Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వాదశో%ధ్యాయః రాజా : తీర్థాని భువి పుణ్యాని బ్రూహి మే మునిసత్తమ | గమ్యాని మానవై ర్దేవైః క్షేత్రాణి సరితస్తథా.
1 ఫలం చ యాదృశం యత్ర తీర్థేషు స్నానదానతః | విధింతు తీర్థయాత్రాయాం నియమాంశ్చ విశేషతః.
2 వ్యాసః : శృణు రాజ న్ర్పవక్ష్యామి తీర్థాని వివిధాని చ | యేషు తీర్థేషు దేవీనాం ప్రశస్తా న్యయనానిచ.
3 నదీనాం జాహ్నవీ శ్రేష్ఠా యమునా చ సరస్వతీ | నర్మదా గండకీ సింధు ర్గోమతి తమసా తథా.
4 కావేరీ చంద్రభాగా చ పుణ్యా వేత్రపతీ శుభా | చర్మణ్వతీ చ సరయూ స్తాపీ సాభ్రమతీ తథా.
5 ఏతా శ్చ కథితా రాజ న్నన్యా శ్చ శతశః పునః | తాసాం సముద్రగాః పుణ్యా స్వల్ప పుణ్యా హ్యనబ్ధిగాః.
6 సముద్రగానాం తాః పుణ్యాః సర్వదౌఘవహాస్తు యాః | మాసద్వయం శ్రావణాదౌ తాశ్చ సర్వా రజస్వలా.
7 భవంతి వృష్ఠియోగేన గ్రామ్యవారివహా స్తథా | పుష్కరం చ కురుక్షేత్రం ధర్మారణ్యం సుపావనమ్.
8 ప్రభాసం చ ప్రయోగం చ నైమిషారణ్య మేవ చ | విశ్రుతం చార్బుదారణ్యం శైలాశ్చ పావనా స్తథా.
9 శ్రీశైలశ్చ సుమేరుశ్చ పర్వతో గంధమాదనః | సరాంసి చైవ పుణ్యాని మానసం సర్వవిశ్రుతమ్.
10 తథా బిందుసరః శ్రేష్ఠ మచ్ఛోదం నామ పావనమ్ | ఆశ్రమా స్తు తథా పుణ్యా మునీనాం భావితాత్మనామ్.
11 విశ్రుత స్తుతదా పుణ్యఃఖ్యాతో బదరికాశ్రమః | నరనారాయణౌ యత్ర తేపే తౌ మునీ తపః.
12 వామనాశ్రమ ఆఖ్యాతః శతయాపాశ్రమ స్తథా | యేన యత్ర తప స్తప్తం తస్య నామ్నా%తి విశ్రుతః. 13 ఏవం పుణ్యాని స్థానాని హ్యసంఖ్యాతాని భూతలే | మునిభిః పరిగీతాని పావనాని మహీపతే. 14 ఏషు స్థానేషు సర్వత్ర దేవీస్థానాని భూపతే | దర్శనా త్పాపహారిణీ వసంతి నియమేన చ. 15 పన్నెండవ అధ్యాయము ఆడీ బక యుద్ద కథారంభము - హరిశ్చంద్ర కథ జనమేజయు డిట్లనెను : మునిసత్తమా! దేవతలు మానవులు సేవింపదగిన పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రములు పుణ్య నదులేవేవిగలవో వానిని తెల్పుము. ఏ పవిత్ర తీర్థమున యథావిధిగ స్నానదానాదులు చేసిన ఏమి ఫలము గల్గునో యా తీర్థయాత్రల నియమములేవో వానిని తేటపఱచుము. అన వ్యాసుడిట్లనెను : రాజా! ఏయే పుణ్యతీర్థములందు శ్రీదేవి మందిరములు విలసిల్లునో యయా వివిధ తీర్థములుగూర్చి తెలుపుదును. ఆలకింపుము. పావనపుణ్యనదులందు గంగ యమున సరస్వతి నర్మద గండకి సింధు గోమతి కావేరి చంద్రభాగ వేత్రవతి చర్మణ్వతి సరయు తాపి సాభ్రమతి (సబర్మతి) మున్నగునవి పవిత్ర పుణ్యనదులు. ఇవికాక భూమిపై పెక్కు నదులు గలవు. వానియందు