Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వితీయో%ధ్యాయః అథ సలోభము పేత్య సురాధిపః సమధిగమ్య గజాసన సంస్థితః త్రిశిరసం ప్రతి దుష్టమతి స్త దా ముని మపశ్యదమేయ పరాక్రమమ్.
1 తమభి వీక్ష్య దృఢా సన సంస్థితం జితగిరం సుసమాధివశం గతమ్ | రవివిభావసు సన్నిభ మోజసా సురపతిః పరమాపద మభ్యగాత్.
2 కథ మసౌ వినిహంతు మహో మయా మునిరపామతిః కిలసమ్మతః | రిపురయం సునమిద్ధతపోబలః కథ ముపేక్ష్య ఇమా%%సనకాముకః.
3 ఇతి విచింత్య పవిం పరమాయుధం ప్రతిముమోచ మునింతపసి స్థితమ్ | శశిదివాకర సన్ని భ మాశుగం త్రిశిరసం సురసంఘపతిః స్వయమ్.
4 తదభిఘాతహతః స ధరాతలే కిల పపాత మమారచ తాపసః | శిఖరిణః శిఖరం కులిశార్దితం నిపతితం భువి వా%ద్భుతదర్శనమ్.
5 తం నిహత్య ముదమాప సురేశ శ్చుక్రుశుశ్చ మునయ స్తు సంస్థితాః. | హా హతేతి భృశ మార్తినిస్వనాః కిం కృతంశతమఖేన పాపినా.
6 వినాపరాధం తపసాం నిధిర్హతః శచీపతిః పాపమతి ర్దురాత్మా | ఫలం కిలా%యం తరసా కృతస్య ప్రాప్నోతు పాపీ హననోద్భవస్య.
7 తం నిహత్య తరసా సురరాజో నిర్జగామ నిజమందిర మాశు | స హతో%పి విరరాజ మహాత్మా జీవమాన ఇవ తేజసాంనిధిః.
8 తం దృష్ట్వాపతితం భూమౌ జీవంత మివ వృతహా | చింతామాపాతిఃన్నాంగః కింవా జీవేదయం పునః.
9 విమృశ్య మనసా%తీవ తతణం పురతః స్థితమ్ | మఘవా వీక్ష్య తం ప్రాహ స్వకార్య సదృశం వచః.
10 తక్షం శ్ఛింధి శిరాంస్యస్య కురుష్వ వచనం మమ | మా జీవతు మహాతేజా భాతి జీవన్నివ స్వయమ్.
11 ఇత్యాకర్ణ్య వచస్తస్య తక్షోవాచ విగర్హయన్ | మహాస్కంధో భృశం భాతి పరశుర్న తరిష్యతి.
12 తతో నాహం కరిష్యామి కార్యమేత ద్విగర్హితమ్ | త్వయావైనిందితం కర్మ కృతం సద్భి ర్విగర్హితమ్.
13 అహం బిభేమి పాపాద్వై మృతసై#్యవచ మారణ | మృతో%యం మునిరస్త్యేవ శిరసః కృంతనేన కిమ్.
14 రెండవ అధ్యాయము వృత్రాసుర జననము పాపలోభాత్ముడగు నింద్రుడైరావతమెక్కి త్రిశిరోమునిని సమీపించెను. త్రిశిరుడు సూర్యాగ్ని సమతేజుడు - దృఢాసనుడు - సమాధి నిమగ్నుడు నైయుండెను. మునిని గాంచగనే యింద్రునిలో విషాద రేఖ లలముకొనెను. ఇతడింద్రాసన కాముకుడు. మునీశుడు పాపరహితుడు ఇంద్రవైరి. ఇపుడితనిని చంపుటెట్లు? చంపకూరకుండుటెట్లు?' అని యిట్లు తలపోసి ఇంద్రుడు రవిచంద్ర సమానుడగు తాపసునిపై తనపరమాయుధమగు వజ్రమును ప్రయోగించెను. వజ్రము దెబ్బకు గిరి శిఖరములు పడిన విధముగ వజ్రాయుధము వ్రేటునకు తాపసుడు భూమిపై పడి కన్ను మూసెను. మునిని చంపి సురపతి ముదమందెను. కాని యచటి మును లెల్లరు హాహాకారములు చేయుచు నింద్రు డెంతటి ఘోరము చేసెనేయని యార్తనాదములు చేసిరి. ముని నిరపరాధి. ఇంద్రుడీతబిసిని చంపుట వలన తాను పాపఫల మనుభవించి తీరునని మునులనిరి. ఇంద్రుడట్లు మునిని చంపి స్వర్గమేగెను. చచ్చి పడియును పునర్జీవితునివలెనున్న తేజోనిధియగు మునిని గని యితడు మరల బ్రదుకునేమో' యని యింద్రుడు వ్యాకులచిత్తుడయ్యెను. ఇట్లు తలపోసి యింద్రుడు తన యెదుటనున్న తక్షనుగాంచి తన పనికి దగినట్లుగ నతనితో నిట్లు పలికెను : ఓ తక్షా! ఇతడు బ్రతికినవానివలె నున్నాడు. ఈ మహాతేజుడు బ్రదుకరాదు. కాన నా మాట విని యతని తల తెగవేయుము అను నింద్రుని వాక్యములు తక్ష విని ఇట్లనెను : 'ఇంద్రా! అతడు మహాస్కందుడు. నా గొడ్డలి యతని కఠిన కంఠ సీమను తెగనఱుక చాలదు. ఈ నీచకార్యమునకు నేను బూనుకొనను. నీవు సాధువులు నిందించు పని చేసితివి. నాకు పాపభీతి గలదు. ఈ చచ్చిపడిన ముని తల తెగనఱకుటవలన నీ వేమి మూట కట్టుకొందువు? భయం కిం తే%త్ర సంజాతం పాకశాసన కథ్యతామ్ | ఇంద్రః సజీవ ఇవ దేహో%య మాభాతి విశదాకృతిః. 15 తస్మా ద్బిభేమి మా జీవేన్మునిః శత్రు రయం మమ | తక్షోవాచః నా%త్ర కిం త్రపసే విద్య న్క్రూరేణానేన కర్మణా | 16 ఋషిపుత్ర మిమం హత్వా బ్రహ్మహత్యాభయం న కిమ్. ఇంద్ర ఉవాచ : ప్రాయశ్చిత్తం కరిష్యామి పశ్చాత్వాపక్షయాయవై | 17 శత్రు స్తు సర్వథా వధ్య శ్చలేనాపి మహామతే | తక్షోవాచ: త్వం లోభాభిహతః పాపం కరోషి మఘవన్నిహ. 18 తం వినా%హం కథం పాపం కరోమి వద మే విభో | ఇంద్ర ఉవాచ : మఖేషు ఖలు భాగం తే కరిష్యామి సదైవ హి 19 శిరః పశోస్తు తే భాగం యజ్ఞే దాస్యంతి మానవాః | శుక్లే నానేన ఛింది త్వం శిరాంస్యస్య కురు ప్రియమ్. 20 ఏతచ్ఛ్రుత్వా మహేంద్రస్య వచ స్తక్షా ముదాన్వితః | కుఠారేణ శిరాంస్యస్య చకర్త సుదృఢేన హి. 21 ఛిన్నాని త్రీణి శీర్షాణి పతితాని యదా భువి | తేభ్య స్తు పక్షిణః క్షిప్రం వినిష్పేతుః సహస్రశః. 