Sri Devi Bhagavatam-1
Chapters
శ్రీ దేవీ భాగవతే - ప్రథమస్కంథే - చతుర్దశాధ్యాయః సూత : దృష్ట్వా తా మసితాపాంగీం వ్యాస శ్చింతాపరో%భవత్ | కిం కరోమి న మేయోగ్యాదేవకన్యేయమప్సరాః
1 ఏవం చింతయమానం తు దృష్ట్యా వ్యాసం త దా%ప్సరాః భయభీతా మి సంజాతా శాపం మాం విసృజేదయమ్.
2 సా కృత్యా%థ శుకీరూపం నిర్గతా భయవిహ్వలా | కృష్ణస్తు విస్మయం ప్రాప్తో విహాంగీం చ విలోకయన్.
3 కామస్తు దేహే వ్యాసస్య దర్శనా దేవ సంగతః | మనో%తివిస్మితం జాతం సర్వగాత్రేషు విస్మితిః
4 స తు ధైర్యేణ మహతానిగృహ్ణ న్మానసం మునిః | న వశాక నియంతుం చ స వ్యాసః ప్రసృతం మనః
5 బహుశో గృహ్యమాణం చ ఘృతాచ్యా మోహితం నునః బావిత్వాన్నైన విధృతం వ్యాస్యామిత తేజసః
6 మంథనం కుర్వత స్తస్య మనే రగ్ని చికీర్షియా | ఆరణ్యా మేవ సహసా తస్య వుక్ర మథావతత్. 7 సో%విచింత్య తథాపాతం మమం థారణి మేవ చ | తస్మా చ్ఛుకః సముద్భూతో వ్యాసాకృతి మనోహరః
8 విస్మయం జనయ న్బాలః సంజాత స్తదరణ్యజః | యథా%ధ్వరే సమిద్ధో%గ్ని ర్భాతి హవ్యేన దీప్తిమాన్.
9 వ్యాసస్తు సుత మాలోక్య విస్మయం పరమం గతః కి మేత దితి సంచింత్య వరదానా చ్ఛివస్య వై.
10 తేజోరైపీ శుకో జాతో%పర్యరణీ గర్భసంభవః | ద్వితీయో%గ్ని రివా త్యర్థం దీప్యమానః స్వతేజసా.
11 విలోకయామాస తదా వ్యాసస్తు ముదితం సుతమ్ | దివ్యేన తేజసా యుక్తం గార్హపత్య మివాపరమ్.
12 గంగాంతః స్నాపయామసా సమాగత్య గిరే స్తదా పుష్పవృష్టిస్తు ఖాజ్జాతా శిశోరుపరి తాపసాః.
13 జాతాకర్మాదికం చక్రే వ్యాస స్తస్య మహాత్మనః | దేవదుందుభయో నేదు ర న్ననృతు శ్చాప్సరోగణాః.
14 జగు ర్గంధర్వజతయో ముదితా స్తే దిదృక్షవః | విశ్వావసు ర్నారదశ్చ తుంబురుః శుకసంభ##వే.
15 తుష్ణుపుర్ముదితాః సర్వే దేవా విద్యాధరా స్తథా | దృష్ట్యా వ్యాససుతం దివ్య మరణీగర్భసంభవమ్‌జ
16 అంతరిక్షా త్పపాతోర్వ్యాం దండః కృష్ణాజినం శుభమ్ | కమండలు స్తథా దివ్యః శుకస్యార్థేద్వి జోత్తమాః.
