Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్థో%ధ్యాయః నిర్గతా స్తే పరాపృత్తా స్తపో విఘ్నకరాః సురాః | నిరాశాః కార్యసంసిద్ధ్యై తం దృష్ట్వా దృఢచేతసమ్.
1 జాతే వర్షశ##తే పూర్ణే బ్రహ్మా లోకపితా మహః | తత్రా%%జగామ తరసా హంసారూఢ శ్చతుర్ముఖ.
2 ఆగత్య తమువాచేదం త్వష్టృపుత్ర! సుఖీ భవ | త్యక్త్వా ధ్యానం వరం బ్రూహి దదామి తవ వాంఛితమ్.
3 తపసా తే%ద్య తుష్టో%స్మి త్వాం దృష్ట్వా చాతి కర్శితమ్ | వరం వరయ భద్రం తే మనో%భిలషితం తవ. 4 వృత్ర స్తదా%తి విశదాం పురతో నిశమ్య వాచం సుధాసమరసాం జగదేకకర్తుః | సంత్యజ్య యోగకలనాం సహసోదతిష్ఠ త్సంజాతహర్షనయనాశ్రుకలా కలాపః.
5 పాదౌ ప్రణమ్య శిరసా ప్రణయా ద్విధాతు ర్బద్ధాంజలిః పురత ఏవ సమాససాద | ప్రోవాచ తం సువరదం తపసా ప్రసన్నం ప్రేవ్ణూ%తిగద్గదగిరా వినయేన నమ్రః.
6 ప్రాప్తం మయా సకల దేవపదం ప్రభో%ద్య యద్వర్శనం తవ సుదర్లభ మాశు జాతమ్ | వాంఛా%స్తి నాథ మనసి ప్రవణ దురాపా తాం ప్రబ్రవీమి కమలాసన వేత్సి భావమ్.
7 మృత్యుశ్చ మా భవతు మే కిల లోహకాష్ఠ శుష్కార్ద్రవంశనిచయై రపరై శ్చ శ##సై#్త్రః | వృద్ధిం ప్రయాతు మమ వీర్య మతీవ యుద్ధే యస్మా ద్భవామి సబలై రమరై రజేయః.
8 ఇత్థం సంప్రార్థితో బ్రహ్మా తమాహ ప్రహసన్నివ | ఉత్తిష్ఠ గచ్ఛ భద్రం తే | వాంఛితం సఫలం సదా.
9 నశుష్కేణ న చా%%ర్ద్రేణ న పాషాణన దారుణా | భవిష్యతి చ తే మృత్యు రితి సత్యం బ్రవీమ్యహమ్.
10 ఇతి దత్వా వరం బ్రహ్మా జగామ భువనం పరమ్ | వృత్ర స్తు తం వరం లబ్ధ్వా ముదితః స్వగృహం య¸°.
11 నాలుగవ అధ్యాయము వృత్రుడు స్వర్గము నలంకరించుట అట్లు వృత్రుడు నిశ్చలచిత్తముతో చేయు తపమునకు భంగము గలిగింపలేక దేవతలు హతాశులై తిరిగి వెళ్ళిరి. నూఱండ్లు గడచిన పిమ్మట లోకపితామహుడగు బ్రహ్మ రాయంచ నెక్కి వృత్రుని చెంతకు వచ్చి అతనితో నిట్లనెను. 'నీవు సుఖ ముండుము. ధ్యానము వదలుము. నీ మదిగల కోరిక కోరుకొనుము. నీవు తపస్సుచే మిక్కిలి కృశించితివి. నిన్ను గాంచి నేను ప్రసన్నుడ నైతిని. నీకు మేలగుత! నీ మదిగల కోరికి తెలుపుము' అనగా వృత్రుడు తన యెదుటనున్న లోకకర్త పలికిన హితవచనములు విని యోగము మాని యానందబాష్పములు జాలువాఱ లేచి నిలుచుండెను. అతడు భక్తి వినయములతో బ్రహ్మపాదములపై తన శిరముంచి లేచి దోయిలించి తన తపమునకు సంతసిల్లి వరము లిచ్చునట్టి ప్రజాపతితో నిట్టు లనియెను : ఓ కమలాసనా! నీ దుర్లభ దర్శనమువలన సకల దేవ పదములు పడసితిని. నా మదిలోని భావము నీ వెఱుంగుము. ఐనను నా కొక కోర్కి గలదు. తెల్పుదును. వినుము. నాకు తడిసిన-యెండిన వస్తువులచే గాని లోహ-కాష్ఠ-శస్త్రములచేగాని చావు లేకుండునట్లుగను రణమున నా బలము వృద్ధి జెందునట్లుగను. నే నమరుల కజేయుడ నగునట్లుగను వరము లిమ్ము. అట్లు వృత్రుడు ప్రార్థించగా బ్రహ్మ నవ్వుచు 'నీ కోరికి తీరును లెమ్ము. నీవు తడిసిన-యెండిన వస్తువులచే గాని కఠినశిలలచేగాని చావవు. నిజము పల్కుచున్నాను' అని వర మొసగి తన లోక మేగెను. వృత్రుడును ముదమంది తన యింటి కేగెను. శశంస పితు రగ్రే తద్వరదానం మహీపతిః | త్వష్టా తు ముదితః ప్రాప్తం పుత్రం ప్రాప్తవరం తదా.
