Sri Devi Bhagavatam-1    Chapters   

అథ దశమో%ధ్యాయః

జనమేజయ ఉవాచ : కథితం చరితం బ్రహ్మాన్‌ శక్రస్యా%ద్భుత కర్మణః | స్థానభ్రంశ స్తథా దుఃఖ ప్రాప్తి రుక్తా విశేషతః. 1

యత్ర దేవాధిదేవ్యా శ్చ మహిమా%తీవ వర్ణితః | సందేహో%త్ర మమాప్యస్తి యచ్ఛక్రో%పి మహాతపాః. 2

దేవాధిపత్య మసాద్య దుఃఖహం దుఃఖమన్వభూత్‌ | మఖానాంతు శతం కృత్వా ప్రాప్తుం స్థానమనుత్తమమ్‌. 3

దేవేశత్వం చ సంప్రాప్య భ్రష్టః సానా దసౌ కథమ్‌ | ఏతత్సర్వం సమాచక్ష్వ కారణం కరుణానిధే. 4

సర్వజ్ఞో%సి మునిశ్రేష్ఠ పురాణానాం ప్రవర్తకః | నావాచ్యం మహతాం కించి చ్ఛిష్యే చశ్రద్ధయా%న్వితే. 5

తస్మాత్కురు మహాభాగ మత్సందేహపనోదకమ్‌ | సూత ఉవాచ : ఇతి పృష్టః స రాజ్ఞా వై తదా సత్యవతీసుతః. 6

తమాహాతి ప్రసన్నాత్మా యథానుక్రమముత్తరమ్‌ | వ్యాసః : నిభోధ నృపతిశ్రేష్ఠ ! కారణం పరమాద్భుతమ్‌. 7

కర్మణ స్తు త్రిధా ప్రోక్తా గతి స్తత్త్వవిదాం వరైః | సంచితం వర్తమానం చ ప్రారబ్ధ మితి భేదతః. 8

అనేకజన్మ సంజాతం ప్రాక్తనం సంచితం స్మృతమ్‌ | సాత్త్వికం రాజసం కర్మ తామసం త్రివిధం పునః. 9

శుభం వా%ప్యశుభం భూప సంచితం బహుకాలికమ్‌ | అవశ్యమేవ భోక్తవ్యం సుకృతం దుష్కృతం తథా. 10

జన్మజన్మని దేవానాం సంచితానాంచ కర్మణామ్‌ | నిఃశేష స్తు క్షయో నాభూత్కల్ప కోటిశ##తైరపి. 11

క్రియామాణం చ యత్కర్మ వర్తమానం తదుచ్యతే | దేహం ప్రాప్య శుభం వా%పి హ్యశుభం వా సమాచరేత్‌. 12

సంచితానాం పునర్మధ్యా త్సమాహృత్య కియాన్కిల | దేహారంభే చ సమయే కాలః ప్రేరయతీవ తత్‌. 13

