ సహసా తయో ర్వివదమానయోః | 26 మధ్యే లింగం సుధాశ్వేతం విపులం దీర మద్భుతమ్ | ఆకాశే తరసా తత్ర వాగువాచా%శరీరిణీ. 27 మునులమగు మేము నజ్ఞానులమే. మా చిత్తములును మోహపరవశములే. వేయేల? హరిహరబ్రహ్మలు జ్ఞానసంపన్నులు గదా! వారనురాగబంధాలతో మోహావేశాలతో నెల్లలోకములు పరిభ్రమింతురు. మున్ను సత్యయుగమందు విష్ణువగు నారాయణుడు వెలుగుచుండెను. ఆతడు శ్వేతద్వీపమున బ్రహ్మ విద్యాప్రాప్తికి పదివేలేండ్లు మహోగ్రతప మొనరించెను. మోహపాశము నుండి బయలుపడుటకు బ్రహ్మ సైత మొక విజన ప్రదేశమున మహాద్భుతముగ తప మొనరించెను. అంతలో విష్ణువును మరొక స్థలము కుతూహలముతో తన తపోభూమి వదలి వేరొకస్థాన మేగదలచెను. అపుడు బ్రహ్మయును తన పూర్వస్థానము వదలి మరొకచోటి కేగసాగెను. బ్రహ్మవిష్ణువులు మార్గమధ్యమున గలసికొనిరి. వారొకరి నొకరు చూచుకొని నీవెవ్వరవు - నీవెవరవని పరస్పరము ప్రశ్నించుకొనిరి. నేనే యీరేడులోకాలకు కర్త' నని బ్రహ్మ యనెను. నే నచ్యుతుడను. జగత్కర్తను నేనే. నీవు మూఢుడవు. రజోగుణప్రధానుడవు. నీ బలమేపాటిది? నేను సత్త్వగుణము నాశ్రయించితిని. నన్ను సనాతనుడగు వాసుదేవునిగ దెలిసికొనుము. తొల్లి మధుకైటభులు నిన్ను పీడించిరి. నీవపుడు నన్ను శరణుజొచ్చితివి. అంత నేను వారితో బోరి నిన్ను గాపాడితిని. ఓరీ మందమతీ! ఆ దానవులు నా చేతిలో మడిసిరి. ఏల విఱ్ఱవీగుదువు? ఈ మాయామోహము నికనైన విడనాడుము. ఈ విపుల ప్రపంచమునందు నాకంటె నధికుడు లేడు అని విష్ణు వనెను. ఇట్లు బ్రహ్మ విష్ణు లొకరితోనొకరు వాదించుకొనిరి. వారి కన్నులనుండి నిప్పురవ్వలు రాలుచుండెను. వారి పెదవు లదరసాగెను. అంతలో నా వాది ప్రతివాదు లిరువురి నడుమ నొక వింత జరిగెను. పాతాళము నుండి గగనమంత మహాదీర్ఘము - విపులతరము నగు నొక జ్యోతిః స్ఫాటిక మహాలింగము వారి నడుమ ప్రాదుర్భవించెను. అది పూర్ణచంద్రామృతమువలె సుందరముగ తెల్లగ నొప్పెను. అంత గగనసీమ నుండి యాకాశవాణి పరస్పరము వాదించుచున్న ఆ మహాభాగులను ఇద్దరను సంబోధించి ఇట్లనెను: తౌ సంబోధ్య మహాభాగౌ వివదంతౌ పరస్పరమ్ | బ్రహ్మ న్విష్ణో వివాదం మా కురుతాం వాం పరస్పరమ్. 28 లింగస్యాస్య పరం పార మధస్తా దుపరి ధ్రువమ్ | యో యాతి యువయో ర్మధ్యే స శ్రేష్ఠౌ వా సదైవహి. 29 ఏకః ప్రయాతు పాతాళ మాకాశ మపరో%ధునా | ప్రమాణం మే వచః కార్యం త్యక్త్వా వాదం నిరర్థకమ్. 