Sri Devi Bhagavatam-1 Chapters
శ్రీదేవీ భాగవతే - ప్రథమస్కంధే - త్రయోదశాధ్యాయః
సూత ఉవాచ : సుద్యుమ్నేతు దివం యాతే రాజ్యం చక్రే పురురవాః | సగుణశ్చ ప్రజారంజనతత్పరః. 1
ప్రతిష్ఠానే పురే రమ్యే రాజ్యం సర్వసమస్కృతమ్ | చకా సర్వధర్మజ్ఞః ప్రజారక్షణతత్పరః. 2
మంత్రః సుగుప్త స్తస్యాసీ త్సర త్రా భిజ్ఞతా తథా | స దైవో త్సాహ శక్తిచ్ఛ ప్రభుశక్తి స్తథో త్తమా. 3
సామదానాదయః సర్వే వశగా స్తస్య భూపతేః | వర్ణాశ్రమా స్స్వదర్మస్థా స్కుర్వ న్రాజ్యం శశాస హ. 4
యజ్ఞాంశ్చ వివిధాం శ్చ్నకే స రాజా బహుదక్షిణాన్ | దానాని చ విచిత్రాణి దదా వథ ధరాధిపః. 5
తస్య రూప గుణౌ దార్య శీల ద్రవిణ విక్రమాన్ | శ్రుత్వో ర్వశీ వశీభూతా చకమే తం నరాధిపమ్. 6
బ్రహ్మవాపా భిత్తప్తా సా మానుషం లోక మాస్థితా | గుణినం తం నృపం మత్వా వరాయామాస మానినీ. 7
సమయం చేదృశం కృత్వా స్థితా తత్ర వరాంగనా ఏతా పురణకౌ రాజన్న్య స్తౌ రక్షస్వ మానద. 8
ఘృతం మే భక్షణం నిత్యం నా న్యత్కించి న్నృపా శనమ్ | నే క్షేత్వాంచ స్వయం రాజన్యదిన్నగ్నో భవిష్యతి. 9
భాషాబంధ స్త్వయం రాజ న్నదినగ్నో భవిష్యతి | తదా త్యక్త్వా గమిష్యామి సత్య మేత ద్బ్రవీమ్యహమ్. 10
అంగీకృతం చ త ద్రాజ్ఞా కామి న్యాభాషితం తు యత్ స్థితా భాషేణ బంధేన శాపా నుగ్రహ కామ్యయా. 11
రేమే తదా స భూపాలో లీనో వర్షగణా న్బహూన్ ధర్మ కర్మాధికం త్యక్త్వా చో ర్వశ్యా మదమోహితః 12
ఏక చిత్తస్తు సంజాత స్తన్మనస్కో మహీపతిః | న శశాక తయా హీనః క్షనహ వ్యతిమోహితః 13
పదమూడవ అధ్యాయము
ఊర్వశీ పురూరవుల చరిత్ర
ఆ విదముగ సుద్యుమ్నుడు దివికేగెను. ఇటు భువిపై సుగుణవంతుడు ప్రజారంజకుడు సుందరుడునగు పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్ఠాన పురమందు సర్వసమ్మానితుడై రాజ్యమేలు చుండెను. అతడు ధర్మజ్ఞుడు. ప్రజా పాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరుల కెఱుక పడక రహస్యముగ నుండెను. అతని యుత్సాహ ప్రభుశక్తులును శ్రేష్ఠములైనవి. సామదానాదులారాజు వశమందుండెను. అతడు చక్కగ వర్ణాశ్రమ ధర్మములు పాటించుచు ఏలుబడి సాగించు చుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సందలను విక్రమౌదార్యములను గుఱించి ఊర్వశి విని రాజునందు అనురక్త యయ్యెను. బ్రహ్మశాపమున మనుజ రూపమున భువికి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని యని యెఱింగిన యూర్వశి అతనితో ఇట్లు పలికెను : ''ఈ మేకల జంట నీయొద్దనుంతును. నీవు దీనిని కాపాడుము. నేను నిన్నుచేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియు నారగించను. మైథున సమయమున గాక మరెప్పుడు నిన్ను దిసమొలతో నుండగ చూడను. ఇది నా నియమము. నా యీ నియమమును భంగమొనర్చినప్పుడు నేను నిన్ను వదలి వెళ్ళుదును.'' రాజా కామిని పలుకుల నొప్పుకొనెను. ఆ యూర్వశియు తన శాపము దీఱునందాక నతనిని గూడి విహరించు చుండెను. రాజును తొంటి ధర్మకర్మముకు స్వస్తి చెప్పి ఊర్వశీ మద మోహితుడై పెక్కులేండ్లూర్వశితో నుండెను. ఆ పుడమిఱడట్లు తీరని మోహాతిరేకమున నొక్క నిముసమేని వదలిపెట్టక యావరారోహ మీద మరులు గొని యుండెను.
ఏవం వర్షగణాంతే తు స్వర్గస్థః పాకశాసనః | ఊర్వశీం నాగతాం దృష్ట్యా గంధర్వా నాహదేవరాట్ 14
ఊర్వశీ మానయద్వంభోగంధర్వాః సర్వ ఏవహి | హృత్వో రణౌ గృహా త్తస్యభూపతేః సమయే కిల. 15
ఊర్వశీ రహితం స్థానం మదీయం నా తిశోభ##తే | యేన కేనా ప్యుపాయేన తా మానయత కామినీమ్. 16
ఇత్యుక్తా స్తే%థ గంధర్వా విశ్వావసు పురోగమాః | తతో గత్వా మహాగాఢ తమసి ప్రత్యేపస్థితే. 17
జహ్రుస్తా పురణౖ దేవా రమమాణం విలోక్యతమ్ | చక్రందతు స్తదా తౌతు హ్రియామాణౌ విహాయసా. 18
ఊర్వశీ తదుపాకర్ణ్య క్రందితం సుతయోరివ | కుపితో వాచ రాజానం సమయో%యం కృతోమయా. 19
నష్టా%హంతవవిశ్వాసా ద్ధృతౌ చోరై ర్మమోరణౌ | రాజన్పుత్రసమావేతౌ త్వంకిం శేషే స్త్రియా నమః. 20
హతా స్మ్యహం కునాథేన నపుంసా వీరమానినా | ఉరణౌ మే గతౌ చాద్య సదా ప్రాణపి¸° మమ. 21
ఏవం విలప్యమానాం తా దృష్ట్వా రాజా విమోహితః నగ్న ఏవ య¸° తూర్ణం పృష్ఠతః పృథివీపతిః 22
విద్యుత్ప్రకాశితా తత్ర గంధర్వైర్నృపవేశ్మని | నగ్నభూత స్తయా దృష్టో భూపతి ర్గంతు కామయా. 23
త్వక్త్వోరణౌ గతాః సర్వే గంధర్వాః పథి పార్థివః | నగ్నో జగ్రాహ తౌ శ్రాంతో జగామ స్వగృహంప్రతి. 24
తదోర్వశీం గతాం దృష్ట్యా విలలా పాతిదుఃఖితః | నగ్నం వీక్ష్య పతిం నారీ గతా సా వరవర్నినీ. 25
క్రంద స్స దేశ దేశేషు బభ్రామ నీపతిః స్వయమ్ | త చ్చిత్తో విహ్వలః శోచ స్వవశః కామమోహితః 26
ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను : ఓ గంధర్వులారా! మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుటద్వారా ఊర్వశిని తీసికొనిరండు. ఊర్వశి లేని యింద్ర సభ ఏమియు శోభించుట లేదు. కావున నెటులేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్నచోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి యుండగా గంధర్వులు మేకలనుగొని నింకికెగసిరి. ఆ మేకలు మేమే యని యరచినవి. వాని యర వూర్వశికి తన కొమరుల యేడ్పువలె వినబడెను. అపుడామె కోపమున రాజుతో రాజా! నీతో మున్ను నేను ప్రతిన జేసితిని. ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీయందు నాకు నమ్మకము దొలగినది. ఈ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగ లపహరించిరి. ఐనను నీవు స్త్రీవలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి. కునాథుడవు. నీచేత నేను వంచింపబడితిని. నాకు ప్రాణ నమములగు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచు వెడలి పోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగ నామెను వెనుదగిలెను. అదే సమయమని గంధర్వులా రాజమందిరమున తళుక్కను మెఱుపు మెఱసిరి. అపుడూర్వశి దినమొలతో నరుగుదెంచు రాజును జూచినది. గంధర్వులా మేకలను త్రోవలోనే వదలి వెళ్ళిరి. దిగంబరుడగు ఆ చక్రవర్తి యా మేకలను గొని తన యింటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగ నుండగగాంచి యావరవర్ణిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన యూర్వశీ మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు నూర్వశి మీది ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోదించుచు దేశ దేశములు గుమ్మరు చుండెను.
భ్రమన్వై సకలాం పృథ్వం కురుక్షేత్రే దదర్శతామ్ | దృష్ట్యా సంహృష్టవదనః ప్రాహ సూక్తం నృపోత్తమః 27
అయేజాయే తిష్ఠ తిష్ఠ | ఘోరే న త్య క్తు మర్హసి | మాం త్వం త్వ న్మనసం కాంతం వశగంచా ప్యనాంగసమ్. 28
స దేహో%యం పత త్యత్ర దేవి దూరం హృత స్త్వయా | ఖాదంత్యేనం వృకాః కాకా స్త్వయాత్యక్తం వరోరుయత్. 29
ఏవం విలపమానం తం రాజానం ప్రాహ చోర్వశీ | దుఃఖితం కృపణం శ్రాతం కామార్తం వివశం భృశమ్. 30
ఊర్వ : మూర్ఖో%సి నృపశార్దూల జ్ఞానం కుత్ర గతం తవ క్వాపి సఖ్యం న చ స్త్రీణాం వృకాణామివపార్థివ | 31
న విశ్వాసోహి కర్తవ్యః స్త్రీషు చౌరేషు పార్థివై ః | గృహం గచ్చ సుఖం భుక్ష్వ మావిసాదే మనః కృథాః 32
ఇ త్యేవం బోధితో రాజా న వివేదా తిమోహితః దుఃఖం చ పరమం ప్రాప్తః సై#్వరిణీ స్నేహయంత్రితః 33
సూత : ఇతి సర్వం సమాఖ్యాత మూర్వశీచరితం మహత్ | వేదే విస్తరితం చై త త్సం క్షేపాత్కథితంమయా. 34
ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ప్రథమస్కంథే త్రయోదశో%ధ్యాయః.
ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను : 'కఠినురాలా ! కాంతా ! నిలునిలుము. నేను పాపమెఱుగని వాడనే! నీ ప్రియకాంతుడనే! ఏనీకు వశ్యుడనే! నిన్నే నమ్ముకొని యున్నాడనే! నన్ను నీవు విడనాడి యెట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదలి వెళ్ళినచో నా మేనిచ్చోటనే పడిపోగలదు. కాకులు, తోడేళ్ళు నన్ను కడుపార నారగించును,' ఈ రీతిగ రాజ కామార్తుడై కృపణుడై వివశుడై శ్రాంతుడై దిక్కులేని పక్కిచందమున బావురుమని యేడ్చెను. అపుడూర్వశి రాజుతో నిట్లనెను : ఓ నృపశార్దూలా! నీవు మూఢుడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్ళతోడి చెలిమియే. అది తగదు. రాజెప్పుడును దొంగలను స్త్రీలను నమ్మియుండరాదు. కనుక నీవిక నింటికేగి దిగులుమాని సుఖముండుము, అని యిట్లెంతగ నూర్వశి యూరడించినను రాజు మోహాతిరేకమును వదలకుండెను. ఆ సై#్వరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను. కాన నతిశోకార్తుడయ్యెను. ఈ విధముగ మీకూర్వశీ పురూరవుల చరిత్ర సంక్షేపముగ చెప్పితిని. ఇది వేములందు విస్తరించి యభివర్ణింపబడినది.
ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ ప్రథమ స్కంధమందలి త్రయోదశాధ్యాయము