Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షోడశో%ధ్యాయః

కులే కస్య సముత్పన్నాః క్షత్త్రియా హైహయాశ్చయే | బ్రహ్మహత్యా మనాదృత్య నిజఘ్ను ర్భార్గవాంశ్చ యే. 1

వైరస్య కారణం తేషాం కిం మే బ్రూహి పితామహ | నిమిత్తేన వినా క్రోధం కథం కుర్వంతి సత్తమాః. 2

వైరం పురోహితైః సార్ధం కస్మా త్తేషా మజాయత | నాల్పహేతోర్హి తద్వైరం క్షత్త్రియాణాం భవిష్యతి. 3

అన్యథా బ్రాహ్మణా న్పూజ్యా న్కథం జఘ్నురనాగసః | బహుజా బలవంతో%పి పాపభీతాః కథం న తే. 4

స్వల్పే%పరాధే కో హన్యా ద్బాడవాన్‌క్షత్త్రియర్షభః | సందేహో మే మునిశ్రేష్ఠ కారణం వక్తు మర్హసి. 5

ఇతి పృష్ఠ స్తదా తేన రాజ్ఞా సత్యవతీసుతః | ఉవాచ పరమప్రీతః కథాం సమస్మృత్య చేతసా. 6

శృణుపారిక్షితే ! వార్తాంక్షత్త్రియాణం పురాతనీమ్‌ | ఆశ్చర్యకారిణీం సమ్య గ్విదాతాం చ పురా మయా. 7

కార్తవీర్యేతి నామ్నా%భూ ద్దైహయః పృథివీపతిః | సహస్రబాహు ర్బలవా నర్జునో ధర్మతత్పరః. 8

దత్తాత్రేయస్య శిష్యో%భూ దవతారో హరేరివ | సిద్ధః సర్వార్థదః శాక్తో భృగూణాం యాజ్య ఏవ సః. 9

యజ్వా పరమధర్మిష్ఠః సదా దాన పరాయణః | దదౌ విత్తం భృగుభ్యో%సౌ కృత్వా యజ్ఞా ననే కశః. 10

ధనిన స్తే ద్విజా జాతా భృగవో నృపదానతః | హయరత్నస నిర్ధనా జాతాః కాలేన మహతా నృప. 12

ధనకార్యం సముత్పన్నం హైహయానాం కదాచన | యాచిన్ణవో%భిజగ్ము స్తా న్భృగూం స్తే హైహయానృప. 13

వినయం క్షత్త్రియాః కృత్వా%ప్యయా చంత ధనంబహు | న దుదు స్తే%తిలోభార్తా నాస్తి నా స్తీతి వాదినః. 14

పదుహారవధ్యాయము

హైహయుల చరిత్ర

జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు వెఱవక భార్గవులను చంపిరంటివి. వారే కులమువారు? గొప్పవారికి కారణము లేక కోపమురాదు గదా! పితామహా! వారికి వైర మే కారణమున గల్గెనో తెలియబలుకుము. రాజులకు పురోహితులతో పగ యెట్లు వచ్చెను? రాజుల కంతటి కోపము గల్గుట కేదో కొలది కారణ ముండియుండును. కానిచో బ్రాహ్మణుల నేల చంపుదురు. విప్రులు పూజనీయులు - నిరపరాధులు గదా! రాజులు బలవంతులే. ఐనను వారికి మాత్రము పాపభీతి యేల యుండదు? ఒకవేళ విప్రులలో నేదో కొలది దోషమున్న నుండవచ్చును. అంతమాత్రమున రాజశ్రేష్టులు వారి నేల చంపుదురు? మునీశా! నా యీ సందేహము బాపుట కీవే సమర్థుడవు. అట్లు రాజు ప్రశ్నించగా వ్యాసుడు నెమ్మదిలో వారి గత చరిత్ర గుర్తుకు తెచ్చుకొని ప్రీతిగదుర నిట్లనెను : రాజా! హైహయరాజుల చరిత్రమతిపురాతనము ఆశ్చర్యకరము. దానిని నాకు తెలిసినంతవఱకెఱిగింతును వినుము. మున్ను హైహయవంశమందు కార్తవీర్యార్జునుడను రాజుండెను. అతడు సహస్ర బాహువు బలశాలి ధర్మవీరుడు. ఆతడు విష్ణునవతారమగు దత్తాత్రేయుని శిష్యుడు-సిద్ధుడు-శాక్తేయుడు-దాత-భృగువంశ బ్రాహ్మణులకు యజమానుడు - బ్రాహ్మణులచె యజ్ఞాదికర్మము చేయించుకొనువాడు. ఆతడు ధర్మనిష్ఠుడు-మహాదాత. యాగములాచరించినవాడు భార్గవుల కనేక దానధర్మము లొసంగినవాడు. అతని దానముల వలన భార్గవులు హయరత్న సంపన్నులై ధనవంతులై పేరుగాంచిరి. కొన్నాళ్ళకు కార్తవీర్యడు స్వర్గధామ మేగెను. అంత హైహయులు దైవయోగమున కడుబీదవారైరి. ఒకప్పుడు హైహయులకు కొంత డబ్బుకావలసి వచ్చెను. అపుడు వారు భార్గవులను యాచింపదలంచిరి. హైహయులు సవినయముగ విప్రులను ధనమడిగిరి, వారు లోభమతులై లేదులేదని వారికి చిల్లిగవ్వయు నీయకుండిరి.