30 మధ్యస్థః సర్వథా కార్యో వివాదే%స్మి న్ద్వయోరిహ | ఋషిరువాచ : తచ్ఛ్రుత్వా వచనం దివ్యం సజ్జీభూతౌ కృతోద్యమౌ. 31 జగ్మతు ర్మాతు మగ్రస్థం లింగమద్భుతదర్శనమ్ | పాతాళ మగమద్విష్ణు ర్ర్భహ్మ%ప్యాకాశ##మేవ చ. 32 పరిమాతుం మహల్లింగం స్వమహత్త్వ వివృద్ధయే | విష్ణు ర్గత్వా కియద్ధేవం శ్రాంతః సర్వాత్మనా యతః. 33 న ప్రాపాంతం స లింగస్య పరివృత్య య¸° స్థలమ్ | బ్రహ్మ%గచ్ఛ త్తత శ్చోర్ధ్వం పతితం కేతకీదళమ్. 34 శిస్య మస్తకా త్ర్పాప్య పదావృత్తో ముదా%వృతః | ఆగత్య తరసా బ్రహ్మా విషవే కేతకీదళమ్. 35 దర్శయిత్వా చ వితథ మువాచ మదమోహితః | లింగస్య మస్తకా దేతత్ గృహీతం కేతకీదళమ్. 36 అభిజ్ఞానాయ చానీతం తవ చిత్తప్రశాంతయే | శ్రుత్వా తద్ర్బహ్హణో వాక్యం దృష్ట్వా చ కేతకీదళమ్. 37 హరి స్తం ప్రత్యువాచేదం సాక్షీ కః కథయాధునా | యథార్థవాదీ మేధావీ సదాచారః శుచిః సమః. 38 సాక్షీ భవతి సర్వత్ర వివాదే సముపస్థితే | బ్రహ్మా : దూరదేశా త్సమాయాతి సాక్షీ కః సమయే%ధునా. 39 ''మహానుభావులగు బ్రహ్మవిష్ణులారా ! మీరు పరస్పర వివాదము చూసుకొనుడు. మీలో నెవ్వరైన ఈ మహాలింగముయొక్క పైకొననుగాని క్రిందికొననుగాని కనుగొన్నచో వారే శ్రేష్ఠులు. నా మాట ప్రమాణముగ స్వీకరింపుడు. వట్టి మాటలు కట్టి పెట్టుడు ఒకరు పాతాళ మేగుడు; మరొక రాకాశము వైపు వెళ్ళుడు. మీకు మధ్యస్థుడుకూడ నుండవలయును'' అను గగనవాణి విని బ్రహ్మవిష్ణులు సన్నద్ధులై యాపనికి పూనుకొనిరి. ఆ మహాలింగమును కొలుచుటకు బ్రహ్మ నింగివైపుగను విష్ణువు రసాతలము వైపుగను బయలుదేరిరి. విష్ణువు తన మహాశక్తితో లింగమును కొలుచుటకు బయలుదేరెను. కాని కొంత దూరమేగిన పిమ్మట విష్ణు వలసట చెందెను. ఎంతకును లింగము మొదలు తెలియనందున విష్ణువు తిరిగి తన యథా పూర్వ స్థానమునకు వచ్చి చేరెను. బ్రహ్మ మాత్రము పై కేగుచునే యుండెను. అతనికి త్రోవలో మొగలిపూవు కనబడెను. అది పరమ శివుని తలనుండి జారి పడుచుండెను. బ్రహ్మ దానిని గొని హరికి చూపించెను. నేనే యీ మహాలింగముపై నుండి యీ మొగలిపూవు తెచ్చితినని బ్రహ్మ యసత్యమాడెను. నీ మదికి శాంతి గలుగుటకు సాక్ష్యముగ దీనిని నేనే కొనివచ్చితిని అను బ్రహ్మ మాటలు వినిన విష్ణువు మొగలి పూవును గాంచి దీనికి సాక్షి యెవరో చెప్పుము. యథార్థవాది - శుచి - మేధావి - సర్వసముడు - సదాచారి - ఇట్టి వారెల్లెడల వివాదము గల్గినపుడు సాక్షులుగ నుండవలయును. అనగా బ్రహ్మ యిట్లనెను: అంతటి దూరమునుండి యిపుడెవడు అట్టి సాక్షి రాగలడు? యత్సత్యం తద్వచః సేయం కేతకీ కథయిష్యతి | ఇత్యుక్త్వా ప్రేరితా తత్ర బ్రహ్మణా కేతకీ స్ఫుటమ్. 40 వచనం ప్రాహ తరసా శార్గిణం ప్రత్యబోధయత్ | శివమూర్ధ్ని స్థితాం బ్రహ్మా గృహీత్వా మాం సమాగతః. 41 సందేహో%త్ర న కర్తవ్య స్త్వయా విష్ణో కధాచన | మమ వాక్యం ప్రమాణం హి బ్రహ్మా పారంగతో%స్యహ. 42 గృహీత్వా మాం సమాయాతః శివభ##క్తైః సమర్పితామ్ | కేతక్యా వచనం శ్రుత్వా హరి రాహ స్మయన్నివ. 43 మహాదేవః ప్రమాణం మే యద్యసౌ వచనం వదేత్ | తాదాకర్ణ్య హరేర్వార్యం మహాదేవః సనాతనః. 44 కుపితః కేతకీం ప్రాహ మిథ్యావాదిని మా వద | గచ్ఛతో మధ్యతః ప్రాప్తా పతితా మస్తకా న్మమ. 45 మిథ్యాభిభాషిణీ త్యక్త్వా మయా త్వం సర్వదైవహి | బ్రహ్మా లజ్జాపరో భూత్వా ననామ మధుసూదనమ్. 46 శివేన కేతకీ త్యక్తా తద్దివి త్కుసుమేషు వై | ఏవం మాయాబలం విద్ధి జ్ఞానినామపి మోహదమ్. 47 అన్యేషాం ప్రాణినాం రాజ న్కావార్తా విభ్రమం ప్రతి | దేవానాం కార్యసిద్ధ్యర్థం సర్వథైవ రమాపతిః. 48 దైత్యా న్వంచయతే చాశు త్యక్త్వా పాపభయం హరిః | అవతార కరో దేవో నానాయోనిషు మాధవః. 49 త్యక్త్వా%%నంద సుఖం దైత్త్యేర్యుద్ధం చైవాకరోద్విభుః | నూనం మాయాబలం చైతన్మాధవే%పి జగద్గురౌ. 50 సర్వజ్ఞే దేవకార్యాంశే కావార్తా%%న్యస్య భూపతే | జ్ఞానినా మపి చేతాంసి పరమా ప్రకృతిః కిల. 51 బలదాకృష్య మోహాయ ప్రయచ్ఛతి మహీపతే | యయా వ్యాప్త మిదం సర్వం భగవత్యా చరాచరమ్. 52 ఈ మొగలిపూవే నీకు సాక్ష్యమిచ్చును. అనుచు సాక్ష్యము పలుకుమని బ్రహ్మ ఆ పూవును ప్రేరించెను. ఆ పూవు వెంటనే హరితో నేను శివలింగముపై నుండగ బ్రహ్మ నన్ను గొని వచ్చెను. నా మాట మీకు నీకు సందియము వలదు. బ్రహ్మ లింగము చివరకేగె ననుటకు నా మాటయే ప్రమాణము. శివ భక్తులు నన్ను శివున కర్పించగా బ్రహ్మ నన్ను గొనివచ్చెను'' అనెను. మొగలి పూవు పలికిన మాటలు విని హరి నవ్వి ఈ మాటలు శివుడే వచ్చి చెప్పినచో నమ్ముదు'' ననెను. విష్ణు వచనములను శివుడు విని కోపించి మొగలి కిట్లనియెను : ఓ అసత్యమాడుదానా! నోరుమూసి కొనుము. నా శిరమునుండి జారిపడుచు నడుమ బ్రహ్మకు దొరికితివి గదా! నీ వసత్య మాడితివి. కనుక నేను నిన్ను త్యజించుచున్నాను.' అనెను. బ్రహ్మ విష్ణుని పాదములకు మ్రొక్కెను. నాటి నుండి శివుడు మొగలిపూవు తన పూజకు తగదని దానిని పరిత్యజించెను. ఇట్లు మహామాయ జ్ఞానులను సైతము మోహభ్రాంతిలో ముంచివైచును. ఇంక నితరులగు సామాన్యులకు మోహము గల్గుననుటలో వింతయేమున్నది? హరి దేవతలు శ్రేయస్సును కోరి వారి కార్యసిద్ధికి పాటుపడును. ఆయన పాపభీతి వదలి రక్కసులను వంచించుచుండును. అందులకై అతడు పెక్కు యోనులందు జన్మము లెత్తుచుండును. తన సుఖము వదలుకొని దైత్యులతో బోరాడుచుండును. అతడు జగద్గురువు - సర్వజ్ఞుడు - రమాధవుడు; అట్టివాడు మాయా బలమునకు లొంగునా? విష్ణువే లొంగినచో సాధారణుల మాట చెప్పవలయునా! ఆ పరాప్రకృతి జ్ఞానుల చిత్తములను గూడ వశీకరించును. మాయాశక్తి యెంత లావు వానినైనను లాగిపట్టి మోహములో పడద్రోయును. ఆ భగవతి మూలముననే యీ చరాచర జగమంతయును మాయాజాలముతో నిండియున్నది. మోహదా జ్ఞానదా సైవ బంధమోక్షప్రదా సదా | రాజోవాచ: భగవన్ర్భూహి మే తస్యాః స్వరూపంబలముత్తమమ్. 53 ఉత్పత్తి కారణం వా%పి స్థానం పరమకం చ యత్ | ఋషిరువాచ : న చోత్పత్తి రనాదిత్వా న్నృప తస్యాః కదాచన. 54 నిత్యైవ సా పరాదేవీ కారణానాం చ కారణమ్ | వర్తతే సర్వభూతేషు శక్తిః సర్వాత్మనా నృప. 55 శవవచ్ఛక్తి హీన స్తు ప్రాణీ భవతి సర్వథా | చిచ్ఛక్తిః సర్వభూతేషు రూపం తస్యా స్తదేవ హి. 56 ఆవిర్భావతిరోభావౌ దేవానాం కార్యసిద్ధయే | యదా స్తువంతి తాం దేవా మనుజా శ్చ విశాంపతే. 57 ప్రదుర్భవతి భూతానాం దుఃఖనాశాయ చాంబికా | నానారూపధరా దేవీ నానాశక్తి సమన్వితా. 58 ఆవిర్భవతి కార్యార్థం స్వేచ్ఛయా పరమేశ్వరీ | దైవాధీనాన సా దేవీ యథా సర్వే సురా నృప. 59 న కాలవశగా నిత్యం పురుషార్థ ప్రవర్తినీ | అకర్తా పురుషో ద్రష్టా దృశ్యం సర్వమిదం జగత్. 60 దృశ్యస్య జననీ సైవ దేవీ సదసదాత్యిక | పురుషం రంజయత్యేకా కృత్వా బ్రహ్మాండనాటకమ్. 61 రంజితే పురుషే సర్వం సంహరత్యతి రంహసా | తయా నిమిత్తభూతా స్తే బ్రహ్మవిష్ణుమహేశ్వరాః. 62 కల్పితాః స్వస్వకార్యేషు ప్రేరితా లీలయా త్వమీ | స్వాంశం తేషు సమారోప్య కృతాస్తే బలవత్తరాః. 63 దత్తాశ్చ శక్తయ స్తేభ్యో గీర్లక్ష్మీర్గిరిజా తథా | తే తాం ధ్యాయంతి దేవాశాః పూజయంతి పరాం ముదా. 64 జ్ఞాత్వా సర్వేశ్వరీం శక్తిం సృష్టి స్థితి వినాశినీమ్ | ఏతత్తే సర్వ మాఖ్యాతం దేవీ మహాత్మ్యముత్తమమ్. 65 మమ బుద్ధ్యనుసారేణ నాంతం జానామి భూపతే | ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే త్రయస్త్రింశో%ధ్యాయః. ఆ మహామాయ యెల్లరకు మోహము జ్ఞానము బంధమోక్షములు మున్నగు వానిని గల్గించును'' అన రాజిట్లనెను : ఓ మునీశ్వరా ! ఆ మహామాయా స్వరూపమెట్టిది? ఆమె మహాసత్త్వమెట్టిది? శక్తి పుట్టు స్థానమేది? ఆ ప్రాణశక్తి పరమస్థానమేది? ముని యిట్లనెను : ఆ విశ్వశక్తి యనాది. కనుక నామె కుత్పత్తి యెన్నడు నెప్పుడు నెక్కడ లేదు. ఆమె నిత్యసత్యపరాప్రకృతి - కారణ కారణ - సర్వభూతములలోని శక్తి రూపమున నెల్లప్పుడు చైతన్యజ్యోతిగ వెలుగుచుండును. ఆ శక్తి లేనివాడు శవమే. ఆ మహాశక్తి సర్వభూతములందు చిచ్ఛక్తి రూపమున వెల్గులు విరజిమ్మును. ఆ దేవమాత దేవతల కార్యసిద్ధి కావిర్భవించును. ఆమె నానా శక్తులు - నానా రూపములు - దాల్చి వన్నెగాంచును. ఆ పరమేశ్వరి దేవకార్యసిద్ధికై తనకు తానే యావిర్భవించును. ఆ మహాశక్తి తక్కిన దేవతలవలె దైవమునకు లోబడదు. ఆ విశ్వమాత కాలమునకు లోబడునదిగాదు. ఆమె పురుషుని ప్రయోజనములనుబట్టి ఆతని పనులు నిర్వహించును. పురుషుడు ద్రష్ట - అకర్త. ఈ జగములన్నియును దృశ్య మాయా జగన్నాటకమాడి, పరమ పురుషుని రంజింపజేయును. అట్లామె పురుషుని రంజింపజేసి తిరిగి యంతటిని ప్రళయమున ముంచివేయును. హరిహర బ్రహ్మలును నిక్కముగ నిమిత్తమాత్రులే. ఆ మహాశక్తి వారి వారి పనులందు లీలగ నియమించును. ఆమె వారియందు తన శక్తినుంచుట వలన వారు మహాబలశాలులైరి. ఆ తల్లి బ్రహ్మ - విష్ణు-మహేశులకు సరస్వతీ-పార్వతుల నొసంగెను. దేవేశ్వరులగు తిమూర్తులు సైతమా జగదేకమాతను నిరంతరముగ పరమప్రీతితో ధ్యానించుచుందురు. ఆ సర్వేశ్వరీ శక్తి సృష్ఠి-స్థితి-సంహారము లొనర్చునని వారెఱింగిరి. ఈ విధముగ శ్రీదేవీ మాహాత్మ్య మత్యద్భుతముగ వెలుగుచుండును. దీనిని నా బుద్ధికి తోచినంతగ నీకు చెప్పితిని. కాని దానిని సాకల్యముగ నేను నెఱుగను. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు దేవతలును మహామాయకు మోహితులగుట అను ముప్పదిమూడవ యధ్యాయము.