సముద్రములో గలియు నదులన్నియు అధికతర పుణ్యప్రదములు. జలధిలో చేరనివి తక్కువ పుణ్యప్రదములు. నదులు మహావేగముతో సాగరములో గలిసినచో నవి మహాపుణ్యవంతములు. నదులు శ్రావణ భాద్రపద మాసములందు వర్షములు వలన అపరిశుద్ధమగు నీటితో ప్రవహించును. ఇట్లు అవి రజస్వల లగును. పుష్కరము కురుక్షేత్రము మిగుల పావనమగు ధర్మారణ్యము ప్రభాసము ప్రయాగ నైమిశారణ్యము అర్బుదారణ్యము పావనము లని ప్రసిద్ధి గాంచినవి. ఇవ పవిత్ర పర్వతము లెన్నియో కలవు వానిలో శ్రీశైలము మేరువు గంధమాదనము ముఖ్యములు. ఇట్లే పవిత్ర సరస్సులును గలవు. వానిలో మానస సరోవరము బిందురసము అచ్ఛోదము ప్రముఖములు. ఆత్మవంతులగు మునీశులు నివసించు పవిత్రాశ్రమములు గలవు. అవి పుణ్యప్రదములు. ఆశ్రమములందు నరనారాయణులు తప మొనరించిన బదరికాశ్రమము మిక్కిలి పుణ్యప్రదమని వన్నెయు వాసియు గాంచెను. ఇట్లు వామనాశ్రమమును శతయూపాశ్రమమును పుణ్యకరములే. తప మొనరించిన తాపసుల పేర్లతో నాశ్రమ నామము లేర్పడును. ఈ విధముగ భూతలమునందు లెక్క లేనన్ని పుణ్యతీర్థములు వెలసినవి. ఇవి మునీశుల పావన గీతములతో గానము చేయబడినవి. ఈ పుణ్యక్షేత్రములం దెల్లెడల శ్రీదేవీ స్థానములు విలసిల్లును. ఆ స్థానములను దర్శించిన మాత్రన పాపపంకము లింకిపోవును. కథ యిష్యామి తాన్యగ్రే ప్రసంగేన చ కానిచిత్ | తీర్థాని నృప దానాని వ్రతాని చ మఖా స్తథా. 16 తపాంసి పుణ్య కర్మాణి సాపేక్షాణి మహీపతే | ద్రవ్య శుద్ధిం క్రియాశుద్ధిం మనశ్శుద్ధి మపేక్ష్యచ. 17 పావనాని హి తీర్థాని తపాంసి చ వ్రతాని చ | కదాచి ద్ద్రవ్యశుద్ధిః స్యాత్క్రియా శుద్ధిః కదాచన. 18 దుర్లభా మనసః శుద్ధిః సర్వేషాం సర్వదా నృప | మనస్తు చంచలం రాజ న్ననేక విషయాశ్రితమ్. 19 కథం శుద్ధం భ##వే ద్రాజ న్నానాభావసమాశ్రితమ్ | కామక్రోథౌ తథా లోభో హ్యాహంకారో మదస్తథా. 20 సర్వేవిఘ్నకరా హ్యేతే తపస్తీర్థవ్రతేషు చ | అహింసా సత్య మస్తేయం శౌచ మింద్రియనిగ్రహః. 21 స్వధర్మపాలనం రాజ న్సర్వతీర్థ ఫలప్రదమ్ | నిత్యకర్మపరిత్యాగా న్మార్గే సంసర్గదోషతః. 22 వ్యర్థం తీర్థాధిగమనం పాపమేవావశిష్యతే | క్షాళయంతి హి తీరాని సర్వథా దేహజం మలమ్. 23 మానసం క్షాళితం తాని న సమర్థాని వై నృప | శక్తాని యది చేత్తాని గంగాతీర నివాసినః. 24 మునయో ద్రోహసంయుక్తాః కథం స్యు ర్భావితేశ్వరాః | వసిష్ఠ సదృశాః ప్రహ్వా విశ్వామిత్రాదయః కిల. 25 రాగద్వేషరతాః సర్వే కామక్రోధాకులాః సదా | చిత్తశుద్ధిమయం తీర్థం గంగాదిభ్య్బోతి పావనమ్. 