భూ మౌ చ నిదధుః కేచి ద్భృగవో ధన ముత్తమమ్‌ | దదుః కేచి ద్ద్విజాతిభ్యో జ్ఞాత్వా క్షత్త్రియతోభయమ్‌. 15

కృత్వా స్థానాంతరే ద్రవ్యం బ్రాహ్మణా భయవిహ్వాలాః | త్యక్త్వా%%శ్రమాన్యయుః సర్వే భృగవ స్తృష్ణయా%న్వితాః. 16

యాజ్యాంశ్చ దుఃఃతాన్దృష్ట్వాన దదు ర్లోభమోహితాః | పలాయిత్వా గతాః సర్వే గిరిదుర్గా ను పాశ్రితాః. 17

తత స్తే హైహయా స్తాత దుఃఃతాః కార్యగౌరవాత్‌ | భృగూణా మాశ్రమాన్‌ జగ్ముర్ద్రవ్యార్థం క్షత్త్రియర్షభాః. 18

భృగూం స్తు నిర్గతా న్వీక్ష్యశూన్యాం స్త్యక్త్వా గృహానథ | చఖను ర్భూతం తత్ర ద్రవ్యార్థం హైహయా భృశమ్‌. 19

ఖనతా%ధిగతం విత్తం కేన చిత్‌ భృగు వేశ్మసి | దదృశుః క్షత్రియాః సర్వే తద్విత్తం శ్రమకర్శితాః. 20

యత్ర తత్ర సముత్పన్నం భూరి ద్రవ్యం మహీతలాత్‌ | తదా తే పార్శ్వభాగస్థ బ్రాహ్మణానాం గృహాణ్యపి. 21

నిర్భిద్య హైహయా ద్రవ్యం దదృశుర్ధన లిప్సయా | బ్రాహ్మణా శ్చుక్రుశుః సర్వే భీతా శ్చ శరణంగతాః. 22

అతి చిన్వత్సు విప్రాణాంభవనాన్నిః సృతం బహు | నిజఘ్ను స్తాన్‌ శ##రైః కోపాద్బాడవాన్‌ శరణాగతాన్‌. 23

యయుస్తే గిరిదుర్గాం శ్చ యతవై భృగవః స్థితాః | ఆగర్భా దను కృంతంత శ్చేరు శ్చైవ మహీ మిమామ్‌. 24

ప్రాప్తా న్ర్పాప్తా న్భృగూన్సర్వాన్ని జఘ్నర్నిశితైః శ##రైః | ఆ బాలవృద్ధానపరా నవమాన్యచ పాతకమ్‌. 25

ఏవముత్పాట్యమానేషు భార్గవేషు యతస్తతః | హన్యుర్గర్భాంశ్చ నారీణాం గృహీత్వా హైహయా భృశమ్‌. 26

రురుదు స్తాః స్త్రియః కామం కురర్య ఇవ దుఃఃతాః | గర్భాశ్చ కృంతితా యాసాం క్షత్త్రియైః పాప నిశ్చయైః. 27

కొందఱు భార్గవులు క్షత్రియులకు జంకి తమ ధనరాసులను నేలలో బాతిపెట్టిరి. మఱికొందఱు బ్రాహ్మణులకు దానమొసంగిరి. అట్లు భయార్తులగు భార్గవులు తమ దనరాసులను వేరొకచోటికి తరలించి తమతమ యాశ్రమములు వదలి గిరి దుర్గములు పట్టిపోయిరి. అట్లు తమ యజమాను లార్థిక సంకటములో నుండుట కనులార చూచియును విప్రుల ధనలోభమున వారికి ధనమీయక వనదుర్గములు పట్టిపోయిరి. పిదప రాజులు తమకు ధనమత్యావశ్యక మగుట వలన మిక్కిలి వగచిరి. వారు తుదకు ధనము దొరకునేమోయని భార్గవుల యాశ్రమముల జొరపడిరి. అంత భార్గవులు తమ యాశ్రమములు శూన్యము చేసి వెళ్ళిరి. అదిగని హైహయులు వారి యాశ్రమములలో ధనముండునని త్రవ్విరి. అట్లు త్రవ్వుట వలన కొందఱి యిండ్లలో ధనమెక్కువగ లభించెను. ఆ పిదప ధనమునకు వారెంయో శ్రమపడిరి. వారచ్చటచ్చట నేలలో నున్న ధనమంతయును త్రవ్వి తీసిరి. వారు ధనాశ##చే నిరుగుపొరుగు బాపల యిండ్లకు నేగిరి. అట్లంతట త్రవ్వి వారెక్కువగ ధనము బడసిరి. బ్రాహ్మణులు వందురుచు వెఱగంది చేయునది లేక రాజులను శరణు వేడుకొనిరి. ఆ విధముగ రాజులు విప్రుల యిండ్లలో ధనము గొప్పగ బడసియును శరణువేడిన బ్రాహ్మణులను కూడ కోపతీవ్రతతో బాణముల కొట్టి చంపిరి. వారట నుండి భార్గవులుండు గిరి దుర్గములు జేరి భార్గవులను చంపి వారి భార్యలగర్భములు జీల్చి స్వేచ్ఛగ విహరించిరి. వారు పాపభీతి లేక కంటబడిన భార్గవులనెల్ల వాడి ములుకులతో చంపిరి. మఱికొందఱి నవమానించిరి. అట్లు పాపాత్ములగు హైహయులు తమ గర్భములు ఛేదింపగ విప్రస్త్రీలు కురరిపక్షులవలె బోరున విలపించిరి.

అన్యే%ప్యాహుశ్చ తాన్దృప్తాన్మునయ స్తీర్థ వాసినః ముంచంతు క్షత్త్రియాః క్రోధం బ్రాహ్మణషుభయావహమ్‌. 28

అయుక్త మేతదారబ్ధం భవద్భిః కర్మ గర్హితమ్‌ | యద్గర్భాన్భృగుపత్నీనాం నిహన్యుః క్షత్త్రియర్షభాః. 29

అత్యుగ్రపుణ్య పాపానా మిహైవ ఫలమాప్నుయాత్‌ | తస్మా జ్జుగుప్సితం కర్మ త్యక్తవ్యం భూతి మిచ్ఛతా. 30

తానాహుర్హైహయాః క్రుద్ధా మునీ నథ దయాపరాన్‌ | భవంతః సాధవః సర్వే నార్థజ్ఞాః పాపకర్మణామ్‌. 31

ఏభి ర్హృతం ధనం సర్వం పూర్వజానాం మహాత్మనామ్‌ | వంచయిత్వా ఛలాభిజ్ఞై ర్మార్గే పాటచ్చరై రివ. 32

ఏతే ప్రతారకా దంభా స్తాదృశా బకవృత్తయః | ఉత్పన్నే చ మహాకార్యే ప్రార్థితా వినయేన తే. 33

న దదుః ప్రార్థితం విప్రాః పాదవృద్ధ్యా%పి యా చితాః | నాస్తీతి వాదినః స్తబ్ధాః దుఃఃతాన్వీక్ష్య యాజ్యకాన్‌. 34

ధనం ప్రాప్తం కార్యవీర్యా ద్రక్షితం కేన హేతునా | న కృతాః క్రతవః కిం తై ర్దానం చార్థిషు భూరిశః. 35

న సంచితవ్యం విపై#్ర స్తు ధనం క్వాపి కదాచన | యష్టవ్యం విధివ ద్దేయం భోక్తవ్యంచ యథాసుఖమ్‌. 36

ద్రవ్యే చోరభయం ప్రోక్తం తథా రాజభయం ద్విజాః | వహ్నే ర్భయం మహాఘోరం తథా ధూర్తభయం మహత్‌. 37

యేనకేనాప్యుపాయేన ధనం త్యజతి రక్షకమ్‌ | అథవా%సౌమృతో యాతి ద్రవ్యం త్యక్త్వా హ్యసద్గతిమ్‌. 38

పాదవృద్ధ్యా తథా%స్మాభిః ప్రార్థితం వినయాన్వితైః | తథా%పి లోభసందిగ్ధై ర్న దత్తం నః పురోహితైః. 39

దానంభోగ స్తథా నాశో ధనస్య గతిరీదృశీ | దానభోగౌ సుకృతినాం నాశః పాపాత్మనాం కిల. 40

న దాతా న చ యో భోక్తా కృపణో గుప్తితత్పరః | రాజ్ఞా%సౌ సర్వథా దండ్యో వంచకో దుఃఖభా జ్నరః. 41

తస్మాద్వయం గురూ నేతా న్వంచకా న్ర్బాహ్మణాధమాన్‌ | హంతుం సముద్యతాః సర్వే న క్రోద్ధవ్యం మహాత్మభిః. 42

ఆ ఘోరమును తీర్థవాసులగు నితర మునులు గాంచి 'పవిత్ర బ్రాహ్మణులపట్ల మీకీ దారుణ కోపము తగదు. ఉడుగు' డని హైహయులను వారించిరి. 'హైహయులారా! భృగుపత్నుల గర్భములు వ్రయ్యలు చేయుట మీకు తగనిపని. ఇది నీచము నింద్యము. నరుడు తీవ్రమైన పుణ్యపాపముల ఫలమిచ్చటనే పొందును కనుక తన మేలుగోరుకొనువాడిట్టి నీచకర్మము విడనాడవలయును.'' అంత హైహయులు కోపముతో మునుల కిట్లనిరి : మీరెల్లరు సాధుపుంగవులు. పాపకర్మమునకు సరియగు నర్థమెఱుగరు. ఈ భార్గవులు పచ్చి మోసముతో దారులు గొట్టి దోచుకొను దొంగలవలె మా పెద్దలగు పూర్వజులనుండి ధనమపహరించిరి. వీరు పరులను పీడించువారు. కొంగవృత్తితో మోసముతో బ్రతుకువారు. మాకొక తూరి ధనమత్యావశ్యక మయ్యెను. అపుడు మేమే సవినయముగ వీరిని ధనమిమ్మని వేడుకొంటిమి. ఐనను భార్గవులు తమ యజమాను లిబ్బందులలో నుంట నెఱిగియు ధనము లేదని మిన్నకుండిరి. వీరు మా కార్తవీర్యుని వలె గొప్పగ ధనము సంపాదించిరి. వీరు దాని నిన్ని నాళ్ళేల దాచియుంచిరి? యజ్ఞములు చేసి యాచకుల కేల దానము లీయలేదు? విప్రులెప్పుడు నెక్కడను ధనము కూడ పెట్టగూడదు. వారు తప్పక యజ్ఞములు చేయవలయును. ఇతరులకీయవలయును. తాము సుఖముగననుభవింపవలయును. ఎక్కడనైన ధనమున్నచో దొంగల వలన - రాజుల వలన - దోపిడిగాండ్రవలన - నిప్పువలన భయము గల్గుచుండును. ధనము తన్ను గాపాడు వాని నెటులైన వదలి వెళ్ళును. వాడు చచ్చినప్పుడైన తాను ధనమును వదలి పోవును. మేము నాల్గవ వంతు వడ్డీతో గూడ మొత్తము చెల్లింపగలము. అని మేమెంతయో వినయముగ ఈ విప్రులను వేడుకొంటిమి. కాని, లోభమున కొట్టుమిట్టాడుచున్న పురోహితులందుల కొప్పుకొనలేదు. ధనమునకు దానము భోగము నాశమునను మూడు దశలు గలవు. పుణ్యాత్ములు దానిని దానభోగములకు వినియోగింతురు. కాని, పాపాత్ములు దానిని నశింపజేతురు. ఒకనికింత పెట్టక తానింత తినక ధనమును గూడబెట్టిన పిసినిగొట్టు మోసగాడు. వాడు దుఃఃతుడు. అట్టి వానిని రాజు దండింపవలయును. ఈ విప్రాధములు మాకు గురువులే. ఐనను వారు వంచకులు. కనుక వారిని చంపుటకు పూనుకొంటిమి. మమ్ము కోపింపకుడు.

ఇత్యుక్త్వాహేతు మద్వాక్యం తా నాశ్వాస్య మునీనాథ | విచేరుశ్చ విచిన్వానా భృగుదారా ననేకశః. 43

భయార్తా భృగుపత్న్యస్తు హిమవంతం ధరాధరమ్‌ | ప్రపేదిరే రుదత్యశ్చ వేపమానాః కృశా భృశమ్‌. 44

ఏవం తే హైహయై ర్విప్రాః పీడితాః ధనకాముకైః | నిహతాశ్చయథాకామం సంరబ్ధైః పాపకర్మభిః. 45

లోభ ఏవ మనుష్యానాం దేహసంస్థో మహారిపుః | సర్వదుఃఖకరః ప్రోక్తో దుఃఖదః ప్రాణనాశకః. 46

సర్వపాపస్యమూలం హి సర్వదా తృష్ణయా%న్వితః | విరోధకృత్త్రివర్ణానాం సర్వార్తేః కారణం తథా. 47

లోభా త్త్యజంతి ధర్మం వైకులధర్మం తథైవ హి | మాతరం భ్రాతరం హంతి పితరం బాంధవం తథా. 48

గురుం మిత్రంతథా భామం పుత్రంచ భగినీం తథా | లోభా విష్టో న కిం కుర్యా దకృత్యం పాపమోహితః. 49

క్రోధాత్కామా దహంకార ల్లోభ ఏవ మహారిపుః | ప్రాణాం స్త్యజతి లోభేన కిం పునఃస్యా దనావృతమ్‌. 50

పూర్వజాస్తే మహారాజ ధర్మజ్ఞాః సత్పథే స్థితాః | పాండవాః కౌరవాశ్చైవ లోభేన నిధనం గతాః. 51

యత్ర భీష్మశ్చ ద్రోణశ్చ కృపః కర్ణశ్చ బాహ్లికః | భీమసేనో ధర్మపుత్త్ర స్తథైవార్జున కేశవౌ. 52

తథాపి యుద్ధ మత్యుగ్రం కృతం తైశ్చ పరస్పరమ్‌ | కుటుంబ కదనం భూరి కృతం లోభాతురై రిహ. 53

హతో ద్రోణో హతో భీష్మ స్తథైవ పాండవాత్మజాః | భ్రాతారః పితరః పుత్రాః సర్వే వైనిహతా రణ 54

తస్మా ల్లోభాభిభూతస్తు కిం న కుర్యాన్నరః కిల | హైహయై ర్నిహతాః సర్వే భృగవః పాపబుద్ధిభిః. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే షోడశో%ధ్యాయః

ఇట్లు హైహయులు సహేతుకముగ పలికి మునులకు నచ్చజెప్పి భార్గవుల భార్యలను వెదకుటకు వెళ్ళిరి. అపుడు భృగు పత్నులు భయత్రస్తలై వాపోవుచు హిమగిరి జేరిరి. పాపమతులను దన దాహముగలవారునగు హైహయుల చేతులలో బడి విప్రులు పీడితులై చచ్చిరి. లోభము మనుజునిలో దాగియున్న లోనిశత్రువు - అది దుఃఖకరము. తుదకు తీయని ప్రాణములు సైతము తీయగలది. లోభ##మెల్ల పాపములకు బానిసతొత్తుగ మారి తన కుల ధర్మమును గూడ విడనాడును. లోభము సొంత తల్లిదండ్రులను - బంధువులను - అన్నదమ్ములను - బావను - హితులను చంపించును. అది మిత్రులను పుత్రులను అక్క సెల్లెండ్రను తుదకు గురువును సైతము చంపుటకు వెనుకాడదు. పాపమతితో నెంతటి చేయరాని పనియైన చేయింపగలదు. అది కామ క్రోధాహంకారములకన్న చెడ్డది. ఆత్మవైరి. దీని మూలమున నరుడు ప్రాణములు సైతము గోలుపోవును. ఇట్టి లోభముగూర్చి యేమని చెప్పుదును? రాజా! నీ పూర్వజులగు కౌరవులు కర్మనిరతులు సన్మార్గులు ఐనను వారును లోభము మూలమున నిహతులైరి. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు బాహ్లికుడు ధర్మజుడు కృష్ణార్జునులు భీముడు - వీరందఱు గొప్పవారు. వీరు బ్రతికియుండగానే కౌరవ పాండవులు తీవ్రయుద్ధమొనర్చిరి గదా! వారి కుటుంబములు సమూలముగ నాశనమయ్యెను గదా! దీనికంతటికి మూలకారణము లోభ##మే కదా! దీనివలన పోరితములో ద్రోణుడు భీష్ముడు పాండుపుత్రులు నశించిరి. ఎందఱందరో సోదరులు తండ్రులు కుమారులు నిహతులైరి కదా! లోభాత్ముడెంతటి దారుణమైన చేయగలడు కనుక లోభమతులగు భార్గవులు పాపమతులగు హైహయులచేత మడిసిరి.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠస్కంధమందు హైహయుల చరిత్రమను షోడశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters