Sri Devi Bhagavatam-1    Chapters   

ప్రథమస్కంథ - ద్వాదశాధ్యాయః

సూతః : తతః పురురవా జజ్జే ఇలాయాం కథయామి వః | బుధ పుత్రో తిధర్మాత్మా యజ్జకృ ద్దానతత్పరః 1

సుద్యుమ్నో నామ భూపాలః సత్యవాదీ జితేంద్రియః | సైంధవం హయ మారుహ్య చచార మృగయాం వనే. 2

యుతః కతిపయామాత్యై ర్దంశిత శ్చారుకుండలః | ధను రాజగవం బద్ధ్వా బాణసంఘం తథా %ద్భుతమ్‌ 3

స భ్రమం స్తద్వనోద్దేశే హన్యమానో రురూ స్మృగాన్‌ | శశాంశ్చ సూకరాంశ్చైవఖడ్గాంశ్చగవయాం స్తథా. 4

శరభా న్మమిషాంవూవ సృమరా న్వనకుక్కుటాన్‌ | నిఘ్న న్మేధ్యా న్పశూ న్రాజ. ఆ కుమారవన మావిశత్‌. 5

మేరోరధస్తలే దివ్య మందార ద్రుమ రాజితమ్‌ | అశోకలతికా కీర్ణం వకులై రధివాసితమ్‌. 6

సాలైసాలై స్తమాలైశ్చ చంపకైః పనసై స్తథా | ఆమ్రై ర్నీ పై ర్మధైకైవ్చ మాధవీమండలపావృతమ్‌ 7

దాడివై ర్నారికేళైచ్ఛ కదళీఖండమండితమ్‌ | యూధికా మాలతీ కుంద పుష్పవల్లీ సమావృతమ్‌. 8

హంసకారండవాకీర్ణం కీచకద్వని నాదితమ్‌ | భ్రమరాళిరుతారామం వనం సర్వ సుఖావహమ్‌. 9

దృష్ట్యా ప్రముదితో రాజా సుద్యుమ్నః సేవకై ర్వృతః | వృక్షా న్సుపుష్పితా న్వీక్ష్యకోకిలారావమండితాన్‌. 10

ప్రవిష్ట స్తత్ర రాజర్షిః స్త్రీత్వ మాప క్షణాత్తతః | అశ్వో% పి బడబా జాత శ్చింతావిష్టః స భూపతిః. 11

కిమేత దితి చింతార్త శ్చింత్య మానః పునః | దుఃఖం బహుతరం ప్రాప్తః సుద్యుమ్నో లజ్జయా న్వితః 12

కిం కరోమి కథం యామి గృహం స్త్రీభావసంయుతః | కథం రాజ్యం కరిష్యామి కేన వా వంచితో హ్యహమ్‌. 13

పండ్రెండవ అధ్యాయము

సుద్యుమ్నస్తుతి

సూతుడిట్లనియెను : పిమ్మట బుధునకిలయందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుడు దర్మాత్ముడు. పెక్కు యజ్ఞము లొనరించినవాడు. దానశీలుడు. అట్టి పురూరవుని జన్మవృత్తాంతము వివరింతును, వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి యుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, ఒకనాడతడు సింధు దేశోద్భవమగు నశ్వమెక్కి మంత్రులతో గూడి కవచధారియై యందమైన కుండలములు దాల్చి అజగవమను ధనువును బాణములను చేపట్టి వేటకై యడవి కేగెను. ఆ రాజు పెక్కు రురుమృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగములు, శరభములు, మహిషములు, సృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను యజ్జియములగు పశువులను పక్షులను జెండాడుచు కుమార వనమందు ప్రవేశించెను. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోక లతలు, సాల, తమాల, చంపక, పనసవృక్షములు మామిడి, కడిమి, ఇప్ప, గురివింద వృక్షములు మాధవీలతామండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును అడవిమొల్ల మాలతి కుంద పూదీవియలును కనుల పండువుగ నుండెను. ఆ వనము హంస కారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోను గండుతుమ్మెదల ఝంకారముతోను చెవుల పండువు సేయుచుండెను. అట్టి సుందర వనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగ విహరించుచు రంగురంగుల పువ్వులను గనుచు మత్తకోకిల మధురగానములు వినుచు సంతసిల్లుచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు పోవుచునే ప్రమోదము నిండార వనమందు జేరగనే ప్రమదగ మారెను. ఆతని మగగుఱ్ఱ మాడుగుఱ్ఱమయ్యెను. ఆ వింతగని రాజు చింతాక్రాంతుడయ్యెను. ఈ వింతకు కారణమేమో యని మాటిమాటికి వంతంజెందుచు తన నారీ రూపమునకు తలవంచుకొనుచు ఈ యాడుదనంబుతో నేనింకేమిజేతును? ఇంటి కెట్టులేదగుదును? రాజ్యమేలుట యెట్లో? వంచించిన దెవ్వరో?' యని రాజు లోలోననే తెలుపరాని బాధ పడుచుండెను.

సూతాశ్చర్య మిదం ప్రోక్తం త్వయా య ల్లోహహర్షణ | సుద్యుమ్నః స్త్రీత్వ మాపన్నో భూపతి ర్దేవసన్నిభః. 14

కింతత్కారణ మాచక్ష్వ వనే తత్ర మనోహరే | కిం కృతం తేన రాజ్ఞా చ విస్తరం వద సువ్రత! 15

సూత ఉవాచ : ఏకదా గిరిశం ద్రష్టుమృషయః సనకాదయః | దిశో వితిమిరాభాసాః కుర్వంతం సముపాగమన్‌. 16

తస్మింశ్చ సమయే తత్ర శంకరః ప్రమదాయుతః | క్రీడాసక్తో మహాదేవో వివస్త్రా కామినీ శివా. 17

ఉత్సంగే సంస్థితా భర్తూ రమమాణా మనోరమా | తా న్విలోక్యాంబికా దేవీ వివస్త్రా వ్రీడితా భృశమ్‌. 18

భర్తురంకా త్సముత్థాయ వస్త్ర మాదాయ పర్యదాత్‌ | లజ్జావిష్టా స్థితా తత్ర వేపమానా% తి మానినీ. 19

ఋషయో% పి తయో ర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః | పరివృత్య యయు స్తూర్ణం నరనారాయణాశ్రమమ్‌ 20

హ్రీయుక్తాం కామినీం వీక్ష్య ప్రోవాచ భగవాన్‌ హరః | కథం లజ్జాతురా%సి త్వం సుఖం తే ప్రకరోమ్యహమ్‌. 21

అద్య ప్రభృతి యో మోహా త్పుమాన్కో%పి వరాననే | వనం చ ప్రవిశే దేత త్స వై యోషి ద్భవిష్యతి. 22

ఇతి శప్తం వనం తేన యే జానంతి జనాః క్వచిత్‌ | వర్ణయంతీహ తే కామం వనం దోషసమృద్ధిమత్‌. 23

సుద్యుమ్నస్తు తదజ్ఞానా త్ప్రనిష్టః సచివైః సహ | తథైవ స్త్రీత్వ మాపన్న సై#్తః సహే తి న సంశయః. 24

చింతావిష్టః స రాజర్షి ర్నజగామ గృహం హ్రియా | విచచార బహి స్తస్మా ద్వనదేశా దితస్తతః. 25

ఇలేతి నామ సంప్రాప్తం స్త్రీత్వే తేన మహాత్మనా | విచరం స్తత్ర సంప్రాప్తో బుధః సోమసుతో యువా. 26

స్త్రీభిః పరివృతాం తాం తు దృష్ట్యా కాంతాం మనోరమామ్‌ | హావభావకళాయుక్తాం చకమే భగవా న్బుధః. 27

సా% పి తం చకమే కాంతం బుధం సోమసుతం పతిమ్‌ | సంయోగ స్తత్ర సంజాతస్త యోః ప్రేవ్ణూపరస్పరమ్‌. 28

స తస్యాం జనయామాస పురూరవస మాత్మజమ్‌, 29

ఋషులిట్లనిరి : ఓ సూతా! ఆ దేవసన్నిభుడగు సుద్యుమ్నుడు పడతిగనెట్లు మారెను? ఇదంతయును వింతగ నున్నది. రాజా సుందరవనమందు గ్రుమ్మరుటచే నట్లు జరుగుటకు కారణమేమి? ఆ తరువాత నతడేమి చేసెనో తెల్లమొనర్పుము. సూతుడిట్లనియెను : పూర్వము సనకాదియోగి పుంగవులు తమలోని దివ్యకాంతిపుంజములు దెసలను వెలిగించు చుండగ శివసందర్శనమున కరిగిరి. అత్తఱి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై యుండెను. దిగంబరయై యుండెను. ఆ మానవతి ఋషులను గాంచి తలవంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండుటగని ఋషులచ్చోటు వదలి గ్రక్కున నరనారాయణాశ్రమ మేగిరి. ఆ పార్వతి లజ్జించుట గాంచి శంకరభగవానుడామెతో నీవేల లజ్జాతురవగుదువు? నీ మదిలోని కుందు బాపుదును. ఈ వనమెవడేని ప్రవేశించినచో నతడు స్త్రీరూపమందును. ఈ వనమీవిధముగ వపింపబడెనని విన్నవాడెవడైనను దోషభూయిష్ఠమైన యీ వనమును ప్రవేశింపరాదు అని పలికెను. ఆ సుద్యుమ్నున కీ శివశాపము తెలియకపోవుటచే తన మంత్రులం గూడి యందు ప్రవేశించి స్త్రీ భావము నందెను. అతడు చేయునది లేక తలవంచుకొని తన భవనమునకేగక వనమందే యటునిటు గ్రుమ్మరుచుండెను. ఆ నారిగ మారిన మహాత్ముడు 'ఇల' యను పేర బరగెను. అంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు నచ్చటి కేతెంచి ఆ యిలాకామినిని పెక్కురు చెలికత్తియల నడుమ మనోహరిణిగనున్న దానిని జూచి కామించెను. ఆ యిలయును చంద్రుని కుమారునే తన కాంతునిగ తంచెను. వారిరువుర సంయోగ ఫలితముగ బుధునకా యిలయందు పురూరవుడను కుమారుడు జనించెను.

