Sri Devi Bhagavatam-1
Chapters
అథ ఏకోనవింశో%ధ్యాయః వ్యాసః : తసై#్య దత్త్వా వరం శంభుః కైలాసం త్వరితోయ¸°రమ్యం దేవగణౖ ర్జుష్ట మప్సరోభిశ్చమండితమ్.
1 తత్ర గత్వా చిత్రరూపం గణం కార్యవిశారదమ్ | ప్రేషయామాస వైకుంఠే లక్ష్మీకార్యార్థ సిద్ధయే.
2 శివః : చిత్రరూప హరిం గత్వా బ్రూహిత్వం వచనాన్మమ | యథాసౌ దుఃఃతాం పత్నీం విశోకాం చ కరిష్యతి.
3 ఇత్యుక్త శ్చిత్రరూపో%థ నిర్జగామ త్వరాన్వితః | వైకుంఠం పరమం స్థానం వైష్ణవైశ్చ గుణౖర్వృతమ్.
4 నానాద్రుమగణాకీర్ణం వాపీశతవిరాజితమ్ | సంజుష్టం హంసకారండ మయూర శుభకోకిలైః.
5 ఉచ్చప్రాసాదసంయుక్తం పతాకాభిరలంకృతమ్ | నృత్యగీత కళాపూర్ణం మందారద్రుమ సంయుతమ్.
6 వకుళాశోక తిలక చంపకాళీ విమండితమ్ | కూజితై ర్విహగానం తు కర్ణాహ్లాదకరై ర్యుతమ్.
7 సంవీక్ష్య భవనం విష్ణో ర్ద్వాఃస్థౌ ప్రాహప్రణమ్య చ | జయవిజయ నామానౌ వేత్రపాణీ స్థితావుభౌ.
8 భో నివేదయతం శీఘ్రం హరయే పరమాత్మనే | దూతం ప్రాప్తం హరస్యాత్ర ప్రేరితం శూలపాణినా.
9 తచ్ఛ్రుత్వా వచనం తస్య జయః పరమబుద్ధిమాన్ | గత్వా హరిం ప్రణమ్యాహ కృతాంజలి పుటః పురః.
10 దేవదేవ! రమాకాంత! కరుణాకర! కేశవ! ద్వారి తిష్ఠతి దూతో%త్ర శంకరస్య సమాగతః. 11 ఆజ్ఞాపయ ప్రవేష్ఠవ్యో న వేతి గరుడధ్వజ | చిత్రరూపధరో%ప్యస్తి న జానే కార్యగౌరవమ్.
12 ఇత్యాకర్ణ్య హరిః ప్రాహ జయం ప్రజ్ఞాత కారణః | ప్రవేశయాత్ర రుద్రస్య భృత్యం సమయ సంస్థితమ్.
13 ఇత్యాకర్ణ్య జయ స్తూర్ణం గత్వా తం పరమాద్భుతమ్ | ఏహీత్యాకార యామాస జయః శంకరసేవకమ్.
14 ప్రవేశితో జయేనాథ చిత్రరూప స్తథా కృతిః | ప్రణమ్య దండవ ద్విష్ణుం కృతాంజలి పుటః స్థితః.
15 పందొమ్మిదవ యధ్యాయము హరి యశ్వినియందు పుత్రుని బడయుట ఆ విధముగ సాంబసదాశివుడు లచ్చికి వరమిచ్చి సురలతో శోభిల్లు కైలాసమునకు వేగముగ నేగెను. అట కేగిన పిదప శివుడు లక్ష్మీ కార్యసిద్ధికి చిత్రరూపుడను కార్యవిశారదుని వైకుంఠమును పంపుచు నిట్లనెను. : 'చిత్రరూపా! నీవు హరిని దర్శించి నా మాటగ నిట్లు పలుకుము. నీ భార్య విరాహార్తయై రోదించుచున్నది. ఆమె దుఃఖము మానుపుమని హరితో ననుము అని హరుడనగనే చిత్రరూపుడు సత్వరమే వైష్ణవ గణములతో నిండిన దివ్యధామమగు వైకుంఠధామము జేరెను. వైకుంఠము సుమనోహరమైన పెక్కు చెట్లతో బావులతో హంస - కారండ - మయూర - శుక పికములతో పొలు పారుచున్నది. అందు మందార తరులతో నలరుచు నృత్యగీతకళలతో నినదించుచు పెక్కు టెక్కములతో నొప్పుచు నెత్తైన దివ్య భవనములు సొబగు