22 కలవంకా స్తిత్తిరయ స్తథైవ చ కపింజలాః | పృథక్పృథ గ్వినిష్వేతు ర్ముఖత స్తరసా తదా. 23 యేన వేదా నధీతే స్మ సోమం చ పిబతే తథా | తస్మా ద్వక్త్రా త్కిలోత్పేతుః సద్య ఏవ కపింజలాః. 24 యేన సర్వా దిశః కామం పిబన్నివ నిరీక్షతే | తస్మాత్తు తిత్తిరా స్తత్ర నిఃసృతా స్తిగ్మతేజసః. 25 యత్సురాపం తు తద్వంక్త్రం తస్మాత్తు చటకాః కిల | వినిష్పేతు స్త్రిశిరస ఏవం తే విహగా నృప. 26 ఏవం వినిఃసృతా న్దృష్ట్వా తేభ్యః శక్రస్తథా%ండజాన్ | ముమోద మనసా రాజన్ జగామత్రిదివంపునః. 27 ఇందు నీకు గల్గు భయమేమో తెలుపుము అన ఇంద్రుడిట్లనెను : ఇతని దేహము సజీవముగ నున్నట్లు తోచుచున్నది. కనుక నా శత్రువు మరల జీవించునేమోయని నా గుండె దడదడలాడుచున్నది. తక్ష ఇట్లనెను : 'నీవు విబుధుడవు గద! ఈ నీ క్రూరకర్మమునకు నీకు సిగ్గేల గల్గుటలేదు? ఈ ఋషి కుమారుని చంపినందున నీకు బ్రహ్మహత్యాభయము గల్గుట లేదా?' అన ఇంద్రు డిట్లనెను : పాపపరిహారమునకై ప్రాయశ్చిత్తము చేసికొందును. పగతుని మోసముననైన చంప వలయునని పండితులందురు.' తక్ష ఇట్లనియెను: 'నీవు లోభవశమున పాపము చేయుచుంటివి. నాకట్టి లోభము లేదు. కనుక నేనట్టి పాపమునకు పాల్పడను.' ఇంద్రు డిట్లనెను : 'నీకు యాగములందు హవిర్భాగము లిత్తును. నరులు యాగములందు నీకు పశుశిరమర్పింతురులెమ్ము. నీవితని శిరము ఖండించి నాకు ప్రియమొడగూడ్పుము' అని యింద్రుడనెను. తుదకింద్రుని మాటలకు లొంగి తక్ష ముదముతో తన గండ్రగొడ్డట ముని తల తెగనఱికెను. ముని మూడు తలలు నేల పడగనే వాని నుండి పక్షులు గుంపులు గుంపులుగ వేగముగ వెడలజొచ్చెను. అతని వేర్వేరు మొగముల నుండి కలవింక తిత్తిర కపింజలములు మున్నగు పక్షులు పుట్టెను. వేదాధ్యయనమును సోమపానమును చేయునట్టి ముఖమునుండి కపింజలపక్షులు పుట్టెను. దెసలన్నిటిని త్రాగివేయునట్లు పరికించు మొగమునుండి తిత్తిరిపక్షులు వెలువడెను. అతని సురాపానము సేయు మోము నుండి కలవింక పక్షులు పుట్టెను. అట్లు వెడలిన పక్షుల గుంపులను గని సురపతి మోదముతో స్వర్గసీమ కేగెను. గతే శ##క్రే తు తక్షా%పి స్వగృహం తరసా య¸° | యజ్ఞభాగం పరం లబ్ధ్వా ముదమాప మహీపతే. 28 ఇంద్రో%థ స్వగృహం గత్వా హత్వా శత్రుం మహాబలమ్ | మేనే కృతార్థ మాత్మానం బ్రహ్మహత్యామచింతయన్. 29 తం శ్రుత్వా నిహతం త్వష్టా పుత్రం పరమధార్మికమ్ | చుకో పాతీవ మనసా వచనం చేద మబ్రవీత్. 30 అనాగసం మునిం యస్మాత్పుత్త్రం నిహతవా న్మమ | తస్మా దుత్పాదయిష్యామి తద్వధార్థం సుతం పునః. 31 సురాః పశ్యంతు మే వీర్యం తపసశ్చ బలం తథా | జానాతు సర్వం పాపాత్మా స్వకృతస్య ఫలం మహత్. 32 ఇత్యుక్త్వా%గ్నిం జుహావా%థ మంత్రై రాథర్వణోదితైః | పుత్ర స్యోత్పాదనార్థాయ త్వష్టా క్రోధసమాకులః. 33 కృతే హోమే%ష్టరాత్రుం తు సందీప్తా చ్చ విభావసోః | ప్రాదుర్భ భూవ తరసా పురుషః పావకోపమః. 34 తం దృష్ట్వా%గ్రే సుతం త్వష్టా తేజోబల సమన్వితమ్ | వేగా త్ర్పకటితం వహ్నేర్దీప్యమాన మివానలమ్. 35 ఉవాచ వచనం త్వష్టా సుతం వీక్ష్య పురః స్థితమ్ | ఇంద్రశత్రో వివర్ధస్వ ప్రతాపా త్తపసో మమ. 36 ఇత్యుక్తే వచనే త్వష్ట్రా క్రోధ ప్రజ్వలితేన చ | సో%వర్ధత దివం స్తబ్ధ్వా వైశ్వానర సమద్యుతిః. 37 జాతః స పర్వతా కారః కాలమృత్యు సమః స్వరాట్ | కిం కరోమీతి తం ప్రాహ పితరం పరమాతురమ్. 38 కురు మే నామ కిం వాథ కార్యం కథయ సువ్రత | చింతాతురో%సి కస్మా త్త్వం బ్రూహి మే శోకకారణమ్. 39 నాశయా మ్యద్య తే శోక మితి మే వ్రత మాహితమ్ | తేన జాతేన కిం భూయః పితా భవతి దుఃఃతః. 40 పిబామి సాగరం సద్య శ్చూర్ణయామి ధరాధరాన్ | ఉద్యంతం వారయా మ్యద్య తరణిం తిగ్మతేజసమ్. 41 హన్మీం ద్రం ససురం సద్యోయమం వా దేవతాంతరమ్ | క్షిపామి సాగరే సర్వాంసముత్పాట్య చ మేదినీమ్. 42 ఇంద్రుడు వెళ్ళిన వెంటనే తక్షయును తన గృహమేగి యజ్ఞ భాగమందుకొని ముదమందెను. అట్టు లింద్రుడు తన శత్రుని చంపి స్వర్గమేగి తన్నుతా కృతార్థునిగ దలచుచు బ్రహ్మహత్యా పాపమును మఱచెను. విశ్వకర్మ తన ధార్మికుడగు పుత్రుడు నిహతుడగుట విని కన్నుల నిప్పులురాల నిట్లనియెను : నా పుత్రుడు నిర్దోషుడు ధార్మికుడు ముని. ఇట్టి నా పుత్రుని చంపినవానిని తిరిగి చంపుటకు మరొక పుత్రుని బడయగలను. దేవతలు నా తపోవీర్యమును తేజోబలమును గాంతురు గాక! ఇంద్రుడు తన పాపము పండినదని గుర్తించుగాత! అని పలికి త్వష్ట మహాక్రోధముతో నాథర్వణమంత్రములతో పుత్ర ప్రాప్తికి హోమము చేసెను. అట్లెనిమిది రాత్రులు వేల్చిన పిమ్మట వహ్నిజ్వాలలనుండి యగ్ని పురుషు డొకరుడు ఉద్భవించెను. అట్లు తేజోబలములు గల్లి రెండవ యగ్నివలె వెల్గులు చిమ్ముచు తన యెదుటనున్న సుతుని గాంచి త్వష్ట యిట్లనెను : ''ఓ యింద్రశత్రూ! నా తపోబలమున వర్ధిల్లుము.' అట్లు త్వష్ట కోపముతొ పలుకనే యగ్ని తేజుడగు మునిసుతు డాకసమును నీరంధ్ర మొనర్చుచు నెంతయో యెత్తుగ పెరిగెను. అత డట్లు కాలాంతకునివలె పర్వతాకారమున పెరిగి పెరిగి చింతాతురుడగు తన తండ్రి కిట్లనెను : ' నే నిపుడేమి చేయవలయును? నాకు పేరు పెట్టుము. నా వలన గావలసిన కార్యము తెలుపుము. నీవు చింతాతురుడవై శోకమున మునుంగుటకు కారణము తెల్పుము. నీ శోకము మాన్పుటయే నా వ్రతము. తండ్రి కడగండ్ల పాలగుచుండగ కొడుకు పుట్టి యేమి లాభము? సాగరములను త్రాగుదునా? గిరులను నుగ్గును గ్గొనర్తునా? ఉదయించు రవితేజము నరికట్టుదునా? సురలను సురపతిని యముని మరే దేవతనేని పల్లార్చవలయునా? ఈ భూగోళమును పెకలించి మున్నీట ముంచుదునా? ఇత్యాకర్ణ్య వచ స్తస్య త్వష్టా పుత్రస్య పేశలమ్ | ప్రత్యువాచాతి ముదిత స్తం సుతం పర్వతోపమమ్. 43 వృజినా త్త్రాతు మధునా యస్మా చ్ఛ క్తో%సి పుత్రక | తస్మా ద్వృత్ర ఇతి ఖ్యాతం తవ నామ భవిష్యతి. 44 భ్రాతా తవ మహాభాగ త్రిశిరా నామ తాపసః | త్రీణి తస్య చ శీర్షాణి హ్యభవ న్వీర్యవంతి చ. 45 వేద వేదాంగతత్త్వజ్ఞః సర్వవిద్యావిశారదః | సంస్థిత స్తపసి ప్రాయ స్త్రిలోకీ విస్మయ ప్రదే. 46 శ##క్రేణ తు హతః సో%ద్య వజ్రఘాతేన సంప్రతమ్ | వినా%పరాధం సహసా ఛిన్నాని మస్తకాని చ. 47 తస్మాత్త్వం పురుషవ్యాగ్ర జహి శక్రం కృతాగసమ్ | బ్రహ్మహత్యాయుతం పాపం విస్త్రపం దుర్మతిం శఠమ్. 48 ఇత్యుక్త్వా చ తదా త్వష్టా పుత్త్ర శోకసమాకులః | ఆయుధాని చ దివ్యాని చకార వివిధాని చ. 49 దదావసై#్మ సహస్రాక్ష వధాయ ప్రబలాని చ | ఖడ్గశూలగదాశక్తితో మర ప్రముఖాని వై. 50 శార్గం ధను స్తథా బాణం పరిఘం పట్టిశం తథా | చక్రం దివ్య సహస్రారం సుదర్శన సమప్రభమ్. 51 తూణీరౌ చాక్ష¸° దివ్యౌ కవచం చాతిసుందరమ్ | రథం మేఘప్రతీకాశం దృఢం భారసహం జవమ్. 52 యుద్ధోపకరణం సర్వం కృత్వా పుత్త్రాయ పార్థివ | దత్త్వా%సౌ ప్రేరయామాన త్వష్టా క్రోధ సమన్వితః. 53 ఇతి శ్రీదేవీభావతే మహాపురాణ షష్ఠస్కంధే ద్వితీయో%ధ్యాయః. అను తన పుత్రుని యతిలోకవాక్కులు విని త్వష్ట ముదమంది పర్వతాకారుడగు తన తనయున కిట్లనియెను : వృజిన పదమునకు దుఃఖమని యర్థము. నీవు నన్ను దానినుండి గాపాడ (త్రాణమొనర్ప) జాలుదువు. కాన నీవు లోకమున వృత్రనామమున వాసికెక్కుదువు. నీ సోదరుడు త్రిశిరుడు. మహాతపస్వి. అతని మూడు తలలు మహాశక్తి గలవి. అతడు వేద వేదాంగ విద్యావిశారదుడు. అతడు ముల్లోకముల కచ్చెరువు గొల్పు తపమొనర్చెను. ఇట్టి నిరపరాధు నింద్రుడు తన వజ్రముతో పడగొట్టి యతని శిరములు ఖండింపజేసెను. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషి - సిగ్గుమాలినవాడు - దుర్మతి. నీ వతనిని సంహరింపుము. ఇట్లు త్వష్ట పుత్రశోకమున పొగిలి పిమ్మట వివిధ దివ్యాయుధములు సిద్ధము జేసెను. ఇంద్రవధకు ఖడ్గ-శూల-గదా-శక్తి-తోమర-శార్గ-ధనుర్బాణములు- పరిఘ-పట్టిసములు - సుదర్శనము వంటి సహస్రారములు కల చక్రమును - అక్షయతూణీరములు - సుందర వచము - మేఘమువలె వేగముగల రథమును - ఈ మున్నగు యుద్ధ సామాగ్రినంతయును సిద్ధము చేసి త్వష్ట వానినెల్ల తన కుమారునకిచ్చి రణమున కతనిని ప్రేరించెను. ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు వృత్రాసుర జననమను ద్వితీయాధ్యాయము.