12 స్వస్తి తే%స్తు మహాభాగ జహి శక్రం రిపుం మమ | హత్వా గచ్ఛ%%త్రిశిరసో హంతారం పాపసంయుతమ్.
13 భవ త్వం త్రిదశాధీశః సంప్రాప్య విజయం రణ | మమాధిం ఛింధి విపులం పుత్త్రనాశసముద్భవమ్.
14 జీవతో వాక్యకరణా తయాహే భూరిభోజనాత్ | గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రతా.
15 తస్మా త్ప్యుత మమా%త్యర్థం దుఃఖం నాశితు మర్హసి | త్రిశిరా మమ చిత్తా త్తు నా%పసర్పతికర్హిచిత్.
16 సుశీలః సత్యవాదీ చ తాపసో వేదవిత్తమః | అపరాధం వినా తేన నిహతః పాపబుద్ధినా.
17 ఇతి తస్య వచః శ్రుత్వా పుత్రః పరమదుర్జయః | రథ మారుహ్య తరసా నిర్జగామ పితు ర్గృహాత్.
18 రణదుందుభినిరోషం శంఖనాదం మహాబలమ్ | కారయిత్వా ప్రయాణం స చకార మదగర్వితః.
19 నిర్య¸° నయసంయుక్తః సేవకానితి సంవదన్, | హత్వా శక్రం గహ్రీష్యామి సురరాజ్య మకంటకమ్.
20 ఇత్యుక్త్వా నిర్జగామా%%శు స్వసైన్యపరివారితః | మహతా సైన్యనాదేన భీషయ న్నమరావతీమ్.
21 తమాగచ్ఛంత మాజ్ఞాయ తురాషాడపి సత్వరః | సేనోద్యోగం భయత్రస్తః కారయామాస భారత.
22 సర్వా నాహూయ తరసా లోకపాలా నరిందమః | యుద్ధార్థం ప్రేరయ న్సర్వా స్వ్యరోచత మహాద్యుతిః.
23 గృధ్రవ్యూహం తతః కృత్వా సంస్థితః పాకశాసనః | తత్రాజగామ వేగాత్తు వృత్త్రః పరబలార్దనః.