మీరుచున్నవి. చెవుల కింపైన పెక్కు పక్షుల కలరవములతో చెన్నొందు వకుళ - అశోక - తిలక - చంపక తరువు లున్నవి. పరమపదమగు విష్ణుమందిరము దివ్యమహస్సు లీనుచున్నది. ఆ మందిర ద్వారమందు జయవిజయులు వేత్రధారులై యున్నారు. చిత్రరూపుడు వారిని గాంచి కైమోడ్చి వారి కిట్లనెను శూలపాణియగు శివుడు పంపగ నొక దూత యేతెంచెనని మీరు విష్ణునితో వెంటనే తెలుపుడు. అతని మాటలు విని బుద్ధిమంతుడగు జయుడు వెళ్ళి చేతులు మోడ్చి హరికిట్లు విన్నవించెను : దేవదేవా! రమాకాంతా! కరుణాకరా! కేశవా! శంకరుని దూతవచ్చి ద్వారమున నిలుచుచున్నాడు. అతడు చిత్రరూపుడట. ఏల వచ్చెనో యెఱుగను. గరుడధ్వజా! అతనిని లోనికి ప్రవేశ##పెట్టుమందురా, వలదా? అను మాటలు విని హరి యతని రాకకు కారణ మెఱిగెను. కనుక నతనిని లోనికి ప్రవేశ##పెట్టుమని జయునితో ననెను. అది విని జయుడు వెంటనే వెళ్ళి శివదూతయగు చిత్రరూపుని రమ్మనెను. అట్లు చిత్రరూపుడు జయునిచేత లోన ప్రవేశ##పెట్టబడి విష్ణునకు దండ ప్రాణమము లొనర్చికైమోడ్చి నిలుచుండెను. దృష్ట్వా తం విస్మయం ప్రాప భగవాన్గరుడధ్వజః | చిత్రరూపధరం శంభోః సేవకం వినయాన్వితమ్.
16 పప్రచ్ఛ తం స్మితం కృత్వా చిత్రరూపం రమాపతిః | కుశలం దేవదేవస్య సకుటుంబస్య చానఘ.
17 కస్మాత్త్వం ప్రేషితోస్యత్ర బ్రూహి కార్యం హరస్యకిమ్ | అథవా దేవతానాం చ కించిత్కార్యం సముత్థితమ్.
18 దూతః : కి మజ్ఞాతం తవాస్తీహ సంసారే గరుడధ్వజ| వర్తమానం త్రికాలజ్ఞ యదహం ప్రబ్రవీమివై.
19 ప్రేషితో%స్మి భ##వేనాత్ర విజ్ఞప్తుం త్వాం జనార్దన | హరస్య వచనా ద్వాక్యం ప్రబ్రవీమి త్వయి ప్రభో !
20 తేనోక్త మేతద్దేవేశ భార్యా తే కమలాలయా | తపస్తప్యతి కాళిందీతమసా సంగమే విభో.
21 హయీరూపధరా దేవీ సర్వార్థ సిద్ధిదాయినీ | ధ్యాతుం యోగ్యా%మరగణౖ ర్మానవైర్యక్ష కిన్నరై.
22 వినా తయా నరః కో%పి సుఖభాగీ భ##వేద్భువి | తాం త్యక్త్వా పుండరీకాక్ష ప్రాప్నోషి కిం సుఖంహరే.
23 దుర్బలో%పి స్త్రియం పాతి నిర్ధనో%పి జగత్పతే | వినా%పరాధం చ విభో కిం త్యక్తా జగదీశ్వరీ.
24 దుఃఖం ప్రాప్నోతి సంసారే యస్య భార్యా జగద్గురో | ధిక్తస్య జీవితం లోకే నిందితం త్వరిమండలే.
25 సకామా రిపవస్తే%ద్య దృష్ట్వాతాం దుఃస్థితాం భృశమ్ | త్వాం వియుక్తం చ రమయా హసిష్యంతి దివానిశమ్.
26 రమాం రమయ దేవేశ త్వదుత్సంగగతాంకురు | సర్వ లక్షణ సంపన్నా సుశీలాం చ సరూపణీమ్.
27 సుఃతో భవ తాం ప్రాప్య వల్లభాం చారుహాసినీమ్ | కాంతా విరహజం దుఃఖం స్మరా మ్యహ మనాతురమ్.