26 యది స్యా ద్దైవయోగేన క్షాళయ త్వాంతరం మలమ్ | విశేషేణ తు సత్సంగో జ్ఞాననిష్ఠస్య భూపతే. 27 న వేదా న చ శాస్త్రాణి న వ్రతాని తపాంసి న | న మఖా న చ దానాని చిత్తశుద్ధే స్తుకారణమ్. 28 వసిష్ఠో బ్రహ్మణః పుత్త్రో వేదవిద్యా విశారదః | రాగద్వేషాన్వితః కామం గంగాతీర సమాశ్రితః. 29 ఆడీబకం మహాయుద్ధం విశ్వామిత్ర వసిష్ఠయోః | జాతం నిరర్థకం ద్వేషా ద్దేవానాం విస్మయప్రదమ్. 30 వీనిలో ముఖ్యముగా గొన్నిటిని ప్రసంగానుసారముగ వివరింపగలను. రాజా ! సర్వతీర్థ-వ్రత-దాన-యాగములు ఎల్ల తపములు పుణ్యకర్మములు పరస్పరము పుణ్యమునకు దోహదకారులు. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి చిత్తశుద్ధి యత్యావశ్యకములు. వీనివలననే ఎల్ల తపములు వ్రతములు తీర్థములు పావనములు పుణ్యదములునై చెన్నలరారును. ఒకప్పుడు ద్రవ్యశుద్ధి క్రియా శుద్ధి రెండే యుండవచ్చును. కాని, యెల్లరి కెల్లచోటుల చిత్తశుద్ధి గల్గుట మాత్ర మతి దుర్లభము. ఏలన, చిత్తమతి చంచలము. అది పలు విషయములందు పరిభ్రమించుచుండును. ఇట్లు పెక్కు విధముల భావములకు తావలమైన చిత్త మెట్లు పరిశుద్ధమగును? చిత్తమును కామక్రోధములు మదలోభాహంకారములుండును. ఇవి సకల తీర్థవ్రత తపముల విషయమున విఘ్నకారులు. అహింస సత్యము పవిత్రత ఇంద్రియ నిగ్రహము దొంగిలింపకుండుట స్వధర్మపాలన యనునని సకలతీర్థసేవా ఫలములు గల్గింపగలవు. సంగదోషము నిత్యకర్మలోపము అను దోషములు గలవు. ఈ రెండును తీర్థయాత్రల వలన గల్గును. వీనివలన పాపము తగులును. తీర్థము లొడలిమీది మురికిని మాత్రమే పోగొట్టగలవు. అవి చిత్తమాలిన్యమును కడుగజాలవు. అవి చిత్తకాలుష్యము బాపజాలినచో గంగాతీర వాసులగు మును లీశ్వర సేవాపరులై యుండిన ద్రోహము లేల యొనర్తును? వసిష్ఠ విశ్వామిత్రాది మునులు వినయశీలురు. వారును రాగద్వేషములకు కామక్రోధములకు వశులై వ్యవహరించిరే! కనుక చిత్తశుద్ధి యను తీర్థము గంగాది తీర్థములకంటె నత్యుత్తమమైనది. దైవయోగమున సాధుసజ్జనుల సత్సంగతి లభించవచ్చును. అపుడు చిత్తమాలిన్యము కడుగబడును. వేదశాస్త్రములు దానవ్రతములు తపోయాగములును వీనిలో నే యొక్కటియును చిత్తశుద్ధి గలిగింపజాలవు. వషిష్ఠ మహర్షి బ్రహ్మపుత్రుడు వేదవిద్యా నిష్ణాతుడు గంగాతీరవాసి. అంతటి మహాత్ముడును రాగద్వేషములకు తల యొగ్గెను. వసిష్ఠ విశ్వామిత్రుల పనికిమాలిన ద్వేషము కారణముగ నాడీ బక మహాయుద్ధము సంఘటిల్లెను. అది వేల్పులకును నబ్బురము గలిగించెను. విశ్వామిత్రో బక స్తత్ర జాతః పరమతాపసః | శప్తః స తు వసిష్ఠేన హరిశ్చంద్రస్య కారణాత్. 31 కౌశికేన వసిష్ఠో%పి శప్త్వా%%డీదేహబాక్కృతః | శాపా దాడీబకౌ జాతౌ తౌ మునీవిశదప్రభౌ. 32 నివాసం ప్రాపతు స్తీరే సరసో మానసస్య చ | చక్రతు ర్దారుణం యుద్ధం నఖచంచుప్రతాడనైః. 33 వర్షాణా మయుతం యావ త్తావృసీ రోషసంయుతౌ | యుయుధాతే మదోన్మత్తౌ సింహావివ పరస్పరమ్. 34 రాజా : కథం తౌ మునిశార్దూలౌ తాపసౌ ధర్మతత్పరౌ | పరస్పరం వైరపరౌ సంజాతౌ కేన హేతునా. 35 శాపం పరస్పరం కేన కారణన మహామతీ | దత్తవంతౌ మిథః క్లేశకారకౌ దుఃఖదౌ నృణామ్. 36 వ్యాసః : హరిశ్చంద్రో నృపశ్రేష్ఠ స్త్రిశంకుతనయః పురా | బభూవ రవి వంశీయో రామచంద్రస్య పూర్వజః. 37 అనపత్యః సరాజిర్షి ర్వరుణాయ మహాక్రతుమ్ | ప్రతిజజ్ఞే పుత్రకామో నరమేధం దురాసదమ్. 38 వరుణ స్తస్య సంతుష్టో యజ్ఞస్య నియమే కృతే | దధార గర్భం రాజ్ఞ స్తు భార్యా పరమసుందరీ. 39 రాజా బభూవ సంతుష్టో దృష్ట్వా భార్యాం సదోహదామ్ | చకార విధివత్కర్మ గర్భ సంస్కార కారకమ్. 40 సుషువే తనయం నారీ సర్వలక్షణ సంయుతమ్ | ముదం ప్రాప నృప స్తత్ర పుత్త్రే జాతే విశాంపతే ! 41 కృతవాన్ జాతకర్మాది సంస్కారవిధి ముత్తమమ్ | దదౌ హిరణ్యం గా దోగ్ధ్రీర్ బ్రాహ్మణభ్యో విశేషతః. 42 జన్మోత్సవే%తి సంవృత్తే గేహే వై యాదసాంపతిః | ఆజగామ మహారాజ | విప్రవేషధర స్తథా. 43 పూజితః పార్థివేనాథ దత్త్వా విధివ దాసనమ్ | కార్యే పుష్టే%బ్రవీద్వాక్యం వరుణో%స్మీతి భూపతిమ్. 44 కురు యజ్ఞం సుతం కృత్వా పశుం పరమ పావనమ్ | సత్య వాగ్భవ రాజేంద్ర ! సంకల్ప స్తు త్వయా కృతః. 45 విశ్వామిత్రుడు తొల్లి హరిశ్చంద్రుని కారణమున వసిష్ఠునిచే శపింపబడి కొంగ యయ్యెను. వసిష్ఠుడును విశ్వామిత్రునిచే శపింపబడి ఆడీరూపము దాల్చెను. ఇట్లు లా మునివరు లాడీ బక రూపములు దాల్చిరి. అవి రెండును మానస సరోవరతీరమున మనుగడ సాగించుచు తమతమ గోళ్లతో ముక్కులతో తీవ్రముగ పోట్లాడుకొనుచుండెను. ఆ ఋషు లట్లు రోషముతో మత్తసింహముల మాడ్కి పదివేలేండ్లు పోరిరి. రాజిట్లనెను : వారిరువురును ధర్మపరులు తాపసులు మునివరులును గదా! ఐనను వారు పరస్పర మేల శపించుకొనిరి? వ్యాసు డిట్లనెను : పూర్వము త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రు డను నతడు ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యవంశజుడు శ్రీరామునకు పూర్వుడు. అతనికి సంతులేదు. వరుణుని దయచే తనకు పుత్త్ర ప్రాప్తి గల్గినచో వరుణప్రీతికి తన పుత్త్రుని నరమేథ మొనర్తునని యతడు దుష్కరమగు ప్రతిన బూనెను. అతని యజ్ఞనియమమునకు వరుణుడు సంతుష్టిజెందెను. అంతట హరిశ్చంద్రుని భార్య గర్భవతి