24 అతడు తన వరప్రాప్తినిగూర్చి తన తండ్రితో చెప్పెను. విశ్వకర్మ తన కొడుకు వరమంది వచ్చుటకు సంతసించి యిట్లనెను : 'ఓ మహాత్మా! నీకు మేలగుత! త్రిశిరుని చంపిన పాపి యింద్రుడు. అతడు నా వైరి. నీ వతనిని చంపి రమ్ము. యుద్ధములో విజయమంది స్వర్గపతివి గమ్ము. పుత్రనాశమున గల్గిన నా మనోవ్యాధి నుడుపుము. తండ్రి బ్రతికి నంతవఱ కతని మాట పాటించుట తండ్రి మరణించిన పిదప పితృకర్మ లొనర్చి బ్రాహ్మణ సంతర్పణ జరుపుట గయలో పిండ ప్రదానము చేయుట అను మూటిపై పుత్రుని పుత్రత్వ మాధారపడియున్నది. పుత్త్రా! ఈ నా దుఃఖము తొలగింప గలిగినవాడవు నీవే. త్రిశిరుడు నా మనస్సునుండి యెంతకును తొలగుటలేదు. అతడు సుశీలుడు. తాపసుడు-సత్యవాది-వేదవిదుడు. అంతటి అతడు నిరాపరాధుడయ్యు పాపియగు నింద్రునిచే చంపబడెను' అను తన తండ్రి మాటలు ఇని దుర్జయుడగు వృత్రుడు వేగమే రథమెక్కి తండ్రి యింటినుండి బయల్వెడలెను. ఆ మదగర్వితుడు బయలుదేరగనే రణభేరీ శంఖనాదములు పిక్కటిల్లెను. అట్లు నయయుక్తుడగు వృత్రుడు వెడలుచు తన సేవకుల కిట్లనెను. 'నేడు నే నింద్రుని చంపి స్వర్గమును అకంటంకముగ గైకొందును' అని పలికి వృత్రుడు సేనలను గూర్చుకొనెను. వృత్రుని సేనల ధ్వనులు దేవతలను భయపెట్టుచుండెను. ఇట్లు వృత్రుడు రణమునకు తరలెను. వృత్రుని రాక యెఱింగి యింద్రుడును సేనలను గూర్చుకొనెను. అతడు లోకపాలుర నెల్లరను రావించి వారిని యుద్ధమునకు పురికొల్పెను. ఇంద్రుడు గృధ్రవ్యూహము పన్నగనే వృత్రు డచ్చోటికి వచ్చెను. దేవదానవయో స్తావత్సంగ్రామస్తుములో%భవత్ | వృత్రవాసనయోః సంఖ్యే మనసా విజయైషిణోః.
25 ఏవం పరస్పరం యుద్ధే సందీప్తే భయదే భృశమ్ | ఆకూతం దేవతాః ప్రాపు ర్దైత్యా శ్చ పరమా ముదమ్.
26 తో మరై ర్భిందిపాలై శ్చ ఖడ్గైః పరశు పట్టి శైః | జఘ్నుః పరస్పరం దేవదైత్యాః స్వస్వవరాయుధైః
27 ఏవం యుద్ధే వర్తమానే దారుణ లోమహర్షణ | శక్రం జగ్రాహ సహసా వృత్రః క్రోధ సమన్వితః.
28 అపావృత్య ముఖే క్షిప్త్వా స్థితో వృత్రః శతక్రతమ్ | ముదితో%భూ న్మమరాజ! పూర్వవైర మనుస్మరన్.
29 శ##క్రే గ్రస్తే%థ వృత్రేణ సంభ్రాంతా నిర్జరా స్తదా | చుక్రుశుః పరమార్తా స్తే హా శ##క్రేతి ముహుర్ముహుః.
30 అపావృతం ముఖే వక్రం జ్ఞాత్వా సర్వే దివౌకసః | బృహస్పతిం ప్రణమ్యోచు ర్దీనా వ్యథిత చేతసః.
31 కిం కర్తవ్యం ద్విజ శ్రేష్ఠ త్వ మస్మాకం గురుః పరః | శక్రో గ్రస్త స్తు వృత్రేణ రక్షితో దేవతాంతరైః.
32 వినా శ##క్రేణ కిం కుర్మః సర్వే హీన పరాక్రమాః | అభిచారం కురు విభో సత్వరః శక్రముక్తయే.
33 బృహస్పతిః: కిం కర్తవ్యం సురాః క్షిప్తోముఖమధ్యే%స్తివాసవః | వృత్రేణోత్సాదితోజీవన్నస్తికోష్ఠాంతరేరిపోః.
34 అంత విజయకాములగు నింద్రవృత్రులును దేవదానవులును ఘోరముగ పోరిరి. అట్లు భీకర సమరము జరుగుచుండగ సురలు విషాద మందిరి. రాక్షసులు ముదమందిరి. దేవ దానవులు తోమర-భిందిపాల-ఖడ్గ-పరశు-పట్టిసములతో నొకరి నొకరు పొడుచుకొనిరి. అట్లు దారుణ రణము జరుగుచుండగ వృత్రుడు కోపాటోపముతో నింద్రుని వేగమున బట్టుకొనెను. అతడింద్రుని కవచాదులు తొలగించెను. ఇంద్రునితో తనకున్న వెనుకటి పగ గుర్తుకు రాగ వృత్రుడు సంతసముతో నింద్రుని తన నోటిలో వేసికొనెను. అట్లు వృత్రు డింద్రుని మ్రింగగ సురలు హా సురపతీ! యనుచు మాటిమాటికి విలపించిరి. ఇంద్రుడట్లు కవచాదులు లేక వృత్రుని నోటిలో నుండగ దేవతలు కటకటపడి వికలచిత్తులై దీనముగ బృహస్పతి కిట్లనిరి. 'ఓ ద్విజవరా! నీవు మా గురుడవు. మేమెంతగ రక్షించినను లాభము లేక దేవేంద్రుడు వృత్రునిచే మ్రింగబడెను. ఇపుడు మా కర్తవ్యమేమి? ఇంద్రుడు లేనిచో మేము బలహీనులము. ఏమియు చేయజాలము. కనుక నింద్రుడు మరల వచ్చుట కభిచార హోమములు చేయుము.' బృహస్పతి యిట్లనెను: 'ఓ దేవతలారా! ఇంద్రుడు వృత్రుని నోట జీవించియే యున్నాడు. కనుక బ్రదికి యుండగనే బైటికి వచ్చునట్టి యుపాయ మాలోచింపవలయును. దేవాశ్చింతాతురాః సర్వే తురాసాహంతథాకృతమ్ | దృష్ట్వా విమృశ్య తరసా చక్రు ర్యత్నం విముక్తయే.
35 అసృజంత మహాసత్త్వాం జృంభికాం రిపునాశినీమ్ | తతో విజృంభమాణః స వ్యావృతాస్యో బభూవ హ.
36 విజృంభమాణస్య తతో వృత్రస్యాస్యా దవాపతత్ | స్వా న్యంగా న్యపి సంక్షిప్య నిష్క్రాంతో బలసూదనః.
37 తతః ప్రభృతి లోకేషు జృంభికా ప్రాణిసంస్థితా | జహృషు శ్చ సురాః సర్వే శక్రం దృష్ట్వా వినిర్గతమ్.
38 తతః ప్రవవృతే యుద్ధం తయో ర్లోకభయప్రదమ్ | వర్షాణా మయుతం యావ ద్దారుణం లోమహర్షణమ్.
39 ఏకతశ్చ సురాః సర్వే యుద్ధాయ సముపస్థితాః | ఏకతో బలవాన్ త్వాష్ట్రః సంగ్రామే సమవర్తత.
40 యదా వ్యవర్దతరణ వృత్రో పరమదావృతః | పరాజిత స్తదా శక్ర స్తేజసా తస్య ధర్షితః.
41 వివ్యథే మఘవా యుద్ధే తతః ప్రాప్య పరాజయమ్ | విషాదమగ మన్దేవా దృష్ట్వా శక్రం పరాజితమ్.
42 జగ్ముస్త్యక్త్వా రణం సర్వే దేవా ఇంద్రపురోగమాః | గృహీతం దేవసదనం వృత్రేణాగత్య రంహసా.
43 దేవోద్యానాని సర్వాణి భుంక్తేsసౌదానవో బలాత్ | ఐరావతో sపి దైత్యేన గృహితోsసౌ గజోత్తమాః. 44 విమానాని చ సర్వాణి గృహీతాని విశాంపతే | ఉచ్చైః శ్రవా హయవరో జాత స్తస్య వశే తదా.
45 కామధేనుః పారిజాతో గణ శ్చాప్సరసాం తథా | గృహీతం రత్నమాత్రం తు తేన త్వష్టృ సుతేన హ.
46 స్థానభ్రష్టాః సురాః సర్వే గిరిదుర్గేషు సంస్థితాః | దుఃఖమాపుః పరిభ్రష్టా యజ్ఞభాగా త్సురాలయాత్.
47 ఇంద్రుడట్లతగుటకు దేవతలెల్లరును చింతాక్రాంతులై యతని విముక్తికి ఉపాయ మాలోచించిరి. వారెల్లరును వృత్రునకు పెద్దగ నావులింత గల్గునట్లు చేసిరి. అపుడు వృత్రుడావులింతచే నోరు పెద్దగ తెఱచెను. అట్టులావులించు వృత్రుని నోటినుండి బలసూదనుడగు నింద్రుడు చెరచెర తన యంగములు చిన్నవిగ చేసికొని బయటపడెను. ఆ నాటినుండి ప్రపంచ మందలి ప్రాణులందఱ కావులింతలు గల్గుచుండెను. ఇంద్రుడట్లు ముక్తుడగుటగని సురలు హర్షమందిరి. మరల వారిర్వురి మధ్యలోక భీకరముగ పోరు సాగెను. ఒక వైపున సురలెల్లరు నిలువబడగ వృత్రుడొక్కడే బలముతో ప్రతిపక్షమున నిలుచుండెను. వృత్రుడు తన వరబలముతో యుద్ధమున వృద్ధి పొందుచుండగ నింద్రుడతని తేజముముందు తాళ##లేక ఓడిపోయెను. ఇంద్రుడు యుద్ధములో నోటుపడి విషాదమొందగాగని సురలును వెలవెలవోయి వగచిరి. ఇంద్రాది దేవతలు యుద్ధము వదలి పరుగెత్తిరి. వృత్రుడు వెంటనే స్వర్గసీమ తన హస్తగతము చేసికొనెను. వృత్రుడు పిమ్మట నందనోద్యానములందు విహరింపసాగెను. గజశ్రేష్ఠమైన యైరావతమును స్వాధీనము చేసికొనెను. అతడుత్తమాశ్వమగు నుచ్చైః శ్రవమును సకల విమానములను గ్రహించెను. కామధేనువును పారిజాతమును నచ్చరలు మున్నగు వానితో స్వర్గమును. తన కైవసము చేసికొనెను దేవతలు స్వర్గభ్రష్టులై హవిర్భాగములు గోలుపోయి గిరిదుర్గములందు గ్రుమ్మరుచుండిరి. వృత్రః సురపదం ప్రాప్య బభూవ మదగర్వితః | త్వష్టా%తీవ సుఖం ప్రాప్య ముమోద సుతసంయుతః.
48 అమంత్రయ న్హితం దేవా మునిభిః సహ భారత | కిం కర్తవ్య మితి ప్రాప్తే విచింత్య భయమోహితాః.
49 జగ్ముః కైలాసమచలం సురాః శక్రసమన్వితాః | మహాదేవం ప్రణమ్యోచుః ప్రహ్వాః ప్రాంజలయో భృశమ్.
50 దేవదేవ మహాదేవ కృపాసింధో మహేశ్వర | రక్షా%స్మా న్భయభీతాం స్తు వృత్రేణా%తి పరాజితాన్.
51 గృహీతం దేవసదనం తేన దేవ! బలీయసా | కిం కర్తవ్య మతః శంభో బ్రూహి సత్యం శివా%ద్య నః.
52 కిం కుర్మః క్వ చ గచ్ఛామః స్థానభ్రష్టా మహేశ్వర | దుఃఖస్య నా%ధఙగచ్ఛామో వినాశోపాయ మీశ్వర |
53 సాహాయ్యం కురు భూతేశ వ్యథితాః స్మ కృపానిధే | వృత్రం జహి మదోత్సిక్తం వరదానబలా ద్విభో |
54 శివ ఉవాచ: బ్రహ్మాణం పురతః కృత్వా వయం సర్వే హరేః క్షయమ్ | గత్వా సమేత్య తం విష్ణుం చింతయామో వధోద్యమమ్.
55 స శక్త శ్చ చ్ఛలజ్ఞశ్చ బలవా న్బుద్ధిమత్తరః | శరణ్య శ్చ దయాబ్ధి శ్చ వాసుదేవో జనార్దనః.
56 వినా తం దేవదేవేశం నార్థసిద్ధి ర్భవిష్యతి | తస్మా త్తత్ర చ గంతవ్యం సర్వకార్యార్థ సిద్ధయే.
57 ఇతి సంచింత్య తే సర్వే బ్రహ్మా శక్రః సశంకరః | జగ్ముర్విష్ణోః క్షయం దేవాః శరణ్యం భక్తవత్సలమ్.
58 గత్వా విష్ణుపదం దేవాస్తుష్టువుః పరమేశ్వరమ్ | హరిం పురుషసూక్తేన వేదోక్తేన జగద్గురుమ్.
59 ప్రత్యక్షో%భూజ్జగన్నాథ స్తేషాం స కమలాపతిః | సమ్మాన్యచ సురాన్ సర్వా నిత్యువాచ పురః స్థితః.
60 కి మాగతాః స్మలోకేశా హరబ్రహ్మసమన్వితాః | కారణం కథయధ్వం వః సర్వేషాం సురసత్తమాః.
61 ఇతి శ్రుత్వా హరేర్వాక్యం నోచుర్దేవా రమాపతిమ్ | చింతావిష్టాః స్థితాః ప్రాయో సర్వే ప్రాంజలయ స్తథా.
62 ఇతి శ్రీ దేవీభాగవతే షష్ఠస్కంధే చతుర్థో%ధ్యాయః. అట్లు వృత్రుడు మదగర్వముతో సురపదము చేజిక్కించుకొనగ విశ్వకర్మ తన తనయునిగూడి సుఖముండెను. సురలు భీత చిత్తులై యేమిచేయుటకును తోచక మునులజేరి హితమాలోచించు చుండిరి. ఇంద్రాది దేవతలు కైలాసమేగి మహేశునకు సవినయముగ ప్రణమిల్లి యిట్లనిరి: ఓ దేవదేవా! మహాదేవా! మహేశ్వరా! కృపాసాగరా! మేము వృత్రుని కోడి భయపడితిమి. మమ్ము కాపాడుము. శంభూ! హరా! శంకరా! వృత్రాసురుడు బలశాలి. అతడు మా సర్వమును గ్రహించెను. ఇపుడు మా కర్తవ్యమేమో నిజము తెలుపుము. మహేశా! మేము స్థాన భ్రష్టులమైతిమి. ఇపుడు మేమెక్కడి కేగవలయును? ఈ దుఃఖము తొలగు నుపాయము తోచుటలేదు. భూతేశా! దయాపరా! మేము దుఃఃతులము. మాకు సాయము సేయుము. వరమద మత్తుడగు వృత్రుని సంహరింపుము. శివుడిట్లనెను : ఇపుడు మనమెల్లరమును బ్రహ్మను మున్నిడుకొని విష్ణుసన్నిధికేగి వృత్రవధనుగూర్చి యాలోచింతము. వాసుదేవుడు జనర్దనుడు బుద్ధిబల శక్తులుగలవాడు. మోసమెఱిగినవాడు. దయావారాశి. విశ్వశరణ్యుడు. ఆ దేవ దేవేశుని బలములేనిచో నర్థసిద్ధి చేకూరదు. కనుక సర్వకార్య సిద్ధికి విష్ణు సన్నిధి కేగుదము అని యిట్లాలోచించుకొని శివబ్రహ్మవాసవాదులు భక్తవత్సలుడు విశ్వ శరణ్యుడు నైన విష్ణుని వైకుంఠ ధామము జేరిరి. వారు వేదోక్తమగు పురుష సూక్తముతో జగద్గురువు పరమేశ్వరుడునైన శ్రీహరిని సంస్తుతించిరి. కమలాపతియగు జగన్నాథుడు వారికి ప్రత్యక్షమై వారిని సమ్మానించి యిట్లనెను. సురవరులారా! మీరింద్ర బ్రహ్మశివులతో నేలవచ్చితిరి? కారణమేమో తెలుపుడు అను హరి వాక్కులాలించి దేవతలు దీనవదనములతో దోసిళులొగ్గి నిలుచుండిరేకాని వారినోట మాట రాకుండెను. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి షష్ఠస్కంధమందు వృత్రుడు స్వర్గము నలకరించుటయను చతుర్థాధ్యాయము.