28 శివదూతయగు చిత్రరూపుడు వినయము రూపొందినట్లు నిలుచుండగ హరిగని యచ్చెరు వందెను. పిమ్మట శ్రీపతి మొలకనవ్వులు చిందించుచు చిత్రరూపున కిట్లనెను : ఓ యనఘా! మహాదేవునకు నతని కుటుంబమునకు కుశలమే కదా? హరునకు నా వలన గావలసిన కార్యమేమి? అతడు నిన్నేల పంపెను? కానిచో నాతో దేవతల కేదైన పని యుండెనా? తెలుపుము. దూత యిట్లనెను : గరుడధ్వజా! నీవు త్రికాలవేదివి. ఈ ప్రపంచమందు నీకు తెలియని దేమున్నది? నేను దెల్పునవి నీకు తెలియనివి కావు. జనార్దనా! శివుడు నీతో నొకమాట తెల్పుమని నన్నంపెను. ప్రభూ! హరుని పలుకులుగా నేను పలుకుచున్నాను : విభూ! కమలయగు నీ భార్య కాళిందీ తమసా నదుల సంగమమున తపము తీవ్రముగ నాచరించుచున్నది. ఆ శ్రీదేవి సర్వార్థప్రదాయిని. ఆమె దేవ - కిన్నర - నర - యక్షుల చేత నారాధింపబడ దగినది. ఐన నే డామె గుఱ్ఱము రూపుదాల్చి యున్నది. అట్టి లక్ష్మి దేవిని గొలువనిచో లోకమం దెవ్వడు సుఃంపగలడు? ఆ సిరులదేవిని విడనాడి నీవేమి సుఖ పడుదువు? భర్త యెంతటి దుర్బలుడైనను పేదపడినను నతడు తన భార్యను పోషించుకొనును. నీవే తప్పులేని జగదీశ్వరి నేల వదలితివి? ఈ లోకమం దెవ్వని భార్య దుఃఖముల పాలగునో వాని శత్రులు వానిని దుయ్యబట్టుదురు. ఇపుడు సిరులొసగు లక్ష్మినే కష్టాలు ముసరుకొనినవి. నీ శత్రువు లామెను గాంచి మోహపరవశులైరి. నీ లచ్చికి బ్రతుకునీడగ నీవు లేనందున వారు రేయింబవళ్ళు నిన్ను పరిహసించుచున్నారు. లక్ష్మి సాధ్వి - సుశీల - సురూప - సుగుణ - సకల లక్షణ సంపన్న - ఆమెను ప్రసన్నురాలిని జేసికొని నీ మధుర సంగతి నామెకు గలిగించుము. ఆమె చారుహాసిని. నీ ప్రియురాలు. ఆమెను నీ దానిగ జేసికొని సుఖపడుము. నా వెనుకటి కాంతావియోగము తలపునకు వచ్చినపు డెల్ల నా గుండె బరువెక్కును. మమ భార్యా మృతా విష్ణో దక్షయజ్ఞే సతీయదా | తదా%హం దుఃఖం భుక్తవానంబుజేక్షణ.
29 సంసారే%స్మి న్నరః కో%పి మా భూన్మ త్సదృశో%పరః మనసా%కరవం శోకం తస్యా విరహ పీడితః.
30 కాలేన మహతా ప్రాప్తా మయా గిరిసుతా పునః | తప స్తప్త్వా%తి దుఃసాధ్యంయా దగ్ధాతు రుషా%ధ్వరే.
31 హరే కిం సుఖమాపన్నం త్వయా సంత్యజ్య కామినీమ్ | ఏకాకీ తిష్ఠతా కాలం సహస్రవత్సరాత్మకమ్.
32 గత్వా%%శ్వాస్య మహాభాగం సమానయ నిజాలయమ్ | మాభూత్కో%పీహ సంసారే వియుక్తొ రమయాతయా.
33 కృత్వా తురగరూపం త్వం భజతా త్కమలాలయామ్ | ఉత్పాద్య పుత్రమాయుష్మం స్తామానయ శుచిస్మితామ్.
34 హరి రాకర్ణ్య తద్వాక్యం చిత్రరూపస్య భారత| తథే త్యుక్త్వా తు దూతం తం ప్రేషయామాస శంకరమ్.
35 గతే దూతే%థ భగవా న్వైకుంఠా త్కామసంయుతః | జగామ ధృత్వా తత్రా%%శు వాజిరూపం మనోహరమ్.
36 యత్రసా బడబారూపం కృత్వా తప్యతి సింధుజా | విష్ణు స్తం దేశ మాసాద్య తామపశ్య ద్ధయీం స్థితామ్.
37 సా%పి తం వీక్ష్య గోవిందం హయరూపధరం పతిమ్| జ్ఞాత్వా వీక్ష్య స్థితా సాధ్వీ విస్మితా సాశ్రులోచనా.
38 తయో స్తు సంగమ స్తత్ర ప్రవృత్తో మన్మథార్తయోః | కాళిందీ తమసాసంగే పావనే లోకవిశ్రుతే.
39 సగర్భా సా తదా జాతా బడబా హరివల్లభా | సుషువే సుందరం బాలం తత్రైవ సుగుణోత్తరమ్.
40 తమాహ భగవా న్వాక్యం ప్రహస్య సమయాశ్రితమ్ | త్యజాద్య బాడబం దేహం పూర్వదేహా భవాధునా.
41 గమిష్యావః స్వవైకుంఠ మావాం కృత్వా నిజం వపుః | తిష్ఠత్వత్ర కుమారో%యం త్వయాజాతః సులోచనే.
42 దక్షయజ్ఞములో నా సతియగు సతీదేవి మరణించినపుడు నా పడిన విరహ వదేన యింతింనరానిది. అపుడు నేను భార్యావియోగమున తపించితిని. ఈ ప్రపంచమున నావలె నెవ్వడును భార్యతో నెడబాటు జెందకుండుతమని నే నపుడు తలచితిని. సతీదేవి రోషము కొలది దక్షయాగమందు భస్మమైనది. నే నామెకై పెక్కులేండ్లు ఘోర తపమాచరించితిని. పిదప నామె గిరిజారూపము దాల్పగ నామెను బడయగల్గితిని. హరీ! నీవు నీ వల్లభను విడనాడి యొంటరిగ వేలేండ్లు గడుపుచున్నావు. ఇందుచే నీవేమి సుఖ మొందుచున్నావు? కనుక నీవు వెంటనే వెళ్ళి నీ సౌభాగ్యలక్ష్మిని నీ యింటికి తెచ్చుకొమ్ము. ఈ లోకమునందు లక్ష్మిలేనివాడెవ్వడు మనజాలడు గదా! నీ వశ్వరూపముతో నశ్వనిని గూడి కొడుకును గని తిరిగి నీ భార్యను వెంటగొనిపొమ్ము అను చిత్రరూపుని పలుకులు విని హరో యట్లే యగుత' మని శంకరుదూతను సాగనంపెను. అట్లు దూత వెళ్ళిన పిదప విష్ణువు వైకుంఠము వదలి యందమైన గుఱ్ఱము రూపము ధరించెను. అత డాడు గుఱ్ఱము రూపున తపము చేయుచున్న లక్ష్మిచెంత కరిగి యామెను కంటి కింపుగ గాంచెను. సాధ్వి లక్ష్మి హయరూపమున వచ్చిన వానిని తన పతి యగు గోవిందునిగ తెలిసికొని యెడద గగుర్పొడువ బాష్పములు కనులనిండ నిలిచెను. అంత వారిర్వురు లోక ప్రసిద్ధమై పవిత్రమైన కాళిందీ తమసల సంగమమున నిండారిన తమకముతో మధుర సంగమములో నొకటి యైరి. అపు డశ్వినియగు హరివల్లభకు గర్భము నిలిచెను. ఆమె యొక యందాల సుగుణాల రాశియగు బాలుని గనెను. పిమ్మట హరి నవ్వి సమయోచితముగ గుఱ్ఱము రూపు వదలి తొంటి రూపము ధరించుము. మనము మన నిజరూపములతో తిరిగి వైకుంఠ మేగుదుము. నీకు గల్గిన యీ కుమారు డిచ్చటనే యుండుగాత!'' మని లక్ష్మితో ననెను. లక్ష్మీ రువాచ : స్వదేహ సంభవం పుత్రం కథం హిత్వా వ్రజామ్యహమ్ | స్నేహః సుదుస్త్యజః కామం స్వాత్యజస్య సురర్షభ.
43 కా గతిః స్యాదమేయాత్మన్బాల స్యాస్యన దీతటే | అనాథస్యా సమర్థస్య విజనే%ల్పతనోరిహ.
44 అనాశ్రయం సుతం త్యక్త్వా కథం గంతుం మనోమమ | సమర్థం సదయం స్వామి న్భవేదంబుజలోచన.
45 దివ్య దేహౌ తతో జాతౌ లక్ష్మీ నారాయణా వుభౌ | విమానవర సంవిష్టౌ స్తూయమానౌ సురైర్దివి.
46 గంతు కామం పతిం ప్రాహ కమలా కమలాపతిమ్ | గృహాణమం సుతం నాథ నాహం శక్తా%స్మిహాపితుమ్. 47 ప్రాణప్రియో%స్తి మే పుత్రః కాంత్యా త్వత్సదృశః ప్రభో | గృహీత్వైనం గమిష్యావో వైకుంఠం మధుసూదన.
48 హరిరువాచ : మావిషాదం ప్రియేకర్తుం త్వమర్హసి వరాననే | తిష్ఠత్వయం సుఖేనాత్ర రక్షా మే విహితా త్విహ.
49 కార్య కిమపి వామోరు ! వర్తతే మహదద్భుతమ్ | నిబోధ కథ యామ్యద్య సుతస్యాత్ర విమోచనే. 50 తుర్వసు ర్నామ విఖ్యాతో యయాతితనుజో భువి | హరివర్మేతి పిత్రా%స్య కృతం నామ సువిశ్రుతమ్.
51 స రాజా పుత్రకామో%ద్య తపస్తప్యతి పావనే | తీర్థే వర్షశతం జాతం తస్య వై కుర్వత స్తపః.
52 తస్యార్థే నిర్మితః పుత్త్రో మయా%యం కమలాలయే | తత్ర చ త్వాం నృపం సుభ్రు! ప్రేరయిష్యామి సాంప్రతామ్.
53 తసై#్మ దాస్యా మ్యహం పుత్రం పుత్రకామాయ కామిని | గృహీత్వా స్వగృహం రాజా ప్రాపయిష్యతి బాలకమ్.
54 ఇత్యాశ్వాస్య ప్రియాం పద్మాం కృత్వారక్షాంచ బాలకే | విమానవరమారుహ్య ప్రయ¸° ప్రియయాసహ.
55 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ఏకోనవింశో%ధ్యాయః. లక్ష్మి ఇట్లనెను : 'నాథా! నా కడుపున పండిన యీ చిన్నారిని వదలి యెట్లు రాగలను? సంతానము మీది ప్రేమ తప్పించుకొన నలవి గాదు సుమా! మహాత్మా! ఈ యనదు డీ నదీతటమున నొంటిగ పడియున్నాడు. ఇత డసమర్థుడు. అర్భకుడు. ఈ బాలుని గతి యేమి కావలయును? స్వామీ! ఈ దిక్కులేని బాలుని విడనాడిపోవుటకు నా మనసొప్పుటలేదు. ఇతడు మన యంతఃకరణ ప్రకాశము.' అంతలో లక్ష్మీనారాయణులు దివ్యరూపములు దాల్చిరి. వారు సురగణముచే సంస్తుతింపబడుచు దివ్య విమానమెక్కిరి. వారు వెళ్ళిపోదలచిరి. అపుడు లక్ష్మి విష్ణుతో నిట్లనెను : ఈ నీ కొడుకును తీసికొనుము. ఇతనిని వదలి నేను రాజాలకున్నాను. మధుసూదనా! నా కొడుకు నా ప్రాణములకన్న ప్రియతరుడు. ఇతని దచ్చముగ నీ రూపే. ఇతడు మన స్నేహబంధము. మన యానందగ్రంథి. కనుక మన మితనిని వెంటగొని వైకుంఠ మేగుదము. హరి యిట్లనెను : ఓ సులోచనా! నీవు శోకింపకుము. ఇతని సుఖమున కిక్కడ నెట్టి లోటు లేదు. ఇతని రక్షణభారము నాది. ఈ నేలపై నితని వలన నొక యద్భుత కార్యము జరుగనున్నది. అందులకే యితని నిచట వదలుచున్నాను. దాని గూర్చి నీకు తెల్పుదును, వినుము. ఈ భూమిపై యయాతి కొడుకు తుర్వసు డనువాడు పేరుగాంచెను. అతని కతని తండ్రి హరివర్మ యని పేరిడెను. అతడీ తీర్థమున పుత్రునిగోరి నూఱండ్లు తప మొనర్చెను. అతని కొఱకే నే నీబాలుని కంటిని. నే నా రాజు చెంతకేగి యతనిని ప్రేరింతును. ఆ పుత్రకామున కీ పుత్రు నీయగలను. అత డీ బాలుని తన యింటికి తీసికొని వెళ్ళగలడు. ఇట్లు విష్ణువు తన ప్రియురాలగు పద్మనోదార్చి బాలకునకు రక్షణ గల్పించి తన ప్రియతో విమానమెక్కి వెళ్ళెను. ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు హరి యశ్వినియందు పుత్రుని బడయుటయను పందొమ్మిదవ యధ్యాయము.