సా ప్రాసూత సుతం బాలా చింతావిష్జా వనే స్థితా | సస్మార స్వకులాచార్యం వసిష్ఠం మునిసత్తమమ్‌. 30

స తదా%స్య దశాం దృష్ట్వా సుద్యుమ్నస్య కృపాన్వితః | అతోషయ న్మహాదేవం శంకరం లోకశంకరమ్‌. 31

తసై#్మస భగవాం స్తుష్జః ప్రదదౌ వాంఛితం వరం | వసిష్టః ప్రార్థయామాస పుంస్త్వం రాజ్ఞః ప్రియస్య చ. 32

శంకరస్తు నిజాం వాచ మృతాం కుర్వ న్నువాచ హ | మాసం పుమాంస్తు భవితా మాసం స్త్రీ భూపతి కిల. 33

ఇత్థం ప్రాప్య వరం రాజా జగామ స్వగృహం పునః | చక్రే రాజ్యం స ధర్మాత్మా వసిష్ఠస్యా ప్యనుగ్రహాత్‌. 34

స్త్రీత్వే తిష్ఠతి హర్మ్వేషు పుంస్త్వే రాజ్యం ప్రశాస్తి చ | ప్రజా స్తస్మి న్సముద్విగ్నా నాభ్యనంద న్మహీపతిమ్‌. 35

కాలే తు ¸°వనం ప్రాప్తః పుత్రః పురూరవా స్తదా | ప్రతిష్ఠానవతి స్తసై#్మ దత్వా రాజ్యం వనం య¸°. 36

గత్వా తస్మి న్వనే రమ్యే నానాద్రుమసమాకులే, నారదా న్మంత్ర మాసాద్య నవాక్షర మనుత్తమమ్‌. 37

జజాప మంత్ర మత్యర్థం ప్రేమపూరితమానసః | పరితుష్టా తదా దేవీ సుగుణా తారిణీ శివా. 38

సంహారూఢా స్థితా చాగ్రే దివ్యరూపా మనోరమా | వారుణీపాన సంమత్తా మదాఘూర్ణితలోచనా. 39

దృష్వా తాం దివ్యరూపాం చ ప్రేమాకులితలోచనః | ప్రణమ్య శిరసా ప్రీత్యా తుష్ఠాన జగదంబికామ్‌. 40

అటులు ఇల వనమందే తనయుని గని చింతాకులయై తనకులాచార్యుడు మునిసత్తముడగు వసిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్నుని దీనదశ జూడగనే జాలి కలిగి వసిష్ఠుడు లోకశంకరుండగు శంకరుని ప్రార్థించెను. పరమ శివుడు ప్రసాదభావము నొందుట గని రాజునకు మరల పురుషత్వము గలుగవలయునని ముని శివుని వేడుకొనెను. మహేశ్వరుడు తన పలికిన వాక్యము సత్యము జేయుటకై యితడొక నెల పురుషుడుగను నొకనెల స్త్రీగను నుండునని పలికెను. ఇట్లు రాజు వసిష్టుని దయవలన వరము బడసి తన గృహమేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగ మారినపుడంతఃపుర మందే యుండును. పురుషుడైనపుడు రాజ కార్యములు చక్కబెట్టుచుండును. దీనికి ప్రజలుద్విగ్నులై సంతోషము జెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడగు పురూరవుడు యువకుడు కాగా నతనికి ప్రతిష్ఠానపురము రాజధానిగ రాజ్యమొసంగి రాజు వనమున కరిగెను. పలు వృక్షములతో నుల్లము పల్లవింపజేయు రమ్యవనమందా రాజు నారదమునివలన పావనమైన నవాక్షరమంత్రము నుపదేశమంది ఆ శ్రీదేవీ మంత్రమునే భక్తిశ్రద్ధలతో నిరంతరముగ జపించుచుండెను. అంత సర్వగుణోపేతయు తరింపజేయునదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహారిణియు మద్యపానముచే మత్తయు మదముచే నాకులములైన లోచనములు గలదియునగు దేవి యతని యెడ ప్రసన్న యయి సాక్షాత్కరించెను. రాజా దివ్యమంగళమూర్తిని తన యెదుట సందర్శించగనే యతని హృదయము నుండి ప్రేమ భక్తి పెల్లుబికి యా జగదంబికను భక్తితో నీ విధముగ సంస్తుతింప దొడంగెను.

ఇలోవాచ : దివ్యం చ తే భగవతి ప్రథితం స్వరూపం | దృష్టం మయా సకలలోకహితానురూపమ్‌.

వందే త్వదంఘ్రికమలం సురసంఘ సేవ్యం | కామప్రదం జనని ! చాపి విముక్తిదం చ. 41

కో వేత్తి తే%ంబ భువి మర్త్యతను ర్నికామం | ముహ్యంతి యత్ర మునయశ్చ సురాశ్చ సర్వే |

ఐశ్వర్య మేత దఖిలం కీపణ దయాం చ | దృష్ట్వైవ దేవి సకలం కిల విస్మయో మే.

ళంభుర్హరిః కమలజో మఘవా రవిశ్చ విత్తేశ వహ్ని వరుణాః పవనశ్చ సోమః.

జానంతి నైవ వసవో%పి హితే ప్రభావం బుధ్యే త్కథం తవ గుణా నగుణో మనుష్యః. 43

జానాతి విష్ణు రమితద్యుతి రంబ సాక్షాత్‌ త్వాం సాత్త్వికీ ముదధిజాం సకలార్థదాం చ |

కో రాజసీం హర ఉమాం కిల తామసీం త్వాం వేదాంబికే! న తు పునః ఖలు నిర్గుణాం త్వామ్‌. 44

క్వాహం సుమందమతి రప్రతిమప్రభావః క్వాయం తవాతినిపుణోమయి సుప్రదాదః |

జానే భనాని చరితం కరుణాసమేతం య త్సేవకాంశ్చ దయసే త్వయిభావయుక్తాన్‌. 45

వృత స్త్వయా హరి రసౌ వనజేశయాపి నైవాచరత్యపి ముదం మధుసూదనశ్చ |

పాదౌ తవాదిపురుషః కిల పావకేన కృత్వా కరోతి కరోతి చ కరేణ శుభౌ పవిత్రౌ. 46

వాంఛత్వహో హరి రశోక ఇవాతికామం పాదాహతిం ప్రముదితః పురుషః పురాణః |

త్వాం త్వం కరోషి రుషితా ప్రణతం చ పాదే దృష్ట్వా | పతిం సకలదేవనుతం స్మరార్తమ్‌. 47

వక్షఃస్థలే వససి దేవి సదైవ తస్య పర్యంకవ త్సుచరితే విపులే%తిశాంతే |

సౌదామనీవ సుఘనే సువిభూషితే చ కిం తేన వాహన మసౌ జగదీశ్వరో%పి. 48

త్వం చే జ్జహాసి మధుసూదన మంబ కోపా న్నైవార్చితో%పి స భ##వే త్కిల శక్తిహీనః |

ప్రత్యక్షమేవ పురుషం స్వజనా స్త్యజంతి శాంతం శ్రియోజ్ఘిత మతీవ గుణౖ ర్వియుక్తమ్‌. 49

బ్రహ్మా దయః సురగణా స తు కిం యువత్యో యే త్వత్పదాంబుజ మహర్నిశ మాశ్రయంతి |

మన్యే త్వయైన విహతాః ఖలు తే పుమాంసః కిం వర్ణయామి తవ శక్తి మనంతవీర్యే. 50

త్వం నాపుమా న్న చ పుమా నితి మేవికల్పో యాకా%సి దేవి సుగుణా నను నిర్గుణా వా |

తాం త్వాం నమామి సతతం కిల భావయుక్తో వాంఛామి భక్తి మచలాం త్వయి మాతరం తే. 51

సూత ఉవాచ : ఇతి స్తుత్వ్వా మహీపాలో జగామ వరణం తదా పరితుష్టా దదౌ దేవీ తత్ర సాయుజ్య మాత్మని. 52

సుద్యుమ్నస్తు తతః ప్రాప్త పదం పరమకం స్థిరమ్‌ | తస్యా దేవ్యా ః ప్రసాదేన మునీనా మపి దుర్లభమ్‌ 53

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కందే | సుద్యుమ్నస్తితిర్నామ ద్వాదశో%ధ్యాయః.

భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు. సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ నా రాజు సంస్తుతించగనే శ్రీదేవి సుప్రసన్నయై యతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవీ ప్రసాదమున మునులకును దుర్లభ##మైన ధ్రువ పరమపదమును జెందెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందు సుద్యుమ్నస్తుతి యను ద్వాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters