Sri Devi Bhagavatam-1
Chapters
అథ నవమో%ధ్యాయః వ్యాసః : తాం వీక్ష్య విపులాపాంగీం రహః శోక సమన్వితామ్ | అఖండలః ప్రియాంభార్యాం విస్మితశ్చా బ్రవీత్తదా.
1 కథ మత్రాగతా కాంతే కథం జ్ఞాత స్త్వయాహ్యహం | దుర్జేయః సర్వభూతానాం సంస్థితో%స్మి శుభాననే.
2 శచీ : దేవదేవ్యాః ప్రసాదేన జ్ఞాతో%స్యద్య భవానిహ | పున స్తస్యాః ప్రసాదేన ప్రాప్తా%స్మి త్వాం దివస్పతే. 3 నహుషో నామ రాజర్షిః స్థాపితో భవదాసనే | త్రిదశై ర్మునిభి శ్చైవ స మాం బాధతి నిత్యశః. 4 పతిం మాం కురు చార్వంగిః తురాసాహం సురాధిపమ్ | ఏవం వదతి మాం పాప్మా కిం కరోమి బలార్దనః. 5 ఇంద్రః : కాలాకాంక్షీ వరారోహేః సంస్థితో%స్మి యదృచ్ఛయా | తథాత్వమపికల్యాణిః సుస్థిరం స్వమనః కురు. 6 ఇత్యుక్తా తేన సాదేవీ పతినా%తి ప్రశంసినా | నిః శ్వసంత్యాహ తం శక్రం వేపమానా%తి దుఃఃతా. 7 కథం తిష్ఠే మహాభాగః పాపాత్మా మాం వశానుగామ్ | కరిష్యతి మదోన్మత్తో వరదానేన గర్వితః. 8 దేవాశ్చ మునయః సర్వే మామూచు స్తద్భయాకులాః | తం భజస్వ వరారోహే దేవరాజం స్మరాతురమ్. 9 బృహస్పతి స్తు శత్రుఘ్న బాడవో బలవర్జితః | కథం మాం రక్షితుం శక్తో భ##వే ద్దేవానుగః సదా. 10 తస్మాచ్చింతా%స్తి మహతీ నార్యహం వశవర్తినీ | అనాథా కిం కరిష్యామి విపరీతే విదౌ విబో 11 నార్యస్మ్యహం న కులటా త్వచ్చిత్తా%తి పతివ్రతా | నాస్తిమే శరణం తత్ర యోమాం రక్షతి దుఃఃతామ్. 12 తొమ్మిదవ అధ్యాయము ఇంద్రుడు మరల నింద్రత్వమందుట ఇంద్రుడు విశాలాక్షియగు తన భార్యనుజూచి ఆమె శోకార్తయై యొంటిగ గనిపించుటచే విస్మయము జెంది ఆమెతో నిట్లనెను : కాంతా! శుభాననా! ఇచట నే నెల్ల భూతముల కంట బడకుంటిని గదా! ఇట నేనుంట నీ వెటులెఱిగితివి? ఎటుల రాగలిగితివి?' శచియిట్లనెను : 'ఓ దేవా ! శ్రీ మాతృదేవి దయవలన నిన్నెఱింగితిని. ఆ తల్లి యనుగ్రహముననే నిన్ను గలిసికొంటిని. మునులు సురలును రాజర్షియగు నహుషుని నీ యాసనముపై నుంచిరి. అతడు నన్నెప్పుడును బాధపెట్టు చున్నాడు. బలనిషూదనా! తాను సురపతియనియు తన్ను పతిగ వరించుమనియు నతడు నన్ననుచున్నాడు. ఆ పాపి నన్నట్లను చుండగ నేనేమి చేయగలను? ఇంద్రుడిట్లనెను : 'ఓ కళ్యాణీ! నేను మంచి దినముల కెదురు చూచుచున్నాను. నీవును మనస్సు కుదుటపరచుకొని యెదురు చూడుము.' అట్లు ధీశాలియగు నింద్రుడు పలుకగ శచి నిట్టూర్చుచు దుఃఃతయై గడగడలాడుచు నిట్లు పలికెను : 'ఓ మహాత్మా! అచట నే నెట్లు నిలువగలను? దుర్మదాంధుడు వరగర్వితుడునగు ఆ పాపాత్ముడు నన్ను తన వశముచేసికొన జూచుచున్నాడు. అతని ధాటికి సురలును మునులును వెఱచి నన్నా కామాతురుని సేవింపుమని పోరు పెట్టుచున్నారు. ఓ పరంతపా! బృహస్పతి దేవతలకు