యయ్యెను. తన భార్య గర్భిణియగుట గని రాజు సమ్మోదముతో నామెకు యథావిధిగ గర్భసంస్కారము లొనరించెను. ఆమె సర్వ లక్షణ సంపన్నుడగు కుమారుని గనెను. రాజు పరమానందబరితుడయ్యెను. అతడా పిల్లవానికి చక్కగ జాతకర్మాది సంస్కారములు జరిపి బ్రాహ్మణులకు బంగారము, పాలిచ్చు గోవులు దానమొనరించెను. అట్లు పుత్త్రజనన మహోత్సవము జరుగుచుండగ వరుణుడు విప్రవేషముతో రాజ గృహమున కేతెంచెను, రా జతనిని సత్కరించి కూర్చుండ నియోగించి యతని రాకకు కారణ మడిగెను. 'నేను వరుణుడను. నీ సుతుని పశువుగ జేసి నాకు యజ్ఞ మొనరింపుము. బలి యిమ్ము. నీవు మున్ను నాకు మాట యిచ్చితివి. దాని నిపుడు నిలువబెట్టు కొను' మని వరుణు డనెను. తచ్ఛ్రుత్వా వచనం రాజా విహ్వాలో%తి వ్యథా కులః | సం స్తంభ్యాధిం నృపః ప్రాహ వరుణం సత్కృతాంజలిః. 46 స్వామిన్కరోమి తం యజ్ఞం సర్వథా విధి పూర్వకమ్ | మయా తే యత్ర్పతిజ్ఞాతం భవామి సత్యవాగహమ్. 47 పూర్ణే మాసే విశుద్ధ్యేత ధర్మపత్నీ సురోత్తమ | విశుద్ధాయాం తు భార్యయాం కర్తవ్యః సపశుర్మఖః. 48 ఇత్యుక్తే వచనే రాజ్ఞా వరుణః స్వగృహం గతః | రాజా బభూవ సంతుష్టః కించిచ్చింతాతుర స్తథా. 49 పూర్ణే మాసి పునః పాశీ పరీక్షార్థం నృపాలయ్ | ఆజగామ ద్విజో భూత్వా సువేషః సుష్ఠుభాషకః. 50 కృతార్హణం సుఖాసీనం భూపతి స్తం సురోత్తమమ్ | ఉవాచ వినయోపేతో హేతుగర్భంవచస్తదా. 51 అసంస్కృతం సుతం స్వామి న్యూపే బధ్నామి తం కథమ్ | సంస్కృత్య క్షత్రియం కృత్వా యజ్బేహం యజ్ఞముత్తమమ్. 52 దయసే యది దేవ త్వం జ్ఞాత్వా దీనం స్వసేవకమ్ | అసంస్కృతస్య బాలస్య నాధికారో%స్తి కుత్రచిత్. 53 వరుణః: ప్రతారయసి రాజేంద్ర కృత్వా సమయమగ్రతః | దుస్త్యజ స్తవ జానామి సుతస్నేహో హ్యపుత్రిణః. 54 గృహం వ్రజామి భూపాల | వచనాత్తవ కోమలాత్ | కియత్కాలం ప్రతీక్ష్యాహ మాగమిష్యామి తే గృహమ్. 55 భవితవ్యం త్వయా తాత తదా సత్యవచో%న్వితమ్ | అన్యథా త్వయి ముంచామి కోపం శాప సమన్వితమ్. 56 రాజా : సమావర్తనకర్మాంతే సర్వథా యాదసాంపతే | కృత్వా పుత్త్రం పశుం యజ్ఞే యజిష్యే విధిపూర్వకమ్. 57 తచ్ఛ్రుత్వా వచనం రాజ్ఞో వరుణః ప్రీతమానసః | తథేత్యుక్త్వా య¸° తూర్ణం నృపస్తు సుస్థితో%భవత్. 58 రోహితాఖ్య ఇతి ఖ్యాతః సుత స్తస్య వివృద్ధిమాన్ | సంజాత శ్చతురః సర్వవిద్యానాం చ విశారదః. 59 యజ్ఞస్య కారణం తేన జ్ఞాతం సర్వం సవిస్తరమ్ | భయభీత స్తతః సో%పి మత్వా మరణమాత్మనః. 60 కృత్వా పలాయనం వీరో గతో%సౌ గిరిగహ్వారే | ఆగమ్యే నృపతిః స్థానే స్థిత స్తత్ర భయాతురః. 61 వరుణుని వాక్కులు వినగనే రాజు నిశ్చేష్టుడై పడి కొంత వడికి తన్నుతా నిబ్బరించుకొని మోడ్పుకేలు నిగుడించి యిట్లనెను : స్వామీ! తొల్లి నీకు మాట యిచ్చిన మాట నిజమే. నీకు యథావిధిగ యాగ మొనర్చి సత్యవాది నగుదును. సురవరా ! ఒక నెలకు నా భార్యకు శుద్ధి యగును. ఆమె శుద్ధయైనంతనే నరమేధ మొనర్పగలను అని రాజనగనే వరుణుడు తన నెలవున కరిగెను. రాజు అప్పటికి సంతసించెను. కాని లోన దిగులు మాత్ర మతనిని వదలలేదు. ఒక నెల గడిచెను. ప్రియవాదియగు వరుణుడు పిమ్మట పాశము చేతబూని రాజు పరీక్షింప తిరిగి విప్రవేషముతో రాజప్రాసాదమున కేతెంచెను. అంత రాజు వరుణున కాసనమిచ్చి పూజించి సవినయముగ సహేతుకముగా నిట్లు పలికెను : స్వామీ! నా కుమారుడింకను సంస్కృతుడు కాలేదు. అట్టి వాని నెట్టుల యూపస్తంభమునకు బంధింపగలను? కనుక నతని నొక క్షత్రియునిగ సంస్కరించిన పిదప నుత్తమ నరయాగ మొనర్తును. దేవా! నేను దీనుడను. నీ సేవకుడను. నన్ను కనికరింపుము. సంస్కారహీనుడగు బాలున కెందు నధికారము లేదు గదా! వరుణు డిట్లనెను : రాజా! నన్ను మోసగించి మాటిమాటికి రమ్మనుచున్నావు. పుత్రహీనుడవగు నీకు పుత్త్ర వాత్సల్యము మెండు, దీనికి మితి లేకున్నది. కనుక నీ మాట చొప్పున తిరిగి నా గృహ మేగుచున్నాను. కొంతకాల మెదురుచూచి తిరిగి నీ యింటికి రాగలను. అపుడైన నీవు నీ మాట నిలువ బెట్టుకొనుము. కానిచో కోపముతో నిన్ను శపింతును. రాజిట్లనెను : వరుణదేవా! నా కుమారునకు సమావర్తనము జరుగగానే యతనిని పశువుగ నుంచి యాగమొనర్పగలను. అను రాజు మాటలు విని వరుణుడు హర్షించి యట్లే యని వేగ నేగెను. రాజును శాంతుడయ్యెను. అతని కుమారుడు రోహితనామమున పెరిగి యెల్ల విద్యలందు విశారదు డయ్యెను. అతడు యాగహేతువు నంతయును విని తనకు చావు మూడినందులకు భీతుడయ్యెను. అందుచే అతడు తన తండ్రినుండి పరుగెత్తి యొక గిరి గుహలో వసించెను. ప్రాప్తే కాల్బేథ వరుణో యజ్ఞార్థీ నృపతేర్గృహమ్ | గత్వా తమాహ భూపాలం కురు యజ్ఞం విశాంపతే. 62 ప్రవ్లూనవదనో రాజా తమాహ వ్యథితేంద్రియః | కిం కరోమి గతః క్వా%పి సుతో మే సురసత్తమ. 63 శ్రుత్వా తద్వచనం రాజ్ఞః కుపితో యాదసాంపతిః | శశాపతం నృపం కోపా దసత్యవాదినం భృశమ్. 64 జలోదరాభిధో వ్యాధి ర్దేహే భవతు తే నృప | యతః ప్రతిరితశ్చాహం కృత్వా కపట పండిత. 65 ఇతి శప్త్వా య¸° ధామ స్వకం పాశధర స్తదా | రాజా చింతాతుర స్తస్థౌ భవనే వ్యాధిపీడితః. 66 యధా%తివ్యాధితో రాజా రోగేణ శాపజేన హ | యదా శుశ్రాన పుత్రో%పి పితరం వ్యాధిపీడితమ్. 67 పాంథికః ప్రాహ పుత్రం హి పితా తే భృశదుఃఃతః | జలోదరవికారేణ శాపజేన నృపాత్మజ. 68 వినష్టం జీవితం తే%ద్య వృథాజాతస్య దుర్మతే | యత్త్యక్త్వా పితరం దుఃస్థం ప్రాప్తో%సి గిరిగహ్వరమ్. 69 కి మనేన శరీరేణ ప్రాప్తం తే జన్మనః ఫలమ్ | దేహదం దుఃఃతం కృత్వా స్థితో%స్యత్ర సుతాధమ. 70 ప్రాణాస్త్యాజ్యాః పితుః కార్యే సత్పుత్రేణ%తి నిశ్చయః | త్వదర్ధే దుఃఃతో రాజా క్రందతి వ్యాధిపీడితః. 71 తదాకర్ణ్య వచస్తథ్యం పాంథికాద్ధర్మ సంయుతమ్ | యదా చక్రే మనోగంతుం ద్రష్టుం తాతం వ్యథాతురమ్. 72 తదా విప్రవపు ర్భూత్వా వాసవస్తముపాగతమ్ | రహః ప్రాహ హితం వాక్యం దయావానివ భారత ! 73 మూర్ఖో%సి రాజపుత్త్రం త్వం గమనాయ మతిం వృథా | కరోషి పితరం త్వద్య న జానాసి వ్యథాయుతమ్. 74 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠ స్కంధే ద్వాదశో%ధ్యాయః. తగిన సమయమునకు యజ్ఞార్థియగు వరుణుడు రాజుచెంత కరిగి యజ్ఞము చేయుమని యడిగెను. అంత రాజు వాడిన మోముతో దిగులొందిన మనముతో నేనిపుడేమిచేతును? నా కొడుకెటకో పారిపోయె' ననియెను. అట్లు రాజు బొంకులాడెను. రాజు మాటలు విని వరుణుడు కోపమున రాజా! నీవు పచ్చిమోసగాడవు. నన్నే మోసగించితివి. కనుక నీవు జలోదరమను వ్యాధిచే పీడితుడవగుదువుగాక! అని శపించి తన చోటికి తానేగెను. రాజు తన యింట వ్యాధిపీడితుడై చింతాతురుడై పడియుండెను. శాపవశమున తన తండ్రి రోగపీడితుడగుట రోహితుడు వినెను. ఎట్లన, ఒక తెరువరి రోహితుని కిట్లనెను : రాకుమారా! నీ తండ్రి శాపవశమున జలోదర వ్యాధిచే పీడింపబడి దుఃఃంచుచున్నాడు. దుర్మతీ! నీ బ్రతుకంతయు పనికిమాలినది. నీ జన్మము నిరర్థకము. నీ తండ్రి దుఃఃంచుచుండగ నతనిని విడనాడి నీవీ గిరిగుహలందు సుఃంతువా? నీవు కుపుత్త్రుడవు. నీకీ శరీరముండి యేమిలాభము? నీవు పుట్టి మాత్రము ప్రయోజనమేమి? అట నీ తండ్రి దుఃఃంచుచుండ నీవిట సుఖమున్నావు. తన కన్నతండ్రి మేలుకొఱకు కన్నకొడుకు తన ప్రాణములు సైతము వదల వలయును. నీ తండ్రి వ్యాధిపీడతో నిన్ను తలచితలచి యచట వంతజెందుచున్నాడు.' అది విని రోహితుడు బాటసారివలన సత్యధర్మములగు నీతివాక్యములు గ్రహించి దుఃఃతుడగు తన తండ్రిని గాంచుటకు నిశ్చయించుకొనెను. అంతలో నింద్రుడు విప్రవేషమున నతనిని సమీపించి దయగలవానివలె రహస్యముగ నతని కిట్లనియెను : ''ఓ రాజకుమారా! నీవెంతటి మూర్ఖుడవు. నీ తండ్రి వ్యాధిపీడితుడయ్యెనో లేదో సరిగ నెఱుగక యచ్చోటికి వెళ్లదలతువేల? ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు ఆడీ బక యుద్ధకథారంభమను ద్వాదశాధ్యాయము.