Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుస్త్రింశో%ధ్యయః రాజోవాచ: భగవ న్ర్భూహి మే సమ్యక్తస్యా ఆరాధనే విధిమ్ | పూజావిధం చ మంత్రాంశ్చ తథా హోమవిధిం వద.
1 ఋషిరువాచ : శృణు రాజ న్ర్పవక్ష్యామి తస్యాః పూజావిధం శుభమ్ | కామదం మోక్షదం నౄణాం జ్ఞానదం దుఃఖనాశనమ్.
2 ఆదౌ స్నాన విధిం కృత్వా శుచిః శుక్లాంబరో నరః | ఆచమ్య ప్రయతః కృత్వా శుభ మాయతనం నిజమ్.
3 తతో%వలిప్త భూమ్యాంతు సంస్థాప్యాసన ముత్తమమ్ | తత్రోపవిశ్య విధివ త్త్రిరాచమ్య ముదా%న్వితః. 4 పూజాద్రవ్యం సుసంస్థాప్య యథాశక్త్యనుసారతః | ప్రాణాయామం తతః కృత్వా భూతశుద్ధిం విధాయ చ. 5 కుర్యాత్ర్పాణప్రతిష్ఠాం తు సంభారం ప్రోక్ష్య మంత్రతః | కాలజ్ఞానం తతః కృత్వా న్యాసం కుర్యా ద్యథావిధి 6 శుభే తామ్రమయే పాత్రే చందనేన సితేన చ | షట్కోణం విలిఖే ద్యంత్రం చాష్టకోణం తతో బహిః. 7 నవాక్షరస్య మంత్రస్య బీజాని విలిఖే త్తతః | కృత్వా యంత్రప్రతిష్ఠాం చ వేదోక్తాం సంవిధాయ చ. 8 అర్చాం వా ధాతవీం కుర్యా త్పూజామంత్రైః శివోదితైః | పూజనం పృథివీపాల భగవత్యాః ప్రయత్నతః. 9 కృత్వా వా విధివత్పూజా మాగమోక్తాం సమాహితః | జపే న్నవాక్షరం మంత్రం సతతం ధ్యానపూర్వకమ్. 10 హోమం దశాంశతః కుర్యా ద్దశాంశేన చ తర్పణమ్ | భోజనం బ్రాహ్మణానాం చ తద్దశాంశేన కారయేత్. 11 చరిత్రత్రయ పాఠం చ నిత్యం కుర్యా ద్విసర్జయేత్ | నవరాత్రవ్రతం చైవ విధేయం విధిపూర్వకమ్. 12 అశ్వినే చ తథా చైత్రే శుక్లే పక్షే నరాధిప | నవరాత్రోపవాసో వై కర్తవ్యః శుభమిచ్ఛతా. 13 హోమః సువిపులః కార్యో జప్యమంత్రైః సుపాయసైః | శర్కరాఘృతమిశ్రై శ్చ మధుయుక్తైః సుసంస్కృతైః. 14 ముప్పదినాల్గవ యధ్యాయము శ్రీమద్దేవీ నవరాత్ర వ్రత విధానము రాజిట్లనెను : మహానుభావా ! ఆ దయామయి యగు శ్రీదేవి యొక్క పూజా విధానము - ఆరాధన విశేషము - మంత్రహోమముల తెఱంగును నాకు ప్రస్ఫుటముగ దెలుపుము అన ముని యిట్లనెను : రాజా ! నీకు శ్రీకళారూపయగు దేవి యొక్క పూజావిధాన మెఱింగింతును. శ్రద్ధగ వినుము. ఆ దేవీ పూజవలన జనులకు ధర్మార్థ కామమోక్షములు గల్గును. బ్రహ్మజ్ఞానము గల్గును. దుఃఖ శోకములు నశించును. మానవుడు మొట్టమొదట శుచిగ స్నానము చేయవలయును. అతడు తెల్లని మడుపులు ధరించవలయును. అతడు తన కనువగు చోట గూర్చుండి యాచమనము చేయవలయును. ఆ ప్రదేశ మావు పేడతో నలుకవలయును. అచ్చోట నుత్తమాసన మేర్పరచవలయును. దానిపై కూర్చుండి ముమ్మారు ఆచమించవలయును. దానికి పూర్వము మొదట పూజాద్రవ్యములు యథాశక్తిగ సమకూర్చుకొనవలయును. ప్రాణాయామ మొనరించి భూతశుద్ధికి మాతృకాన్యాస మొనర్పవలయును. తదుపరి సంకల్పము చేసి పిదప శ్రీదేవీ ప్రాణప్రతిష్ఠ జరుపవలయును. ఆ పిదప యథావిధిగ న్యాసము లొనర్పవలయును. ఒక తామ్రపత్రముపై మంచి గంధముతో షట్కోణ యంత్రము వ్రాయవలయును. వానియందు నవాక్షర మంత్రబీజములు వ్రాసి వేదోక్తముగ యంత్ర ప్రతిష్ఠ నొనర్పవలయును. పిమ్మట యంత్ర పూజ సలుపవలయును. యంత్రము లేనిచో నేదే నొక శ్రీదేవి ప్రతిమను చేసి భగవతీపూజ విధివిధానముగ జరుపవలయును. ఈ విధముగ వేదోక్త మంత్రములతో శ్రీదేవిని పూజింపవలయును. అదియును గానిచో నిశ్చల నిర్మల ధ్యానముతో నవాక్షర మంత్రము నిరంతరము జపింపవలయును. జపసంఖ్యకు దశాంశము హోమమును హోమదశాంశము దేవీ తర్పణమును తర్పణ దశాంశము బ్రాహ్మణ భోజనమును నిష్ఠతో జరుపవలయును. ప్రతినిత్యమును శ్రీదేవీ చరిత్రత్రయము చక్కగ పఠించి దేవీ విసర్జనము చేయవలయును. ఈ విధముగ విధిగ దేవీనవ రాత్రములందు దేవీ వ్రతమును సమాచరింపవలయును. తనకు శుభమును కోరుకొను మనుజుడు చైత్రాశ్వయుజ మాసములలోని నవరాత్రములందు విధిగ నుపవసింపవలయును. పంచదార నేయి-తేనె కలిసిన పాయసమును దేవీ జపమంత్ర ముచ్చరించుచు దేవీ ప్రియముగ హోమము చేయవలయును. ఛాగమాంసేన వా కార్యో బిల్వపత్రై స్తథా శుభైః | హయారి కుసుమైః రక్తై స్తిలైర్వా శర్కరాయుతైః. 15 అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాంచ విశేషతః | కర్తవ్యం పూజనం దేవ్యా బ్రాహ్మణానాం చ భోజనమ్. 16 నిర్ధనో దన మాప్నోతి రోగీ రోగా త్ర్పముచ్యతే | అపుత్రో లభ##తే పుత్రాన్ శుభాంశ్చ వశవర్తినః. 17 రాజ్యభ్రష్టో నృపో రాజ్యం ప్రాప్నోతి సార్వభౌమికమ్ | శత్రుభిః పీడితో హంతి రిపుం మాయాప్రసాదతః. 18 విద్యార్థీ పూజనం యస్తు కరోతి నియతేంద్రియః | అనవద్యాం శుభాం విద్యాం విందతే నా%త్ర సంశయః. 19 బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా భక్తిసంయుతః | పూజయే జ్జగతాం ధ్రాత్రీం ససర్వసుఖభాగ్భవేత్. 20 నవరాత్రవ్రతం కుర్యా న్నరనారీగణ శ్చయః | వాంఛితం ఫల మాప్నోతి సర్వదా భక్తి తత్పరః. 21 ఆశ్వినే శుక్లపక్షే తు నవరాత్రవ్రతం శుభమ్ | కరోతి భావసంయుక్తః సర్వాన్కామా నవాప్నుయాత్. 22 విధివన్మండలం కృత్వా పూజాస్థానం ప్రకల్పయేత్ | కలశం స్థాపయే త్తత్ర వేదమంత్ర విధానతః. 23 యంత్రం సురుచిరం కృత్వా స్థాపయే త్కలశోపరి | వాపయిత్వా యవాం శ్చారూ న్పార్శ్వతః పరివర్తితాన్. 24 కృత్వోపరి వితానం చ పుష్పమాలా సమావృతమ్ | ధూపదీప సుసంయుక్తం కర్తవ్యం చండికాగృహమ్. 25 త్రికాలం తత్ర కర్తవ్యా పూజా శక్త్యనుసారతః | విత్తశాఠ్యం న కర్తవ్యం చండికాయాశ్చ పూజనే. 26 ధూపై ర్దీపైః సునైవేద్యైః ఫలపుషై#్ప రనేకశః | గీతవాద్యైః స్తోత్రపాఠై ర్వేదపారాయణౖ స్తథా. 27 ఉత్సవ స్తత్ర కర్తవ్యో నానావాదిత్ర సంయుతైః | కన్యకానాం పూజనం చ విధేయం విధి పూర్వకమ్. 28 చందనై ర్భూషణౖ ర్వసై#్త్ర ర్భక్ష్యై శ్చ వివిధై స్తథా | సుగంధ తైలమాల్యై శ్చ మనసో రుచికారకైః. 29 అది సాధ్యముగానిచో మేక మాంసముతోగాని బిల్వదళములతోగాని యెఱ్ఱని కరవీర సుమములతోగాని నూగులు పంచదార కలిపిగాని వేల్చవచ్చును. ఈ విధమాచరించుచు అష్టమీ - నవమీ - చతుర్దశులందు యథావిధిగ బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును. ఈ విధానముతో శ్రీదేవీ వ్రత మాచరించినచో పేదవాడు కలిమికలవాడగును. రోగి స్వస్థుడగును. అపుత్త్రకుడు తన మాట వినునట్టి సత్పుత్త్రులను బడయును. రాజ్యభ్రష్టుడు చక్రవర్తి గాగలడు. శత్రుపీడితుడు దేవి దయవలన శత్రునాశ మొనర్పగలడు. ఈ విధముగ నొక విద్యార్థి ఇంద్రియ సంయమముతో దేవీవ్రత మాచరించినచో నతడు తప్పక మహా విద్వాంసుడు గాగలడు. బ్రహ్మ-క్షత్రియ-వైశ్య-శూద్రులలో నెవ్వరైనను పరమభక్తితో శ్రీజగదంబికను గొల్చినచో నతడు సకల సుఖములు పడయగలడు. స్త్రీ పురుషులలో నెవ్వరేని దేవీప్రీతిగ నీ పుణ్యనవరాత్ర వ్రత మాచరించినచో వారి కోరికలు తప్పక సఫల మగును. ఆశ్వయుజ శుక్లపక్షమునందు శరన్నవరాత్రము లాచరించువారు నిక్కముగ సర్వకామము లనుభవింపగలరు. ఇక నవరాత్రవ్రత విధానము వినుము. అదెట్లన, తొలుత మండలాకారముగ శుద్ధిచేసిన కొంతచోటు పూజాస్థానముగ నేర్పరచుకొనవలయును. అచ్చోట వేదమంత్రవిధానమున కలశస్థాపన చేయవలయును. ఆ కలశముపై శ్రీదేవీయంత్ర ముంచవలయును. కలశము క్రింద నలువైపుల బియ్యము పోయవలయును. శ్రీదేవిని పూలమాలలతో నలంకరించవలయును. శ్రీచండీ గృహమును ధూపదీపముల ఘుమఘుమలతో ధూపించవలయును. ఆ దేవీ మందిరమందు త్రికాలము లందును యథాశక్తిగ దేవీపూజ లొనర్పవలయును. దేవీపూజ చేయుటలో లోభిత్వముగాని కొంచెపుతనముగాని యెంతమాత్రమును తగవు. దేవి నామ పారాయణాభీష్టఫలదాయిని. ఆ తల్లిని ధూపదీప నైవేద్యములతో వేదపారాయణలతో మధురగీత వాద్యములతో స్తోత్రపాఠములతో సం సేవింపవలయును. శ్రీమద్దేవీ మహోత్సవమును శుభోదయములగు పెక్కు మంగళవాద్యములతో జరుపవలయును. ఒక కన్యకను యథావిధిగ పూజించుట ముఖ్యము. కన్నియను చందనభూషణ వస్త్రములతో మధుర భోజనములతో సుగంధకుసుమమాలలతో తనుపవలయును. ఏవం సంపూజనం కృత్వా హోమం మంత్ర విధానతః | అష్టమ్యాం వా నవమ్యాం వా కారాయే ద్విధిపూర్వకమ్. 30 బ్రాహ్మణా న్భోజయే త్పశ్చా త్పారణం దశమీదినే | కర్తవ్యం శక్తితో దానం దేయం భక్తిపరైర్నృపైః. 31 ఏవం యః కురుతే భక్త్యా నవరాత్రవ్రతం నరః | నారీ వా సధవా భక్త్యా విధవా నా పతివ్రతా. 32 ఇహలోకే సుఖం భోగా న్ర్పాప్నోతి మనసేప్సితాన్ | దేహాంతే పరమం స్థానం ప్రాప్నోతి వ్రతతత్పరః. 33 జన్మాంతరే%ంబికాభక్తి ర్భవ త్యవ్యభిచారిణీ | జన్మోత్తమకులే ప్రాప్య సదాచారో భ##వేద్ధి సః. 34 నవరాత్రవ్రతం ప్రోక్తం వ్రతానా ముత్తమం వ్రతమ్ | ఆరాధనం శివాయా స్తు సర్వసౌఖ్యకరం పరమ్. 35 అనేన విధినా రాజ న్సమారాధయ చండికామ్ | జిత్వా రిపూ నస్ఖలితం రాజ్యం ప్రాప్స్య స్యనుత్తమమ్. 36 సుఖం చ పరమం భూప దేహే%స్మి న్స్వగృహే పునః | పుత్రదారా న్సమాసాద్య లప్స్యసే నాత్ర సంశయః. 37 వైశ్యోత్తమ త్వమేవాద్య సమారాధయ కామదామ్ | దేవీం విశ్వేశ్వరీం మాయాం సృష్టిసంహార కారిణీమ్. 38 స్వజనానాం చ మాన్య స్త్వం భవిష్యసి గృహే గతః | సుఖం సాంసారికం ప్రాప్య యథాభిలషితం పునః. 39 దేవలోకే శుభే వాసో భవితా తే న సంశయః | నారాధితా భగవతీ యై స్తే నరకభాగినః. 40 ఇహలోకే % తి దుఃఖార్తా నానారోగైః ప్రపీడితాః | భవంతి మానవా రాజన్ శత్రుభిశ్చ పరాజితాః. 41 నిష్కళత్రా హ్యపుత్రా శ్చ తృష్ణార్తాః | స్తబ్ధ బుద్ధయః | బిల్వీదళైః కరవీరైః శతపత్రై శ్చ చంపకైః. 42 అర్చితా జగతాం ధాత్రీ యైస్తే%తీవ విలాసినః | భవంతి కృతపుణ్యాస్తే శక్తిభక్తిపరాయణాః. 43 ధన విభవ సుఖాఢ్య మానవా మానవంతః సకలగుణ గణానాం భాజనం భారతీశాః | నిగమ పఠితమంత్రైః పూజితాయై ర్భవానీ నృపతితిలక ముఖ్యాస్తే భవంతీహ లోకే 44 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే చతుస్త్రింశో%ధ్యాయః. ఈ విధానముగ దేవీపూజ లొనరించి యష్టమినాడుగాని నవమినాడుగాని యథావిధిగ దేవీహోమ మొనరింపవలయును. ఆ పిదప బ్రాహ్మణ సంతర్పణ జరిపి దశమినాడు పారణ జరుపవలయును. విప్రులకు భూరి దానము లొసంగవలయును. ఈ విధముగ శ్రీమద్దేవీ నవరాత్రవ్రతమును పురుషుడుగాని ప్రతివ్రతయగు సధవగాని విధవగాని భక్తిప్రపత్తులతో నాచరించపవచ్చును. ఇట్లు చేసినవారీ లోకమందున కోరిన కోర్కెలు పడయుదురు. వారు పిదప దేవీ పరమపద సాయుజ్యము గాంచగలరు. వారి కొకవేళ మరల జన్మము గల్గినచో వారుత్తమ సంస్కారుల కులమందు జన్మించి దేవి పదభక్తి గలవారగుదురు. ఈ విధముగ శ్రీ నవరాత్రవ్రతము గుఱించి తెల్పితిని. శ్రీదేవీ సమారాధనము సకల సుఖశాంతులకు పట్టుగొమ్మ. కనుక రాజా! నీవును శ్రద్ధతో శ్రీచండికారాధన మొనరించుము. నీవు శత్రువులను గెలిచి నీ రాజ్యము మరల బడయగలవు. నీవు నీ భార్యాపుత్రులతోడ నీ యింట తప్పక శాంతి సమృద్ధులతోడ వన్నెగాంతువు. ఓ వైశ్యరత్నమా! నీవును సృష్టిసంహాకారకారిణి - కామదాయిని - విశ్వేశ్వరియగు మాయాదేవిని సేవింపుము. నీవును నీ బంధుమిత్రులతో గౌరవమర్యాద చెందగలవు. ఆమెను గొలువని వారు నరకమున గూలుదురు; దుఃఖశోకార్తులు - రోగపీడితులు - శత్రు పరాజితులు నగుదురు. భార్యపుత్త్రహీనులు - దరిద్రనారాయణులు నై యిడుములు గుడుతురు. శ్రీదేవిని బిల్వదళములతోగాని కమల - కరవీర - చంపక సుమములతోగాని యర్చింపవలయును. శ్రీదేవి బ్రహ్మ హరి మహేశుల కిరీటకాంతుల నివాళు లందుకొను పాదపీఠిక గలది. దేవి వారికి శాశ్వత సుఖము లిచ్చును. అట్టి దేవి నర్చించినవారు పుణ్యపురుషులు - శక్తి భక్తిపరులు నిత్యవిలాసవంతులు. వారు ధనవిభవ సుఖసంపన్నులు - సద్గుణ గరిష్ఠులు-మానవంతులు. వారు వేదోక్తవిధిగ దేవిని గొలిచి మహారాజులై కీర్తి-ప్రతిష్ఠలు గడించువారు. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీమద్దేవీ నవరాత్రవ్రతవిధానమను ముప్పదినాల్గవ యధ్యాయము.