పదవ అధ్యాయము

కర్మగతి

జనమేజయు డిట్లనియె : ''ఓ మహనీయా! ఇంద్రు డద్భుత చరిత్రుడు. అతని స్థానభ్రంశము దుఃఖప్రాప్తి మరల నింద్రత్వమందుట వివరించి తెల్పితివి. అందు దేవాధిదేవియగు శ్రీమాతృదేవి మహిమము విపులముగ వెల్లడించితివి. కాని నాకొక్క సందేహము గల్గుచున్నది. అదేమన, ఇంద్రుడు మహాతపస్వి. అతడింద్రత్వమునకై నూరుయాగము లొనరించియు దేవాధిపత్యము బడసియును ఘోరక్లేశము లనుభవించెను. అతడు దేవేశత్వమందియును పదభ్రష్టుడెట్లు గావలసివచ్చెను? దయామయా! వీటి హేతువులన్నియును నాకు తెల్ల మొనరింపుము. నీవు బహుపురాణకర్తవు. మునిప్రవరుడవు. సర్వజ్ఞుడవు. మహాత్ములకు శ్రద్ధాళురగు శిష్యులకు చెప్పరానిదుండదు గదా! మహానుభావా! నా యీ సందేహము దీర్పుము.'' అని యిట్లు జనమేజయుడడిగిన ప్రశ్నములను వ్యాసుడు విని ప్రసన్నుడై యీ ప్రకారముగ క్రమముగ నతనికి చెప్పసాగెను. 'నృపవరా! నీవడిగిన వానికద్భుతములగు హేతువులు గలవు. వానినన్నిటిని సమగ్రముగ నాలకింపుము. తత్త్వవిదులు కర్మము ముత్తెఱంగులుగ నుండునందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధమనబడును. ఈ కర్మగతి గహనమైనది. ఈ కర్మము మరల సాత్త్వికము రాజసము తామసమునని మూడువిధములుగ నలరును. పెక్కు పూర్వజన్మములలో జేసిని కర్మము సంచితమనబడును. కర్మము మంచిదైనను చెడుదైనను. నేనాటిదైనను జీవుడు తప్పక ఆ పుణ్యపాపముల ఫలము లనుభవించవలసినదే. ఇట్లు జన్మజన్మల సంచితకర్మఫలము శతకోటి కల్పములకైన జీవులనుభవింపక తప్పదు. ఇప్పుడిక్కడ చేయబడుచున్న పని వర్తమాన మనబరగును. దేహముదాల్చిన ప్రతి దేహియు నిచటి మంచిచెడ్డ లాచరించవలసినదేకదా! ఈ తనువు దాల్చునపుడు జీవుడు సంచితములోని కొంతభాగ మనుభవించుటకు ప్రేరింపబడును. దానిని ప్రారబ్ధమందురు.

ప్రారబ్ధం కర్మ విజ్జేయం భోగాత్తస్యక్షయః స్మృతః | ప్రాణిభిః ఖలు భోక్తవ్యం ప్రారబ్ధం నాత్ర సంశయః. 14

పురా కృతాని రాజేంద్ర! హ్యశుభాని శుభాని చ | అవశ్యమేవ కర్మాణి భోక్తవ్యానీతి నిశ్చయః. 15

దేవై ర్మనుషై#్య రసురై ర్యక్ష గంధర్వకిన్నరైః | కర్మైవ హి మహారాజ! దేహారంభస్య కారణమ్‌. 16

కర్మక్షయే జన్మనాశః ప్రాణినాం నాత్ర సంశయః | బ్రహ్మా విష్ణు స్తథా రుద్ర ఇంద్రాద్యాశ్చ సురాస్తథా. 17

దానవా యక్షగంధర్వాః సర్వే కర్మవశాః కిల | అన్యథా దేహసంబంధః కథం భవతి భూపతే. 18

కారణం యస్తు భోగస్య దేహినః సుఖదుఃఖయోః | తస్మా దనేకజన్మోత్థ సంచితానాం చ కర్మణామ్‌.19

మధ్యే వేగః సమాయాతి కస్యచిత్కాలపాకతః | తత్త్రాపరబ్ధవశా త్పుణ్యం కరోతి చ యథా తథా. 20

పాపం కరోతి మనుజస్తథా దేవదయ్బోపి చ | తథా నారాయణో రాజన్నరశ్చ ధర్మజా వుభౌ. 21

జాతౌ కృష్ణార్జునౌ కామ మంశౌ నారాయణస్య తౌ | పురాణపీఠికేయం వై మునిభిః పరికీర్తితా. 22

దేవాంశః స తు విజ్ఞేయోయోభ##వే ద్విభవాదికః | నానృషిః కురుతే కావ్యం నారుద్రో రుద్ర మర్చతే. 23

న దేవాంశో దదాత్యన్నం నావిష్ణు పృథివీపతిః | ఇంద్రా దగ్నే ర్య మాద్విష్ణో ర్దనదా దితి భూపతే. 24

ప్రభుత్వం చ ప్రభావం చ కోపం చైవ పరాక్రమమ్‌ | ఆదాయ క్రియతే నూనం శరీర మితి నిశ్చయః. 25

యః కశ్చి ద్బలవాంల్లోకే భాగ్యదానథభోగవాన్‌ | విద్యానా న్దానవా న్వ్బాపి స దేవాంశః ప్రపఠ్యతే. 26