వశుడు విప్రుడు బలహీనుడు అట్టివాడు నన్నెట్లు గాపాడగలడు? నే నబలను. పురుషవశ వర్తినిని. అనాధను అట్టి నాకు విధి యనుకూలింపనిచో నేనేమియును జేయజాలనని బాధపడుచున్నాను. నేను స్త్రీని. నీ దానను. పతివ్రతను. కులటను కాను; శోకార్తను. అచట నన్ను బ్రోవగల వారెవ్వరును లేరు.' ఇంద్రః : ఉపాయం ప్రబ్రవీ మ్యద్యం తం కురుష్వ వరాననే | శీలంతే దుఃఃతే కాలే పరిత్రాతం భవిష్యతి. 13 పరేణరక్షితా నారీనభ##వే చ్చ పతివ్రతా | ఉపాయైః కోటిభిః కామభిన్న చిత్తా%తి చంచలా. 14 శీల మేవహి నారీణాం సదారక్షతి పాపతః | తస్మాత్త్వం శీల మాస్థాయ స్థిరాభవ శుచిస్మితే. 15 యదా త్వాం నహుషో రాజా బాలాదాకర్షయే త్ఖలః | తదా త్వం సమయం కృత్వా గుప్తం వంచయ భూపతిమ్. 16 ఏకాంతే తత్సమీ పే త్వంగత్వా వద మదాలసే | ఋషియానేన దివ్యేన మాముపేహి జగత్పతే. 17 ఏవం తవ వశే ప్రీతా భవిష్యామీతి మే వ్రతమ్ | ఇతి తం వద సుశ్రోణి తదాతు పరిమోహితః. 18 కామాంధః స మునీన్యానే యోజయిష్యతి పార్థివః | అవశ్యం తాపసో భూపం శాపదగ్థం కరిస్యతి.19 సాహాయ్యం జగదంబా తే కరిష్యతి న సంశయః | జగదంబా పదస్మర్తుః సంకటం న కదాచన .20 యది జాయేత తచ్చాపి జ్ఞేయం తత్స్వస్తయే కిల | తస్మా త్సర్వప్రయత్నేన మణిద్వీపాధివాసినీమ్. 21 భజ త్వం భువనేశానీం గురువాక్యానుసారతః | ఇత్యాఖ్యాతా శచీ తేన జగామ నహుషం ప్రతి. 22 తథేద్యుక్త్వా%తి విశ్వస్తా భావికర్యేకృతోద్యమా | నహుష స్తాం సమాలోక్య ముదితో వాక్యమబ్రవీత్. 23 ఇంద్రుడిట్లనెను : 'వరాననా! నీ కొక ఉపాయము చెప్పుదును. అటుల చేయుము. విపత్కాలమందు తన సౌశీల్యమును దక్కించుకొనుటయే స్త్రీ ధర్మము. పరుల వలన రక్షింపబడిన నారి పతివ్రత గాదు. స్త్రీ చిత్త మతి చంచలము. అది కామము దెసకే పరుగిడుచుండును. శుచిస్మితా ! స్త్రీల సౌశీల్యము వారిని వారి పాపాల నుండి రక్షించును. కనుక మంచి శీలవతివై నడుచుకొమ్ము. నహుషుడు నిన్ను బలాత్కరించు తఱి నతనిని అతనికి తెలియకుండునట్లు మోసగించుము. అతడొంటరిగ నున్న సమయ మెఱుగుము. అపు డతనితో నీవు పరమర్షుల దివ్య యానమున నా చెంతకు రమ్ము. నేను నీ కపుడు ప్రేయసి నగుదును. ఇదే నా వ్రత'మనుము. దాని కతడు మోహితుడు డగును. అతడు కామాంధుడై మునులను తన యానమునకు వాహకులుగ నియమించుకొనును. అంత మును లతనిని శాపాగ్నితో దహించివేయుదురు. శ్రీజగదంబికయును నీకు తన కైదండ నొసగగలదు. శ్రీ త్రిభువనేశ్వరీ పాదపద్మములు సంస్మరించు వారి కెన్నడు నెట్టి సంకటములును గల్గవు. ఒకవేళ శ్రీదేవి భక్తుల కాపదలు సంభవించవచ్చును. ఐనను నవి వారి మేలునకే యగునని యెఱుంగుము. కనుక మణిద్వీపాధివాసిని నెల్ల విధముల గొలుపుము. లోకేశ్వరిని గురు వచనానుసారముగ భజింపుము.'' అన విని శచీదేవి అట్లు చేయుట కొప్పుకొని విశ్వాసముతో భావికార్యమునకు యత్నించుచు నహుషుని చెంత కేగెను. నహుషు డింద్రాణి రాకగని సంతస మొంది యిట్లనెను : స్వాగతం సత్యవచనై స్త్వదధీనో%స్మి కామిని | దాసో%హం తవ సత్యేన పాలితం వచనం త్వయా. 24 యదాగతా సమీపే మే తుష్టో%స్మి మితభాషిణి | న చ వ్రీడా త్వయా కార్యా భక్తవం మాంభజ సుస్మితే. 25 కార్యం వద విశాలాక్షి కరిష్యామి తవ ప్రియమ్| శచీ: సర్వం కృతం త్వయా కార్యం మమ కృత్రిమవాసవ 26 మనోరథో%స్మి మే దేవ శృణు చిత్తే%ధునా విభో | వాంఛితం కురు కల్యాణ త్వద్వశా%హ మతః పరమ్. 27 బ్రవీమి మానసోత్సాహం త్వంతం కర్తు మిహా%ర్హసి | కార్యం త్వం బ్రూహి చంద్రాస్యే ! కరోమితవవాంఛితమ్. 28 అలభ్య మపిదాస్యామితుభ్యంసుభ్రు వదస్వ మామ్. శచ్యువాచ : కథంబ్రవీమిరాజేంద్ర! వ్రత్య యోనాస్తి మేతవ. 29 శపథం కురు రాజేంద్ర! యత్కరోమి ప్రియం తవ | రాజానః సత్యవచసో దుర్లభా ఏవ భూతలే. 30 పశ్చా ద్ర్బవీ మ్యహం రాజన్ జ్ఞాత్వా సత్యేన యంత్రితమ్ | కృతే చే ద్వాంఛితే భూప! సదా తే వశవర్తినీ. 31 భవిష్యామి తురాషాడ్వై సత్య మేత ద్వచో మమ | నహుషః : అవశ్యమేవ కర్తవ్యం వచనం తవ సుందరి. 32 శపామి సుకృతేన్బాహం యజ్ఞదానకృతేన వై | శచ్యువాచ : ఇంద్రస్య హరయో వాహా గజశ్చైవ రథస్తథా. 33 గరుడో వాసుదేవస్య యమస్య మహిష స్తథా | ఋషభః శంకరస్యా%పి బ్రహ్మణో వరటాపతిః 34 మయూరః కార్తికేయస్య గజాస్యస్యతు మూషకః ఇచ్ఛామ్యహ మపూర్వం వైవాహనం తే సురాధిప. 35 య న్న విష్ణో ర్న రుద్రస్య నా%సురాణాం నరక్షసామ్ | వహంతు త్వాం మహారాజ! మునయః సం శితవ్రతాః. 36 సర్వే శిబికయా రాజ న్నే తద్ధి మమ వాంఛితమ్ | సర్వ దేవాధికం త్వాం వై జానామి వసుధాధిప. 37 తేన తే తేజసో వృద్ధిం వాంఛామ్యహ మతంద్రితా | ''సత్యభాషిణీ! కాంతా! నీకు కుశలమా? నేను నీ వాడను. నీ దాసుడను. కామినీ! నీవు నా మాట ప్రకారము వచ్చితివి. మితభాషిణీ! నీవు నా దాపుజేరినంతనే సంతసించితిని. ఇక సిగ్గు వదలుము. నీ భక్తుడనగు నన్ను భజింపుము. విశాలాక్షీ! నీ వే పని చెప్పినను చేసి నీకు ప్రియము గూర్తును.' శచీదేవి యిట్లనెను 'వాసవా! నీవన్ని పనులును చేసితివి. నా మది నొక కోర్కె గలదు. వినుము. నా వాంఛితము దీర్చినచో నేను నీదాన నగుదును. నా మనోరథ మిపుడు వెల్లడించు చున్నాను. దానిని సాధింప నీవే సమర్థుడవు.' నహుషు డిట్లనెను : 'చంద్రాస్యా! నీ కోరిక యేమో తెలుపుము. అదెంతటి కష్టసాధ్యమైనదైనను నే నొర్తును. తెల్పుము.' శచి యిట్లనెను : 'రాజేంద్రా! నీ యందు నాకు నమ్మకము లేదు. నేనెట్లు చెప్పుదును. కనుక రాజా! నీవు ప్రమాణము చేసినచో నీకు ప్రియము గూర్తును. ఈ భూమిపై రాజులు నిజము పల్కుట దుర్లభము. నీవు సత్యశీలుడ వను నమ్మకము నాకు గల్గవలయును. అపుడు నా యిష్టము దెల్పుదును. నీ కపుడు వశగతనగుదును. నా మాటలు నిక్కములని నమ్ముము.' నహుషు డిట్లనెను:'సుందరీ! నీ మాట తప్పక చెల్లింపగలను. నా యజ్ఞదానముల పుణ్యమును ప్రమాణముగ జేసి చెప్పుచున్నాను.' శచి యిట్లనెను : 'ఇంద్రుని వాహనములు ఉచ్చైః శ్రవము - ఐరావతము - విష్ణు వామనము గరుడి, యమ వాహనము మహిషము, శివ వాహనము వృషభము. బ్రహ్మ వాహనము హంసము. షణ్ముఖుని వాహనము మయూరము. విఘ్నహరుని వాహనము మూషకము. కనుక నో సురపతీ! ఇక నీ వాహన మెట్లుండునో చూడగోరుచున్నాను. నీకు హరిరుద్రుల - సురాసురుల వాహనములు తగవు. నీకు సంశిత వ్రతులగు మునీంద్రులు వాహనముగ నుండ వలయును. వారు నీ పల్లకిని మోయవలయును. అపుడు నిన్ను సర్వదేవాధికునిగ నెఱుగగలను. ఇదియే నా కోరిక. దీనివలన నీ తేజ మినుమడింపవలయునని కోరుదును.' తస్యా స్తద్వచనం శ్రుత్వా ప్రహస్య జ్ఞాన దుర్బలః. 38 మోహిత స్తు మహాదేవ్యా కృతమోహేన తత్క్షణమ్ | ఉవాచ వచనం భూపః సంస్తువ న్వాసవ ప్రియామ్. 39 నహుషః : సత్యముక్తం త్వయా తన్వి వాహనం రుచిరం మమ | కరిష్యామి సుకేశాంతే వచనం తవ సర్వథా. 40 నహ్యల్పవీర్యో భవతి యో వాహాన్కురుతే మునీన్ | అహ మారుహ్య యానేన త్వా మేష్యామి శుచిస్మితే. 41 సప్తర్షయో మాం వక్ష్యంతి సర్వే దేవర్షయ స్తథా | సమర్థం త్రిషు లోకేషు జ్ఞాత్వా మాంతాపస్బాధికమ్. 42 ఇత్యుక్త్వా తాం సుసంతుష్టో విససర్జ హరిప్రియామ్ | మునీ నాహూయసర్వాంస్తానిత్యువాచస్మరాన్వితః. 43 నహుషః : అహమింద్రో%ద్య భోవిప్రాః సర్వశక్తి సమన్వితః | కార్యమత్ర ప్రకుర్వంతుభవంతోవిగతస్మయాః. 44 ఇంద్రాసనం మయాప్రాప్తం నేంద్రాణీ మాముపైతి చ | ఆకారితా చ మాం బ్రూతే ప్రేమపూర్వ మిదం వచః | 45 మునియానేన దేవేంద్ర మాముపేహి సురాధిప | దేవదేవ మహారాజ మత్ర్పియం కురు మానద. 46 ఏతత్కార్యం మునిశ్రేష్ఠా మమాత్యంతం దురాసదమ్ | భవద్భిస్తు ప్రకర్తవ్యం సర్వథైవ దయాశుభిః. 47 మనో దహతి మే కామః శక్రపత్న్యాం ప్రవర్తితమ్ | భవంతః శరణం మే%ద్య కురధ్వం కార్య మద్భుతమ్. 48 అగస్తి ప్రముఖా స్తస్య శ్రుత్వా వాక్య మసత్కరమ్ | అంగీచక్రుశ్చ భావిత్యా త్కృపయా పరమర్షయః. 49 శచి మాటలకు జ్ఞానహీనుడగు నహుషుడు పకపక నవ్వెను. అంతట శ్రీమహాదేవి మాయచే నహుషుడు ప్రమోహితుడయ్యెను. అతడు వెంటనే యామెను పొగడుచు నిట్లనియెను : 'తన్వంగీ! నా ఠీవికి తగిన వాహనము దెల్పి నిజము పల్కితివి. నీ మాట తప్పక చెల్లింతును. అల్పవీర్యుడు మునులను వాహకులుగ జేసికొనజాలడు. నేను ముని వాహన మెక్కి నీ చెంతకు వత్తును. నన్ను సప్తర్షులు మోయుదురు. సురలు నన్ను త్రిలోకములందు గొప్ప తపశ్శాలిగ నెన్నుదురు. 'అట్లు నహుషుడు సంతుష్టుడై శచిని వదలి మునులను పిలిపించి కామార్తితో వారితో నిట్లనెను : 'విప్రులారా ! ఇపుడు నే నింద్రుడను. సకల శక్తియుక్తుడను. మీరు వింత జెందక నా కొకపని జేయవలయును. నా కింద్ర పదవి లభించెను గాని యింద్రాణి లభించలేదు. ఆమె నాతో ప్రేమమున 'దేవదేవా! నీవు ముని యానమున నన్ను జేరి నాకు ముదము గూర్పుము' అని పలికెను. మునివరులారా ! ఈ పని నాకు కష్టమైనది. మీరే దయతో దీనిని నెఱవేర్పవలయును. నా డెంద మింద్రుని భార్యయందు తగిలినది. నా మదిలో కామాగ్ని ప్రజ్వరిల్లుచున్నది. నా పని నెఱవేర్చుడు. ఇక మీరే నా దిక్కు.'' అగస్త్యాదిమును లీ దుష్కార్యము విని జరుగనున్నది ఎఱింగి దయతో నతని మాట నంగీకరించిరి. అంగీకృతే%థ తద్వాక్యే మునిభి స్తత్త్వ దర్శిభిః | ముదం ప్రాప నృపః కామం పౌలోమీకృతమానసః. 50 ఆరుహ్య శిబికాం రమ్యాం సంస్థిత స్త్వరయా%న్వితః | వాహా న్కృత్వా మునీ న్దివ్యా న్సర్ప సర్పేతి చాబ్రవీత్. 51 కామార్తః సో%స్పృశన్మూఢః పాదేన మునిమస్తకమ్ | అగస్తిం తాపసశ్రేష్ఠం లోపాముద్రాపతింతదా. 52 వాతాపిభక్షకర్తారం సముద్రస్యాపి శోషకమ్ | కశయా తాడయామాస పంచబాణశరాహతః. 53 ఇంద్రాణీ హృతచిత్తో%సౌ సర్పేతి ప్రబ్రువన్మునిమ్ | తం శశాప మునిః క్రుద్ధః కశాఘాతమనుస్మరన్. 54 సర్పోభవ దురాచార వనే ఘోర వపుర్మహాన్ | బహువర్ష సహస్రాణి యత్ర క్లేశో మహాన్భవేత్. 55 విచరిష్యసి వీర్యేణ పునః స్వర్గ మవాప్స్యసి | దృష్ట్వా యుధిష్ఠిరం నామ తవ మోక్షో భవిష్యతి. 56 ప్రశ్నానాముత్తరం శ్రుత్వా ధర్మపుత్ర ముఖాత్తతః | ఏవం శప్తః సరాజర్షిః స్తుత్వాతం మునిసత్తమమ్. 57 స్వర్గా త్పపాత సహసా సర్పరూపధరో%భవత్ | బృహస్పతి స్తతో గత్వా తరసా మానసం ప్రతి. 58 అట్లు తత్త్వదర్శనులగు మునులంగీకరింపగ శచిమీద మనస్సుగల నహుషుడు ప్రమోదమందెను. అతడు పిమ్మట నొక మంచి పల్లకిలో గూర్చుండి దివ్యమునులను వామకులుగ నేర్పరచి సంభ్రమముతో సర్పసర్ప' యని (త్వరగ సాగుమనుచు) ఆ గర్వి-కామాంధుడు లోపాముద్రాపతి మహాతపస్వియగు అగస్త్య మహర్షి తలపై కాలిడెను. అంతేకాక, నహుషుడు కామదుర్మదాంధుడై ఇంద్రాణీగత మనస్కుడై వాతాపిని మ్రింగినవాడు సాగరమును గ్రోలినవాడునైన యగస్త్య మహర్షిని పదపద అనుచు కొరడాతో గొట్టెను. ఆ దెబ్బ తలచుకొనుచు మునివరుడు మహాక్రోధముతో నహుషు నిట్లు శపించెను. 'ఓరీ దురాచారా! నీవు వనము నందు ఘోర శరీరముగల సర్పము గమ్ము. పెక్కేండ్లు దుఃఖములు గడుపుము. అటుల నీవు బలముతో తిరుగుచుందువు. పిదప ధర్మజుడు నీ ప్రశ్నల కన్నిటికి సమాధానము లీయగలడు. అట్లు యుధిష్ఠిరుని వలన నీకు శాపముక్తి గల్గును. అపుడు మరల స్వర్గము జేరగలవు.' అట్లు రాజర్షి నహుషుడు శపింపబడి యగస్త్యుని సన్నుతించెను. నహుషుడు వెంటనే స్వర్గచ్యుతుడై పామై నేలగూలెను. అంత వేగిరముగ బృహస్పతి మానస సరస్సున కేగెను. ఇంద్రాయ సర్వ వృత్తాంతం కథాయామాస విస్తరమ్ | తచ్ఛ్రుత్వా మఘవా రాజ్ఞః స్వర్గా త్ర్పచ్యవనాదికమ్. 59 ముదితో%భూ న్మహారాజః స్థిత స్తత్రైవ వాసవః | దేవాశ్చ మునయో దృష్ట్వా నహుషం పతితం భువి. 60 జగ్ముః సర్వే%పి తత్రైవ యత్రేంద్రః సరసి స్థితః | తమాశ్వాస్య సురాః సర్వే మునిభిః సహితా స్తథా. 61 స్వర్గే సమానయాసు ర్మానపూర్వం శచీపతిమ్ | సమాగతం తతః శక్రం సర్వే తే మునయః సురాః. 62 స్థాపయిత్వా%%సనే పశ్చా దభిషేకం దదుః శివమ్ | ఇంద్రో%పి స్వాసనం ప్రాప్య శచ్యాసహ సురాలయే. 63 చిక్రీడ నందనే రమ్యే కాననే ప్రేమయుక్తయా | ఏవ మింద్రేణ సంప్రాప్తం దుఃఖంపరమదారుణమ్. 64 హత్వా%సురం కామరూపం విశ్వరూపం ముదామునిమ్ | పునర్దేవ్యాంః ప్రసాదేన స్వస్థానం ప్రాప్తవాన్నృప. 65 ఏతత్తే సర్వ మాఖ్యాతం వృత్రాసురవధాశ్రయమ్ | యత్పృష్ఠో%హం త్వయా రాజ న్కథానక మనుత్తమమ్. 66 యాదృశం కురుతే కర్మ తాదృశం ఫల మాప్నుయాత్ | అవశ్య మేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్. 67 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే వృత్రవధోనామ నవమో%ధ్యాయః అతడింద్రునికి జరిగినదంతయు వినిపించెను. నహుషుడు స్వర్గపదభ్రష్ఠుడగుట మున్నగునవన్నియు నింద్రుడు విని ఆనందభరితుడై యచ్చోటనే యుండెను. ఎల్ల దేవతలును మునులును నహుషుడు స్వర్గభ్రష్టుడగుట వినిరి. వారెల్లరు నింద్రుడు వసించిన సరస్సు కరిగి ఇంద్రున కూరటగల్గించిరి. సురపతిని సాదరముగ స్వర్గమునకు తీసుకొనివచ్చిరి. ఆ వచ్చిన యింద్రుని సురులును మునులును గలిసికొని హర్షము వెలిపుచ్చిరి. ఇంద్రు నింద్రాసనమున నునిచి యభిషేకించిరి. ఆ విధముగ మరల నింద్రు డింద్రాసనము బడసి యింద్రాణీసహితుడయ్యెను. నందనవనమందు ప్రేమవిహారము లొనర్చెను. ఇటుల నింద్రుడు గూడ ఘోర దుఃఖములపాలయ్యెను. ఇంద్రుడు అట్లు కామరూపి మహర్షియగు విశ్వరూపుని చంపి శచీప్రముఖ దేవతలచేత సేవింపబడిన శ్రీదేవి కృపాకటాక్షముతో మరల తన పదవి నలంకరింపగలిగెను. రాజా! ఈ విధముగ వృత్రాసుర వధకు సంబంధించిన దివ్యకథ నీవడుగగ సవిస్తరముగ జెప్పితిని. ఎల్ల ప్రాణు లెట్టి కార్యము చేతురో యట్టి ఫలము తప్పకనుభవింతురు. శుభముగాని యశుభముగాని యనుభవింపక తీరదు. ఇందు సందేహము ఇంతయును లేదు. ఇతి శ్రీమద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు నింద్రుడు మరల నింద్రత్వందుటయను నవమాధ్యాయము.