17 పదునాలుగవ అధ్యాయము శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ నావేద వ్యాసుడా దేవకన్యకను ఘృతాచినిగాంచి ఇపుడేమి చేతును? ఈ దేవకన్యక నాకు దగినది గాదు అని తన మదిలో విచారించు చుండెను. అట్టి వ్యాసునిగని యితడు నన్ను శపించునేమోయని యామె భయభీతయై వెంటనే శుకీ రూపముదాల్చి యచ్చోటుపాసి వెడలినది. పచ్చని చిలుక పక్షియందము ఱప్పవాల్చక వ్యాసుడు వింతగ గాంచుచుండెను. దాని సోయగము చూడగానే ముని మనము విస్మితమయ్యెను. ఆ ముని వర్యుడు మనసును ధీరతతో నిలువ జూచెను. కాని భవితవ్యతా బలమున మహాతేజస్వియగు వ్యాసుడు సైతము తన మనస్సును నిగ్రహించుకొనలేక ఘృతాచీ వశుడయ్యెను. ఆ సంయమి అగ్నికై యరణిని మధించుచుండ ఆ యరణి యందతని వీర్యము పడినది. అతడు తన శుక్ర పాతము సైతమెఱుంగక అరణి మథనము చేయుచునే యుండెను. అంత మునిరూపమునే సంతరించుకొని యొక చక్కని శుకరూప మరణినుండి యుద్భవించినది. జన్నమునందు నేతివేలిమిచేత నగ్నికాంతిమంతుడై ప్రజ్వరిల్లునట్లే శుకబాలుడరణి నుండి వింత కాంతులీనుచు ఆవిర్భవించెను. అపుడు వ్యాసుడు తన సుతు నవలోకించి యిదేమి వింతయని మదిలో విస్తుపోయి ఇదంతయు నా పరమేశ్వరుని ప్రసాదఫలమే యని తలచెను. ఆ శుకుడరణి గర్భసంభూతుడు. మహాతేజస్వి - నిజతేజమున రెండవ యగ్నివలె ప్రజ్వలించుచున్నాడు. వ్యాసుడు గార్హపత్యాగ్ని బ్రహ్మ తేజమున తేజరిల్లు తన పుత్రుని కన్నులపండువుగ తిలకించెను. వ్యాసుడంత గిరినుండి దిగి పావనగంగలో తనయుని స్నానమాడించెను. దేవతలపుడు పూలజల్లు గురిసిరి. అచ్చరలు నర్తించిరి. దివి దేవదుందుభులు మ్రోసెను. ముని యా బాలునకు జాతకర్మాది విదులు నిర్వర్తించెను. గంధర్వపతులు ప్రమదమున బాడిరి. అరణిజుండగు శుకుని జన్మవృత్తాంతము విని నారద తుంబురులు విశ్వావసులు విద్యాధరాదులు ప్రహర్షమున శుకుని దర్శించ నేతెంచిరి. ఆ యరణిజుండగు శుకుని సందర్శించి విద్యాధరాదిదేవత లతనిని సంస్తుతించిరి. అంతలో నంతరిక్షమునందుండి శ్రీ శుకునికొఱకు దివ్యకృష్ణాజినము దండకమండలువులు నేలపై బడినవి. సద్యఃసవవృదే బాలో జాతమాత్రో%తిదీప్తిమాన్ | తస్యోపనయనం చక్రే వ్యాసో విద్యావిధానవిత్.
18 ఉత్పన్న మాత్రం తం వేదాః స రహాస్యాః ససంగ్రహాః | ఉపతస్థు ర్మహాత్మానం యథా%స్యపితరంతథా. 19 యతో దృష్టం శుకీరూపం ఘృతాచ్యాః సంభ##వేతదా | శుకేతి నామ పుత్రస్య చకార మునిసత్తమః. 20 బృహస్పతి యుపాధ్యాయం కృత్వా వ్యాససుత స్తదా | ప్రతాని బ్రహ్మచర్యస్య చకార విధిపూర్వకమ్. 21 సో% ధీత్య నిఖిలా న్వేదా న్సరహస్యా న్ససంగ్రహాన్ | ధర్మశాస్త్రాణి సర్వాణి కృత్వా గురుకులే శుకంః.
22 గురువే దక్షిణాం దత్వా సమావృత్తో ముని స్తదా | అజగామ పితుః పార్మ్యం కృష్ణద్వైపానస్య చ.
23 దృష్ట్యా వ్యాసః శుకం ప్రాప్తిం ప్రేవ్ణూెత్థాయ ససంభ్రమః | ఆలిలింగ ముహుర్ఘ్రాణం మూర్ధ్నితస్య చకారహ.
24 పప్రచ్ఛ కుశలం వ్యాస స్తథా చాధ్యయనం శుచిః | ఆళ్వాస్య స్థాపయామాస శుకం తత్రాశ్రమే శుభే.
25 దారకర్మ తతో వ్యాసః శుకస్య పర్యచింతయత్ | కన్యాం మునిసుతాం కాంతా మపృచ్ఛ దతివేగవాన్. 26 శుకం ప్రాహ సుతం వ్యాసో వేదో%ధీత స్త్వయా%నఘ | ధర్మశాస్త్రాణి సర్వాణి కురు భార్యాం మహామతే.
27 గార్హస్థ్యం చ సమాసాద్య యజ దేవా న్పితౄ నథ | ఋణా న్మోచయ మాం పుత్ర ప్రావ్య దారా న్మనోరమాన్.
28 అపుత్రస్య గతి ర్నా స్ని స్వర్గో నైవచ | తస్మా త్పుత్రమహాభాగ కురుష్వాద్య గృహాశ్రమమ్. 29 కృత్వా గృహాశ్రమం పుత్ర సుఖినం కురు మాం శుక | ఆశా మే మహతీ పుత్ర పూరయస్వ మహామతే.
30 అతడు పుట్టిననాటి నుండి విజ్ఞాననిధియై బుద్ధిమంతుడై జ్యోతిష్మంతుడై ప్రవర్ధిల్లుచుండెను. అంత విద్యా విధానవిదుడగు వ్యాసుడతని కుపనయన సంస్కార మొనరించెను. వ్యాసునకువలెనే శ్రీ శుకునకు సైతము పుట్టిన వెంటనే యెల్లవేదములను సార్థములుగ సరహస్యములుగ నవగతములైనవి. శుకీ రూపమునందున్న ఘృతాచియందలి కామాతిరేకమున తనకు సుతుడు గల్గుటచేత వ్యాసుడు తన తనయునకు శుకుడని నామకరణము చేసెను. శుకుడు దేవగురుడగు గురుని తన గురువుగ నంగీకరించి బ్రహ్మచర్యవ్రతమును విధిగ బాటించెను. గురుకులమందు వేదములన్నిటిని సరహస్యములుగ ససంగ్రహములుగ నధ్యయనము చేసెను. సకల ధర్మశాస్త్రము లెఱింగెను. పిమ్మట గురునకు దక్షిణ సమర్పించి సమావర్తనముచేసి తన తండ్రియగు వ్యాసుని సన్నిధి కరుగుదెంచెను. అట్లు తిరిగి వచ్చిన శుకునిగాంచి వ్యాసుడు పరమానంద మంది లేచి యతని నక్కునజేర్చి శిరంబు మూర్కొనెను. తన తనయుని కుశలప్రశ్న లడిగి యతని చదువునుగూర్చి ప్రశ్నించి తన యాశ్రమమందుండ నియమించెను. పిమ్మట వ్యాసుడు తన కుమారునకు వివాహము సేయదలంచి ఒక చక్కని మునికన్నియను వధువుగ నిశ్చయించి శుకునితో నిట్లు పలికెను : మహామతీ! నీవు గట్టిగ వేదములు చదివితివి. దర్మశాస్త్రము లెఱింగితివి. ఇపుడింక చక్కగ గార్హస్థ్యము నెఱపుము. దేవపితృయాగము లొనర్చుము. నన్ను ఋణముక్తుని జేయుము. అపుత్త్రకులకు స్వర్గాది సద్గతులు లేవు. నీవు గృహాశ్రమము నడపి నా కోర్కె దీర్చుము. నాకు సుఖము గల్గించుము. నే నాచరించిన యుగ్రతపః ఫలితముగ నీవు నా కయోనిజుడవై జనియించితివి. నీ తండ్రినగు నా మాట పాలించుము. తప స్తప్త్వా మహాఘోరం ప్రాప్తో%సి త్వ మయోనిజః| దేవరూపీ మహాప్రాజ్ఞ పాహి మాం పితరం శుక.
31 సూతఉవాచ : ఇతి వాదిన మభ్యాశే ప్రాప్తః ప్రాహ శుక స్తదా విరక్తః సో%తిరిక్తం తం సాక్షా త్పితర మాత్మనః.
32 శుక ఉవాచ : కిం త్వ వదసి ధర్మజ్ఞ వేదవ్యాస మహామతే | తత్త్వేనాశాధి శిష్యం మాం త్వదాజ్ఞాం కరవాణ్యలమ్.
33 వ్యాస ఉవాచ : త్వదర్థే య త్తప స్తప్తం మయా పుత్ర శతంసమాః | ప్రాప్త స్త్వం చాతిదుఃఖేన శివస్యారాధనేన చ.
34 దదామి తవవిత్తం తు ప్రార్థయిత్వా%థ భూపతిమ్ | సుఖం భుంక్ష్వ మహాప్రాజ్ఞ ప్రాప్య¸°వన ముత్తమమ్.
35 శుక ఉవాచ : కింసుఖంమానుషేలోకే బ్రూహితాతనిరామయమ్ | దుఃఖవిద్ధంసుఖంప్రాజ్ఞానవదంతిసుఖంకిల.
36 స్త్రియం కృత్వా మహాభాగ భవామి తద్వశానుగః | సుఖం కిం పరతంత్రస్య స్త్రీజితస్య విశేషతః.
37 కదాచిదపి ముచ్యేత లోహకాష్ఠాదియంత్రితః | పుత్రదారైర్నిబద్ధస్తు న విముచ్యేత కర్హిచిత్.
38 విణ్మూత్రసంభవో దేహో నారీణాం తన్మయ స్తథా | కః ప్రీతిం తత్ర విప్రేంద్ర విబుధః కర్తు మిచ్ఛది.
39 అయోనిజో%హం విప్రర్షే యోనౌ మే కీదృశీమతిః | న వాంఛా మ్యహమగ్రే% పియోనావేవ సముద్భవమ్.
40 విట్సుఖం కిమువాంఛామి త్యక్తాత్మసుఖ మద్భుతమ్ | ఆత్మారామశ్చ భూయో%పి న భవ త్యతిలోలుపః.
41 ప్రథమం పఠితా వేదా మయా విస్తారితాశ్చ తే | మింసామయా స్తే పఠితాః కర్మమార్గ ప్రవర్తకాః. 42 సూతుడిట్లయె : ఈ విధముగ ననురాగియగు వ్యాసుడు పలుకగా విరాగియగు శుకుడు తన తండ్రికిట్లు మారుపలికెను: మీరేమి పల్కుచున్నారు? నన్ను మీ శిష్యునిగ గ్రహించి తత్త్వముపదేశింపుడు. మీ యాన జవదాటను. ఓ పుత్ర! నీ కొఱకు నేను నూరువర్షములు ఘోరమైన తప మొనర్పగా శివుని ప్రసాదమున నతికష్టముమీద నీవు గల్గితివి. నేనే రాజు నైన నభ్యర్థించి నీకు విత్తము సమకూర్తును. నీవిక పరువమునకు తగిన సుఖములనుభవించుము అని వ్యాసుడనెను. శుకుడిట్లనియె : తండ్రీ! నిత్యసత్యమైన యానంద మీనరలోకమున నెక్కడనున్నది? ప్రాజ్ఞులు దుఃఖముతో ముడివడినసుఖము సుఖముగ దలంపరు. నేను భార్యను బడసినచో నామెకు వశుడనై యాత్మ స్వాతంత్ర్యమును గోల్పోవవలసి వచ్చును. నారి చెప్పుచే తల నడుచు నరునకు సుఖమెక్కడిది? నరుడు లోహకాష్ఠములచే బిగింపబడిన యంత్ర బంధములనుండి యొక వేళ విముక్తుడైన గావచ్చును. కాని భార్యామాయబంధములనుండి విముక్తుడేనాటికిని గాలేడు. ఈ శరీరము మలమూత్రములకొంప! ఈ కొంప కంపుతో కులుకు కలికితో నరుడు బద్ధుడగును గద! అట్టి హేయమైన దానియందు విబుధులకు ప్రీతియెట్టు గల్గును ? అయోనిజుండనగు నాకింక యోని విషయమై రక్తియెట్లు గల్గును? ఇక ముందును నేను యోనిజుడ నగుటకెన్నడును గోరుకొనను. సత్యజ్ఞానానంతమై పరమైన యాత్మానందమే నా స్వరూపము. ఇక మలమాత్రముల మురికిలో నెట్లు సుఖింతును? నేనాత్మారాముడను. మరల కృపణుడను కాగోరను. నీవు ప్రపంచించిన వేదములెల్ల నేను చదివితిని. అవన్నియును కర్మ మార్గము బోధించునవే; హింసామయములే. బృహస్పతిర్గురుః ప్రాప్తః సో%పి మగ్నో గృహార్ణవే | అవిద్యా గ్రస్త హృదయః కథం తారయితుం క్షమః.
43 రోగగ్రస్తో యథా వైద్యః పరరోగచికిత్సకః | తథా గురు ర్ముముక్షో ర్మే గృహస్థో%యం విడంబనా.
44 కృత్వా ప్రణామం గురవే త్వ త్సమీప ముపాగతః | త్రాహి మాం తత్వబోధేన భీతం సంసార సర్పతః.
45 సంసారే% స్మి న్మహాఘోరే భ్రమణం నభచక్రవత్ | న చ విశ్రమణం క్వాపి సూర్యస్యేవ దివా నిశి.
46 కిం సుఖం తాత సంసారే నిజతత్వ విచారణాత్ | మూఢానాం సుఖబుద్ధిస్తు విట్సు కీట సుఖం యథా.
47 అధీత్య వేదశాస్త్రాణి సంసారే రాగిణశ్చ యే | తేభ్యః పరో న మూర్ఖో%స్తి సధర్మాః శ్వాశ్వసూకరైః.
48 మానుష్యం దుర్లభం ప్రాప్య వేదశాస్త్రా ణ్యధీత్య చ | బధ్యతే యది సంసారే కో విముచ్యేత మానవః.
49 నాతః పరతరం లోకే క్వచి దాశ్చర్య మద్భుతమ్ | పుత్ర దార గృహా సక్తఃపండితః పరిగీయతే.
50 న బాధ్యతే యః సంసారే నారీమాయా గుణౖ స్త్రిభిః | సవిద్వాన్‌స చ మేధావీ శాస్త్రపారంగతో హి సః.
51 కిం వృథా%ధ్యయనే నాత్ర దృఢబంధ కరేణ చ | పఠితవ్యం తదేవాశు మోచయే ద్భవబంధనాత్.
52 గృహ్ణాతి పురుషం యస్మాత్ గృహం తేన ప్రకీర్తితమ్ | క్వ సుఖం బంధనాగారే తేన భీతో స్మ్యహం పితః.
53 యే%బుధా మందమతయో విధినా మషితాశ్చ యే | తేప్రాప్యమానుషంజన్మపునర్బంధం విశంత్యుత.
54 బృహస్పతి నాకు గురువుగ లభించెను. పాపము! అతడును మాయా సంసారమందే మున్కలు వేయుచున్నాడు. అజ్ఞానాంధహృదయు డీ దుస్తర సంసారము నెట్లు తరింపనోపును? రోగగ్రస్తుడగు వైద్యుడితర రోగుల కుపయోగపడనట్లు ముముక్షుడనగు నాకును బాహ్యగురు డుపయోగపడడు. ఇదంతయు లోకుల విడ్డూరమే సుమా! ఆ గురువునకొక్క నమస్కారముచేసి నీ సన్నిధి కరుగు దెంచితిని. నేను సంసార ఘోర విషసర్పాల దంష్ట్రలకు వెఱతును. నన్ను స్వాత్మ ప్రబోధామృతమున పరిరక్షింపుము. ఆకాశవీథిలో నహోరాత్రములు సూర్యుడు చక్రమట్లు పరిభ్రమించునట్లే ఈ ఘోరమైన కోర్కులనెడు మొసళ్లు తిరుగాడు సంసార సాగరమందు జీవుడు విశ్రాంతి లేక పరిభ్రమించును. పెండపురుగు మలమందే సుఖమందునట్లు మందమతులీ సంసారమాయలందు తగుల్కొనుటయందే సుఖమున్నదనుకొందురు. వేదశాస్త్రములు చక్కనెఱిగి మన్ననలందిన హిరణ్యగర్భునివంటివాడే. శక్తిహీనునిజేయు విషయ విషమందే సంరక్తుడగునే! అట్టివాని కంటె మూర్ఖుడింకొక్కడుండునా? అయ్యయో! వాని నడతలు పందినడతలు. వాని ధర్మము కుక్కధర్మము. చిత్ర చిత్రము సృష్టి చిత్రము. మానవ జన్మము మరి దుర్లభంబు. వేదశాస్త్రములబ్బుట మరింత దుర్లభము. అట్టివాడే యట్టి విషయ సంసార సంబద్ధుడైనచో నింక ముక్తినందు దీరాత్ముడెవ్వడు? తన్ను నమ్ముకొనిన భార్యను బిడ్డలను మమతతో బోషించువాడే తెలివైనవాడని లోకులందురు. ఈ లోకాన నింతకుమించిన వింతయేముండును? ఏ మానవుడీ దుర్భరమైన సంసార మందుజిక్కి స్త్రీల త్రిగుణకృత మాయాబంధములచేత భగ్న హృదయుడుగాడో వాడే విద్వాంసుడు; వాడే మేధావి; వాడే శాస్త్రపారంగతుడు. హృదయగ్రంధులు దృఢపరచు చదువులు వృథలు. ఇక్కడనే సమత్వమున భవబంధముక్తి గల్గించు చదువే చదువు. పురుషుని గ్రహించునది గృహమనబడును. బంధములకు పుట్టిల్లగు గృహమందేమి సుఖముండును? నేను దీనికి బిట్టు వెఱతురు. మందమతులు బోధరహితులు విదివంచితులునైన నరులీ దుర్లభ మానవజన్మమెత్తియును మరల మరల బంధనములచే కట్టువడుదురు. వ్యాస ఉవాచ : న గృహం బందనాగారం బంధనే న చ కారణమ్ | మనసా యో వినిర్ముక్తోగృహస్థో%పి విముచ్యతే.
55 న్యాయాగత ధనః కుర్వ న్వేదోక్తం విధిత్క్రమాత్ | గృహస్థో%పి విముచ్యేత శ్రాద్ధకృ త్సత్యవా క్ఛుచిః.
56 బ్రహ్మచారీ యతి శ్చైవవానప్రస్థో వ్రతస్థితః | గృహస్థం సముపాసంతే మధ్యా హ్నాతిక్రమే సదా.
57 శ్రద్ధయా చా న్నదానేన వాచా సూనృతయా తథా | ఉపకుర్వంతి ధర్మస్థా గృహాశ్రమనివాసినః.
58 గృహాశ్రమా త్పరో ధర్మో న దృష్టో న చ వై శ్రుతః | వసిష్టాదిభి రాచార్యై ర్జానిభిః సముపాశ్రితః.
59 కి మసాధ్యం మహాభాగ వేదోక్తాని చ కుర్వతః | స్వర్గం మోక్షం చ సజ్జన్మ యద్యద్వాంఛతి తద్భవేత్.
60 ఆశ్రమా దాశ్రమం గచ్ఛే దితి ధర్మవిదో విదుః | తస్మా దగ్నిం సమాధాయ కురు కర్మా ణ్యతంద్రితః.
61 దైవ న్పితౄ న్మనుష్యాంశ్చ సంతర్ప్య విధివ త్సుత | పుత్ర ముత్పాద్య దర్మజ్ఞు సంయోజ్య చ గృహాశ్రమే.
62 త్వక్త్వా గృహం వనం గత్వా కర్తాసి వ్రతముత్తమమ్ | వానప్రస్థాశ్రమం కృత్వా సంన్యాసం చ తతః పరమ్.
63 ఇంద్రియాణి మహాభాగ మాదకాని సునిశ్చితమ్ | అదారస్య దురంతాని పంచైవ మనసా సహ.
64 తస్మా ద్దారా న్ప్రకుర్వీత తజ్జయాయ మహామతే | వార్ధకే తప ఆతిష్ఠే దితి శాస్త్రోదితం వచః.
65 విశ్వామిత్రో మహాభాగ తపః కృత్వా %తిదుశ్చరమ్ | త్రీణి వర్షసహస్రాణి నిరాహారో జితేంద్రియః.
66 మోహితశ్చ మహాతేజా వనే మేనకయా స్థితః | శకుంతలా సముత్పన్నా పుత్రీ తద్వీర్యజా శుభా.
67 దృష్ట్వా దాశసుతాం కాశీం పితా మమ పరాశరః | కామబాణార్థితః కన్యాం తాం జగ్రా హోడుపే స్థితః.
68 బ్రహ్మా%పి స్వసుతాం దృష్ట్యా పంచబాణ ప్రపీడితః | ధానమానవ్చ రుద్రేణ మూర్ఛితశ్చ నివారితః.
69 తస్మాత్త్వమపి కల్యాణం కురు మే వచనం హితమ్ | కులజాం కన్యకాం మృత్వా వేదమార్గం సమాశ్రయ.
70 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ప్రథమస్కంధే చతుర్దశో%ధ్యాయః. వ్యాసు డిట్లనియెను : గృహము బంధించు కారాగారముగాదు. ఇందు బంధన కారణమును లేదు. కామవాసనల నుండి ముక్తుడైన విమలహృదయుడు గృహస్థుడైనను బంధరహితుడైనవాడే. న్యాయార్జితధనముగలవాడు వేదవిహితము లొనర్చువాడు సత్యవాది శుచి శ్రాద్ధకారియైనవాడు గృహస్థుడైనను ముక్తుడైనవాడే. బ్రహ్మచారి యతి వ్రతి వానప్రస్థుడు అను వారలు మధ్యాహ్నము దాటగనే గృహస్థుని జేరుదురు. గృహస్థాశ్రమవాసులు ధర్మపరులు - శ్రద్ధతో నన్నదానమొనర్చువారు - సత్యవచనులు - పరోపకారపరాయణులు నగుదురు. గృహస్థాశ్రమ ధర్మమునకు మిన్నయగు ధర్మమింతవఱకును కన-విన-బడ లేదు. వసిష్ఠాది జ్ఞానులు ఆచార్యులు దీనిని చక్కగ నాచరించిరి. వేదోక్తమార్గమున నడచుకొనువాని కసాధ్యమైనదేదియును లేదు. స్వర్గము - మోక్షము - ఉత్తమజన్మము - ఏది కోరిన నతని కది లభించితీరును. ఒక యాశ్రమమునుండి వేరొండాశ్రమమున కేగవలయునని ధర్మవిదులు పేర్కొందురు. కనుక నీవగ్నిని వేల్చి తెలివితో వేదోక్తకర్మలు నడుపుము. కుమారా! మానవుడైనవా డీ విధముగ విధ్యను సారముగ దేవపితృ మనుజులను దనిపి సత్పుత్త్రులనుబడసి వారినొక యింటివారిని జేయవలయును. పిదప నిల్లువదలి యడవికేగి నియమముతో వానప్రస్థాశ్రమము స్వీకరించి, తరువాత సంన్యాసి గావలయును. ఈ యింద్రియములు మదించిఉండి మనస్సునుగూడి దురంతములై యుండును. ఇవి భార్యతోడులేని వానిలో మరింతగ బాధ గల్గించును. కనుక వీనిని జయించుటకై దారను పరిగ్రహింపుము. వార్ధకమున తపమొనరింపుము. ఇది శాస్త్రోక్తవచనము. విశ్వామిత్రుడును మున్ను మూడువేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై దుశ్చరతప మాచరించెను. అంతటి తపోధనుడే వనమందు మేనకను గాంచినంతనే విమోహితుడయ్యెను. అతని వీర్యమున శకుంతల జననమందినది. నా తండ్రియగు పరాశరుడును దాశకన్యయగు కాళిని గాంచినంతనే మన్మథాగ్నివశుడై నావయందే యాకన్నియను ననుభవించెను. బ్రహ్మయును తన కొమరిత సొబగును గాంచినంతనే మదనావేశ మూర్ఛితుడై పరుగులెత్తుచుండగ రుద్రుడతనిని వారించెను. కావున నీవును నా హితము నాలించి కులీనయగు నొక పడుచుకన్నెను పెండ్లియాడి వేదమార్గానుసారముగ నడచుకొమ్ము. ఇది శ్రీదేవిభాగవతమందలి ప్రథమస్కంధమందలి చతుర్దశాధ్యాయము.