తథైవైతే సమాఖ్యాతాః పాండవాః పృథివీపతే | దేవాంశో వాసుదేవో%పి నారాయణ సమద్యుతిః. 27

శరీరం ప్రాణినాం నూనం భాజనం సుఖదుఃఖయోః | శరీరీ ప్రాప్నుయాత్కామం సుఖదుఃఖ మనంతరమ్‌. 28

ప్రారబ్ధమనుభవించిన గాని తీరదు. ప్రాణులీప్రారబ్ధకర్మము నిస్సంశయముగ ననుభవింతురు. ఇట్లు జీవులు తాము మునుపుజేసిన మంచిచెడ్డలను తప్పక యనుభవింపవలయును. ఈ కర్మమే సుర-అసుర-దేవ-గంధర్వ-కిన్నర-నర తనువుల దాల్చుటకు మూలకారణము. కర్మము నశించినచో ప్రాణికిక జన్మములేదు. బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఇంద్రాది దేవతలును-దానవులు-యక్ష-గంధర్వులెల్లరును కర్మవశులే. ఇట్టి కర్మములేనిచో కర్మబంధ సంబంధ మెట్లు గల్గును? జీవులు సుఖదుఃఖము లనుభవించుట కిట్టి కర్మబంధము ముఖ్య హేతువు. సంచిత కర్మములు తొంటి పెక్కు జన్మములకు సంబంధించి యుండును. అందుండి కాలవశమున గల్గిన కర్మవేగము ప్రారబ్దమగును. దానినిబట్టి జీవుడు పుణ్యము లాచరించును. లేక యతడు పాపము లొనర్చును. ఈ పుణ్యపాపములు నరులెట్టు లాచరింతురో దేవతలు నట్టులే యాచరింతురు. తొల్లి ధర్మపుత్త్రులగు నరనారాయణు లుండిరి. వారు కర్మవశమున కృష్ణార్జునులుగ నవతరించిరి. వీరు నారాయణాంశజులని మునులు పురాణములందు కీర్తించిరి. అధిక విభుత్వముగల వానిని దేవాంశ సంభూతుడని యెఱుగుము. ఋషిగానివాడు కవి గాజాలడు. రుద్రుడు గానివాడు రుద్రునర్చింపజాలడు. దేవాంశసంభూతుడుకానివా డన్న దానము చేయజాలడు. విష్ణునంశ##లేనివాడు రాజుగాలేడు. రాజా ! ఈ దేహమింద్ర - అగ్ని - యమ - విష్ణు - కుబేరుల వలన గలిగెను. ఈ మేను వారినుండి వరుసగ ప్రభుత్వము - ప్రభావము - కోపము - పరాక్రమము - వైభవము గ్రహించి యేర్పడును. ఈ లోకమునందు బలము భాగ్యము భోగము చదువు గలవాడు దేవాంశ సంజాతుడని పేరెన్నిగ గాంచును. కనుకనే పాండవులు దేవాంశజులని ప్రఖ్యాతి వహించిరి. ప్రతిభా ప్రభావశాలియగు వాసుదేవుని నారాయణ స్వరూపినిగ భావింపుము. ఈ ప్రాణుల శరీరము సుఖదుఃఖములకు నిలయము. దేహి సుఖ దుఃఖము లొకదాని వెంట నొకటి యనుభవించుచుండును.

దేహీ నాస్తి వశః కో%పి దైవాధీనః సదైవ హి | జననం మరణం దుఃఖం సుఖం ప్రాప్నోతి చావశః. 29

పాండవా స్తే వనే జాతాః ప్రాప్తాస్తు స్వగృహం పునః | స్వబాహుబలతః పశ్చా ద్రాజసూయ క్రతూత్తమమ్‌. 30

వనవాసం పునః ప్రాప్తా బహుదుఃఖకరం పరమ్‌ | అర్జునేన తపస్తప్తం దుష్కరం హ్యజితేంద్రియైః. 31

సంతుష్ట స్తు సురై ర్దత్తం వరదానం పునః శుభమ్‌ | నరదేహకృతం పుణ్యం క్వ గతం వనవాసజమ్‌. 32

నరదేహే తపస్తప్తం చోగ్రే బదరికాశ్రమే | నార్జునస్య శరీరే తత్ఫలదం సంబభూవ హ. 33

ప్రాణినాం దేహసంబంధే గహనా కర్మణో గతిః | దుర్జేయా సర్వథా దేవై ర్మానవానాం తు కా కథా. 34

వాసుదేవో%పి సంజాతః కారాగారే%తి సంకటే | నీతో%సౌ వసుదేవేన నందగోపస్య గోకులమ్‌. 35

ఏకాదశైవ వర్షాణి సంస్థిత స్తత్ర భారత | పునః స మధురాం గత్వా జఘానోగ్రసుతం బలాత్‌ ! 36

మోచయామాస పితరౌ బంధనాత్‌ భృశదుఃఃతౌ | ఉగ్రసేనం చ రాజానం చకార మథురాపురే. 37

జగామ ద్వారవత్యాం స వ్లుెచ్ఛరాజభయా త్పునః | సర్వం భావివత్కృష్ణః కృతవా న్పౌరుషం మహత్‌. 38

కృత్వా కార్యా ణ్యనేకాని ద్వారవత్యాం జనార్ధనః | దేహం త్యక్త్వా ప్రభాసే తు స కుటుంబో దివంగతః. 39

పుత్రాః పౌత్రాశ్చ సుహృదో భ్రాతరో జామయస్తథా | ప్రభాసే యాదవాః సర్వే విప్రశాపాత్‌క్షయం గతాః. 40

ఏవం తే కథితా రాజన్కర్మణో గహనాగతిః | వాసుదేవ్బోపి వ్యాధస్య బాణన నిధనం గతః. 41

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే దశమో%ధ్యాయః.

ఏ దేహికిని స్వాతంత్ర్యమెప్పుడు నుండదు. అతడు దైవాధీనుడు. అతడు పరాధీనుడై జన్మమరణములు సుఖదుఃఖములు ననుభవించుచుండును. పాండవులడవులందు జన్మించిరి. పిదప తమ గృహముల కరిగి. మరల వారు రాజసూయయాగమాచరించిరి. పిమ్మట దుఃఖకరములగు వనవాస క్లేశము లనుభవించిరి. అర్జునుడు ఘోరతమొనర్చెను. దానికి సంతోషించి దేవతలతనికి వరములు ప్రసాదించిరి. వారు వనములందు బుట్టి జేసిన పుణ్యమంతయు నేమయ్యెనోకదా! తొల్లి నరుడు బదరికాశ్రమమం దుగ్రతపమాచరించెను. దాని ఫలితమతనికేల దక్కకుండెను? కనుక ప్రాణిగణముల దేహ సంబంధముతో గలుగు కర్మగతి యెవరికిని బోధపడదు. వాసుదేవుడు సైతము బాధాకరమగు కారాగృహమును బుట్టి వసుదేవునిచేత నందునింటికి గొనిపోబడెనుగదా! అచట కృష్ణుడు పదునొకండేండ్లు గడపి పిదప మధురకేగి కంసుని సంహరించెను. కృష్ణుడు దుఃఃతులగు తన తల్లిదండ్రులను బంధముక్తులనుజేసి మధురకుగ్రసేనుని రాజుగనొనర్చెను. వ్లుెచ్ఛరాజగు కాలయువనునకు వెఱచి ద్వారక కేగెను. అట్లు కృష్ణుడు దైవవశమున పౌరుషమవలంబించెను. అతడు ద్వారకలో నతిమానుషము లత్యద్భుతములునగు కార్యములాచరించి ప్రభాసతీర్థమున వైకుంఠమేగెను. కృష్ణుని పుత్రపౌత్రులు మిత్రులు భాత్రలు మున్నగువారెల్లరు విప్రశాపమున నశించిరి. రాజా! ఇట్లు నీకు తెలియరాని కర్మగతి గూర్చి వివరించితిని. వాసుదేవుడు సైతము తుదకొక వ్యాధుని బాణముచే ప్రాణములు వదలెను.

ఇది శ్రీమద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు కర్మగతి యను దశమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters